Govindarajaswamy Temple
-
తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో అపశ్రుతి.. (ఫొటోలు)
-
100 కిలోల స్వర్ణంతో గోవిందుడి గోపురానికి తాపడం
సాక్షి, తిరుమల: సర్వర్ సమస్యలు తలెత్తకుండా టీసీఎస్‌తో చర్చలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం చేస్తామని ప్రకటించింది. హనుమంతుడి జన్మభూమిని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. హనుమంతుడి విగ్రహం, జన్మ వృత్తాంతం తెలిపే చిత్రాలు ఏర్పాటు చేస్తామని, తరిగొండ వెంగమాంబ సమాధి స్థలాన్ని బృందావనంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఇలా ఉండగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. జూలైలో శ్రీవారిని 5.32 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. జులైలో హుండీ ఆదాయం రూ.55.58 కోట్లు రాగా, ఈ-హుండీ ఆదాయం రూ.51.97 లక్షలు వచ్చింది. ఇక లడ్డూ విక్రయాలతో రూ.35.26 లక్షల ఆదాయం సమకూరింది. అన్నప్రసాదంలో భోజనం చేసిన భక్తుల సంఖ్య 7.13 లక్షల మంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 2.55 లక్షలు. -
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, తిరుపతి : గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సింహావాహన సేవలో ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. కరెంట్ వైర్లు తగులుకోవడంతో రథంపై ఉన్న గొడుగులు పక్కకు వాలాయి. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం పందిరి వాహనంపై గోవిందస్వామి దర్శనమివ్వనున్నాడు. -
టీటీడీ పరువు పోయె.. కిరీటాలు కరిగిపోయె!
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు అలంకరించిన కిరీటాల చోరీ కేసును ఛేదించే విషయంలో ఎక్కడా టీటీడీ పాత్ర నామమాత్రంగా కూడా కనిపించలేదు. దేశంలోనే శక్తివంతమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న దేవస్థానం చోరీకి గురైన మూడు కిరీటాలను కనిపెట్టలేకపోయింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో పోలీసులే రంగంలోకి దిగి దొంగను పట్టుకున్నారు. అనంతరం కరిగించిన కిరీటాలకు సంబంధించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాక్షి, తిరుపతి : శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించిన మూడు బంగారు కిరీటాల చోరీతో టీటీడీ పరువు పోయిం దనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానం భద్రతా వ్యవస్థ ఏమైందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కిరీటాలు అపహరణకు గురైన కేసులో టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 3న చోరీకి గురైన కిరీటాలను దొంగ కరిగించేశాడు. చోరీకి గురై 80 రోజులు గడచిపోయాక పోలీసులు దొంగను పట్టుకున్నారు. ఆ తర్వాత దొంగ దొరికాడని, బంగారం దొరికిందని సముదాయించుకోవడం తప్ప టీటీడీ చేసిందేమీ లేదని తెలుస్తోంది. రైడింగ్లు.. దర్శనాలు చేయించడానికేనా? తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత కోసం ఆక్టోపస్ నుంచి హోంగార్డు వరకు దేశంలోనే అత్యంత పటిష్టమైన వ్యవస్థ ఉంది. అయితే వీరు నిర్వర్తించాల్సిన విధులు నిర్వహించడం లేదనే విమర్శలున్నాయి. తిరుమలలోని వివిధ దుకాణాల్లో రైడింగ్ చేసి హడావుడి చేస్తారు. అంతకంటే వీవీఐపీలు, వీఐపీల దర్శనాలు చేయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు చోరీ అయితే ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. నిత్యం భక్తులు ఉన్న సమయంలోనే కిరీటాలు చోరీకి గురైతే అందుకు టీటీడీ నిర్లక్ష్యమే కారణమనేందుకు శ్రీగోవిందరాజస్వామే సాక్షి. ఇంత జరిగినా టీటీడీలో ఏ అధికారి చోరీపై నోరు మెదప లేదు. సిఫారసు లేఖలతో పోస్టులు తెచ్చుకుని, డిప్యుటేషన్లపై టీటీడీకి చేరుకుని శ్రీవారి సేవా ముసుగులో వ్యాపారాలు చేసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప స్వామి ఆస్తులు, ఆభరణాలకు భద్రత విషయంపై దృష్టి సారించేవారు కరువయ్యారని భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కిరీటాలు కరిగించేశారని సాక్షి ముందే చెప్పింది శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించిన మూడు కిరీటాలను దొంగలించిన దొంగలు కరిగించేసి ఉంటారని సాక్షి ఫిబ్రవరి 14న కథనం ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. స్వామి వారికి ఎవరో భక్తులు కానుక ఇచ్చిందనే నిర్లక్ష్యంతో టీటీడీ అధికారులు వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఐదేళ్లుగా టీటీడీలో పాలన గాడి తప్పిందని దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. -
కిరీటాల దొంగ.. సెల్‌ఫోన్ కోసం వచ్చి దొరికిపోయాడు..
తిరుమల : తిరుపతిలోని ప్రఖ్యాత గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాల చోరీ కేసును ఎట్టకేలకు అర్బన్ జిల్లా పోలీసులు ఛేదించారు. అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బురాజన్ తెలిపిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి 1కేజీ 351 గ్రాముల 3 బంగారు కిరీటాలు చోరీకి గురయ్యాయి. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 80 రోజుల పాటు విచారణ చేసి ఎట్టకేలకు దొంగను మంగళవారం రేణిగుంట రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద సిట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి బృందం అరెస్టు చేసింది. మహారాష్ట్ర, నాందేడు జిల్లా, ఖాందార్ తాలూకా, బూమ్నగర్ స్ట్రీట్, స్వప్న భూమ్నగర్కు చెందిన బాలాజీ పవార్ కుమారుడు ఆకాష్ పవార్ సరోడీ (25)ని నిందితుడిగా గుర్తించారు. 2014లో అతనికి వివాహం కాగా మూడున్నరేళ్లు వయసు గల శారద అనే కుమార్తె ఉంది. 2018 నుంచి తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద సెల్ఫోన్లు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడు. దొంగతనం జరిగిందిలా.. 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య గోవిందరాజస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని, పక్కనే ఉన్న కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కూర్చున్నాడు. అక్కడ ఉత్సవ విగ్రహాలపై ఉన్న బంగారు కిరీటాలు గమనించాడు. తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకుని మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో రెక్కీ నిర్వహించాడు. ఫిబ్రవరి 2న మళ్లీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నాడు. అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలపై ఉన్న మూడు కిరీటాలను దొంగిలించి నాందేడ్ వెళ్లిపోయాడు. స్నేహితుడితో కలసి బంగారు కిరీటాలు అమ్మేందుకు ప్రయత్నించాడు. నలగ్గొట్టి ఉండడంతో ఎవరూ కొనడం లేదని, దానిని కత్తిరించి ముక్కలు ముక్కలుగా చేశారు. అనంతరం కరిగించగా 1351 గ్రాములు కాగా, రూ.40 లక్షలకు పైగా విలువ ఉంటుందని గుర్తించారు. సెల్‌ఫోన్ కోసం వచ్చి దొరికిపోయాడు.. బంగారు అచ్చును తీసుకుని చెన్నైలో విక్రయించాలని స్నేహితుడితో కలసి ఆకాష్ పవార్ సరోడీ పథకం వేశాడు. అయితే తిరుపతిలో గతంలో తను దొంగతనం చేసి..ముళ్లపొదల్లో పడేసిన ఓ సెల్‌ఫోన్‌ను తీసుకుపోదామని నిశ్చయించుకున్నాడు. బంగారం అమ్మలేకపోతే సెల్‌ఫోన్ అయినా అమ్ముకోవచ్చునని భావించాడు. చెన్నైలో బంగారాన్ని అమ్మడానికి చుట్టుపక్కలవారిని విచారించాలని ముందుగా తన స్నేహితుడిని సోమవారం అక్కడకు పంపాడు. అనంతరం నిందితుడు బస్టాండు చేరుకుని ముళ్ల పొదల్లో దాచిన సెల్‌ఫోన్ వెతికి తీసుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే ఉండి బంగారంతో సహా రేణిగుంట నుంచి మంగళవారం చెన్నైకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1351 గ్రాముల బంగారం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించేందుకు 80 రోజులపాటు ఆరు బృందాలు బిహార్, జార్ఖండ్, బెంగళూరు, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ముమ్మరంగా తనిఖీ చేసి, 78 కెమెరాల్లో నిందితుడ్ని గుర్తించి పట్టుకున్నారు. కాగా నిందితులను పట్టుకున్న పోలీసులకు త్వరలోనే రివార్డులు ఇస్తామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. -
గోవిందరాజ స్వామి ఆలయ దొంగ అరెస్ట్
తిరుపతి: రెండు నెలల క్రితం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి గురైన మూడు కిరీటాలను రికవరీ చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. తిరుపతిలో ఎస్పీ అన్బురాజన్ విలేకరులతో మాట్లాడుతూ... చోరీ చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రకాశ్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి బంగారు కడ్డీలు, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు చోరీ చేసిన 3 కిరీటాలను కరిగించి బంగారు కడ్డీలుగా మార్చాడని తెలిపారు. చోరీకి గురైన 3 కిరీటాల బరువు 1381 గ్రాములని, వాటి విలువ సుమారు రూ.42 లక్షల 35 వేలని చెప్పారు. చోరీ జరిగిన 80 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకున్నట్లు వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు. నిందితుడు దొంగతనం చేశాక రేణిగుంట, కాచిగూడల్లో స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారుల వద్ద అమ్మటానికి ప్రయత్నించి విఫలమయ్యాడని వివరించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా, ఓ వైన్‌షాప్ వద్ద ఉన్న సీసీ కెమెరా అనంతరం రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో నిందితుడు కనపడ్డానని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుడి కదలికల ఆధారంగా వివిధ ప్రాంతాలకు టీంలను పంపించినట్లు వివరించారు. -
మూడురోజులైనా జాడలేని కిరీటాలు..!
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో శనివారం మాయమైన మూడు ఉత్సవమూర్తుల కిరీటాల జాడ.. మూడు రోజులైనా దొరకలేదు. పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయినా, ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవి పనిచేయడం లేదని తెలిసిన బయటి వ్యక్తులే కిరీటాలను చోరీ చేసి ఉంటారా? లేక ఇంటి దొంగల పనేనా అన్న కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
టీటీడీలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం
-
భయంకరంగా టీటీడీ ఉద్యోగి వీరంగం.. వైరల్
సాక్షి, తిరుపతి: పవిత్రమైన ఆలయంలో పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు.. పూటుగా మద్యం సేవించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ రోడ్లపై వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే... తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వాహన బేరర్‌గా పనిచేస్తున్న కుమార్.. ఆదివారం రాత్రి జనంపై దౌర్జన్యానికి దిగాడు. దుకాణాల్లోని కూరగాయలు, వస్తువులను రోడ్డుపైకి విసిరేశాడు. అటుగా వెళ్లే వాహనదారులపై దాడికి యత్నించాడు. అడ్డం వచ్చిన కానస్టేబుల్పైనా దౌర్జన్యం చేశాడు. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ, నిలిపిఉంచిన ద్విచక్రవాహనాలను ఎత్తిపడేసే యత్నం చేశాడు. వీడియో కెమెరాలకు చిక్కిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీటీడీ అధికారులకు సమాచారం: విచ్చలవిడిగా ప్రవర్తించిన కుమార్‌ను దాదాపు అరగంట తర్వాత పోలీసులు పట్టుకున్నారు. తెలిసినవారి ద్వారా కుమార్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అతని కుటుంబీకులను పిలిపించారు. ఉద్యోగి వ్యవహారంపై టీటీడీ అధికారులకు సైతం సమాచారం అందించినట్లు తెలిసింది. కుమార్‌పై టీటీడీ చర్యలు తీసుకుంటుదా, లేదా తెలియాల్సిఉంది. -
విదేశీ నాణేల గుట్టలు
⇒ టీటీడీ ఖజానాలో పేరుకుపోతున్న వైనం ⇒ ఇప్పటికే 200 టన్నులు ఉంటాయని అంచనా ⇒ పరిపాలన భవనం, గోవిందరాజస్వామి ఆలయంలో నిల్వ సాక్షి,తిరుమల: తిరుమలేశునికి విదేశీ భక్తులు భక్తితో సమర్పించే నాణేలు నిష్ఫలంగా మారుతున్నాయి. దశాబ్దంగా గుట్టలుగా పోస్తున్న టీటీడీ అధికారులు వాటి మార్పిడి గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా నాణేలు రూపు మారుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 టన్నుల నాణేల పరిస్థితి ఇలా తయారైంది. వాటిని మార్పిడి చేస్తే స్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందన్న వాస్తవాన్ని అధికారులు గుర్తించడంలేదు. వడ్డీకాసులవాడైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి హుండీలో భక్తులు సమర్పించే కానుకలు ప్రతి నెలా కోట్లలో ఉంటాయి. ఇందులో విదేశీ కరెన్సీ వాటా 15 శాతం పై మాటే. నాణేలు మరో 5 శాతం ఉంటాయని అంచనా. తిరుమలేశునికి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ వెంట తీసుకొచ్చిన కరెన్సీ నోట్లతోపాటు నాణేలు కూడా కానుకగా సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు ఆసియా ప్రాంతానికి చెందిన సింగపూర్, మలేషియా, మార్షియస్, ఇండోనేషియా, బ్యాంకాంగ్, శ్రీలంక, కువైట్, దుబాయ్ వంటి ఎన్నో దేశాలకు చెందిన నాణేలు శ్రీవారి హుండీలో ఎక్కువగా వస్తుంటాయి. శ్రీవారికి 2016–2017 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1110 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ఇందులో విదేశీ కరెన్సీ సుమారు రూ.150 కోట్లుపైబడి ఉంది. ఇక విదేశీ నాణేల విలువ కూడా సుమారు రూ.60 కోట్ల వరకు ఉంది. వాటిని నిర్ణీత గడువులో విదేశీ మారకద్రవ్యంతో నగదు మార్పిడి చేసుకుంటే శ్రీవారి ఖజానాకు మరింత ఆదాయం లభిస్తుంది. అయితే టీటీడీ అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడంలేదు. దశాబ్దంగా విదేశీ నాణేలు గుట్టలుగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మొదట పరిపాలన భవనంలో నిలువ చేయడం మొదలు పెట్టిన అధికారులు అక్కడ నిండిపోవడంతో ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలోని ఆభరణాలు భద్రపరిచే గదిలోకి చేరుస్తున్నారు. ఇక్కడ 100 టన్నులు, అక్కడ మరో 100 టన్నులు ఉంటాయని భావిస్తున్నారు. పొడిగా రాలిపోతున్న నాణేలు వివిధ దేశాలు వివిధ లోహాలతో నాణేలు తయారు చేస్తుంటాయి. ఏ నాణెలు అయినా వాడకుండా గుట్టలుగుట్టలుగా పడేస్తే లోహ మిశ్రమాలతో కూడినవి కావడంతో రసాయన చర్య జరిగి రూపు కోల్పోవడంతో పాటు పొడిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టీటీడీ వద్ద దశాద్ద కాలం దాటిన నాణేలు కూడా ఉన్నాయంటే వాటి పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. తక్షణమే వీటిని తరలించికపోతే నాణెం విలువ మాట ఎటున్నా లోహం విలువ కూడా రాదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత టీటీడీ విభాగాధిపతులు చొరవ తీసుకోవాల్సి ఉంది.