
జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న డీఐజీ నాగలక్ష్మి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రిజిస్ట్రేషన్లు చేసిన సమయంలో ఒకటికి రెండు సార్లు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వ్యవసాయ భూములా, ప్రభుత్వ భూములా, దేవాదాయ భూములా అనేది చూసుకోవాలని, భవిష్యత్తులో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా సహించేది లేదని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్, విజయనగరం అధికారి కె.నాగలక్ష్మి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాలు, స్టాంప్, చిట్‌లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ ప త్రాలు పెండింగ్‌లో ఉండటంపై సిబ్బందిపై మండిపడ్డారు.
ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ క్ర యవిక్రయదారులను ఇబ్బంది పె ట్టకూడకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిపై సబ్‌రిజిస్ట్రార్ స్పందిస్తూ మూడు రోజు లుగా ఆన్‌లైన్ సమస్యతో పాటు విద్యుత్ అంతరాయం ఉండటం వ ల్లే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పా రు. ప్రత్యామ్నాయాలు చూ సుకుని పనిపూర్తి చేయాలే తప్ప పెండింగ్‌లో ఉంచకూడదని డీఐజీ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లలో ఎటువంటి అవతవకలు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా నుంచి ఈ ఏడాది 7 ఫిర్యాదులు రాగా, అందులో ఐదింటిని పరిష్కరించామన్నారు.
లక్ష్యాలకు మించిన ఆదాయం..
2017–2018 సంవత్సరానికి గాను శ్రీకాకుళం జిల్లాకు రూ.92.53 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించామని డీఐజీ తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి 45,574 డాక్యుమెంట్లకుగాను రూ.103 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అదనంగా 20.66 శాతం ఆదాయం సమకూరిందని చెప్పారు. ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యాలను పారదర్శకంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment