హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ ఉందా?.. 13న ఈ సేవలన్నీ బంద్! | HDFC Bank Scheduled Downtime on July 13 | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ ఉందా?.. 13న ఈ సేవలన్నీ బంద్!

Published Tue, Jul 9 2024 6:09 PM | Last Updated on Tue, Jul 9 2024 6:14 PM

HDFC Bank Scheduled Downtime on July 13

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఈనెల 13న (జులై 13) సిస్టమ్ అప్‌గ్రేడ్‌ చేపడుతోంది. ఈ కారణంగా ఆ రోజు పలు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. ఉదయం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ అప్డేట్ అనేది సుమారు 13:30 గంటలు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. అవసరమైన కార్యకలాపాలను 12వ తేదీనే చేసుకుంటే మంచిది. ఎందుకంటే 13వ తేదీ అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం.

జులై 13న అందుబాటులో ఉండే సేవలు
👉యూపీఐ సేవలను ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు. 
👉ఏటీఎమ్ సర్వీసును ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు.
👉నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో అందుబాటులో ఉంటాయి.
👉ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్‌లైన్ బదిలీలు, బ్రాంచ్ బదిలీలతో సహా అన్ని ఫండ్ బదిలీ అందుబాటులో ఉండవు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement