ముంబై: విమానాశ్రయంలో సర్వర్ క్రాష్.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంప్యూటర్‌లు పని చేయకపోవడంతో.. మ్యానువల్‌గా చెక్‌ఇన్‌లను చేయడంతో భారీగా ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో.. ఫ్లైట్ టేకాఫ్ షెడ్యూల్‌లో మార్పులు కనిపించాయి.
బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండవ టెర్మినల్స్ నుంచి విదేశీ విమానాలు ఆలస్యం అయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్ క్రాష్ కావడంతో.. చెక్‌ఇన్ ప్రాసెస్ మ్యానువల్‌గా జరిగింది. దీంతో 40 నిమిషాలపాటు ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తోంది. క్యూలో నిలబడిన కొందరు.. సోషల్ మీడియాలో అక్కడి పరిస్థితులను అప్‌డేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టెర్మినల్ నుంచి విదేశీ విమానాలే కాదు.. స్వదేశీ విమానాలు కూడా సర్వీసులు నడిపిస్తుంటాయి.
System crash at #MumbaiAirport @airindiain #allairlines Crazy crowd and long queues. Expect delayed flights and more… pic.twitter.com/3ImGgmjUYy
— Kiwi (@kiwitwees) December 1, 2022
The sheer timing of you placing your bag for check in and all systems going down at that exact moment at Mumbai Airport @CSMIA_Official! 😶
— Ritu Mittal Mukherjee (@ritu__mukherjee) December 1, 2022
Complete standstill and this is how we begin the weekend!
ఇదిలా ఉంటే.. ఎయిర్ ఇండియా ఈ పరిస్థితిపై ట్వీట్ చేసింది. అంతరాయాన్ని తగ్గించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందంటూ పేర్కొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ తర్వాత ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. ప్రస్తుతం అక్కడ సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలుస్తోంది.
We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates.
— Air India (@airindiain) December 1, 2022
#UPDATE | Normal services have resumed at Mumbai International Airport. The operations were disturbed for about 40 minutes due to server failure.
— ANI (@ANI) December 1, 2022
ఇదీ చదవండి: ఒక్క ఓటర్ కోసం.. 8 మంది సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment