సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. గురువారం రెండో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక ఈ లాక్‌డౌన్ పది రోజుల పాటు(మే 21) వరకు కొనసాగుంది. తాజాగా తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు అమల్లోకి రానుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. అదే విధంగా అన్ని కోవిడ్ జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ 50 మంది సిబ్బందితో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.
ఇక తెలంగాణలో లాక్‌డౌన్ దృష్ట్యా వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులకు బ్రేక్ పడింది. ముందస్తుగా రవాణా శాఖ పలు స్లాట్లను వాయిదా వేసింది. తెలంగాణలో ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్ల సేవలు నిలిపివేయనున్నారు.
చదవండి: తెలంగాణ: లాక్‌డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే
Comments
Please login to add a commentAdd a comment