సాంకేతిక సమస్యలతో ఉదయం నుంచి బంద్
సాయంత్రానికి కూడా పరిష్కారం కాకపోవడంతో ఎదురుచూపులతోనే సరి
ఆధార్ సేవల్లో అంతరాయమే కారణం.. నేటి నుంచి యథావిధిగా సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. యథావిధిగా ఉదయం 10 గంటలకు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలు ప్రారంభం కాగా, అన్ని చోట్ల ఒకట్రెండు డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 11 గంటలకు సమస్య వచ్చింది.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా క్రయవిక్రయదారుల ఆధార్ వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఈకేవైసీని సబ్‌రిజి్రస్టార్ వేలిముద్రతో ఆమోదించాలి.
అలా సబ్‌రిజిస్ట్రార్ వేలిముద్ర వేసే క్రమంలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆ దశలోనే ఆగిపోయిందనిరిజిస్ట్రేషన్లశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 3,500 నుంచి 4వేల వరకు డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ, గురువారం ఉదయం నుంచి సాయంత్రం కార్యాలయ వేళలు ముగిసేంతవరకు ఈకేవైసీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం కేవలం 339రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి.
రిజిస్ట్రేషన్ సేవల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని, ఆధార్ సర్విసుల్లో సమస్య కారణంగానే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయా యని తెలంగాణరిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అధికారికంగా వెల్లడించింది. ఈ విషయమైరిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను ‘సాక్షి’ సంప్రదించగా, తమ శాఖకు సంబంధించిన సర్వర్లలో ఎలాంటి సమస్యా లేదని, సెంట్రల్ సర్వర్‌తో అన్ని కార్యాలయాల్లోని సర్వర్లు సక్రమంగానే ఉన్నాయని చెప్పారు.
ఈకేవైసీ మినహా ఈసీలు, వివాహ రిజిస్ట్రేషన్లు, ఈ–స్టాంపులు లాంటి కార్యకలాపాలు యథావిధిగా నడిచాయని వెల్లడించారు. కాగా, ఆధార్ సేవల్లో తలెత్తిన లోపాన్ని చక్కదిద్దామని, శుక్రవారం నుంచి యథావిధిగా సేవలు అందుతాయని ఢిల్లీలోని యూఐడీఏఐ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment