charge
-
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
నామినీ వివరాలను అప్డేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF) చందాదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.పీపీఎఫ్ ఖాతాలకు నామినీ పేర్లను మార్చడానికి ఆర్ధిక సంస్థలు రూ.50 వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చార్జీలను తొలగించడానికే జీవో తీసుకురావడం జరిగింది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ఇటీవల ఆమోదం పొందిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం.. డిపాజిటర్ల డబ్బు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులు, భద్రతా లాకర్ల చెల్లింపు కోసం నలుగురు వరకు నామినీలు ఉండవచ్చు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్ రికార్డ్!నామినేషన్ కోసం ఫారం-10 ని దాఖలు చేయడం ద్వారా మీరు మీ పీపీఎఫ్ ఖాతాలోని నామినీ వివరాలను మార్చవచ్చు. దీన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చందాదారులు వివరాలను నవీకరించడానికి అనుమతిస్తాయి.Recently was informed that a fee was being levied by financial institutions for updating/modifying nominee details in PPF accounts. Necessary changes are now made in the Government Savings Promotion General Rules 2018 via Gazette Notification 02/4/25 to remove any charges on… pic.twitter.com/Hi33SbLN4E— Nirmala Sitharaman (@nsitharaman) April 3, 2025 -
పొంచి ఉన్న ‘ట్రూఅప్’ భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భవిష్యత్తులో ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ) ముప్పు పొంచి ఉందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాలరావు ఆందోళన వ్యక్తంచేశారు. రెండు డిస్కంలకు రూ.20,151 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని అంచనా వేయగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కింద బడ్జెట్లో రూ.11,500 కోట్లు మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. మిగతా లోటును పూడ్చుకునేందుకు ట్రూఅప్ చార్జీలు విధించాల్సి వస్తుందని తెలిపారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన 2025–26 వార్షిక ఆదాయ అవశ్యకత(ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. డిస్కంల ఆర్థిక నష్టాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల బకాయిల కలిపి రూ.98,053 కోట్లకు ఎగబాకాయని ఆందోళన వ్యక్తంచేశారు. గరిష్ట డిమాండ్ ఉండే సమయంలో పునరుత్పాదక విద్యుత్ అందుబాటులో ఉండదని, అందువల్ల తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన కనీస మొత్తం కంటే అధికంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనటం ఏమాత్రం సరికాదని అన్నారు. అలా చేస్తే గరిష్ట డిమాండ్‌ను తీర్చడానికి బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు అనవసర ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన కొనుగోళ్లకు అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకుంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించడానికి బ్యాకింగ్ డౌన్ చేసి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఏడాది ఏకంగా 28,504 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మిగులు విద్యుత్ ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయని, అవసరం లేని ఈ విద్యుత్‌కు చెల్లించే ఫిక్స్డ్ చార్జీల భారం వినియోగదారులపై పడుతుందని అన్నారు. సమ్మతి తెలిపిన వినియోగదారులకే ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని సూచించారు. టైమ్ ఆఫ్ డే పేరుతో రాత్రి పూట విద్యుత్ వినియోగించే హెచ్‌టీ వినియోగదారులకు ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని కోరారు. బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే విద్యుత్ ధర యూనిట్‌కు రూ.11కి పెరిగిపోతుందని చెప్పారు. వినతులు, ఫిర్యాదులు.. » రైల్వే ట్రాక్షన్ విద్యుత్ చార్జీలను హైదరాబాద్ మెట్రో రైలు కేటగిరీతో సమానంగా తగ్గించాలని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్.మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. » విద్యుత్ బిల్లులను నెల పూర్తికాక ముందే జారీ చేసిన సందర్భాల్లో సగటున 30 రోజుల వాడకాన్ని అంచనా వేసి టారిఫ్ శ్లాబులను వర్తింపజేస్తుండటంతో బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయని కిరణ్‌కుమార్ అనే వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. » విద్యుత్ ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ప్రశ్నించారు. దరఖాస్తులు చేసుకోవడానికి నిర్దేశిత గడువు ఏమీ లేనప్పుడు గడువు పేరుతో దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తున్నారని నిలదీశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో సంజీవరెడ్డి అనే వ్యక్తి 2019లో విద్యుదాఘాతంతో మరణిస్తే ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని అతడి భార్య సరిత ఫిర్యాదు చేయటంతో అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíÙయా చెక్కును ఇప్పించారు. » కొత్త వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలతోపాటు లంచాలు ఇచ్చినా సకాలంలో జారీ చేయడం లేదని పలువురు రైతులు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై జస్టిస్ దేవరాజు నాగార్జున్ అక్కడికక్కడే టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని వివరణ కోరారు. లైన్లు, టవర్ల ఏర్పాటులోనిబంధనలు పాటించాలిపంట పొలాల్లో విద్యుత్ లైన్లు, టవర్ల ఏర్పాటు విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఈఆర్సీ చైర్మన్ ఆదేశించారు. నోటిసులు ఇవ్వకుండా, తమ సమ్మతి లేకుండా పొలాల్లో లైన్లు వేస్తున్నారన్న రైతుల ఫిర్యాదులపై వివరణ కోరారు. టవర్ ఏర్పాటు చేస్తే స్థలం మార్కెట్ విలువ తో పోల్చితే 200 శాతాన్ని, లైన్లు వేస్తే 30 శాతాన్ని పరిహారంగా ఇవ్వాలని జీవో ఉందని ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్షేత్ర స్థాయిలోని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఫారూఖీ హామీ ఇచ్చారు. -
ఆర్టీసీ కంటే నాలుగు రెట్లు అధిక ధర
-
క్రెడిట్ కార్డులపై కొత్త చార్జీలు.. డిసెంబర్ 20 నుంచి..
దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ వచ్చే డిసెంబర్ నెల నుండి తన క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో అనేక మార్పులు చేయబోతోంది. వీటిలో కొత్త రిడెంప్షన్ ఫీజులు, సవరించిన వడ్డీ రేట్లు, అదనపు లావాదేవీ ఛార్జీలు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 20 నుండి అమలుకానున్నాయి.ఎడ్జ్ రివార్డ్‌లపై రిడెంప్షన్ ఫీజుయాక్సిస్ బ్యాంక్ ఎడ్జ్ రివార్డ్‌లు లేదా మైల్స్‌ను వినియోగించడం కోసం రిడెంప్షన్ ఫీజులను ప్రవేశపెడుతోంది. క్యాష్ రిడెంప్షన్‌కు రూ. 99 (18 శాతం జీఎస్టీ అదనం), మైలేజ్ ప్రోగ్రామ్‌కు పాయింట్లను బదిలీ చేయడానికి రూ. 199 (18 శాతం జీఎస్టీ అదనం) వసూలు చేయనుంది. డిసెంబర్ 20 లోపు పాయింట్లను రీడీమ్ లేదా బదిలీ చేసుకుంటే ఈ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.రిడెంప్షన్ ఫీజు వర్తించే కార్డులు ఇవే..» యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్» శామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్» శామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్» యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ » యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్సవరించిన ఇతర ఛార్జీలునెలవారీ వడ్డీ రేటు 3.75 శాతానికి పెరుగుతుంది. ఆటో డెబిట్ రివర్సల్, చెక్ రిటర్న్‌పై చెల్లింపు మొత్తంలో 2 శాతం రుసుము ఉంటుంది. కనిష్ట పరిమితి రూ. 500 కాగా గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. దీంతో శాఖలలో నగదు చెల్లింపుపైనా రూ.175 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ట బకాయి మొత్తాన్ని చెల్లించడంతో వరుసగా రెండు సార్లు విఫలమైతే రూ. 100 అదనపు రుసుము విధిస్తారు.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!ఇక డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) మార్కప్‌ను డీసీసీని 1.5 శాతానికి సవరించారు. అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం, క్రెడ్, గూగుల్ పే వంటి ఏదైనా థర్డ్-పార్టీ యాప్ ద్వారా విద్యా రుసుము చెల్లిస్తే 1 శాతం రుసుము ఉంటుంది. అయితే, విద్యా సంస్థలకు నేరుగా చెల్లించే చెల్లింపులకు మినహాయింపు ఉంటుంది.రూ. 10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడ్‌పై 1% రుసుము చెల్లించాలి. ఒక స్టేట్మెంట్ సైకిల్లో రూ. 50,000 కంటే ఎక్కువ ఇంధన ఖర్చులు, రూ. 25,000 లకు మించిన యుటిలిటీ, రూ. 10,000 కంటే ఎక్కువ గేమింగ్ లావాదేవీలు ఉంటే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
‘ఈ–ప్రోత్సాహం’ కొందరికే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్ల విధి విధానాలనే అమలుచేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ విధానాలను తమవని చెప్పుకునేందుకు పాకులాడుతోంది. కానీ, చార్జింగ్ కేంద్రాలను ప్రత్యేక కేటగిరి టారిఫ్ కిందకు తీసుకొచ్చి తక్కువ ధరకే విద్యుత్ అందించాలన్న వైఎస్ జగన్ నిర్ణయానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యూనిట్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది.ఇప్పుడు రాయితీలు కొందరికే.. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకయ్యే ఖర్చులో 25 శాతం అంటే గరిష్టంగా రూ.10 లక్షల వరకూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. వాహనదారులు కొనుగోలు చేసే చార్జర్లపైనా 25 శాతం డిస్కౌంట్ అందించింది. అలాగే.. విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీ కేంద్రాలు, హైడ్రోజన్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భారీ ప్రోత్సాహకాలను గత ప్రభుత్వం ప్రకటించింది. మూలధన వ్యయంలో 25 శాతం వరకూ రాయితీ కల్పించింది. అది గరిష్టంగా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంది. విద్యుత్ సుంకాన్ని, స్టేట్ జీఎస్టీని వంద శాతం తిరిగిచ్చేసింది. అన్నిటికీ మించి ఈ–మొబిలిటీలో సరికొత్త పరిశోధనల కోసం రూ.500 కోట్ల నిధులను కేటాయించింది. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ముందువచ్చిన కొందరికే రాయితీలు ఇచ్చేలా విధానాన్ని రూపొందిస్తోంది. అంతేకాక.. చార్జింగ్ కేంద్రాల్లో యూనిట్‌కు రూ.15 చొప్పున వసూలుచేయాలని భావిస్తోంది. తద్వారా విద్యుత్ వాహనదారులపై పెనుభారం మోపనుంది.పాత పాలసీకే మెరుగులు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకొచి్చంది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. అందుకు అవసరమైన నాలుగు వేల స్థలాలను అప్పట్లోనే గుర్తించింది. విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలను మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరాలుగా గుర్తించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల (పీసీఎస్)ను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటుచేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనికి ఎటువంటి లైసెన్స్ అక్కర్లేదని చెప్పింది.అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బీఈఈ సూచించినట్లుగా అన్ని రకాల భద్రత, నాణ్యత ప్రమాణాలు ఈవీ స్టేషన్లో ఉండాలని సూచించింది. టెండర్లు ఆహ్వనించగా.. యూనిట్‌కు రూ.12 చొప్పున వసూలుచేసి, దాన్నుంచి డిస్కంలకు విద్యుత్ చార్జీ రూ.6, స్థల యజమానికి రూ.2.55 చెల్లిస్తామంటూ ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుకు చెందిన సంస్థలు టెండర్లు వేశాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కేవలం 1,028 చార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మన రాష్ట్రంలో 266 స్టేషన్లను జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాలసీని రూపొందిస్తున్నామని చెబుతూ గత ప్రభుత్వ పాలసీకే మెరుగులు దిద్దుతోంది. -
కొత్తగా ‘లైన్’ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, అదనపు లోడ్ సామర్థ్యం మంజూరీకి ఇకపై సర్వీసు లైన్ చార్జీల పేరుతో కొత్త చార్జీలను వసూలు చే యనున్నారు. కనెక్షన్ లోడ్ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కి ఈ చార్జీ లను చెల్లించాల్సి ఉంటుంది. కోరిన వారికి కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ విద్యు త్ పంపిణీ సంస్థ (డిస్కం)ల బాధ్యత కాగా, అందుకు అవసరమైన విద్యుత్ లైన్ లేదా ప్లాంట్ ఏర్పాటుకు చేసే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ఈ లైన్ చార్జీలను వసూలు చేయనున్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ప్రకటించి ఈ నె ల 24లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. లోడ్ సామర్థ్యం, కనెక్ష న్ కేటగిరీ, కనెక్షన్ జారీకి డిస్కంలు చేసే సగటు వ్యయం ఆధారంగా కొత్త కనెక్షన్ల చార్జీలను నిర్ణయించాలని రాష్ట్రాల ఈఆర్సీలకు గతంలో కేంద్రం సూచన చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్) రూల్స్ 2020ను ప్రకటించింది. ప్రతి కనెక్షన్ కోసం సైట్‌ను సందర్శించి డిమాండ్ చార్జీలను అంచనా వేయడానికి బదులుగా ఈ పద్ధతిని పాటించాలని కోరింది. కేంద్రం సూచనల మేరకు లైన్ చార్జీల వసూళ్లకు అనుమతించాలని డి స్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ఈ మేరకు ముసాయిదాను ప్రకటించింది. కనెక్షన్ లోడ్ సామర్థ్యంలోని ప్రతి కిలోవాట్ లోడ్‌కి కొంత మొత్తం చొప్పున ఈ చార్జీలను విధిస్తారు. కొత్త కనెక్షన్ జారీకి ప్రత్యేకంగా విద్యుత్ లైన్ వే యాల్సిన అవసరం ఉన్నా, లేకున్నా ఈ కింద పేర్కొన్న మేరకు సర్వీసు లైన్ చార్జీలను వసూలు చేయాలని ఈఆర్సీ ప్రతిపాదించింది. అభ్యంతరాలు, సలహాలు తీసుకున్న తర్వాత ఈఆర్సీ తుది ఆదేశాలు జారీ చేయనుంది. ప్రస్తుత చార్జీలకు అదనంగా కొత్త చార్జీలుకొత్త విద్యుత్ కనెక్షన్ కోసం భూగర్భ కేబుల్ లైన్ వేయాల్సిన అవసరం వస్తే పైన పేర్కొన్న సంబంధిత కేటగిరీ చార్జీలతో పోలిస్తే దరఖాస్తుదారుల నుంచి 2.5 రెట్ల రుసుమును అధికంగా వసూలు చేస్తారు. కొత్త కనెక్షన్ల జారీకి ఇప్పటికే వసూలు చేస్తున్న దరఖాస్తు ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీలకు అదనంగా ఈ సర్వీసు లైన్చార్జీలను వసూలు చేయనున్నారు. హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ కోసం కొత్త లైన్లను వేయాల్సి వస్తే అందుకు కానున్న వ్యయాన్ని డిస్కంలు అంచనా వేసి దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీ సూచించింది. -
టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్‌ప్లాజ్ రుసుం చెల్లిస్తుంటాం కదా. అయితే ఇకపై ఆ ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు. అవునండి..మీరు నిత్యం అదే రహదారి గుండా ప్రయాణిస్తూ, మీ ఇళ్లు స్థానికంగా టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అందుకు కొన్ని ధ్రువపత్రాలు సమర్పించి టోల్‌పాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.ముందుగా టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో మాట్లాడి మీ దగ్గరున్న అడ్రస్ ప్రూఫ్ సమర్పించాలి. ఆ సమయంలో మీ ఫాస్టాగ్ అకౌంట్‌తో అడ్రస్ప్రూఫ్ను లింక్ చేసి లోకల్ పాస్ జారీ చేస్తారు. అందుకోసం రూ.340 చెల్లించాల్సి ఉంటుంది. ఇది నెలపాటు పని చేస్తుంది. వచ్చేనెల తిరిగి ఈ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.340 చెల్లించి నెలరోజులపాటు టోల్ ఛార్జీలు పేచేయకుండా ప్రయాణించవచ్చు. అయితే ఈ లోకల్పాస్ కేవలం సంబంధిత టోల్‌ప్లాజాలో మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం అక్కడి టోల్రేట్లకు తగినట్లుగా పూర్తి ఛార్జీలు ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సిందే.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!2021 ఆర్థిక సంవత్సరంలో ఫాస్టాగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.34,778 కోట్లు ఆదాయం సమకూరింది. 2022లో అది 46 శాతం పెరిగి రూ.50,855 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి పది నెలలకాలంలో రూ.50 వేలకోట్ల మార్కును దాటింది. -
ప్రజలకు విద్యుత్ చార్జీల షాక్
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి.. ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే మాట తప్పి రాష్ట్ర ప్రజలపై రూ.8,100 కోట్ల భారం మోపేందుకు సిద్ధమైంది. వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు కానుకగా ప్రజలపై విద్యుత్ చార్జీల పిడుగు వేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీల ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ)కి సమరి్పంచాయి. ఆ ప్రతిపాదనలపై ఈ నెల 18న బహిరంగ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు ఏపీ ఈఆర్సీ సోమవారం వెల్లడించింది.ఈ చార్జీలు, ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ విచారణలో తెలపాలని కోరింది. అలాగే ఆన్లైన్ సూచనలు, అభ్యంతరాలను ఈనెల 14వ తేదీలోగా కమిషన్ చిరుమానాకు పోస్టు ద్వారాగానీ, ఈ–మెయిల్ ద్వారాగానీ పంపాలని కోరింది. అయితే.. ఈ విచారణ నామమాత్రమే. డిస్కంలు ప్రతిపాదించిన మేరకు చార్జీలు వసూలు చేసుకునేందుకు మండలి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఎఫ్‌పీపీసీఏ చార్జీలు ఒక్కో డిస్కంలోనూ ఒక్కో విధంగా ఉండనున్నాయి. వాటికి ప్రసార, పంపిణీ నష్టాలు(టీఆండ్‌డి)లను కూడా డిస్కంలు కలిపాయి. డిస్కంలలో ఈ నష్టాలు 7.99 శాతం నుంచి 10.90 వరకూ ఉన్నాయి. ఈ రెండూ కలిపి చార్జీల రూపంలో అమల్లోకి వస్తే ఒక్కో వినియోగదారునిపైనా నాలుగు త్రైమాసికాలకు కలిపి యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం పడనుంది.చంద్రబాబు పచ్చి మోసం సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ఇప్పటికే ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరో హామీని తుంగలో తొక్కారు. గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచకపోయినా పెంచేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విద్యుత్ చార్జీలనూ పెంచబోమని ప్రకటించారు. చివరకు ఎప్పటిలాగానే ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా విద్యుత్ వినియోగదారులకు చార్జీలు పెంచుతున్నారు. ఇదే చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ఈఆర్సీని తప్పుదోవ పట్టించారు.డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలను సమరి్పంచకుండా అడ్డుకున్నారు. దాంతో ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆ భారం పడింది. అప్పటికే డిస్కంలు రూ.వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయాయి. చంద్రబాబు హయాంలో వసూలు చేయని ట్రూ అప్ చార్జీలను డిస్కంలు వసూలు చేసుకుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి.. ప్రజలపై సర్దుబాటు పేరిట చార్జీల పిడుగు వేస్తున్నారు. -
పోర్టుల్లో చార్జీల తగ్గింపు
న్యూఢిల్లీ: ఎగుమతి, దిగుమతిదారులు ఎదుర్కొంటున్న నౌకా రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా పోర్టుల్లో కొన్ని రకాల చార్జీలు తగ్గించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ద్వారా ఐదు సెకండ్ హ్యాండ్ కంటెయినర్ వెసెల్స్ (సరుకులు, ఉత్పత్తుల రవాణాకు ఉపయోగించే) కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.వాణిజ్య, పరిశ్రమలు, షిప్పింగ్, పోర్టులు, ఫైనాన్స్, పౌర విమానయాన, రైల్వే తదితర శాఖల సీనియర్ అధికారులు, ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో, కస్టమర్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, షిప్పింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం తర్వాత కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది. సమావేశం అనంతరం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. ‘తాజాగా తీసుకున్న చర్యలు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే, ఖాళీ కంటెయినర్ల లభ్యత పెరుగుతుంది. సరుకులు వేగంగా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. పోర్టుల్లో రద్దీ గణనీయంగా తగ్గుతుంది’ అన్నారు. చర్యలు ఇవీ.. » కార్గో రవాణా సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఎస్సీఐ అదనంగా 5 సెకండ్ హ్యాండ్ కంటెయినర్ నౌకలను కొనుగోలు చేస్తుంది. » రైల్వే బోర్డు, కంటెయినర్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న కంటెయినర్లను యార్డులో 90 రోజుల పాటు చార్జీల్లేకుండా అందుబాటులో ఉంచుతా యి. 90 రోజుల తర్వాత రూ.3,000గా వసూ లు చేస్తున్న చార్జీని రూ.1,500కు తగ్గించారు. » కంటెయినర్ సామర్థ్యాన్ని 9,000 టీఈయూల మేర పెంచుతున్నట్టు ఎస్సీఐ ప్రకటించింది. » 40 అడుగుల కంటెయినర్‌కు రేట్లను రూ.9,000 నుంచి రూ.2,000కు తగ్గించారు. 20 అడుగుల కంటెయినర్ చార్జీలు రూ.6,000 నుంచి రూ.1,000కు దిగొచ్చాయి. -
పరిశ్రమలకు విద్యుత్ చార్జీల ‘హైటెన్షన్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు షాక్ కొట్టనున్నాయి. విద్యుత్ చార్జీలతోపాటు ఫిక్స్డ్ చార్జీలు కూడా పెరగబోతున్నాయి. లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించేవారికీ ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)లు వాతపెట్టబోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ.. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పిడీసీఎల్) బుధవారంరాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈ మేరకు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, కొత్త టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనిపై ఈఆర్సీ త్వరలో బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్‌టీలో ఏకరూప చార్జీలతో.. ప్రస్తుతం హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం పేరిట మూడు ఉప కేటగిరీల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మూడింటికి వేర్వేరు చార్జీలను విధిస్తున్నారు. ఇందులో 132 కేవీ చార్జీలు తక్కువగా, 33 కేవీ చార్జీలు కొంత తక్కువగా ఉండగా.. వీటికంటే 11 కేవీ చార్జీలు ఎక్కువగా ఇకపై అన్నింటికీ 11 కేవీతో సమానంగా.. ఎక్కువ చార్జీలను వసూలు చేయనున్నారు. అంటే 33కేవీ చార్జీలు ఒక్కో యూనిట్‌పై 50పైసల చొప్పున, 132కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీలు రూపాయి చొప్పున పెరగనున్నాయి. హెచ్‌టీ కేటగిరీలోకి సాధారణ పరిశ్రమలు, లైట్స్ అండ్ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్ పరిశ్రమలు, ఫెర్రో అల్లాయ్ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు. ఎల్టీ కేటగిరీలో 300 యూనిట్లు దాటితే వాతేఎల్టీ కేటగిరీలోని గృహ కనెక్షన్లకు లోడ్ సామర్థ్యం (కాంట్రాక్టెడ్ లోడ్) ఆధారంగా ప్రతి కిలోవాట్ (కేడబ్ల్యూ)కు రూ.10 చొప్పున ప్రస్తుతం ఫిక్స్డ్ చార్జీలను విధిస్తున్నారు. ఇకపై నెలలో విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించితే వారి ఫిక్స్డ్ చార్జీలను కిలోవాట్‌కు రూ.10కి బదులు రూ.50 చొప్పున వసూలు చేస్తారు. ఉదాహరణకు ప్రస్తుతం నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే గృహ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల కింద రూ.30 విధిస్తుంటే.. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రూ.150 విధిస్తారు. » ఇక ఎల్టీ కేటగిరీలోని ఇతర వినియోగదారులకు సంబంధించిన ఫిక్స్డ్ చార్జీల పెంపునకు కూడా డిస్కంలు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. లోటెన్షన్ కేటగిరీలోకి గృహాలు, గృహేతర/ చిన్న వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారులు వస్తారు. వీటికి విద్యుత్ చార్జీలను యథాతథంగా కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఆదాయ లోటు రూ.13,022 కోట్లు.. రాష్ట్ర డిస్కంలు 2024–25లో రూ.13,022 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేశాయి. ఇందులో ఎస్పీడీసీఎల్ వాటా రూ.8,093 కోట్లు కాగా ఎన్పిడీసీఎల్ వాటా రూ.4,929 కోట్లు. విద్యుత్ చార్జీల పెంపుతో రూ.1,200 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని.. మిగతా రూ.11,822 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుందని డిస్కంలు ఈఆర్సీకి ఇచి్చన ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. -
ఇంధన సర్దు‘బాదుడు’కు బ్రేక్ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పిఈసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తోసిపుచ్చింది. ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ 2023 జనవరి 18న ఈఆర్సీ జారీ చేసిన మూడో సవరణ నిబంధనలు–2023ను డిస్కంలు అమలుపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2023– 2024 ఆర్థిక సంవత్సరంలోని నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ డిస్కంలు దాఖలు చేసిన పటిషన్లకు విచారణ అర్హత లేదని తిరస్కరిస్తూ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.2023 ఏప్రిల్–జూన్, 2023 జూలై–సెప్టెంబర్, 2023 అక్టోబర్–డిసెంబర్, 2024 జనవరి–మార్చి త్రైమాసికాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు రెండు డిస్కంలు చెరో నాలుగు పిటిషన్లు దాఖలు చేయగా, అన్నింటినీ ఈఆర్సీ కొట్టి వేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగదారుల నుంచి ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడం ఇదే తొలిసారి. ఎందుకు తిరస్కరించిందంటే..? నిబంధనల ప్రకారం.. N నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను N+2 వ నెలకు సంబంధించిన బిల్లుతో కలిసి N+3వ నెలలో డిస్కంలు జారీ చేయాలి. N+2 నెల 15వ తేదీలోగా ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను డిస్కంలు తమ వైబ్సైట్లో ప్రకటించాలి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు ఆ తర్వాతి మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. డిస్కంలు ఒక నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించి సంబంధిత నెల ముగిశాక 45 రోజుల్లోగా దిన పత్రికల్లో యాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను అనుమతించరు. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతోపాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తుంది. యూనిట్ విద్యుత్‌కు గరిష్టంగా 30పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒకవేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్‌కి 30పైసలకు మించితే ముందస్తు అనుమతి లేకుండా ఆపైన ఉండే అదనపు చార్జీలు విధించడానికి వీలులేదు. 30 పైసల సీలింగ్‌కు మించి ఎఫ్ఎస్ఏ చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఈఆర్సీ నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఈ నిబంధనలను పాటించకపోవడంతో ఎఫ్ఎస్ఏ చార్జీల వసూలు చేసేందుకు ఉత్తర/దక్షిణ తెలంగాణ డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తాజాగా తిరస్కరించింది. కేంద్రం నిబంధనల ఆధారంగా ఇంధన/ విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమెటిక్‌గా విద్యుత్ బిల్లుల్లో బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్లా) రూల్స్ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా ఎక్కువ కావడంతో ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. దీని ఆధారంగానే గతేడాది ఈఆర్సీ ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. -
క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లిస్తున్నారా.. కొత్త చార్జీలు తెలుసుకోండి!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన 'హెచ్డీఎఫ్సీ' అద్దె చెల్లింపుల కోసం కొత్త ఫీజును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్రెడో, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లించే అద్దె మీద 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. దీనిని గరిష్టంగా రూ. 3వేలుకు పరిమితం చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ జూన్ 26న కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంటే ముందు.. క్రెడిట్ కార్లు చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ఇతర క్రెడిట్ కార్డు జారీదారులు, బ్యాంకులు కూడా ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లలో అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్లను అందించడం ఆపివేసాయి.2024 ఫిబ్రవరి 1 నుంచి అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి నిర్దిష్ట కార్డ్‌లు మినహా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులు, ఈ వాలెట్ లోడింగ్ లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు లభించడం లేదు. కాగా ఇప్పుడు హెచ్డీఎఫ్సీ చెల్లింపులపైన అదనపు ఫీజు చెల్లింపులను ప్రారంభించింది. ఈ మార్పులు 2024 ఆగష్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. -
టోలు ఒలుస్తున్నారు!
సాక్షి, అమరావతి: వాహనంతో రోడ్డెక్కితే చాలు ‘టోలు’ ఒలిచేస్తున్నారు. దేశంలో టోల్ చార్జీల రాబడి రికార్డుస్థాయిలో పెరిగింది. దేశంలో 2023–24లో రూ.64,809 కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేయడం విశేషం. ఇది 2022–23 కంటే 39శాతం అధికం. కేంద్ర ప్రభుత్వం ‘బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్’(బీవోటీ) విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తుండటంతో కొత్త రహదారులు టోల్ చార్జీల పరిధిలోకి వస్తున్నాయి. దేశంలో 2022 డిసెంబర్ నాటికి 35,996 కి.మీ.మేర టోల్ చార్జీలు వసూలు చేసే జాతీయ రహదారులు ఉండేవి. కాగా, 2023 డిసెంబర్ నాటికి జాతీయ రహదారులు 45,428 కి.మీ.కు పెరిగాయి. దాంతోపాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో టోల్ చార్జీల రూపంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ)కు ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. 8 కోట్లకుపైగా ఫాస్టాగ్‌లు వాహనదారుల నుంచి టోల్ చార్జీల వసూలు చేసేందుకు 2023, డిసెంబర్ నాటికి 8కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీచేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున రూ.147.31కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇక త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు విధానాన్ని ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. టోల్ చార్జీలను కూడా దశలవారీగా పెంచనుంది.వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ ముందుగా నిర్ణయించింది. కానీ, సాధారణ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం అమలును రెండు నెలలు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 5శాతం టోల్ చార్జీలను పెంచింది. శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు అమల్లోకి వచ్చినప్పుడు మళ్లీ పెంచే అవకాశం ఉంది. దీంతో వాహనదారులపై టోల్ చార్జీల భారం మరింత పెరగనుంది. -
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం(జూన్16) బాధత్యలు స్వీకరించారు. సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్ ఇచ్చారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందించారు. -
ఫోన్ నంబర్ ఇక ఫ్రీ కాదు.. ట్రాయ్ షాకింగ్ ప్రతిపాదన
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఫోన్ నంబర్ లేని వారంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతిఒక్కరికి వ్యక్తిగత ఫోన్ నంబరో లేక ల్యాండ్‌లైన్ నంబరో ఏదో ఒకటి ఉంటుంది. యూజర్లు తమ అవసరాలను బట్టీ వాటికి రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఫోన్ నంబర్ కోసం ఇప్పటి వరకూ ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్ కోసం త్వరలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్‌ను అత్యంత విలువైన, పరిమితమైన ప్రజా వనరుగా భావిస్తున్న ట్రాయ్ ఈ నంబర్లకు గానూ మొబైల్ ఆపరేటర్లపై ఛార్జీలు విధించాలని ప్రతిపాదించింది. కంపెనీలు వీటిని వినియోగదారుల నుంచి రికవరీ చేయవచ్చు. అలాగే ఎక్కువ నంబర్లు కలిగి తక్కువ వినియోగం ఉన్న టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే అవకాశాన్ని ట్రాయ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ సహా పలు దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్లకు ఫీజులు విధిస్తున్నాయి. భారత్‌లోనూ నంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి చర్యలను అవలంబించాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఛార్జీల అమలుకు ట్రాయ్ పలు మార్గాలను సూచించింది. ప్రభుత్వం ప్రతి నంబర్‌కు వన్ టైమ్ ఛార్జీ లేదా వార్షిక రుసుమును విధించవచ్చు. ఇక ప్రీమియం లేదా 'వీఐపీ' నంబర్ల కోసం వేలం నిర్వహించవచ్చు.प्रेस विज्ञप्ति संख्या 27/2024 - राष्ट्रीय नंबरिंग योजना के संशोधन पर परामर्श पत्र के संबंध में ।Press Release No. 27/2024 regarding Consultation Paper on Revision of National Numbering Plan.https://t.co/AQC11neBSr— TRAI (@TRAI) June 7, 2024 -
ఔటర్‌పై నేటి నుంచి పెరగనున్న టోల్ చార్జీలు
లక్డీకాపూల్: ఔటర్ రింగ్ రోడ్‌పై టోల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. సోమవారం నుంచి పెంచిన టోల్ చార్జీలు 5 శాతం అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్లకు ప్రతి కిలోమీటర్‌కి రూ.2.34 పైసలు, ఎల్‌సివి, మినీ బస్‌లకు రూ.3.77, బస్, 2–యాగ్జిల్ ట్రక్‌లకు రూ.6.69, భారీ నిర్మాణ మెషినరీ, ఎర్త్ మూ వింగ్ ఎక్విప్మెంట్లకు రూ.12.40, ఓవర్సైజ్డ్ వాహనాలకు రూ.15.09 చొప్పున టోల్ చార్జీలు పెరగనున్నాయి.కొత్త టోల్ రేట్లు, రో జువారీ పాసులు, నెలవారీ పాసులు తదితరాలకు హెచ్ఎండిఏ వైబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా ఐఆర్బి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ సంస్ధ నిర్వాహకులు సూచించారు. -
దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..
-
వాస్తవ ఖర్చులే ట్రూ అప్ చార్జీలు
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినవే.ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్‌కు ఎంత వసూలు చేయాలని ఈఆర్సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రతి రోజూ కొనే విద్యుత్‌కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్‌ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.ఖర్చు చేసినంతా కాదుడిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది. అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల్లో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ అకౌంట్, పొదుపు ఖాతాలపై కొన్ని సేవలకు ఛార్జీలను సవరించింది. మే 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. యావరేజ్ బ్యాలెన్స్, నగదు, ఏటీఎం లావాదేవీలకు పరిమితులు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజు, ఉచిత చెక్‌బుక్‌ల పరిమితికి సంబంధించిన ప్రమాణాలను బ్యాంక్ అప్డేట్ చేసింది.కీలక మార్పులు ఇవే..⇒ సగటు బ్యాలెన్స్ ప్రమాణాలుసంకల్ప్ సేవింగ్స్ అకౌంట్: సెమీ అర్బన్ అండ్ రూరల్‌లో రూ.2,500.రోజువారీ పొదుపు ఖాతా: మెట్రో అండ్ అర్బన్‌లో రూ.15,000, సెమీ అర్బన్‌లో రూ.5,000, రూరల్‌లో రూ.2,500.⇒ ఉచిత నగదు లావాదేవీ పరిమితులుడైలీ సేవింగ్స్/శాలరీ అకౌంట్, ప్రో సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్ అకౌంట్లలో ఇప్పుడు నెలకు 5 ఉచిత లావాదేవీలు లేదా గరిష్టంగా రూ .2 లక్షలకు పరిమితం చేసింది.ప్రివీ నియాన్/మాక్సిమా ఖాతాలకు సంబంధించి ఇప్పుడు నెలకు 7 ఉచిత లావాదేవీలు లేదా రూ.5 లక్షలకు పరిమితం చేసింది. అలాగే సోలో సేవింగ్స్ ఖాతాకు నెలకు ఒక ఉచిత లావాదేవీ లేదా రూ.10,000 కు తగ్గించింది.⇒ ఏటీఎం లావాదేవీ పరిమితులుఎవ్రీడే సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్, ప్రో సేవింగ్స్, ఏస్ సేవింగ్స్, ప్రివీ ఖాతాదారులకు కోటక్ ఏటీఎంలలో నెలకు 7 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు 7 ఉచిత లావాదేవీలు ఉంటాయి.కోటక్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో కలిపి నెలకు గరిష్టంగా 30 ఉచిత లావాదేవీలు ఉంటాయి.ఇక ఎవ్రీడే శాలరీ, ఎడ్జ్ శాలరీ అకౌంట్లకు కోటక్ ఏటీఎంలలో నెలకు 10 ఉచిత ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎలాంటి మార్పు లేదు. అపరిమిత ఉచిత లావాదేవీలు ఉంటాయి.⇒ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజుసేవింగ్స్, శాలరీ అకౌంట్లన్నింటికీ రూ.200 చొప్పున కొత్త రుసుము విధించనున్నారు. గతంలో ఎలాంటి చార్జీలు ఉండేవి కావు.⇒ చెక్ బుక్ లిమిట్సోలో సేవింగ్స్ అకౌంట్: ఏడాదికి 25 ఉచిత చెక్ లీవ్స్ నుంచి 5 ఉచిత చెక్ లీఫ్లకు తగ్గించారు.⇒ లావాదేవీ వైఫల్య రుసుముడెబిట్ కార్డు/ఏటీఎం వినియోగ రుసుము: సరిపడా నిధులు లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే ఒక్కో లావాదేవీకి రూ.25 చార్జీ ఉంటుంది. చెక్ జారీ చేసినప్పుడు, రిటర్న్ చేసినప్పుడు తీసుకునే ఫీజు రూ.250కి పెరిగింది. -
సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!
సెలబ్రిటీలకు స్టయిల్ని అద్ది.. వాళ్లను ఫ్యాషన్ స్టార్స్‌గా తీర్చిదిద్దే స్టయిలిస్ట్‌లు ఉంటారు. ముఖ్యంగా చీర కట్టు అనేది ఎప్పటికీ స్పెషల్. దీన్ని ప్రోషెషన్గా ఎంచుకుని సినీ సెలబ్రిటీలకు కట్టే స్థాయికి వెళ్లింది స్టార్ స్టయిలిస్ట్ డాలీ జైన్. ఆమె ఎలా శారీ డ్రేపర్‌గా మారిందో తెలుసుకుందామా..! ‘ఆరు గజాల ప్రతి చీరా నాకు 360 రకాల కట్టుతీరుల్ని, కుచ్చిళ్లను పరిచయం చేస్తున్నట్టనిపిస్తుంది’ అంటుందీ చీరకట్టు స్పెషలిస్ట్. దీపికా పదుకోణ్, ఆలియా భట్, ప్రియంకా చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, నీతా అంబానీ, ఈషా అంబానీ, శ్లోకా అంబానీ, రవీనా టండన్ వంటి సెలబ్రిటీలందరూ ఏ చిన్న ఫంక్షన్‌కి అటెండ్ కావాలన్నా డాలీ జైన్‌కి కబురు పెడతారు. ఆమె చేత చీర కట్టించుకుంటారు. అంతలా చీరకట్టును ఓ ప్రొఫెషన్ స్థాయికి తీసుకెళ్లిన డాలీ.. పెళ్లయిన కొత్తలో చీరంటే యమ చిరాకు పడేదట. బెంగళూరులో పుట్టిపెరిగిన ఆమె పెళ్లయ్యే వరకు జీన్స్.. టీ షర్ట్స్, కుర్తీలే ధరించేది. కానీ అత్తారింట్లో క్యాజువల్ వేర్ నుంచి అకేషనల్ వేర్ దాకా అన్నిటికీ చీరే మస్ట్ అని ఆమె సాసుమా ఆర్డర్ పాస్ చేశారు. తప్పక చీరకట్టుతో కుస్తీపట్టడం మొదలుపెట్టింది డాలీ. రోజూ ముప్పావు గంట పట్టేదట చీర కట్టుకునేసరికి. ఇప్పుడు రికార్డ్ రేంజ్లో 18.5 సెకన్లలో కట్టేస్తుంది.. కట్టిస్తుంది. ప్రొఫెషన్‌గా ఎలా మారింది? కారణం సినీతార శ్రీదేవే అనే ఆన్సర్ ఇస్తుంది డాలీ. చీరే కట్టుకోవాలి అని రూల్ పెట్టిన అత్తగారు.. కోడలు పడుతున్న అవస్థ చూసి జాలిపడి ‘కుర్తీలు వేసుకో’ అంటూ నియమాన్ని సడలించింది. అయితే అప్పటికే డాలీకి చీర మీద మోజు మొదలైంది. సో.. చీరనే కంటిన్యూ చేసింది. ఇంట్లో.. ఇరుగుపొరుగు.. బంధువుల్లో ఏ శుభకార్యం జరిగినా చీరకట్టడంలో అతివలకు సాయపడటమూ స్టార్ట్ చేసింది. అలాంటి ఒక సందర్భంలో ఆమె మేనమామ ఒక పార్టీ ఇచ్చాడు. అతను సినీతార శ్రీదేవి ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడట. అందుకని శ్రీదేవినీ ఆహ్వానించాడు. డాలీ కూడా వెళ్లింది. పార్టీలో శ్రీదేవి చీర మీద జ్యూస్ ఒలికిందట. ఆమె ఇబ్బందిపడుతుంటే డాలీ చొరవ తీసుకుని గబగబా మేనమామ భార్య చీరొకటి తెచ్చి.. శ్రీదేవికి ఇచ్చిందట. అంతేకాదు ఆమె చీరకట్టుకుంటూంటే.. కుచ్చిళ్లు పెట్టడంలో.. పల్లూ సెట్ చేయడంలో సహాయపడిందట కూడా. డాలీ చీరకట్టే నేర్పరితనానికి శ్రీదేవి అబ్బురపడుతూ ‘ఇన్నేళ్లుగా చీర కట్టుకుంటున్నాను.. ఇంతబాగా కుదిరిందిలేదెప్పుడూ! దీన్ని ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చుగా?’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట. ఆలస్యం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇదిగో ఇలా ఫేమస్ అయింది డాలీ. వందల్లోంచి లక్షల్లోకి... దాదాపు 20 ఏళ్లుగా శారీ డ్రేపర్ ప్రొఫెషన్లో కొనసాగుతూన్న డాలీ జైన్.. తొలి పారితోషికం రూ. 250. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుంది. ఆమె దగ్గర 20 మంది సభ్యులతో కూడిన టీమ్ ఉంటుంది. చీరనే కాదు.. హాఫ్ శారీ, దుపట్టా.. ఇలా అన్నిటినీ సెట్ చేస్తుంది. ఈ స్టయిలింగ్‌లో ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీలేం లేవు ఆమెకు. కేవలం చీర కట్టు మీద తనకున్న మమకారం.. సృజనతోనే ఈ స్థాయికి ఎదిగింది. తనలాంటి గృహిణులు ఎందరికో స్ఫూర్తిని పంచుతోంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ? డాలీ జైన్ టాలెంట్ ఫ్యాషన్ డిజైన్ సందీప్ ఖోస్లా దృష్టిలో పడింది. నీతా అంబానీ 50 వ పుట్టిన రోజు ఫంక్షన్లో ఆమెకు చీర కట్టేందుకు డాలీని రికమెండ్ చేశాడు అతను. ఆ వేడుకలో మరెందరో సెలబ్రిటీల దృష్టిలోపడి బాలీవుడ్ ప్రవేశాన్ని సాధించింది. ఆమె ఫస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీ వేడుక.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ వెడ్డింగ్. అక్కణ్ణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎందరికో డాలీ ఫేవరేట్ శారీ డ్రేపర్ అయిపోయింది. -
అంబానీ ఇంట పెళ్లికి షారూఖ్ పెర్ఫార్మెన్స్? ఫీజు అన్ని కోట్లా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కూతురు రాధిక మర్చంట్‌ను పెళ్లాడనున్నాడు.మరి కుబేరుడి ఇంట్లో పెళ్లి సందడి క్రేజ్ మామూలుగా ఉండదుగా. ఈ నేపథ్యంలోనే వారి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అనంత్-రాధిక వెడ్డింగ్ వేడుకల్లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో అతిథులను అలరించనున్నాడని రిపోర్టులు ద్వారా తెలుస్తోంది. ఇందుకు ఏకంగా రూ. 3-4 కోట్లు డిమాండ్ చేసినట్లు పలు నివేదికలుసూచిస్తున్నాయి. షారుఖ్ ఖాన్‌తో పాటు, బాలీవుడ్ స్వీట్ కపుల్ రణబీర్, అలియా, అలాగే సింగర్ దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయట. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ ముంబైకి వెళ్లేందుకు జామ్‌నగర్ విమానాశ్రయంలోకి వెళ్లే వీడియో ఒకటి కనిపించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్షిప్లో నల్ల జాకెట్‌తో, స్టైలిష్ లుక్‌లో కనిపించిన షారుక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.షారుక్ రిహార్సల్స్ కోసం జామ్‌నగర్‌ను వెళ్లాడంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Latest - SRK spotted at the Reliance township of Jamnagar ❤️@iamsrk #SRK #ShahRukhKhan pic.twitter.com/1mE5yJlmPO — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 22, 2024 పలు నివేదికల ప్రకారం జూలైలో వీరి పెళ్లి జరగనుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. అంబానీ ఇంట పార్టీ అంటే పలువురు రాజకీయ, వ్యాపార, క్రీడారంగ ప్రముఖులతోపాటు, బాలీవుడ్ సెలబ్రిటీల సందడి కూడా తప్పక ఉంటుంది. అంతేకాదు మార్చి ప్రారంభంలోప్రీ వెడ్డింగ్ వేడుకలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ పలువురు గ్లోబల్ బిజినెస్ దిగ్గజాలు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం. -
సిలిండర్ ఈకేవైసీ @ రూ.150
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభానికి ముందే అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. ఈకేవైసీ పేరుతో అందినకాడికి దోచుకుంటున్న విషయం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక శివనగర్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీకి రూ.150 చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటుగా కచ్చితంగా పైపు తీసుకోవాలనే నిబంధన ఉందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారిని వివరణ కోరగా.. ఈకేవైసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
నీతా అంబానీ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా!
సెలబ్రెటీలకు ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్‌లు ఉంటారు. వాళ్లు మేకప్ వేసుకున్నట్లు అనిపించకుండా నేచురల్‌గా ఉండేలా చేయడంలో మంచి నైపుణ్యం ఉన్నవారు. అలాంటి ఆర్టిస్ట్‌లు ఒక్క వ్యక్తికి మేకప్ వేయడానికి ఎంత తీసుకుంటారో వింటే షాకవ్వుతారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు నిషా సింగ్. ఆమె ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్ల వద్ద మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అలాగే కొన్ని బాలీవుడ్ సనిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆమె ఓ కల్చర్ సెంటర్(ఎన్ఎంఏసీసీ) ఈవెంట్ హాజరయ్యేందుక వెళ్తున్న నీతాఅంబానికి మేకప్ వేయాల్సి వచ్చింది. మొదట నిషా నీతాకు తన పని నచ్చుతుందా అని సందేహించారు. ఆ ఈవెంట్లో ఆమె బనార్సీ చీరలో అందంగా కనిపించేలా చేశారు. తొలుత నీతా అంబానీకి తానే మేకప్ వేయడానికి వెళ్తున్నానా! అని ఆశ్చర్యం వేసింది, పైగా ఎలా వేస్తానో? అని గాబరా పడిపోయానంటోంది నిషా. అయితే తాను వేసిన మేకప్ నీతా అంబానికీ నచ్చడమే గాక ఆకట్టుకునేలా వేశారని తనని మెచ్చకున్నట్లు చెప్పుకొచ్చారు నిషా. నీతా అంబానీతో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చారు నిషా. బీర్సింగ్లో పుట్టిన నిషా ప్రస్తుతం ముంబైలో నివశిస్తున్నారు. ఆమె ఏడేళ్లు మేకప్, హెయిర్ స్ట్రైలింగ్లో మంచి శిక్షణ పొందిన ఆర్టిస్ట్. పైగా గౌరిఖాన్ మీరా రాజ్‌పుత్, కరణ్ జోహార్, కియారా అద్వానీ, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, షానాయ కపూర్, సారా అలీఖాన్, వాణి కపూర్, మానుషి చిల్లర్, అతియా శెట్టి, యామీ గౌతమ్ వంటి ప్రసిద్ధ బాలీవుడ్ ప్రముఖులతో కలసి పనిచేశారు. నిషా సింగ్ తల్లి రామ్లఖాన్ సింగ్ టాటా మోటార్స్‌లో ఉద్యోగి కాగా, ఆమె తండ్రి అజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇద్దరూ ఇప్పుడు రిటైరయ్యారు. అంతేగాదు మేకప్ ఆర్టిస్ట్‌గా ధడక్, జగ్ జగ్ జీయో, భూల్ భూలయ్యా 2, పృథ్వీరాజ్ చౌహాన్, ఘోస్ట్ స్టోరీస్ వంటి చలనచిత్రాలకు కూడా పనిచేయడం విశేషం. ఆమెకు సోషల్ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. అంతేగాదు ప్రముఖ సెలబ్రెటీ క్లయింట్లకు సంబంధించిన వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటారు. ఇక ఒక్కో క్లయింట్‌కి నిషా సుమారు రూ. 30 వేలకు పైనే చార్జ్ చేస్తుందట. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah) (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు. న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు. -
న్యాయమూర్తులపైనే దాడులా? చీఫ్ జస్టిస్ సీరియస్
ఢిల్లీ: సమాజంలో న్యాయాన్ని కాపాడేవారు న్యాయమూర్తి. అలాంటి హోదా ఉన్న వ్యక్తి అంటే గౌరవం ఉంటుంది. కానీ అలాంటి జడ్జికే లైంగిక వేధింపులు ఎదురైతే? ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశంలో సహచర సీనియర్ న్యాయమూర్తులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళా జడ్జి ఆరోపించారు. స్థానికంగా న్యాయ పోరాటం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చనిపోవడానికి అనుమితి ఇవ్వాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు లేఖ కూడా రాశారు. ఉత్తరప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా జడ్జి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ' ప్రజలకు సేవలు చేసే న్యాయమూర్తి వృత్తిలో తక్కువ కాలంలోనే నాకు గొప్ప అగౌరవం జరిగింది. కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు' అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. 'ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎలాంటి చర్యలు లేవు. హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీని సంప్రదించాను. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. సాక్షులు ప్రభావితం కాకుండా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. కానీ నా అభ్యర్థనను కొట్టివేశారు. ఏడాదిగా ఈ బాధ అనుభవిస్తున్నా. నేను బతికుండి ప్రయోజనం శూన్యం. గౌరవప్రదంగా చనిపోవడానికి అనుమతినివ్వండి' అంటూ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించారు. ఈ అంశంపై స్టేటస్ అప్డేట్ కోరాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. తదనంతరం, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నుంచి కూడా నివేదికను కోరారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
బ్యాంక్ లాకర్లపై అనాసక్తి
ముంబై: బ్యాంక్ లాకర్లు.. ఒకప్పుడు వీటిని పొందడం కష్టంగా ఉండేది. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా అన్నట్టు గతంలో పరిస్థితి. కానీ, ఇప్పుడు బ్యాంక్ లాకర్లు అంటే చాలా మందిలో అనాసక్తి నెలకొంది. లాకర్ చార్జీలు గణనీయంగా పెరిగిపోవడం, క్లిష్టమైన కేవైసీ ప్రక్రియ తదితర ఎన్నో అంశాలు లాకర్లు అంటే మొహం మొత్తిపోయేలా చేస్తున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు లాకర్లను ఇటీవలి కాలంలో మూసివేయడం, లేదంటే మూసివేయాలనే యోచనతో ఉన్నారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. 11,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని లోకల్ సర్కిల్స్ ఈ వివరాలను విడుదల చేసింది. లాకర్లను మూసివేసినట్టు 36 శాతం మంది చెప్పగా.. అధిక చార్జీల కారణంగా లాకర్లను మూసివేయాలని అనుకుంటున్నట్టు 4 శాతం మంది పేర్కొన్నారు. 16 శాతం మంది లాకర్ సైజును తగ్గించుకున్నట్టు చెప్పారు. నూతన చార్జీలు తమకు సమ్మతమేనని, లాకర్లను కొనసాగిస్తామని 36 శాతం మంది వెల్లడించారు. ‘‘బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో శాఖకు వచ్చి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కస్టమర్లను బ్యాంక్‌లు కోరుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి లీజ్ డాక్యుమెంట్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో లాకర్ చార్జీలు కూడా పెరిగాయి’’అని లోకల్ సర్కిల్స్ తెలిపింది. చార్జీలు గణనీయంగా పెరగడం వల్లే తాము లాకర్లను రద్దు చేసుకున్నామని, లేదంటే మూసివేయాలని అనుకుంటున్నామని, లేదంటే సైజును తగ్గించుకుంటామని 56 శాతం మంది చెప్పినట్టు ఈ సంస్థ వెల్లడించింది. -
AP: గ్యాస్ సిలిండర్ డెలివరీకి చార్జీలు చెల్లించొద్దు
సాక్షి, అమరావతి: గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 15 కిలో మీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కానీ గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని కోరారు. -
పోలీసులపై స్థానిక ప్రజల ఎదురుదాడి.. 'సీఐ' ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి.. మరీ
సాక్షి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూర్‌లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ఎక్లాస్పూర్, జిన్నారం, చిత్తనూర్, చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామాల శివారుల్లో పారబోస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ట్యాంకర్ వ్యర్థాలను నింపుకొని బయటికి రావడాన్ని గమనించిన గ్రామస్తులు.. ఎక్లాస్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అడ్డుకున్నారు. ఇథనాల్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. 16 గంటలపాటు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం తహసీల్దార్ సునీత అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ నెల 25న ఆర్డీఓ సమక్షంలో కంపెనీని పరిశీలిస్తామని చెప్పినా వినలేదు. ట్యాంకర్లో ఉన్న కెమికల్‌ను పరీక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు భీష్మించారు. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మరికల్, మక్తల్, నర్వ, ధన్వాడ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులపై లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలవగా.. పొలాల వెంబడి గ్రామస్తులు పరుగులు పెట్టారు. ఇదే సమయంలో ఇథనాల్ కంపెనీ ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇటుకలు, కర్రలతో దూసుకురావడంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. మక్తల్ సీఐ రాంలాల్‌ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొందరు పోలీసులు పక్కనే ఉన్న నరసింహస్వామి ఆలయ గదిలోకి వెళ్లారు. అనంతరం అరెస్ట్ చేసిన ఆందోళనకారులను వదిలిపెట్టి, గదిలో ఉన్న పోలీసులను విడిపించుకున్నారు. గాయపడిన పోలీసులు.. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ ఆందోళనలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణలో మక్తల్ సీఐ రాంలాల్తోపాటు కృష్ణ ఎస్ఐ విజయభాస్కర్, కానిస్టేబుళ్లు అనిత, అరుణ, వెంకటేశ్వరమ్మ, చెన్నరాయుడు, నవ్వు శ్రీనులకు గాయాలయ్యాయి. అలాగే పోలీస్ టీఆర్ గ్యాస్ వాహనంతోపాటు రెండు బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కంపెనీకి వెళ్లే 8 లారీల అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు టైర్లలో గాలి తీశారు. ఈ ఘటనకు కారణమైన వారి ఆచూకీ కోసం చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాలను జల్లెడ పడుతున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కాలు విరగొట్టారు.. పోలీసులు కర్రలతో కొట్టడంతో కాలు విరిగిపొయింది. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి తమకు ప్రాణహాని ఉందని రెండేళ్ల నుంచి ఆందోళన చేస్తున్నాం. పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం వల్ల చాలామంది గాయపడ్డారు. ఇంకా కంపెనీని రద్దు చేసే వరకు నిద్రపోం. – చంద్రమ్మ, జిన్నారం ప్రాణం పోయినా.. పట్టువదలం! ఇక్కడి నుంచి కంపెనీ ఎత్తివేసే వరకు తమ పోరాటం ఆగదు. ఇథనాల్ కంపెనీ నుంచి ప్రమాదం కలిగించే కెమికల్స్‌ను గ్రామ శివారులో వేయడం వల్ల దుర్వాసన వస్తోంది. వ్యర్థాలను తరలించే ట్యాంకర్‌ను అడ్డుకొని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు దాడిచేసి గాయపర్చారు. అక్కడి నుంచి పరుగు తీసినా వదిలిపెట్టలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. కంపెనీని తొలగించే వరకు ఆందోళన చేస్తాం. – హన్మమ్మ, మానస, ఎక్లాస్పూర్ డీఎస్పీదే బాధ్యత.. ఇథనాల్ కంపెనీ నుంచి బయటకు తెచ్చి పారబోస్తున్న విష రసాయనాల ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసు లను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించిన డీఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యు డు చక్రవర్తి అన్నారు. కంపెనీ నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తీసుకువచ్చి జిన్నారం, ఎక్లాస్పూర్, చిత్తనూర్, ఉంద్యాల గ్రామాల పక్కన పారపోయడంపై తహసీల్దార్‌తో మాట్లాడుతుండగా డీఎస్పీ పోలీసులను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించారని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు. -
ఏసీ బస్సుల్లో ‘స్నాక్స్’ బాదుడు!.. తప్పక చెల్లించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఏసీ బస్సుల టికెట్ ధరలను ఆర్టీసీ సవరించింది. ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ప్రతి టికెట్‌పై రూ.30 చొప్పున పెంచింది. ఏసీ స్లీపర్ సర్వీసు లహరి, గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సుల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ ప్యాకెట్‌ను అందించటాన్ని ప్రారంభించిన ఆర్టీసీ, ఆ తినుబండారాల చార్జీ రూపంలో రూ.30 చొప్పున పెంచుతూ టికెట్ ధరలను సవరించింది. ఈ కొత్త ధరలను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి అమలులోకి తెచ్చింది. చిరు ధాన్యాలతో స్నాక్స్ రూపొందించే ట్రూ గుడ్ అన్న సంస్థతో ఇటీవలే ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ప్రయాణికులకు సరఫరా చేస్తోంది. నో ఛాయిస్.. సాధారణంగా ఇలాంటి తినుబండారాలను అందించేటప్పుడు ప్రయాణికుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇటీవల సూపర్ లగ్జరీ బస్సుల్లో అరలీటరు మంచినీటి సీసాను అందించే నిర్ణయం తీసుకున్నప్పుడు రూ.10 చొçప్పున టికెట్ ధరను పెంచిన విషయం తెలిసిందే. ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, కచ్చితంగా పెంచిన ధరను చెల్లించేలా అమలులోకి తెచ్చింది. ఇప్పుడు కూడా, స్నాక్స్ ప్యాకెట్‌ను విధిగా తీసుకోవాల్సిందే. టికెట్లోనే దాని ధరను చేర్చినందున స్నాక్స్ ప్యాకెట్ రుసుమును కచ్చితంగా చెల్లించాల్సినట్టవుతుంది. ఏముంటాయంటే.. టికెట్ తీసుకోగానే ప్రయాణికుడికి ఓ ప్యాకెట్ ఇస్తారు. ట్రూ గుడ్–ఆర్టీసీ సంయుక్త వివరాలతో ఈ ప్యా కెట్లను రూపొందించారు. ఆ ప్యాకెట్లో చిరుధాన్యా లతో రూపొందించిన 25 గ్రాముల మురుకులు/కా రప్పూస, పప్పు చెక్క, సేగు (ఇవి ఒక్కో ప్యాకెట్లో ఒ క్కోరకం ఉంటుంది), 20 గ్రాముల మిల్లెట్ చిక్కీ, ఒక మిల్లెట్ రస్్కలతో కూడిన విడివిడి ప్యాకెట్లు ఉంటా యి. ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాలతో రూపొందించిన చిరుతిండిని అందించాలని నిర్ణయిం చినట్టు గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ‘స్నాక్స్’వల్ల పెరిగే ఆదాయం ఏమేరకు? ప్రస్తుతం ఆర్టీసీ ఏసీ బస్సుల్లో నిత్యం దాదాపు 16 వేల నుంచి 18 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.30 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నందున ఆర్టీసీకి నెలకు రూ.కోటిన్నర వరకు ఆదాయం పెరుగుతుంది. అయితే, తయారీ కంపెనీ నుంచి ఒక్కో ప్యాకెట్‌పై ఆర్టీసీ రూ.18 వరకు వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఆ లెక్కన దీన్ని పెద్ద ఆదాయంగా పరగణించాల్సిన అవసరం ఉండదు. -
రైతుబంధు చైర్మన్‌గా టి.రాజయ్య బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతుబంధు సమితి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. ఈ సమితిలో 1.60 లక్షల మంది సభ్యులున్నారని, సీఎం కేసీఆర్ సహకారంతో ఈ సంస్థను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పదేళ్లలో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రపంచంలోనే వినూత్నమైన రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని రాజయ్య పేర్కొన్నారు. -
అందరికీ అందుబాటులోకి స్వచ్ఛ ఇంధనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అందరికీ కాలుష్యం లేని స్వచ్ఛ ఇంధనం అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి, వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను తయారు చేసింది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తేవాలని, దాని కోసం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022లో నిబంధనలు జారీ చేసింది. వాటిని అనుసరించి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వినియోగదారులు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181 (1) ప్రకారం నడుచుకోవడానికి రాష్ట్ర కమీషన్లు చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజా డ్రాఫ్డ్‌ను తీసుకువచ్చినట్లు ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నియంత్రణ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లు (సరఫరా వ్యవస్థలు), విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వర్తిస్తుంది. కొత్త నిబంధనలివీ.. ♦ గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం.. దివాలా తీసిన సంస్థలు, డిస్కంలకు రెండు నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న సంస్థలు, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు ఓపెన్ యాక్సెస్‌ను పొందడానికి అర్హత లేదు.అరు్హలైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ♦ దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ(ఏపీ ట్రాన్స్‌కో) నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులన్నీ నేరుగా సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి. ♦ సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ♦ అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ జనరేటర్లకు కనెక్టివిటీ మంజూరు చేస్తారు ♦వినియోగదారులు, జనరేటర్ల మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాలలో పేర్కొన్న విధంగానే ఛార్జీలు వర్తిస్తాయి. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు, స్టాండ్‌బై ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, రియాక్టివ్ ఎనర్జీ ఛార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ వర్తించవు. ఉదాహరణకు 2032 డిసెంబర్‌లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్‌లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్‌ఛార్జి వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 1 లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. ♦ రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారులకు వార్షిక ప్రాతిపదికన గ్రీన్ సర్టిఫికేట్ అందించాలి. ఓపెన్ యాక్సెస్ అంటే.. విద్యుత్తు వినియోగదారులు ఎవరైనా వారికి నచ్చిన పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ నుంచి నేరుగా కరెంటును పొందే వెసులుబాటు. ఇందుకు ఈ వినియోగదారులు నోడల్ ఏజెన్సీ అనుమతి పొంది తగిన చార్జీలు చెల్లించి ఈ విద్యుత్తును పొందవచ్చు. -
ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా..
టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తరుణంలో ఏమి కావాలన్నా.. ఇంట్లో కూర్చుని పొందగలుగుతున్నారు. కేవలం వస్తువులు మాత్రమే కాకుండా, ఫుడ్ కూడా ఉన్న చోటికే ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు బిల్లు చూస్తే చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, అహ్మదాబాద్‌కి చెందిన ఒక మహిళ జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమెకు వచ్చిన బిల్ చూసి ఒక్క సారిగా అవాక్కయింది. ఎందుకంటే బిల్లులో కంటైనర్ చార్జీలు కూడా కలిపి ఉన్నారు. ఆమె మూడు ప్లేట్స్ 'దూది తెప్లా' (Dudhi Thepla) ఆర్డర్ చేసింది. ఒక ప్లేట్ ధర రూ. 60 కావడంతో మొత్తం బిల్లు రూ. 180 అయింది. కానీ ఇందులో కంటైనర్ చార్జీలు కూడా కలిపి రూ. 249గా నివేదించారు. బిల్ అందుకున్న మహిళ, దానిని స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ (ట్విటర్) ద్వారా షేర్ చేసింది. ఆర్డర్ చేసిన ఆహారానికి కంటైనర్ చార్జీలు కూడా వసూలు చేస్తారా అంటూ వాపోయింది. దీనికి స్పందించిన కంపెనీ కంటైనర్ చార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆర్డర్ చేసిన ఆహారానికి 5 నుంచి 18 శాతం వరకు చార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని తెలిపింది. ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే.. సోషల్ మీడియాలో వెల్లడైన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అదనపు చార్జీలు చిరాకును తెప్పిస్తాయని, మరికొందరు బిల్లు ముందుగానే చూసుకోవాలి కదా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అదనపు ఛార్జీలకు సంబంధించిన సంఘటనలు గతంలో కూడా చాలా వెల్లడయ్యాయి. Hi Khushboo, while taxes are universal and vary from 5 - 18% depending on the type of food. Packaging charges are levied by our restaurant partners, they are the ones who implement and earn from this practice. For further clarification please feel free to initiate a private (1/2) — zomato care (@zomatocare) August 2, 2023 -
కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు..
ఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు మోపింది సీబీఐ. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారా వద్ద సిక్కులను హత్య చేయడానికి ఆందోళనకారులను రెచ్చగొట్టాడని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడులకు జగదీశ్ టైట్లర్ రెచ్చగొట్టాడని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని ఛార్జిషీటులో పేర్కొంది. ఇదీ చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు?
పెన్సిల్వేనియాకు చెందిన 5 ఏళ్ల బాలుడిని అతని పెంపుడు తల్లి, ఆమె భర్త చిత్రహింసలకు గురిచేసి చంపేశారని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో చెప్పడంతో పోలీసులు ఆ భార్యాభర్తలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బాలుని హత్య గత ఫిబ్రవరిలో జరిగింది. డెల్మాంట్కు చెందిన లారెన్, జాకబ్ మలోబెర్టిలు గత ఫిబ్రవరి 7న చిన్నారి లాండన్ మలోబెర్టిని అత్యంత కరాతకంగా హత్యచేశారని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వెల్లడించారు. తల్లిదండ్రుల చేతుల్లో చిత్రహింసకు గురై.. లాండన్‌కు తల, మెడపై తీవ్రమైన గాయాలున్నాయని, బాలుని మొండెంపై కూడా గాయాలున్నాయని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నికోల్ జిక్కారెల్లి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాగా జనవరి 30న గాయాలపాలై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న చిన్నారిని ఆ దంపతులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. జిక్కారెల్లి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం తల్లిండ్రుల చిత్రహింసలకు గురైన ఆ చిన్నారి ఒక వారం రోజుల తర్వాత మరణించాడు. అతనిని దత్తత తీసుకున్న కుటుంబం చేతిలోనే ఆ బాలుడు విలవిలలాడిపోయి చివరికి కన్నుమూశాడు. అంత్యక్రియల ఖర్చుల పేరుతో.. అయితే ఆ బాలుని తల్లిదండ్రులు గో ఫండ్ ద్వారా నిధులను సేకరించారు. పిల్లవాడి అంత్యక్రియల ఖర్చుల కోసం $5,000లకుపైగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు బృంద తెలిపింది. యూపీఎంసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఐదేళ్ల చిన్నారికి మెదడులో రక్తస్రావం జరిగింది. ఆ బాలుని తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక రోజంతా వేచి చూశారు. పిల్లవాడి శరీరంపై గతంలో అయిన గాయాలు, క్తొతగా అయిన గాయాలు ఉన్నాయని, ఇవి శారీరక వేధింపుల కారణంగా అయిన గాయాలేనని వైద్యులు చెప్పారు. ఇది కూడా చదవండి: కెనడా మానవ అక్రమ రవాణా కేసులో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష.. దుర్భర స్థితిలో.. బాలునికి గాయాలు సంభవించిన సమయంలో విపరీతమైన నొప్పిని అనుభవించాడని వైద్యులు తెలిపారు. ఆ బాలుడు కనీసం నిలబడలేకపోయాడని, తినడానికి, తాగడానికి వీలుకాని పరిస్థితిలో దుర్భర స్థితిని ఎదుర్కొన్నాడని వారు పేర్కొన్నారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో అతని అవయవాల పనితీరు మరింతగా బలహీనపడిందని వైద్యులు తెలిపారు. కాగా లాండన్‌కు బొమ్మ రాక్షసునితో, ట్రక్కులతో ఆడుకోవడం, దేశీయ సంగీతాన్ని పాడడం అంటే ఎంతో ఇష్టం. అయితే అతని పెంపుడు తండ్రి లారెన్ తన కుమారుని విషయంలో విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శించాడు. లాండన్ తోబుట్టువులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తమ తండ్రి.. లాండన్‌ను చెక్క గరిటతో కొట్టడం లేదా స్ప్రే బాటిల్‌తో స్ప్రే చేయడం ద్వారా అతనిని ఏడ్పించేవారని తెలిపారు. బాలునిపై విపరీతమైన ద్వేషం అయితే లాండన్ పాఠం నేర్చుకోకపోవడం కారణంగానే అతని తల్లి లాండన్‌ను దండించేదని తోటి పిల్లలు తెలిపారు. లాండన్ తల్లి సహోద్యోగులు మాట్లాడుతూ ఆమె తన కొడుకుపై ద్వేషం పెంచుకున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 2022 నుండి బాలుడు చనిపోయే వరకు దంపతుల మధ్య నడిచిన సందేశాలు గమనిస్తే వారు లాండన్ విషయంలో విపరీతమైన ద్వేషం చూపారని దర్యాప్తు బృందం సభ్యులు కనుగొన్నారు. లాండన్ తల్లి లారెన్ ఒకసారి తాను కుమారుడిని చంపబోతున్నాను అని అని టెక్స్ట్ చేసింది. కాగా తన 25 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని డెల్మాంట్ పోలీస్ చీఫ్ టిజె క్లోబుకర్ పేర్కొన్నారు. లాండన్ తల్లిపై హత్య కేసుతో పాటు పిల్లల సంక్షేమానికి అపాయం కలిగించడం, వారిపై దాడి చేయడం, నేరపూరిత కుట్ర మొదలైన నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిస్పక్షపాతంగా విచారణ ఆమె భర్త కూడా ఇదేవిధమైన నేరాలకు పాల్పడ్డాడంటూ అతనిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు వీరిద్దరికీ బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం వీరు వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ జైలులో ఉన్నారు. ఆగస్టు 8న కోర్టులో తదుపరి విచారణకు వీరు హాజరుకానున్నారు. లాండన్ తన స్వల్ప జీవితంలోనే తీవ్రమైన గాయాలను చవిచూశాడని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నికోల్ జిక్కారెల్లి అన్నారు. లాండన్‌కు తగిన గౌరవాన్ని కల్పిస్తూ, కేసును నిస్పక్షపాతంగా విచారించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: దారుణం: మూడు రోజులపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని.. మహిళ గొంతు పోయేలా అరిచినా.. -
ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం..
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలు ఈ మేరకు తగ్గనున్నాయి. ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా ఛార్జీని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనుంది. "టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన ఉంది. ప్రతి రోజు సగటున 15 వేల వరకు తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించడం జరిగింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలి." అని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి నియామకం -
ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలను ఎత్తేసిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఆఫ్‌షోర్ పవన, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ చార్జీలను ఎత్తివేస్తూ 25 ఏళ్లపాటు ఉపశమనాన్ని కేంద్ర సర్కారు కల్పించింది. 2032 డిసెంబర్ 31 వరకు కార్యకలాపాలు ప్రారంభించే ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు, పర్యావరణ అనుకూల ఇంధనాల తయారీకి మద్దతుగా కేంద్ర సర్కారు తీసుకుంటున్న ఎన్నో చర్యల్లో దీన్ని కూడా ఒక భాగంగా చూడొచ్చు. ఇదీ చదవండి: Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు -
వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని నిర్ధాక్షిణ్యంగా చంపబోయాడు..కానీ..
ఓ టీనేజర్ పొరపాటున మరొకరి ఇంటి బెల్ మోగించాడు. అంతే ఓ వ్యక్తి ఏ మాత్రం కనికరం లేకుండా తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ టీనేజర్ తలలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ భయానక ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..16 ఏళ్ల అఫ్రికన్ అమెరికన్ రాల్ఫ్ పాల్ యార్ల అనే వ్యక్తి తన కవల సోదరులను స్నేహితుడి ఇంటి నుంచి పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. అప్పుడే అతను పొరబడి వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ను నాక్ చేశాడు. అంతే ఆ ఇంటి యజమాని ఆండ్రూ లెస్టర్ నిర్ధాక్షిణ్యంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో రెండు తుటాలు సరాసరి టీనేజర్ తలలోకి దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఆండ్రూ లెస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే గంటల కస్టడీ తర్వాత ఎలాంటి ఆరోపణలు మోపకుండానే అతను విడుదలయ్యాడు. దీంతో నల్లజాతీ యువకుడిపై కాల్పులు జరిపితే అలా ఎలా వదిలేస్తారని ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని నిరసనలు వెల్లవెత్తాయి. ఇది జాత్యాహంకారంతో జరిగినే హత్య అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు టీనేజర్ అత్త ఫెయిత్ స్ఫూన్‌మూర్ మాట్లాడుతూ.. తన మేనల్లుడు కెమికల్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడని, మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని చెప్పుకొచ్చారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో నల్లజాతీయులపై హింస జరుగతూనే ఉంది దీనికి జవాబుదారితనం వహించాల్సిందే అంటూ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు మిస్సోరీ పోలీస్ చీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇది జాతిపరంగా జరిగిన హత్యగా ఆయన పేర్కొనలేదు. తాను వారి ఆవేదనను అర్థం చేసుకుంటానని చెప్పారు. అలాగే జాతి పరంగా జరిగిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడమే గాక నిందితుడిని అదీనంలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. చివరికి నిందితుడు ఆండ్రూ లెస్టర్(85) వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక కోర్టు కూడా సదరు నిందితుడు సాయుధ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి దోషిగా తేల్చింది. అంతేగాదు అతనికి కోటి రూపాయాల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. అదృష్టవశాత్తు టీనేజర్ కూడా కొద్దిలో ప్రాణాపాయంతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సదరు బాధితుడితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్లో సంభాషించి..క్షేమ సమాచారాలను అడిగినట్లు వైట్‌హౌస్ పేర్కొనడం గమనార్హం. (చదవండి: అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి) -
కిడ్నాప్ నాటకంతో డబ్బులు కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..
ఒక అమాయక భర్తకి మీ భార్య కిడ్నాప్ అయ్యిందంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆమెను వదిలేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే చిత్రహింసలకు గురిచేస్తాం అని కూడా బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేసును విచారించిన పోలీసులు సైతం నివ్వెరపోయారు. చివరికి అతడి భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ అనూహ్య ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. దక్షిణాఫ్రికాలోని 47 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళ ఫిరోజా బీ బీ జోసెఫ్ తాను కిడ్నాప్ అయ్యినట్లు నాటకం ఆడింది. అందుకోసం తన భర్తకి ఒక అపరిచిత వ్యక్తి చేత ఫోన్ చేయించి..మీ భార్యను కిడ్నాప్ చేశామని, వదిలేయాలంటే పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇంతలో మరుసటి రోజు కూడా డబ్బుల తొందరగా ఇవ్వకపోతే గనుక ఆమెను చిత్రహింసలకు గురి చేస్తాం అని మరోసారి సదరు వ్యక్తి నుంచి కాల్ వచ్చింది ఆమె భర్తకు. దీంతో పోలీసులు ఆ ఫోన్ కాల్స్‌ని ట్రేస్ చేసి ఆ దిశగా దర్యాప్తు సాగించగా.. అసలు విషయం బయటపడింది. అతడి భార్య జోసఫ్ పీటర్‌మారిట్జ్‌బర్గ్ నగరంలోని ఒక హోటల్ల గదిలో ఉంటున్నట్లు తేలింది. అలాగే కిడ్నాపర్లు దొంగలించారన్న ఆభరణాలన్ని కూడా ఆమె అధీనంలోనే ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఆమె ఆ హోటల్లో బస చేసినట్లు సీసీఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించారు. అక్కడ ఆమె వేరే పేరుతో లగ్జరీగా నివశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కిడ్నాప్ నాటకంతో భర్త నుంచి డబ్బులు కాజేయాలనుకుని చివరికి కటకటాలపాలైంది. (చదవండి: అతని జీవితం నాశనం అయ్యింది.. భారతీయుడికి రూ.11 కోట్లు చెల్లించాలని ఆదేశం) -
మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు దిగొచ్చాయి. రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేసవికి ఎండలు మరింత మండ నున్నాయనే వార్తల నేపథ్యంలో తరచుగా రైళ్లోలో ప్రయాణించే వారికి ఇది చల్లటి కబురే. రైల్వే తాజా నిర్ణయంతో ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ చార్జీలకు సంబంధించి మునుపటి (నవంబరు 2022) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది. దీని ప్రకారం ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి ఉంటుందని బెడ్స్ యథావిధిగా అందజేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగిచెల్లించనున్నారు. దీంతో ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇప్పుడు చౌకగా మారింది. (ఇదీ చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరో షాక్: ఏ మోడల్ అయినా బాదుడే!) ఉత్తమ, చౌకైన ఏసీ ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్‌లను సెప్టెంబరు 2021లో ప్రవేశపెట్టింది. 11,277 సాధారణ ఏసీ 3 కోచ్‌లతో పోలిస్తే ప్రస్తుతం 463 ఏసీ 3 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయని, సాధారణ AC 3 కోచ్‌ల కంటే AC 3 ఎకానమీ కోచ్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సాధారణ AC 3-టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉంటే, AC 3-టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉంటాయి. డేటా ప్రకారం ఏసీ 3-టైర్ ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలోనే ఇండియన్ రైల్వే రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని ద్వారా రూ. 177 కోట్ల ఆదాయం వచ్చింది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఖాతాల నుంచి రూ.295 కట్! ఎందుకో తెలుసుకోండి..
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది బ్రాంచ్‌లు ఉన్న ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులు ఉన్నారు. రకరకాల సేవల నిమిత్తం బ్యాంక్ పలు చార్జీల కింద కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయో తెలియక చాలా మంది మథనపడుతుంటారు. స్టేట్ బ్యాంకు ఇటీవల తమ ఖాతాల నుంచి రూ.295 కట్ చేసిందని, అది తిరిగి జమ కాలేదని చాలా మంది కస్టమర్లు చెబుతున్నారు. ఆ మొత్తం ఎందుకు కట్ చేశారో తెలియక తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బు కట్ అవడానికి గల కారణం ఇక్కడ తెలుసుకోండి... నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) సేవల కోసం కస్టమర్ల అకౌంట్ల నుంచి ఆ డబ్బు కట్ చేస్తున్నట్లు తెలిసింది. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఈఎంఐల ఆటోమేటిక్ చెల్లింపు కోసం ఎన్ఏసీహెచ్ ను ఉపయోగిస్తున్నారు. మీరు ఈఎంఐపై ఏదైనా కొనుగోలు చేసినా లేదా రుణం తీసుకున్నా నిర్ణీత తేదీలో మీ సేవింగ్ ఖాతా నుంచి ఈఎంఐ మొత్తం ఆటోమేటిక్‌గా కట్అవుతుంది. కాబట్టి గడువు తేదీకి ఒక రోజు ముందుగానే మీరు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఉదాహరణకు ప్రతి నెల 5వ తేదీన కట్ అవుతుందనుకుంటే 4వ తేదీ నుంచి ఆ మొత్తం మీ ఖాతాలో ఉండాలి. ఇదీ చదవండి: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా? ఒక వేళ ఈఎంఐ ఆటోమేటిక్‌గా కట్ కాకపోయినా, ఈఎంఐకి తగినంత మొత్తం మీ ఖాతాలో లేకపోయినా రూ.295 పెనాల్టీ కింద కట్ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఒకే సారి కాకుండా కొన్ని నెలల పాటు పెనాల్టీని కూడబెట్టి ఆపై పూర్తిగా కట్ కావచ్చు. మీరు ఈఎంఐ మొత్తానికి తగినంత బ్యాలెన్స్ అకౌంట్లో ఉంచడంలో విఫలమైతే బ్యాంక్ రూ. 250 పెనాల్టీ విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అంటే రూ.45 అదనం. మొత్తంగా రూ.295 మీ ఖాతా నుంచి కట్ అవుతుందన్నమాట. ఇలా కట్ కాకూడదంటే మీరు ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని గడవు తేదీకి ఒక రోజు ముందుగానే మీ అకౌంట్లో ఉంచాలని గుర్తుంచుకోండి. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..
ఇటీవలకాలంలో కోపంతో లేదా మరేదైనా ఇతర కారణాలతోనూ హత్యలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వారిలోంచి వికృతమైన సైకో బయటకు వచ్చి.. బాధితుల కుటుంబసభ్యులు కడసారిచూపు దక్కనివ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసుగా చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలాంటి దారుణ ఘటనే హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హాంకాంగ్‌లోని అబ్బి చోయి అనే 28 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. ఆమె కాళ్లను నగరశివార్లలోని ఒక ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో గుర్తించారు పోలీసులు. ఆ ప్రాంతంలోని మృతదేహాన్ని కోసేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ రంపాన్ని కూడా కనుగొన్నారు. ఇంకా.. ఆమె శరీరంలోని మొండెం, తల, చేతులు గుర్తించాల్సి ఉంది. ఇటీవలే ఎల్ అఫియల్ మొనాకో ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్‌పై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ఈ కేసుకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి శరీర భాగాల కోసం గాలిస్తుండగా... స్థానిక మ్యాగజైన్లో ఆమె ఫోటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హాంకాంగ్ పోలీసులు మాట్లాడుతూ..ఈ హత్యకు సంబంధించి ఆమె మాజీ భర్తను, బావా, అతని సోదరుడు, అత్తగారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మోడల్ చోయి మంగళవారం నుంచి కనిపించకుండా పోయిందని, చివరిసారిగా తాయ్ పీఓ జిల్లాలో కనిపించిందని తెలిపారు. ఆమె శరీర భాగాలను ఆ జిల్లాలోని గ్రామంలోనే గుర్తించారు. మిగతా భాగాల కోసం డ్రోన్ల తోహా అధికారుల బృందం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
ట్రూఅప్ చార్జీలు.. రూ.12,015 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీల వసూలుకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/టీఎస్‌ఎనీ్పడీసీఎల్)లు శుక్రవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆరీ్స)కి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ కొనుగోలు వ్యయం, వాస్తవ వ్యయం మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్‌రంగ పరిభాషలో పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీలు అంటారు. 2016–17 నుంచి 2022–23 మధ్యలోని ఏడేళ్ల కాలానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ కొనుగోళ్ల వ్యయంతో పోలిస్తే వాస్తవ వ్యయం రూ.29,212 కోట్లు అధికంగా ఉందని తమ పిటిషన్లలో ఉత్తర/దక్షిణ డిస్కంలు పేర్కొన్నాయి. పెరిగిన వ్యవసాయ విద్యుత్ సరఫరాను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మేరకు వ్యత్యాసం ఉందని తెలిపాయి. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయం కింద రూ.7,961 కోట్లు, నష్టాల సర్దుబాటు రూ.9,236 కోట్లను అందించింది. ఈ మొత్తాలు పోను మిగిలిన రూ.12,015 కోట్లను విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలుకు ఈఆర్సీ అనుమతి కోరాయి. ఈ మేరకు టీఎస్ఎస్పీడీసీఎల్ రూ.9,060.80 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్ రూ.2,954.66 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీల వసూళ్లకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. టీఎస్ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు శనివారం తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. చార్జీల పెంపు లేదంటూ ప్రతిపాదనలు.. ఆపై ట్రూఅప్ చార్జీల వడ్డన.. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023–24లో రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆరీ్స)కి సమర్పించిన వార్షిక టారీఫ్ ప్రతిపాదనల్లో కోరాయి. రూ.12,015 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూప్ చార్జీల వసూళ్ల కోసం తాజాగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ రెండు ప్రతిపాదనలపై నిర్దేశిత గడువులోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈఆర్సీ ఆహ్వానించనుంది. తర్వాత ప్రజాభిప్రాయసేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహించనుంది. వీటికి సంబంధించిన తేదీలను త్వరలో ఈఆర్సీ ప్రకటించనుంది. అనంతరం 2023–24 కి సంబంధించిన విద్యుత్ టారీఫ్ ఉత్తర్వులను ప్రకటించనుంది. ప్రతిపాదిత పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలపై మరో ఉత్తర్వులు జారీ చేయనుంది. ట్రూఅప్ చార్జీల భారం రూ.16,107 కోట్లు 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి సంబంధించి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల వసూలుకు గత ఆగస్టు 18న ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. తాజాగా ప్రతిపాదించిన రూ.12,015 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూప్ చార్జీలను కలుపుకుంటే డిస్కంలు ప్రతిపాదించిన మొత్తం ట్రూఅప్ చార్జీలు రూ.16,107 కోట్లకు పెరగనున్నాయి. ఇవేకాక జనరేషన్ ట్రూఅప్ కింద మొత్తం రూ.500 కోట్లకుపైగా చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ జెన్కో, సింగరేణి సంస్థలు సైతం వేర్వేరు పిటిషన్లు వేశాయి. వినియోగదారులపై ట్రూఅప్ గండం! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రూ.5,986 కోట్ల విద్యుత్ చార్జీలను డిస్కంలు పెంచిన విషయం తెలిసిందే. ట్రూఅప్ చార్జీలకు ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఆ భారం పడనుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై జనవరి 18న ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. మార్చి నుంచి క్షేత్ర స్థాయిలో తనిఖీలు వ్యవసాయ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి వీలుగా వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు తప్పనిసరిగా మీటర్లు బిగించాలని ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు స్పష్టం చేశారు. మార్చి నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు అంటే? విద్యుత్ కొనుగోళ్ల వ్యయం కాకుండా విని యోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అయ్యే అన్ని రకాల వ్యయాలను కలిపి డిస్ట్రిబ్యూషన్ వ్యయం అంటారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చార్జీలు), ఆదాయంపై పన్నులు, తరుగుదల, మూలధనంపై రాబడి, ఇతర ఖర్చులు వంటివి ఉంటాయి. ముందస్తుగా డిస్ట్రిబ్యూషన్ వ్యయ అంచనాలను ఈఆర్సీ ఆమోదిస్తుంది. దానికి తగినట్టుగా బిల్లుల వసూలుకు అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనాల కంటే డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరిగితే.. ఆ మేరకు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యయం తగ్గితే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని ట్రూడౌన్ అంటారు. -
మెట్రో వడ్డన.. 25 నుంచి 30 శాతం చార్జీల పెంపు?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ మెట్రో చార్జీలు 25 నుంచి 30 శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరిగిన టికెట్ ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపునకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీకి ఈ– మెయిల్ ద్వారా సలహాలు పంపించేందుకు విధించిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రజల నుంచి పలు అంశాలపై సూచనలు అందినట్లు సమాచారం. ప్రధానంగా మెట్రోలో చార్జీల పెంపునకు బదులు ఆదాయం పెంచుకునేందుకు నగరంలో మెట్రోకు కేటాయించిన విలువైన ప్రభుత్వ స్థలాల లీజు, మాల్స్ నిర్మాణం, స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ బస్సులను నడపడం, ప్రతి స్టేషన్లో ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించడం, స్టేషన్ మధ్య భాగంలో తక్కువ అద్దెతో నిత్యావసరాలు విక్రయించుకునేందుకు చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న సూచలు అందడం విశేషం. ఆదాయ ఆర్జనలో విఫలం.. మెట్రో నిర్మాణం సమయంలో ప్రయాణికుల చార్జీల ద్వారా 45 శాతం.. మరో 50 శాతం వాణిజ్య స్థలాలు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా సమకూర్చుకోవడం, మరో అయిదు శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో ఆదాయ ఆర్జన చేయాలని నిర్మాణ సంస్థ నిర్దేశించుకుంది. నిర్మాణ పనులు ఆలస్యం కావడం, కోర్టు కేసులు, రాష్ట్ర విభజన, కోవిడ్ విజృంభణ, ఆర్థిక మాంద్యం తదితర కారణాల రీత్యా నిర్మాణ సంస్థ అంచనాలు తలకిందులయ్యాయి. నగరం నడిబొడ్డున పలు చోట్ల సుమారు 269 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాలను 60 ఏళ్లపాటు సంస్థకు సర్కారు కేటాయించింది. ఈ స్థలాలను అభివృద్ధి చేసి ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టే విషయంలోనూ సంస్థ చతికిలపడింది. తాజాగా పెరిగే విద్యుత్ చార్జీల భారం, నిర్వహణ కష్టాలు, రుణాలు, వాటిపై వడ్డీతో తడిసి మోపెడు కావడం తదితర కారణాలను సాకుగా చూపి చార్జీల పెంపునకు సిద్ధపడటం గమనార్హం. ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్ల మేర సాఫ్ట్‌లోన్ మంజూరు అంశం కూడా కొలిక్కి రాకపోవడంతో చార్జీలు పెంచడం మినహా ఇతర ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగర మెట్రోలో కనీస చార్జీ రూ.10.. గరిష్టంగా రూ.60గా ఉంది. పెంపు ప్రతిపాదనలను 25 నుంచి 30 శాతానికి పరిమితం చేస్తారా? అంతకంటే అదనంగా పెంచుతారా? అన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది. -
ఛీ! విమానంలో అదేం పని...ఏడాది జైలు శిక్ష
విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌కి చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్‌కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు(ఏఎఫ్‌పీ) అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్ ఎయిర్పోర్ట్ పోలీస్ కమాండర్ మార్క్ కోల్‌బ్రాన్ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
Hyderabad: మెట్రో జర్నీ మరింత ప్రియం.. సామాన్యుడిపై చార్జీల పిడుగు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీజన్లపై త్వరలో మెట్రో చార్జీల పిడుగు పడనుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి కల్పించేందుకు ఏర్పాటు చేసిన కలల మెట్రోలో జర్నీ సామాన్యుడికి మరింత ప్రియం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మహానగర పరిధిలో నాలుగేళ్ల క్రితం నుంచి మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. తాజాగా చార్జీల సవరణ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆర్డర్ నెం. కె–14011/29/2018–ఎంఆర్టీఎస్–2 ప్రకారం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేంద్రకుమార్ బగ్డె, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్ప్రసాద్ల ఆధ్వర్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నగర వాసులు, మెట్రో ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని హెచ్ఎంఆర్ బహిరంగంగా ప్రకటించింది. నవంబరు 15 వరకు గడువు ఇచ్చింది. నగరవాసులు ‘ఎఫ్ఎఫ్సీహెచ్ఎంఆర్ఎల్ ఎట్రేట్జీమెయిల్.కామ్’కు సలహాలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని కోరింది. చార్జీల వడ్డింపుతో నిరాదరణే.. నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు రూట్లలో 57 రైళ్లను నడుపుతున్నారు. నిత్యం సుమారు 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రోలో కనీస చార్జీ రూ.10 గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, తమ ఇళ్ల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు ప్రత్యేకంగా షటిల్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మెట్రో అధికారుల ముందస్తు అంచనాల మేరకు ఈ మూడు రూట్లలో 16 లక్షల మంది జర్నీ చేస్తారని అంచనా వేసినప్పటికీ.. పలు కారణాల రీత్యా మెట్రోకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా చార్జీలు మరింత పెంచితే ప్రయాణికుల నిరాదరణ తప్పదని ప్రజారవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణం అంచనాలు, వినియోగ వ్యయాలు, మెట్రో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మెట్రో చార్జీలను సవరించనున్నట్లు తెలిసింది. నగర మెట్రోలో కనీస చార్జీ ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీ రూ.60 నుంచి రూ.100కి పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
సాధారణంగా బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులను చాలా సేవలకు కస్టమర్లు ఉపయోగిస్తుంటారు. అందులో ప్రధానంగా క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె కడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే ఫీజులు వసూలు చేయనుంది. అక్టోబర్ 20 నుంచి ఈ పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్‌లు ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఐసీఐ వసూలు చేయనున్న రుసుముకి ఇది అదనం కానుంది. ప్రస్తుతానికైతే ఈ ఫీజు వసూలు చేసే జాబితాలో ఐసీఐసీఐ మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మిగతా బ్యాంకులు ఈ తరహా నిర్ణయాన్నే తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వెనక ఇంత కథ జరుగుతుందా! అందుకే.. అసలు కథేంటంటే.. క్రెడ్( Cred), రెడ్ గిరాఫీ( RedGiraffe), మైగేట్( Mygate), పేటీఎం( Paytm) మ్యాజిక్ బ్రిక్స్( Magicbricks) వంటి ప్లాట్‌ఫాంలో ఇంటి అద్దెను క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించే వెసలుబాటు ఉంటుంది. ఈ ప్లాట్‌ఫాంలో కస్టమర్లు తమ కుటుంబాన్ని లేదా స్నేహితులను ఇంటి ఓనర్లుగా చేర్చుకుని, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డుని ఉపయోగించడం ద్వారా నగదు పొందుతున్నారు. సాధారణంగా అయితే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం( ATM) నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే 2.5-3% వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెడ్ గిరాఫీ( RedGiraffe) మినహా ఈ సేవలను అందిస్తున్న అన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రెంట్ పేమెంట్ ధృవీకరించే అద్దె ఒప్పందాన్ని అడగడం లేదు. దీంతో క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఫీచర్ ద్వారా అద్దె చెల్లింపు పేరుతో కొందరు కస్టమర్లు సులభంగా, ఏ ఫీజులు లేకుండా నగదుని పొందే అవకాశం ఉంది. ఇటీవల ఈ తరహా చెల్లింపులు ఎక్కువ కావడంతో బోగస్ పేమెంట్లను ఆపేందుకే ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
ఈవీ వాహనదారులకు శుభవార్త, ఫోన్ ఛార్జింగ్ కంటే ఫాస్ట్‌గా!
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈవీలతో సుధీర్ఘ ప్రయాణాలు చేసే వాహనదారులకు ఛార్జింగ్ పెట్టుకునే సమయం ఎక్కువ పట్టడం, ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యల్ని అధిగమించేందుకు పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ పరిశోధనల్లో సత్ఫలితాలు నమోదవుతున్నాయని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇడాహో నేషనల్ లాబొరేటరీ (Idaho National Laboratory) సంస్థ ఛార్జింగ్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేలా కొత్త పద్దతుల్ని సృష్టించినట్లు తెలిపింది. ఈ పద్దతులతో వాహనదారులు సెల్ ఫోన్ ఛార్జింగ్ కంటే వేగంగా..కేవలం 10 నిమిషాల్లో ఈవీ వెహికల్స్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ఇడాహో సైంటిస్ట్ ఎరిక్ డుఫెక్ స్పష్టం చేశారు. ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెట్టే ఛార్జింగ్ అన్నీ వాహనాలకు ఒకేలా ఉండదు. వాహనాన్ని బట్టి మారుతుంటుంది. కొన్ని ఈవీ బ్యాటరీలకు మొత్తం ఛార్జింగ్ పెట్టాలంటే సుమారు 40 నుంచి 50 గంటల సమయం పడుతుంది. మరికొన్నింటికి 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పెట్టొచ్చు. ఉదాహరణకు ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో అగ్ర గామిగా ఉన్న టెస్లా సంస్థ 320 కిలోమీటర్ల ప్రయాణించే కార్లకు కేవలం 15 నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదే కొత్త టెక్నిక్ ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఛార్జింగ్ పెట్టే సమయంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే దీర్ఘకాలంలో బ్యాటరీకి హాని కరం. ఒక్కోసారి ఆ బ్యాటరీలో అగ్నికి ఆహుతైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే బ్యాటరీ లైఫ్ టైమ్ అంచనా వేస్తే ఫాస్ట్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం డుఫెక్ బృందం మెషిన్ లెర్నింగ్ సాయంతో బ్యాటరీ లైఫ్ టైంను పరిశీలించింది. ఈ అల్గోరిథంలో 20,000 నుండి 30,000 డేటా పాయింట్లను అంచనా వేసింది. ఈ డేటా పాయింట్ల సాయంతో బ్యాటరీ మన్నికను గుర్తించి 10నిమిషాల్లో 90శాతం ఛార్జింగ్ పెట్టింది. ప్రస్తుతం 10నిమిషాల కంటే తక్కువ సమయంలో ఈవీలకు ఛార్జింగ్ పెట్టే పద్దతిపై తమ ప్రయోగాల్ని ముమ్మురం చేసినట్లు అమెరికాకు చెందిన ఇడాహో నేషనల్ లాబొరేటరీ తెలిపింది. -
వడ్డిస్తారా? వదిలేస్తారా?
చూస్తూ చూస్తుండగానే వామనుడు త్రివిక్రమావతారం దాల్చడమంటే ఇదే! ఆరేళ్ళ క్రితం 2016 జూలైలో నెలకు కేవలం కోటి రూపాయల లోపలున్న ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) లావాదేవీల విలువ ఈ జూలైలో ఏకంగా రూ. 10.6 లక్షల కోట్ల స్థాయికి చేరింది. సామాన్యులు, పేదలకు సైతం బ్యాంకింగ్‌ను అందుబాటులోకి తెచ్చి, చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో రోజువారీ లావాదేవీలను జరిపే సాంకేతికతను అందించడం అపూర్వ విజయమే! ప్రపంచంలోని దేశదేశాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి, ఇండియా వైపు తిరిగి చూసేలా చేసిన డిజిటల్ చెల్లింపుల విప్లవమిది. ఈ యూపీఐ చెల్లింపులపై సర్వీస్ ఛార్జ్ వేయాలా, వద్దా అన్నది తాజా ప్రశ్న. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్చాపత్రం గత వారం ఈ అంశాన్ని లేవనెత్తింది. రాజకీయ విమర్శలకు వెరచి, ఆర్థికశాఖ తక్షణమే బరిలోకి దిగింది. భారం మోపే ఆలోచనను కొట్టిపారేసింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి దేశంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ వ్యాలెట్లు – ఇలా అనేక వ్యవస్థలున్నాయి. ఆర్బీఐ పక్షాన డిజిటల్ కరెన్సీ సైతం రానుంది. భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వారి ‘యూపీఐ’ పల్లెపల్లెకూ పాకి, మొత్తం రిటైల్ నగదు బదలీల్లో 82 శాతం వాటా దక్కించుకోవడానికి పలు కారణాలు. మొబైల్ ఇంటర్నెట్ విప్లవం, బాదరబందీలు లేని బ్యాంకు ఖాతాల ‘జన్‌ధన్ యోజన’, నగదు రహిత చెల్లింపులపై సర్కారు మొగ్గు... ఇలా అనేకం ఈ విజయగాథ వెనక ఉన్నాయి. యూపీఐలో అప్పటికే నిర్ధారించిన ఫోన్ నంబర్ల ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదలీ అవుతుంది. డబ్బు అందుకున్నవారు సదరు లావాదేవీ విలువలో 0.3 శాతాన్ని (తక్కువలో తక్కువ రూ. 100) రుసుముగా గతంలో చెల్లించాల్సి వచ్చేది. నగదు రహిత లావాదేవీల్ని పెంచడానికి 2020 జనవరిలో ప్రభుత్వం ఆ ఫీజును తొలగించింది. అప్పటి నుంచి యూపీఐ తారాపథాన్ని తాకింది. ప్రజలపై భారం ఎత్తేసినా, అసలంటూ యూపీఐ కార్యకలాపాల నిర్వహణకైతే 0.25 శాతం మేర ఖర్చవుతున్నట్టు ఆర్బీఐ అంచనా. ఆర్థిక మధ్యవర్తులకు పడే ఆ లోటును కేంద్ర నిధులతో సర్కారు భర్తీ చేస్తూవస్తోంది. ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లానే యూపీఐ నిర్వహణ భారాన్నీ జనంపై వేయాలని ప్రతిపాదన. సుమారు రూ. 800 విలువైన లావాదేవీకి ఇచ్చే బ్యాంకు, తీసుకొనే బ్యాంకు, ఎన్పీసీఐ, యూపీఐ యాప్‌లు అన్నింటికీ కలిపి రూ. 2 ఖర్చవుతుందట. ప్రతి సేవకూ కొంత ఖర్చయ్యే మాట నిజమే. అలాగని అన్నిటికీ రుసుము వసూలు చేస్తామనడం సరికాదు. కొన్ని సేవలకు పబ్లిక్ సబ్సిడీ అవసరం. ఇవాళ యూపీఐ సేవలు లాంటివే. ఏ వ్యవస్థ అయినా నిలదొక్కుకోవాలంటే, అది వాడే వారికి భారం కాకూడదనేది సాధారణ సూత్రం. ఛార్జీల్లేని యూపీఐ మరింత కాలం కొనసాగాలం టున్నది అందుకే. వినియోగదారులకు సౌకర్యం, మన ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే లబ్ధి రీత్యా చూస్తే యూపీఐ ‘డిజిటల్ జనహిత’ వ్యవస్థ. ఆర్థిక శాఖే ఆగస్టు 21న ఆ మాట అన్నది. నిర్ణీత అవసరాన్ని తీరుస్తూ, ఎవరైనా వాడుకొనేలా ఉచితంగా అందుబాటులో ఉంటేనే ప్రజాశ్రేయో వ్యవస్థ. లేదంటే అది కొందరి స్వలాభానికే పరిమితమై, చివరకు సంక్షేమం క్షీణిస్తుందని ఆర్థిక శాస్త్రవేత్తల హెచ్చరిక. నల్లధనం చెల్లింపులకు చోటివ్వకుండా, పారదర్శకమైన డిజిటల్ మార్గంలో పురోగమించడం దేశానికి మంచిదని భావిస్తున్న కేంద్రం దీని నిర్వహణ వ్యయాన్నీ భరించాలి. పోనుపోనూ అది బరువయ్యే మాట నిజమే. వచ్చే 2023–24 నాటికి డిజిటల్ చెల్లింపులు ఏటా రూ. 120 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. ప్రభుత్వ సబ్సిడీ బిల్లు రూ. 30 వేల కోట్ల పైకి ఎగబాకవచ్చు. కానీ, సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలు ఆ భారానికి సిద్ధపడాలి. యూపీఐ లావాదేవీల్లో 1.4 శాతానికి పైగా విఫలమవుతున్నాయనీ, ఇటీవల ఆ రేటు పెరుగుతోందనీ, ఈ చెల్లింపు వ్యవస్థను దీర్ఘకాలం సమర్థంగా నడపాలంటే వినియోగ ఛార్జ్ తప్పదనే వారున్నారు. ఒకవేళ రేపు తప్పనిసరై ఛార్జ్ చేయాల్సి వచ్చినా ఇటు కస్టమర్ల, అటు ఆపరేటర్ల ప్రయోజనాల సమతూకంతో దాన్ని నిర్ణయించాలి. నిర్ణీత మొత్తం లోపల ఛార్జ్ మినహాయించడం ఒక మార్గం. లేదంటే నెలకు నిర్ణీత యూపీఐ లావాదేవీలు ఉచితమంటూ, అది దాటితేనే ఛార్జ్ అన్నది మరో మార్గం. ప్రతి యూపీఐ లావాదేవీకీ ఒక పైసా వంతున స్వల్పఛార్జ్ వసూలు చేసినా, ఈ జూలైకి ముగిసిన ఏడాదికి రూ. 5,842 కోట్ల ఆదాయం వచ్చేదని కొందరు లెక్కలు కడుతున్నారు. వెయ్యిసార్లు యూపీఐ వాడితే... కస్టమర్ పది రూపాయలే చెల్లించాల్సి వస్తుందనీ, ఈ నామ మాత్రపు రుసుముతో కొత్త ఆవిష్కరణలకూ, మెరుగుదలకూ వీలుంటుందనీ చెబుతున్నారు. పైకి ఇవన్నీ బాగానే ఉన్నా, కొన్నదానికీ, తిన్నదానికీ జీఎస్టీ సహా రకరకాల పన్నులు కడుతున్న ప్రజలు తమ నగదు చెల్లింపులకూ సర్కార్ వారి బాదుడు ఆలోచనను స్వాగతిస్తారా అన్నది ప్రశ్న. ఫలితంగా వారు మళ్ళీ డిజిటల్ కన్నా నగదు చెల్లింపుల వైపే మొగ్గే ప్రమాదం ఉంది. పెద్ద మొత్తాల బదిలీకి వాడే ఇతర ఆన్లైన్ చెల్లింపు విధానాలకు పాలకులు సబ్సిడీ ఇవ్వకున్నా ఫరవాలేదేమో కానీ, కోట్లాది సామాన్యుల్ని డిజిటల్ వైపు నడిపించిన యూపీఐని అపురూపంగా చూసుకోవడం ప్రస్తుతం అవసరం. అతి ఛార్జీలతో ఆన్లైన్ చెల్లింపుల్ని నిరుత్సాహపరిస్తే డిజిటల్ లక్ష్యమే దెబ్బ తింటుంది. కథ మళ్ళీ మొదటికి వస్తుంది! -
నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్: ఓలాకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక కస్టమర్ నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు జబేజ్ శామ్యూల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్ కారణంగా మొత్తం రూ. 95,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఓలా క్యాబ్స్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు దారు జబేజ్ శామ్యూల్ 2021, అక్టోబరు 19న నాలుగు గంటలకు ఓలా క్యాప్ బుక్ చేసుకున్నాడు. భార్య, మరొకరితో కలిసి క్యాబ్ ఎక్కినపుడు అంతా డర్టీగా కనిపించింది. ఏసీ ఆన్ చేయమన్నా, డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాదు నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శామ్యూల్‌ని మధ్యలోనే దింపేశాడు. దీనిపై ఓలాను సంప్రదించినప్పటికీ ఫలితం కనబడలేదు. పైగా రూ. 861 ఫీజు చెల్లించాల్సిందిగా పదేపదే కోరడంతో విసిగిపోయిన కస్టమరు దాన్ని చెల్లించారు. (భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం) దీంతో హతాశుడైన శామ్యూల్ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ - III ను ఆశ్రయించారు. దాదాపు రూ.5 లక్షల పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. దీన్ని విచారించిన కోర్టు 5 లక్షల అంటే, చాలా పెద్ద మొత్తం అని అభిప్రాయపడినకోర్టు, ట్రిప్ చార్జీ, రూ. 861 వడ్డీతో (సంవత్సరానికి 12శాతం చొప్పున), అలాగే మానసిక వేదనకుగాను రూ. 88వేలు, ప్రొసీడింగ్స్ ఖర్చుల నిమిత్తం రూ. 7 వేలు కలిపి మొత్తం 95 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్ ఓలా క్యాబ్‌ను ఆదేశించింది. -
ఆర్టీసీ ఆస్పత్రిలో నిమ్స్ చార్జీలతో వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఆస్పత్రిలో సాధారణ ప్రజలకూ వైద్యం అందించాలని నిర్ణయించిన ఆ సంస్థ యాజమాన్యం.. ఆయా చికిత్సలకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న తరహాలో చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. శస్త్రచికిత్సల నుంచి ల్యాబ్ పరీక్షల దాకా అన్నిరకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నందున.. వాటిని సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ప్రచారం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మందులపై భారీ డిస్కౌంట్ ఇంతకాలం ఆర్టీసీ ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు అవసరమైన అన్ని మందులను ఆన్లైన్ ద్వారాగానీ, వేరే పెద్ద మెడికల్ షాపుల నుంచి తెప్పించిగానీ అందించాలని నిర్ణయించారు. ప్రైవేటు మెడికల్ షాపుల తరహాలో హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్పత్రికి అనుబంధంగా ఫార్మసీలు తెరవనున్నారు. ఇప్పటికే కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా, ఎంజీబీఎస్ బయట గౌలీగూడ సీబీఎస్ వద్ద, తార్నాక ఆస్పత్రిలో రిటైల్ ఫార్మసీలను ప్రారంభించారు. దశలవారీగా మిగతా చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫార్మసీలలో బ్రాండెడ్ మందులపై 15 శాతం, జనరిక్ మందులపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. అన్నీ తక్కువ ధరకే.. అన్ని రకాల హెల్త్ చెకప్‌లపై 40 శాతం రాయితీ ఇవ్వాలని కూడా ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా చికిత్సలు, పరీక్షలు, మందులు తక్కువ ధరతో అందుబాటులోకి వస్తుండటం.. పేదలు, అల్పాదాయ వర్గాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇలా సాధారణ ప్రజలకు చికిత్సలతో వచ్చే నిధులను ఆస్పత్రి అభివృద్ధికే వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు పొందిన సాధారణ ప్రజలు.. ఆర్టీసీ సిటీ బస్సుల్లో (రెండు గంటల పాటు) ఉచితంగా ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పించారు. త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు: సజ్జనార్ ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సేవలను విస్తరించేందుకు త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఆయన ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్యులు, అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి అనుబంధంగా ఏర్పాటవుతున్న ఫార్మసీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని ఎండీకి అధికారులు వివరించారు. ఆస్పత్రిలో రోజూ సగటున 10 శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు తెలిపారు. -
హాస్పిటల్ బెడ్స్‌పై జీఎస్టీ బాదుడు: మరింత నరకం!
సాక్షి, ముంబై: ‘ఒకే దేశం ఒకే పన్ను’ అంటూ కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ ఇపుడికి రోగులను కూడా చుట్టుకుంది. కార్పొరేట్ ఆసుపత్రుల బాదుడుకు తోడు బీజేపీ సర్కార్ మరో భారాన్ని మోపింది. జూన్ చివరలో జరిగిన 47వ సమావేశంలో హాస్పిటల్ బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీని కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీని కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నేటి(జూలై 18, 2022) రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై అదనపు భారం పడనుంది. ఐసీయూ మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉండే బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్పుట్ ట్యా ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతోపాటు, ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. Instead of learning from the havocking results of its failed healthcare system during COVID, the Modi govt is hell-bent on making it more disastrous. #GabbarSinghStrikesAgain pic.twitter.com/M4KNPnn5LB — Congress (@INCIndia) July 18, 2022 ఈ రోజునుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్నులపై కాంగ్రెస్ మండిపడింది. చివరికి ఆసుపత్రి పడకలపై కూడా పన్ను బాదుడుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవస్పత్రి పడకలపై కూడా పన్నుతో గబ్బర్ సింగ్ మరో బాదుడుకు తెరతీశాడని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కేంద్రం నిర్ణయం దేశ ప్రజలపై పెను భారం మోపుతుందని ట్విటర్లో మండిపడింది. అసలే కోవిడ్-19 మహమ్మారిసంక్షోభంతో ఆరోగ్య సంరక్షణకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి, ముఖ్యంగా పేద ప్రజలను మరింత నరకంలో నెట్టేసిందని ట్వీట్ చేసింది. కాగా దేశంలో హెల్త్‌కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో సహా అనేక వస్తువులపై జీఎస్టీ వసూలుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వర్ అయ్యర్ బాధ్యతలు!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ తాజా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అయ్యర్ తాజా బాధ్యతల్లో కొనసాగుతారు. కాంత్‌కు వర్తించిన నియామక, బాధ్యతల విధివిధానాలే అయ్యర్‌కూ వర్తిస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా పరిగణించిన 20 బిలియన్ డాలర్ల స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు అయ్యర్ గతంలో నాయకత్వం వహించారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పని చేశారు. 2016–20 మధ్య కాలంలో తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. -
పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పరిశ్రమల నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఊరట కలిగించింది. రాష్ట్రంలో నిర్వహణ భారమై మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్ సర్వీసును తిరిగి ఇచ్చేందుకు కనిష్ట చార్జీలను వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఏపీఈఆర్సీ ఆదేశించింది. ఈ నిబంధన వచ్చే మార్చి 31 వరకు అమలులో ఉంటుందంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణ విధానం అమలుపై మూడు నెలలకోసారి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. చదవండి: AP: ‘అంగన్వాడీ’ల ఆధునికీకరణ ఓ పరిశ్రమ విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కొంతకాలం నడిచి, మూతపడితే మూడు నెలల పాటు కనీస చార్జీల రూపంలో బిల్లు జారీ అవుతుంది. తరువాత ఆ బిల్లూ నిలిపేస్తారు. కొన్నేళ్ల తరువాత పరిస్థితులు చక్కబడి పరిశ్రమను తిరిగి తెరవాలనుకున్నప్పుడు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సి ఉంటుంది. అప్పుడు మూతపడ్డ రోజులన్నిటికీ కనీస చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా అలా చేయరు. తొలి మూడునెలలకు మాత్రమే కట్టించుకుని మళ్లీ సర్వీసును ఇచ్చేస్తారు. అయితే పరిశ్రమ మూతపడే సమయానికి ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలు వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఏపీఈఆర్సీ ద్వారా డిస్కంలు అందిస్తున్న ఈ వెసులుబాటు ప్రయోజనం కలిగించనుంది. -
హైదరాబాద్ మెట్రో: టికెట్ ధరలు పెంచుతారా?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల భారాన్ని బూచిగా చూపుతూ త్వరలో మెట్రో ధరలను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో రైలు నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. చార్జీల పెంపు అంశాన్ని హైదరాబాద్ మెట్రోరైలు వర్గాలు మాత్రం ధ్రువీకరించడం లేదు. ►పెరగని ఆక్యుపెన్సీ ఒకవైపు.. మరోవైపు విద్యుత్ చార్జీల భారం గుదిబండగా మారిన నేపథ్యంలో సంస్థ రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రోజుకు సరాసరిన రూ.50 లక్షల నష్టంతో నెట్టుకొస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం కోవిడ్ కలకలం నుంచి తేరుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో పెరగలేదని నిర్మాణ సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ► రెండేళ్ల క్రితం మూడు మార్గాల్లో 4.5 లక్షల ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లు.. ప్రస్తుతం 3 లక్షల మందితోనే రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యధికంగా నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో 1.40 లక్షల చొప్పున ప్రయాణికులు మెట్రోలో జర్నీ చేస్తున్నారు. గతంలో మెట్రో నిర్మాణానికి తీసుకున్న రుణాలు,వాటిపై వడ్డీలు, నిర్వహణ ఖర్చులకు తోడు విద్యుత్ చార్జీలు భారంగా మారిన నేపథ్యంలో ఆ భారం ప్రయాణికులపై వేయక తప్పదన్న భావన మెట్రోరైలు వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెరపైకి చార్జీల పెంపు? ►ప్రస్తుతం మెట్రోకు హెచ్‌టీ5 (బి) కేటగిరీ కింద విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ప్రతి యూనిట్‌కు డిమాండ్ చార్జీలతో కలిపి రూ.5.28 వసూలు చేస్తున్నారు. మే నెల నుంచి ప్రతి యూనిట్‌కు రూ.6.57 వసూలు చేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వర్గాలు పేర్కొన్నాయి. తమకు క్రాస్ సబ్సిడీ లేకుండా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలు కల్పించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ఈఆర్సీని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఈ విషయంపై ఈఆర్సీ నుంచి స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అంశం తెరమీదకు వచ్చింది. పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. ►మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు పెరగడం, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీల భారానికి తోడు కరెంట్ చార్జీల పిడుగు నేపథ్యంలో ప్రయాణికులపై భారం మోపక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మెట్రోలో కనిష్ట చార్జీ రూ.10 కాగా.. గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు. రోజురోజుకూ నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో ఛార్జీల పెంపు అనివార్యమౌతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని హెచ్ఎంఆర్ అధికారులు ధ్రువీకరించకపోవడం గమనార్హం. -
మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు.. కారణమేంటంటే
సాక్షి, కోనరావుపేట (కరీంనగర్): కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఎస్సైగా పనిచేసిన క్రాంతికిరణ్ ఈ నెల 6న బదిలీ కాగా.. 7వ తేదీన శ్రీనివాస్ జాయినయ్యారు. ఆయన వచ్చిన కొద్ది గంటల్లోనే మరో ఎస్సై శ్రీరాం ప్రేమ్‌దీప్‌కు కోనరావుపేట పోలీస్‌స్టేషన్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం శ్రీరాం ప్రేమ్‌దీప్ బాధ్యతలు స్వీకరించారు. కత్తులతో వీరంగం.. పరస్పరం ఫిర్యాదు తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తులతో దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.. ఇటీవల గ్రామానికి తిరిగొచ్చాడు. అతనికి గ్రామంలోనే ఉంటున్న మరో యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది. పక్కనే ఉన్న గౌడ్‌కులస్తుని దగ్గర నుంచి కల్లుగీసే కత్తులను లాక్కుని దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువకుడు ప్రాణ భయంతో పరుగులు పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్ చేసింది.. డిలీట్ చేయాలంటే! -
ప్రేమలత చేతికి పార్టీ పగ్గాలు..?
సాక్షి, చెన్నై(తమిళనాడు): విజయకాంత్ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా డీఎండీకే పగ్గాలు చేపట్టేందుకు ఆయన సతీమని ప్రేమలత విజయకాంత్ సిద్ధమవుతున్నారని డీఎండీకేలో చర్చ జరుగుతోంది. సినీ నటుడిగా రాజకీయ పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో తనకంటూ ఓటు బ్యాంక్‌ను డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ చాటుకున్నారు. 2011 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. దివంగత సీఎం జయలలితతో వైర్యం విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టాయి. 2014 లోక్ సభ, 2016 అసెంబ్లీ, 2019 లోక్ సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్య నేతలందరూ విజయకాంత్‌కు హ్యాండిచ్చారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా పార్టీని విజయకాంత్ నడుపుతున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కోశాధికారిగా పగ్గాలు చేపట్టిన ఆయన సతీమని ప్రేమలత డీఎండీకేను ముందుండి నడిపిస్తున్నారు. అధ్యక్ష...లేదా ప్రధాన కార్యదర్శిగా.. నగర పాలక సంస్థల ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొనేందుకు డీఎండీకే సిద్ధం అవుతోంది. ఇందు కోసం పార్టీ పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకునేందుకు ప్రేమలత విజయకాంత్ సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవిని ప్రేమలత చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే అధ్యక్షుడిగా విజయకాంత్ వ్యవహరిస్తున్న దృష్ట్యా, పార్టీలో కొత్తగా ప్రధాన కార్యదర్శి పదవిని సృష్టించి ఆ పదవి చేపట్టాలని ప్రేమలతకు జిల్లాల కార్యదర్శులు సూచించారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ, సర్వ సభ్య సమావేశంలో ఇందుకు తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు డీఎండీకేలో జోరుగా చర్చ జరుగుతోంది. విజయకాంత్ వారసులు సైతం పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం. -
డిజిటల్ పేమెంట్లపై వడ్డన.. ఆర్బీఐ ‘నో’ క్లారిటీ
RBI Monetary Policy | UPI for Feature Phone Users: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. ఫీచర్ ఫోన్లకు సైతం(స్మార్ట్ ఫోన్లు కాకుండా బేసిక్ ఫోన్లు) యూపీఐ ఆధారిత పేమెంట్ పద్దతులను.. అదీ ఆర్బీఐ పర్యవేక్షణ నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తద్వారా చిన్నాచితకా ట్రాన్జాక్షన్లు జరిగే అవకాశం ఉందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే యూపీఐ ఆధారిత ఫీచర్ ఫోన్ ప్రొడక్టులు ఎలా పని చేయనున్నాయనేది ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే పేమెంట్ వ్యవస్థలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ తీరును మరింత సరళీకరించే ఉద్దేశంతో ఆర్బీఐ ఉంది. ఇందుకోసం కార్డులు, వాలెట్లు, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఛార్జీల మీద చర్చా పత్రాన్ని విడుదల చేయబోతోంది. కార్డులు, వాలెట్ల వరకు ఓకే. కానీ, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన బేసిక్ పేమెంట్ యాప్స్ ఏవీ ఇప్పటివరకు పేమెంట్ల మీద పైసా ఛార్జీ వసూలు చేయలేదు. దీంతో భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల మీద ఛార్జీలు వసూలు చేస్తారా? అనే కోణంలో చర్చ మొదలైంది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో యూపీఐ మోస్ట్ పాపులర్ పేమెంట్ మెథడ్‌గా ఉంది. ఒక్క నవంబర్లోనే 4.1 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ ద్వారా 6.68 లక్షల కోట్లు యూపీఐ ద్వారా జరిగింది. ప్రస్తుతం యూపీఐ పరిధిలోని గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఏవీ కూడా ట్రాన్జాక్షన్స్కి యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ, నాన్ యూపీఐ పరిధిలోని కొన్ని మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు యూపీఐ పరిధిలోని ప్లేయర్స్(గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటివి).. మర్చంట్ డిస్కౌంట్ రేటు విధించాలని ఎప్పటి నుంచో ఆర్బీఐను డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఫోన్ ఫే ఫౌండర్ సమీర్ నిగమ్ గతంలో ఓ సదస్సులో మాట్లాడుతూ.. యూపీఐ పరిధిలోని ప్లేయర్స్ ‘జీరో ఎండీఆర్’తోనే 85 నుంచి 90 శాతం ట్రాన్జాక్షన్స్ చేస్తున్నాయని ప్రస్తావించారు. మరి ఆర్బీఐ యూపీఐ ప్లేయర్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా?.. ఒకవేళ తీసుకుంటే డిజిటల్ ట్రాన్జాక్షన్స్పై సామాన్యుల మీదే భారం వేస్తుందా? ఆ చర్చా పత్రంలో ఎలాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు? అనే విషయాలపై బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తే బాదుడే.. ఎప్పటినుంచంటే.. -
జర్మనీలో షోల్జ్ నేతృత్వంలో సంకీర్ణ కూటమి
బెర్లిన్: ఎంజెలా మెర్కెల్ తర్వాత జర్మనీ చాన్సెలర్‌గా బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే విషయంలో సందిగ్ధం వీడింది. ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ‘ప్రోగ్రెసివ్’కూటమి అధికారపగ్గాలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై షోల్జ్‌కు చెందిన సోషల్ డెమోక్రాట్ పార్టీ, భాగస్వాములైన గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్ నేతలు మంగళవారం సంతకాలు చేశారు. దీంతో, పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రోగ్రెసివ్ కూటమి నేతగా బుధవారం షోల్జ్ ఎన్నికకు మార్గం సుగమమైంది. జర్మనీ తదుపరి చాన్సెలర్‌గా షోల్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చూపిన సహకారం భాగస్వామ్య పక్షాల మధ్య మున్ముందు కూడా కొనసాగితే, మాముందున్న లక్ష్యాలను సాధించడం చాలా తేలికవుతుంది. కరోనా మహమ్మారిని నిలువరించడం మా శక్తిసామర్థ్యాలకు పరీక్ష కానుంది’షోల్జ్ మీడియాతో అన్నారు. వాతావరణ మార్పులను అడ్డుకోవడమే కొత్త ప్రభుత్వ ప్రథమ ప్రాథాన్యం కానుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణ, మరిన్ని ఉదారవాద సామాజిక విధానాలను ప్రవేశపెట్టడం కూడా షోల్జ్ ప్రభుత్వ లక్ష్యాలుగా ఉన్నాయి. కాగా, ఇప్పటికే నాలుగు పర్యాయాలు, 16 ఏళ్లపాటు ప్రభుత్వాధినేతగా కొనసాగి చరిత్ర సృష్టించిన ఎంజెలా మెర్కెల్ ఐదో దఫా చాన్సెలర్ ఎన్నిక బరి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఆమెకు చెందిన యూనియన్ బ్లాక్ సెప్టెంబర్‌లో జరిగిన ఓటమి పాలైంది. -
కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!
ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్చేసేందుకు గూగుల్ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్ స్టోరేజ్ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్ మరో ఎత్తుతో యూజర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..! వాట్సాప్‌లో పరిమిత సేవలు...! వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌లోని ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లను బ్యాకప్ చేసుకొనే సౌకర్యాన్ని యూజర్లకు వాట్సాప్ యాప్ కల్పిస్తోంది. వాట్సాప్ యూజర్లకు బ్యాకప్ విషయంలో నియంత్రణను కల్పించేలా కొత్త బ్యాకప్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. బ్యాకప్‌పై నియంత్రణ ఉంచడంతో యూజర్లకు నచ్చిన వాటిని బ్యాకప్ చేసుకొనే వీలు ఉంటుంది. వాట్సాప్ బ్యాకప్ డేటా పూర్తిగా యూజర్ సంబంధిత గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంటుంది. గూగుల్ డ్రైవ్‌లో అపరిమితంగా వాట్సాప్ డేటాను బ్యాకప్ చేసుకోవచ్చును. తాజాగా వాట్సాప్ నిర్ధిష్ట బ్యాకప్ డేటాకు మాత్రమే ఆలో చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అపరిమిత వాట్సాప్ బ్యాకప్ డేటాకు త్వరలోనే కాలం చెల్లనుంది. రానున్న రోజుల్లో వాట్సాప్ అపరిమిత బ్యాకప్ డేటా వాడకం కోసం గూగుల్ ఛార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు వాట్సాప్ బ్యాకప్ డేటా పై 2000ఎమ్బీ వరకు పరిమితిని గూగుల్ విధించనుంది. కాగా ప్రస్తుతం వస్తోన్న వార్తలపై వాట్సాప్, గూగుల్ స్పందించలేదు. వాట్సాప్ బ్యాకప్ డేటా పరిమితిపై రానున్న రోజులే నిర్ణయించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: దేశీయ విమాన ప్రయాణీకులకు ఊరట -
పది సెకండ్ల యాడ్‌కు 18 లక్షలా....!
కోవిడ్-19 దెబ్బకు ఐపీఎల్-14 వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండో దఫా ఐపీఎల్-14 యూఎఈలో కొనసాగుతుంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్‌స్పోర్ట్స్‌కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐపీఎల్-14 రెండో దఫా నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ యాడ్ రేట్లను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.దసరా, దీపావళి పండుగ సీజన్ల నేపథ్యంలో పలు కంపెనీ బ్రాండ్స్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో సుమారు 25 శాతం నుంచి 30 శాతం మేర యాడ్స్ రేట్లను పెంచింది. చదవండి: Forgotten Password: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! విశ్వసనీయ వర్గాల ప్రకారం.. తొలి దఫా ఐపీఎల్లో ఒక యాడ్ పది సెకన్ల పాటు టీవీలో కన్పించేందుగాను సుమారు రూ. 13 నుంచి 14 లక్షలు ఉండగా...ప్రస్తుతం రూ. 18 లక్షలను ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్స్ పెంపుపై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పందించలేదు. స్టార్‌స్పోర్ట్స్‌ను ఇప్పటివరకు 12 బ్రాండ్ కంపెనీలు సంప్రదించారు. సహ-సమర్పణ స్పాన్సర్లుగా... డ్రీమ్ 11, ఫోన్‌పే, బైజుస్ ఉన్నాయి. అసోసియేట్ స్పాన్సర్లుగా..బింగో, కమలా పసంద్, ఏఎమ్ఏఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, క్యాడ్బరీ డైరీ మిల్క్, అమెజాన్ ప్రైమ్, థమ్స్ అప్, గార్నియర్ మెన్, క్రెడ్ కంపెనీలు ఉన్నాయి ఎక్స్చేంజ్4మీడియా నివేదిక ప్రకారం...ఐపీఎల్-14 మొదటి దశలో 10 సెకన్ల యాడ్స్‌కు సుమారు రూ. 14.1 నుంచి 14.3 లక్షలను స్టార్‌స్పోర్ట్స్ ఛార్జ్ చేసింది. సహ-ప్రాయోజిత వ్యయం రూ.110-125 కోట్ల పరిధిలో ఉండగా, అసోసియేట్ స్పాన్సర్షిప్ ధర రూ.65-70 కోట్లుగా ఉంది. బ్రాడ్‌కాస్టర్ సహ-సమర్పించే స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.2 లక్షలు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి 10 సెకన్లకు 13.6 లక్షలను వసూలు చేసింది. చదవండి: iPhone13: ఐఫోన్-13పై చిప్ దెబ్బ..కొన్ని వారాలు ఎదురు చూడాల్సిందేనా? -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్..!
న్యూ ఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. ఎలాంటి రుసుం లేకుండా వాహన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని కేంద్రం నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుం నుంచి కూడా మినహాయింపును ఇచ్చింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు అదనపు ప్రోత్సహకంగా సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలు-1989 సవరించాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వేగవంతంగా చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను అందిస్తున్నాయి. -
కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చిన టాటా మోటార్స్..!
ముంబై: ప్యాసింజర్ వాహన కొనుగోలుదారులకు టాటా మోటార్స్ మరోసారి షాక్ ఇచ్చింది. వచ్చేవారం నుంచి టాటా మోటార్స్‌కు చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని కంపెనీ చూస్తోంది. స్టీల్, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో సేకరణ వ్యయాన్ని భారీగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మార్కెట్లో టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వంటి ప్యాసింజర్ వాహనాలను టాటా మోటర్స్ విక్రయిస్తుంది. టాటా మోటార్స్ ప్రెసిడెంట్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ...గత ఏడాది నుంచి స్టీల్, విలువైన లోహల ధరల్లో గణనీయమైన పెరుగుదలను చూశామన్నారు. గత ఏడాది కాలంలో కంపెనీ ఆదాయాలలో 8-8.5 శాతం వరకు వస్తుధరలు భారీగా పెరిగాయని తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని కంపెనీ ఎదుర్కోన్నట్లు పేర్కొన్నారు. కంపెనీ దృష్టిలో కేవలం 2.5 శాతం మాత్రమే ఇన్పుట్ ఖర్చులను పెంచగా, షోరూమ్ కోణంలో ఇది దాదాపు 3 శాతంగా ఉండనుందని పేర్కొన్నారు. కస్టమర్లకు పెద్ద మొత్తంలో ధరల పెంపును నివారించాలనుకుంటున్నందున వివిధ వ్యయ తగ్గింపు కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించగలిగామని చంద్ర పేర్కొన్నారు. ఇన్పుట్ వ్యయాల మధ్య ఇంకా అంతరం మిగిలి ఉండటంతో కచ్చితంగా వాహనాల ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. కంపెనీ పలు మోడళ్ల రివైజ్డ్ ధరలను రూపోందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను ఎదుర్కోవటానికి ఇతర మోడళ్ల హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, సిఎన్జి వేరియంట్ల ధరలను సుమారు రూ .15 వేల వరకు పెంచింది. -
ఏటీఎంల ఛార్జీల మోత
-
అంచనాలు మించిన ఆదాయం
సాక్షి, హైదరాబాద్: చార్జీల పెంపుదల ఆర్టీసీలో ఆశలు రేకెత్తిస్తోంది. కొన్నేళ్లుగా తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీ, ఇప్పుడు చార్జీల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం తో గట్టునపడొచ్చన్న నమ్మకం వ్యక్తమవుతోంది. మంగళవారం తొలి షిఫ్ట్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెరగగా, తొలి రోజు అందిన ప్రాథమిక లెక్కల ప్రకారం ఆదాయం 22 శాతాన్ని మించి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో రెండు రోజులు చూస్తే గానీ కచ్చితమైన వివరాలు అందవని పేర్కొంటున్న అధికారులు, తొలిరోజు మాత్రం అంచనాకు మించి ఆదాయం ఉన్నట్టుగా గుర్తించామంటున్నారు. నగరంలో అది 25 శాతంగా ఉండగా, జిల్లాల్లో 20 శాతాన్ని మించి ఉందని అంటున్నారు. వెరసి రోజువారీ ఆదాయంలో రూ.2 కోట్లు చొప్పున పెరిగే అవకాశం కనిపిస్తోంది. త్వరలో బస్సుల షెడ్యూల్ మార్చడం, కార్మికుల డ్యూటీ సమయాలను సవరణ వల్ల పనితీరు మెరు గుపడి ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని, దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని అంటున్నారు. నగరంలో ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్లు ఒక షిఫ్ట్‌లో 6.50 గంటల మేర పనిచేస్తున్నారు. మరో 40 నిమిషాలు డ్యూటీ బాధ్యతలు తీసుకోవటం, అప్పగించటం (చేంజ్ ఓవర్)గా ఉంటోంది. ఇప్పుడు చేంజ్ ఓవర్ సమయాన్ని తగ్గించటంతోపాటు డ్యూటీ సమయాలను 7.20 గంటలకు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత బాగా పెరిగి కిలోమీటరుకు ఆదాయం (ఈపీకే) బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సిటీ డిపోల్లో సగటున అదనపు ఆదాయం రోజుకు రూ.1.75 లక్షల మేర పెరిగినట్టు గుర్తించారు. -
జియో వడ్డన : ఇంపార్టెంట్ అప్డేట్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో బాదుడుకి దిగన సంగతి తెలిసిందే. గురువారం నుండి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్గోయింగ్ కాల్లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు నిర్ణయం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో జియోపై పలు సెటైర్లతోపాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జియో ట్విటర్ ద్వారా వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. అక్టోబర్ 9 న లేదా అంతకు ముందు రీఛార్జ్ చేసిన వినియోగదారులందరికీ జియోయేతర నంబర్లకు ఉచిత అవుట్గోయింగ్ కాల్ ప్రయోజనాలను అందిస్తూనే ఉంటామని ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ జియో తన అధికారిక ఖాతా పోస్ట్ ట్విటర్ పోస్ట్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే, రీఛార్జ్ చేసిన ప్రణాళిక గడువు తేదీ వరకు ప్రయోజనాలు అందుబాటులోఉంటాయని తెలిపింది. . అంటే ప్రస్తుత ప్రణాళిక గడువు ముగిసే వరకు మీరు మీ జియో నంబర్ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉచిత అవుట్గోయింగ్ కాల్స్ చేయవచ్చు. ఆ తరువాత, ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆఫ్-నెట్ అవుట్గోయింగ్ కాల్స్‌కోసం కొత్త ఐయుసి టాప్-అప్ వోచర్లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాగా జియో ఈ వారం ప్రారంభంలో నాలుగు ఐయుసి టాప్-అప్ వోచర్లను ప్రకటించింది. రూ. 10 - రూ. 100. ఈ వోచర్లు 20 జీబీ డేటాతో పాటు 1,362 నిమిషాల వరకు అందిస్తున్నాయి. జియో-కాని నంబర్లకు అవుట్ గోయింగ్ కాల్స్ పొందటానికి జియో ప్లాన్‌తో సంబంధం లేకుండా కొత్త టాప్-అప్ అవసరం. An important update for all Jio users. pic.twitter.com/TR04y92wmC — Reliance Jio (@reliancejio) October 10, 2019 -
ఆర్టీసీలో నిఘా అధికారి వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఆయనో కీలక అధికారి. డిపోలపై నిఘా వేసి అక్రమాలు వెలికి తీయాల్సిన ముఖ్యమైన బాధ్యత ఆయనది. ఆయన పరిధిలో దాదాపు 30 డిపోలున్నాయి. గుర్తొచ్చినప్పుడు మినహా కార్యాలయం మొహమూ చూడరు. సిటీలో సొంత వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. కానీ డిపోల నుంచి యథేచ్ఛగా మామూళ్లు దండుకుంటారు. బస్ భవన్లో సీనియర్ అధికారులతో ‘టచ్’లో ఉంటూ బదిలీలు, ఇతర పైరవీల్లో మునిగి తేలుతుంటారు. ఇది పదవీ విరమణ పొందిన ఓ అధికారి వ్యవహారం. గతంలో పదవీవిరమణ పొం దిన అధికారులను ఆర్టీసీలో ఉద్యోగాల్లోకి తీసుకున్న సమయంలో ఈయన కూడా దూరారు. అప్పట్లో ఇలాగే రిటైర్మెంట్ తర్వాత కీలకపోస్టు నిర్వహించిన ముఖ్యఅధికారి ఈయనపై ఈగ వాలనీయకుం డా చూసుకున్నారు. ఆ అధికారిని ప్రభుత్వం తప్పించటంతో ఇప్పుడు బస్‌భవన్‌లో కీలకంగా ఉన్న అధికారుల పంచన చేరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. ఇప్పుడు దీనిపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. బస్‌భవన్‌లోని ఉన్నతాధికారి అండ.. కొంతకాలంగా ఆర్టీసీలో విజిలెన్సు విభాగం పూర్తిగా నిర్వీర్యమైంది. గతంలో ఈ విభాగాన్ని పర్యవేక్షించిన ఓ ఉన్నతాధికారి తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదులు ఎక్కువ కావటంతో ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనకు అనుచరుడిగా ముద్రపడ్డ మరో అధికారిపై ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయానికి వెళ్లకుం డా, ఆయా డిపోల్లో చిన్నచిన్న తప్పిదాలకు పాల్పడ్డ వారిని గుర్తించి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు చెబుతున్నాయి. ఇక సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నాడని, సహకరించని వారిని బదిలీ చేయించి వేధిస్తున్నాడని ఇటీవల కొందరు సిబ్బంది ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బస్‌భవన్‌లో కీలక పోస్టులో ఉన్న ఓ ఉన్నతాధికారి ఆయనకు అండగా నిలుస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పట్టించుకునే వారు లేరన్న ధీమా.. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ లేరు. గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన సోమారపు సత్యనారాయణ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోవటంతో చైర్మన్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దీంతో పట్టించుకునేవారు లేరన్న ధీమాతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడు. గతంలోనే పదవీ విరమణ పొందినప్పటికీ, భారీ జీతంతో ఆర్టీసీలో ఆయనకు మళ్లీ అవకాశం కల్పించారు. దీంతో తనపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేరన్న ధీమాతో ఆయన విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఆయనను అడ్డం పెట్టుకుని ఆర్టీసీలో ఓ ఉన్నతాధికారి డిపోల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, రకరకాల కారణాలతో సస్పెన్షన్‌కు గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్ల చేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టాటా ఆటోకాంప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకి చెందిన ట్రీటియం సంస్థతో చేతులు కలిపింది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ట్రీటియం తయారు చేసే డైరెక్ట్ కరెంట్ (డీసీ) ఫాస్ట్ చార్జర్లను భారత్‌లో అందుబాటులోకి తేనున్నట్లు టాటా ఆటోకాంప్ ఒక ప్రకటనలో తెలిపింది. డీసీ చార్జింగ్ ఇన్ఫ్రా కంపెనీ అయిన ట్రీటియం.. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ సంస్థలకు చార్జర్లను సరఫరా చేస్తోంది. ట్రీటియం తయారు చేసే వీఫిల్–ఆర్టీ డీసీ ఫాస్ట్ చార్జర్లు.. ఇటు ద్విచక్రవాహనాల నుంచి కార్లు, వాణిజ్య వాహనాల దాకా వివిధ రకాల వాహనాలను వేగంగా చార్జ్ చేసేందుకు వాడతారని టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో అరవింద్ గోయల్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చార్జర్ల అవసరం కూడా గణనీయంగా ఉండనుందన్నారు. ఈ మార్కెట్లో అపార అవకాశాలున్నాయని, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని గోయల్ తెలిపారు. ఇటీవలే ప్రకటించిన రెండో విడత ఫేమ్ పథకంలో భాగంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా తోడ్పాటు లభించనుంది. -
రష్‌గా ఉన్నా.. రాజాలా పోవచ్చు!
