long ques
-
Mumbai: సర్వర్ క్రాష్.. చుక్కలు చూసిన ప్రయాణికులు
ముంబై: విమానాశ్రయంలో సర్వర్ క్రాష్.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంప్యూటర్లు పని చేయకపోవడంతో.. మ్యానువల్‌గా చెక్ఇన్లను చేయడంతో భారీగా ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో.. ఫ్లైట్ టేకాఫ్ షెడ్యూల్లో మార్పులు కనిపించాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండవ టెర్మినల్స్ నుంచి విదేశీ విమానాలు ఆలస్యం అయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్ క్రాష్ కావడంతో.. చెక్ఇన్ ప్రాసెస్ మ్యానువల్‌గా జరిగింది. దీంతో 40 నిమిషాలపాటు ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తోంది. క్యూలో నిలబడిన కొందరు.. సోషల్ మీడియాలో అక్కడి పరిస్థితులను అప్డేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టెర్మినల్ నుంచి విదేశీ విమానాలే కాదు.. స్వదేశీ విమానాలు కూడా సర్వీసులు నడిపిస్తుంటాయి. System crash at #MumbaiAirport @airindiain #allairlines Crazy crowd and long queues. Expect delayed flights and more… pic.twitter.com/3ImGgmjUYy — Kiwi (@kiwitwees) December 1, 2022 The sheer timing of you placing your bag for check in and all systems going down at that exact moment at Mumbai Airport @CSMIA_Official! 😶 Complete standstill and this is how we begin the weekend! — Ritu Mittal Mukherjee (@ritu__mukherjee) December 1, 2022 ఇదిలా ఉంటే.. ఎయిర్ ఇండియా ఈ పరిస్థితిపై ట్వీట్ చేసింది. అంతరాయాన్ని తగ్గించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందంటూ పేర్కొంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ తర్వాత ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. ప్రస్తుతం అక్కడ సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలుస్తోంది. We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates. — Air India (@airindiain) December 1, 2022 #UPDATE | Normal services have resumed at Mumbai International Airport. The operations were disturbed for about 40 minutes due to server failure. — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ఒక్క ఓటర్ కోసం.. 8 మంది సిబ్బంది -
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
-
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
దాదాపు వారం రోజులకు పైగా విపరీతమైన వర్షాలు, వరదలతో అల్లాడుతున్న చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరం పాక్షికంగా సాధారణ స్థితికి చేరువ అవుతోంది. రోడ్ల మీద నీళ్లు తగ్గుతుండటంతో.. ఏటీఎంలు, పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వరుసపెట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు సుమారు 245 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రధానంగా రోడ్లు కొట్టుకుపోవడం, రైలు మార్గాలు పాడవ్వడం, విమానాశ్రయంలోకి కూడా నీళ్లు చేరుకోవడంతో ఆకాశ మార్గం కూడా మూసుకుపోయింది. కొట్టుపురం, ముడిచూర్, పల్లిక్కరనై లాంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల కొరత పట్టి పీడిస్తోంది. అతి కొద్దిసంఖ్యలో మాత్రమే ఏటీఎంలు, పెట్రోలు బంకులు తెరవడంతో.. వాటివద్ద పొడవాటి క్యూలైన్లు కనపడుతున్నాయి. రెండు రోజుల్లో చాలావరకు పెట్రోలు బంకులు తెరుస్తారని, ప్రజలు ఆందోళన చెందవద్దని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం అయినా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎగ్మూర్ - తాంబరం స్టేషన్ల మధ్య రైళ్లు నడిపిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది. దాంతో స్థానికులకు చాలావరకు ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. తాంబరం సహా చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ ల్యాండ్లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మొబైల్ సేవలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దాంతో సహాయ పనులకు ఆటంకం కలిగింది. కూరగాయలు, పాలు మాత్రం ఇంకా కొరతగానే ఉండటంతో వాటి ధర ఆకాశాన్ని అంటుతోంది.