
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో శనివారం మాయమైన మూడు ఉత్సవమూర్తుల కిరీటాల జాడ.. మూడు రోజులైనా దొరకలేదు. పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయినా, ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవి పనిచేయడం లేదని తెలిసిన బయటి వ్యక్తులే కిరీటాలను చోరీ చేసి ఉంటారా? లేక ఇంటి దొంగల పనేనా అన్న కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment