నర్సింగ్ రిజిస్ట్రేషన్లకు బ్రేక్ | Break to Registered nursing | Sakshi
Sakshi News home page

నర్సింగ్ రిజిస్ట్రేషన్లకు బ్రేక్

Published Sun, Mar 22 2015 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

నర్సింగ్ రిజిస్ట్రేషన్లకు బ్రేక్

నర్సింగ్ రిజిస్ట్రేషన్లకు బ్రేక్

తెలంగాణ ఎంపీహెచ్‌డబ్ల్యూలకు ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో అడ్డంకులు
{పభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులుగా మిగులుతున్న వైనం లబోదిబోమంటోన్న ఐదు వేల మంది విద్యార్థులు

 
హైదరాబాద్: తెలంగాణలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కో ర్సుచేసిన నర్సింగ్ విద్యార్థుల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ (ఏపీఎన్‌సీ)లో సాంకేతికపరమైన అడ్డంకులు ఏర్పడటం తో ఈ పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్సు పూర్తిచేసిన ఎంపీహెచ్‌డబ్ల్యూ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా చేరడానికి, ఏఎన్‌ఎంలుగా పనిచేయడానికి అవకాశం లేకుండా పోతోంది. రెండేళ్లు కష్టపడి చదివాక ఈ దుస్థితి ఏర్పడడంతో వారంతా లబోదిబోమంటున్నారు.
 పోస్టుల భర్తీ ఉన్నా: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద పెద్దఎత్తున ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ పోస్టుల్లో దాదాపు 80 శాతం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తిచేసిన వారితో భర్తీ చేయనుంది.

కానీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో దాదాపు 5వేల మంది ఎంపీహెచ్‌డబ్ల్యూలు అర్హత కోల్పోయే ప్రమాదముం ది. అంతేగాక ఎవరైనా వేరే దేశాలకు వెళ్లాల్సి ఉన్నా రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో ఇబ్బం దులు పడే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వానికి విన్నవిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలంగాణ నర్సింగ్, పారామెడికల్ సంఘం నాయకులు గోవర్ధన్, నగేశ్ తదితరులు పేర్కొంటున్నారు. ఈ విషయమై తెలంగాణ ఆ రోగ్య, సంక్షేమశాఖ కమిషనర్ జ్యోతిబుద్దప్రకాశ్‌ను కలసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
 
టీ లోగోతో సర్టిఫికెట్ ఇవ్వడం వల్లే
 
తెలంగాణలో సుమారు 150 ఎంపీహెచ్‌డబ్ల్యూ కాలేజీలు ఉండగా అందులో ఏడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆస్పత్రుల్లో నర్సులుగా, ఏఎన్‌ఎంలుగా పనిచేయడానికి ఈ విద్యార్హత తప్పనిసరి. ఈ కోర్సులో చేరడానికి కనీస విద్యార్హత పదో తరగతి. దీంతో గ్రామాల్లోని పేద విద్యార్థులు సత్వర ఉపాధి కోసం ఈ కోర్సులను ఎంచుకుంటుంటారు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్‌లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన దాదాపు 5 వేల మంది విద్యార్థులు ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి పరీక్షలు రాశారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. విభజన తర్వాత తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నర్సింగ్ పరీక్ష బోర్డు ఏర్పాటు చేసి ఈ కోర్సు పూర్తి చేసిన వారందరికీ సర్టిఫికెట్లు జారీచేసింది. అయితే వైద్యరంగంలో డాక్టర్లు ప్రాక్టీసు చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలన్నా మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఎలాగో నర్సింగ్ కోర్సు చేసిన వారు కూడా తప్పనిసరిగా నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకుంటే వారెక్కడా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేయడానికికానీ వీలుండదు. తెలంగాణ ఏర్పడ్డాక ఏపీఎన్‌సీ విడిపోకపోవడం... తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడకపోవడంతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీఎన్‌సీనే రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ తెలంగాణ లోగోతో సర్టిఫికెట్లు ఉన్నందున తాము రిజిస్ట్రేషన్లు చేయబోమని ఏపీఎన్‌సీ చేతులెత్తేస్తోంది. దీంతో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 
రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపీహెచ్‌డబ్ల్యూలకు సర్టిఫికెట్లు జారీచేసింది. అవన్నీ తెలంగాణ లోగోతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యంకాదు.
 - రోజారాణి, రిజిస్ట్రార్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement