కాకినాడ సిటీ: కరోనా నియంత్రణలో భాగంగా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు మే 3వ తేదీ వరకు జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో బ్యాంకు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు లీడ్‌బ్యాంక్ మేనేజర్ జె.షణ్ముఖరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్యాంకుల్లో అంతర్గత సేవలు కూడా నిషేధించామన్నారు. నాన్ – కంటైన్మెంట్ జోన్లలో బ్యాంకులను పనివేళల్లో తెరచి అంతర్గత కార్యకలాపాలకు ప్రభుత్వ, ప్రభుత్వ అండర్ టేకింగ్ లావాదేవీలకు అనుమతించినట్లు వివరించారు. ప్రజలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు ఉండవన్నారు. ప్రజలు ఇంటర్నెట్, ఏటీఎం లావాదేవీలతో పాటు ఇతర డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment