Server problem
-
స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. యథావిధిగా ఉదయం 10 గంటలకు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలు ప్రారంభం కాగా, అన్ని చోట్ల ఒకట్రెండు డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 11 గంటలకు సమస్య వచ్చింది.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా క్రయవిక్రయదారుల ఆధార్ వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఈకేవైసీని సబ్‌రిజి్రస్టార్ వేలిముద్రతో ఆమోదించాలి. అలా సబ్‌రిజిస్ట్రార్ వేలిముద్ర వేసే క్రమంలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆ దశలోనే ఆగిపోయిందనిరిజిస్ట్రేషన్లశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 3,500 నుంచి 4వేల వరకు డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ, గురువారం ఉదయం నుంచి సాయంత్రం కార్యాలయ వేళలు ముగిసేంతవరకు ఈకేవైసీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం కేవలం 339రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి.రిజిస్ట్రేషన్ సేవల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని, ఆధార్ సర్విసుల్లో సమస్య కారణంగానే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయా యని తెలంగాణరిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అధికారికంగా వెల్లడించింది. ఈ విషయమైరిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను ‘సాక్షి’ సంప్రదించగా, తమ శాఖకు సంబంధించిన సర్వర్లలో ఎలాంటి సమస్యా లేదని, సెంట్రల్ సర్వర్‌తో అన్ని కార్యాలయాల్లోని సర్వర్లు సక్రమంగానే ఉన్నాయని చెప్పారు. ఈకేవైసీ మినహా ఈసీలు, వివాహ రిజిస్ట్రేషన్లు, ఈ–స్టాంపులు లాంటి కార్యకలాపాలు యథావిధిగా నడిచాయని వెల్లడించారు. కాగా, ఆధార్ సేవల్లో తలెత్తిన లోపాన్ని చక్కదిద్దామని, శుక్రవారం నుంచి యథావిధిగా సేవలు అందుతాయని ఢిల్లీలోని యూఐడీఏఐ అధికారులు తెలిపారు. -
Mumbai: సర్వర్ క్రాష్.. చుక్కలు చూసిన ప్రయాణికులు
ముంబై: విమానాశ్రయంలో సర్వర్ క్రాష్.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంప్యూటర్లు పని చేయకపోవడంతో.. మ్యానువల్‌గా చెక్ఇన్లను చేయడంతో భారీగా ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో.. ఫ్లైట్ టేకాఫ్ షెడ్యూల్లో మార్పులు కనిపించాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండవ టెర్మినల్స్ నుంచి విదేశీ విమానాలు ఆలస్యం అయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్ క్రాష్ కావడంతో.. చెక్ఇన్ ప్రాసెస్ మ్యానువల్‌గా జరిగింది. దీంతో 40 నిమిషాలపాటు ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తోంది. క్యూలో నిలబడిన కొందరు.. సోషల్ మీడియాలో అక్కడి పరిస్థితులను అప్డేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టెర్మినల్ నుంచి విదేశీ విమానాలే కాదు.. స్వదేశీ విమానాలు కూడా సర్వీసులు నడిపిస్తుంటాయి. System crash at #MumbaiAirport @airindiain #allairlines Crazy crowd and long queues. Expect delayed flights and more… pic.twitter.com/3ImGgmjUYy — Kiwi (@kiwitwees) December 1, 2022 The sheer timing of you placing your bag for check in and all systems going down at that exact moment at Mumbai Airport @CSMIA_Official! 😶 Complete standstill and this is how we begin the weekend! — Ritu Mittal Mukherjee (@ritu__mukherjee) December 1, 2022 ఇదిలా ఉంటే.. ఎయిర్ ఇండియా ఈ పరిస్థితిపై ట్వీట్ చేసింది. అంతరాయాన్ని తగ్గించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందంటూ పేర్కొంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ తర్వాత ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. ప్రస్తుతం అక్కడ సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలుస్తోంది. We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates. — Air India (@airindiain) December 1, 2022 #UPDATE | Normal services have resumed at Mumbai International Airport. The operations were disturbed for about 40 minutes due to server failure. — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ఒక్క ఓటర్ కోసం.. 8 మంది సిబ్బంది -
100 కిలోల స్వర్ణంతో గోవిందుడి గోపురానికి తాపడం
సాక్షి, తిరుమల: సర్వర్ సమస్యలు తలెత్తకుండా టీసీఎస్‌తో చర్చలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం చేస్తామని ప్రకటించింది. హనుమంతుడి జన్మభూమిని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. హనుమంతుడి విగ్రహం, జన్మ వృత్తాంతం తెలిపే చిత్రాలు ఏర్పాటు చేస్తామని, తరిగొండ వెంగమాంబ సమాధి స్థలాన్ని బృందావనంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఇలా ఉండగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. జూలైలో శ్రీవారిని 5.32 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. జులైలో హుండీ ఆదాయం రూ.55.58 కోట్లు రాగా, ఈ-హుండీ ఆదాయం రూ.51.97 లక్షలు వచ్చింది. ఇక లడ్డూ విక్రయాలతో రూ.35.26 లక్షల ఆదాయం సమకూరింది. అన్నప్రసాదంలో భోజనం చేసిన భక్తుల సంఖ్య 7.13 లక్షల మంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 2.55 లక్షలు. -
ఓటు నమోదైతే ఒట్టు!
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటరు నమోదుకు ఇంకా రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఓటు నమోదు కోసం జనం ఎగబడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ మాత్రం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు పొందాల ని జిల్లాలోని పలువురు ఆన్లైన్ ద్వారా ప్రయత్నం చేస్తుండగా అది సాధ్యం కావడం లేదు. ఓటరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం సీఈఓ ఈ–రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి ఫారం–6ను నింపి అప్లోడ్ చేయ డం ద్వారా ఓటరు నమోదు చేసుకోవచ్చని ఎన్నిక ల సంఘం కూడా సూచించింది. జిల్లాలోని పలు వురు ఉద్యోగులు, యువకులతోపాటు జిల్లాకు చెంది ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న పలు వురు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఫారం–6 నింపుతుండగా కొన్నిసార్లు, ఫొటో అప్లోడ్ చేస్తుండగా కొన్ని సార్లు సమస్య తలెత్తుతోంది. దరఖాస్తు అసలు అప్లోడ్ కావడం లేదు. సమస్యను 1950కు నేరుగా గానీ, ఎస్ఎంఎస్ ద్వారా గాని తెలియజేద్దామంటే అది కూడా సాధ్యం కావడం లేదు. కొంద రు ఓటర్లు తమ ఓటు వివరాలను తెలుసుకునేం దుకు 1950కు వివరాలు పంపించినా తిరిగి వచ్చి న జవాబు అర్థంకాని భాషలో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. హెల్ప్‌లైన్ యాప్‌లో కూడా ఇలాంటి సమస్య లే ఎదురవుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఓటరు నమోదునకు మరో రెండు రోజులే గడువు ఉండగా ఆన్లైన్లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రత్యామ్నాయం చూపించాలని పలువురు కోరుతున్నారు. సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన లెంక భాగ్యశ్రీ ఓటు నమోదు చేసుకుందామని రెండురోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ వెబ్సైట్ పనిచేయకపోవడంతో సాధ్యం కావడం లేదు. ఈమె శృంగవరపుకోటలో ఉండేవారు. వివా హం జరగడంతో సంతకవిటి మండలం మందరాడకు వచ్చారు. ఇటీవల ఎస్. కోటలో ఓటును రద్దు చేయించుకుని, మందరాడలో నమోదు చేసుకోవాలని రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎన్వీఎస్పీ వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో అది సాధ్యం కాలేదు. శ్రీకాకుళం నగరానికి చెందిన పాలిశెట్టి లీలవతి ఓటర్ల జాబితాలో తనపేరు ఉందో లేదో తెలుసుకునేం దుకు 1950కు ఎస్ఎంఎస్ పంపించింది. అక్కడి నుంచి తిరుగు సమాధానంగా మీ నంబర్ రిజిస్టర్ అయిందని, త్వరలోనే వివరాలు తెలుపుతామని సమాచారం వచ్చింది. తర్వాత వచ్చిన ఎస్ఎంఎస్ను చూడగా అందులో ప్లస్‌లు, మైనస్‌లు, వేర్వేరు గుర్తులు ఉండడంతో ఏం చేయాలో తెలీక మిన్నకుండిపోయింది. అష్టకష్టాలు.. మా గ్రామం యారబాడులో గతంలో నాకు ఓటు ఉండేది. ఇటీవల కొత్తగా వచ్చిన జాబితాలో పరిశీలిస్తే పేరు లేదు. ఎవరు తొలగించారో తెలీడం లేదు. మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేయడానికి మీ సేవ చుట్టూ రెండు రోజులుగా తిరుగుతున్నా. పని కావడం లేదు. దరఖాస్తు చేసేందుకు ఆన్లైన్ సర్వర్ బాగులేదు. సర్వర్ డౌన్లో ఉంది అని మీ సేవా వాళ్లు అంటున్నారు. సమయం చూస్తే రెండు రోజులే ఉంది. ఇప్పుడు సర్వర్ డౌన్ అంటే ఎలా? – ఎస్.రామినాయుడు, యారబాడు, నరసన్నపేట ఆన్లైన్లో పెట్టాం గానీ ఓటు రాలేదు పలాస మండలం చినంచల గ్రామానికి చెందిన నేను ఇటీవల ఓటు తనిఖీ చేయించాను. మా గ్రామానికి చెందిన ఓటరు లిస్టులో నా పేరులేదు. రెండు రోజుల కిందటే మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. ఇంకా రెండురోజులు గడువు ఉంది. ఆన్లైన్ సమస్యగా చెబుతున్నారు తప్ప ఓటు హక్కు ఇవ్వడం లేదు. – బమ్మిడి కామయ్య, చినంచల గ్రామం, పలాస మండలం -
స్తంభించిన ఇన్స్టాగ్రామ్
ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం, ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టాగ్రామ్ సేవలు మరోసారి ప్రపంచంలోని పలు దేశాల్లో స్తంభించిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్లు రెండూ పనిచేయలేదు. అమెరికా, కెనడా, యూరప్‌లతో పాటు ఇండియాలో కూడా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ డేటా ఆధారంగా.. బుధవారం ఈ సేవలు ఆగిపోయాయి. గంట వ్యవధిలో వెయ్యికి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. వినియోగదారులు లాగిన్ అయినపుడు "5xx సర్వర్ ఎర్రర్"ని చూపించింది. ఈ అసౌకర్యంపై సోషల్ మీడియాలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ, జోకులను పోస్ట్ చేశారు. దీనిపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. #instagramdown right now and Flat Tummy Tea is plummeting down on the stock market — Tariq Nasheed (@tariqnasheed) October 3, 2018 When #instagram is down like this it’s either the #Government or a cyber attack 🤐 pic.twitter.com/9OtLb4daFQ — madein85 (@uptownloner) October 3, 2018 @Instagram is down.#instagramIsDown pic.twitter.com/vnM8gB0REI — Shashank Mahajan (@mahajanshank95) October 3, 2018 -
సర్వర్ డౌన్
– జిల్లా వ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేషన్లు – రెండ్రోజులుగా వెలవెలబోతున్న కార్యాలయాలు – 13వ తేదీ వరకు ఇదే పరిస్థితి ! అనంతపురం టౌన్ : ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ శాఖ రెండ్రోజులుగా మూగబోయింది. సర్వర్ లోపాల కారణంగా గురువారం నుంచి భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శుక్రవారమైనా కష్టాలు తొలుగుతాయనుకుంటే సాయంత్రం వరకు వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో స్థలాలు, భూములు, భవనాల కొనుగోలుదారులు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలోనే సర్వర్ పని చేయకపోవడంతో అన్ని రకాల సేవలు స్తంభించిపోయాయి. ఎన్ఐసీతో అనుసంధానమైన రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో ఐదు రోజులు పట్టే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్న మార్పు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. జిల్లాలోని అన్ని కార్యాలయాల నుంచి రోజూ సుమారు రూ.4 కోట్ల ఆదాయం వచ్చేది. రెండ్రోజులుగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఉదయాన్నే విధులకు హాజరవుతున్న అధికారులు సాయంత్రం వరకు వేచి ఉండి వెళ్లిపోతున్నారు. సర్వర్ విషయం తెలియక కొందరు క్రయవిక్రయదారులు కార్యాలయాలకు వస్తుండగా.. మరికొందరు డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బందికి ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. ఇటీవల స్తిరాస్థి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ‘ఆధార్’ అనుసంధానం తెగిపోవడంతో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు రిజిస్ట్రేషన్ శాఖకు ఆధార్ సర్వర్ అనుసంధానాన్ని ఆపేయడంతో అప్పట్లో సమస్య వచ్చింది. ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే సవరించడానికి అవసరమైన ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) సర్వర్‌ను సైతం ఆపేయడంతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. తాజాగా మరోసారి సర్వర్ డౌన్ కావడంతో క్రయ విక్రయదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. కాగా.. రిజిస్ట్రేషన్లలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను ఆ శాఖ అధికారులు విస్మరిస్తున్నారు. ఫలితంగా పనుల కోసం వచ్చే వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. -
సర్వర్ సమస్యను పరిష్కరించాలి
పాన్‌గల్ : తహసీల్దార్ కార్యాలయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యతో రోజుల తరబడి సర్టిఫికెట్లు, ఇతర పత్రాలకోసం తిరుగుతూ రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయరాములుసాగర్ తెలిపారు. మంగళవారం వివిధ గ్రామాలనుంచి ఆర్ఓఆర్, పహాణి, పాస్‌పుస్తకాలకోసం రైతులు ధర్నా నిర్వహించారు. వారికి సంఘీభావం తెలిపిన జయరాములు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతులు పంట పొలాల వివరాలు అన్లైన్లో నమోదు చేయడానికి, పాసు పుస్తకాల కొరతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకుల ద్వారా రుణాల లభించక పెట్టుబడులకు వేచి చూస్తున్నారని తెలిపారు. స్పందించిన ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సర్వర్ సమస్య గురించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, రైతులకు రుణాల మంజూరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. -
అమెరికా వీసా కార్యకలాపాలకు అంతరాయం
-
ఇదే మి సేవ..?
* ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం * వారాలు గడిచినా రాని సర్టిఫికెట్లు * వేలాది సర్టిఫికెట్లు పెండింగ్ * నానా అగచాట్లు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు * సర్వర్లు డౌన్, సాంకేతిక సమస్యలతో సతమతం * రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమూ కారణమే * క్షేత్రస్థాయి తనిఖీకే వారాలు పడుతున్న వైనం * సర్టిఫికెట్ల జారీ వెనుక అవినీతి ఆరోపణలు? సాక్షి ప్రతినిధి, ఖమ్మంజిల్లా కేంద్రానికి చెందిన సంతోష్‌కు డిగ్రీలో చేరేందుకు కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలి. వాటిని కళాశాలలో సమర్పిస్తేనే అడ్మిషన్ దొరుకుతుంది. సర్టిఫికెట్ల కోసం పదిరోజుల క్రితం స్థానిక ‘మీసేవ’ కేంద్రంలో అతను దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇంతవరకు అతనికి సర్టిఫికెట్ రాలేదు. మీసేవా కేంద్రం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం అని రాసిన ధ్రువీకరణపత్రాలు ఇంకా రాలేదని కొన్ని రోజులు.. సాంకేతిక సమస్యలున్నాయని.. సర్వర్లు డౌన్ అయ్యాయని మరికొన్ని రోజులు..ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్ప అతనికి సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదు. ఒక్క సంతోష్‌దే కాదు జిల్లాలోని దాదాపు మెజార్టీ మీసేవ, ఈసేవ కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల నుంచి రైతుల దాకా అందరూ వారాల తరబడి తిరగాల్సి వస్తోంది. చేతులు తడిపితే మాత్రం సర్టిఫికెట్ ఇట్టే జారీ అయిపోతుండటం గమనార్హం. జిల్లాలో మీ సేవ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. సాంకేతిక సమస్యలకు తోడు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో అవస్థలు పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. మీసేవ కేంద్రాల చుట్టూ తిరగలేక వారి చెప్పులు అరిగిపోతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి తహశీల్దార్ల వరకు సర్టిఫికెట్ల జారీ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డబ్బు ముట్టిన దాన్ని బట్టి సర్టిఫికెట్ల జారీ అవుతున్నాయని, ఒక్కో సర్టిఫికెట్‌కు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలకు తోడు మానవ తప్పిదాలు వాస్తవానికి ఏపీ ఆన్లైన్, ఈసేవ, మీసేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో సర్టిఫికెట్ల జారీ రోజురోజుకూ సులభతరం కావాల్సింది పోయి క్లిష్టమతున్నాయి. ముఖ్యంగా సర్వర్ ప్రాబ్లమ్ అటు కేంద్రాల నిర్వాహకులు, ఇటు దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నెట్ క నెక్ట్ కావడం లేదని, సర్వర్లు పనిచేయడం లేదని దరఖాస్తుదారులను నిర్వాహకులు వెనక్కు పంపుతున్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా చోట్ల తహశీల్దార్లు, డెప్యూటీ తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు లేక సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. మరోవైపు దరఖాస్తుపై విచారణ స్థాయిలో కూడా జాప్యం జరుగుతోంది. ఈ విచారణ పేరుతో వీఆర్వోలు వారాల తరబడి జాప్యం చేస్తున్నారు. ఇదేమంటే మాకు ఇదొక్కటే పనికాదు కదా అని బదులిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్టిఫికెట్ల జారీలో అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయం స్థాయిలో మామూళ్లు ఇచ్చిన కేంద్రాల సర్టిఫికెట్లు మాత్రమే క్లియర్ అవుతున్నాయని, పెద్దగా ముడుపులు ఇవ్వని కేంద్రాల సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని కూడా కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ మామూళ్లకు మధ్యవర్తులుగా క్షేత్రస్థాయిలో దరఖాస్తులను విచారించే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారని సమాచారం. మరోవైపు సర్టిఫికెట్ల వారీగా కొన్ని చోట్ల వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం రూ.3వేలు, ఆదాయం కోసం రూ.వెయ్యి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి.. భద్రాచలంలో మీసేవా, ఈ సేవా ఆన్లైన్లలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక పదిరోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై మీసేవా నిర్వాహకులను ప్రశ్నిస్తే పదిరోజులుగా ప్రింటింగ్ స్టేషనరీ ప్రభుత్వం నుంచి అందటం లేదని చెపుతున్నారు. భద్రాచలం మీసేవలో తహశీల్దార్ సంతకం అయి కూడా వందల సంఖ్యలో కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు జారీ కావడం లేదు. కూనవరంలో 122, వెంకటాపురంలో 60 వరకు ఇలానే పెండింగ్‌లో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో ఆరు ఈసేవా కేంద్రాలు ఉన్నాయి. జూన్ 29వ తేది నుంచి జూలై 04వ తేదీ వరకు 2000 సర్టిఫికెట్ల( కుల,ఆదాయ, నివాస, ఈబీసీ, ఓబీసీ) కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో 760 ధ్రువీకరణ పత్రాలు తహశీల్దార్ మంజూరు చేయగా, 250 పత్రాలు ఈసేవా నుంచి లబ్ధిదారులకు విడుదల చేశారు. ఇంకా 410 సర్టిఫికెట్లు ఈసేవా నుంచి లబ్ధిదారులకు అందాల్సి ఉంది. నాలుగు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వ ముద్రతో కూడిన పత్రాలు అందుబాటులో లేవు. గార్ల మండలంలో 424 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తహశీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. తహశీల్దార్‌కు రిజిస్టర్ కీ ఇచ్చి రెండేళ్లు అయింది. రిజిస్టర్ కీ కాల పరిమితి ఈనెల 3తో ముగిసింది. తహశీల్దార్ రిజిస్టర్ కీ లేనందున విద్యార్థుల సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఈ, మీసేవా కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లోనే ఉన్నాయి. స్టేషనరీ పేపర్లు సమయానికి రాకపోవడం, సర్వర్లు మొరాయించడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందటం లేదు. ఖమ్మం రూరల్ మండలంలోని పెదతండా, తల్లంపాడులో 30 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ ప్రాబ్లమ్ అని తిప్పుతున్నారు: పొట్టపింజర బాలస్వామి, నేలకొండపల్లి మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో సర్వర్ ప్రాబ్లమ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కేంద్రాలలో పని అయిపోయిందని తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడా అదే పరిస్థితి... రోజుల తరబడి తిప్పుతున్నారు. కాలేజీ, వసతి గృహాలలో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో అందటం లేదు. -
ట్రెజరీ పనుల్లో స్తంభన
రెండు రోజులుగా సర్వర్ సమస్య జీతాల చెల్లింపులకు అంతరాయం బిల్లుల సమర్పణకు ముగిసిన గడువు పొడిగింపు ఉత్తర్వులు ఇంతవరకు అందలేదు విభజన నేపథ్యంలో స్పష్టతలేని వైనం సాక్షి,చిత్తూరు : జిల్లా ట్రెజరీతో పాటు, మదనపల్లె, తిరుపతి, పుత్తూరు, చిత్తూరు సబ్ ట్రెజరీల్లో సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సేవలు స్తంభించాయి. సర్వర్ కనెక్టు కావడం, తిరిగి ఆగిపోతుండటంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ట్రెజరీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ట్రెజరీ బిల్లుల మంజూరు, ఇతర లావాదేవీలకు అనుమతి ఇవ్వాలన్నా, ఆర్థిక శాఖ సైట్లో వివరాలు పొందుపరచాలన్నా, అనుమతులు పొందాలన్నా, వివిధ హెడ్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవాలన్నా అంతరాయం కలుగుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు, వివిధ శాఖల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. జీతాలకు ఇబ్బందే..... మే నేల జీతాలకు సర్వర్ సాంకేతిక సమస్యతో పాటు, రాష్ట్ర విభజన ఎఫెక్ట్ పడనుంది. జిల్లాలో 40 వేల మందికిపైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం ఏర్పడే పరిస్థితి. బిల్లుల సమర్పణకు 19వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఇంకా కొన్ని శాఖల నుంచి జీతాల బిల్లులు ట్రెజరీలకు అందలేదు. అదే సమయంలో సర్వర్‌డౌన్ కావటంతో వివిధ శాఖలు ఇచ్చిన జీతాల బిల్లులను ట్రెజరీల్లో వివరాలు అప్‌లోడ్‌చేసి పాస్ చేసే పరిస్థితి లేదు. బిల్లు పాస్ చేసేందుకు గడువు పొడిగింపునకు సంబంధించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ క్రమంలో ట్రెజరీ అధికారులు ఎలా చేయాలి, ఏం చేయాలని తర్జనభర్జన పడుతున్నారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అకౌంట్లతో కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేశారు. అందులో భాగంగా ఈ నెల 24వ తేదీనే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేసి కార్యకలాపాలు ముగించాలని నిర్ణయించారు. ఆ తరువాత తెలంగాణ వేరుగా, సీమాంధ్ర(ఆంధ్రప్రదేశ్) వేరుగా ఆర్థికశాఖ కార్యకలాపాలు నిర్వహించుకుంటాయి. అప్పటి నుంచి కొత్తరాష్ట్ర ట్రెజరీ కార్యకలాపాలు ఒక వారం ముందు నుంచే మే 25వ తేదీ నుంచే ప్రారంభించి నిర్వహణాపరమైన సమస్యలు ఏవైనా తలెత్తితే గమనించి సరిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా ఈ నెల 24వ తేదీకి జీతభత్యాల చెల్లింపులు చెల్లించే పరిస్థితి కనపడటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి..... చిత్తూరు జిల్లాతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్కావటం మూలంగా అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా ట్రెజరీ అధికారి పాలేశ్వర్రావు తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సమస్య కనుక ప్రభుత్వ స్థాయిలో చర్యలుచేపట్టాల్సి ఉందన్నారు. జీతాల బిల్లులు పాస్ చేసేందుకు గడువు పొడగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇంకా అందలేదన్నారు.