సాక్షి, తిరుమల: సర్వర్ సమస్యలు తలెత్తకుండా టీసీఎస్‌తో చర్చలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం చేస్తామని ప్రకటించింది. హనుమంతుడి జన్మభూమిని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. హనుమంతుడి విగ్రహం, జన్మ వృత్తాంతం తెలిపే చిత్రాలు ఏర్పాటు చేస్తామని, తరిగొండ వెంగమాంబ సమాధి స్థలాన్ని బృందావనంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది ఇలా ఉండగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. జూలైలో శ్రీవారిని 5.32 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. జులైలో హుండీ ఆదాయం రూ.55.58 కోట్లు రాగా, ఈ-హుండీ ఆదాయం రూ.51.97 లక్షలు వచ్చింది. ఇక లడ్డూ విక్రయాలతో రూ.35.26 లక్షల ఆదాయం సమకూరింది. అన్నప్రసాదంలో భోజనం చేసిన భక్తుల సంఖ్య 7.13 లక్షల మంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 2.55 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment