Registrations
-
ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబధ్దీకరణ పథకానికి (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సచివాలయంలో ఎల్ఆర్ఎస్ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. 2021లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారిలో.. 2020 ఆగస్టు 28కు ముందు నాటి అక్రమ లేఅవుట్లనే క్రమబధ్దీకరించనున్నారు. మార్చి 31వ తేదీలోపు పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారికి 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లేఅవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబధ్దీకరణకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10శాతం ప్లాట్లు రిజిస్టరై.. 90శాతం ప్లాట్లు మిగిలిపోయినా ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్‌డీడ్ రిజి్రస్టేషన్ కలిగిన వారికి కూడా క్రమబధ్దీకరణ చాన్స్ ఇచ్చారు. ఈ కేటగిరీల వారికి కూడా మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రోజు వారీగా సమీక్షించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత భూముల జాబితా పట్ల అప్రమత్తం ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, దాన కిషోర్, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్ల రాబడి అంచనా రాష్ట్రంలో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకానికి శ్రీకారం చుట్టింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్పై దృష్టి పెట్టింది. అప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తగిన ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబధ్దీకరించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఆలస్యమైంది. తాజాగా బుధవారం మంత్రులు సమావేశమై ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపారు. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.20 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వేగంగా దరఖాస్తుల పరిశీలన రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 25.67 లక్షలు. ఇందులో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్లు చెల్లింపు కూడా పూర్తయింది. మరో 9.21 లక్షల దరఖాస్తులను పరిశీలించి ఎల్ఆర్ఎస్కు ఆమోదయోగ్యమైనవిగా గుర్తించారు. ఫీజు చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇంకా ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన మిగతా సుమారు 16 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇకపై వేగవంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ప్రజలపై భారం.. రూ.13,500 కోట్లు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. స్థిరాస్థుల మార్కెట్ విలువలను భారీగా పెంచడం ద్వారా ప్రజల నడ్డివిరుస్తోంది. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, నివాస భవనాలను వేటినీ వదలకుండా వాటి విలువల్ని అమాంతం పెంచేసింది. అర్బన్ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇష్టానుసారం సవరించింది.రాష్ట్రవ్యాప్తంగా ఈ పెరుగుదల 50 శాతానికి పైగానే ఉండగా కొన్ని ప్రాంతాల్లో 80 శాతానికి దగ్గరగా ఉంది. ఇక శనివారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పెరుగుదల అమల్లోకి వచ్చింది. షాక్ కొట్టేలా పెరిగిన కొత్త మార్కెట్ విలువల ప్రకారమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో జనం లబోదిబోమంటున్నారు. భూముల విలువలే కాకుండా నిర్మాణాల విలువలను (స్ట్రక్చర్ రేట్లు) కూడా పెంచిపారేశారు. ఇళ్లు, అపార్టుమెంట్లు, రేకుల షెడ్లు, పూరిళ్లు, ఖాళీ స్థలాల విలువల్ని పెంచడంతో ప్రజలపై ఇంకా భారం పెరిగిపోయింది.రాయలసీమ ప్రాంతంలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉండడం విశేషం. ఈ పెరుగుదలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు జనం వెనుకాడుతున్నారు. ఇందుకు ఉదాహరణే.. శుక్రవారం వరకూ కిటకిటలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శనివారం వెలవెలబోయాయి. పెనుకొండలో భారీగా..సత్యసాయి జిల్లా పెనుకొండలో అత్యధికంగా మార్కెట్ విలువల్ని 78 శాతం పెంచారు. మడకశిర ప్రాంతంలో 69 శాతం పెంచారు. గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో 73 శాతం పెరుగుదల ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డోర్ నెంబర్ల వారీగా అక్కడి విలువల్ని నిర్థారించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయనే నెపంతో కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా రేట్లు పెంచారు. అలాగే, కొత్తగా ఏర్పడిన వాణిజ్య స్థలాల డోర్ నెంబర్లను సేకరించి వాటిపై భారం మోపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములతోపాటు కొత్తగా వ్యయసాయేతర భూములుగా మారిన వాటి వివరాలు సేకరించి వాటి రేట్లూ పెంచారు.జాతీయ రహదారులు, ప్రధాన రహదారులే కాకుండా ఓ మోస్తరు రహదారుల వెంట, వాటి చుట్టుపక్కల ప్రాంతాల భూముల విలువలను పెంచారు. ఇందుకోసం ఎన్నడూ లేనివిధంగా భూముల క్లాసిఫికేషన్లు కూడా మార్చారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు అవసరమైతే నాలుగు రేట్లు నిర్థారించారు. వ్యవసాయ భూముల్లో మెట్ట, మాగాణి కాకుండా వాటిలోనూ రెండు, మూడు రేట్లు పెట్టారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా నివాస, వాణిజ్య ప్రాంతాల్లోనూ వీలును బట్టి రెండు, మూడు రేట్లు పెట్టారు. బండి ఆత్మకూరు, బనగానపల్లె, కోయిలకుంట్ల, దువ్వూరు, అవుకు తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల 50 నుంచి 60 శాతానికి పైగా ఉంది. వెంకటగిరి, నందికొట్కూరు, ప్యాపిలి, హిందూపురం, గజపతినగరం, మంగళగిరి, తెనాలి, బాపట్ల, జమ్మలమడుగు, చంద్రగిరి, గూడూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం పెంచారు.గజానికి రూ.5 వేలు పెరిగింది.. ⇒ ఇదిలా ఉంటే.. విజయవాడలోని వాణిజ్య ప్రాంతమైన బీసెంట్ రోడ్డు ఏరియాలో గజం విలువను రూ.5 వేలు పెంచారు. గతంలో రూ.1.10 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.1.15 లక్షలకు పెరిగింది. ⇒ గవర్నర్‌పేట ప్రాంతంలోనూ గజం 1.09 లక్షల నుంచి 1.15 లక్షలకు పెరిగింది. ⇒ గాందీనగర్‌లో రూ.58 వేల నుంచి రూ.64 వేలకు పెంచారు. ⇒ గురునానక్ నగర్ కాలనీలో గజానికి రూ.3 వేలు పెంచారు. ⇒ విశాఖపట్నంలోని దేశివానిపాలెంలో గజం రూ.1.19 లక్షల నుంచి నుంచి రూ.1.26 లక్షలకు పెరిగింది. జగదాంబ సెంటర్, వన్‌టౌన్, డాబా గార్డెన్స్, ఎంవీపీ కాలనీ వంటి చోట్లా గజానికి రూ.5 వేలకు పైనే పెరిగింది. ⇒తిరుపతి జిల్లాలోని రేణిగుంట, తిరుపతి ప్రాంతాల్లోనూ గజానికి రూ.2 నుంచి రూ.3 వేలకు పెంచారు. ⇒ కొన్నిచోట్ల 50 శాతం పెరుగుదలతో రూ.30 లక్షలున్న ఆస్థి విలువ రూ.45 లక్షలకు పెరిగింది. దీంతో గతంలో దీనిపై రూ.2.30 లక్షలు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడు రూ.3.5 లక్షల వరకు కట్టాల్సి వస్తోంది. అంటే అదనంగా 1.20 లక్షల భారం పడుతోంది. రూ.13,500 కోట్ల ఆదాయమే లక్ష్యం.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రజల నడ్డివిరిచి ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా మార్కెట్ విలువల్ని చంద్రబాబు ప్రభుత్వం సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,500 కోట్ల ఆదాయాన్ని సాధించే లక్ష్యంతో ఈ పెరుగుదలను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం జనవరి నెలాఖరుకు రూ.10,800 కోట్ల ఆదాయం సమకూరాలి. కానీ, రూ.7,500 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచి్చంది. జనవరి వరకే రూ.3,300 కోట్ల లోటు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రాబోయే రోజుల్లోనూ ఆదాయం పెరిగే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు భారీగా మార్కెట్ విలువల్ని పెంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే ప్రజలు ఈ రేట్లు చూసి షాక్‌కు గురవుతున్నారు. -
ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లు
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఇటీవల ప్రారంభించిన బీమా సఖి యోజనలో నెలలోపే 50,000కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పథకంలో నమోదైన 52,511 మందిలో 27,695 మంది బీమా సఖిలకు పాలసీలను విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఇప్పటికే 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టారని పేర్కొంది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం లక్ష్యంగా ఎల్ఐసీ గతంలో తెలిపింది.ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకందేశవ్యాప్తంగా మహిళల సాధికారత లక్ష్యంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో బీమా సఖీలుగా పిలువబడే ఏజెంట్లుగా మారడానికి మహిళలకు శిక్షణ ఇస్తారు. దాంతో వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.లక్ష్యాలు, ప్రయోజనాలుగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహనను పెంపొందించడం బీమా సఖి యోజన(LIC Bima Sakhi Yojana) ప్రాథమిక లక్ష్యం. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 1,00,000 మంది మహిళలను, వచ్చే మూడేళ్లలో 2,00,000 మంది మహిళలను ఈ పథకంలో భాగం చేయడం దీని లక్ష్యం. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి బీమాను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.ఈ పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు ఉంటుంది. దాంతోపాటు నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్‌లు అందిస్తారు. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందకుండా మహిళలు తమ శిక్షణపై దృష్టి పెట్టడానికి ఈ ఆర్థిక వెసులుబాటు సహాయపడుతుంది. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితాఅర్హతలు ఇవే..కనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఎల్ఐసీ ఏజెంట్లుగా మారి వారు విక్రయించే పాలసీల ఆధారంగా కమీషన్లు(Commissions) పొందవచ్చు. బీమా సఖి యోజన ప్రారంభమైనప్పటి నుంచి మొదటి నెలలోనే 50,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరిలో 27,695 మంది మహిళలకు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేయగా, 14,583 మంది ఇప్పటికే పాలసీలను విక్రయించడం ప్రారంభించారు. ఏడాదిలోగా దేశంలోని ప్రతి పంచాయతీకి కనీసం ఒక బీమా సఖిని అందించాలని ఎల్ఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోగ్రామ్‌లో చేరిన గ్రాడ్యుయేట్ మహిళలను భవిష్యత్తులో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. -
నిన్న కరెంట్ చార్జీలు.. నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు బాదుడే బాదుడు
రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసిందేమీ లేకపోగా, ప్రజలను బాదడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో కరెంట్ చార్జీలను ఎడా పెడా బాదేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా రిజిస్ట్రేషన్లపై పడింది. ఇదివరకు ఏ ప్రభుత్వం అవలంభించని రీతిలో ల్యాండ్ ధరలను పెంచేయడంతో పాటు నిర్మాణాల విలువనూ అమాంతం ఆకాశాన్నంటించింది. విలువల పెంపునకు కాదేదీ అనర్హం.. అన్నట్లు పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలక పోవడం విస్తుగొలుపుతోంది. క్లాసిఫికేషన్ల పేరుతో మాయ చేస్తూ ఒకే ప్రాంతంలో ఇష్టానుసారం రేట్లు ఫిక్స్ చేస్తోంది. సంపద సృష్టించడం అంటే ఇదే కాబోలు అని జనం వాపోయేలా చేసింది.విజయవాడలోని పటమట ప్రాంతంలో ప్రస్తుతం రూ.కోటి విలువైన ఫ్లాట్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8 లక్షలు. ఇప్పుడు దాని విలువ 30% పెరిగితే రిజిస్ట్రేషన్ చార్జీలు అదనంగా రూ.2.50 లక్షలు.. అంటే రూ.10.50 లక్షలు కట్టాల్సి వస్తుంది. గుంటూరు రూరల్ ప్రాంతంలో రూ.30 లక్షల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రస్తుతం రూ.2.40 లక్షలు అవుతుండగా.. అవి రూ.3 లక్షలకు పెరగనున్నాయి. ఇలా అన్ని చోట్లా భూముల విలువను బట్టి రేట్లు భారీగా పెరిగిపోనున్నాయి. జనవరి 1 నుంచి ఈ పెరుగుదల అమల్లోకి రానుంది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మంగళవారం రాత్రి మెమో, ప్రొసీడింగ్స్ (ఎంవీ1/752/2022) జారీ చేశారు. సాక్షి, అమరావతి: ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పెను భారాలు మోపుతోంది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటికే నిర్మాణాల విలువను నిర్ధారించింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లనూ వదలకుండా వాటి విలువలను పెంచేసింది. భూముల విలువ పెంచినా, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైకి 20 శాతం వరకు పెంపు ఉంటుందని చెబుతున్నా 50 శాతం వరకు పెంచుతున్నారని తెలుస్తోంది. అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని భూముల విలువ కేటగిరీలను బట్టి 30 నుంచి 60 శాతం వరకు పెంచేస్తున్నారు. దీంతో నగరాల్లో అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసిన వారిపై అదనంగా రూ.లక్షల భారం పడనుంది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం ఉన్న భూముల క్లాసిఫికేషన్లను మార్చేస్తున్నారు. అంటే ప్రతి ఏరియాలోని భూమికి ప్రస్తుతం ఒకే విలువ ఉండగా, దొడ్డిదారిన దాని క్లాసిఫికేషన్ మార్చి రెండవ విలువను పెట్టాలని నిర్ణయించారు. దీనికి కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగా.. ఇళ్ల స్థలాలైతే జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నవి.. వాటి వెనుక ఉన్నవి.. అంటూ పలు రకాలుగా క్లాసిఫికేషన్‌లో ఉన్నాయి. ఒక ఏరియాలో మెట్ట భూమి విలువ రూ.10 లక్షలు, మాగాణి భూమి విలువ రూ.20 లక్షలుగా ఉందనుకుందాం. ఇప్పుడు రూ.10 లక్షలు ఉన్న మెట్ట భూమిలో ఒకచోట రూ.15 లక్షలు, పక్కనే ఉన్న దానికి రూ.20 లక్షలు పెడుతున్నారు. అంటే ప్రతి క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటు పెడుతున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్ పెడుతున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి ఆనుకున్న భూమికి ఒక రేటు, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు.వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు రకరకాలుగా మార్చారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతి దాని రేటు మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచేశారు. ఏరియాను బట్టి కాదు.. స్థలాన్ని బట్టి రేటు సాధారణంగా భూముల విలువను.. ఉన్న దానిపైనే ఎంతో కొంత పెంచడం ఆనవాయితీ. కానీ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడం కోసం గుట్టుచప్పుడు కాకుండా క్లాసిఫికేషన్లు మార్చుతున్నారు. దీంతో ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి.ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలు పెరిగిపోనున్నాయి. ఎక్కడైనా ఈ ఏరియాలో భూమి రేటు ఎంత ఉందని అడగడం సహజం. కానీ ఇకపై ఆ ఏరియాలోని ప్రతి స్థలం రేటు.. రోడ్డు పక్కన ఒకలా, రోడ్డు లోపల మరోలా మారిపోవడం వల్ల రేటు చెప్పడం అంత సులువు కాదు. 27 నాటికి తుది విలువలకు ఆమోదం భూముల మార్కెట్ విలువల పెంపునకు సంబంధించి ఇప్పటికే సబ్ రిజి్రస్టార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ షెడ్యూల్ కూడా ఇచ్చింది. 18వ తేదీ లోపు మార్కెట్ విలువను నిర్ధారించాలని షెడ్యూల్ ఇవ్వడంతో దాదాపు అన్ని చోట్లా వాటిని ఖరారు చేశారు. 19వ తేదీ ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు వీటికి ఆమోదం తెలపనున్నాయి. 20వ తేదీ.. పెరిగిన ఈ విలువలను సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో అంటించడంతోపాటు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో పెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు.అభ్యంతరాల స్వీకరణ, వాటికి వివరణలు ఇవ్వడం, డేటా ఎంట్రీ పనులన్నీ 26వ తేదీలోపు పూర్తి చేసి.. 27న మార్కెట్ విలువకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ విలువలను అమల్లోకి తెచ్చి, వాటి ప్రకారమే రిజి్రస్టేషన్ల చార్జీలు వసూలు చేయాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పని జరుగుతోంది.పూరి పాకలనూ వదల్లేదు ఇప్పటికే నిర్మాణాల విలువను ప్రభుత్వం ఖరారు చేసి ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు, నాన్ ఆర్సీసీ రూఫ్‌లతోపాటు పూరిళ్లు, గోడలు లేని ఇళ్ల విలువనూ పెంచేసింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఉన్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, నివాస భవనాలకు చదరపు అడుగు విలువను రూ.1,490కి పెంచింది. నగర పంచాయతీల్లో చదరపు అడుగు రూ.1,270, గ్రామ పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ.900కు పెంచింది. సెల్లార్, పార్కింగ్ ఏరియాతోపాటు ప్రతి అంతస్తులో అదనపు ఫ్లోర్లకు రేటు పెంచారు. వాణిజ్య భవనాల విలువను కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రూ.1,800కు, నగర పంచాయతీల్లో రూ.1,540కి, పంచాయతీల్లో రూ.1060కు పెంచారు. ఇతర ఆర్సీసీ నిర్మాణాలే కాకుండా ఆర్సీసీ రూఫ్‌లు లేని ఇళ్ల విలువను సైతం పెంచేశారు. చివరికి పెంకుటిళ్లు, పాకలు, గోడలు లేని ఇళ్లను సైతం వదలకుండా వాటి విలువను చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.20 వరకూ పెంచింది. అన్ని రకాల నిర్మాణాల్లోనూ ఎస్ఎఫ్టీ రేటు రూ.30 నుంచి రూ.90 వరకు పెంచారు. -
కోట్లు పలుకుతున్న కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టు
కావలి సబ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా అధికారానికి, అహంకారానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. లంచం లేనిదే సంతకం పెట్టని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలకు తావులేదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కావలిలోనే కాక, ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ శాఖలో అవినీతికి తావులేదని చెప్పిన ఆ ప్రజాప్రతినిధే.. మూడు నెలలు తిరగక ముందే ప్లేటు ఫిరాయించి ఆ పోస్టుకు బహిరంగ వేలం పెట్టడంతో సబ్ రిజిస్ట్రార్ vs ప్రజాప్రతినిధిగా మారింది. సెలవు పెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే ఎలా పనిచేస్తావో చూస్తానన్న సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి.. ఆ సబ్ రిజిస్ట్రార్ తన పలుకుబడితో అదే సీటులో కూర్చొని పనిచేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి సబ్ రిజిస్ట్రార్ సీటు.. భలే హాటుగా మారింది. ఈ పోస్టు వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్ అయింది. అధికారం, రాజకీయం ఆధిపత్యం కొనసాగుతోంది.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ ద్వారా అదనపు వసూళ్లు లేకుండా కాగితం కదలని పరిస్థితి. అలాంటి సబ్ రిజిస్ట్రార్కార్యాలయం ఎదుట లంచాలకు తావులేదని, ప్రభుత్వ రుసుములు చెల్లిస్తే చాలని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద సంచలనంగా మారింది. నిత్యం క్రయవిక్రయాల్లో రూ.లక్షల్లో చేతులు మారే కార్యాలయంలో ఉన్న పళంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారం వెనుక అధికారి నిజాయితీ ఉందనుకుంటే పొరపాటే. రూ.కోట్లు పలికే ఆ పోస్టులో సదరు ప్రజాప్రతినిధిని ధిక్కరించి కూర్చొన్న సదరు మహిళా అధికారి భవిష్యత్ ప్రమాదానికి భయపడి ఆ బోర్డు ఏర్పాటు చేసినట్లుగా చర్చ సాగుతోంది. నెలకు రూ.50 లక్షల ఆదాయం జిల్లాలో నెలవారీ ముడుపుల ఆదాయంలో నెల్లూరు తర్వాత కావలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే. కావలి చుట్టూ రామాయపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం ఇలా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు దూసుకుపోతున్న కావలిలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. ఈ ప్రాంతంలో భూ క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే భూ వివాదాలు ఉన్న ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కీలకంగా మారింది. నిబంధలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తే రూ.లక్షల్లో ముడుపులు అందుతాయి. నెలవారీగా సబ్ రిజిస్ట్రార్ ఆదాయం రూ.50 లక్షలకుపై మాటే ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో కావలి సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ దఫా సాధారణ బదిలీల్లో భాగంగా ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకుని ఓ మహిళా అధికారి ఈ పోస్టును పట్టేసింది. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ లేకుండానే ఆ పోస్టులో కూర్చొంది. రెండు నెలల పాటు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయంలో కాసులు గలగలాడాయి. దీంతో ఆ పోస్టుపై కన్నేసిన ప్రజాప్రతినిధి సదరు అ«ధికారిణి దందా వ్యవహారంపై ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ఆమె కొద్ది రోజులు సెలవుపై వెళ్లడం చకచకా జరిగిపోయాయి. పోస్టుకు బహిరంగ వేలం.. కావలి సబ్‌రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లడంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి ఈ పోస్టుకు వేలం పెట్టినట్లు తెలుస్తోంది. నెలవారీగా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆ పోస్టుకు గతంలో పని చేసిన ఓ అధికారి, నెల్లూరులో పనిచేసి వెళ్లిన మరో అధికారి పోటీ పడుతున్నారు. రెగ్యులర్ పోస్టు అయితే.. రూ.2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యుటేషన్‌పై వచ్చేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. రూ.కోటి వరకు బేరం కుదిరింది. లోకల్ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో భారీ ఆఫర్లతో పోస్టు కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తన పోస్టుకు ఎసరు పెడుతున్న విషయాన్ని తెలుసుకున్న సదరు అధికారిణి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఉన్నతాధికారులకు రెకమెండ్ చేయించుకుని వెను వెంటనే విధుల్లో జాయిన్ అయిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని సందర్శించిన సదరు ప్రజాప్రతినిధి ఇక్కడ అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పారు. మూడు నెలలు తిరగక ముందే ఆ పోస్టుకు వేలం పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీటు వదలాల్సిందే.. కదిలే ప్రసక్తే లేదు.. కావలి సబ్ రిజిస్ట్రార్ గా విధుల్లో జాయిన్ అయిన అధికారిణి స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు ఇతరులను రాజీ రాయబేరానికి పంపించారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రజాప్రతినిధి ఆమె ఆ సీటులో ఎన్ని రోజులు కూర్చుంటుందో నేను చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆ సీటు వదలాల్సిందేనని సదరు ప్రజాప్రతినిధి హుంకరిస్తుంటే.. కదిలే ప్రసక్తే లేదంటూ సబ్ రిజిస్ట్రార్ మొండికేస్తున్నారు. అధికారి, ప్రజాప్రతినిధి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో రాజకీయంగా ఉచ్చు బిగిసే అవకాశం ఉండడంతో ఆ సబ్ రిజిస్ట్రార్ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రజాప్రతినిధికే సవాల్ విసురుతూ ఎదురొడ్డుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీని అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని భావించిన సదరు అధికారిణి కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు, చలనాలు మాత్రమే చెల్లించాలని, దళారులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని బోర్డు పెట్టించడమే కాకుండా క్రయ, విక్రయ దారులను ఎవరికి అదనపు రుసుములు చెల్లించవద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆ కార్యాలయ ఉద్యోగులకు నచ్చడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కావలి కార్యాలయానికి బదిలీపై వస్తే లంచాలు రాకుండా ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తమకు వచ్చే ఆదాయాన్ని అడ్డుకుంటుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేసిన సదరు అధికారిణిపై అనేక ఆరోపణలున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అధికారిణి కావలికి వచ్చేసరికి ఇలా బోర్డులు ఏర్పాటు చేయడంపై ఆ శాఖలోనే హాట్ టాపిక్‌గా మారింది. -
ఆర్టీవో ఆఫీసులో దసరా, దీపావళి దందా..!
సాక్షి,విశాఖపట్నం: విశాఖ ఆర్టీవో కార్యాలయంలో దసరా,దీపావళి దందాకు తెరతీశారు. రెండు నెలల నుంచి వేల సంఖ్యలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు పెండింగ్ పెట్టారు. ఉద్దేశ్య పూర్వకంగానే రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.రిజిస్ట్రేషన్ల పెండింగ్‌కు ఏదో ఒక సాకు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు.రిజిస్ట్రేషన్ జరగాలంటే 500 నుంచి 1000 వరకు చేతులు తపాలని ఆర్టీఏ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పని జరగాలంటే తమ డ్రైవర్లను కలవాలని కొందరు అధికారులు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.డ్రైవర్లతో వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడాలని ఆ అధికారులు సూచిస్తున్నారు. తమ డ్రైవర్లకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ రవాణా కమిషనర్(డీటీసీ)కి తెలియకుండా కిందిస్థాయి సిబ్బందే ఈ దందా నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంతో విసిగిపోయిన టూ వీలర్,ఫోర్ వీలర్ వాహనాల డీలర్లు డీటీసీని మంగళవారం(అక్టోబర్ 29) కలవనున్నారు. గంభీరం నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన అధికారి,మరో మహిళా అధికారితో కలిసి ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: బాంబు బెదిరింపులతో హడల్ -
రిజిస్ట్రేషన్లకు రేవంత్ సర్కార్ బ్రేక్
-
తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో లేఔట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొత్తగా గ్రామాలను చేర్చింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే పలు ఫామ్‌హౌస్‌లకు గ్రామ పంచాయితీలు అనుమతులు ఇచ్చాయి. జాన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లకు గ్రామ పంచాయితీ అనుమతినిచ్చింది. హైడ్రా తెర మీదకు రావడంతో గ్రామ పంచాయితీల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సర్కార్ నిర్ణయించింది.కాగా, వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది.దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు.ఇదీ చదవండి: ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్నగదు అవసరమైనప్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది. -
ఆదాయం ఎందుకు తగ్గింది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఆదాయం తగ్గడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రావాల్సిన ఆదాయం కంటే గడిచిన ఆరేడు నెలల్లో ప్రతినెలా ఆదాయం రూ 650 కోట్ల మేరకు తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయం తగ్గడానికి కారణాలేంటి? ఎక్కడ లొసుగులున్నాయో దృష్టిపెట్టాలని ఆదేశించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, రవాణా, మైనింగ్, ఎక్సైజ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో గురువారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సది్వనియోగం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల లక్ష్యం రూ.85,126 కోట్లుగా ఉంటే.. ఏప్రిల్‌నుంచి సెపె్టంబర్‌వరకు రూ.42,034 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఇందులో రూ.37,315 కోట్లు మాత్రమే వచి్చంది. రూ.4,719 కోట్లు తక్కువ రావడంపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. లక్ష్యాన్ని చేరుకోవాలి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరే విధంగా పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆదాయ వసూళ్లపై నిక్కచి్చగా ఉండాలని, అవసరమైతే సంబంధిత విభాగాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలని, సంస్కరణలు చేసుకోవాలని సూచించారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రతీశాఖ పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదని హెచ్చరించారు.అత్యధికంగా జీఎస్టీలో 4,086 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రూ.654 కోట్లు తక్కువగా వచి్చనట్లు తేలింది. రాష్ట్రంలో జీఎస్టీలో ఎంట్రీ కాకుండా చాలామంది కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని. అటువంటి వారిని కూడా గుర్తించాలని ఆదేశించారు. మద్యం విక్రయాల్లో ఆదాయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టాలన్నారు. ఆర్ఆర్ఆర్తో సానుకూల వాతావరణం రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి ప్రాజెక్టులతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వీటితోపాటు ఫోర్త్‌సిటీ, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, కొత్త ఎయిర్‌పోర్టులు వంటివాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లలేదని, గందరగోళానికి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని చెప్పినట్లు తెలిసింది.ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలనే హైడ్రా కూలి్చవేసిందని, అన్నీ సక్రమంగా ఉన్న భూముల విలువ పెరిగి.. రిజి్రస్టేషన్లు పెరగాల్సిన చోట.. ఆదాయం తగ్గడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీలోని నిర్మాణాల తొలగింపునకు, రిజిస్ట్రేషన్లు తగ్గడానికి ఎలా ముడిపెడతారని సీఎం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. -
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
‘అసైన్డ్’ రిజిస్ట్రేషన్ల నిలిపివేత
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై కల్పించిన యాజమాన్య హక్కులను హరించేలా కూటమి సర్కారు చర్యలకు దిగింది. యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా గత ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై విచారణ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది. యాజమాన్య హక్కులు పొందిన తర్వాత రిజి్రస్టేషన్లు జరగని లేదా ఎలాంటి లావాదేవీలు జరగని భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయాలంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిన భూములపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పేర్కొంది.ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా శనివారం కలెక్టర్లు, రిజి్రస్టార్లు, సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ చేశారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల వల్ల అనర్హులు లబ్ధి పొందారని, రిజిస్ట్రేషన్ల చట్టం 1908 సెక్షన్ 22ఏకి విరుద్ధంగా హక్కులిచ్చారని అందులో పేర్కొన్నారు. సామాజిక, పోరంబోకు భూములపై అక్రమంగా హక్కులిచ్చారని, అనంతరం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులిచి్చన చోట్ల విచారణ నిర్వహించి దీనిద్వారా ఎక్కడైనా భూకబ్జాలు జరిగాయా? హక్కుల నిర్థారణలో వాస్తవికత ఉందో లేదో నిర్థారించేందుకు వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు.మూడు నెలలో వెరిఫికేషన్ పూర్తి కావాలని, ఇందుకోసం కలెక్టర్లు విచారణ సంస్థలను ఉపయోగించుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా ఏ కేసులోనైనా యాజమాన్య హక్కుల కల్పన అక్రమంగా జరిగినట్లు తేలితే వాటిని రద్దు చేసి ఆ భూమిని తిరిగి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చేలా రీ క్లాసిఫికేషన్ చేయాలని ఆదేశించారు. యాజమాన్య హక్కులిచి్చన భూములను ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే ఇకపై వాటికి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సూచించారు. విచారణలో యాజమాన్య హక్కులు సక్రమంగానే ఇచి్చనట్లు తేలినా వాటిపై రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత!
సాక్షి, అమరావతి : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజలు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకుండా గ్రామ స్థాయిలోనే సచివాలయాల్లో పూర్తి చేసుకొనేలా రెండేళ్ల క్రితం అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది. భూముల రీ సర్వే పూర్తయిన 4 వేలకుపైగా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది.ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉన్న ఈ విధానాన్ని తమ ఆదాయం పోతుందని డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉనికికే ప్రమాదమంటూ ఆ శాఖలోని పలువురు సిబ్బంది వ్యతిరేకించారు. అయినప్పటికీ, ప్రజల మేలు కోరిన వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలను అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెద్దగా జరగడంలేదనే సాకుతో దానిని నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. -
స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. యథావిధిగా ఉదయం 10 గంటలకు సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలు ప్రారంభం కాగా, అన్ని చోట్ల ఒకట్రెండు డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 11 గంటలకు సమస్య వచ్చింది.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా క్రయవిక్రయదారుల ఆధార్ వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఈకేవైసీని సబ్‌రిజి్రస్టార్ వేలిముద్రతో ఆమోదించాలి. అలా సబ్‌రిజిస్ట్రార్ వేలిముద్ర వేసే క్రమంలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆ దశలోనే ఆగిపోయిందనిరిజిస్ట్రేషన్లశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 3,500 నుంచి 4వేల వరకు డాక్యుమెంట్లరిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ, గురువారం ఉదయం నుంచి సాయంత్రం కార్యాలయ వేళలు ముగిసేంతవరకు ఈకేవైసీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం కేవలం 339రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి.రిజిస్ట్రేషన్ సేవల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని, ఆధార్ సర్విసుల్లో సమస్య కారణంగానే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయా యని తెలంగాణరిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అధికారికంగా వెల్లడించింది. ఈ విషయమైరిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను ‘సాక్షి’ సంప్రదించగా, తమ శాఖకు సంబంధించిన సర్వర్లలో ఎలాంటి సమస్యా లేదని, సెంట్రల్ సర్వర్‌తో అన్ని కార్యాలయాల్లోని సర్వర్లు సక్రమంగానే ఉన్నాయని చెప్పారు. ఈకేవైసీ మినహా ఈసీలు, వివాహ రిజిస్ట్రేషన్లు, ఈ–స్టాంపులు లాంటి కార్యకలాపాలు యథావిధిగా నడిచాయని వెల్లడించారు. కాగా, ఆధార్ సేవల్లో తలెత్తిన లోపాన్ని చక్కదిద్దామని, శుక్రవారం నుంచి యథావిధిగా సేవలు అందుతాయని ఢిల్లీలోని యూఐడీఏఐ అధికారులు తెలిపారు. -
గ్రేటర్ హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టత..సాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలుకీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదల..సాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజి్రస్టేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..గ్రేటర్లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు..సాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ -
సిటీ ‘రియల్’ మార్కెట్ ఢమాల్
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.- సాక్షి,హైదరాబాద్రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టతసాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలు కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదలసాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి.హైదరాబాద్జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజిస్ట్రేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..గ్రేటర్లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారుసాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి,గిరిధారి హోమ్స్ ఎండీ -
టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే!
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్‌గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.రూల్స్, గీల్స్ ఏమీలేవు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్‌లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్‌చుప్‌గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది. -
BH రిజిస్ట్రేషన్.. బయటపడ్డ డీలర్ల మోసాలు
-
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్‌లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్‌పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్‌లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
Fact Check: ఈసీలపైనా గుడ్డి రాతలేనా?
సాక్షి, అమరావతి: ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపి... అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వంపైకి తప్పు నెట్టేయడం ఈనాడుకు... దానిని నడుపుతున్న రామోజీకి నిత్యకృత్యంగా మారింది. తాజాగా ఈసీల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా... అవి అందించలేకపోవడంతో రిజిస్ట్రేషన్లు అగిపోయాయంటూ ఓ అబద్ధాన్ని అందంగా అచ్చేశారు. కానీ వాస్తవానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఒక్క మార్చిలోనే రాష్ట్రంలో 2,62,807 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆన్లైన్లో 1.26,123 ఉచితంగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 26,912 ఈసీలు జారీ అయ్యాయి. ఇక్కడ లక్షల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్లు, ఈసీల జారీ కనిపిస్తుంటే.. రాజగురువు రామోజీ మాత్రం కళ్లుండి ధృతరా్రషు్టడిలా మారిపోయారు. రాజకీయంగా చతికిలపడిన తన పార్ట్నర్ చంద్రబాబు గ్రాఫ్‌ను పైకి లేపేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈనాడులో నిత్యం అసత్య కథనాలు వండివారుస్తూ దిగజారిపోతున్నారు. దేశంలోనే రిజిస్ట్రేషన్ల విధానంలో ఏపీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ అమలులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల సేవలు మరింత సులభంగా, సురక్షితంగా సాగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ సక్సెస్‌ను జీర్ణించుకోలేని రామోజీ ప్రైమ్ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా పది రోజులుగా ఈసీలు నిలిచిపోయాయంటూ కుట్రపూరిత కథనాన్ని అల్లేశారు.అవాస్తవాలే అందులో వార్తలు రాష్ట్రంలో ఈసీల జారీ నిలిచిపోలేదు. క్రయవిక్రయాలు ఆగలేదు. రిజిస్ట్రేషన్లు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. www.registration.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఈసీలు అందుతున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల కౌంటర్ల ద్వారా ప్రజలు నిర్దేశిత దరఖాస్తు నింపి, నిర్ణీత రుసుము చెల్లింపులతో సబ్‌రిజిస్ట్రార్ ఈ–సైన్‌తో కూడిన ఈసీలను పొందుతున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు అందించేవారికి జారీ చేస్తున్న విధానం ప్రస్తుతం సాంకేతిక భద్రతా ప్రమాణాల ఆడిటింగ్ కారణంగా తాత్కాలికంగా నిలిచింది. మిగిలిన విధానాల్లో యథావిధిగా ఈసీల జారీ కొనసాగుతోంది. కానీ, వాస్తవాలను పక్కన పెట్టి ఈనాడు యథావిధిగా అసత్యాలను అచ్చేసింది. సెక్యూరిటీ ఆడిట్ పూర్తయిన వెంటనే మీసేవ ద్వారా కూడా ఈసీల జారీ పునఃప్రారంభమవుతుంది. దీనితో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా 30వ తేదీ నుంచి డిజిటల్ సర్టిఫైడ్ ఈసీలు, డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీలు ఆన్లైన్లో నిర్ణీత రుసుము చెల్లింపులతో పొందవచ్చు. కానీ కేవలం అబద్ధాలే అచ్చేసే ఈనాడు ఈ విషయంలోనూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు యరిజిస్ట్రార్స్తోంది. -
ఫామ్ ల్యాండ్ బురిడీ
సాక్షి, యాదాద్రి: ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు..అధికారులతో కుమ్మక్కై ప్రధానంగా ఫామ్ ల్యాండ్ వెంచర్లు, అలాగే అనధికారిక లేఅవుట్లు, చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి. స్థానిక సంస్థల స్థిరాస్తి ఆదాయానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నాయి. వాస్తవానికి అనధికారిక లే అవుట్లను అదుపు చేయడంతో పాటు, ఆదాయానికి గండి పడకుండా, ప్రజలు రియల్టర్ల మోసాల బారిన పడకుండా ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీని ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో 0.20 ఎకరాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ గుంట, రెండు గుంటల భూమిని కూడా ఫామ్ ల్యాండ్ వెంచర్ల కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదేవిధంగా తహసీల్దార్ ఇచ్చిన నాలా కన్వర్షన్ పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్లాట్లను 2000 చదరపు గజాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ 121 (గుంట), 242 (రెండు గుంటలు) గజాల ప్లాట్లను కూడా రిజిస్టర్ చేస్తున్నారు. అలాగే డీటీసీపీ, హెచ్ఎండీఏ, రెరా, వైటీడీఏల అప్రూవ్డ్ లేఅవుట్లలోనే ఆయా వెంచర్లకు సంబంధించిన మొత్తం సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ ఓపెన్ ప్లాట్లకు నాలా కన్వర్షన్‌తో 121, 242, 363 గజాల ప్లాట్లకు కూడా వెంచర్‌కు సంబంధించిన అన్ని సర్వే నంబర్లు వేసి, ఆ ప్లాటు చుట్టూ హద్దులు ఇతర ప్లాట్లకు సంబంధించిన నంబర్లు వేయడం ద్వారా అన్ని అనుమతులు ఉన్నాయని కొనుగోలుదారులను నమ్మిస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో యధేచ్చగా రిజిస్ట్రేషస్లు చేసేస్తుండటం గమనార్హం. కొనుగోలుదారులకు ఎర ఎలాంటి అనుమతులు లేకుండా కొత్త కొత్త పేర్లతో వేల ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వెంచర్ ప్రారంభోత్సవం రోజునే ప్లాటు కొనుగోలు చేసిన మొదటి 50 మందికి నెలకు రూ.10 వేల చొప్పున 30 నెలల పాటు రెంటల్ చెల్లిస్తామని ఆఫర్ ఇస్తూ పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఈ అక్రమ వ్యాపారంతో ప్రభుత్వానికి, స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రియల్టర్లు డెవలప్మెంట్ చార్జీల చలాన్ల నిమిత్తం ఎకరానికి సుమారు రూ.లక్ష చొప్పున చెల్లించకుండా, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు 10 శాతం స్థిరాస్తి భూమిని గిఫ్ట్ డీడ్ చేయకుండా ఎగవేస్తున్నారు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన జీఓ ప్రకారం అప్పటి కలెక్టర్ పమేలా సత్పతి ఫాంల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కొంత కాలం నిలిచిపోయినా తిరిగి ఊపందుకున్నాయి. 900 వరకు అక్రమ వెంచర్లు! జిల్లాలో ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యాపారం చేస్తున్న సుమారు 900 వరకు అక్రమ వెంచర్లు ఉన్నట్లు అంచనా. యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, ఆత్మకూర్(ఎం) వలిగొండ, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు సాగుతున్నాయి. ప్రధానంగా వంగపల్లి, సర్వేపల్లి, కాచారం, రఘునాథపురం, కొలనుపాక, యాదగిరిపల్లి, సైదాపురం, పెద్ద కందుకూరు శ్రీనివాసాపురం, పటేల్‌గూడెం, గుండ్లగూడెం ఆలేరులలో ఫామ్ ల్యాండ్ ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కుదరదు..రుణం రాదు ఫామ్ ల్యాండ్ పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లలో ప్రధానంగా ఇంటి నిర్మాణాలకు అనుమతి లభించదు. డీటీసీపీ అనుమతి లేనందున బ్యాంకు రుణం రాదు. కొనుగోలుదారు ప్లాటు పొజిషన్‌కు స్థానిక సంస్థలు చట్టబద్ధతను సైతం ఇవ్వడం లేదు. 70 ఎకరాల్లో అనధికార లేఅవుట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం ధర్మపురం రెవెన్యూ శివారులో శ్రీసిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్.. రాయల్ గార్డెన్–2 ఫామ్ ల్యాండ్ పేరుతో సర్వే నంబర్లు 26 నుంచి 28 వరకు, అలాగే 30 నుంచి 38 వరకు, 42, 49ల్లోని సుమారు 70 ఎకరాలు అనధికారికంగా లేఅవుట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. వ్యవసాయ భూమిని కేవలం వ్యవసాయేతర భూమిగా మార్చి (నాలా కన్వర్షన్), 60, 40, 30 ఫీట్ల రోడ్లు వేసి, విద్యుత్ స్తంభాలు నాటి గజం రూ.4,600 చొప్పున విక్రయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 300 గజాల ప్లాట్ (నం.806)ను మోత్కూర్ సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో (డాక్యుమెంట్ నంబర్ 4716/19) సర్వే నంబర్లు మొత్తం వేసి రిజిస్టర్ చేశారు. ఈ ఒక్క వెంచర్‌లోనే వివిధ విస్తీర్ణాల్లో 2 వేలకు పైగా ప్లాట్లు ఉన్నాయి. -
డీలాపడే.. ఇళ్లపై రంకెలు
సాక్షి, అమరావతి : అధికారంలో చంద్రబాబు తప్ప వేరెవరైనా ఉంటే అ ప్రభుత్వం చేసే మంచి పనులేవీ రామోజీరావుకు కనిపించవు. ఒకవేళ కనిపించినా కనిపించనట్లు జీవిస్తారు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయనెంత దుర్మార్గం చేసినా ఆహా ఓహో అంటూ భజనలు. ఇది తన సహజ లక్షణమని ఆయన నిత్యం నిరూపించుకుంటున్నారు. తాజాగా.. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకురాని సంస్కరణను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి విజయవంతంగా అమలుచేయడాన్ని ఈ పచ్చకళ్ల రామోజీరావు సహించలేకపోతున్నారు. జగన్‌ను, ఆయన సర్కారును ఎలాగైనా అభాసుపాల్జేయాలన్న కసి ఆయనను దహించేస్తోంది. దీంతో.. దేశంలో పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసిన ఏకైక ప్రభుత్వంగా నిలిచినా దాన్ని తక్కువచేసి చూపేందుకు, లబ్ధిదారుల్లో అపోహలు సృష్టించేందుకు తన క్షుద్ర పత్రికలో చేతికొచ్చింది రాసిపారేస్తున్నారు. ‘అంకెలు భళా.. అమలు డీలా’ అంటూ నిజాలకు పాతరేసి తన పెత్తందారీ భావజాలాన్ని అక్షరం అక్షరంలో ప్రదర్శించారు. 45 రోజుల వ్యవధిలో పేదలకిచ్చిన 15.59 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయడం డీలాపడడం ఎలా అవుతుందో రామోజీరావుకే తెలియాలి. పేదలకు జగన్ సర్కారు చేస్తున్న మేలుతో చంద్రబాబుకు ఇక జన్మలో అధికారం దక్కదన్న దుగ్థతో రామోజీనే డీలాపడి ఇష్టమొచ్చినట్లు రంకెలు వేస్తున్నారు. అసలు.. రిజిస్ట్రేషన్ల శాఖ సంవత్సరం మొత్తం మీద చేసే రిజిస్ట్రేషన్ల సంఖ్య 20 లక్షలు. మామూలుగా అయితే ఈ రిజిస్ట్రేషన్లు చేయడానికి దాదాపు ఏడాది పడుతుంది. కానీ, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వారికి వెనువెంటనే హక్కు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ రిజిస్ట్రేషన్లు చేసింది. ఫిబ్రవరి 4న మొదలుపెట్టి మార్చి 15 వరకు రికార్డు స్థాయిలో 15.59 లక్షల రిజిస్ట్రేషన్లను చేసింది. ఎన్నికల పనులు, రీసర్వే వంటి కార్యక్రమాలున్నా జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం అత్యంత వేగంగా రిజిస్ట్రేషన్లు చేసి చరిత్ర సృష్టించడాన్ని డీలాపడడం అని రామోజీ పదకోశంలో ఈనాడు అనుకుంటే దానిని కడుపుమంట కాక ఇంకేమనాలి? నిజానికి.. చంద్రబాబు తన హయాంలో పేదలకు చెప్పుకోదగ్గ మేలు చేసింది ఏమీలేదు. కానీ రామోజీరావు ఎప్పుడూ దీన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు డీపీటీ (దోచుకో–పంచుకో–తినుకో) పద్ధతిలో పచ్చముఠా రాష్ట్ర ఖజానాను పూర్తిగా నాకేసింది. కానీ, ఇప్పుడు అలాంటిదేవీులేదు. ఖర్చుపెట్టే ప్రతి పైసాకూ తగ్గ ప్రతిఫలం పేదలకు దక్కాలన్నదే సీఎం జగన్ తపన. దీనిని చంద్రబాబే కాదు.. ఎల్లోగ్యాంగ్లో ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ రాతలు.. ఈ రోత కథనాలు. రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక విరామం.. ఇక ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని వక్రీకరించి ఇక అక్కడితో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయినట్లు చిత్రీకరించడం రామోజీ దివాళాకోరుతనం. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న కన్వేయన్స్ డీడ్లపై సీఎం ఫొటో ఉండకూడదనే నిబంధనవల్లే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లకు విరామం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ అనుమతితో సీఎం ఫొటోలేకుండా రిజిస్ట్రేషన్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో మిగిలిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. లెక్క ఎక్కువ కాదు. అసలు లెక్కే రామోజీ.. ఇళ్ల స్థలాల లెక్కను ఎక్కువచేసి ప్రచారం చేసుకుంటున్నారని, కాలనీలు కాదు ఊళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఈనాడు తన అక్కసు వెళ్లగక్కింది. 31.19 లక్షల మంది ఇళ్ల స్థలాలులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలివ్వగా అందులో 22 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. మరో 7 లక్షల మంది పొజిషన్లో ఉండడంతో వీరికి గతంలోనే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మిగిలినవి టిడ్కో, ఇతర ఇళ్లు. ఇందులో లెక్క ఎక్కువచేసి చూపింది ఎక్కడ? 22 లక్షల మంది జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుంటున్న విషయం నిజంకాదా? 17 వేలకుపైగా జగనన్న కాలనీలు ఏర్పడడం రామోజీకి కనిపించడంలేదా? 22 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే 15.50 ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. త్వరలో మిగిలిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇవి కాగితాల్లో లెక్కలు కాదు. వాస్తవంగా కనిపించే లెక్కలే. రిజిస్ట్రేషన్లు చేయకుండా టీడీపీ అడ్డంకులు.. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనే మాటకు కట్టుబడి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020లోనే జీఓ ఇచ్చినా టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి దానికి అడ్డుపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలోపు పేదలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఏకంగా 71,811 ఎకరాల భూమిని సేకరించి, పేదలకు అప్పటికి డీకేటీ పట్టాలిచ్చింది. టీడీపీ అడ్డుకున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించేందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (పీఓటీ) చట్టాన్ని 2021లో సవరించి పదేళ్ల తర్వాత ఇంటి పట్టాను అమ్ముకునే అవకాశం లబ్ధిదారులకు కల్పించింది. రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఉపయోగంలేని రిజిస్ట్రేషన్ అంటూ వక్రభాష్యం చెబుతూ పేదలను మోసం చేస్తోంది. వాస్తవానికి.. ఈ రిజిస్ట్రేషన్ చేయడంవల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణాలిస్తాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి డేటాబేస్‌లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టిౖఫెడ్ కాపీ పొందే దానికి వీలుంటుంది. ఫోర్జరీ, ట్యాంపరింగ్ భయం ఉండదు. ఇన్ని ఉపయోగాలుండగా రిజిస్ట్రేషన్ అవసరంలేదని బుకాయించడం రామోజీ ఏడుపు కాక మరేమిటి? వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడ రాయించుకున్నారు? ఇళ్ల స్థలాలు తీసుకున్న వారిలో కొందరు చనిపోవడంతో వారి వారసులను (లీగల్ హైర్స్) గుర్తించడం ఆలస్యమవడంవల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యాయి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్లు చేసేందుకు చేసే ప్రయత్నాన్ని కూడా ఈనాడు రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థలాలను వైఎస్సార్సీపీ నేతలు తమ పేరుతో ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆధారాల్లేకుండా కుట్రపూరిత రాతలు రాస్తోంది. అలాగే, ఈ కథనంలోనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మొదట రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే తప్పుడు ఆరోపణను అచ్చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఇచ్చిన ఇళ్లన్నింటికీ రిజిస్ట్రేషన్లు చేస్తుంటే దానిపైనా నిందలు మోపి తన వక్రబుద్ధిని ఆ క్షుద్ర పత్రిక చాటుకుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు ఆటోమేటిక్‌గా వస్తాయని, వాటికి కన్వేయన్స్ డీడ్ల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయడం అవసరంలేదనే వింత వాదన లేవనెత్తింది. రెవెన్యూ శాఖ ఎన్ఓసీ లేకుండా యాజమాన్య హక్కులు ఎలా వస్తాయో మహా మేధావి రామోజీకే తెలియాలి. -
‘పీఎం సూర్య ఘర్’కు కోటి రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: సుమారు నెల క్రితం ప్రారంభించిన రూఫ్ టాప్ సోలార్ స్కీం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అనూహ్య స్పందన వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం కోసం ఇప్పటికే కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అద్భుతమంటూ శనివారం ‘ఎక్స్’లో హర్షం వ్యక్తం చేశారు. అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఇప్పటికీ రిజస్ట్రేషన్ చేయించుకోని వారు సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని సూచించారు. -
10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి 10.31 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 79,953 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ జిల్లాలో 79,892 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 50 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ల పంపిణీని త్వరలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పేదలకు స్థలాలు ఇచ్చినా వాటిపై పూర్తి హక్కులు ఇవ్వకుండా డి–పట్టాలు మాత్రమే జారీ చేశారు. తొలిసారిగా వైఎస్ జగన్ అన్ని హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే వాటికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని చూసినా చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఆ పని ఆలస్యమైంది. అన్ని సమస్యలను అధిగమించి, అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత జారీ చేసే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారనున్నాయి. అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. -
ల్యాండ్ టైట్లింగ్‌తో భూ వివాదాలకు తెర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2022 వల్ల భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. వాస్తవాలను గమనించకుండా కొన్ని రాజకీయ పార్టీలు, కొంత మంది న్యాయవాదులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని 12 రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని, భూములకు శాశ్వత హక్కు రావాలంటే ఈ చట్టం అమలు జరగాలని అన్నారు. యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని, ప్రతి మూడు నెలలకోసారి మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎవరైనా మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థలో 66 శాతం కేసులు, 24 శాతం హత్యలు భూ తగాదాలకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఇలా.. సాక్షి: ఈ చట్టం వల్ల భూ యజమానులకు ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయితే ఆ భూమికి అతనే యజమాని అనే హామీని ప్రభుత్వం ఇస్తుంది. ఆ భూమిపై హక్కుకు ఈ రికార్డే సాక్ష్యం. ఒకవేళ రికార్డుల్లో ఏదైనా పొరపాటు వల్ల భూమి హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకోసం టైటిల్ ఇన్సూరెన్సు వ్యవస్థ ఏర్పాటవుతుంది. సాక్షి: ఈ చట్టం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? కల్లం: వ్యవసాయ భూమి కొనుగోలు చెయ్యాలంటే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు చేయించుకోవాలి. ఆ తరువాత ఆర్వోఆర్ చట్ట రిజిస్ట్రేషన్ ప్రకారం తహసీల్దార్ విచారణ చేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చెయ్యాలి. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేచోట, ఒకేసారి జరుగుతాయి. భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటే హక్కులకు సంపూర్ణ హామీ ఉన్నట్లే. సాక్షి: రెవెన్యూ రికార్డుల్లో ఎలా నమోదు చేసుకోవాలి? కల్లం: తహసీల్దార్‌కు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ విచారణ చేసి నమోదు చేస్తారు. పట్టాదారు రికార్డుల్లో పాస్ పుస్తకం జారీ చేస్తారు. కొత్త విధానంలో టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి, సర్టిఫికెట్ జారీ చేస్తారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రాథమిక పరిశీలన చేసి, రికార్డుల వివరాలు, దరఖాస్తుదారు అర్జీల్లో పొందుపరిచి నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారు. సాక్షి: టైటిల్ రిజిస్టర్లో ఏర్పడే భూ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: భూమి రికార్డులను రూపొందించిన ఆ రికార్డుల్లో పొరపాట్లను సరి చెయ్యడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటయ్యింది. భూమి యజమానుల రికార్డు అయినా రిజిస్టర్ 1, 1బిలో తప్పులుంటే సవరణ కోసం ఆర్వోఆర్ చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ దాఖలు చెయ్యవచ్చు. కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులుంటే జిల్లా స్థాయిలోని ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు.టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలకు సంబంధించి వివాదాలుంటే జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. సాక్షి: ఈ చట్టం కింద ఏర్పడే నూతన వ్యవస్థలు ఏమిటి? కల్లం: కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి హక్కుల రిజిస్టర్‌కు భూమి టైటిలింగ్ ఆఫీసర్లను నియమిస్తారు. టైటిల్ రిజిస్టర్‌పై వివాదాలుంటే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్లను నియమిస్తారు. ఇప్పుడున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు అనుబంధ సంస్థలుగా పని చేస్తాయి. సాక్షి: కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర ఏమిటి? కల్లం: ఆర్వోఆర్ చట్టం కింద నిర్వహించే 1బి రిజిస్టర్లో నమోదు, తప్పొప్పుల సవరణ బాధ్యత సివిల్ కోర్టులకు లేనట్లే. ఈ కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులను సవరించే బాధ్యత కూడా సివిల్ కోర్టులకు ఉండదు. వారసత్వ/ఆస్తి పంపకాల వివాదాలు, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగులో ఉన్న వివాదాలు, టైటిల్ రిజిస్టర్ తయారీకి సంబంధం లేని ఇతర భూ వివాదాలు సివిల్ కోర్టు పరిధిలోనే ఉంటాయి. కొత్త చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాల వివరాలు టీఆర్‌లో నమోదు చేయించుకోవాలి. అంతిమంగా ఉత్తర్వుల ప్రకారం చర్య తీసుకుంటారు. టీఆర్ నమోదైన వివరాలపై అభ్యంతరాలుంటే హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సాక్షి: కొత్త చట్టంలో రికార్డులు ఎవరు నిర్వహిస్తారు? కల్లం: ఈ చట్టం కింద మూడు రికార్డులుంటాయి. 1. భూమి హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఉండే టైటిల్ రిజిస్టర్, 2. భూ సమస్యలుంటే నమోదు చేసే వివాదాల రిజిస్టర్, 3. భూమిపై ఇతర హక్కులను నమోదు చేసే చార్లెస్ అండ్ కొవనెంట్స్ రిజిస్టర్. ఈ మూడు రిజిస్టర్లను కలిపి రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటారు. ఈ రికార్డులను ల్యాండ్ అథారిటీ, సంబంధిత అధికారులు నిర్వహిస్తారు. సాక్షి: అభ్యంతరాలుంటే ఎంత కాలంలో తెలపాలి? కల్లం: టైటిల్ రిజిస్టర్లో ఉన్న వివరాలపై అభ్యంతరాలు ఉంటే ఆ వివరాలు నమోదైన రెండు సంవత్సరాల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్వోఆర్ చట్ట ప్రకారం రూపొందిన రిజిస్టర్–1లో అభ్యంతరాలుంటే సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ 1బిలో నమోదు చేసిన వివరాలపై అభ్యంతరాలుంటే 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఈ చట్టంలో అత్యధికంగా రెండేళ్ల కాల వ్యవధి ఇచ్చారు. సాక్షి: కొత్త చట్టం హక్కులకు భద్రతా? భంగమా? కల్లం: హక్కులకు పూర్తి భద్రత చేకూర్చడం, భూ యజమానులకు ప్రభుత్వమే భరోసాగా ఉండడమే ఈ చట్టం ఉద్దేశం. భూములన్నింటికీ ఒకే రికార్డు ఉండటం, ఈ రికార్డును ఆన్లైన్లో పూర్తి రక్షణతో అందరికీ అందుబాటులో ఉంచడం వలన పారదర్శకత వస్తుంది. తారుమారు చేసే అవకాశం లేకుండా రికార్డులు నిర్వహిస్తారు. ఈ చట్టం వలన భూ వివాదాలు భారీగా తగ్గుతాయి. కొత్తగా భూ యాజమాన్య వివాదాలు ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. కోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ చట్టం కింద నమోదు చేసుకోవాలి. ఆ వివరాలకు ప్రభుత్వ గ్యారెంటీ లభిస్తుంది. టైటిల్ రిజిస్టర్లో క్లరికల్ తప్పిదాలుంటే టీఆర్ఓ వద్ద అప్పీలు చేసుకోవాలి. సాక్షి: ఇలాంటి చట్టం ఎక్కడైనా ఇప్పటికే అమలులో ఉందా? కల్లం: టైటిల్ గ్యారెంటీ చట్టం ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, కెనడా, బ్రిటన్, కామన్వెల్త్, తదితర వంద దేశాల్లో అమల్లో ఉంది. సాక్షి: కొత్త చట్టంలో భూమి కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి కొనుగోలు చేసే ముందు టైటిల్ రిజిస్టర్లో వివరాలు చూసుకుంటే చాలు. పాత విధానంలో ఆర్ఎస్ఆర్ నుంచి ప్రస్తుత అడంగల్ వరకూ ప్రతి సంవత్సరం రికార్డు పరిశీలించాల్సిన అవసరం ఉండదు. టైటిల్ రిజిస్టర్లో పేరుంటే ప్రభుత్వ భరోసాతో భూమి కొనుగోలు చెయ్యవచ్చు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి సులభంగా జరిగిపోతాయి. రిజిస్ట్రేషన్ జరిగిందంటే భూమి హక్కుల బదిలీ జరిగినట్టే. అన్ని రకాల భూములకూ ఈ చట్టం వర్తిస్తుంది. అన్ని రకాల భూములకు ఒకటే రిజిస్టర్ ఉంటుంది. సాక్షి: తగాదాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: వివాదాలుంటే సర్వే, హద్దుల చట్టం కింద సంబంధిత అధికారులను కానీ, సివిల్ కోర్టును కానీ ఆశ్రయించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య భాగ పంపిణీ, వారసత్వ తగాదాలు ఉంటే సివిల్ కోర్టులు పరిష్కరిస్తాయి. ఆస్తి పన్నులు, ఇతర వివాదాలు, కేసులు ఉంటే న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి.రికార్డుల వివరాలపై అభ్యంతరాలుంటే చట్టంలో పేర్కొన్న కాల వ్యవధిలో ఎల్‌టీఏఓ, అప్పీలు వేసి, వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేసుకోవాలి. అప్పీల్ చేసుకోకపోతే ఆ భూమిపై హక్కులకు ప్రభుత్వ గ్యారెంటీ లభించదు. ప్రస్తుతం సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో వచ్చే అంతిమ తీర్పు ప్రకారమే టైటిల్ రిజిస్టర్లో హక్కుల నమోదు జరుగుతుంది. కానీ కోర్టుల్లో వివాదంలో ఉన్న వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేయించుకుని, ఆ సర్టిఫైడ్ కాపీని సంబంధిత కోర్టుకు తెలియజేయాలి. -
శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతోంది. 4 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5,000 రిజిస్ట్రేషన్లు జరగ్గా క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. సోమవారం ఒక్కరోజే 90,000 రిజిస్ట్రేషన్లు చేశారు. మంగళవారం రాత్రికి లక్ష రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికే 60 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన లబ్ధిదారులు.. సాయంత్రం ఇంటికి వచ్చాక రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 లక్షల రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా పల్నాడు జిల్లాలో 24 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత బాపట్ల, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లాల్లో 17 నుంచి 20 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వం తరఫున వీఆర్వోలు లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు మొత్తం 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15.33 లక్షల ఇళ్ల పట్టాల డేటాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎంటర్ చేశారు. త్వరలో మిగిలిన డేటాను కూడా ఎంటర్ చేయనున్నారు. రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనిప్రకారం సాధ్యమైనంత త్వరగా మొత్తం రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లు ఆగకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కన్వేయన్స్ డీడ్ల ముద్రణకు ఏర్పాట్లు రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్స్‌ను ముద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ డీడ్లను త్వరలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ వాటిని పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఇప్పటివరకు పేదలకు ఇచ్చిన స్థలాలకు గత ప్రభుత్వాలు డీ పట్టాలు ఇచ్చేవి. వాటిపై పూర్తి హక్కులు లేకపోవడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడేవారు. అందుకే తొలిసారిగా వారికి హక్కుల ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టా ఇస్తున్నారు. పదేళ్ల తర్వాత ఈ పట్టా (కన్వేయన్స్ డీడ్స్) ఆటోమేటిక్‌గా సేల్ డీడ్‌గా మారుతుంది. గడువు తీరిన తర్వాత తహశీల్దార్ నుంచి నిరభ్యంతర పత్రం అవసరం ఉండదు. కన్వేయన్స్ డీడ్స్ సేల్ డీడ్‌గా మారాక దాన్ని ప్రైవేటు పట్టా మాదిరిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. కన్వేయన్స్ డీడ్స్ పొందినప్పటి నుంచి దానిపై బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
AP: పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. తొలిరోజే పది వేల డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున వీఆర్ఓలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సిన అవసరం ఉండదని స్పష్టంగా ముద్రించారు. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో మొట్టమొదటగా తాతపూడి అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ విలువ రూ. 4.46 లక్షలు కాగా, భూసేకరణ విలువ రూ. 11.61 లక్షలుగా అందులో పేర్కొన్నారు. ఈ రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ, యూజర్ ఛార్జిలను ప్రభుత్వమే భరిస్తోంది. అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన రూ. 11.61 లక్షల విలువైన ఆస్తికి సాధారణంగా అయితే ఆమె రూ. 18,600 స్టాంప్ డ్యూటీ, రూ. 2,325 రిజిస్ట్రేషన్ ఛార్జి, రూ. 500 యూజర్ ఛార్జి కలిపి మొత్తం రూ. 21,425 చెల్లించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వమే భరించింది. రిజిస్ట్రేషన్ చేసిన కన్వేయన్స్ డీడ్ 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి.. పదిహేనురోజుల్లో 30.61 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రిజిస్ట్రేషన్లను మరింత వేగంగా చేయనున్నారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లను (కన్వేయన్స్ డీడ్స్) లబ్ధిదారులకు అందించనున్నారు. రూ. 10 స్టాంప్ పేపర్లపై ఈ డీడ్ల ప్రింటింగ్‌ను రిజిస్ట్రేషన్లు అయినదాన్ని బట్టి జిల్లాల్లోనే చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత నియోజకవర్గాలు, సచివాలయాల స్థాయిలో ప్రజాప్రతినిధులు ఈ డీడ్స్‌ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
Fact Check: ఆదాయం పెరిగినా ఏడుపేనా!?
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం సర్వనాశనమైనా అంతా బాగున్నట్లు చిత్రీకరించే రామోజీరావు.. సీఎం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం వృద్ధి చెందుతున్నా.. తిరోగమనంలో ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తూ తన కడుపుమంట చల్లార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రాకపోతే వృద్ధిలేదు, స్థిరాస్తి రంగం దెబ్బతిందని ఆయన పత్రికలో చాటింపు చేస్తూ.. అదే ఆదాయం పెరిగితే మార్కెట్ విలువలను పెంచడంవల్లే ఆదాయం పెరిగినట్లుగా వక్రీకరిస్తూ తన వక్రబుద్ధి చాటుకున్నారు. స్థిరాస్తి రంగం వృద్ధి చెందడంవల్లే ఆదాయం పెరిగిందని రాయడానికి ఈనాడుకు మనసొప్పదు.. చేతులూ రావు. ఎందుకంటే సీఎం కుర్చీలో తన ఆత్మబంధువు చంద్రబాబు లేరు కాబట్టి. వినూత్న చర్యలతో పెరిగిన ఆదాయం నిజానికి.. కొత్త జిల్లాల ఏర్పాటు, రిజిస్ట్రేషన్ల శాఖ వినూత్న మార్పులతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా పెరిగింది. అయినా ఆ ఘనత ప్రభుత్వానికి ఇవ్వడం మానేసి ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేలా కార్టూన్ వేసి ఈనాడు రామోజీ తన కుసంస్కారాన్ని ప్రదర్శించారు. మార్కెట్ విలువల్ని పెంచడంవల్లే ఆదాయం పెరిగిందన్న అడ్డగోలు వాదనకు దిగారు. రిజిస్ట్రేషన్ రేట్లు పెంపును శాస్త్రీయంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో కాకుండా 19 శాతం గ్రామాల్లో మాత్రమే చేపట్టిన విషయం తెలిసి కూడా ఆ పత్రిక దాచిపెట్టింది. చంద్రబాబు హయాంలో అన్ని గ్రామాలు, పట్టణాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువను పెంచారు. అదే సమయంలో చుక్కల భూములు, షరతుగల భూములు, ఈనాం భూములు వంటి లక్షలాది ఎకరాల భూములపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంతో అవన్నీ మార్కెట్లోకి రావడంతో ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరిగి రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2014–15లో 13.70 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా 2022–23లో 26.25 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రంలో పెరిగిన ఆర్థిక వృద్ధి, రియల్ ఎస్టేట్ పెరగడంవల్లే రిజిస్ట్రేషన్లలో ఈ పెరుగుదల సాధ్యమైందనేది సుస్పష్టం. అందుకనుగుణంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరిగింది. కానీ, ఈ విషయాన్ని పక్కనపెట్టి తన పైత్యం, ద్వంద విధానంతో ప్రజలను మభ్య పెట్టేందుకు చార్జీలు పెంచేశారని ఈనాడు అడ్డగోలుగా రాసిపారేసింది. ప్రజలకు సౌకర్యంగా రిజిస్ట్రేషన్ సేవలు.. నిజానికి రిజిస్ట్రేషన్ల శాఖ వైఎస్ జగన్ హయాంలో అత్యంత ఆధునికతను సంతరించుకుంది. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సౌకర్యవంతం చేసింది. ఇందులో ప్రజలే డాక్యుమెంట్ తయారుచేసుకునే అవకాశాన్ని కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం టైం స్లాట్ బుక్‌చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ–స్టాంపింగ్ విధానంవల్ల పెద్దఎత్తున మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులవల్ల ఆదాయం పెరగడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ, దానికి వక్రభాష్యం చెబుతూ చేతికొచ్చింది రాసేసి తన పెన్నుకు బుర్రలేదని రామోజీ చాటుకున్నారు. మార్కెట్ విలువలపై పచ్చి అబద్ధాలు జగన్ పాలనలో తొమ్మిదిసార్లు మార్కెట్ విలువలు పెంచినట్లు పచ్చి అబద్ధాలు రాసింది. వాస్తవానికి ఐదేళ్లలో ఐదుసార్లు మార్కెట్ విలువల్ని సవరించాల్సి వున్నా కేవలం రెండు సాధారణ సవరణలు మాత్రమే చేసింది. మరో మూడుసార్లు ప్రత్యేక రివిజన్‌ను కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసింది. 90 శాతం గ్రామాల్లో ఈ ఐదేళ్లలో ఒక్కసారి మాత్రమే మార్కెట్ రేట్ల సవరణ జరిగింది. అదే చంద్రబాబు హయాంలో అర్బన్ ప్రాంతంలో ఐదుసార్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడుసార్లు మార్కెట్ విలువల్ని సవరించారు. ఈ వాస్తవాలకు మసిపూసి ఈనాడు వంకర రాతలు రాసింది. ఇక్కడిలా.. తెలంగాణలో మరోలా.. జనవరి 30, 2023 తెలంగాణ ఎడిషన్‌లో ఇదే ఈనాడు ‘తరిగిపోయిన స్థిరాస్తి కల’ అని రాసింది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా వృద్ధి చెందుతోందని, ఏపీలో పెరగడంలేదని అప్పట్లో అడ్డగోలు రాతలు రాసింది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా మరో కొత్త వితండ వాదాన్ని ఎత్తుకుంది. తెలంగాణలో 2015–16లో రూ.3,786 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తే, ఏపీలో 3,585.12 కోట్ల ఆదాయం వచ్చిందని, 2021–22 నాటికి తెలంగాణలో రూ.12,429 కోట్లు ఆదాయం రాగా ఏపీలో రూ.7,345.38 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని అప్పట్లో శోకాలు పెట్టింది. అలాగే, 2019–20లో ఏపీలో రూ.4,886.65 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం ఉండగా, 2022–23 నాటికి రూ.8,079 కోట్ల ఆదాయం పెరిగిందని అదే ఈనాడు రాసింది. -
నవయుగంపై జగన్ సంతకం
ఇది పేదింటి మహిళల శిరస్సులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అలంకరిస్తున్న ఆత్మగౌరవ కిరీటం. సాధికారతా పథంలో మహిళలను ముందడుగు వేయించే ఉజ్వల ఘట్టం. ఒకేసారి 30.61 లక్షల మందికి ఇళ్లస్థలాల పట్టాలివ్వడం ఒక జాతీయ రికార్డు. అందునా వారంతా మహిళలే కావడంఒక సామాజిక విప్లవం. ఇస్తున్నవి కంటితుడుపు ‘డీ’ పట్టాలు కావు.. గుండె బలమిచ్చే రిజి్రస్టేషన్ పత్రాలు. ఈ కన్వేయన్స్ డీడ్స్ పదేళ్లలో సేల్డీడ్స్గా మారుతాయి. సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిష్టర్ చేసి మరో చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్లను రిజిష్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కారు రికార్డుకెక్కనుంది. దీనివల్ల పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లపై పూర్తి భరోసా దక్కుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అందచేస్తారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నేడో రేపో పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఒకేసారి 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ ప్రభుత్వం 30.61 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాల భూమిని సేకరించి 17 వేలకుపైగా లేఅవుట్లు నిర్మించింది. అందులో భాగంగా 25,374 ఎకరాల ప్రైవేటు భూమిని రూ.11,343 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ ద్వారా సేకరించింది. ఇళ్ల పట్టాల కోసం ప్రైవేట్ భూమిని సేకరించడం, రూ.వేల కోట్లు వెచ్చించి పేదల ఇంటి కలను నెరవేరుస్తున్న తొలి ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం. ఇప్పటివరకు ‘డి’ పట్టాలే.. ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ ఇళ్ల పట్టాలను పేదల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు. 1977 అసైన్డ్ భూముల చట్టం (పీఓటీ) ప్రకారం గత ప్రభుత్వాలు పేదలకు ‘డి’ పట్టాలు మాత్రమే జారీ చేసేవి. అది కూడా చాలా స్వల్ప సంఖ్యలోనే ఉండేవి. సీఎం జగన్ ప్రభుత్వం మొదటిసారిగా లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని మహిళలకు సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది. వాస్తవానికి 2020 ఉగాది నాడే ఇళ్లతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసి ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. ఇందుకోసం పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులు యాజమాన్య హక్కులు పొందేలా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించారు. కానీ అప్పట్లో కొందరు రాజకీయ స్వార్థంతో పేదలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అప్పటికి తాత్కాలికంగా ‘డి’ పట్టాల ప్రకారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మాటకు కట్టుబడి రిజిస్ట్రేషన్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వ హ క్కులతో వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు అ సైన్డ్ భూముల చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల సవ రించింది. దాని ప్రకారం 2021లో ‘డి’ పట్టాలు ఇ చ్చిన 30.61 లక్షల మందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ స్థలాల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వ జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. సంక్లిష్ట ప్రక్రియకు తెర ప్రస్తుతం గడువు ముగిసిన ‘డి’ పట్టాలను క్రమబద్ధీరించుకోవడం ఎంత కష్టమో అందరికి తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం క్లిష్టమైన ప్రక్రియ. పేద మహిళలు అలాంటి అవస్థలు పడకుండా వారికిచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరుతోనే ప్రభుత్వం రిజిష్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. ఈ డీడ్ల వల్ల ఆ స్థలా లు విలువైన స్థిరాస్తిగా వారికి సమకూరనున్నాయి. ఆ ఆస్థిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణా లు పొందే అవకాశం కలుగుతుంది. ప్రైవేట్ ఆస్థి మాదిరిగానే లబ్ధిదారులు, వారి వారసులు అనుభ వించే అవకాశం ఏర్పడుతుంది. ఆ ఆస్థి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉండదు. తద్వారా పేద మహిళలకు వారు పొందిన ఇళ్ల పట్టాలపై పూర్తి భరోసా లభిస్తుంది. పదేళ్ల తర్వాత ఎవరితోనూ సంబంధం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కు లు సంక్రమిస్తాయి. తహశీల్దార్ల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్థలాలు వారి పేరు రిజిష్టర్ అయి ఉండడం, కన్వేయన్స్ డీడ్లు కూడా ఇస్తున్నందున వాటిని ఆస్తిపత్రాలు (సేల్ డీడ్స్)గా వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే డమ్మీ రిజిస్ట్రేషన్లు.. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. మంగళవారం కొన్ని డమ్మీ రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తించారు. అక్కడి వీఆర్ఓలను ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ చేసే ప్రతినిధులుగా నియమించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించింది. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో 30.61 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన వారి డేటాను పొందుపరిచింది. లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సర్వర్ల సామర్థ్యాన్ని కూడా పెంచారు. -
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్‌లోని బటన్‌ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్‌పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్‌ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.ఏఎన్ఎం యాప్‌లో 15 మాడ్యూల్స్...2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్‌లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్‌గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్‌కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.టెక్నాలజీతో రైతుకు దన్ను...‘ఈ–కర్షక్’ యాప్‌తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్‌తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్‌ను వివిధ యాప్‌లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్‌తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.అర చేతిలో ఆరోగ్యశ్రీ...ఆరోగ్య శ్రీ యాప్‌లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్‌నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్‌ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలు ఈహెచ్‌ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్‌కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థదేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్‌లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్‌లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది.♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
6,268 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగం మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. గత నెలలో హైదరాబాద్‌లో రూ.3,741 కోట్ల విలువ చేసే 6,268 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 8 శాతం, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ప్రాపర్టీ విలువలలో అక్టోబర్‌తో పోలిస్తే 18 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ► ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో నగరంలో 64,658 ప్రాపరీ్టల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి విలువ రూ.34,205 కోట్లు. గతేడాది ఇదే కాలంలో రూ.30,429 కోట్ల విలువ చేసే 62,208 యూనిట్ల రిజిస్ట్రేషన్లయ్యాయి. అంటే ఏడాది కాలంలో 12 శాతం వృద్ధి నమోదైందన్నమాట. 2021 జనవరి–నవంబర్‌లో చూస్తే రూ.33,531 కోట్ల విలువ చేసే 75,451 ప్రాపరీ్టల రిజి్రస్టేషన్స్ జరిగాయి. ► గత నెలలో జరిగిన ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో అత్యధిక వాటా మధ్యతరగతి గృహాలదే. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల వాటా 61 శాతంగా ఉండగా.. రూ.50–75 లక్షలు ధర ఉన్నవి 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 9 శాతం, రూ.కోటి పైన ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 13 శాతంగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌లోనే.. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల హవా కొనసాగుతుంది. గత నెలలోని రిజిస్ట్రేషన్లలో ఒక్కో జిల్లా వాటా 43 శాతం కాగా.. హైదరాబాద్‌లో 14 శాతంగా ఉంది. గత నెల రిజి్రస్టేషన్లలో 1,000–2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 71 శాతంగా ఉండగా.. 1,000 చ.అ. లోపు ఉన్న గృహాలు 15 శాతం, 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ప్రాపరీ్టల వాటా 14 శాతంగా ఉన్నాయి. ► గత నెలలోని టాప్–5 రిజి్రస్టేషన్లలో బేగంపేటలో రూ.10.61 కోట్ల మార్కెట్ విలువ చేసే ఓ ప్రాపర్టీ తొలి స్థానంలో నిలిచింది. బంజారాహిల్స్‌లో రూ.7.78 కోట్లు, రూ.7.47 కోట్ల విలువ చేసే రెండు గృహాలు, ఇదే ప్రాంతంలో రూ.5.60 కోట్లు, రూ.5.37 కోట్ల విలువ చేసే మరో రెండు ఇళ్లు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ ఐదు ప్రాపరీ్టల విస్తీర్ణం 3 వేల చ.అ.లుగా ఉన్నాయి. -
రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది. బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్‌కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్’! టాప్-5 లిస్ట్ ఇదే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది. గత నెలలో రూ.3,461 కోట్లు విలువ చేసే 6,493 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఈ ఏడాది ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ జరగడం ఇది రెండోసారి. మార్చిలో అత్యధికంగా 6,959 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. జూలై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్స్‌లో 17 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 15 శాతం ఎక్కువని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే జూలైతో పోలిస్తే 20 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 22 శాతం ఎక్కువ. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) 68 శాతం వాటా ఈ గృహాలదే.. ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధిక వాటా రూ.50 లక్షల లోపు గృహాలదే. ఈ ఇళ్ల వాటా 68 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.25 లక్షలు లోపు ధర ఉన్న ప్రాపర్టీల వాటా 16 శాతం కాగా.. రూ.25-50 లక్షలు మధ్య ధర ఉన్న ప్రాపర్టీల వాటా 52 శాతం, రూ.50-75 లక్షలవి రూ.16 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 8 శాతం, రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ధర ఉన్నవి 7 శాతం, రూ.2 కోట్లకు మించి ధర ఉన్న ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది. 2 వేల చ.అ. లోపు విస్తీర్ణ ఇళ్లు... ♦ గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీ వాటా 70 శాతంగా ఉంది. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్న ఇళ్ల వాటా 9 శాతం, 3 వేల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన యూనిట్ల వాటా 2 శాతంగా ఉంది. ♦ అత్యధిక రిజిస్ట్రేషన్లు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోనే జరిగాయి. ఈ జిల్లా వాటా 43 శాతం ఉండగా.. రంగారెడ్డిలో 39 శాతం, హైదరాబాద్‌లో 17 శాతం రిజిస్ట్రేషన్ వాటాను కలిగి ఉన్నాయి. టాప్-5 రిజిస్ట్రేషన్లన్స్ ఇవే.. ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్–5 జాబితాలో బేగంపేట, బంజారాహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాలలోని ప్రాపర్టీలు నిలిచాయి. అత్యధికంగా బేగంపేటలో రూ. 8.20 కోట్ల మార్కెట్ విలువ గల రిజిస్ట్రేషన్ జరగగా.. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో రూ.7.47 కోట్లు, రూ.5.60 కోట్లు, రూ.5.60 కోట్ల ప్రాపర్టీలు, ఖైరతాబాద్‌లో రూ.4.76 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆయా యూనిట్ల విస్తీర్ణం 3 వేల చ.అ.లకు మించి ఉన్నవే. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపు! భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, హైదరాబాద్ 2023 జులైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. వీటి మొత్తం విలువ రూ. 2,878 కోట్లు. గతేడాది ఇదే నెలతో పోల్చితే రిజిస్ట్రేషన్ల సంఖ్య 26 శాతం, ఆస్తుల విలువ 35 శాతం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో 2023 జూలైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదయ్యాయి. “హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్ ఊపు కొనసాగుతోంది. 1,000, 2,000 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 2023 ఏప్రిల్ నుంచి ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం కూడా కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను పెంచింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో మరింత విస్తీర్ణం, ఆధునిక సౌకర్యాలతో అపార్ట్మెంట్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది" అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ అన్నారు. అత్యధిక వాటా వాటిదే.. హైదరాబాద్‌లో 2023 జులైలో జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అత్యధికం రూ. 25 లక్షలు నుంచి రూ. 50 లక్షల విలువున్నవే. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 52 శాతం. ఇక రూ. 25 లక్షల కంటే తక్కువ విలువున్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్లలో 18 శాతం ఉన్నాయి. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వాటా 2023 జులైలో 9 శాతం. 2022 జులైతో పోలిస్తే ఇది కూడా కొంచెం ఎక్కువ. ఇక విస్తీర్ణం పరంగా చూసుకుంటే 2023 జులైలో 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లే అత్యధికంగా నమోదయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇవి 67 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్ -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు షాకిచ్చిన జూన్! ఎలాగంటే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉండగా.. రియల్టీ రంగంలో స్తబ్దత నెలకొంది. ఏ ప్రభుత్వం వస్తుందో, అభివృద్ధి పనులు ఎలా ఉంటాయో, ధరలు తగ్గుతాయేమో అనే రకరకాల కారణాలతో స్థిరాస్తి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో గ్రేటర్లో రిజిస్ట్రేషన్లు, వాటి విలువలు క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. మేలో రూ.2,994 కోట్ల విలువ చేసే 5,877 అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్స్ జరగగా.. జూన్ నాటికి రూ.2,898 కోట్ల విలువైన 5,566 యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గతేడాది జూన్‌లో జరిగిన 5,411 యూనిట్లతో పోలిస్తే గత నెలలో రిజిస్ట్రేషన్స్‌లో 3 శాతం వృద్ధి నమోదయింది. అలాగే విలువల పరంగా చూస్తే 2022 జూన్‌లో రూ.2,842 కోట్లతో పోలిస్తే గత నెలలో 2 శాతం పెరుగుదల కనిపించింది. గత నెలలోని రిజిస్ట్రేషన్స్‌లో 52 శాతం యూనిట్లు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే. అలాగే రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా 9 శాతంగా ఉంది. 68 శాతం ఫ్లాట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న యూనిట్లే. 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 11 శాతంగా ఉంది. రిజిస్ట్రేషన్స్‌లో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా హవా కొనసాగుతుంది. జూన్‌లో జరిగిన రిజిస్ట్రేషన్స్‌లో ఈ జిల్లా వాటా 46 శాతం కాగా.. రంగారెడ్డి 38 శాతం, హైదరాబాద్ 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది నెల వారీగా రిజిస్ట్రేషన్స్ (రూ.కోట్లలో) నెల రిజిస్ట్రేషన్లు విలువ జనవరి 5,454 2,650 ఫిబ్రవరి 5,725 2,987 మార్చి 6,959 3,602 ఏప్రిల్ 4,494 2,286 మే 5,877 2,994 జూన్ 5,566 2,898 సోమాజిగూడలో రూ.5.09 కోట్లు సోమాజిగూడ ఖరీదైన నివాసాలకు కేంద్రంగా మారింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్–5 లావాదేవీలలో నాలుగు ఈ ప్రాంతంలోనే జరగడం గమనార్హం. రూ.5.09 కోట్ల మార్కెట్ విలువ గల 3,500 చ.అ.ల లోపు ఉన్న రెండు అపార్ట్మెంట్లు, రూ.4.22 కోట్ల వ్యాల్యూ ఉండే మరొక రెండు యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అలాగే నార్సింగిలో రూ.5 కోట్ల మార్కెట్ విలువ గల ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిందని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. ఇదీ చదవండి: ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్! -
అతనో సామాన్య రైతు. కుటుంబ అవసరాల కోసం ట్రాక్టరు, కారు, రెండు బైక్‌లు
గతంలో కారు, బైక్ లాంటి వాహనాలు స్టేటస్ సింబల్‌గా ఉండేవి. అబ్బో వాళ్లకు కారుంది... వీళ్లకు ద్విచక్ర వాహనం ఉందని గొప్పగా చెప్పుకునేవాళ్లు. అయితే ఇప్పుడు అవి కనీస అవసరాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ బైక్ ఉండటమనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ముద్దారెడ్డి, రొళ్ల మండలం జీబీ హళ్లి. సామాన్య రైతు. కుటుంబ అవసరాల నిమిత్తం ట్రాక్టరు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు, కుటుంబ సభ్యులందరి కోసం ఓ కారు, ఎవరికి వారు వెళ్లేందుకు రెండు ద్విచక్ర వాహనాలు కొన్నారు. ఈయన పేరు పవన్‌కుమార్. అమరాపురం వాసి. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఒక కారుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో వెళ్తుంటారు. ఫలితంగా రోజుకు సగటున పెట్రోల్‌కు రూ.600 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక్కో ఇంట్లో అవసరాల నిమిత్తం మూడు – నాలుగు వాహనాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమేయక మానదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నవి మాత్రమే. జిల్లాకు కర్ణాటక సరిహద్దు పక్కనే ఉండటంతో చాలా మంది పొరుగు రాష్ట్రంలోనే వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా అన్ని వాహనాలు లెక్క చేస్తే ఇంటికో ఓ వాహనం ఉన్నట్లు చెప్పవచ్చు. జిల్లాలో మొత్తం 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాల వాహనాలు కలిపి మూడు లక్షలు దాటాయి. అవసరాల నిమిత్తం.. ఒకే కుటుంబంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం మూడు – నాలుగు రకాల వాహనాలు కొంటున్నారు. కుటుంబ సభ్యులందరి కోసం కారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టరు. జీవన పోషణ కోసం బాడుగ ఇచ్చేందుకు జీపు, సొంత పనులపై తిరిగేందుకు ద్విచక్ర వాహనం. మహిళల కోసం ఎలక్ట్రిక్ బైక్. బాలికల కోసం స్కూటీ. అబ్బాయిల కోసం యమహా లాంటి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల వాహనాలు కలిపి జిల్లాలో అధికారికంగా మూడు లక్షలు దాటాయి. అయితే కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన వాటితో మరో లక్ష పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇరుగు పొరుగు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు ఇంకో లక్ష వరకు ఉంటాయి. ద్విచక్ర వాహనాలే టాప్.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,235 వాహనాలు ఉన్నాయి. అత్యధికంగా మోటారు బైక్‌లు 2,01,238 ఉన్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు పొరుగు రాష్ట్రం నుంచి వాహనాలు కొనుగోలు చేస్తుండటంతో ప్రతి ఇంట్లో ఒక ద్విచక్ర వాహనం చొప్పున ఉన్నట్లు చెప్పవచ్చు. ఆటో రిక్షాలు 15 వేలు, కార్లు 13 వేలు, గూడ్స్ వెహికల్స్ 11 వేలు, ట్రాక్టర్లు 11 వేలు, ట్రాలీలు, జీపులు, క్యాబ్‌లు, విద్యాసంస్థల వాహనాలు, డంపర్లు, అంబులెన్సులు, ఓమ్ని బస్సులు, చెట్ల కోత వాహనాలు కలిపి మొత్తం 2.77 లక్షల వరకు ఉన్నాయి. నెలకు వెయ్యిపైగా రిజిస్ట్రేషన్లు జిల్లాలో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోజూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి. అన్ని రకాల వాహనాలు కలిపి సగటున నెలకు వెయ్యి పైగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రోజుకు సరాసరి 37 వాహనాలు చొప్పున రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అవసరాల నిమిత్తం ద్విచక్ర వాహనాలే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. – కరుణసాగర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి -
డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)–2023 నోటిఫికేషన్‌ను కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌తో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికోసం ఈసారి కొత్తగా ఈౖ ఖీ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకుని దోస్త్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా దోస్త్ రిజిస్ట్రేషన్ ► ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈౖ ఖీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసేప్పుడు విద్యార్థి ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ► మీ సేవ కేంద్రాల ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ► టీయాప్ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. విద్యార్థి ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈలో లభించే విద్యార్థి ఫొటో, ప్రత్యక్షంగా దిగే ఫొటో సరిపోతే.. దోస్త్ ఐడీ సమాచారం వస్తుంది. ► రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు రూ.200 రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను భద్రపర్చుకోవాలి. ► రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు మీసేవ నుంచి పొందిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 86 వేల సీట్లు తగ్గాయ్.. ఈ ఏడాది డిగ్రీలో దాదాపు 86 వేల సీట్లు తగ్గించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. డిమాండ్ లేని కోర్సుల బదులు కొత్త కోర్సులు పెడతామంటే అనుమతులు ఇస్తామన్నారు. గత ఏడాది 4,73,214 డిగ్రీ సీట్లు ఉంటే, ఈ ఏడాది 3,86,544 అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. డిమాండ్ లేని సీట్లను గత ఏడాది కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్..!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు ఇవాళే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. ► 13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు ► అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి ► ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే.. -
‘చెడు’జోలికి పోకుండా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే 25.3 కోట్ల మందితో అత్యధికంగా యువత కలిగిన దేశం భారత్. ఈ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య కౌమార దశలో (టీనేజిలో) ఉన్నారు. కౌమార దశలో ఉన్న బాలబాలికలు చెడు ప్రభావాలకు గురికాకుండా లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్య సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్లినిక్స్‌లో నమోదు చేసుకునే కౌమార బాలల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో, వివిధ రాష్ట్రాలవారీగా కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో నమోదు సంఖ్య, కౌన్సెలింగ్ తీరుపై విశ్లేషణాత్మక నివేదికను ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో వివిధ రాష్ట్రాల్లో క్లినిక్‌లలో నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగిందని నివేదిక తెలిపింది. 2020–21లో కోవిడ్ నేపథ్యంలో ప్రతి లక్ష జనాభాలో 383 మంది ఈ క్లినిక్‌లలో కౌన్సెలింగ్‌కు పేర్లు నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 601కు పెరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో కూడా 2020–21లో ప్రతి లక్ష మందిలో 283 మంది నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 1,673కు పెరిగిందని పేర్కొంది. యుక్త వయస్సులోని యువతీ యువకులను ఆరోగ్యంగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతారని, ఈ నేపథ్యంలోనే కౌమార దశలోని బాలికలు, బాలురకు పని, విద్య, వివాహం, సామాజిక సంబంధాల విషయంలో చెడు ప్రభావాలకు లోనుకాకుండా చేయడమే స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ అని నివేదిక పేర్కొంది. రాష్ట్రీయ కిశోర్ స్వాస్త్య కార్యక్రమం కింద కౌమార ఆరోగ్య సమస్యలు, పౌష్టికాహారం, లింగ ఆధారిత హింస, నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మానసిక ఆరోగ్యంతోపాటు పెడ ధోరణులకు లోనుకాకుండా వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. శిక్షణ పొందిన సర్విస్ ప్రొవైడర్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఈ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో 36,56,271 మంది బాలురు, 45,73,844 మంది బాలికలు నమోదయ్యారు. 2021–22లో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో 60 శాతం పైగా కౌమార దశలోని బాల బాలికలు క్లినికల్ సేవలు, కౌన్సెలింగ్ పొందినట్లు నివేదిక పేర్కొంది. 2021–22లో దేశం మొత్తమీద 70 శాతం బాలికలు, 66 శాతం బాలురు క్లినికల్ సేవలు పొందారు. అలాగే 76 శాతం బాలికలు, 69 శాతం బాలురు కౌన్సెలింగ్ తీసుకున్నారు. మన రాష్టంలో 2021 నాటికి 5,28,95,000 జనాభా ఉండగా అందులో 8,85,150 మంది కౌమార బాలలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నివాస విభాగం నేల చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది తొలి నెలలో గ్రేటర్లో రూ.2,422 కోట్ల విలువ చేసే 4,872 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. 2021 మొదటి నెలలో రూ.3,269 కోట్లు విలువ చేసే 7,343 యూనిట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ జరిగిన వాటిల్లో అత్యధికంగా 54 శాతం గృహాలు రూ.25–50 లక్షలవే. 2021 జనవరిలో ఈ ఇళ్ల వాటా 39 శాతంగా ఉంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. ఇక రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ ఇళ్ల వాటా 2021 జనవరిలో 36 శాతం కాగా.. గత నెలలో 18 శాతానికి పడిపోయాయి. ఈ జనవరిలో 1,000 నుంచి 2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న గృహాలే ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి వాటా 71 శాతం ఉంది. అయితే గతేడాది జనవరిలో వీటి వాటా 72 శాతంగా ఉంది. 2021 జనవరిలో 500–1,000 చ.అ. ఇళ్ల వాటా 15 శాతం ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 2 వేల చ.అ.లకు పైగా విస్తీర్ణం ఉన్న యూ నిట్ల వాటా 9 శాతంగా ఉంది. ఎందుకు తగ్గాయంటే.. ప్రతి ఏటా మొదటి కొన్ని నెలల పాటు స్థిరాస్తి కార్యకలాపాలు మందగిస్తాయని దీంతో విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. గృహ కొనుగోలుదారుల కొనుగోలు నిర్ణయంలో ఊహించని మార్పులు, ధరలలో ప్రతికూలతలుంటాయి. వేతన సవరణలు, రాయితీలు, పండుగ సీజన్ల వంటి వాటితో మార్కెట్లో సానుకూల ధోరణి కనిపించినప్పుడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాపర్టీల డెలివరీకి సమయం పడుతుంది దీంతో విక్రయాలు ఎక్కువ జరిగినా.. ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదవుతాయని వివరించారు. -
ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్మాన్ జాహి కుటుంబానికి హైదరాబాద్ పరిసరాల్లో రూ.వందల కోట్ల విలువైన భూములను గుర్తించేందుకు రిసీవర్ కమ్ కోర్టు కమిషనర్‌ను హైకోర్టు నియమించింది. పైగా భూములను గుర్తించి నివేదిక సమర్పించేవరకు రిజిస్ట్రేషన్లు, అభివృద్ధి ఒప్పందాలకు అనుమతించలేమని తెలిపింది. రిసీవర్ నుంచి నివేదిక అందాక తుది డిక్రీని ప్రకటిస్తామని పేర్కొంది. హైకోర్టులో ఉన్న సీఎస్ 7/1958 పిటిషన్లో కొందరు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేస్తూ ఉత్తర్వులు పొందుతున్నారని..ఇది వివాదాల పెంపునకు కారణమవుతున్న నేపథ్యంలో హైకోర్టు మేరకు నిర్ణయించింది. సీఎస్ 7కు సంబంధించి 2013లో జారీ చేసిన తుది డిక్రీని సవాలు చేస్తూ ఖాజామొయినుద్దీన్, అభివృద్ధి ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ అనిస్ నిర్మాణ సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించింది. మాజీ జిల్లా జడ్జీలు మహమ్మద్ బండె అలి, కె.అజిత్ సింహారావును కొత్త కమిషనర్లుగా నియమించింది. ఆయా గ్రామాల్లోని షెడ్యూలు ఆధారంగా భూములను, వారసులను గుర్తించాలని రాజీ డిక్రీల వివరాలను కొత్త రిసీవర్లకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై మార్చిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రిసీవర్ల నుంచి నివేదిక అందిన తర్వాతే తుది డిక్రీ రూపకల్పన జరుగుతుందని పేర్కొంది. విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది. -
హైదరాబాద్‌లో తగ్గిన రిజిస్ట్రేషన్లు!
హైదరాబాద్‌లో ప్రతి నెలా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు తగ్గిపోతున్నాయి. ఆగస్టులో 5,656 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరగగా.. గత నెలలో 24 శాతం మేర క్షీణించి 4,307లకు పడిపోయాయి. విలువల పరంగానూ తగ్గుదలే నమోదయింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల విలువ రూ.28,453 కోట్లు కాగా.. సెప్టెంబర్ నాటికి 16 శాతం 23 శాతం మేర తగ్గి రూ.21,978 కోట్లకు తగ్గాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 55 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు మధ్య విలువ ఉన్నవే. అలాగే 75 శాతం గృహాలు వెయ్యి చ.అ. నుంచి 2 వేల చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్నవే జరిగాయి. గ్రేటర్లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రూ.25,094 కోట్ల విలువ చేసే 50,953 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.27,640 కోట్ల విలువ చేసే 62,052 యూనిట్లుగా ఉన్నాయి. చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా.. -
2 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
కమలాపురం : అక్టోబర్ రెండో తేదీ నుంచి రాష్ట్రంలోని 1,949 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమవుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ బి.శివరాం తెలిపారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలోని సబ్ రెజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారని చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేశామన్నారు. ఆయా సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు నెట్ వర్క్, స్కానింగ్, వెబ్‌క్యామ్‌లతో పాటు రిజిస్ట్రేషన్లు, సెటిల్ మెంట్లు, పార్టీషియన్లు ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీంతో ఏ గ్రామానికి చెందిన వారు అదే గ్రామంలో రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పొందవచ్చన్నారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ జారీ, ఈసీల జారీ తదితర సేవలు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం సంబటూరు, జంభాపురం గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ చెన్నకేశవరెడ్డి, సబ్ రెజిస్ట్రార్ డీఎం బాషా పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్?
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అలాంటి లేఅవుట్లలోని ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీనితో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలోని గ్రామ పంచాయతీల్లో వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో చాలా వరకు మున్సిపాలిటీలుగా మారడమో, విలీనం కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సదరు లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు అర్హమైనవి అయితే.. ఆ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను అనుమతించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఆ ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్లు చేయాలని.. అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సి ఉందన్న అంశాన్ని చేర్చాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో జారీచేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదనపు ఆదాయ వనరుల సమీకరణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. -
కౌన్ బనేగా కరోడ్‌పతి 14: రిజిస్ట్రేషన్లు ఈ తేదీ నుంచే!
కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) అభిమానులకు గుడ్‌న్యూస్. కేబీసీ 14వ సీజన్లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనేది ఏప్రిల్ 2న తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 9, రాత్రి 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రచార ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా విశేష జనాదరణ పొందింది. ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది భారీగా నగదు గెల్చుకున్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకోవాలన్న తాపత్రయంతో కూడా కొంతమంది ఈ షోకు వస్తుంటారు. (క్లిక్: దగ్గుతో మోసం.. బహుమతి వెనక్కి, కేబీసీ కథేంటో తెలుసా?) కేబీసీ 14లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు హోస్ట్ అమితాబ్ బచ్చన్ మొదటి రిజిస్ట్రేషన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత నుంచి ప్రతి రోజు రాత్రి కొత్త ప్రశ్న ఉంటుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారిని కేబీసీ బృందం సంప్రదించి షార్ట్ లిస్ట్ తయారుచేస్తుంది. ఆశావహులు సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు) -
ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్
సాక్షి, విజయవాడ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్ సృష్టించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.వెయ్యి కోట్ల ఆదాయం దాటింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా మార్చి నెల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7,327 కోట్ల ఆదాయం రాగా.. గత ఏడాది కంటే 2 వేల కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. చదవండి: ట్రావెల్ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ సీన్.. రాష్ట్ర విభజన అనంతరం అత్యధికంగా రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోయిన ఆదాయం పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ రావడంతో ఆదాయం పెరిగినట్లు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ(స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ) తెలిపారు. -
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సాంకేతిక అడ్డంకులు
సాక్షి, అమరావతి: టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లను విశాఖ జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఫిబ్రవరి 11న రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటాపురం నుంచి రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టినా ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇక్కడ 4,800(నూరు శాతం) ఇళ్లను అన్ని వసతులతో నిర్మించి అందుబాటులో ఉంచారు. అయితే ఇళ్లు నిర్మించిన స్థలాన్ని ప్రభుత్వం నుంచి మునిసిపాలిటీకి బదలాయించడం ఆలస్యమవడంతో ఇక్కడ ఐదు యూనిట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలిగారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్న రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు ఫేజ్–1లో 2,528 ఇళ్లు పూర్తిచేశారు. ఇక్కడ శనివారం నాటికి 401 యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని పెనుకులపాడు పెదగరువు వద్ద చేట్టిన 6,144 ఇళ్ల నిర్మాణంలో 70 శాతం యూనిట్లు పూర్తవగా.. 502 ఇళ్ల రిజిస్ట్రేషన్లను పూర్తిచేశారు. భీమవరం సమీపంలోని గునుపూడి మెంటేవారి తోటలో రెండు ఫేజుల్లో 8,352 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 75 శాతం దాకా నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై అధిక పని ఒత్తిడి కారణంగా 10 యూనిట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తయింది. దీంతో పాటు విజయనగరం జిల్లాలోనూ ఇదే తరహా ఒత్తిడి కారణంగా 21 యూనిట్లకు, శ్రీకాకుళం జిల్లాలో 22 యూనిట్లకు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. కాగా, మొత్తం నాలుగు జిల్లాల్లో ఐదు చోట్ల ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు శనివారానికి 961 యూనిట్లను లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందించారు. ప్రస్తుతం ఇక్కడ ఎదురవుతున్న సమస్యలను సరిచేసి ఇతర జిల్లాల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని మార్చి నెలాఖరుకు 20 వేల యూనిట్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి అందించే లక్ష్యంతో అధికారులున్నారు. -
టిడ్కో ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్‌తో లబ్ధిదారులకు మేలు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తక్కువ ఆదాయ వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించేందుకు సిద్ధమవడం.. పేదలకు ఎంతో మేలు చేకూర్చే నిర్ణయమని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ చెప్పారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో 2.62 లక్షలకు పైగా గృహాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రసన్నకుమార్ గురువారం మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల లబ్ధిదారులకు వందల కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వమే భరించడం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయమంటూ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. పార్వతీపురాన్ని మన్యం జిల్లాగా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణను సత్కరించారు. మంత్రిని కలిసినవారిలో టిడ్కో డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ ఉన్నారు. సోమవారం నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్లు టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని, బ్యాంక్ లింకేజీ పూర్తయిన యూనిట్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. తొలుత శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: వచ్చే జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. కోవిన్ యాప్/వెబ్సైట్లో అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. చదవండి: 2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’ ప్రభుత్వ గుర్తింపు కార్డులులేని వారు విద్యా సంస్థలు మంజూరు చేసిన గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయసులోపు వారు 22,41,000 మంది ఉన్నారు. టీకాల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంది. కోవిన్ యాప్‌లో రిజస్ట్రేషన్ చేసుకోకుంటే, స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుందో, లేదో అనే విషయం కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ ఇలా.. ►కోవిన్ మొబైల్ యాప్ లేదా https:// selfregistration. cowin. gov. in// పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ►యాప్ లేదా పోర్టల్‌లోకి లాగిన్ అయ్యాక ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ►అనంతరం ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ►ఒక ఫోన్ నంబర్‌పై నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (ఉదా.. గతంలో తల్లిదండ్రులిద్దరూ కోవిన్ యాప్‌లో రిజిస్టరైన నంబరుతో వారి పిల్లల (15–18ఏళ్ల మధ్య వారైతేనే) పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు.) ► వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. అందులో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి. ►గుర్తింపు కార్డు కింద ఆధార్‌ను ఎంచుకోవాలి. ఆధార్‌లేని పక్షంలో పదో తరగతి విద్యార్థి గుర్తింపు ఐడీ నంబరును నమోదు చేయవచ్చు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు గడువు
సాక్షి, అమరావతి: లేఅవుట్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (టీసీపీ) విభాగం వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువునిచ్చింది. పరిశీలన పూర్తయిన దరఖాస్తుదారులు ఆలోగా అడిగిన పత్రాలు, ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. గడువులోగా క్రమబద్ధీకరించని ప్లాట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశంలేకపోవడంతో పాటు ఆయా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కావు. ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు తీసుకుని, రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో పాటు అక్కడ చేపట్టే నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బంది పడుతున్న వారు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. ఇలాంటి వారికి ఊరటనిస్తూ 2019 ఆగస్టు చివరి నాటికి ప్లాట్లు కొన్నవారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ వచ్చే ఏడాది మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ టీసీపీ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా.. అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్లాట్ల యజమానులకు అవసరమైన పత్రాలు సమర్పించాలని కొందరికి, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారికి ఫీజు చెల్లించాలని అధికారులు సమాచారం పంపుతున్నారు. అందిన దరఖాస్తులు 43 వేలు.. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పలు సంస్థలు వేల సంఖ్యలో ప్రైవేటు వెంచర్లు వేశారు. ఇలాంటి వాటిలో 10,883 వెంచర్లు ఎల్ఆర్ఎస్కు అనుకూలమైనవని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం గుర్తించింది. వాటిలో ప్లాట్లు కొన్నవారికి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. దీంతో వివిధ జిల్లాల నుంచి 43,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటిదాకా నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించిన 9,187 దరఖాస్తులకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. బఫర్ జోన్లో ఉన్నవి, సరైన పత్రాలు లేని 1,442 అప్లికేషన్లను తిరస్కరించారు. సోమవారం నాటికి మరో 1,363 మందికి ఫైనల్ ప్రొసీడింగ్స్‌కు ఫీజు చెల్లించాలని.. అవసరమైన పత్రాలు సమర్పించాలని మరో 3 వేల మందికి అధికారులు సమాచారం పంపించారు. 2,747 దరఖాస్తులను షార్ట్‌ఫాల్‌లో ఉంచారు. కాగా, ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు 28 వేలు ఉన్నాయని, జనవరి చివరి నాటికి వాటి స్క్రూటినీ ప్రక్రియ కూడా పూర్తిచేసి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతామని ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వేపనగండ్ల రాముడు తెలిపారు. అనుమతిలేకుంటే రిజిస్ట్రేషన్లు బంద్ ఇక ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు గడువులోగా స్పందించకుంటే ఇబ్బందులు తప్పేట్టులేవు. దరఖాస్తు చేసుకున్నవారు గడువులోగా అడిగిన పత్రాలు సమర్చించాలని, ఫీజు చెల్లించాలని మెసేజ్‌లు అందుకున్నవారు ఆ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రాముడు సూచించారు. లేకుంటే అలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న దరఖాస్తుదారులు గడువులోగా స్పందించాలని ఆయన కోరారు. -
సర్వ హక్కులతో స్వగృహాలు
మీకెందుకయ్యా.. కడుపుమంట? ఈ రోజు మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. అది చంద్రబాబు కావచ్చు.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 కావచ్చు. ఒకవేళ వారు మీ దగ్గరికి వస్తే కొన్ని ప్రశ్నలు అడగండి. అయ్యా.. మా ఇళ్లను ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా మార్కెట్ రేటుకు కొనుగోలు చేస్తారా? అని గట్టిగా నిలదీయండి. మీ వారసులకేమో మీ ఆస్తులను రిజిస్టర్ చేసి ఇస్తారు కదా..! మరి మా బిడ్డలకు ఇంటిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు కల్పిస్తుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని గట్టిగా అడగండి. మీరు కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ భూముల మాదిరిగానే మా ఇంటి విలువ కూడా పెరిగేలా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మా అన్న చెబుతుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని ప్రశ్నించండి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన కట్టడం మాత్రమే కాదని ఒక మనిషి సుదీర్ఘకాలం పడిన కష్టానికి, సంతోషానికి సజీవ సాక్ష్యం లాంటిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.26 వేల కోట్ల విలువైన భూమిని 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా పేదలకు స్థిరాస్తిపై వివాదరహితంగా, క్లియర్ టైటిల్‌తో సర్వహక్కులూ కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. కలను నిజం చేస్తున్నాం... ఇవాళ నా పుట్టిన రోజు నాడు దేవుడి దయతో దాదాపు 52 లక్షల మందికిపైగా మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సొంతూరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లును కూడా జీవిత కాలం గుర్తు పెట్టుకుంటాం. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇంటిని తదనంతరం పిల్లలకు ఒక ఆస్తిగా ఇవ్వాలని ఆరాట పడే పేదల కలలను నిజం చేస్తున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదలకు ఇంటి పట్టాలు, స్థలాలు మాత్రమే ఇస్తున్నారు కానీ వాటిపై హక్కులు కల్పించడం లేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా 52 లక్షలకుపైగా కుటుంబాలకు రూ.1.58 లక్షల కోట్ల విలువైన ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నాం. ఇందులో ఓటీఎస్‌తో మొదటగా లబ్ధి పొందుతున్న 8.26 లక్షల మందికి పత్రాల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాం. ఓటీఎస్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హక్కులు లేక.. దిక్కు తోచక తమ ఇంటిలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న 52 లక్షల మందికి సర్వ హక్కులు కల్పించేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తెచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నా. వారికి అందించే ఆస్తి విలువ రూ.1.58 లక్షల కోట్లు. అది నేరుగా వారి చేతుల్లోకి వస్తుంది. నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇంటిపై హక్కులు దక్కితే అవసరం వచ్చినప్పుడు మార్కెట్ రేటుకు అమ్ముకునే వీలుంటుంది. ఇప్పటిదాకా ఆ అవకాశం లేదు. వారసత్వంగా సంతానానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే వీలు కూడా లేదు. కష్ట కాలంలో తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకునేందుకూ వీల్లేదు. ఏ హక్కూ లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లలో గడపాల్సిన పరిస్థితి. శనక్కాయలు, బెల్లానికీ సరిపోవు... ఇంటి మీద మనకు హక్కు లేకపోతే మార్కెట్లో రూ.10 లక్షలు పలికే నివాసం విలువ మరో రకంగా ఉంటుంది. రూ.2 లక్షలకు కూడా కొనేవారుండరు. శనక్కాయలకు, బెల్లానికి కూడా సరిపోవు. ఉదాహరణకు ఈ రోజు ఇదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసిన భూమి, ఇంటికి.. రిజిస్ట్రేషన్ చేయని వాటికి తేడా ఎంత ఉందో ఒకసారి గమనించాలని కోరుతున్నాం. రిజిస్ట్రేషన్ జరిగిన వాటి విలువ చేయని వాటితో పోలిస్తే పలు రెట్లు అధికంగా ఉంది. నా పాదయాత్ర సమయంలో నన్ను కలిసిన అక్క చెల్లెమ్మలను అడిగి ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించాం. పేదలకు ఇంటిపై సర్వ హక్కులు కల్పిస్తూ అవసరమైతే కష్ట కాలంలో అమ్ముకునే స్వేచ్ఛను కూడా ఈరోజు నుంచి కల్పిస్తున్నాం. ఓటీఎస్ (వన్‌టైమ్ సెటిల్మెంట్) ద్వారా తొలుత లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ హక్కులతో డాక్యుమెంట్లను ఇవాళ అందచేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్న దాదాపు 12 లక్షల కుటుంబాలు కేవలం రూ.10 చెల్లిస్తే చాలు రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తున్నాం. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్న వారు గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. వీరందరికీ సర్వ హక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఆస్తిని వారి చేతుల్లో పెడతాం. పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.14,400 కోట్లు బకాయి ఉండగా ఏకంగా రూ.10 వేల కోట్లు పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో మరో రూ.6 వేల కోట్లను ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ప్రయోజనం కల్పిస్తోంది. మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నాం. ఒకవేళ అదే వారే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే 7.50 శాతం మేర రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు కట్టాలి. ఒక ఇంటి విలువ రూ.15 లక్షలు అని లెక్కేసుకున్నా కనీసం రూ.లక్ష రిజిస్ట్రేషన్ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అది కూడా పూర్తిగా మాఫీ చేస్తూ ఉచితంగా రిజిస్ట్రేషన్‌తో 52 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 41 వేల మంది అసలు, వడ్డీ కడితే కేవలం డి.ఫారం మాత్రమే దక్కింది. అటువంటి వారందరికీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం. నిషేధిత భూముల జాబితా (22 ఏ) నుంచి పూర్తిగా తొలగిస్తున్నాం. సబ్ రిజిస్ట్రార్æ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మీ ఇంటిని సచివాలయాల్లోనే నామమాత్రపు రుసుము చెల్లించి కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓటీఎస్ ద్వారా లబ్ధి పొందిన వారికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. పేదలు రూ.15.29 కోట్లు చెల్లిస్తే హక్కులేవి? ప్రభుత్వం కట్టించిన పేదల ఇళ్లపై కనీసం వడ్డీనైనా మాఫీ చేయాలని 2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి చంద్రబాబు పాలనలో అధికారులు ఐదుసార్లు ప్రతిపాదనలు పంపితే నిరాకరించారు. రుణమాఫీ దేవుడెరుగు.. కనీసం వడ్డీ కూడా మాఫీ కూడా చేయని ఈ పెద్ద మనిషి ఇవాళ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 43 వేల మంది లబ్ధిదారులు అప్పో సప్పో చేసి రూ.15.29 కోట్లు చెల్లిస్తే గత సర్కారు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించిందని గట్టిగా నిలదీయండి. ఆ పెద్ద మనుషులకు చెప్పండి అధికారంలోకి వచ్చిన 30 నెలల వ్యవధిలోనే ఈ ప్రభుత్వం ఎలాంటి వివక్ష, దళారులకు తావు లేకుండా బటన్ నొక్కి నేరుగా రూ.1.16 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా అర్హుల ఖాతాలకు జమ చేసింది. ఒక్క రూపాయి కూడా లంచానికి ఆస్కారం లేకుండా పంపిణీ చేసి మంచి చేసిన జగనన్న మీవద్ద నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటాడా? ఈ విషయాన్ని ఆ పెద్ద మనుషులకు ఒకసారి తెలియజేయాలని కోరుతున్నా. మీ పిల్లలైతే ఇంగ్లీష్ మీడియం బడుల్లో చదవచ్చు.. మా పిల్లలేమో తెలుగుమీడియం బడుల్లో మాత్రమే చదవాలా? అని వారిని అడగండి. మా జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి పేదలకు మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం ధర్మమేనా? అని ప్రశ్నించండి. ఇదే రాజధాని (అమరావతి)లో పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే సామాజిక అసమతుల్యత నెలకొంటుందని ఆ పెద్ద మనుషులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఓటీఎస్ ఉగాది వరకు పొడిగింపు ఓటీఎస్ పథకాన్ని వచ్చే ఉగాది వరకు పొడిగిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 2వతేదీ వరకు పొడిగించాలని నిర్ణయించాం. ఈ పథకం ద్వారా మంచి జరుగుతుంది. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఒక చరిత్ర... చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా రెండున్నరేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశాం. ఒక అన్నగా నిండు మనసుతో అక్కచెల్లెమ్మలకు అందచేశాం. ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాలా రూ.26 వేల కోట్లు. అందులో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. గృహ నిర్మాణాలు పూర్తయ్యాక మౌలిక వసతులతో కలిపి ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్థిని పెట్టినట్లు అవుతుంది. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, ధర్మాన కృష్ణదాస్ తానేటి వనిత, పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, శాసనమండలి చైర్మన్ కె.మోషేన్‌రాజు, సీఎం ప్రొగామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. -
ఇళ్లపై యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో నిర్మించిన ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పథకం కింద 1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకున్నవారు నిర్దేశించిన మొత్తం, రుణం తీసుకోని వారు రూ.10 నామమాత్రపు రుసుము చెల్లిస్తే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. గుంటూరు, కృష్ణా సహా ఐదు జిల్లాల్లో శనివారం లాంఛనంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. సోమవారం నాటికి 200 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మంగళవారం నుంచి 13 జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్టు గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. -
త్వరలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లపై లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. దీని కోసం 4 దశల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. వైఎస్సార్ జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలకు సంబంధించిన 47,37,499 మంది లబ్ధిదారుల వివరాలను మునిసిపాలిటీలు, పంచాయతీలకు గృహ నిర్మాణ శాఖ బదిలీ చేసింది. ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ/వార్డు వలంటీర్లు, వీఆర్వో, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుత గృహ అనుభవదారుడు ఎవరు? స్థలం స్వభావమేంటి? సరిహద్దులు గుర్తించడం తదితర విచారణలు చేపట్టి అర్హులను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 12 జిల్లాల్లో 14,34,037 మందిని అర్హులుగా తేల్చారు. వైఎస్సార్ జిల్లాలో ఎన్నికల కోడ్ వల్ల అర్హుల గుర్తింపు చేపట్టలేదు. బద్వేలు ఉప ఎన్నిక ముగిసినందున వైఎస్సార్ జిల్లాలో కూడా గుర్తింపు ప్రక్రియ మొదలుపెడతామని అధికారులు చెప్పారు. నిర్దేశించిన మొత్తాలిలా.. రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తుంది. ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవ లబ్ధిదారుడు నుంచి ఇల్లు కొనుగోలు చేసిన వారు, వారసులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు చెల్లిస్తే పూర్తి యాజమాన్య హక్కులు దక్కుతాయి. గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి రుణం తీసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ప్రభుత్వం ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి పరిశీలన, విచారణల అనంతరం అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకుంటున్నామని చెప్పారు. నిర్దేశించిన రుసుము చెల్లించిన వారికి త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. -
సెప్టెంబర్‌లో 16,570 కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు
ముంబై: దేశవాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 16,570 కొత్త కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని అధికారిక గణాంకాలు తెలిపాయి. తద్వారా దేశంలో ప్రస్తుతం కార్యకలాపాలను సాగించే(యాక్టివ్) కంపెనీల మొత్తం సంఖ్య 14.14 లక్షలకు చేరింది. కేంద్ర కార్పొరేట్ వ్యవవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ సెప్టెంబర్ 30వ తేది నాటికి దేశంలో మొత్తం 22,32,699 కంపెనీలు రిజి్రస్టేషన్ చేసుకున్నాయి. వీటిలో 7,73,070 కంపెనీలు మూతబడ్డాయి. 2,298 సంస్థలు క్రియాశీలకంగా పనిచేయడం లేదు. 6,944 కంపెనీలు దివాళ ప్రక్రియలో ఉన్నాయి. 36,110 కంపెనీలు వివిధ సమస్యలతో మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కనిష్టంగా 3,209 కంపెనీలు రిజిస్ట్రేషన్లు జరిగాయని, నాటి నుంచి నెలవారీ కంపెనీల రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది సెపె్టంబర్ రిజిస్ట్రేషన్లు 16,641 తో పోలిస్తే తాజా సమీక్ష నెలలో రిజిస్ట్రేషన్లు తగ్గినా, ఈ ఏడాది ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సంఖ్య 25 శాతం అధికంగా ఉంది. -
రికార్డ్ సేల్స్: అపార్ట్మెంట్లా.. హాట్ కేకులా..!
కరోనా మహమ్మారి ఇళ్ల కొనుగోలు దారుల ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో అఫార్డబుల్ హౌస్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడే వారు. కానీ ఇప్పుడు వారి ఆలోచన మారింది. లెక్క ఎక్కువైనా పర్లేదు..లగ్జరీ మాత్రం మిస్ అవ్వకూడదనేలా ఆలోచిస్తున్నారని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే తెలిపింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా పలు బ్యాంకులు హోం లోన్లపై వడ్డిరేట్లతో పాటు స్టాంప్ డ్యూటీ రుసుము తగ్గించడంతో భారీ ఎత్తున ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. ముఖ్యంగా లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్లో వందల కోట్ల బిజినెస్ జరిగినట్లు మరో సర్వే సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి చిరకాల కోరిక. జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బులతో కలల పొదరిల్లును నిర్మించుకోవాలని అనుకుంటారు.అలాంటి పొదరిల్లును ముంబై మహా నగరంలో ఎంతమంది సొంతం చేసుకున్నారనే అంశంపై నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ చేసింది. ఈ స్టడీలో దసరా నవరాత్రి సందర్భంగా ముంబైలో ప్రతి రోజు 400కి పైగా అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే హోంలోన్లను ఆఫర్ చేయడంతో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో రియల్టీ ఎక్స్పర్ట్స్ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ సుమారు 3,205 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన స్టడీలో పేర్కొంది. ఇక ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దసరా పండుగ మధ్య కాలంలో ప్రతి రోజు 219 నుంచి 260 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్పష్టం చేసింది. ఆగస్ట్ నెలకంటే అక్టోబర్ 13 వరకు ఇళ్ల సేల్స్ 17శాతం పెరిగాయి. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో 4,052 యూనిట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ నిర్ధారించింది. దివాళీ ఫెస్టివల్ లో సైతం సేల్స్ పెరగొచ్చు ఈ సందర్భంగా ది గార్డియన్స్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ జాయింట్ డైరెక్టర్ రామ్ నాయక్ మాట్లాడుతూ..గత 8 రోజుల్లోనే రూ12,00కోట్ల విలువైన అపార్ట్మెంట్లను అమ్మినట్లు తెలిపారు. వాటిలో సుమారు రూ.750కోట్ల విలువైన లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్ అపార్ట్ మెంట్లు ఉన్నట్లు చెప్పారు. దీపావళి సందర్భంగా ఇళ్ల సేల్స్ పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం, దీపావళికి ఇళ్లు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో పాటు ఇతర కారణాల వల్ల సేల్స్ పెరుగుతాయని రామ్ నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆస్తుల వాటా.. స్టాంప్ డ్యూటీకి టాటా
సాక్షి, అమరావతి: విజయవాడలోని ప్రముఖ వ్యాపారికి చెందిన ఉమ్మడి ఆస్తిని నలుగురు వారసులు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం ఆ ఆస్తి విలువ రూ.133.93 కోట్లు. హిందూ వారసత్వ చట్ట నిబంధనల ప్రకారం ఆస్తిని పంచుకున్న వారసులు రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.1.84 కోట్లను స్టాంపు డ్యూటీగా చెల్లించాలి. కానీ.. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ వారసుల మధ్య ఆస్తులను సమానంగా పంపిణీ చేయలేదు. అంతేకాదు వారసులు కాని వారికి ఆస్తులను ముందే విక్రయించేసి.. కొనుగోలుదారులను కూడా వారసుల జాబితాలో చూపించారు. మొత్తంగా సుమారు రూ.75 లక్షల్ని మాత్రమే స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. దాంతో ఖజానాకు రూ.1.09 కోట్ల నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రముఖ వ్యాపారి, రాజకీయ నేత కుటుంబానికి చెందిన రూ.132 కోట్ల ఉమ్మడి ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఖజానాకు రూ.1.03 కోట్ల మేర గండికొట్టారు. ఇలా 2014–20 సంవత్సరాల మధ్య స్టాంప్ డ్యూటీ రూపంలో రాష్ట్ర ఖజానా రూ.1,200 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయినట్టు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) గుర్తించింది. వారసత్వ చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఖజానాకు దశాబ్దాలుగా రూ.వేలాది కోట్లను గండికొడుతున్న మాయాజాలం ఏపీ డీఆర్ఐ పరిశీలనలో వెల్లడైంది. ఏటా 64 వేల వారసత్వ ఆస్తుల పంపిణీ రిజిస్ట్రేషన్లు వీలునామా లేని సందర్భాల్లో వారసుల మధ్య ఆస్తుల పంపిణీకి సంబంధించిన నిబంధనల్ని హిందూ వారసత్వం చట్టంలోని సెక్షన్ 8లో స్పష్టంగా పొందుపర్చారు. ఆ సెక్షన్ కింద రాష్ట్రంలో ఏటా దాదాపు 64 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఇవి 4 శాతం. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏటా సగటున 16 లక్షల ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేస్తోంది. తద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో ఏటా సగటున రూ.5,500 కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతోంది. అందులో వారసత్వ ఆస్తుల పంపిణీ రిజిస్ట్రేషన్లు 4 శాతం అంటే 64 వేల రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి ఏటా రూ.75 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ.. నిబంధనల ప్రకారం ఏటా రూ.275 కోట్లు స్టాంపు డ్యూటీ రావాలని ఏపీ డీఆర్ఐ తనిఖీల్లో వెల్లడైంది. ఆరేళ్లలో రూ.1,200 కోట్ల స్టాంపు డ్యూటీ ఎగవేత ఏపీ డీఆర్ఐ కమిషనర్ ఎం.నరసింహారెడ్డి ఇటీవల ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో విస్మయానికి గురిచేసే వాస్తవాలు వెలుగు చూశాయి. 2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 50 రిజిస్ట్రేషన్లను ఏపీ డీఆర్ఐ బృందాలు తనిఖీ చేశాయి. వాటికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ కంటే రూ.22.68 కోట్లు తక్కువ చెల్లించినట్టు గుర్తించారు. ఆ విధంగా 2014–20 మధ్య ఖజానాకు రూ.1,200 కోట్లు గండికొట్టినట్టు తేలింది. హక్కుదారులు కాకపోయినా.. ఉమ్మడి ఆస్తిలో చట్ట ప్రకారం హక్కుదారులు కాని వారిని కూడా హక్కుదారులుగా చేరుస్తున్నారు. ఆ మేరకు ముందుగానే ఆస్తుల అమ్మకానికి ఒప్పందం చేసుకుని కొనుగోలుదారులను ఆస్తి హక్కుదారులుగా చూపిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన సబ్ రిజిస్ట్రార్లు కొందరు అవినీతికి పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆమోదిస్తున్నారు. వారసులు కానివారికి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తే 3 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. కానీ.. వారిని వారసులుగా పేర్కొని వాటాలు ఇస్తూ ఆ విలువపై కేవలం 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నారు. దాంతో ప్రభుత్వం 2 శాతం స్టాంపు డ్యూటీ ఆదాయాన్ని కోల్పోతోంది. మరోవైపు స్వార్జిత ఆస్తిని కూడా ఉమ్మడి వారసత్వ ఆస్తిగా చూపిస్తున్నారు. దాంతో ఒక భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు పొందుతున్నారు. న్యాయ వివాదాలు తలెత్తితే నష్టం వారికే.. వారసత్వ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి ఆస్తుల పంపిణీ చేస్తుండటంతో న్యాయ వివాదాలు కూడా పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒకరికి ఎక్కువ వాటా ఇవ్వాలంటే ఆ మేరకు మిగిలిన వాటాదారులు తమ వాటాల్లోని భాగాన్ని ఎక్కువ వాటా పొందే వారికి చట్టబద్ధంగా బదిలీ చేయాలి. దానిపై 3 శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తే అది చట్టబద్ధమైన బదలాయింపు అవుతుంది. కానీ.. ప్రస్తుతం తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కదా అని ఒకరికి ఎక్కువ, మిగిలిన వారికి తక్కువగా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కానీ అది ఆస్తులను చట్టబద్ధంగా బదిలీ చేసినట్టు కాదు. భవిష్యత్‌లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తే.. తమకూ సమాన వాటా దక్కాల్సిందే అని మిగిలిన వాటాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే చేయగలిగేదేమీ ఉండదు. ఎందుకంటే వాటాల బదిలీ చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి వారసులందరికీ సమాన హక్కు సజీవంగా ఉన్నట్టే. రాష్ట్రంలో ఇలాంటి కేసులు లెక్కకు మించి న్యాయ వివాదాలు నమోదవుతూ ఉన్నాయి. ఉమ్మడి ఆస్తి పంపిణీపై స్టాంపు డ్యూటీ నిబంధనలివీ.. ► ఉమ్మడి ఆస్తిని విభజించి రిజిస్ట్రేషన్ చేసేప్పుడు దస్తావేజులో పేర్కొన్న పార్టీలు అందరూ ఉమ్మడి ఆస్తిలో వాటాదారులు కావాలి. వారి మధ్య ఆస్తిని సమ భాగాలుగా పంపిణీ చేస్తే.. అందులో ఒక భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇస్తారు. ► మిగిలిన భాగాలకు రిజిస్ట్రేషన్ ఆస్తి విలువలో 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. కన్వేయన్స్ డీడ్ ద్వారా ఆస్తి పొందిన వారు 4 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ► హక్కు విడుదల (అంటే చట్టబద్ధ వారసులు తమ వాటాలో కొంత భాగాన్ని ఇతరులకు ఇస్తే) ద్వారా ఆస్తి పొందిన వారు 3శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ► గిఫ్ట్/సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఆస్తి పొందితే 2శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ఎగవేత సాగుతుందిఇలా.. ఉమ్మడి వారసత్వ ఆస్తి పంపిణీలో ఓ భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు నిబంధనను దుర్వినియోగం చేస్తూ స్టాంపు డ్యూటీని భారీగా ఎగవేస్తున్నారు. చట్టబద్ధ వారసులైన కుమారులు, కుమార్తెల మధ్య ఆస్తిని సమాన భాగాలుగా పంపిణీ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. ఒకరికి ఆస్తిలో ఎక్కువ భాగం కేటాయిస్తున్నారు. ఆ పెద్ద భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు తీసుకుంటున్నారు. మిగిలిన భాగాలకు ఒక శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం స్టాంపు డ్యూటీ రావడం లేదు. వారసులు పరస్పర సమ్మతితో ఎక్కువ లేదా తక్కువ భాగాలు పంపిణీ చేసుకోవాలనుకుంటే ఎవరూ కాదనరు. కానీ.. నిబంధనల ప్రకారం సమానంగా పంపిణీ చేసుకుని.. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలి అనుకుంటున్నారో మిగిలిన వాటాదారులు తమ వాటా నుంచి ఆ మేరకు ఆస్తిని బదిలీ చేయాలి. అలా చేస్తే.. అది వారసత్వ హక్కును బదలాయించినట్టు అవుతుంది. ఆ మేరకు బదలాయించిన అదనపు ఆస్తి భాగంపై 3శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకపోవడంతో ప్రభుత్వం 3 శాతం స్టాంపు డ్యూటీని నష్టపోతోంది. -
Telangana: భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు
7.5- 8 శాతం వరకు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ కలిపి 6 శాతం వసూలు రాష్ట్రంలో 2013 నాటి నుంచీ ఇవే ఫీజులు.. ప్రస్తుతం రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో 6 శాతాన్ని చార్జీగా వసూలు చేస్తున్నారు. ఇందులో 5.5 శాతం స్టాంపు డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటున్నారు. అదనంగా ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు రూ.100 చొప్పున యూజర్ చార్జీ, 0.01 శాతం మ్యుటేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. 6.5 శాతం నుంచి 7 శాతం వరకు స్టాంపు డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటారు. యూజర్ చార్జీ, మ్యుటేషన్ ఫీజు యథాతథంగా ఉంటాయని సమాచారం. రూ.250 కోట్లు రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీలు రెండూ పెంచితే.. ప్రతి నెలా సుమారు రూ.250 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారుల అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రిజిస్ట్రేషన్ల ఫీజును కూడా సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద భూమి లేదా ఆస్తి విలువలో 6 శాతం వసూలు చేస్తుండగా.. దీనిని 7.5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 7-8 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేస్తుండటం, రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్లుగా ఒక్కసారి కూడా ఈ ఫీజులు పెంచకపోవడం నేపథ్యంలో.. ఈసారి ఫీజుల పెంపుదల ప్రతిపాదనను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే భూముల విలువలను పెంచుతున్న సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచితే.. ప్రజలపై భారం పడినట్టు అవుతుందనే తర్జనభర్జన కూడా జరుగుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి మంగళవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి నెలా అదనంగా రూ.250 కోట్లు: భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీల పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ, ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలకు రూ.500 కోట్లకు అటూఇటుగా ఉంది. తాజాగా విలువలు, చార్జీల పెంపు అమల్లోకి వస్తే.. ఆదాయం 50 శాతం మేర పెరుగుతుందని అధికారులు లెక్కలు వేశారు. అంటే నెలనెలా అదనంగా రూ.250 కోట్లు వస్తాయని.. మొత్తంగా నెలకు రూ.750 కోట్ల చొప్పున ఏడాదికి రూ.9 వేల కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. ఆ లెక్కన మరో రూ.3,500 కోట్లు ఎలా సమకూర్చుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. చార్జీలతో భారమనే అభిప్రాయం భూములు, ఆస్తుల విలువలు పెంచితే.. వాటి ఆధారంగా రుణాలు కూడా కాస్త ఎక్కువగా, సులువుగా లభించే వెసులుబాటు ఉంటుందన్న అభిప్రాయముంది. అందువల్ల విలువల సవరణ వల్ల కట్టే చార్జీ పెరిగినా.. క్రయవిక్రయదారులు పెద్దగా ఇబ్బందిపడే అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. అదే ఫీజు కూడా పెంచితే భారం పెరిగిందనే భావన ఏర్పడుతుందని పేర్కొంటున్నాయి. ఈ రెండు రకాల వాదనలపై కేబినెట్ భేటీలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గతంలో రెండేళ్లకోసారి.. పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా భూములు, ఆస్తుల విలువలను సవరించేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఈ సవరణ జరగలేదు. ప్రస్తుతం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి భూముల విలువలు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. ఈ కేబినెట్ సమావేశంలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. రెండూ పెంచితే ఎలా? భూములు, ఆస్తుల విలువల పెంపుతో సరిపెడితే రిజిస్ట్రేషన్ శాఖకు ఓ మోస్తరుగా మాత్రమే ఆదాయం పెరుగుతుంది. అదే చార్జీలు కూడా పెంచితే గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. కానీ రెండూ పెంచితే ప్రజలపై భారం ఒక్కసారిగా పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు రూ.లక్ష ధరతో ఒక ఎకరం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరిగితే.. ప్రస్తుత విధానం ప్రకారం రూ.6 వేలు (6 శాతం) చార్జీల కింద కడితే సరిపోతుంది. ఇదే ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలకు పెంచితే.. ప్రస్తుత చార్జీల ప్రకారమే రూ.24 వేలు కట్టాల్సి వస్తుంది. ఇదే సమయంలో చార్జీలను 8 శాతానికి పెంచితే.. రూ.32 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే భారం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండింటినీ పెంచడంపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు, కోవిడ్‌పైనా.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ పెంపుతోపాటు 50 వేల ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వానాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో వ్యవసాయ స్థితిగతులు, పాఠశాలలు, పుస్తకాల పంపిణీ, ఇతర విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
తెలంగాణ లాక్డౌన్: బ్యాంకు పనివేళల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. గురువారం రెండో రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక ఈ లాక్డౌన్ పది రోజుల పాటు(మే 21) వరకు కొనసాగుంది. తాజాగా తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు అమల్లోకి రానుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. అదే విధంగా అన్ని కోవిడ్ జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ 50 మంది సిబ్బందితో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఇక తెలంగాణలో లాక్డౌన్ దృష్ట్యా వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులకు బ్రేక్ పడింది. ముందస్తుగా రవాణా శాఖ పలు స్లాట్లను వాయిదా వేసింది. తెలంగాణలో ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్ల సేవలు నిలిపివేయనున్నారు. చదవండి: తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే -
రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 75,236 లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.382.64 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దీంతోపాటు రూ.200 కోట్లు ఈ చలాన్ల రూపంలో వచ్చాయి. కరోనా మన రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు సాధారణంగా రోజుకు 4-5 వేల వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. ఈ నెలలో వచ్చిన సెలవులను మినహాయిస్తే దాదాపు అదే స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఎప్పుడు ఏమవుతుందో? కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగడానికి మళ్లీ లాక్డౌన్ పెడతారేమోననే ఆందోళనే కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఏ క్షణమైనా ప్రభుత్వం లాక్డౌన్ పెట్టే అవకాశముందని రియల్టర్లు, కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ కూడా రియల్ లావాదేవీలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనుకుంటున్న ప్రభుత్వం.. కచ్చి తంగా మార్కెట్ విలువలను పెంచుతుందనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది. ఏప్రిల్ 1 నుంచే మార్కెట్ విలువల పెంపు అమల్లోకి వస్తుం దనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ మార్కెట్ విలువలు పెరిగితే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజు పడుతుందనే ఆలోచనతోనే హడావుడిగా రిజిస్ట్రేషన్లకు వెళ్లాల్సి వస్తోందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోవడం కూడా లావాదేవీలు పెరిగేందుకు కారణమని రిజిస్ట్రేషన్ల అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు క్రయ, విక్రయ లావాదేవీల నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది. ముఖ్యంగా ఫొటో క్యాప్చరింగ్ సమయంలో మాస్కులు తీయాల్సి ఉన్నందున ఆ విభాగంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చిన నేపథ్యంలో ఈ నెలలో మిగిలిన పనిదినాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ చదవండి: రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు -
అప్పుడు రూ.8 లక్షలే అన్నవ్.. ఇప్పుడు 12 చెబుతున్నవ్!
నిర్మల్: ‘అరె.. ఏమన్నా.. అంత చెబుతున్నవ్. రెండు నెలల కిందట రూ.8 లక్షలకే తీసుకో అన్నవ్. ఇప్పుడేమో పన్నెండు చెబుతున్నవ్. గీ రెణ్నెళ్లకే నాలుగు లక్షలు పెరిగిందా..! గిదేం లెక్కనే..’ అని కస్టమర్ అడుగుతుంటే.. ‘అట్లనే ఉన్నది భాయ్ సాబ్. ఇప్పుడు కొత్త వెంచర్ల ప్లాట్లకు సర్కారు రిజిస్ట్రేషన్ చేస్తలేదు. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసి ఉన్న ప్లాట్లకే చేస్తున్నరు.వాటికే డిమాండ్ పెరుగుతున్నది. అందుకే పాత ప్లాట్ల ధరలు పెంచినం..’ అని రియల్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం వెంచర్ల ఏర్పాట్లలో నిబంధనలు పెట్టడం, కొత్త వెంచర్ల విషయంలో క్లా రిటీ ఇవ్వకపోవడంతో చాలామంది గతంలో రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లపైనే దృష్టి పెడుతున్నారు. ఈ క్ర మంలో రీసేల్‌లో వీటి ధరలు రెట్టింపవుతున్నాయి. జిల్లాలో జోరుగా.. మిగతా జిల్లాలతో పోలిస్తే నిర్మల్ జిల్లాలో రియల్ఎస్టేట్ రంగం జోరుగా పెరుగుతోంది. ఇటీవల సర్కారు కొత్త లేఅవుట్ నిబంధనలను పక్కాగా అమలు చేయకముందు ఎటు చూసినా వెంచర్లే దర్శనమిచ్చాయి. ప్రస్తుతం కొత్త ప్లాట్ల ఏర్పాటు తగ్గి నా.. భూములకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ భూమి మీద పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో సామాన్యుడికి అందనంతగా ధరలు చేరువవుతున్నాయి. జిల్లాకేంద్రం చుట్టూ ఐదారు కిలోమీటర్ల వరకు ఎకరం రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్లు పలుకుతోందంటే.. పరిసి ్థతి అర్థం చేసుకోవచ్చు. అసలు.. కొనడానికి పెద్దమొత్తంలో భూమి దొరకడమే గగనంగా మారింది. ఎక్కడో మారుమూల ఉన్న భూమి కూడా ఎకరానికి రూ.కోటిపైనే విక్రయిస్తున్నారు. పాత వాటికే.. లేఅవుట్ నిబంధనలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో కొత్త వెంచర్లకు దెబ్బ ప డింది. మారిన నిబంధనల ప్రకారం ఎకరానికి ఐదా రు ప్లాట్లు తగ్గుతున్నాయి. మరోవైపు కొత్తగా వెంచ ర్లు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం ఇంకా మొదలు పెట్టలేదు. వాటిపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారి టీ కూడా ఇవ్వలేదు. దీంతో చాలామంది పాత(రీసే ల్) ప్లాట్లపైనే దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం సా మాన్య, మధ్యతరగతి కుటుంబాలు సైతం తమకంటూ కొంత భూమి ఉండాలని ఆశపడుతున్నాయి. అప్పు చేసైనా సరే ఓ ప్లాటు కొనాలనుకుంటున్నా యి. ఈ క్రమంలో తమకు అందుబాటులో వచ్చే ప్లా ట్లు కాస్త దూరమైనా ఫర్వాలేదంటున్నారు. అందుకే పట్టణాలకు కనీసం ఐదారు కిలోమీటర్ల వరకూ వెంచర్లు అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రీసేల్ ప్లా ట్లకే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండటంతో వాటి ధర పెరిగినా అప్పుచేసి మరీ వాటినే తీసుకుంటున్నారు. ఇళ్లపై దృష్టి.. ప్లాట్లు కొని ఇబ్బందులు పడే కంటే నేరుగా ఇల్లునే తీసుకుంటే బాగుంటుంది కదా.. అన్న ధోరణి కూ డా పెరుగుతోంది. ప్రధానంగా భర్త, భార్య, పిల్లలు ఉన్న చిన్న కుటుంబాలు ఇలాంటి ప్రణాళికల్లోనే ఉంటున్నాయి. ప్లాట్లు, రిజిస్ట్రేషన్, కన్స్ట్రక్షన్.. ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రెడీమేడ్ ఇళ్లు ఉంటే తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో జిల్లాలో రియల్టర్లతో పాటు బిల్డర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వారే చిన్నపాటి సైజ్‌లో ఓ డబుల్బెడ్రూం ఇల్లును కట్టించి ఇస్తున్నారు. కుటుంబ రాబడి, వారు పెట్టే పెట్టుబడిని బట్టి ఇళ్ల ను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకేంద్రంలో అపార్ట్మెంట్ల నిర్మాణం వేగమవుతోంది. పదులసంఖ్యలో కొత్త అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. పేస్లిప్, ఇన్‌కంటాక్స్ పేమెంట్ రెగ్యులర్ ఉన్నవాళ్లకు బ్యాంకులు సైతం ఇళ్లరుణాలు ఇస్తుండటంతో వాటి వైపు దృష్టి పెడుతున్నారు. నిలిచిన రిజిస్ట్రేషన్లు.. ప్రభుత్వం పక్కాగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తుండటం, లేఅవుట్ ప్రకారం వెంచర్లుండాలని చెప్పడంతో రియల్టర్లు కొత్తవాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ల విక్రయాలే జోరందుకుంటున్నాయి. ఈక్రమంలో వాటి ధరలూ పెరుగుతున్నాయి. జిల్లాకేంద్రంలో మూడు నెలల కిందటి వరకు ఏరియాను బట్టి 40/50ప్లాటు ధర రూ.8లక్షల–14లక్షలవరకుఉండగా.. ఇప్పుడు రూ. 15లక్షల పైనే చెబుతున్నారు. కొన్ని కాలనీల్లో రూ. 40నుంచి 50లక్షల్లో ధరలు నడుస్తున్నాయి. లేఅవు ట్ ప్రకారం చేసి, పాతధరలకు అమ్మితే, తమకు ఏం లాభం ఉండదని రియల్టర్లు చెబుతున్నారు. కొత్త లేఅవుట్ ప్రకారం వెళ్తే.. కచ్చితంగా ప్లాట్ల ధరలను పెంచాల్సి వస్తుందంటున్నారు. మరోవైపు ఓ ప్లాటైనా కొనుక్కుందామనుకునే మధ్యతరగతి కు టుంబాలు ఈ ధరలు చూసి బెంబేలెత్తుతున్నాయి. చదవండి: ఒకప్పుడు భయపడేవారు.. ఇప్పుడు ప్రశంసలు! -
సెకండ్ శాటర్ డే, సండే కూడా..
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మార్చి నెలలోని నాలుగు ఆదివారాలు, రెండో శనివారం కూడా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో మహాశివరాత్రి, హోలీ సెలవులు మినహాయించి మిగతా రోజులు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరపాలని ఆయన సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఉద్యోగ సంఘ ఆఫీస్ బేరర్లు బీఆర్కేఆర్ భవన్లో సీఎస్‌ను గురువారం కలిశారు. శాఖ పరిధిలో ఇటీవల పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది పనితీరు పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ నేతలు పరిష్కరించాలని కోరిన సమస్యలపై సీఎస్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కన్వీనర్ ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, సభ్యులు ప్రణయ్‌కుమార్, సిరాజ్ అన్వర్, నరేశ్‌గౌడ్ తదితరులున్నారు. -
సాహసోపేతం.. రీసర్వే మహాయజ్ఞం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూములు, స్థిరాస్తుల రీసర్వే అత్యంత క్లిష్టమైన పని. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరపాలక సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వేచేసి హద్దులు నిర్ణయించి హక్కుపత్రాలు ఇవ్వడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులు, నకిలీ రికార్డులు వంటి ఎన్నో చిక్కుముళ్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా కొలతల్లో వచ్చే అతిసూక్ష్మ తేడా, వాస్తవ భూమికి, రికార్డుల్లోని గణాంకాలకు మధ్య ఉన్న భారీ తేడా, డ్యూయల్ రిజిస్ట్రేషన్లు, ట్యాంపరింగైన రికార్డులు వంటి సమస్యల్ని రీసర్వే క్రతువులో అధిగమించాల్సి ఉంటుంది. అందుకే రీసర్వేని రెవెన్యూ నిపుణులు మహాయజ్ఞంగా అభివర్నిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ మహాక్రతువులో భాగస్వామ్యం కల్పించినందుకు వ్యక్తిగతంగా, సంస్థ తరఫున సీఎం జగన్‌కు, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని దేశంలోనే అతి పురాతన, ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే సంస్థ.. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ బహిరంగంగానే చెప్పారంటే ఈ సర్వేకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. క్లిష్టమైన సమస్యలను అధిగమించి రీసర్వే పూర్తిచేస్తే గోల్డెన్ రికార్డులు రూపుదిద్దుకుంటాయి. భూతగాదాలు, పొలం గట్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తర్వాత క్రయవిక్రయాలు, చట్టబద్ధమైన వారసత్వం ప్రకారం కేవలం మ్యుటేషన్లు చేసుకుంటూ వెళితే వచ్చే 40 నుంచి 50 ఏళ్లపాటు ఈ రికార్డులు అద్భుతంగా ఉంటాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత భూహక్కులు కల్పించిన మొదటి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. రికార్డుల స్వచ్చికరణ, రీసర్వే ప్రక్రియలను అంకితభావంతో పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉంది. కొలతల్లో తేడాలు దుకాణానికి వెళ్లి బంగారం కొని వెంటనే పక్క షాపునకు వెళ్లి తూకం వేయిస్తే 10 నుంచి 20 మిల్లీగ్రాముల వరకు తేడా వస్తుంది. దీన్ని తప్పుగా పరిగణించడానికి వీలులేని అతిసూక్ష్మ తేడా అంటారు. తూకాల్లో లాగే భూమి కొలతల్లో కూడా అతిసూక్ష్మ తేడాలు వస్తాయి. ప్రపంచంలోనే అత్యాధునిక కార్స్ టెక్నాలజీతో సర్వేచేసినా ఇవి వస్తాయి. ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుని కొలత వేసిన తర్వాత మరోసారి అలాగే తీసుకుని చూస్తే గరిష్టంగా ఐదు సెంటీమీటర్ల వరకు ఎక్కువ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే సర్వే పరిభాషలో ప్లస్ ఆర్ మైనస్ 5 సెంటీమీటర్ల ఎర్రర్ అని అంటారు. సాధారణంగా రెండు సెంటీమీటర్లు మించి తేడా రాదు. కొన్నిచోట్ల ఐదు సెంటీమీటర్ల వరకు రావచ్చని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన దానికంటే తక్కువని అర్థం. ఇలాంటి తేడాలను కూడా అంగీకరించనివారికి వాస్తవాలు వివరించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ కొలిచి చూపడం ద్వారా ఒప్పించాల్సి ఉంటుంది. తక్కెళ్లపాడులో నాలుగెకరాల తేడా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో పైలెట్ ప్రాతిపదికన నిర్వహించిన రీసర్వేలో ఆర్ఎస్ఆర్కు, వాస్తవ కొలతలకు మధ్య నాలుగెకరాల తేడా వచ్చింది. తమ భూముల కొలతల విషయంలో 35 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వాస్తవాలు వివరించడం ద్వారా వారిని ఒప్పించారు. నేటి నుంచి అవగాహన రీసర్వేని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 14 వేల మంది సర్వేయర్లను నియమించారు. వీరిలో 9,400 మందికి శిక్షణ ఇవ్వగా మిగిలిన వారికి వచ్చేనెల 26 నాటికి శిక్షణ పూర్తి చేయనున్నారు. రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. డ్రోన్ సర్వేలో తేడా వచ్చిందని యజమానులు భావిస్తే రోవర్‌తో చేస్తారు. అందులోనూ సంతృప్తి చెందకపోతే చెయిన్‌తో మాన్యువల్ విధానంలో కొలిపించి హద్దులు నిర్ణయిస్తారు. దీన్ని కూడా అంగీకరించని పక్షంలో సివిల్ ఇంజినీరింగ్ విధానంలో కొలుస్తారు. వివాదాలను పరిష్కరించేందుకు మండలానికి ఒకటి చొప్పున 660 మొబైల్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గొప్ప సంస్కరణ ప్రజలకు మేలు చేయాలని ఏ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టినా కొన్ని సమస్యలు వస్తాయి. రీసర్వేలోనూ ఇలాంటి సమస్యలుంటాయి. ఏయే సమస్యలు వస్తాయో లిస్టు రూపొందించుకున్నాం. ఏయే అంశాల్లో ఎలా ముందుకెళ్లాలో ఇప్పటికే నాలుగు సర్క్యులర్లు పంపించాం. మరోదాన్ని పంపనున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో సర్వే చేయడమే కాకుండా స్థిరాస్తుల యజమానులకు శాశ్వత హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇది దేశంలో ఎక్కడా లేని గొప్ప సంస్కరణ. ప్రజలపై నయాపైసా భారం పెట్టకుండా ప్రభుత్వమే భరించి సర్వే చేయడంతోపాటు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీని అమలుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – నీరబ్‌కుమార్‌ప్రసాద్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) -
వ్యవసాయేతర ‘రిజిస్ట్రేషన్లు’ షురూ..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు 3 నెలల ఎదురు చూపుల తర్వాత వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ధరణి వెబ్ సైట్‌పై దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారిం చిన హైకోర్టు రిజిస్ట్రేషన్లు ఆపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిం చింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రిజి స్ట్రేషన్ల ప్రారంభానికి నిర్ణయం తీసు కున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ‘వ్యవ సాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను స్లాట్ బుకింగ్ ద్వారా నిర్వహించడానికి హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు సాఫ్ట్వేర్ నిర్దేశించిన మొత్తంలో ఫీజులు, సుంకాలు చెల్లించి శుక్రవారం నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ సదుపా యం కల్పించాం. బుక్ చేసుకున్న స్లాట్ లోని తేదీ ప్రకారం ఈనెల 14 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ మవుతాయి. స్లాట్ బుక్ చేసు కున్న వ్యక్తులు మాత్రమే సం బంధిత తేదీ, సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. స్లాట్ బుకింగ్ లేకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోరు..’అని సీఎస్ స్పష్టం చేశారు. ఇబ్బందులు.. ఆర్థిక నష్టం కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనూ సంస్కరణలు తేవడం ద్వారా అవినీతి, అక్రమాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు నిలిచిపోయాయి. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం భూములు, ఆస్తులు అమ్ముకుని, కొనుక్కునే ప్రక్రియ నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడింది. గత మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో రావాల్సిన రూ.1,500 కోట్ల మేర ఆదాయం రాలేదు. ధరణిపై కోర్టులో దాఖలైన పిటిషన్ వాయిదాలు పడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ధరణిలో కాకుండా పాత విధానం (కార్డ్) ద్వారానే రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. వ్యవసాయేతర ఆస్తులు, భూములకు గతంలో ఎలా రిజిస్ట్రేషన్లు జరిగేవో.. మళ్లీ ప్రభుత్వ నిర్ణయం తీసుకునేంతవరకు అదే పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కేటీఆర్ ట్వీట్.. కోర్టు ఆదేశాల అనంతరం మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి పోస్టు చేశారు. ‘హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను రేపట్నుంచి (శుక్రవారం) ప్రారంభించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు’అని గురువారం చేసిన ఆ పోస్టులో కేటీఆర్ తెలిపారు. -
ధరణిలో చిక్కుముళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో ప్రారంభమై ఐదు రోజులు గడిచినా ఇంకా సవాళ్లు మాత్రం అధిగమించలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకొనే సమయంలో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సర్వే నంబర్లు పోర్టల్‌లో నమోదు కాకపోవడం, సొసైటీ, సంస్థలు కొనుగోలు చేసిన భూములకు ఆధార్ నంబర్లు సీడింగ్ కాకపోవడం, కటాఫ్ తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మ్యుటేషన్ కాకపోవడం, ఫౌతీ (వారసత్వం) తదితరాలు లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి కారణాలతో ఉన్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణిలో చేసుకొనే పరిస్థితి లేదు. మరోవైపు ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలనే దానిపై యంత్రాంగానికి స్పష్టత లేదు. ఈ గందరగోళంతో చాలా వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. ‘ధరణి’ప్రారంభం తర్వాత ఎదురైన సమస్యల్లో కొన్ని... రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సర్వే నంబర్ 506లోని భూమిని విక్రయించిన వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం ధరణిలో స్లాట్ బుక్ చేసేందుకు ప్రయత్నించగా... ఆ నంబర్, మార్కెట్ విలువ ఆన్లైన్లో కనిపించలేదు. దీంతో ఈ అంశాన్ని స్థానిక తహసీల్దార్‌కు వివరించినా పరిష్కారం దొరకలేదు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేఖుర్ధులో పదెకరాల భూమి కొనుగోలు చేశారు. కోవిడ్–19 బారిన పడి నాలుగు నెలల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఆ భూమిని భార్య పేరిట ఫౌతీ (విరాసత్) కోసం మండల తహసీల్దార్ కార్యాలయంలో కుటుంబ సభ్యులు అర్జీ పెట్టుకున్నారు. ఇంతలోనే కొత్త రెవెన్యూ యాక్టు అమలుతో ఈ సమస్య పెండింగ్‌లో ఉండిపోయింది. సంగారెడ్డిలోని కంది సమీపంలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్న ఓ సంస్థ ఆరెకరాల భూమి కొనుగోలు చేసింది. ఈ భూమికి పట్టాదారు పుస్తకం కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. కానీ సంస్థకు చెందిన అందరూ ఆధార్ నంబర్లు ఇచ్చే అవకాశం లేదు. వారి తరఫున ఒకరే ఆధార్ నంబర్ ఇస్తే భూమి విక్రయ సమయంలో అతనే కీలకం కానుండటంతో ఇతర డైరెక్టర్లు సైతం అయోమయంలో పడుతున్నారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియలో అమ్మకందారులు, కొనుగోలదారుల సంఖ్య నాలుగు కంటే ఎక్కువగా ఉంటే బుకింగ్ కావడం లేదు. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని మ్యుటేషన్ దరఖాస్తు పెట్టకుంటే ఆన్లైన్ రికార్డులో పూర్వపు యజమాని పేరే వస్తోంది. తాజాగా ధరణి వెబ్సైట్లో పూర్వపు యజమాని పేరే కనిపిస్తుండడంతో గోప్యంగా ఆ భూమిని మరో వ్యక్తికి సైతం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. పరిష్కారం సర్కారుకే ఎరుక...! రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వీఆర్వో వ్యవస్థ రద్దవగా ఆయా ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్లూ గ్రామ స్థాయిలో భూముల వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించిన వీఆర్వో సీటు రద్దు కావడంతో ఆ స్థాయిలో జరగాల్సిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగే కార్యకలాపాలు సైతం నిలిచిపోయాయి. రెవెన్యూ యాక్టు అమలుతో పాత పద్ధతిలో జరిగే అన్ని రకాల వ్యవహారాలను ప్రభుత్వం ఒక్కసారిగా నిలిపేసింది. దీంతో అప్పటివరకు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం అటకెక్కింది. మండల రెవెన్యూ కార్యాలయంలో పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా వాటి ఏర్పాటు పెండింగ్‌లో ఉంది. మరోవైపు నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకొని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త యాక్టు అమలుతో ఆన్లైన్లో రికార్డు మారలేదు. ఫలితంగా పాస్‌పుస్తకాలు జారీ కాలేదు. వాటి జారీపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇలాంటి కారణాలు రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. భూముల రికార్డుల్లో మార్పుచేర్పులు, సమస్యల పరిష్కరంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపించట్లేదు. అంకెల్లో ధరణి... ధరణి పోర్టల్‌కు శుక్రవారం నాటికి 63.63 లక్షల హిట్స్ వచ్చాయి. 38,132 మంది పోర్టల్‌లోకి లాగ్ఇన్ అయి సందర్శిం చారు. శుక్రవారం నాటికి 4,525 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ. 10.77 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. తనఖా రిజిస్ట్రేషన్, నాలా, బ్యాంకులకు సంబం« దించిన లావాదేవీలను అందుబాటులోకి తేవడానికి కసరత్తు జరుగుతోంది. వివరాలు ఇలా.. తేదీ రిజిస్ట్రేషన్లు నవంబర్ 2 490 నవంబర్ 3 523 నవంబర్ 4 870 నవంబర్ 5 1,170 నవంబర్ 6 1,472 మొత్తం 4,525 -
మ్యుటేషన్..ఇక సులువే!
ఎల్.ఎన్.పేట, టెక్కలి, ఆమదాలవలస: స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా భూమి హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. భూములతో పాటు ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరిగిన సందర్భంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. రిజి స్ట్రేషన్ల తర్వాత భూమి ఓనర్షిప్ మార్పుల కోసం కొనుగోలు చేసిన యజమాని రెవెన్యూ (తహసీల్దారు కార్యాలయం) అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ఇలా అయినా సవాలక్ష ఆంక్షలు చూపించి భూ యజమానులు సహనాన్ని కోల్పోయేలా చే యడం పరిపాటిగా ఉండేది. ఇక నుంచి రోజుల తరబడి రెవె న్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా భూమి ఓనర్షిప్ మార్పును ప్రభుత్వం సులభతరం చేసింది. రిజిస్ట్రేషన్ పరిభాషలో దీన్నే ‘ఆటో మ్యుటేషన్’ అంటారు. సీసీఎల్ఏ ద్వారా ఉత్తర్వులు ఈ ఆటో మ్యుటేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలా సీసీఎల్ఏ ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రత్యేక సర్క్యులర్‌ను ప్ర భుత్వం జారీ చేసింది. దీని ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే భూమి ఓనర్షిప్ (మ్యుటేషన్) మార్చేలా ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత భూమికి ఆయా మండలాల తహసీల్దార్లు విచారణ నిర్వహించి నిర్ధారణ కూడా చేపడతారు. దీని కోసం ఆర్ఓఆర్ యాక్టు–1971కి సవరణలు చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానికల్లీ మెయిన్‌టెయిన్డ్ రెవెన్యూ రికార్డ్స్(వెబ్‌ల్యాండ్) మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆటో మ్యుటేషన్ ప్రక్రియ రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో, రెండోది తహసీల్దారు కార్యాలయంలో చేపడతారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే ప్రక్రియ భూముల క్రయ విక్రయాలు జరిగిన తర్వాత వ్యవసాయ భూమిని కలిగిన వ్యక్తి దాన్ని అమ్మడం కోసం(విక్రయం), భాగాలు చేయటం (పార్టీషన్–కుటుంబ సభ్యుల మధ్య వాటాలు), బహుమతి(గిఫ్ట్) ఇవ్వటం కోసం గానీ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శిస్తాడు. అందులో భాగంగా వెబ్‌ల్యాండ్ 1–బి తప్పనిసరిగా సరిచూసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. – తన కార్యాలయానికి వచ్చిన అమ్మకందారు, కొనుగోలుదారుల ఈ–కేవైసీని సబ్ రిజి స్ట్రార్ నిర్ధారణ చేసుకుంటారు. – అమ్మకందారుడు తీసుకువచ్చిన భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్ రికార్డ్స్‌తో పోల్చి చూస్తారు. – రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ తన కార్యాలయంలో తాత్కాలిక మ్యుటేషన్ తన డిజిటల్ సంతకం ద్వారా చేస్తారు. – తాత్కాలిక మ్యుటేషన్ పూర్తయిన వెంటనే సంబంధిత రికార్డు తహసీల్దారు కార్యాలయంలో ఉండే వెబ్‌ల్యాండ్‌కు తదుపరి ప్రక్రియ ద్వారా పంపుతారు. – ఈ విధంగా తాత్కాలిక మ్యుటేషన్ జరిగిన వెంటనే అమ్మకం, కొనుగోలు దారులు ఇద్దరికీ ఎస్ఎంఎస్ అలెర్ట్ కూడా వెళుతుంది. – కొనుగోలుదారుడు ఒకవేళ సర్వే సబ్ డివిజన్ చేయించాలనుకుంటే తగిన ఫీజును గ్రామ సచివాలయం, మీ–సేవ వద్ద చెల్లించవచ్చు. తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగే ప్రక్రియ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాయంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి తహసీల్దారు కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా తాత్కాలిక మ్యుటేషన్ కోసం వస్తుంది. ఫారం–8ను జనరేట్ చేసి ఆయా గ్రామ పంచాయతీ, సచివాలయ నోటీస్ బోర్డులో ఉంచుతారు. 15 రోజుల్లో వీటికి సంబంధించిన అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణలోకి తీసుకుని విచారిస్తారు. – రిజిస్ట్రేషన్ జరిగిన 15 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం గ్రామ రెవెన్యూ అధికారి ఏడు రోజుల్లో, ఆర్ఐ, డిటీలు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. – ప్రొవిజనల్ మ్యుటేషన్ రికార్డును ఫీల్డ్ మీద విచారణ కోసం, నోషనల్ సబ్ డివిజన్‌ను ఎఫ్ఎంబీ, ఫీల్డ్ మీద మార్కింగ్ చేయటం కోసం సంబంధిత గ్రామ సర్వేయర్‌కి పంపుతారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజుల్లో పూర్తి చేయాలి. – విచారణ చేసిన డ్రాఫ్ట్ సబ్ డివిజన్ రికార్డును గ్రామ సర్వేయర్, మండల సర్వేయర్ ద్వారా తహసీల్దార్ అప్రూవల్ కోసం పంపుతారు. ఇలా వచ్చిన సబ్ డివిజన్ రికార్డులు ఫీల్డ్ రిపోర్టు, అభ్యంతరాలు పరిశీలించిన మీదట అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నది స్పీకింగ్ ఆర్డర్ ద్వారా జారీ చేస్తారు. తద్వారా తదుపరి ప్రక్రియను వెబ్‌ల్యాండ్ ద్వారా పూర్తి చేస్తారు. – సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వచ్చిన తాత్కాలిక మ్యుటేషన్‌పై 30 రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే డీమ్డ్ మ్యుటేషన్ అవుతుంది. – తహసీల్దారు కార్యాలయంలో మ్యుటేషన్ పూర్తయిన వెంటనే అమ్మకందారుడు, కొనుగోలుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెళుతుంది. అప్పుడు కొనుగోలుదారుడు ఈ–పాస్ బుక్, టైటిల్ డీడ్, సబ్ డివిజన్ రికార్డును మీ భూమి పోర్టల్ ద్వారా తీసుకోవచ్చు. ఇబ్బంది కలగకుండా.. భూమి హక్కుదారునికి ఇబ్బంది కలగకుండా ఆటో మ్యుటేషన్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ–సేవ కేంద్రంలో ఈ–పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. కొత్తవిధానంలో అలా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే ఆన్లైన్లో వివరాలు వస్తున్నాయి. వీటిని పరిశీలించి ఓనర్షిప్ మార్చి ఈ–పాస్ పుస్తకం కోసం సిఫార్స్ చేస్తున్నాం, ఈ విధానం రైతులకు, అధికారులకు ఎంతో సులువైనదిగా ఉంది. – రషీద్ అహ్మద్, ఉప తహశీల్దారు, ఎల్ఎన్ పేట రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త మార్పులు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. కొనుగోలుదారులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో మ్యుటేషన్ విధానంలో భూమి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వివరాలు తెలియజేస్తూ తహశీల్దారు కార్యాలయానికి నివేదికను ఆన్లైన్లో పంపిస్తాం. భూమి ఓనర్ పేరు, వివరాలు తహసీల్దారు కార్యాలయంలో 15 రోజుల వ్యవధిలోనే మార్పులు జరుగుతాయి. గతంలో భూమి హక్కు పొందాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇప్పుడు సులభతరం అయింది. – బి.లక్ష్మీనారాయణ, సబ్ రిజిస్ట్రార్, పాతపట్నం -
వాహనమిత్ర రిజిస్ట్రేషన్‌లో రయ్రయ్!
శ్రీకాకుళం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో నిలిచింది. అధికారులు, సిబ్బంది చొరవ తీసుకుని నమోదు చేయించడంతో గత ఏడా దితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా 1434 మందికి ఈ పథ కం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆటో, టాక్సీలు కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇన్సూరెన్స్‌లు, టాక్స్‌లు, మరమ్మతులు నిమి త్తం ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నేడు (గురువారం) లబి్ధదారుల ఖాతాలో వాహనమిత్ర సొమ్ము జమ చేయనున్నారు. సచివాలయాలతో సులభతరం.. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాహనమిత్ర కోసం దరఖాస్తు చేసుకోవడం చాలామంది డ్రైవర్లకు సులభతరంగా మారింది. ఎన్ని పనులు ఉన్నప్పటికీ గ్రామ సె క్రటరీకు దర ఖాస్తు ఇవ్వడంతో పాటు ఆయన దగ్గరుండీ వా హనాన్ని పరిశీలించడం, వెంటవెంటనే ఆన్లైన్ చేయడంతో ఈ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యింది. సిక్కోలులోనే అధికం.. 2019 అక్టోబర్‌లో ప్రారంభించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఎంతో మంది ఆటో, టాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చింది. ఈ పథకానికి గతేడాది 13,735 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 13,539 మందికి రూ.10వేలు ప్రోత్సా హకం లభించింది. గతేడాదిలో రెన్యువల్స్, ఈఏడాదిలో కొత్తగా దరఖాస్తు చేసిన లబ్దిదారులు కలిపి 14,973 మందితో జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో కంటే శ్రీకాకుళంలోనే అత్యధికంగా రిజి్రస్టేషన్లు కావడం విశేషం. జిల్లాలో క్యాబ్స్, ఆటోలు కలిపి 30,804 వరకు ఉన్నాయి. సచివాలయాల సిబ్బంది సహకారంతో.. నాకు సొంత ఆటో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో గతేడాది దరఖా స్తు చేయలేకపోయాను. ఈసారి ఆర్టీవో అధికారులు మార్గమధ్యలో తనిఖీలు చేస్తూ వా హనమిత్రకు దరఖాస్తుపై ఆరా తీశా రు. మా గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా వాహనమిత్రకు దరఖాస్తు చేశాను. ఏడాది పూర్తికాకుండానే రెండోసారి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి టాక్సీ డ్రైవర్ అకౌంట్లో రూ.10వేలు వేయడం గొప్ప నిర్ణయం. – కొంగరాపు సుధ, బైరివానిపేట ప్రత్యేక టీమ్‌తో.. జిల్లా కలెక్టర్ చొరవతో వైఎస్సార్ వాహనమిత్రను మరింత ముందు కు తీసుకుపోయాం. గత ఏడాది వాహనమిత్ర టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. మళ్లీ వారితోనే ఈసారి కూడా రిజి్రస్టేషన్ ప్రక్రియను పూర్తి చేశాం. ప్రతిరోజూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఆర్టీవో కార్యాలయానికి వచ్చే ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం వాహన మిత్ర కౌంటర్‌ను ఏర్పాటు చేశాం. సమావేశాలతో పాటు రహదారి తనిఖీల్లోనూ డ్రైవర్లకు పథకంపై అవగాహన కలి్పంచాం. గ్రామ సచివాలయ సెక్రటరీ లకు ఎటువంటి అపోహాలు ఉన్నా వారిని విజయవా డ రవాణాశాఖ టెక్నికల్ టీమ్‌తో నేరుగా మాట్లాడించాం. టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఎంపీడీఓలు, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. – డాక్టర్ సుందర్ వడ్డీ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, శ్రీకాకుళం -
రాష్ట్రంలో 633 రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ తర్వాత మంగళవారం రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 633 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోవిడ్–19 కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న కార్యాలయాలను తెరచి రిజిస్టేషన్ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రంలో 108 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు పనిచేశాయి. కంటైన్మెంట్ జోన్లలోనే కలెక్టర్ల సూచన మేరకు కొన్ని రెడ్ జోన్లలోని కార్యాలయాలనూ తెరవలేదు. దీంతో రాష్ట్రంలోని 295 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో 187 ప్రారంభంకాలేదు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉన్నందున కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని ఆస్తులను కూడా వేరేచోట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రణకోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యాలయాల్లో భౌతిక దూరం అమలు చేయడంతోపాటు బయోమెట్రిక్ యంత్రాలను ప్రతిసారీ శానిటైజ్ చేశారు. మంగళవారం రిజిస్ట్రేషన్ల వల్ల రుసుముల రూపేణా ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం వచ్చింది. ఆదాయ పెంపుపై దృష్టి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఆదాయ పెంపుపై దృష్టి పెట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు కమిషనర్ సిద్ధార్థ జైన్ సూచించారు. దీనిపై సోమవారంలోగా సూచనలు పంపాలన్నారు. ఆ శాఖ డీఐజీ, డీఆర్‌లతో మంగళవారం ఆయన ఈ మేరకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. -
కరోనా ఎఫెక్ట్: రిజిస్ట్రేషన్లు అనుమానమే..
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లకు ఇంకా వారం మాత్రమే గడువు ఉండడంతో బీఎస్–4 వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 31వ తేదీలోగా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోక పోతే ఆ వాహనాలను తుప్పుగా పరిగణించనున్నారు. వాహన కాలుష్యంతో వాతావరణం సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బీఎస్–4 వాహనాల స్థానంలో బీఎస్–6 వాహనాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2016లోనే ఇందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆర్టీఏ కార్యాలయం నిత్యం సందడిగా కనిపిస్తోంది. అయితే ‘కరోనా’ వైరస్ ప్రజా జీవనంపైనే కాదు రవాణా శాఖపై కూడా తన ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్, లర్నింగ్, డ్రైవింగ్ టెస్ట్‌లు, లర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి గాను స్లాట్ బుకింగ్‌లు నిలిపివేశారు. వాహన ఫిట్నెస్, వాహన రిజిస్ట్రేషన్లు మాత్రమే సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు తక్కువ సమయం ఉండటంతో పాటు కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించడానికి మోటారు వాహన రంగంలో ఎప్పటికప్పుడు వాహన తయారీలో పెనుమార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు నడిచిన బీఎస్–4 వాహనాలు ఇక పాత మోడల్స్‌గా మిగిలిపోనున్నాయి. ప్ర స్తుతం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బీఎస్–6 వాహనాలకు చాలా క్రేజ్ ఏర్పడుతోంది. ఇక బీఎస్–3, 4 ఇతర పాత వాహనాలకు మార్చి 31 వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తి చేయనున్నారు. గత పది రోజుల్లో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి ఏకంగా 2,150 వాహనాల రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–4 (భారత్ స్టేజీ–4) వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిషేధించారు. బీఎస్–6 ప్రమాణాల మేరకు ఉన్న వాహనా లనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తూ సుప్రీం కో ర్టు సైతం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రి జిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. రెండు జిల్లాల్లో వివరాలు.. బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ నిబంధనలపై గత నెల రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. వివిధ షోరూం నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. నూతన వాహనాలకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వాహనదారులకు అవగాహన కూడా కల్పించారు. మంచిర్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాలు, కార్లు, గూడ్స్ ఇతర వాహనాలు మొత్తంగా 4,858 వాహనాలు ఉండగా కుమురం భీం జిల్లాలో 2,683 వాహనాలు కలిపి రెండు జిల్లాల్లో 7541 ఉన్నాయి. ఇందులో రెండు జిల్లాల్లో కలిపి 5391 ఇంకా రిజిస్ట్రేషన్ కావాలి్సన వాహనాలు ఉన్నాయి. బీఎస్ 6 వాహనాలు రానుండగా బీఎస్–4 తయారీ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించకుంటే నష్టమే.. ఈ నెలాఖరులోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయించుకోకపోతే కొనుగోలు దారులు చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈనెల 31 తరువాత బీఎస్–4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. దీంతో ఆ వాహనం పట్టుపడితే సీజ్ చేయడం ఖాయం. బీమా కంపెనీలు ఆ వాహనాలను ఇన్‌స్రూెన్స్ చేయరు. దీంతో ఆ వాహనానికి ఏ ప్రమాదం జరిగినా బీమా వర్తించదు. దీనికి తోడు బీమా లేకుండా వాహనం నడిపితే కొత్త చట్టం ప్రకా రం జరిమానా, జైలు శిక్ష కూడా తప్పదు. గడువులోగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఉన్న డీలర్లకు బీఎస్–4 వాహన అమ్మకాలు నిలిపివేయాలని స్పష్టం చేశాం. ఈ నెలఖారులోగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఏ వాహనమైనా మార్చి 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకుంటే రిజిస్ట్రేషన్ లేని వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా గుర్తిస్తారు. – ఎల్.కిష్టయ్య, జిల్లా రవాణా శాఖాధికారి ‘కరోనా’ ప్రభావంతో కష్టమే.. కరోనావ్యాధి తీవ్ర నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వస్తుండటంతో రద్దీ ఏర్పడి ‘కరోనా’ వ్యాధి వ్యాప్తించేందుకు అవకాశం ఉంది. కార్యాలయాల్లో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా భయాందోళన తప్పడం లేదు. సామూహికంగా కార్యాలయానికి రాకుండా చూడటంతో పాటు శానిటైజర్ ఇస్తూ, చేతులు కడిగిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా చూస్తున్నారు. కంప్యూటరీకరణ చేసేటప్పుడు వ్యక్తుల మధ్య మీటర్ దూరం ఉండేలా చూస్తున్నారు. కార్యాలయంలో వైరస్ జాగ్రత్తలను తెలియజేసేలా ఎల్సీడీలు ఏర్పాటు చేయించారు. -
రిజిస్ట్రేషన్లకు మాంద్యం ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మందగమన పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోనూ స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు తగ్గాయి. భూములు, స్థలాలు, భవనాల క్రయ విక్రయాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. 2018– 19 ప్రథమార్థంతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో రిజిస్ట్రేషన్లు 4.21 శాతం తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత/ తిరోగమన రేటు కనిపిస్తోంది. షేర్ మార్కెట్లో రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన షేర్లు కనిష్ట స్థాయికి పడిపోయాయి. స్థిరాస్తి రంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయనేందుకు రియల్ ఎస్టేట్ షేర్లు కనిష్ట స్థాయికి పడిపోవడమే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. తొలి ప్రభావం రియల్ ఎస్టేట్‌పైనే.. ‘నల్లధనం ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో చలామణిలో ఉంటుంది. అందువల్ల ఆర్థిక ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మొదట ఈ రంగంపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆర్థిక రంగం బాగుంటే వాహన విక్రయాలు పెరుగుతాయి. ఇప్పుడు వాహన విక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి’ అని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2.86 శాతం ఆదాయ వృద్ధి రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయ ఆర్జన లక్ష్యం రూ.3,234 కోట్లు కాగా రూ. 2,467.67 కోట్లు (76.30 శాతం) మాత్రమే సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన రూ. 2,399.09 కోట్ల ఆదాయంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయంలో వృద్ధి 2.86 శాతంగా నమోదైంది. ఆదాయ ఆర్జనలో గుంటూరు (రూ.347.94 కోట్లు), విశాఖ (రూ.344.91 కోట్లు), కృష్ణా (రూ.330.09 కోట్లు) జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ఆదాయ వృద్ధిలో విజయనగరం (29.19 శాతం) చిత్తూరు (10.68) వైఎస్సార్ (10.44 శాతం)తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే గుంటూరు జిల్లాలో ఆదాయం 2.99 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 1.89 శాతం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1.48 శాతం చొప్పున తగ్గింది. వైఎస్సార్ జిల్లాలో 10 శాతం పెరుగుదల వైఎస్సార్ జిల్లాలో మాత్రం గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పది శాతానికి పైగా పెరిగింది. ప్రకాశం జిల్లాలో 1.72 శాతం, విజయనగరం జిల్లాలో 1.04 శాతం పెరిగాయి. కర్నూలు జిల్లాలో గత ఏడాది మొదటి ఆరు నెలల్లో నమోదైనన్ని డాక్యుమెంట్లే ఈ ఏడాది కూడా నమోదు కావడం గమనార్హం. రిజిస్ట్రేషన్ల సంఖ్య పరంగా చూస్తే గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. అధిక ధరలున్న చోట్ల భారీగా తగ్గిన కొనుగోళ్లు భూములు, స్థలాలు, భవనాల ధరలు అమాంతం పెరిగిన ప్రాంతాల్లో స్థిరాస్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ధరలు ఎక్కువగా ఉన్న చోట లావాదేవీలు తగ్గిపోయాయి. గుంటూరు జిల్లాలో రాజధాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థిరాస్తుల ధరలు భారీగా పెంచేశారు. గత పాలకులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. కృత్రిమ బూమ్ సృష్టించి ధరలు అమాంతం పెంచేశారు. దీంతో గత ఏడాది కూడా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే గుంటూరు జిల్లాలో స్థిరాస్తి విక్రయ లావాదేవీలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోల్చితే ఈసారి ఇదే కాలంలో గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్లు సుమారు 16 శాతం, కృష్ణా జిల్లాలో 8 శాతం, విశాఖపట్నం జిల్లాలో 4 శాతం పడిపోయాయి. -
9న డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయి ఫలితాలు వెల్లడించాక వారి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని వివరించారు. గత మూడేళ్లుగా ఆన్లైన్లో ప్రవేశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ ప్రవేశాల వల్ల హైదరాబాద్‌లోని టాప్ కాలేజీల్లో కూడా అన్ని జిల్లాలకు చెందిన గ్రామీణ విద్యార్థులకు సీట్లు లభించినట్లు తెలిపారు. డిగ్రీలో ప్రవేశాల కోసం మొదట ఈ–సేవా కేంద్రాల ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అయితే గతేడాది నుంచి ఈ–సేవతోపాటు ఆధార్ ఆధారిత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈసారి ఆ రెండు సదుపాయాలతోపాటు అన్ని జిల్లాల్లోని 76 హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు. స్పెషల్ హెల్ప్‌లైన్ కేంద్రాలు: విద్యార్థులు తమ మొబైల్ నంబరు మార్చుకోవడంతోపాటు ఇతర మార్పు లు చేసుకునేందుకు పది పాత జిల్లా కేంద్రాల్లో స్పెషల్ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిగ్రీలో ప్రస్తుతం కొన్ని వర్సిటీల్లో వేర్వేరు గ్రేడ్ పాయింట్లు ఉన్నందున వాటిని మార్పు చేసి, అన్ని వర్సిటీల్లో ఒకే గ్రేడింగ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. అలాగే ఒకే రకమైన మూల్యాంకన విధానాలు, స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా ఒకే రకమైన కోర్, ఎల క్టివ్ పేపర్ల అమలు వంటి చర్యలు చేపడతామన్నారు. -
జియో బ్రాడ్‌బ్యాండ్‌కు రిజిస్ట్రేషన్లు షురూ
న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. సెకనుకు ఒక గిగాబిట్ వేగంతో ఇంటర్నెట్ను అందిస్తామని జియో హామీ ఇస్తోంది. జియోడాట్‌కామ్ వెబ్సైట్, మైజియో యాప్ ద్వారా కనెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ‘జియోగిగాఫైబర్. గిగాబిట్ వైఫై, టీవీ, స్మార్ట్ హోం, ఫ్రీ కాలింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందండి‘ అంటూ మైజియో యాప్‌లో కంపెనీ ప్రకటించింది. టారిఫ్‌ల యుద్ధం... ప్రస్తుతం పోటీ సంస్థలు హోమ్ యూజర్స్‌కి సెకనుకు 100 మెగాబిట్ డౌన్లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తున్నాయి. ఇందుకు చార్జీలు నెలకు సుమారు రూ. 1,000 దాకా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతకు 10 రెట్లు వేగంతో ఇంటర్నెట్ అందిస్తామని జియో చెబుతోంది. చార్జీల గురించి ఇంకా వెల్లడించకపోయినప్పటికీ.. మిగతా కంపెనీలకు గట్టి పోటీనిచ్చే విధంగానే ఉండవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న..పెద్ద సంస్థలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్లు షురూ : ధర, ఆఫర్లు
సంచలనాల రిలయెన్స్ జియో నుంచి మరో సంచలన సర్వీస్‌ను అందిస్తోంది. జియో అభిమానులు ఎంతోకాలంగా వేచి చూస్తున్న జియో గిగా ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ప్రీ-బుకింగ్స్ ప్రారంభయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ జియో నేటి నుంచి ఫైబర్-టూ-ది-హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్ జియో.కామ్‌లలో జియోగిగాఫైబర్ నమోదు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రీవ్యూ ఆఫర్ కింద జియో గిగా ఫైబర్ ఆల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్ను 100 ఎంబీపీఎస్ స్పీడులో 90 రోజుల వరకు ఆఫర్ చేయనుంది. నెలవారీ డేటా కింద 100 జీబీని ఆఫర్ చేస్తోంది. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో హైస్పీడ్ వైఫై కవరేజ్‌తో పాటు కంపెనీకి చెందిన గిగా టీవీ, స్మార్ట్‌హోమ్‌లాంటివి కూడా యాక్టివేట్ అవుతాయి. ప్రస్తుతానికి జియో గిగాఫైబర్‌ను ఇళ్లలో ఉపయోగించే వినియోగదారులకు నెలకు రూ.1000 ప్లాన్‌తో సెకనుకు వంద మెగాబిట్ డౌన్లోడ్ స్పీడ్ అందించనుంది. గృహ వినియోగదారులకు పది రెట్ల వేగంతో ఇంటర్నెట్ అందిస్తామని జియో హామీ ఇచ్చింది. కాగా కంపెనీ ఈ గిగాఫైబర్ ధరను వెల్లడించలేదు. అయితే, గతంలో జియో విడుదలైనప్పుడు టెలికాం సంస్థల మధ్య భారీగా పోటీ ఏర్పడినట్లే ఇప్పుడు కూడా పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు. జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జియో అధికారిక వెబ్సైట్కులాగిన్ అయ్యి గిగాఫైబర్ పేజ్ ఓపెన్ చేయాలి అక్కడున్న చేంజ్ బటన్‌పై ప్రెస్ చేసి అడ్రెస్‌ను సబమిట్ చేయాలి. అనంతరం డిఫాల్ట్ అడ్రెస్ డిస్ ప్లే అవుతుంది. ఇది మీ ఇంటి అడ్రెసా లేక ఆఫీస్ అడ్రెసా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాతి పేజీలో మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీ లొకాలిటీ (సొసైటీ, టౌన్షిప్, డెవలపర్‌లాంటివి) సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.అలాగే మీరు ఇతర ప్రాంతాలను కూడా నామినేట్ చేయొచ్చు. అంటే మీరు పని చేసే చోటు లేదా ఇతర స్నేహితులు, ఇంకా ఎవరిదైనా అడ్రెస్‌పై కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ప్లాన్లను జియో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, అంచనాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా రూ.500, రూ.750, రూ.999, రూ.1299, రూ.1599 గా ఉంచవచ్చని అంచనా. రూ .500 ప్లాన్ : ఇది జియోగిగాఫైబర్లో మొదటి ప్యాకేజి. ఇందులో 50ఎంబీపీఎస్ వేగంతో నెలకు 300జీబీ వరకు అపరిమిత డేటా రూ. 750 ప్లాన్: 50ఎంబీపీఎస్ వేగంతో నెలకు 450 జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ రూ 999ప్లాన్: 100ఎంబీపీఎస్ వేగంతో నెలకు600 జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ రూ 1,299 ప్లాన్: 100ఎంబీపీఎస్ వేగంతో నెలకు750 జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ రూ 1,599 ప్లాన్ 150ఎంబీపీఎస్ వేగంతో నెలకు900 జీబీ వరకు అపరిమిత డేటా. 30 రోజులు వాలిడీటీ కాగా టెలికాం మార్కెట్లో 4జీ సేవల అనంతరం జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నామని గత నెలలో జరిగిన 41వ వార్షిక సాధారణ సమావేశంలో రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఏ నగరం నుంచి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు వస్తాయో అక్కడ నుంచి మొదటగా గిగాఫైబర్ సేవలు అందించనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. ఈ సేవలను మొత్తం 1100 నగరాల్లో ప్రారంభిస్తామని గత నెల రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపిన సంగతి తెలిసిందే. -
మళ్లీ రెచ్చిపోతున్న‘రియల్’ గ్యాంగ్స్
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలో రియల్టీ బిజినెస్ స్పీడ్‌తో పాటు నయా గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఉపయోగంలోకి రాని భూములపై కన్నేస్తూ... డబుల్ రిజిస్ట్రేషన్లకు తెగబడుతున్నాయి. ఇటీవల గ్రేటర్ పరిధిలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో కొందరు గ్యాంగ్స్టర్లు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, చిరుద్యోగులు కొనుగోలు చేసి ఉపయోగంలోకి రాని భూములపై కన్నేశారు. వాటి డబుల్ రిజిస్ట్రేషన్లతో.. డబ్బుల పంటను పండించేస్తున్నారు. ఈ అక్రమ దందాకు పొలిటికల్, పోలీస్, సబ్‌రిజిస్ట్రార్ విభాగాలు పూర్తిగా సహకరిస్తుండటంతో ఎంతో మంది బాధితులు న్యాయం కోసం రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల మెట్లు ఎక్కుతున్నారు. పోలీస్ కమిషనరేట్‌కు వస్తున్న ప్రతి పది ఫిర్యాదుల్లో ఏడు నుంచి ఎనిమిది వరకు ఇలాంటి కేసులే వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి–భువనగిరి, ఎల్బీనగర్, బాలానగర్ డివిజన్ పరిధిలో అత్యధిక భూ సంబంధ వివాదాలు వస్తుండటం అందులో స్థానిక ప్రజాప్రతినిధులు, వారి సమీప బంధువులు, పోలీస్ అధికారుల ప్రమేయంపై ఫిర్యాదులు వస్తుండటం విశేషం. డబుల్ అంటే.. వెరీ స్పీడ్ డబుల్ రిజిస్ట్రేషన్స్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బులు వెదజల్లుతున్నాయి. ఒక మారు తన భూమిని విక్రయించిన వ్యక్తి,.. మరోసారి పాత రికార్డులతో యధేచ్ఛగా విక్రయిస్తున్నాడు. ఇందుకు డాక్యుమెంటు రైటర్లు, సబ్రిజిస్ట్రార్లు సహకరించి డబుల్ రిజిస్ట్రేషన్‌కు పాల్పడుతున్నారు. సంబంధిత ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నదన్న విషయాన్ని తెలుసుకునే వీలు ఉన్నప్పటికీ..టైటిల్ వెరిఫికేషన్ వివరాల్లోకి సబ్రిజిస్ట్రార్లు వెళ్లకుండా లింక్ డాక్యుమెంట్ల ఆధారంగా పని కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి నిషేధిత భూముల(ప్రభుత్వ, వక్ఫ్, భూదాన, దేవాలయ తదితరాలు)ను రిజిష్ట్ర్రేషన్ చేసే విషయంలో ఇటీవలి కాలంలో జాగ్రత్త పడుతున్న సబ్రిజిస్ట్రార్లు. ప్రైవేటు భూముల డబుల్ రిజిస్ట్రేషన్లలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే టైటిల్ వెరిఫికేషన్ తమ పరిధిలోకి రాదని చెబుతూ, ఆన్లైన్లోనే, ఒక మారు రిజిస్టర్ చేసిన భూములను మళ్లీ అదే వ్యక్తులు చేయకుండా నిరోధించే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలా ఐతేనే అక్రమాలకు చెక్ చెప్పే చాన్స్ ఉంటుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ అలజడి గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలతో వణికిపోయిన యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ రియల్ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఈ మారు పొలిటికల్ బాస్‌లు...వారి కనుసన్నల్లో నడిచే కొందరు పోలీస్ అధికారుల చర్యలతో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్‌ను దుబాయ్‌లో స్థిరపడ్డ ఫిలిప్స్ ఆనే ఎన్నారై కలిసి యాదగిరిగుట్టలో అక్కడి రాజకీయనాయకులు–ఒక పోలీస్ అధికారి తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనాన్ని వివరించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. తాను యాదగిరిపల్లిలో సర్వే నెంబర్ 146/ఎఎ/1లో 15.9.2000లో ఆకుల చిననర్సయ్య అనే వ్యక్తి నుండి ఐదెకరాలు భూమిని కొనుగోలు చేశానని, ఈ భూములకు సంబంధించిన మ్యుటేషన్, పాసుబుక్కుల పొందడం చేశానని, అలాగే కబ్జాలోనూ తానే ఉన్నానని వివరించాడు. అయితే అదే చిన నర్సయ్యతో కొందరు మళ్లీ భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు, ఓ పోలీస్ అధికారి అండతో తనను ఆ భూమి అమ్మేయాలని, లేదా సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై సత్వరం స్పందించిన సీపీ మహేష్‌భగవత్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త అక్రమ భూ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఇదే తరహాలో యాదాద్రి –భువనగిరి జిల్లా నుండి భారీఎత్తున రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు ఫిర్యాదులు వస్తుండటం విశేషం. హఫీజ్‌పేటలో భూముల వేట హఫీజ్‌పేట సర్వే నంబర్ 80లోని సుమారు 600 ఎకరాలను నిజాం హయాంనాటి ‘పైగా’ భూములుగా గుర్తించారు. ఈ భూములనూ కబ్జాచేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా ఈ భూములను సర్వే నంబర్ 80(ఎ),80(బి),80(సీ),80(డీ)గా విభజించగా, ఈ భూముల్లో 80(డీ) భూములకు మాత్రమే కోర్టు అనుకూల ఉత్తర్వులు, ఆపై డిక్రీలున్నట్లు రెవెన్యూ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన మూడు సర్వే నెంబర్లకు డిక్రీలు లేవు. ఇందులో 80(ఎ) ఆక్రమణలకు గురికాగా, 80(బీ),80(సీ)ల సంబంధించిన వివాదాలు న్యాయస్థానాలు, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే మియాపూర్ భూ కుంభకోణ సూత్రధారులే 80(డీ) పత్రాలను 80(బి)కి వర్తించేలా ఏర్పాట్లు చేస్తూ వాటిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అందులో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, కొందరు పోలీస్ అధికారులు, ల్యాండ్ మాఫియా గ్యాంగ్స్టర్లకు వాటాలు ఇస్తామంటూ, మిగిలిన భూమిని ఓ బడా కంపెనీకి కట్టబెట్టే ఏర్పాట్లు చేసున్న అంశం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. అయినా ఈ భూములను ఎలాగైనా దక్కించుకునే దిశగా ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తుండడం సైబరాబాద్ పోలీస్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. -
ఇంజనీరింగ్‌లో సీటు రాకపోతే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు రాని విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. వాటిలో కన్వీనర్ కోటా కింద సీటు వస్తుందని చివరి క్షణం వరకు ఎదురుచూసే వేల మంది విద్యార్థులకు ఈసారి డిగ్రీ ఆప్షన్ లేకుండాపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై కళాశాల విద్యా శాఖ, డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ (దోస్త్) ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈనెల 27వ తేదీతో డిగ్రీ మూడో దశ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి దోస్త్ సీట్లను కేటాయించనుంది. జూలై 5వ తేదీ నుంచి 7 వరకు కాలేజీ స్థాయిలో ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం కల్పించి ప్రవేశాలను ముగించాలని ఇదివరకే నిర్ణయించింది. 10వ తేదీన సీట్లు కేటాయించేలా షెడ్యూలు జారీ చేసింది. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో సీట్లు లభించని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తొలి దశ ప్రవేశాలే పూర్తి.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటి దశ ప్రవేశాలు మాత్రమే పూర్తయ్యాయి. కన్వీనర్ కోటాలో 64,646 సీట్లు అందుబాటులో ఉండగా, 52,621 మందికి ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించింది. అందులో 38,705 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మరో 13,916 మంది చేయలేదు. వారంతా రెండో దశ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారే కాకుండా మరో 20 వేల మంది వరకు రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వారి కోసం ఎంసెట్ ప్రవేశాల కమిటీ జూలై 6వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు షెడ్యూలు జారీ చేసింది. 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది. వారందరికీ 12వ తేదీన సీట్లను కేటాయించి, కాలేజీల్లో చేరేందుకు 15వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. మూడో దశ ప్రకటనేదీ? ఈసారి ఇంజనీరింగ్ మూడో దశ ప్రవేశాల కౌన్సెలింగ్ కూడా నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రెండో దశ పూర్తయ్యాక మూడో దశ ప్రవేశాల ప్రకటన జారీ చేయనుంది. జూలై 25వ తేదీ వరకు ఆ ప్రక్రియను చేపట్టనుంది. మరోవైపు ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి కోర్సుల్లోనూ బైపీసీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. వాటికి ఇంకా షెడ్యూలు కూడా జారీ కాలేదు. ఈనెలాఖరు లేదా జూలైలో వాటి షెడ్యూలు ఇస్తే ఆ ప్రవేశాలు జూలై చివరి వరకు కొనసాగనున్నాయి. వేల మంది విద్యార్థులు ఆయా కౌన్సెలింగ్‌లలో పాల్గొననున్నారు. అందులో పాల్గొనే అందరికి సీట్లు రావు. వాటిలో సీట్లు లభించని వారు చివరి ఆప్షన్‌గా ఉన్న డిగ్రీ కోర్సుల్లోనే చేరతారు. కానీ దోస్త్ ఈనెల 27వ తేదీ వరకే చివరి దశ ప్రవేశాల రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టింది. సీట్లు రాని విద్యార్థుల పరిస్థితి ఏంటన్న అంశాన్ని ఇటు కళాశాల విద్యా శాఖ గానీ, అటు దోస్త్‌గానీ పట్టించుకోవడంలేదు. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రవేశాల తర్వాత మిగిలిపోయే విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశం లేకపోతే అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరుకు మరో విడత డిగ్రీ ప్రవేశాలకు అవకాశం కల్పించాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి. -
సొంత బండి దండగ
ఉద్యాననగరిలో సొంత వాహనం తప్పనిసరి. ఇంట్లో రెండు మూడు వాహనాలకు తక్కువ ఉండవు. ఎక్కడికి వెళ్లాలన్నా వాటి మీదే. అయితే నగర సమస్యలు సొంత వాహనం పెద్ద భారమనే విధంగా చేస్తున్నాయి. గత రెండేళ్ల వాహన రిజిస్ట్రేషన్లు దీనినే స్పష్టంచేస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో వాహనాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ 20 శాతం తగ్గిపోయిందని రవాణా శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 7.20 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, 2017–18లో ఈ సంఖ్య 5.69 లక్షలకు పడిపోవడం గమనార్హం. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడం, భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు, పార్కింగ్ లేమి, మెట్రోరైలు మార్గం విస్తరణ, అందుబాటులో క్యాబ్ సేవలు ఉండడం తదితర కారణాలతో వాహనాల కొనుగోలుపై నగరవాసుల్లో అనాసక్తి నెలకొంది. ట్రాఫిక్ రద్దీతో సతమతం పెరుగుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయి కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. రద్దీ సమయాల్లో వాహనాల సగటు వేగం 10 కిలోమీటర్లకు పడిపోతోంది. దీంతో వాహనాల నుంచి పొగ విపరీతంగా వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ సమస్యల వల్ల నగరవాసులు సిటీ బస్సులు, మెట్రో, క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆదుకుంటున్న క్యాబ్‌లు క్యాబ్స్ సేవలు విస్తరించడం, వాటి చార్జీలు కూడా దిగిరావడంతో నగరవాసులు వాటిలో ప్రయాణం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 2013–14లో 66,264 ట్యాక్సీలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1.57 లక్షలు. ఓలా, ఉబెర్ వంటి పలు సంస్థలకు చెందిన ట్యాక్సీలు ఉండడం గమనార్హం. అలాగే ఇటీవల ఆశాకాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నగరంలో పార్కింగ్ చేసేందుకు సరైన స్థలం లేకపోవడం కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీబీఎంపీతో పాటు బీడీఏ నగరంలో పార్కింగ్ స్థలలాను ఏర్పరచడంలో పూర్తిగా విఫలమయింది. గతేడాది జీఎస్టీ కూడా అమ్మకాలకు బ్రేక్ వేసిందని చాలామంది డీలర్లు చెబుతున్నారు. రోజుకు 1600 వాహనాల నమోదు వాహన విక్రయాల సగటు వార్షిక వృద్ధి రేటు 10 శాతంగా ఉంది. కానీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం అధికంగా వాహనాల కొనుగోలు జరిగింది. దేవనహళ్లి ఆర్టీవో కార్యాలయం బెంగళూరు పట్టణ విభాగానికి మారడంతో వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగింది. సగటున ప్రతి రోజు దాదాపు 1,600 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఇందులో 1,100 వరకు ద్విచక్రవాహనాలు ఉండగా, మరో 300 వరకు కార్లు. ఈ సంఖ్య ఇదేవిధంగా కొనసాగితే 2022లోగా నగరంలో వాహనాల సంఖ్య 1.08 కోట్లకు చేరుకుంటుంది. మెట్రో సౌకర్యం నగరంలో మెట్రో విస్తరణ వల్ల ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. 42 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ వల్ల రోజుకి 3.40 లక్షల మంది ప్రజలు సగటున ప్రయాణిస్తున్నారు. 2011లో ఒక రోజుకి 28,007 మంది సగటు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3.40 లక్షలకు చేరుకుంది. ఈ కారణాలన్నింటి వల్ల కొత్తగా వాహనాల కొనుగోలుపై నగరవాసులు అనాసక్తి కనపరిచి, ఇతర ప్రయాణ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. -
19 నుంచి ‘తహశీల్’ రిజిస్ట్రేషన్లు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 21 మండలాల్లో రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 19 నుంచి ఆయా మండలాల్లో తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వహిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలను అప్పగించేందుకు 1908 రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం కొత్తగా 21 సబ్‌జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే, గతంలో ఉన్న సబ్‌జిల్లాల్లో పలు మండలాలుండేవి. కానీ, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌జిల్లాలను కేవలం ఒక్క మండలానికే పరిమితం చేశారు. సోయా విత్తనాలకు మరో రూ.400! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోయాబీన్ విత్తనాల కోసం చెల్లించే ధరను మరో రూ.400 పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది సర్కారు ధర ఖరారు చేసినా.. మరింతగా పెంచాలన్న విత్తన వ్యాపారుల ఒత్తిడికి వ్యవసాయ శాఖ తలొగ్గింది. ఈ మేరకు సర్కారుకు పెంపు ప్రతిపాదనలు పంపింది. గతేడాది క్వింటాల్ సోయాబీన్ విత్తన ధర రూ.5,475 కాగా.. ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.5,800గా ఖరారు చేసింది. అయితే సోయా విత్తన వ్యాపారులు ఒత్తిడితో రూ.6,200కు పెంచేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైందని అధికారవర్గాలు తెలిపాయి. -
ఏప్రిల్ @ రూ.500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. నెలకు లక్షల సంఖ్యలో జరుగుతున్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. జనవరి మినహా గత ఐదు నెలల్లో రూ.400 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం రాగా, ఏప్రిల్‌లో మాత్రం రికార్డు ఆదాయం రానుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇంకా నాలుగు రోజుల కార్యకలాపాలు మిగిలి ఉండగానే రూ.436 కోట్ల రాబడి సమకూరింది. దీంతో ఏప్రిల్ ఆదాయం ఏకంగా రూ.500 కోట్లు దాటి రిజిస్ట్రేషన్ల శాఖ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగేళ్లు.. రూ.13 వేల కోట్లు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యేటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూనే వస్తోంది. ఈ నాలుగేళ్లలో రూ.13 వేల కోట్ల వరకు ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ లావాదేవీలు గణనీయంగా పుంజుకున్నాయి. డిసెంబర్లో తొలిసారిగా ఆదాయం రూ.400 కోట్లు దాటింది. ఆ తర్వాతి నెలలో రూ.367 కోట్లకు తగ్గినా, ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రూ.453 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇదే రికార్డు స్థాయి రాబడి కావడం గమనార్హం. మార్చిలో స్వల్ప తగ్గుదలతో రూ.441 కోట్లు వచ్చింది. ఏప్రిల్‌లో మాత్రం ఊహించని రీతిలో రూ.500 కోట్లు దాటే పరిస్థితి కనిపిస్తోంది. లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు.. ఈనెల 25వ తేదీ వరకు రూ.436.4 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.409.277 కోట్లు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటికే లక్షకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగడం ఉన్నతాధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. బుధవారం నాటికి 1,03,231 లావాదేవీలు జరిగాయని, ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఒక్క రోజే రూ.23.2 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు పని దినాలు మిగిలి ఉన్న నేపథ్యంలో రూ.500 కోట్ల మార్కుకు చేరుకుంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. -
రియల్ బూమ్.. జూమ్.!
సాక్షి, హైదరాబాద్: రూ. 2.23 లక్షల కోట్లు.. అక్షరాలా రెండు లక్షల ఇరవైమూడు వేల కోట్లు.. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నమోదైన రిజిస్ట్రేషన్ లావాదేవీల విలువ ఇది.. వీటితో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.13,380 కోట్లు. రాష్ట్ర విభజన జరిగితే రియల్ బూమ్ తగ్గిపోతుందన్న అంచనాలను పటాపంచలు చేస్తూ... తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతూనే ఉంది. విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 2,531.05 కోట్లుకాగా.. 2017–18 నాటికి 67% పెరిగిపోయి.. రూ.4,222 కోట్లకు చేరింది. ప్రభుత్వం స్థిరాస్తుల మార్కెట్ విలువను పెంచకపోయినా కూడా రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ బూమ్తోపాటు శాఖాపరంగా చేపట్టిన సాంకేతిక సంస్కరణలు, పెద్ద నోట్ల రద్దు, బ్యాంకుల ఇబ్బందుల కారణంగా జనం భూములు, స్థలాల కొనుగోలు వైపు చూడటం వంటివి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కారణంగా చెబుతున్నారు. తొలి ఏడాదిలో మందకొడిగా.. రాష్ట్ర విభజనకు ముందు రెండేళ్లు, తర్వాతి రెండేళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,589.62 కోట్లుగా నమోదైంది. అయితే విభజన సమయంలో అనిశ్చితి కారణంగా.. విభజన జరిగిన ఏడాది ఆదాయం కొంత తగ్గింది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఏడాది కన్నా రూ.57 కోట్లు తక్కువ ఆదాయం వచ్చింది. ముఖ్యంగా విభజన జరిగిన 2014 జూన్‌లో అత్యల్పంగా రూ.180 కోట్లే వచ్చాయి. దాంతో రాష్ట్రం విడిపోతే రియల్ బూమ్ తగ్గిపోతుందన్న అపోహలు, ఆదాయం తగ్గిపోతుందన్న అంచనాలు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల్లనూ వ్యక్తమయ్యాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుని.. ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా రూ.453 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం సమకూర్చే స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇదే ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం. 2014–15 మొదలు 2017–18 వరకు ఏటా రిజిస్ట్రేషన్ లావాదేవీలు, ఆదాయం పెరుగుతూనే వచ్చాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014–15తో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం ఏకంగా 67 శాతం పెరిగి రూ.4,222 కోట్లకు చేరింది. సర్వర్లు, నెట్వర్క్ మెరుగుపర్చుకోవడంతోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు.. రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు చేయడంతో ఆదాయంలో గణనీయంగా వృద్ధి కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌తో కలసి ఉన్న నెట్వర్క్ నుంచి విడిపోయి తెలంగాణకు స్వతంత్ర నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, సర్వర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం సత్ఫలితాలనిచ్చింది. సర్వర్ అప్‌గ్రెడేషన్‌కు ముందు నెలకు నాలుగైదు రోజులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు సంబంధించి సాంకేతిక అవాంతరాలు ఎదురయ్యేవి. సర్వర్‌ను ఆధునీకరించాక వేగంగా లావాదేవీలు జరగడం, సాంకేతిక సమస్యలు ఎదురవకపోవడంతో.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. దీంతో గత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. 2016 డిసెంబర్లో రూ.223 కోట్ల ఆదాయం వస్తే.. 2017 డిసెంబర్లో 79.03 శాతం ఎక్కువగా 400.46 కోట్లు ఆదాయం వచ్చింది. 2017 జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే.. 2018 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుసగా 109.60 శాతం, 105.22 శాతం ఆదాయం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. నోట్ల రద్దుతో భూముల వైపు..! పెద్ద నోట్ల రద్దు అనంతరం జనం బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి భయపడుతున్నారు. ఐటీ అధికారులు వివరణ కోరుతారని.. నోటీసులు, విచారణల వంటి తలనొప్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకుల్లో కుంభకోణాలు పెరిగిపోవటం కూడ ఆందోళనకరంగా మారింది. దీంతో బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయడానికి బదులుగా.. స్థలాలు, భూముల కొనుగోలుపై దృష్టిసారిస్తున్నారు. దీంతో పెద్ద నోట్ల రద్దు తరువాతి నుంచి.. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడం గమనార్హం. ఇక కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా చోట్ల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. దీంతో జిల్లాల్లోనూ రియల్ఎస్టేట్పై పెట్టుబడులు భారీగా పెరిగాయి. -
‘రిజిస్ట్రేషన్ సమస్యలా వాట్సాప్ చేయండి’
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ జాయింట్ ఐజీ వేముల శ్రీనివాసులు తెలిపారు. దీనిలో భాగంగా వాట్సాప్‌తో సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. డాక్యుమెంట్లు, వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ఏ సమస్యలు వచ్చినా.. నేరుగా సబ్ రిజిస్ట్రార్‌కు విషయాన్ని వివరించాలన్నారు. అయినా సమస్య పరిష్కారం కాని పక్షంలో 7093920206కు వాట్సాప్ ద్వారా సమస్యను తెలియజేయాలన్నారు. 24 గంటల్లో స్పందన రాకుంటే.. స్పందన రాలేదని మళ్లీ అదే నంబరుకు వాట్సాప్ చేసే అధికారం వినియోగదారులకు ఉంటుందని తెలిపారు. -
రిజిస్ట్రేషన్ చేయించకపోతే వాహనం సీజ్
అనంతపురం సెంట్రల్: శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించని వాహనాలను త్వరలోనే సీజ్ చేయనున్నట్లు ఉప రవాణా కమిషనర్ సుందర్‌వద్దీ హెచ్చరించారు. గురువారం ఆయన రవాణాశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24,593 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు సీఎఫ్‌ఎస్‌టి సైట్ మూసివేయనున్నామనీ, దీంతో ఆ వాహనాలకు భవిష్యత్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదన్నారు. అందువల్ల ఇంకా వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించని వారంతా ఏప్రిల్ 5లోపు చేయించాలన్నారు. లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీధర్, వివిధ షోరూంల డీలర్లు పాల్గొన్నారు.