Bank services
-
బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదు.. బీసీజీ నివేదిక
గ్లోబల్ బ్యాంకులతో పోలిస్తే భారతీయ బ్యాంకులు ఐటీ సర్వీసులకు తక్కువ ఖర్చు చేస్తున్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకులు సాధారణంగా తమ ఆదాయంలో 7-9% వరకు ఐటీ ఖర్చులు చేస్తుండగా, భారతీయ బ్యాంకులు 5 శాతమే కేటాయిస్తున్నాయని నివేదిక పేర్కొంది.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘ది పోస్టర్ చైల్డ్’ నివేదికలో వివరాల ప్రకారం..2026 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు, రుణాలు మొత్తం 75 శాతం డిజిటల్ రూపంలో జరుగుతాయి. థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 25% కొత్త డిజిటల్ ఖాతాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం బ్యాంకులకు సమకూరే మొత్తం ఆదాయంలో ‘చేంజ్ ది బ్యాంక్ (సీటీబీ)’తో పోలిస్తే దాదాపు 80% ఐటీ బడ్జెట్ ‘రన్ ది బ్యాంక్ (ఆర్టీబీ)’ కోసం ఖర్చు చేస్తున్నారు. భారతీయ బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ఐటీ కేటాయింపులు తగ్గుతున్నాయి. గ్లోబల్ బ్యాంకులు మాత్రం బ్యాంకింగ్ ఐటీ సేవల అప్డేట్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.సుమారు 10 బిలియన్ డాలర్ల(రూ.83 వేలకోట్లు) కంటే ఎక్కువ నికర ఆదాయాన్ని ఆర్జించే గ్లోబల్ బ్యాంక్‌లు 9.1% ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. అదే భారతీయ బ్యాంకులు వాటి ఆదాయంలో కేవలం 3.2% మాత్రమే ఇందుకు కేటాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8 వేలకోట్లు) నుంచి రూ.83 వేలకోట్లు మధ్య నికర ఆదాయాన్ని సంపాదించే బ్యాంకులు సరాసరి 7.2 శాతం ఐటీ బడ్జెట్‌కు ఖర్చు చేస్తున్నాయి. భారతీయ బ్యాంక్‌ల్లో ఈ వాటా 3 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టాటా స్టీల్..2,800 ఉద్యోగాల కోత2022, 2023లో ఆర్బీఐ అంబుడ్స్‌మన్ పరిధిలో 40,000 కంటే ఎక్కువ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలంటే మరింత సమర్థమైన ఐటీ సేవలందించాలి. దాంతో ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఏటా యూపీఐ, నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయి. కొవిడ్ తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. మార్కెట్లో కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవాలంటే బ్యాంకులు అవి అందించే ఐటీ సర్వీసులను అప్డేట్ చేసుకోవాలని నివేదిక సూచిస్తుంది. -
బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!
దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ఈమేరకు దాడి జరిగిన సర్వర్‌ను డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఆర్బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.ఎన్పీసీఐ విడుదల చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం..సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ అనే ముంబయికి చెందిన సంస్థ ప్రాంతీయ, కోఆపరేటివ్, గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలందిస్తోంది. ఈ కంపెనీ టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు రోజుల కిందట ఈ సంస్థ సర్వీసులపై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. తదుపరి చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకుండా వెంటనే గుర్తించి రిటైల్ పేమెంట్ సిస్టమ్‌తో డిస్కనెక్ట్ చేశారు. దాంతో కొంతమంది వినియోగదారులు చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీ-ఎడ్జ్ టెక్నాలజీ అందిస్తున్న సర్వర్‌తో అనుసంధానం చేసిన యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్పీసీఐ చెల్లింపులు సేవలను కొంత సమయంపాటు యాక్సెస్ చేయలేరు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!Regarding interruption in retail payments pic.twitter.com/Ve32ac7WpQ— NPCI (@NPCI_NPCI) July 31, 2024 -
హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ ఉందా?.. 13న ఈ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఈనెల 13న (జులై 13) సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతోంది. ఈ కారణంగా ఆ రోజు పలు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఉదయం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుంది.హెచ్డీఎఫ్సీ అప్డేట్ అనేది సుమారు 13:30 గంటలు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. అవసరమైన కార్యకలాపాలను 12వ తేదీనే చేసుకుంటే మంచిది. ఎందుకంటే 13వ తేదీ అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం.జులై 13న అందుబాటులో ఉండే సేవలు👉యూపీఐ సేవలను ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు. 👉ఏటీఎమ్ సర్వీసును ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు.👉నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో అందుబాటులో ఉంటాయి.👉ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ బదిలీలు, బ్రాంచ్ బదిలీలతో సహా అన్ని ఫండ్ బదిలీ అందుబాటులో ఉండవు. -
ఈ బ్యాంకింగ్ సేవలు ఫ్రీ కాదండోయ్.. లిమిట్ దాటితే బాదుడే!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతీ ఒకరికి ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇటీవల కాలంలో బ్యాంక్ సంస్థలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే నగదు లావాదేవీల ఎస్ఎంఎస్(SMS), ఐఎంపీఎస్(IMPS) ఫండ్ బదిలీ, చెక్ క్లియరెన్స్ , ఏటీఎం విత్డ్రాల్ ఇలా ఏ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. అన్ని సేవలకు, బ్యాంక్ నిబంధనల అనుసరించి తమ కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది తెలియక మన జేబులో పైసలు చార్జీల రూపంలో బ్యాంక్‌లకు కడుతున్నాం. ఓసారి ఆ సేవల గురించి తెలసుకుందాం. నగదు లావాదేవీ బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నగదు లావాదేవీలు చేయడం సహజం. అయితే ఈ లావాదేవీని నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. మీరు నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే, దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ ప్రతి బ్యాంకుకు దాని నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులో 20 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ను నిర్దిష్ట పరిమితి వరకు నిర్వహించాలి. మీ ఖాతాలో అంత కంటే తక్కువ మొత్తం ఉన్నట్లయితే, కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఛార్జ్ చెల్లించాలి. అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్, దానిని నిర్వహించనందుకు ఛార్జీల పరిమితి భిన్నంగా ఉంటాయి. ఐఎంపీఎస్ ఛార్జీలు అన్ని బ్యాంకులు నెఫ్ట్( NEFT), ఆర్టీజీఎస్( RTGS) లావాదేవీలను కస్టమర్లకు ఉచితంగా అందిస్తాయి. అయితే చాలా బ్యాంకులు ఇప్పటికీ ఐఎంపీఎస్( IMPS ) లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీ రూ.1 నుంచి రూ.25 వరకు ఉంటుంది. లక్ష వరకు ఓకే మీ చెక్కు రూ. 1 లక్ష వరకు ఉంటే, మీరు బ్యాంకుకు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే క్లియరెన్స్ ఛార్జీని చెల్లించాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ పరిమితి సంఖ్య వరకు ఉచితంగా ఇస్తారు. అంతకు మించి చెక్కుల కావాలంటే వాటికోసం మీరు ధర చెల్లించాలి. ఏటీఎం లావాదేవీ ఏటీఎం (ATM) నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది. పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువ లావాదేవీల జరిపితే అప్పటి నుంచి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాంకు వసూలు చేసే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఇందుకు చాలా బ్యాంకులు రూ.20-50 వరకు వసూలు చేస్తున్నాయి. ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ కాదండోయ్ మీ ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినప్పుడు లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ పంపుతుంది. దీనికి బ్యాంకులు కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. డెబిట్ కార్డు పోతే.. పైసలే మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీరు మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ఛార్జీలను నిర్దేశించింది. చదవండి: టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా -
ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి!
SBI Whatsapp Banking Services: ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్‌కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కస్టమర్లు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఏటీఎం సెంటర్‌కు వెళ్లే అవసరం కూడా లేదని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. యువర్ బ్యాంక్ ఈజ్ నౌ ఆన్ వాట్సాప్. బ్యాంక్ బ్యాలెన్స్, మినిస్టేట్మెంట్ వాట్సాప్‌లో పొందండి అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. అంతేకాదు వాట్సాప్‌లో ఎస్బీఐ సేవలు పొందాలనుకుంటే కస్టమర్లు ఇంగ్లీష్‌లో 'హాయ్' అని టైప్ చేసి 9022690226 నెంబర్‌కు మెసేజ్ చేయాలని తెలిపింది. Your bank is now on WhatsApp. Get to know your Account Balance and view Mini Statement on the go.#WhatsAppBanking #SBI #WhatsApp #AmritMahotsav #BhimSBIPay pic.twitter.com/5lVlK68GoP — State Bank of India (@TheOfficialSBI) July 19, 2022 వాట్సాప్‌లో ఎస్బీఐ సేవలు స్టెప్1: ముందుగా మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్‌కు యాడ్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఎస్బీఐ సేవలు వాట్సాప్‌లో పొందాలంటే.. అందుకు మీరు కొన్ని పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంక్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 917208933148కు WAREG(కేపిటల్ లెటర్స్) అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ ఎస్ఎంఎస్ చేయండి. స్టెప్ 2: మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 919022690226 నంబర్‌పై 'హాయ్' SBI అని టైప్ చేయండి లేదా "ప్రియమైన కస్టమర్, మీరు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం విజయవంతంగా నమోదు చేసుకున్నారు" అని వాట్సాప్‌లో మీకు వచ్చిన మెసేజ్‌కు రిప్లయి ఇవ్వండి. స్టెప్ 3: మీరు వాట్సాప్ పైన పేర్కొన్న నెంబర్‌కు రిప్లయి ఇస్తే ఇలా మెసేజ్ వస్తుంది. ప్రియమైన వినియోగదారులారా,ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం! 1. బ్యాంక్ బ్యాలెన్స్ 2. మినీ స్టేట్మెంట్ 3. వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేసుకోండి స్టెప్ 4: మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి లేదా మీ చివరి ఐదు ట్రాన్సాక్షన్లకు సంబంధించిన స్టేట్మెంట్(మినీ) పొందడానికి 1 లేదా 2 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేయాలనుకుంటే..మీరు 3 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. స్టెప్5: మీరు పైన పేర్కొన్నట్లుగా సెలక్ట్ చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ పొందవచ్చు. మిగిలిన సంబంధ వివరాలు కావాలనుకుంటే టైప్ చేసి అడగొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌కు సైతం ఎస్బీఐ ఈ వాట్సాప్ సేవల్ని తన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది. వాట్సాప్ కనెక్ట్ పేరుతో క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అకౌంట్ డీటెయిల్స్,రివార్డ్ పాయింట్లు, బ్యాలెన్స్, కార్డ్ చెల్లింపులతో పాటు పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. -
బ్యాంక్‌పై కోపం.. ‘నగరంపై మరో ఉగ్ర దాడి’ అంటూ
సాక్షి, హైదరాబాద్: ఓ బ్యాంకు సేవలు నచ్చకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమో, ఖాతాను మరో బ్యాంకులోకి మార్చుకోవడమో చేస్తాం. నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం సహనం కోల్పోయి బెదిరింపులకు దిగాడు. ముంబైలోని ఆ బ్యాంక్ కాల్ సెంటర్‌కు ‘నగరంపై మరో ఉగ్ర దాడి జరగనుంది’ అంటూ ఈ–మెయిల్ పంపాడు. ఫలితం సైబర్ టెర్రరిజం ఆరోపణలపై కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. వివరాలిలా ఉన్నాయి... నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఓ జాతీయ బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉంది. పెన్షన్ నిబంధనల ప్రకారం ఈ ఖాతా వివరాలను ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. జాప్యం కావడంతో కొన్నాళ్లుగా సదరు రిటైర్డ్ ఉద్యోగికి పెన్షన్ అందట్లేదు. దీంతో ఆయన దీనిపై ఆ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండిపోవడంతో పలుమార్లు ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో (బీకేసీ) ఉన్న బ్యాంక్ కాల్ సెంటర్‌కు ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయిన నగరవాసి ఆవేశపడ్డారు. బ్యాంకు కస్టమర్ కేర్ ఈ–మెయిల్ ఐడీకి మరో మెయిల్ పంపారు. ఈ కాల్ సెంటర్ ముంబైలోని బీకేసీ కాంప్లెక్స్‌లో ఉందని తెలిసిన ఆయన తన ఈ–మెయిల్లో అతి త్వరలోనే అక్కడ ఉగ్రదాడి జరుగనుందని, దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అదే మెయిల్లో తన బ్యాంకు ఖాతా నెంబర్, వివరాలను పొందుపరిచారు. దీన్ని చూసి కంగుతిన్న కాల్ సెంటర్ ఉద్యోగులు విషయాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బ్యాంకు అధికారులు దీనిపై ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు నగరవాసిపై ఐపీసీలోని 506, 507లతో పాటు ఐటీ యాక్ట్‌లో సైబర్ టెర్రరిజానికి సంబంధించిన 66 ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలను బట్టి బాధ్యుడు హైదరాబాద్ వాసిగా తేల్చారు. బెదిరింపు ఈ–మెయిల్ వచి్చన ఐపీ అడ్రస్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. అతడి వివరాలు గోప్యంగా.. నిందితుడిని అరెస్టు చేయడానికి ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం త్వరలో హైదరాబాద్‌కు రానుంది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారిని సాక్షి బుధవారం ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి పేరు, వివరాలతోపాటు బ్యాంక్ అధికారుల కోరిక మేరకు ఆ వివరాలు బయటకు చెప్పలేమని అన్నారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, సేవల్లో లోపంపై స్పందించాల్సిన తీరు ఇది కాదని వ్యాఖ్యానించారు. -
నయా బ్యాం‘కింగ్’.. బ్యాంకు సేవలన్నీ డిజిటల్‌గానే..
ఆధునిక, డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ పాత్ర చెప్పలేనంత పెద్దది. అది ఫోన్‌బ్యాంకింగ్ కావొచ్చు.. నెట్ బ్యాంకింగ్ కావచ్చు. డీమోనిటైజేషన్ తర్వాత నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కరోనా వచ్చి డిజిటల్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతో నేడు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా సంప్రదాయ బ్యాంకులకు.. నియో బ్యాంకులకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకుం డా పోయింది. ఈ పరిణామాలు నియో బ్యాంకుల విస్తరణకు అవకాశాలను విస్తృతం చేసిందని చెప్పుకోవాలి. నేటి యవతరానికి బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద ‘క్యూ’లను చూస్తే చిరాకు. లెక్కలేనన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా వారికి నచ్చదు. సమయం వృథాకాకుండా.. ఉన్న చోట నుంచే బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వారికి నచ్చింది. పెద్దవయసులోని వారు సైతం డిజిటల్ బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసుకుంటూ ఉండడం కొత్త ధోరణికి అద్దం పడుతోంది. కొంచెం ప్రత్యేకంగా.. నియో బ్యాంకులకు ప్రత్యేకమైన నిర్వచనం ఏదీ లేదు. భౌతికంగా ఎటువంటి శాఖలను కలిగి ఉండవు. ఇప్పటికే విస్తరించి ఉన్న సంప్రదాయ బ్యాంకులతో (లైసెన్స్ కలిగిన) ఇవి భాగస్వామ్యం కుదుర్చుకుని.. బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. బ్యాంకు సేవలను వినియోగదారులకు మరింత సౌకర్యంగా అందించడం వీటి ప్రత్యేకత. వీటివల్ల బ్యాంకులకూ ప్రయోజనం ఉంది. కొత్త కస్టమర్లను సంపాదించేందుకు పెద్దగా అవి శ్రమపడాల్సిన పని తప్పుతుంది. నియోబ్యాంకుల రూపంలో కొత్త కస్టమర్లు వాటికి సులభంగా వచ్చి చేరుతుంటారు. బ్యాంకులకు కొత్త కస్టమర్లను తీసుకొచ్చినందుకు.. కస్టమర్ యాక్విజిషన్ ఫీ పేరుతో నియోబ్యాంకులకు కొంత మొత్తం ముడుతుంటుంది. అంతేకాదు.. బ్యాంకు తరఫున కస్టమర్లకు అందించే ప్రతీ సేవలపైనా ఎంతో కొంత ఆదాయం నియోబ్యాంకులకు లభిస్తుంది. కస్టమర్లకు సౌకర్యం.. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల వల్ల కస్టమర్లకు కొన్ని సౌలభ్యాలున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను నియోబ్యాంకులు డిజైన్ చేసుకుంటాయి. నిధుల విషయంలో ఎటువంటి అభద్రతా భావం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియోబ్యాంకులు మధ్యవర్తిత్వ పాత్రే పోషిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అకౌంట్లు, డిపాజిట్లు అన్నీ కూడా సంప్రదాయ బ్యాంకులవద్దే ఉంటాయి. వీటిల్లో ఖాతాను వేగంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్లోనే కేవైసీ వివరాలను పూర్తి చేయవచ్చు. ఆధార్, పాన్‌తోపాటు కొన్ని ప్రాథమిక వివరాలను ఇస్తే చాలు. పైగా ఇవన్నీ కూడా సున్నా బ్యాలన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అంటే ఖాతాదారులు రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే బ్యాంకు సేవలను పొందే వెసులుబాటు ఉంది. వార్షిక నిర్వహణ చార్జీలు కూడా లేవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భాగస్వామ్యం కలిగిన నియో బ్యాంకులు డిపాజిట్లపై అధిక రేటును ఆఫర్ (7 శాతం వరకు) చేస్తున్నాయి. నియో బ్యాంకులు కొన్ని సేవింగ్స్ ఆధారిత సేవలకే పరిమితం అవుతుంటే.. కొన్ని రుణ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. సేవింగ్స్ ఆధారిత నియో బ్యాంకులు పెట్టుబడులు, నగదు బదిలీలు, ఫారెక్స్ చెల్లింపుల వంటి సేవలకు పరిమితమైతే.. మరో రకం రుణ కార్యకలాపాలకు పరిమితం అవుతుంటాయి. సేవింగ్స్ ఆధారితం.. సేవింగ్స్ ఖాతా సేవలకు పరిమితమయ్యే నియో బ్యాంకులు ప్రధానంగా ఆయా సేవలను డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. ఐఎంపీఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/యూపీఐ తదితర చెల్లింపులు, చెక్ బుక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ స్టేట్మెంట్లు, ఖాతాలకు నామినీని నమోదు చేసుకోవడం ఇత్యాది సేవలన్నీ అందిస్తాయి. సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా సంప్రదాయ బ్యాంకులు ఆఫర్ చేసే అన్ని రకాల సేవలను నియో బ్యాంకుల ద్వారా డిజిటల్‌గానే పొందొచ్చు. లావాదేవీల పూర్తి వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందొచ్చు. నియోబ్యాంకులు కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను సైతం బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తున్నాయి. నగదు ఉపసంహరించుకోవాలన్నా, నగదును డిపాజిట్ చేసుకోవాలన్నా.. అప్పుడు కస్టమర్లు నియో బ్యాంకు మంజూరు చేసిన ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఏ బ్యాంకు భాగస్వామ్యంతో కార్డు ఇచ్చిందో ఆయా బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. నగదు జమ కోసం అవసరమైతే భాగస్వామ్య బ్యాంకు శాఖకు వెళ్లి పనిచేసుకోవచ్చు. ఏటీఎం యంత్రాల్లోనూ క్యాష్ డిపాజిట్ అవకాశం ఉంటున్న విషయం తెలిసిందే. కస్టమర్ల వినియోగానికి తగ్గట్టు.. నియోబ్యాంకు ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల వినియోగాన్ని ట్రాక్ చేస్తుంటాయి. వారి అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో గూగుల్ పే ‘ఎఫ్ఐ మనీ’ని ఆరంభించింది. ఇది కూడా ఒక నియోబ్యాంకే. ఇది ఒక ఆటోమేటెడ్ బోట్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసింది. దీంతో కస్టమర్ స్విగ్గీ లేదా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రతీ సందర్భంలోనూ రూ.50–100 వరకు పొదుపు చేయమని సూచిస్తుంటుంది. మరో నియోబ్యాంకు ‘జూపిటర్ మనీ’ మనీ మేనేజ్మెంట్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోనే ఖాతాదారు నిర్దేశించిన మొత్తాన్ని ప్రత్యేక భాగంగా జూపిటర్ మనీ నిర్వహిస్తుంటుంది. కొన్ని నియో బ్యాంకులు అయితే వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. నియోక్స్ అనే నియోబ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో (మధ్యవర్తి ప్రమేయం లేని) ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు. ఫిన్‌టెక్ కంపెనీ కలీదో ప్లాట్‌ఫామ్‌కు చెందిన కలీదో క్యాష్.. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం అందిస్తోంది. వీటిలో కొన్ని బ్యాంకులు బీటా వెర్షన్లోనే ఉన్నాయి. అంటే ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు. బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేదు. మొబైల్ ఫోన్ నుంచే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. అన్ని లావాదేవీలనూ డిజిటల్‌గానే పూర్తి చేసుకోవచ్చు. ఆఖరుకు రుణాలను కూడా డిజిటల్ వేదికగా వేగంగా తీసుకోవచ్చు. ఈ తరహా సేవలతో నియో బ్యాంకులు విస్తరించుకుంటూ వెళుతున్నాయి. ఎటువంటి భౌతిక శాఖల్లేకుండా.. ఆన్లైన్ ఆర్థిక సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లనే నియోబ్యాంకులుగా పేర్కొంటున్నారు. ఈ సంస్థల సేవలపై వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... రుణ ఉత్పత్తులు.. కొన్ని నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. ఇవి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణ దరఖాస్తులను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంటాయి. ఆన్లైన్లోనే ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఫొటో ఐడీ, ఆధార్ నంబర్, ఒక సెల్ఫీ కాపీలను బ్యాంకుకు ఆన్లైన్లో సమర్పిస్తే చాలు. ఫ్రియోకు చెందిన మనీట్రాప్.. రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు కస్టమర్ల రుణ చరిత్ర ఆధారంగా వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది. నెలసరి వేతనం రూ.30,000, ఆపైన ఉన్న ఉద్యోగులకు 13 శాతం వడ్డీ రేటుపైనే మూడు నెలల నుంచి 36 నెలల కాలానికి మంజూరు చేస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి సేవలను ఫ్రియోపే పేరుతో అందిస్తోంది. రూ.500–3,000 వరకు క్రెడిట్‌ను స్థానిక దుకాణాల్లో కొనుగోళ్లకు వాడుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్ణీత తేదీలోపు చెల్లిస్తే చాలు. రూపాయి కూడా వడ్డీ ఉండదు. నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులను ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకుల భాగస్వామ్యంతో అందించొచ్చు. సేవింగ్స్ ఖాతా సేవలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు నుంచే రుణ ఉత్పత్తులను ఆఫర్ చేయాలని లేదు. ఉదాహరణకు ఫ్రియో సంస్థ సేవింగ్స్ ఖాతా సేవలను ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సహకారంతో అందిస్తోంది. కానీ ఇదే ఫ్రియో తన మనీట్రాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణ ఉత్పత్తులను అందించేందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎం ఫైనాన్స్, అపోలో ఫిన్వెస్ట్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఆర్బీఎల్ బ్యాంకుతో టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డులను సైతం అందిస్తోంది. సరైన క్రెడిట్ స్కోర్ లేని వారి గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా నియో బ్యాంకులు.. కస్టమర్ల మొబైల్లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ, ఇతర యాప్‌ల సమాచారం తీసుకునేందుకు అనుమతి కోరుతున్నాయి. నియంత్రణలు, ఫిర్యాదుల పరిష్కారం నియో బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాం కుల సాయంతోనే బ్యాంకింగ్ సేవలను ఇవి అందిస్తున్నాయని గమనించాలి. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందించే సంస్థలు భౌతికంగానూ శాఖలను కలిగి ఉండాలని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. కనుక నియోబ్యాంకులు భౌతికంగా శాఖలు కలిగిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకుని సేవలను అందిస్తున్నాయి. కనుక నియో బ్యాంకు అందిస్తున్న డిపాజిట్, సేవింగ్స్ ఖాతా సేవల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖాతాల్లోని కస్టమర్ల డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. కాకపోతే నియోబ్యాంకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏదన్నది తెలుసుకోవడం మంచిది. ఫిర్యాదులను నియో బ్యాంకు లేదా ఆ బ్యాంకుతో ఒప్పందం కలిగిన సంప్రదాయ బ్యాంకుల వద్ద దాఖలు చేసుకోవచ్చు. సకాలంలో పరిష్కారం రానట్టయితే ఆర్బీఐ సాచెట్ వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చు. అనుకూలమేనా..? వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్, లావాదేవీలను సైతం సౌకర్యంగా నిర్వహించుకోగల వెసులుబాటు నియో బ్యాంకుల్లో ఉంటుంది. కాకపోతే అన్నింటినీ ఒకే కోణం నుంచి చూడకూడదు. కొన్ని నియో బ్యాంకుల్లో బ్యాలన్స్ వెంటనే అప్డేట్ కావడం లేదని.. కస్టమర్ సేవలు బాగోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఎంపిక చేసుకున్న నియోబ్యాంకు సేవలు మెరుగ్గా లేకపోతే వాటిల్లో కొనసాగడం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వదు. సైబర్ భద్రతా రిస్క్ అంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే కావడంతో సైబర్ భద్రతా రిస్క్ ఉంటుంది. అలాగే, ఫోన్లో వ్యక్తిగత సమాచారం పొందేందుకు అనుమతి అడుగుతున్నందున ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. మెరుగైన, సులభతరమైన బ్యాంకు సేవల కోసంనియో బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టయితే.. ఆశించిన మేర సేవల నాణ్యత ఉందేమో పరిశీలించుకోవాలి. ఇప్పటికే సంప్రదాయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు.. మెరుగైన సేవల కోసం రెండో ఖాతాను నియో బ్యాంకుల్లో తెరవడాన్ని పరిశీలించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా.. నియో బ్యాంకుల మాదిరే అన్ని రకాల సేవలను ఆఫర్ చేస్తున్న ఎస్బీఐ యోనో, కోటక్ 811 ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. నియో బ్యాంకులకు ఇవి మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు పేర్కొంటున్నారు. పరిమితులు సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటో డెబిట్ (ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అనుమతి) కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం అన్ని నియో బ్యాంకుల్లోనూ లేదు. అలాగే, పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం లేదు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 730 టార్గెట్: రూ. 870 ఎందుకంటే: గతేడాది(2020–21)కల్లా 8.4 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దేశీ బ్రోకింగ్ బిజినెస్‌లో నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల విషయంలో డిస్కౌంట్ బ్రోకర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీలోనూ కంపెనీ పురోభివృద్ధి సాధిస్తోంది. కంపెనీకి గల పటిష్ట డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. క్లయింట్లకు వివిధ దశల్లో అవసరమయ్యే పెట్టుబడులు, రక్షణ, రుణాలు తదితర లైఫ్‌సైకిల్ సొల్యూషన్స్‌ను పూర్తిస్థాయిలో అందిస్తోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల పెట్టుబడుల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇవి దేశీ బ్రోకింగ్ పరిశ్రమలో డిజిటల్ సేవలు, అతిపెద్ద సంస్థల కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. అతిపెద్ద కంపెనీగా ఐ–సెక్ సర్వీసులకు ఇకపై మరింత డిమాండు కనిపించే వీలుంది. కస్టమర్ల వ్యాలెట్ షేర్ల మానిటైజేషన్ తదితర డైవర్సిఫైడ్ ప్రొడక్టులతో కూడిన సేవల ద్వారా నిలకడైన ఆదాయాన్ని సాధించనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లను పొందడంలో ముందుంటోంది. వ్యయాల క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనుంది. టీసీపీఎల్ ప్యాకేజింగ్ వెంచురా సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 532 టార్గెట్: రూ. 961 ఎందుకంటే: గత దశాబ్దన్నర కాలంగా కంపెనీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పురోగతిని చూపుతోంది. సుమారు 6,000 లిస్టెడ్ కంపెనీలలో గత పదేళ్లుగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తున్న 105 కంపెనీలలో ఒకటిగా జాబితాలో చేరింది. మడిచే వీలున్న అట్టపెట్టెలు(ఫోల్డింగ్ కార్టన్స్), మార్పిడికి వీలయ్యే స్టాండెలోన్ పేపర్ బోర్డుల తయారీలో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. వెరసి ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో నిలకడైన, ప్రాధాన్యత కలిగిన కంపెనీగా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గజ క్లయింట్ల నుంచి గుర్తింపును పొందింది. అంతర్జాతీయంగా రక్షణాత్మక ప్యాకేజింగ్ మార్కెట్ వార్షికంగా 6.7 శాతం వృద్ధితో 281 బిలియన్ డాలర్ల నుంచి 469 బిలియన్ డాలర్లకు జంప్చేయగలదని అంచనా. ఈ రంగంలో పట్టున్న కంపెనీగా టీసీపీఎల్‌కు భారీ అవకాశాలు లభించే వీలుంది. పర్యావరణ అనుకూల టెక్నాలజీస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నందున రానున్న దశాబ్ద కాలంలో కన్సాలిడేషన్ జరగనుంది. తద్వారా పోటీ తగ్గనుంది. ఈ ఏడాది రెండో తయారీ లైన్ ప్రారంభం కానుండటంతో కంపెనీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సామర్థ్యం రెట్టింపుకానుంది. అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనున్న పాలీఎథిలీన్ బ్లోన్ఫిల్మ్ తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనుంది. -
అన్నదాతల ముంగిటకే బ్యాంకు.. రూ.25వేల వరకు విత్‌డ్రా
సాక్షి, అమరావతి: అన్నదాతలకు రకరకాల సేవలందిస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సేవకు శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి బ్యాంకింగ్ సేవలను కూడా వీటి ద్వారా రైతుల ముంగిటకే తీసుకురానుంది. దీంతో ఇన్నాళ్లూ బ్యాంకులో నగదు తీసుకోవాలన్నా.. జమ చేయాలన్నా.. రుణం పొందాలన్నా.. రుణాలు రీషెడ్యూలు చేసుకోవాలన్నా అన్నదాతలుసుదూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లేందుకు ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడీ కష్టాలకు తెరపడనున్నాయి. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఈ సేవలు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనుంది. సీఎం చొరవతోనే బ్యాంకులూ సై గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్ ప్రాంతంలోనూ..10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవ లందిస్తున్నాయి. సీజన్లో రుణాల మంజూరు, రీషెడ్యూల్‌లతో పాటు వివిధ రకాల సేవల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా రైతుల ముంగిటకే బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలందించేందుకు బ్యాంకర్లు సైతం ముందుకొచ్చారు. ఆర్‌బీకేకో బ్యాంకు కరస్పాండెంట్.. శాఖల్లేని ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సుమారు 11,500 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకున్నాయి. వీరిలో 8,500 మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు రోజూ నాలుగైదు గ్రామాలకు వెళ్లి అక్కడ అకౌంట్లు లేని వారితో ఖాతాలు తెరిపించడం, బ్యాంకు-ఆధార్ సీడింగ్, కేవైసీ అప్డేషన్, నగదు ఉపసంహరణ వంటి సేవలందిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఆర్బీకేల్లో వీరి ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఆర్బీకేలతో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను మ్యాపింగ్ చేస్తున్నారు. కరస్పాండెంట్లు అందించే సేవలివే.. ⇒ వీరి వద్ద ఉండే మొబైల్ స్వైపింగ్ ⇒ మిషన్ ద్వారా గరిష్టంగా రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ⇒ కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ⇒ ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చు. ⇒ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే సాగు ఉత్పాదకాలతో పాటు యాంత్రీకరణ, కూలీలకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ⇒ పంట రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ⇒ కొత్త రుణాల మంజూరు, రీషెడ్యూల్ చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు చేరువలో బ్యాంకింగ్ సేవలు సీఎం వైఎస్ జగన్ చొరవతో ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకర్లుముందుకొచ్చారు. డిపాజిట్లు, విత్‌డ్రాలతో పాటు ఇన్పుట్స్, పండించిన పంటల కొనుగోళ్లు వంటి వాటి విషయంలో నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు రైతులకు తోడ్పాటునందిస్తారు. సమీప భవిష్యత్‌లో పంట రుణాల మంజూరు, రీషెడ్యూల్ కూడా ఆర్బీకేల్లో అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
తెలంగాణ లాక్డౌన్: బ్యాంకు పనివేళల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. గురువారం రెండో రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక ఈ లాక్డౌన్ పది రోజుల పాటు(మే 21) వరకు కొనసాగుంది. తాజాగా తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు అమల్లోకి రానుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. అదే విధంగా అన్ని కోవిడ్ జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ 50 మంది సిబ్బందితో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఇక తెలంగాణలో లాక్డౌన్ దృష్ట్యా వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులకు బ్రేక్ పడింది. ముందస్తుగా రవాణా శాఖ పలు స్లాట్లను వాయిదా వేసింది. తెలంగాణలో ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్ల సేవలు నిలిపివేయనున్నారు. చదవండి: తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే -
జాతీయ స్థాయిలో ‘ఆప్కాబ్’కు ప్రథమ స్థానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రుణాల మంజూరు, వసూళ్లతోపాటు వివిధ అంశాల్లో మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతోందని, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్కాబ్) పేర్కొంది. 2018–19 సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాల పనితీరును నాఫ్కాబ్ పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూనే రుణాల రికవరీ, మంజూరు విషయంలో ఆప్కాబ్ గత రెండేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని, గతేడాది (2017–18) కూడా రెండోస్థానాన్ని దక్కించుకుందని వివరించింది. సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పని చేయడం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా డీసీసీబీ స్థాయిలోనూ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కు ఉత్తమ పనితీరులో ద్వితీయ స్థానం లభించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ పరిధిలోని కొమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సుభాష్ యాదవ్ అవార్డును పొందినట్టు చెప్పారు. ఈ అవార్డులను నాఫ్కాబ్ డిసెంబర్లో ప్రదానం చేస్తుందని చెప్పారు. -
కంటైన్మెంట్ జోన్లలో బ్యాంకు సేవలు నిషేధం
కాకినాడ సిటీ: కరోనా నియంత్రణలో భాగంగా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు మే 3వ తేదీ వరకు జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో బ్యాంకు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు లీడ్‌బ్యాంక్ మేనేజర్ జె.షణ్ముఖరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్యాంకుల్లో అంతర్గత సేవలు కూడా నిషేధించామన్నారు. నాన్ – కంటైన్మెంట్ జోన్లలో బ్యాంకులను పనివేళల్లో తెరచి అంతర్గత కార్యకలాపాలకు ప్రభుత్వ, ప్రభుత్వ అండర్ టేకింగ్ లావాదేవీలకు అనుమతించినట్లు వివరించారు. ప్రజలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు ఉండవన్నారు. ప్రజలు ఇంటర్నెట్, ఏటీఎం లావాదేవీలతో పాటు ఇతర డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చన్నారు. -
బ్యాంక్ సేవలపై భారత్ బంద్ ప్రభావం
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్ సంఘాలూ మద్దతిచ్చాయి. ఆర్బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె... పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రాయల్, నగదు డిపాజిట్ చేయడం, చెక్ క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్మెంట్ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి. మరోవైపు హోండా మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. -
ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు డిపాజిట్లను ఉపసంహరిస్తుండటం... కొత్త డిపాజిట్లు చేయకపోవటం వంటి వ్యవహారాలపై ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుతో లావాదేవీల నిర్వహణ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఒక లేఖ రాసింది. ఎప్పటిలాగే బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఐడీబీఐ బ్యాంక్‌కు తగిన సామర్థ్యం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రమోటర్ ఎల్ఐసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎల్ఐసీ, ప్రభుత్వం రెండింటికీ కలిపి బ్యాంకులో 97.46 శాతం వాటా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ ఈ ఏడాది జనవరిలో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీనితో బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాం కుగా ఆర్బీఐ పునర్ వ్యవస్థీకరించింది. బ్యాంకు లో ప్రభుత్వ వాటా ప్రస్తుతం 46.46 శాతం. -
'సఖి' పేర గ్రామాల్లో బ్యాంకు సేవలు
సాక్షి, నల్లగొండ: మారుమూల గ్రామాలకు బ్యాంకుసేవలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బ్యాంకు సేవలు అందుబాటులో లేక ఎంతోమంది ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా బ్యాంకుసేవలను అందించేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. సఖి పేర సేవలు అందించేందుకు మహిళా సంఘాలను గుర్తించి, బిజినెస్ కరస్పాండెంట్లుగా బాధ్యతలు అప్పజెప్పాలని డీఆర్డీఏకు సూచించింది. వీరి సేవలు అందుబాటులోకి వస్తే ఇకనుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక లావాదేవీలు గ్రామాల్లోనే నిర్వహించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో అడుగు ముందుకేస్తోంది. బిజినెస్ కరస్పాండెంట్లుగా ఆయా గ్రామాల్లో ఎంపిక చేసి వారి ద్వారా బ్యాంకు సేవలను అందించనున్నారు. ఆ గ్రామ మహిళా సమాఖ్య సభ్యుల్లో అక్షరాస్యులైన వా రిని ఎంపిక చేయాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యాంకుసేవలు లేని గ్రామాల్లోనే .. బ్యాంకులు, పల్లె సమగ్ర కేంద్రాలు, సర్వీస్ పాయింట్లు లేని గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్లను నియమించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లోని గ్రామ సమాఖ్య సభ్యుల్లో చదువుకున్న మహిళను గుర్తించాలి. ఈ బిజినెస్స్ కరస్పాండెంట్ సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా బ్యాంకు రుణాలు అందించనున్నారు. గ్రామాల్లో సఖి కేంద్రాన్ని డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బిజినెస్ కరస్పాండెంట్‌ను కూడా ఎంపిక చేస్తారు. వీటన్నింటి నిర్వహణకు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, తదితర వస్తువులను కొనేందుకు రూ. 50వేలు రుణం కూడా అందించనున్నారు. వీరికి నెలకు రూ. 4వేల చొప్పున వేతనంతో పాటు కమీషన్‌ను కూడా ఇచ్చేం దుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలలోనే బిజినెస్ కరస్పాండెంట్ల ఎంపిక డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈనెలాఖరుకల్లా ఏ గ్రామాల్లోనైతే సఖి ద్వారా బ్యాంకుసేవలు అందించాలని నిర్ణయించారో, ఆ గ్రామాల్లోని మహిళా సమాఖ్య సభ్యుల్లో విద్యావంతులైన వారిని ఎంపిక చేసి బిజినెస్ కరస్పాండెంట్‌గా నియమించనున్నారు. బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)గా అవకాశం దక్కాలంటే సదరు మహిళ 10వ తరగతి చదివిన వారై, అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. అంతే కాకుండా.. స్మార్ట్ ఫోన్ వాడడం కూడా వచ్చి ఉండాలి. ఎంపికైన తర్వాత ఎనిమిది రోజుల పాటు శిక్షణ కూడా అందిస్తారు. బీసీలుగా నియమితులైన వారు బ్యాంకుల్లో రూ. 25వేలు డిపాజిట్ చేసి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రజలకు తప్పనున్న బాధలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుసేవలు లేక ప్రజలు మండల కేంద్రాలకు రాక తప్పని పరిస్థితి. బ్యాంకులో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా అదే పరిస్థితి. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నూతన విధానం వల్ల ఏ గ్రామంలోని మహిళా సంఘాలు ఆ గ్రామంలోనే బ్యాంకు సేవలను అందిస్తూ ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఆ గ్రామ ప్రజలకు సేవలు అందించనున్నారు. బిజినెస్ కరస్పాండెంట్లను గుర్తిస్తున్నాం బిజినెస్ కరస్పాడెంట్ల ని యామకానికి ఇప్పటికే మండలాలకు ఆదేశాలు అందాయి. ఆయాగ్రామాల వారీగా ప్రక్రియ ప్రారంభమైంది. నెలలోగా బిజినెస్ కరస్పాండెంట్లను గుర్తిస్తాం. – రామలింగం, డీపీఎం -
ఆ డెబిట్ కార్డులిక పనిచేయవు.. డెడ్‌లైన్ డిసెంబర్ 31!
సాక్షి, బిజినెస్ డెస్క్: పాత డెబిట్ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. ప్రస్తుతం విరివిగా వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ (మ్యాగ్‌స్ట్రిప్) డెబిట్ కార్డులు.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 తర్వాత నుంచి చెల్లుబాటు కావు. జనవరి 1 నుంచి యూరో పే, మాస్టర్‌కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త కార్డులను పంపిస్తున్నాయి. అయినప్పటికీ.. సుమారు 70 శాతం మంది ఖాతాదారులకు మాత్రమే ఇవి చేరినట్లు తెలుస్తోంది. దీంతో తప్పనిసరిగా చిప్ కార్డులు తీసుకోవడంపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికీ చిప్ కార్డు పొందని వారు ఆఖరు రోజు దాకా వేచి చూడకుండా.. సత్వరం తమ తమ బ్యాంకు శాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాయి. ఉదాహరణకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ తీసుకుంటే.. ఇందులో ఈ–సర్వీసెస్ విభాగంలో ఏటీఎం కార్డు సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త కార్డుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాత మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులను ప్రభుత్వ రంగ ఎస్బీఐ వంటి బ్యాంకులు చాలామటుకు ఉచితంగానే అందిస్తున్నాయి. మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తున్నవారి చిరునామాలకు నేరుగా పంపిస్తున్నాయి. ఒకవేళ గడిచిన ఏడాదికాలంగా ఒక్కసారి కూడా కార్డును ఉపయోగించని వారు మాత్రం తమ తమ హోం బ్రాంచీల్లో సంప్రదించి కొత్త చిప్ కార్డులను పొందవచ్చని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. 99 కోట్ల డెబిట్ కార్డులు.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 99 కోట్ల డెబిట్ కార్డులు, 4.2 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఖాతాదారులు మోసాల బారిన పడకుండా కాపాడే క్రమంలో 2015 సెప్టెంబర్ నుంచే చిప్ ఆధారిత, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్(పిన్)తో పనిచేసే డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయాలంటూ అదే ఏడాదిలో ఆర్బీఐ ఆదేశించింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను మరికొన్ని నెలలు పాటు పొడిగించడంతో 2016 జనవరి తర్వాత నుంచి కొత్తగా ఖాతాలు తెరిచిన వారందరికీ చిప్ ఆధారిత డెబిట్ కార్డులనే బ్యాంకులు జారీ చేస్తున్నాయి. కానీ, డెడ్‌లైన్ కన్నా ముందే మ్యాగ్స్ట్రిప్తో జారీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డులు యథాప్రకారం వాడకంలో కొనసాగుతున్నాయి. దీంతో వీటన్నింటి స్థానంలో కొత్త చిప్ కార్డులు జారీ చేయాలం టూ ఈ ఏడాది డిసెంబర్ 31ని ఆర్బీఐ డెడ్‌లైన్‌గా విధించింది. దీన్ని పొడిగించాలం టూ బ్యాంకులు కోరినప్పటికీ.. ఆర్బీఐ తోసిపుచ్చడంతో గడువులోగా చిప్కార్డుల జారీ అనివార్యమైంది. ఈఎంవీ చిప్ కార్డు అంటే.. డెబిట్ కార్డు చెల్లింపులకు సంబంధించి ఈఎంవీ చిప్ టెక్నాలజీని అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణిస్తారు. ఈ టెక్నాలజీ గల డెబిట్ కార్డుల్లో పొందుపర్చే మైక్రోప్రాసెసర్ చిప్‌లో.. కార్డుహోల్డరు డేటా భద్రంగా నిక్షిప్త మై ఉంటుంది. అయితే, స్వైప్ చేసిన ప్రతిసారి ఆథెంటికేషన్ వివరాలు మారిపోతూ ఉంటా యి. పిన్ నంబరు కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే.. రెండంచెల భద్ర త ఉంటుంది. దీంతో ఈ కార్డుల నుంచి డేటా సేకరించడం, క్లోనింగ్ చేయడం, మోసగిం చడం చాలా కష్టం. మ్యాగ్‌స్ట్రిప్ కార్డులతో పోలిస్తే ఇది మరింత సురక్షితమైన టెక్నాలజీ. మ్యాగ్‌స్ట్రిప్ కార్డు గుర్తింపు ఇలా డెబిట్ కార్డు ముందుభాగంలో ఎడమవైపున చిప్ లాంటిది గానీ లేకపోతే మీది పాత మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డు అవుతుంది. సాధారణంగా మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల్లో కస్టమర్ డేటా స్థిరంగా నిక్షిప్తమైపోతుంది. దీంతో మోసగాళ్లు ఈ వివరాలను సులభతరంగా సేకరించి, మోసాలకు పాల్పడేందుకు ఆస్కారాలు ఎక్కువ. -
పోస్ట్ పేమెంట్ బ్యాంకు.. గొప్ప ఆవిష్కరణ
హైదరాబాద్: మంచి, చెడుతోపాటు అన్ని విషయాలను చేరవేసే ఒకే ఒక్క మహానుభావుడు పోస్ట్‌మాన్ అని, అలాంటి తపాలా సేవలను మరింత విస్తృతం చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు బ్యాంక్ సేవలను అందించడం గొప్ప విషయమని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం ఇక్కడ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తెలంగాణ బ్రాంచ్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు సీనియర్ సిటిజన్లు, మహిళలకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. దీనిని పోస్టల్ శాఖలో గొప్ప చరిత్రగా చెప్పవచ్చన్నారు. అనంతరం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేసేందుకుగాను డోర్ స్టెప్ బ్యాంక్ సేవలను అందించే క్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 23 బ్రాంచ్‌లను, 115 యాక్సెస్ పాయింట్లను ప్రారంభించినట్లు తెలిపారు. పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, హెడ్ పోస్టాఫీస్‌లను కలుపుకొని 5,695 యాక్సెస్ పాయింట్లను డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తపాలాశాఖ వనరులతో బ్యాంకింగ్ సేవలు తపాలాశాఖలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. ఇందులో ముఖ్యంగా సేవింగ్, కరెంట్ అకౌంట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బయోమెట్రిక్ క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా, ఆర్టీజీఎస్, బిల్లు పేమెంట్స్, ఇన్సురెన్స్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు లక్షల మంది సిబ్బంది మైక్రో ఏటీఎంల ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించబోతున్నారని వెల్లడించారు. ఇది పేపర్ లెస్ బ్యాంకింగ్ అని, కేవలం ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చన్నారు. బ్యాంకింగ్ సేవలపై సందేహాలను తెలుసుకునేందుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు అని పేర్కొన్నారు. పోస్టాఫీస్‌లోని సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు కూడా ఐపీపీబీ ద్వారా అన్ని సేవలను పొందవచ్చన్నారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ టెక్నాలజీకి అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ముందడుగు వేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. అనంతరం బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించి గవర్నర్ చేతుల మీదుగా క్యూర్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారి రాధికా చక్రవర్తి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవకు సేవింగ్స్ అకౌంట్
ఈ అకౌంట్‌ను ఎవరైనా ప్రారంభించవచ్చు. అయితే వారు ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. ప్రేమగా సేవలు అందించగలవారై ఉండాలి. రోజుకు ఎన్ని గంటలపాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ ౖటñ మ్ బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకోవచ్చు. వృద్ధాప్యంతో తీసి వాడుకోవచ్చు! ఏ దేశపు కుర్రాడో తెలియదు. చదువుకోడానికి స్విట్జర్లాండ్ వచ్చాడు. కాలేజ్ దగ్గరే ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇల్లు గల ఆవిడ పేరు క్రిస్టీనా. 67 సంవత్సరాలు. ఇంట్లో ఆవిడొక్కరే ఉంటారు. ఈ కుర్రాడు చేరాడు కదా. ఇప్పుడు ఇద్దరు. సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు క్రిస్టీనా. పింఛను వస్తోంది. స్విట్జర్లాండ్‌లో పింఛను మామూలుగా ఉండదు. మూట నిండుగా ఉంటుంది. తినడానికి, తాగడానికి.. దేనికీ తడుముకోనక్కర్లేదు. ఈ నెల పింఛను ఖర్చయిపోకుండానే మరుసటి నెల పింఛను వచ్చి చేరుతుంది. అయినా గానీ క్రిస్టీనా.. ఆ దగ్గర్లోనే పనికి వెళ్లొస్తుంటారు! ఆమె చేసే పని ఓ 87 ఏళ్ల వృద్ధుడికి సేవలు అందించడం. అది చూసి, ఈ కుర్రాడు అడిగాడు ఒక రోజు : ‘‘డబ్బు కోసమేనా పెద్దమ్మా.. పనికి వెళ్లొస్తున్నారు..’’అని. క్రిస్టీనా నవ్వారు. ‘‘డబ్బు కోసం కాదు. నా టైమ్‌ని ‘టైమ్ బ్యాంక్’లో జమ చేసుకోడానికి పనికి వెళ్తున్నాను. నేను పెద్దదాన్ని అయ్యాక, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని తీసి వాడుకుంటాను’’ అని చెప్పారు. కుర్రాడు ఆసక్తిగా చూశాడు. టైమ్ బ్యాంక్ అనే మాటను తొలిసారి అతడు వింటున్నాడు. ‘టైమ్‌ని సేవ్ చేసుకోవడం, టైమ్‌ని వాడుకోవడం ఏంటి పెద్దమ్మా’ అని అడిగాడు. దగ్గరుండి చూసుకోవాలి ‘టైమ్ బ్యాంక్’ అనేది స్విట్జర్లాండ్‌లో కొన్నేళ్లుగా ఉన్న వృద్ధాప్యపు పింఛను పథకం. స్విస్ సామాజిక భద్రత సమాఖ్య మంత్రిత్వశాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. యవ్వనంలో ఉన్నవారు పెద్దవాళ్లకు సేవలు చేస్తే, వీళ్లు పెద్దవాళ్లయ్యాక సేవలు పొందడానికి వీలు కల్పించే పథకం అది! ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. ప్రేమగా సేవలు అందించగలవారై ఉండాలి. కాలకృత్యాలకు చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడం, వేళకు మందులు అందివ్వడం, ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం.. ఇలాంటివే ఆ సేవలన్నీ. జబ్బున పడ్డవారికైతే ఇంకొంచెం సేవ, ఇంకొంచెం ప్రేమ అవసరం. ఇలా రోజుకు ఎన్ని గంటలపాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ టైమ్ బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకోవచ్చు. గంటల్ని సేవ్ చేసుకోవాలి క్రిస్టీనా వారానికి రెండుసార్లు సేవకు వెళ్లేవారు. వెళ్లిన ప్రతిసారీ రెండు గంటలు సేవలు అందించేవారు. ఇల్లు సర్దేవారు, షాపింగ్ చేయించేవారు. సన్‌బాత్‌కి తీసుకెళ్లేవారు. పక్కన కూర్చొని కబుర్లు చెప్పేవారు. దరఖాస్తులో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది కాలపరిమితి తర్వాత ఈ పని గంటలన్నిటినీ కలిపి క్రిస్టీనాకు ఒక ‘టైమ్ బ్యాంకు కార్డు’ ఇస్తుంది టైమ్ బ్యాంక్. కూడబెట్టుకున్న టైమ్‌కి వడ్డీ కూడా ఇస్తుంది. ఆ కార్డును ఉపయోగించి, తనకు ఎప్పుడు సేవలు అవసరమైతే అప్పుడు ఇంకొకరి దగ్గర్నుంచి పొందవచ్చు. క్రిస్టీనా అకౌంట్‌ను పరిశీలించి, బ్యాంకు వాళ్లే అమె దగ్గరికి వలంటీర్లను పంపుతారు. ఆ సేవలు చేయడానికి వచ్చేవారికి క్రిస్టీనా డబ్బులు చెల్లించనక్కర్లేదు. వాళ్లకూ ఒక అకౌంట్ ఉంటుంది కదా.. ఆ అకౌంట్లో వాళ్ల టైమ్ జమ అవుతుంది. తమ వృద్ధాప్యంలో వాళ్లు ఆ టైమ్‌ని ‘విత్‌డ్రా’ చేసుకోవచ్చు. ఇదీ టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్. ఓపికున్నన్నాళ్లూ.. చేయొచ్చు! ఓ రోజు కాలేజ్‌లో ఉండగా క్రిస్టీనా ఇంట్లో అద్దెకు ఉన్న కుర్రాడికి ఫోన్ వచ్చింది. స్టూలెక్కి కిటికీ అద్దాలు తుడుస్తుండగా ఆమె స్టూలు మీద నుంచి పడిపోయారు. వెంటనే ఆ కుర్రాడు ఇంటికి చేరుకుని క్రిస్టీనాను ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె కాలి మడమ దగ్గరి ఎముక చిట్లిపోయింది. కొంతకాలం కదలకూడదు. మంచం మీదే ఉండాలి. ఆ కుర్రాడు దీర్ఘకాలిక సెలవు తీసుకుని ఆమెకు సేవలు చేయడానికి సిద్ధమైపోయాడు. క్రిస్టీనా అతడిని వారించారు. అప్పటికే ఆమె తన టైమ్‌ని విత్‌డ్రా చేసుకుంటానని టైమ్ బ్యాంక్‌కి అభ్యర్థన పంపుకున్నారు! రెండు గంటల్లోపే టైమ్ బ్యాంక్ నుంచి ఒక నర్సు వచ్చారు. ఆ నర్సు క్రిస్టీనా దగ్గర ఉన్నన్ని రోజులూ ఆమెను ప్రేమగా చూసుకున్నారు. ఆత్మీయంగా సేవలు అందించారు. రుచికరమైన భోజనం వండి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించే కబుర్లు చెప్పారు. చాలా త్వరగా కోలుకుని, తిరిగి తన పనికి వెళ్లిపోయారు క్రిస్టీనా! ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్లూ పనికి వెళ్తానని, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని వాడుకుంటానని.. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న ఆ కుర్రాడితో చెప్పారు క్రిస్టీనా. వృద్ధాప్యానికి సేవల పింఛన్ టైమ్ బ్యాంక్ స్కీమ్ గురించి అతడు ఫేస్బుక్లో ఇంకా చాలా విషయాలు చెప్పాడు. వృద్ధాప్యం కోసం టైమ్‌ని ఇలా కూడబెట్టుకోవడం స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. టైమ్‌బ్యాంక్ వల్ల ప్రభుత్వానికి పింఛను భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. అలాగే కొన్ని సామాజిక సమస్యలకు కూడా టైమ్ బ్యాంక్ చక్కటి పరిష్కారం అయింది. స్విస్ పెన్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం స్విట్జర్లాండ్‌లోని యువతీయువకుల్లో సగం మందికి పైగా వృద్ధాప్య సేవల్లో పాల్పంచుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టైమ్ బ్యాంక్‌ని మరింత ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను స్విస్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తోందట!(ఇది ఎంత వరకు నిజమో తెలీదు. నిజమైతే సంతోషం. నిజం కాకపోతే.. నిజం చేసుకోవలసినంత సంతోషం. స్విట్జర్లాండ్‌లో చదువుతున్నట్లుగా ఓ కుర్రాడు తన పేరు లేకుండా పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అవుతోంది. బ్లాగుల్లో కనిపిస్తోంది. ఫేస్బుక్లో షేర్ అవుతోంది). -
బ్యాంకర్ల సేవలు భేష్
భైంసా(ముథోల్): బ్యాంకర్లు తలుచుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని రైతుబంధు చెక్కుల పంపిణీతో వెల్లడైంది. వారం పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులందరికీ గ్రామాల్లో పంపిణీ బృందాలు చెక్కులు అందించారు. అన్నదాతలు వీటిని నేరుగా తీసుకువచ్చి జిల్లాలోని ఆయా బ్యాంకుల్లో అందజేయగా.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నగదు వారికి చేతికి అందించారు అధికారులు. దీంతో జిల్లా రైతులంతా బ్యాంకర్ల సేవకు మురిసిపోయారు. తొలిసారిగా రైతులను బ్యాంకర్లు గౌరవించడం, వారిని ఆహ్వానించడం, బ్యాంకుల ఎదుట టెంట్లు ఏర్పాటు చేసి కుర్చీలు వేసి చల్లని నీరందించి చేతికి నగదు అందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పంట రుణాలకు సైతం జిల్లాలో సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య ఎప్పుడూ దాదాపు ఒక్కటే.. బ్యాంకులు కూడా అవే. అయితే ఈ రైతులే పంటరుణం కోసం బ్యాంకులకు వెళితే అక్కడి సిబ్బంది ఇచ్చే మర్యాదలు వారు అందించే సేవలు పూర్తి విరుద్ధం. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రైతుబంధు పథకంలో జిల్లా రైతులకు బ్యాంకుల నుంచి మర్యాద దక్కింది. గతంలో పాసుపుస్తకాలను, ఇతర ప్రతులను తీసుకువెళ్లి పంట రుణాల కోసం వెళితే నానా ఇబ్బందులు పడేవారు. బ్యాంకు అధికారులను ఏడు, ఎనిమిది సార్లు కలిస్తేగాని రుణాలు ఇచ్చేవారు కాదు. నెల రోజులు తిరిగితే గాని ఈ పని అయ్యేది కాదు. మధ్యవర్తుల ప్రమేయంతో వెళ్లే రైతుల పని మాత్రం త్వరగానే పూర్తయ్యేది. మధ్యవర్తులకే ప్రాధాన్యం... నిర్మల్, ఖానాపూర్, కడెం, నర్సాపూర్, సారంగాపూర్, దిలావర్పూర్, కుంటాల, కల్లూరు, భైంసా, కుభీర్, తానూరు, లోకేశ్వరం, దేగాం, అబ్దుల్లాపూర్, వానల్పాడ్, బాసర, మామడ, లక్ష్మణచాంద ఇలా ఏ ప్రాంతంలోని బ్యాంకుకు వెళ్లినా అక్కడ బ్యాంకర్లు మధ్యవర్తులకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారనే ఆరోపణలున్నాయి. బ్యాంకర్ల సహకారంతో పంటరుణాల రెన్యువల్ పేరిట మధ్యవర్తులు అమాయక రైతులను దోచుకుంటున్నారు. రుణాలు రెన్యువల్ చేయాలంటే తీసుకున్న మొత్తాన్ని కట్టాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. దీంతో ఏటా తాము తీసుకున్న డబ్బును రెన్యువల్ చేసేందుకు మధ్య దళారుల వద్ద రెండు రోజులకు రూ.50వేలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధికంగా కలిపి ఇస్తున్నారు. ఈ విధానం ఏటా జరుగుతూనే ఉంది. ఈ తతంగం బ్యాంకర్ల సహకారంతోనే ముందుకు సాగుతోంది. రైతులు తీసుకున్న రుణాలకు కేవలం వడ్డీ మాత్రమే తీసుకుంటే రైతులు మధ్య దళారులను కలవాల్సిన అవసరం ఉండదు. వడ్డీ తీసుకుని అసలు మళ్లీ క్రాప్‌లోన్ కింద జమ చేస్తే రైతులకు ఇబ్బందులు తలెత్తవు. దృష్టిసారిస్తే వారం రోజుల్లోనే.. ప్రభుత్వ యంత్రాంగం పాలకులు దృష్టి సారిస్తే వారం రోజుల్లోనే పంటరుణాల ఇబ్బందులను పరిష్కరించవచ్చు. రైతుబందు చెక్కుల పంపిణీలో అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటరుణాల కోసం కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇలాంటి నిర్ణయాలనే తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. మర్యాదలు బాగున్నాయి ఇప్పుడు బ్యాంకర్లు బాగా నే మర్యాదలు ఇస్తున్నా రు. రైతులకు ఎప్పుడూ ఇలాంటి మర్యాదలే ఇవ్వాలి. బ్యాంకుకు వెళ్లిన వారందరికీ సేవలు అందిస్తున్నారు. వెంటనే నీడపట్టున కుర్చీలో కూర్చోవాలని సూచిస్తున్నారు. క్రాప్లోన్లు ఇచ్చే సమయంలోనూ జిల్లా రైతులకు ఇలాంటి సహాయ సహకారాలే అందించాలని వేడుకుంటున్నాం. బ్యాంకర్లు తలుచుకుంటే సాధ్యపడనిది ఏది ఉండదు. – సాయినాథ్, రైతు మహాగాం రుణాలపై దృష్టి సారించాలి పంటరుణాలు ఇప్పించే విషయంలోనూ ఇలాగే బ్యాంకర్లు మర్యాదలు ఇవ్వాలి. అధికారుల బృందం అంతా బ్యాంకు వద్దే ఉంచాలి. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు బ్యాంకు వద్ద ఉంటే సమస్యలు తీరుతాయి. స్థానికంగా ఉన్న చోటే రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. ఫలితంగా రుణాలు కూడా సకాలంలోనే దొరికే అవకాశం ఉంటుంది. రైతుబంధు చెక్కులకు నగదు ఇచ్చినట్లే క్రాప్లోన్లకు సైతం వెంటనే నగదు అందించాలి. బ్యాంకర్లు రైతులందరికీ ఇలాగే మర్యాదలు అందించాలని కోరుకుంటున్నాం. – రాజ్యం, రైతు కిర్గుల్(బి) -
వేలిముద్రే బ్యాంక్ ఖాతా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు విత్ డ్రా చేసుకోవాలంటే ఏటీఎంకో లేక బ్యాంక్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్.. మీ దగ్గర్లోని ఐడీఎఫ్సీ బ్యాంకు మైక్రో ఏటీఎం సెంటర్కెళితే చాలు. డెబిట్, క్రెడిట్ కార్డులేమీ అవసరం లేకుండా కేవలం వేలిముద్ర ఆధారంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు... జమ చేయొచ్చు కూడా. అంతేకాదు వివిధ బ్యాంకులతో ఉన్న ఒప్పందం ఆధారంగా తమ కస్టమర్ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నెలకు ఎన్నిసార్లయినా నగదు ఉపసంహరించుకోవచ్చని, దీనికి పరిమితులేవీ లేవని కూడా ఐడీఎఫ్సీ బ్యాంకు స్పష్టంచేసింది. కనీస నగదు నిల్వల వంటి షరతులు కూడా లేవు. పైపెచ్చు ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారైనా ఈ మైక్రో ఏటీఎం ద్వారా లావాదేవీలు జరుపుకొనే వీలుంది. బుధవారమిక్కడ హైదరాబాద్‌లో తొలి ఐడీఎఫ్సీ బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అవతార్ మోంగా... సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... మైక్రో ఏటీఎంలపై ఫోకస్ పెడుతున్నామన్నారు కదా? అసలేంటివి? ఎలా పనిచేస్తాయి? మైక్రో ఏటీఎం అంటే టెక్నాలజీ నిండిన ఒక ట్యాబ్లెట్ మాత్రమే. రేషన్ షాపులు, పెట్రోల్ బంకులు, కిరాణా, కూరగాయల దుకాణాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఆ డివైజ్‌పై కస్టమరు వేలి ముద్ర వేయగానే... తన బ్యాంక్ ఖాతా వివరాలొచ్చేస్తాయి. దీంతో ఒక ఖాతా నుంచి ఇంకో ఖాతాకు నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కావాలంటే సంబంధిత పాయింట్ ఆఫ్ సేల్ నిర్వాహకుడి నుంచి నగదును తీసుకోవచ్చు. తన దగ్గరే జమ చేయొచ్చు కూడా. అది అప్పటికప్పుడు మీ ఖాతాలోకి కూడా చేరిపోతుంది. దీనికి ఎలాంటి నిర్వహణ చార్జీలుండవు. నగదు లావాదేవీలే కాదు... వాహన, గృహ, వ్యక్తిగత, రిటైల్, వ్యాపార రుణాలు, బీమా పథకాలు, వినియోగ బిల్లుల చెల్లింపుల వంటి సేవలన్నో దీని ద్వారా పొందొచ్చు. డెబిట్ కార్డుపై రూ.25 లక్షల ప్రమాద బీమా కవరేజీ కూడా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ ఆధారంగా గ్రామీణులకు బ్యాంక్ సేవలందించడమే ఈ మైక్రో ఏటీఎంల ఉద్దేశం. మరి ఈ మైక్రో ఏటీఎంలను ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు? ఎవరైనా ముందుకు రావచ్చు. వారికి మా బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఇస్తాం. దాని ద్వారానే వారు తమ చుట్టుపక్కలి వారికి సేవలందిస్తారు. దీనిపై వారికి కమీషన్ కూడా వస్తుంది. గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఇది అదనపు ఆదాయంగా ఉంటుంది. స్థానికంగా చక్కని సంబంధాలున్న వారికి ప్రాధాన్యమిస్తున్నాం. తెలంగాణలో ఇది తొలి బ్రాంచి కదా.. మరి కొత్త బ్రాంచీలకు సంబంధించి లక్ష్యాలేమైనా ఉన్నాయా? 2014 ఆగస్టులో ఐడీఎఫ్సీకి బ్యాంకు లైసెన్స్ వచ్చింది. ప్రస్తుతం 25 రాష్ట్రాల్లోని 670 ప్రాంతాల్లో 45 వేల గ్రామాల్లో సేవలందిస్తున్నాం. దేశంలో 13 వేల మైక్రో ఏటీఎంలు, 3,423 ఆధార్ పే కేంద్రాలు, 135 బ్రాంచీలు ఉన్నాయి. వీటిలో 100 బ్రాంచీలు గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు మాకు 24 లక్షల మంది కస్టమర్లున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 15 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో 767 మైక్రో ఏటీఎంలు, 182 ఆధార్ పే కేంద్రాలున్నాయి. ఇక్కడ నెలకు 1.5 లక్షల లావాదేవీలు ఆధార్ పే ద్వారా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం 200 బ్రాంచీలు, వచ్చే ఏడాది మార్చి నాటికి 30 వేల మైక్రో ఏటీఎంల ఏర్పాటు లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగిసేనాటికి హైదరాబాద్‌లో మరో 4 బ్రాంచీలతో పాటూ బెంగళూరులో 8, చెన్నైలో 5 శాఖలను ప్రారంభిస్తాం. ఐడీఎఫ్సీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉందా? గతేడాది డిసెంబర్ నాటికి స్థూల రిటైల్, కార్పొరేట్ ఆస్తులు రూ.67,488 కోట్లుగా, నికర లాభం రూ.146.1 కోట్లుగా ఉంది. ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. గతేడాది డిసెంబర్ నాటికి 8,668 మంది ఉద్యోగులున్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన సేవలందించే యోచనేమైనా ఉందా? పెన్షన్లు, ఎల్పీజీ వంటి ఇతరత్రా సబ్సిడీలు, స్కాలర్షిప్స్, పౌర సరఫరాలు వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కోసం ఏపీతో ఒప్పందం చేసుకున్నాం. ఇది ఆధార్ అనుసంధానిత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ద్వారా పనిచేస్తుంది. ఈ సేవలను ప్రయోగాత్మకంగా తెలంగాణ సిద్ధిపేటలోని పలు రేషన్ షాపుల్లోనూ నిర్వహిస్తున్నాం. త్వరలోనే పూర్తి స్థాయిలో అధికారికంగా అందుబాటులోకి తెస్తాం. తర్వాత మహారాష్ట్ర, హరియాణాల్లోనూ ప్రారంభిస్తాం. విద్యుత్, మున్సిపల్ వంటి పలు ప్రభుత్వ విభాగాల్లోనూ ఐడీఎఫ్సీ మైక్రో ఏటీఎంల ఏర్పాటు కోసం ఆయా విభాగాలతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. 2 నెలల్లో క్యాపిటల్ ఫస్ట్ విలీనం పూర్తి విలీనం తర్వాత మిశ్రమ సంస్థ నిర్వహణ ఆస్తుల విలువ రూ.88 వేల కోట్లు ఐడీఎఫ్‌సీతో క్యాపిటల్ ఫస్ట్ హోమ్ ఫైనాన్స్ విలీన ప్రక్రియకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) బుధవారం అనుమతినిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉందని.. మరో 2 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తవుతుందని ఐడీఎఫ్సీ ఈడీ అవతార్ మోంగా విలేకరులతో చెప్పారు. విలీనం తర్వాత మిశ్రమ సంస్థ నిర్వహణ ఆస్తు ల విలువ రూ.88 వేల కోట్లుగా ఉంటుందన్నారు. ‘‘షేర్ హోల్డర్లకు 139:10 నిష్పత్తిలో షేర్లు జారీ చేయాలని ఇప్పటికే బోర్డులు నిర్ణయించాయి. అంటే 10 క్యాపిటల్ ఫస్ట్ షేర్లకు ఐడీఎఫ్సీ షేర్లు 139 వస్తాయి’’ అని చెప్పారు. -
ఖాతాదారుడికే క్యాష్!
సొంత బ్రాంచి ఖాతాదారులకే పరిమితమవుతున్న బ్యాంకు సేవలు సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నోట్లు రద్దు చేసి 55 రోజులవుతున్నా సరిపడ నగదు అందక జనం ఇబ్బందులపాలవుతున్నారు. అటు బ్యాంకులు కూడా సొంత ఖాతాదారులకే సేవలను పరిమితం చేస్తున్నాయి. ఏటీఎంల్లో ఎక్కడా క్యాష్ అందుబాటులో ఉండడం లేదు. అక్కడక్కడ కొన్ని ఏటీఎంలు పనిచేస్తున్నా అందులో వేరే బ్యాంకుకు చెందిన కార్డుల ద్వారా డబ్బులు రావడం లేదు. దీంతో ఖాతాదారులంతా కచ్చితంగా తమ బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నెల ప్రారంభం కావడంతో వేతన జీవులు సైతం జీతం డబ్బు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారులకు రూ.10 వేలతో సరిపెడుతున్నారు. హైదరాబాద్‌లోని దాదాపు అన్ని స్టేట్ బ్యాంకు శాఖల్లో ఖాతాదారులకు బుధవారం రూ.10 వేలే ఇచ్చారు. ఐసీఐసీఐ తదితర ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం మధ్యాహ్నం వరకు ఒక్కో ఖాతాదారుడికి రూ.24 వేలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుడికి రూ.4 వేలు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల్లో రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. బ్యాంకులకు తిరిగి రాని కొత్త నోట్లు బ్యాంకుల్లో నగదు లావాదేవీల్లో డిపాజిట్లు, విత్‌డ్రాల నిష్పత్తి దాదాపు సమానంగా ఉంటుంది. ఈ నిష్పత్తిలో వ్యత్యాసం ఉంటేనే ప్రధాన కార్యాలయం లేదా ప్రధాన బ్రాంచి నుంచి నగదును తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్దనోట్ల రద్దుతో ఈ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వచ్చింది. పాతనోట్లు డిపాజిట్ చేసిన ఖాతాదారులంతా తిరిగి వాటిని తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. డిపాజిట్ అయిన మొత్తంలో కేవలం 35 శాతం మాత్రమే బ్యాంకులకు కొత్త నోట్ల రూపంలో నగదు వచ్చింది. దీంతో బ్యాంకులు వాటినే ఖాతాదారులకు పంపిణీ చేస్తున్నారు. మార్కెట్లోకి చేరిన కొత్త నోట్లు బ్యాంకుల్లో జమకావడం లేదు. మణికొండలోని ల్యాంకో హిల్స్ ఎస్బీఐలో నవంబర్ 8కి ముందు రోజుకు సగటున రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు డిపాజిట్ అయ్యేది. ప్రస్తుతం డిపాజిట్లు రూ.10 లక్షలు కూడా దాటడం లేదని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రాజేంద్రనగర్ ఎస్బీహెచ్లో రోజుకు రూ.60 లక్షల డిపాజిట్లు ఉండేవి. ఇప్పుడు కేవలం రూ.5 లక్షలు మాత్రమే వస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతి రోజూ ప్రధాన బ్యాంకు నుంచి నగదును తెచ్చుకోవాల్సి వస్తోందని, దీంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలలో క్యాష్ నిల్ ఏటీఎం మెషీన్లలో క్యాష్‌ను అందుబాటులో ఉంచేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంలు గత రెండు నెలలుగా మూతబడే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించి 7,548 ఏటీఎంలున్నాయి. వీటిలో కొత్తనోట్లకు అనువుగా ఉండేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో పాటు క్యాష్ట్రేలు మార్చేశారు. కానీ క్యాష్ లేకపోవడంతో ఈ మెషీన్లు ఔటాఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎం మెషీన్లలో నగదు అందుబాటులో ఉంచితే ఇతర బ్యాంకులకు చెందిన ఖాతాదారులు సైతం విత్‌డ్రా చేస్తారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బ్రాంచికి చెందిన ఖాతాదారులకు నేరుగా నగదు ఇస్తే తమపై ఒత్తిడి తగ్గుతుందన్న ఉద్దేశంతో.. ఏటీఎం మెషీన్లలో నగదును పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సంతృప్తికర స్థాయిలో నగదు వచ్చిన తర్వాతే ఏటీఎం మెషీన్లు పనిచేసే అవకాశం ఉంది. -
సీనియర్ సిటిజన్లకే బ్యాంకు సేవలు
-
వయో వృద్ధులకే బ్యాంకు సేవలు
శనివారం నాడు పాతనోట్లు మార్చుకుందామని గానీ, ఖాతాలోంచి నగదు విత్‌డ్రా చేసుకుందామని గానీ బ్యాంకులకు వెళ్దామని అనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి. ఈనెల 19వ తేదీ శనివారం బ్యాంకులు మామూలు సమయాల్లోనే పనిచేస్తాయి గానీ, వాటిలో కేవలం వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు) మాత్రమే సేవలు అందిస్తారు. ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ రిషి తెలిపారు. రెండో శని, ఆది వారాల్లో కూడా పనిచేసిన బ్యాంకులు.. ఈసారి మూడో శనివారం అయినా సెలవు ప్రకటిస్తాయని తొలుత కొందరు భావించారు. కానీ, ఎప్పటిలాగే మామూలు పనివేళల్లోనే శనివారం పనిచేస్తాయని తెలిపారు. దేశంలోని అన్ని బ్యాంకులకూ ఈ నిబంధన వర్తిస్తుందని రాజీవ్ రిషి చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని.. ప్రతిరోజూ బ్యాంకుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. అందుకే ఈ శనివారం తాము నోట్ల మార్పిడి పని చేయబోమని.. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే మారుస్తామని అన్నారు. ఇన్నాళ్లుగా పెండింగులో పడిపోయిన మిగిలిన పనిని పూర్తిచేయడానికి శనివారాన్ని ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. -
ఫేస్బుక్, ట్వీటర్లో ఎస్బీఐ సేవలు
న్యూఢిల్లీ: వివిధ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా బ్యాంక్ సేవలను పొందే అవకాశాన్ని ఎస్బీఐ అందిస్తోంది. ఫేస్బుక్, ట్వీటర్ అకౌంట్ల ద్వారా ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు వివిధ బ్యాంక్ సేవలను పొందేలా ‘ఎస్బీఐ మింగిల్’ను ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఎస్బీఐ మింగిల్ను ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య ప్రారంభించారు. చెక్‌బుక్ రిక్వెస్ట్, చెక్‌లకు చెల్లింపులు నిలిపేయడం, మొబైల్ బ్యాంకింగ్‌కు నమోదు చేసుకోవడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, ఏటీఎం/డెబిట్ కార్డులను బ్లాక్ చేయడం.. తదితర సేవలను కూడా ఎస్బీఐ మింగిల్లో అందుబాటులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ ఈఎంఐలు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ముందుగా అర్హత పొందిన వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులను సమాన నెలవారీ వాయిదా(ఈఎంఐ)పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. కనీస కొనుగోలు రూ.5,000గా ఉండాలి 6/9/12 నెలల్లో ఈఎంఐ(సమాన నెలవారీ వాయిదా)ల్లో ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు. 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ డిజిటల్ విలేజేస్, స్టేట్ బ్యాంక్ బడ్డీ తదితర ఫీచర్లను కూడా ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది కీలకం... ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నట్లు బ్యాంక్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనాన్ని ప్రస్తావించారు. ఇది ఎస్బీఐకి అంతర్జాతీయ బ్యాంకింగ్ స్థాయి తీసుకువస్తుందని, వరల్డ్ టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఉంటుందని అన్నారు. కొంచెం అటుఇటుగా ఒకేసారి అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఎస్బీఐ, రిలయన్స్‌ల ఒప్పందం... చెల్లింపు బ్యాంక్(పేమెంట్స్ బ్యాంక్) ఏర్పాటు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐలు సబ్స్క్రిప్షన్ అండ్ షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్‌ను కుదర్చుకున్నాయి. ఈ జాయింట్ వెంచర్ కోసం ఎస్బీఐతో ఒప్పందాన్ని గురువారం కుదుర్చుకున్నామని బీఎస్ఈకి ఆర్ఐఎల్ నివేదించింది. ఈ జేవీలో తమ వాటా 70 శాతమని, ఎస్బీఐ వాటా 30 శాతమని పేర్కొంది. -
విస్తరణ యోచనలో బీఎంబీ
చెన్నై: ప్రభుత్వ భారతీయ మహిళ బ్యాంక్ (బీఎంబీ) తన సేవలను మరింతగా విస్తరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెలలో దేశం మొత్తం మీద 35 బ్రాంచ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారతీయ మహిళా బ్యాంక్ చైర్పర్సన్, ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ చెప్పారు. దీంతో మహిళా బ్యాంక్ మొత్తం శాఖలు 80కి చేరుకుంటాయి. అలాగే వచ్చే వారం మొబైల్ ఆప్‌ను సేవలనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. 15 నెలల క్రితం బ్యాంక్ ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మాకిచ్చిన మూలధనం రూ.1,000 కోట్లని ఈ సందర్భంగా అనంతసుబ్రమణ్యన్ గుర్తు చేశారు. ఈ నిధులు బ్యాంక్ సేవలను బలోపేతం చేసేందుకు, విస్తరణ చేసేందుకు సరిపోతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని జన్‌ధన్ యోజన పథకం కింద ఇప్పటివరకు 66 వేల ఖాతాలను తెరిచినట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది రూ.1,800 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
కేరళలో ఇంటింటికీ బ్యాంకు ఖాతా
న్యూఢిల్లీ: అక్షరాస్యతలో దేశంలోకెల్లా అగ్రస్థానంలో ఉన్న కేరళ మరో ఘనతను సాధించింది. దేశ ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ లక్ష్యాన్ని అందుకోవడంలోనూ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ నెల 11 నాటికి... నూటికి నూరుపాళ్లు బ్యాంకు ఖాతాలు ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. కేరళలో ఒక్కో కుటుంబం కనీసం ఒక్కో బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే గోవా కూడా ఇదే ఘనతను సాధించిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ నెల 10 నాటికి జన్‌ధన్ యోజన కింద 7.24 కోట్ల ఖాతాలను ప్రజలు తెరిచారు.