భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన 'హెచ్‌డీఎఫ్‌సీ' అద్దె చెల్లింపుల కోసం కొత్త ఫీజును ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు క్రెడో, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లించే అద్దె మీద 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. దీనిని గరిష్టంగా రూ. 3వేలుకు పరిమితం చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ జూన్ 26న కస్టమర్‌లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంటే ముందు.. క్రెడిట్ కార్లు చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ఇతర క్రెడిట్ కార్డు జారీదారులు, బ్యాంకులు కూడా ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌లలో అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్‌లను అందించడం ఆపివేసాయి.
2024 ఫిబ్రవరి 1 నుంచి అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి నిర్దిష్ట కార్డ్‌లు మినహా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులు, ఈ వాలెట్ లోడింగ్ లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్‌లు లభించడం లేదు. కాగా ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ చెల్లింపులపైన అదనపు ఫీజు చెల్లింపులను ప్రారంభించింది. ఈ మార్పులు 2024 ఆగష్టు 1నుంచి అమలులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment