భయంకరంగా టీటీడీ ఉద్యోగి వీరంగం.. వైరల్‌ | Half Naked Drunk Employee Of TTD Assault In Tirupathi Video Goes Viral | Sakshi
Sakshi News home page

భయంకరంగా టీటీడీ ఉద్యోగి వీరంగం.. వైరల్‌

Published Mon, Apr 23 2018 2:34 PM | Last Updated on Sat, Aug 25 2018 7:26 PM

Half Naked Drunk Employee Of TTD Assault In Tirupathi Video Goes Viral - Sakshi

సాక్షి, తిరుపతి: పవిత్రమైన ఆలయంలో పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు.. పూటుగా మద్యం సేవించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ రోడ్లపై వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే... తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వాహన బేరర్‌గా పనిచేస్తున్న కుమార్‌.. ఆదివారం రాత్రి జనంపై దౌర్జన్యానికి దిగాడు. దుకాణాల్లోని కూరగాయలు, వస్తువులను రోడ్డుపైకి విసిరేశాడు. అటుగా వెళ్లే వాహనదారులపై దాడికి యత్నించాడు. అడ్డం వచ్చిన కానస్టేబుల్‌పైనా దౌర్జన్యం చేశాడు. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ, నిలిపిఉంచిన ద్విచక్రవాహనాలను ఎత్తిపడేసే యత్నం చేశాడు. వీడియో కెమెరాలకు చిక్కిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

టీటీడీ అధికారులకు సమాచారం: విచ్చలవిడిగా ప్రవర్తించిన కుమార్‌ను దాదాపు అరగంట తర్వాత పోలీసులు పట్టుకున్నారు. తెలిసినవారి ద్వారా కుమార్‌ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అతని కుటుంబీకులను పిలిపించారు. ఉద్యోగి వ్యవహారంపై టీటీడీ అధికారులకు సైతం సమాచారం అందించినట్లు తెలిసింది. కుమార్‌పై టీటీడీ చర్యలు తీసుకుంటుదా, లేదా తెలియాల్సిఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement