తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న రైతులు
పాన్‌గల్ : తహసీల్దార్ కార్యాలయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యతో రోజుల తరబడి సర్టిఫికెట్లు, ఇతర పత్రాలకోసం తిరుగుతూ రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయరాములుసాగర్ తెలిపారు. మంగళవారం వివిధ గ్రామాలనుంచి ఆర్‌ఓఆర్, పహాణి, పాస్‌పుస్తకాలకోసం రైతులు ధర్నా నిర్వహించారు. వారికి సంఘీభావం తెలిపిన జయరాములు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతులు పంట పొలాల వివరాలు అన్‌లైన్‌లో నమోదు చేయడానికి, పాసు పుస్తకాల కొరతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకుల ద్వారా రుణాల లభించక పెట్టుబడులకు వేచి చూస్తున్నారని తెలిపారు. స్పందించిన ఇన్‌చార్జ్ తహసీల్దార్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సర్వర్ సమస్య గురించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, రైతులకు రుణాల మంజూరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.