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందడి అప్పుడే మొదలైంది. మరోవైపు నగరంలో సెటిలైన ఆంధ్ర, తెలంగాణ జిల్లాల ప్రజలు ఇప్పటికే ఊరుబాట పట్టారు. ఇలా నగరం నుంచి బయల్దేరే వాహనాలన్నీ నగరం సరిహద్దుల్లోని టోల్గేట్ల వద్దకు చేరుకుని విపరీతమైన రద్దీకి కారణమవుతున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఏటా సంక్రాంతి, దసరా సమయాల్లో ఇదే పునరావృతమవుతున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఫాస్టాగ్‌పై సరైన ప్రచారం నిర్వహించకపోవడంతో ఈసారి కూడా రద్దీ తప్పేలా లేదు. ఏంటి సమస్య? హైదరాబాద్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన ప్రజలు లక్షల్లో ఉన్నారు. వీరంతా దసరా, సంక్రాంతి సమయంలో ఊళ్లకు వెళతారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాహనాలన్నీ టోల్గేట్లు దాటే వెళ్లాలి. ఒక్కసారిగా వాహనాలు బారులు తీరుతుండటంతో ఏటా సంక్రాంతి, దసరా, దీపావళి సమయాల్లో టోల్గేట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటోంది. శనివారం నుంచి సెలవులు మొదలవుతున్న దరిమిలా.. ఈ రద్దీ ఒక రోజు ముందుగా అంటే శుక్రవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కారణమేంటి? తెలంగాణలో 18 టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో 3 రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో, మిగిలిన 15 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఆధీనంలో ఉన్నాయి. సెలవుల నేపథ్యంలో నగరవాసులు ఊళ్ల నుంచి తిరిగి వచ్చేక్రమంలో ఒక్కసారిగా టోల్‌గేట్లపై విపరీత మైన భారం పడుతోంది. ప్రతివాహనం టోల్ చార్జీ చెల్లించి, చలానా తీసుకుని వెళ్లాలి. ఇందుకు కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. చిల్లర సమస్య, కార్డులు పనిచేయకపోవడం వల్ల మరిం త జాప్యం జరగవచ్చు. శనివారం నుంచి నగరం నుంచి వెళ్లే రద్దీ రెట్టింపవనున్న నేపథ్యంలో టోల్గేట్ల నిర్వాహకులు అదనపు సిబ్బంది ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సమస్యకు కారణాన్ని విస్మరిస్తున్నారు. ఫాస్టాగ్‌పై ప్రచారం ఏది..? ప్రతిసారీ టోల్గేట్ వద్ద ఆగి రుసుము చెల్లించకుండా ఎన్హెచ్ఏఐ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టం (ఈటీసీఎస్)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఫాస్టాగ్ డివైజ్‌లను వాహనాలకు ముందుభాగాల్లో అమరుస్తారు. ముందుగానే రీచార్జ్ చేసుకుంటే.. టోల్గేట్ల వద్ద సెన్సార్లు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వీటిని గుర్తిస్తాయి. రుసుము ఆటోమేటిక్‌గా కట్ అయిపోయి, గేటు సులువుగా తెరుచుకుంటుంది. దీనివల్ల ప్రతి వాహనానికి దాదాపు 5 నిమిషాల సమయం మిగులుతుంది. ఇది ఇటు వాహనదారుడికి, అటు టోల్ నిర్వాహకులకు అనుకూలంగా ఉంటుంది. పైగా ట్రాఫిక్ సమస్యలకు, చిల్లర సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే ఫాస్టాగ్‌లపై 50 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిపై అవగాహన లేని వాహనదారులు డబ్బులు, కార్డుల ద్వారా చెల్లించేందుకే అధికశాతం మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో సొంత వాహనాలు పెరుగుతున్న దరిమిలా వీటిపై కావాల్సినంత ప్రచారం జరగడం లేదన్నది వాస్తవం. 2017 చివరినాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినప్పటికీ ఇది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఆర్టీసీ ఎందుకు బిగించు కోవడం లేదు.. ఆర్టీసీ బస్సులు కూడా టోల్గేట్ ట్రాఫిక్ జాముల్లో చిక్కుకుపోతున్నా సమస్యకు పరిష్కారం దిశగా చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫాస్టాగ్ పరికరాలుబిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని టోల్గేట్లలోనూ ఫాస్టాగ్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. అయితే, ఆర్టీసీ అధికారుల వాదన మరో రకంగా ఉంది. ఒక్కసారి ఈ డివైజ్‌ను బిగిస్తే అందులో వాహనం వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు నిత్యం వేర్వేరు రూట్లలో తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బస్సులకు ఫాస్టాగ్ పరికరాల బిగింపు కార్యరూపం దాల్చడం లేదు. టీఎస్ఆర్టీసీ నగరం నుంచి 5,252 బస్సులువేసింది, ఇందులో 1,500 ఏపీకి వెళ్తాయి. వీటన్నింటిలో ప్రయాణించే వారంతా టికెట్ రేటుతోపాటు టోల్ కూడా చెల్లించాల్సిందే. దీంతో ఈసారి కూడా ఆర్టీసీ బస్సులకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. -
ఇండిగో కొత్త బాదుడు : మంత్రిత్వ శాఖ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులపై భారీ వడ్డింపునకు సిద్ధమైంది. విమానాశ్రయాల్లో భారీ క్యూలను తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకుద్దేశించిన వెబ్ చెక్ ఇన్ అవకాశంపై భారీగా చార్జీలను వసూలు చేయనుంది. వెబ్ చెక్ఇన్ చేసుకునే అన్నిఅన్ని విమాన టికెట్లపై చార్జీ ఉంటుందని ఇండిగో ప్రయాణికుడికి సమాధానంగా ట్విటర్లో వెల్లడించింది. ప్రయాణికుడు ఎంచుకున్న సీటు ఆధారంగా ఈ ఫీజు 200-1000 రూపాయల దాకా ఉండనుంది. సవరించిన తమ కొత్త విధానం ప్రకారం ఈ చార్జి చెల్లించాల్సి ఉంటుందనీ, అయితే ఎయిర్పోర్ట్ ఈ సదుపాయం ఉచితమేనని స్పష్టం చేసింది. దీనిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామంపై విమానయాన శాఖ స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు. ఈ కొత్త మార్పు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేది సమీక్షించనున్నామని ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే వెల్లడించారు. కాగా ఇండిగో, జెట్ ఎయిర్వేస్, కొన్ని సీట్లపై మాత్రమే వెబ్ చెక్ ఇన్ ఫీజును వస్తూలు చేస్తుండగా, స్పైస్‌జెట్ అన్నిటికీ చేస్తుంది. అలాగే విస్తారా ఎయిర్‌లైన్స్ లోవెబ్ చెక్ ఇన్ పూర్తిగా ఉచితం. వెబ్ చెక్ ఇన్: దేశీయంగా విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆన్లైన్లోనే వివరాల పరిశీలనతోపాటు, బోర్డింగ్ పాస్‌ను కూడా ఈ వెబ్ చెక్ఇన్ ద్వారా పొందవచ్చు. MoCA has noted that airlines are now charging for web check-in for all seats. We are reviewing these fees to see whether they fall within the unbundled pricing framework. — Ministry of Civil Aviation (@MoCA_GoI) November 26, 2018 -
మూడు నెలల విరామం తరువాత
సాక్షి, న్యూఢిల్లీ: మూడునెలల విరామం తరువాత కేంద్ర ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ (65) తిరిగి బాధ్యతల్లో చేరారు. మూత్రపిండ మార్పిడి కోసం ఇటీవల ఆసుపత్రిలో చేరిన జైట్లీ కోలుకున్న అనంతరం గురువారం కార్యాలయానికి హాజరయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే నార్త్ బ్లాక్ మొదటి-అంతస్తులోని జైట్లీ కార్యాలయాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా పూర్తిగా పునరుద్ధించినట్టు తెలుస్తోంది. జైట్లీ ఆగస్టు9 న జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తన ఓటు వేశారు. అలాగే సోషల్మీడియాలోచురుకుగా వుంటూ జీఎస్టీసహా ఇతర ఆర్థిక రాజకీయ, సామాజిక అంశాలపై తన స్పందనను తెలియజ్తేసున్నారు. సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ మృతిపై ఆయన సంతాపాన్ని తెలుపుతూ గురువారం ట్వీట్ చేశారు. దీర్ఘకాలికంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడ్డారు. వ్యాధి తీవ్రం కావడంతో వైద్య అవసరాల రీత్యా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెలవులో ఉన్నారు. మే14న ఆయనకు మూత్రి పిండ మార్పడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఆర్థికమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు సమాయత్తమయ్యారు. ఈ విరామ సమయంలో జైట్లీ స్థానంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. Saddened by the death of the veteran Journalist Sh. Kuldip Nayar. His contribution to the cause of free speech is unparalleled. He is credited with breaking some of the most exclusive news stories. Will be best remembered for his struggle against the emergency. — Arun Jaitley (@arunjaitley) August 23, 2018 -
బ్యాంకు చార్జీల బాదుడు!!
న్యూఢిల్లీ: వివిధ చార్జీల రూపంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) గడిచిన నాలుగేళ్లలో ఖాతాదారుల నుంచి ఏకంగా రూ. 3,324 కోట్లు వసూలు చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. బ్యాంకులు అందించే వివిధ సేవలకు నిర్దిష్ట చార్జీలు వసూలు చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉందని, ఈ చార్జీలు సహేతుకమైన స్థాయిలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి జన ధన యోజన సహా పలు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని మంత్రి తెలిపారు. 2017 డిసెంబర్ ఆఖరు నాటికి 30.84 కోట్ల జన ధన అకౌంట్లు సహా మొత్తం.. 53.3 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు ఉన్నాయని వివరించారు. మినిమం బ్యాలెన్స్ లేకపోయినా వీటిపై ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొన్నారు. -
పాత కొత్తకథ!
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఒకరోజు రాజుగారు వాళ్లను పిలిచి...‘‘నా కొడకల్లారా... లేచామా? తిన్నామా? పడుకున్నామా? అని కాకుండా... ఏదైనా చేయండ్రా’’ అని అరిచాడు.‘‘ఏం చేయమంటారేంటి?’’ పెద్దకొడుకు ఆవులిస్తూ అడిగాడు.‘‘వేటకెళ్లి చావండి’’ ఆదేశించాడు రాజు తల మీద కిరీటం సవరించుకుంటూ.‘‘నువ్వు తండ్రివేనా? తండ్రి రూపంలో ఉన్న శత్రువువా?’’ గట్టిగా అరిచాడు రెండో కొడుకు.‘‘తినడానికి తప్ప... నువ్వు నోరు తెరవగా చూడడం ఇదే ఫస్ట్‌టైమ్. ఎందుకంతలా ఫీలై పోతున్నావు? వేటకెళ్లమని చెప్పడం తప్పా?’’ రెండో కొడుకుని నిలదీయబోయాడు రాజు.‘‘ఇన్ని న్యూస్‌చానల్స్ వస్తున్నాయి. ఒక్కటైనా చూసి చస్తేగా... ఎంతసేపూ వందిమాగధుల పొగడ్తలు వినడంతోనే మీకు టైమ్ సరిపోతుంది’’ విసుగ్గా అన్నాడు మూడో కొడుకు. ‘‘నేను చెప్పిందానికి, న్యూస్చానల్స్కు ఏమిటోయ్ సంబంధం?’’ అడిగాడు రాజు. ‘‘సల్మానుఖాను కృష్ణజింకల కేసు గురించి తెలిస్తే... మీ నోటి నుంచి వేట అనే మాటే రాదు. ఈ కేసు పుణ్యమా అని సల్మానుఖాను ఎప్పుడు కటకటాల వెనక్కి వెళతాడో తెలియదు. మీ చేతులకు మట్టి అంటకుండా మమ్మల్ని కటకటాల వెనక్కి తొయ్యాలనేదే కదా మీ తొక్కలో ప్లాను’’ తండ్రి కళ్లలోకి సూటిగా చూస్తూ అరిచినంత పనిచేశాడు నాల్గో కొడుకు.‘‘వేటాడడం అనేది రాజుల తరతరాల సంప్రదాయం. సాహసప్రవృత్తికి నిలువెత్తు నిదర్శనం. మీకు వేటాడే దమ్ము లేక... సాకులు వెదుకుతున్నారు. కనీసం చేపలనైనా పట్టి చావండ్రా’’ అంటూ సింహాసనంపై నుంచి లేచి అటెటో వెళ్లిపోయాడు రాజు. ‘‘తియ్యండ్రా గాలాలు... ఇయ్యండ్రా వీళ్లకు’’ సేనాధిపతి గొంతు గట్టిగా వినిపించింది.మరుసటి రోజు పొద్దుటే వాగులనాగారం చెరువుకు వెళ్లారు రాకుమారులు.చెరువులో గాలాలు వేసి గట్టుపై ఉన్న చెట్టు కింద కూర్చొని పేకాడడం మొదలు పెట్టారు.గంటలు గడుస్తున్నా గాలాలకు చేప కాదు కదా చిన్న పీత కూడా పడలేదు.రాకుమారులకు విసుగొచ్చింది.‘‘ఏహే... తొక్కలో ఫిషింగ్. వెళ్దాం పదండి’’ సోదరులకు పిలుపునిచ్చాడు పెద్ద రాకుమారుడు.‘‘ఇలా ఇరిటేట్ అయితే ఎలా సోదరా? ఇక్కడ సమస్య అనేది చేప గురించి కాదు. మన సహనం గురించి. మనకు ఎంత సహనం ఉంది అని పరీక్షించడానికే తండ్రిగారు మనకు ఈ పరీక్ష పెట్టారు. ఈ చిన్న పరీక్షలో కూడా మనం నెగ్గక పోతే ఇంకేమైనా ఉందా?’’ అని హితవు చెప్పాడు చిన్న రాకుమారుడు.ఈలోపు ‘‘అయిదు వరహాలకు కిలో చేపలు...డెడ్ చీప్.... బంపర్ ఆఫర్’’ అని గట్టుకు ఒకవైపున అరుస్తున్నాడు ఒక జాలరి.‘హమ్మయ్య.... సమయానికి తిమింగలంలా వచ్చాడు’ అని జాలరి దగ్గరికి వెళ్లి చెరో చేప కొనుగోలు చేసి అంతఃపురానికి చేరుకున్నారు రాకుమారులు. ‘‘శబ్బాష్... ఇప్పుడనిపించార్రా నా కొడుకులని’’ కొడుకుల వైపు చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు రాజు.‘‘అది సరే... ఇప్పుడు వీటిని ఏం చేయమంటారు?’’ అడిగాడు పెద్ద రాకుమారుడు.‘‘నాయనలారా.... ఈ ఏడు చేపలను ఎండకు ఎండబెట్టండి. ఎండుచేపల పులుసు తినక చాలారోజులవుతుంది’’ అన్నాడు రాజు.‘‘అలాగే తండ్రి’’ అని రాజు చెప్పిన పని చేశారు కుమారులు.ఆరు చేపలు బ్రహ్మాండంగా ఎండాయి. ఏడో చేప మాత్రం... ఎండలేదు సరికదా.... ఎవరినో ఎండగడుతుంది.‘‘ఈ ఎండలకు బండలే పగులుతున్నాయి. చేపా.... చేపా... నువ్వెందుకు ఎండలేదు?’’ అడిగాడు రాజు.‘‘నా ఇష్టం. నా గురించి అడగడానికి నువ్వెవడివి?’’ గొంతు పెద్దది చేసింది చేప.‘‘నేను రాజును’’ గంభీరం ఉట్టి పడే కంఠంతో అన్నాడు రాజు.‘‘ఏ రాజువు? అప్పల్రాజువా? సుబ్బరాజువా? భీమరాజువా? ఏ రాజువి?’’ వెటకారంగా అంది చేప.‘‘ఆ రాజులలో ఏ రాజుని కాదు... ఐయామ్ ఎ కింగ్ యూ నో’’ మీసాలు మెలేస్తూ అన్నాడు రాజు.‘‘నువ్వు కింగ్ అయితే నేను కింగ్ ఫిష్‌ని. ఆషామాషీ చేపను కాదు. లా చదువుకున్నదాన్ని. చేపల హక్కుల సంఘానికి ప్రెసిడెంటుని’’ ఒకింత గర్వంగా అంది చేప.‘‘అయితే ఏంటంటావు ఇప్పుడు? ఎండకు ఎందుకు ఎండలేదో ముందు చెప్పు?’’ కోపంగా అడిగాడు రాజు.‘‘మళ్లీ అదే చెత్త ప్రశ్న వేస్తున్నావు. ఎండకు ఎండడమా! వానకు తడవడమా! అనేది నా చాయిస్. నువ్వెవరివయ్యా ఆర్డర్ వెయ్యడానికి. ఎడారిలో ఇసుక అమ్ముకునే ముఖం నువ్వూనూ’’ గట్టిగానే తిట్టింది చేప. ‘‘ ఏ ధైర్యంతో ఇంతలా ఎగురుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అయోమయంతో కూడిన ఆవేశంతో అరిచాడు రాజు. ‘‘ఫిష్ప్రొటెక్షన్ యాక్ట్ 2018 గురించి ఎప్పుడైనా విన్నావా? ఖచ్చితంగా విని ఉండవు. ఈ యాక్ట్ ప్రకారం... చేపలను పట్టడం, వాటిని పులుసు చేసుకోవడం, ఎండలో దండానికి వేలాడదీయడం... ఇలాంటి చర్యల ద్వారా చేపల జీవించే హక్కును కాలరాయడం... డబ్ల్యూపీసి 272/384 సెక్షన్ల ప్రకారం శిక్షార్హం. దీనికిగానూ పది సంవత్సరాల జైలుశిక్ష, పదిలక్షల జరిమానా విధించబడుతుంది’’ అని హెచ్చరించింది చేప. గజగజ వణికిపోయాడు రాజు.వన్స్ అపాన్ ఎ టైమ్... పొరుగు రాజ్యం రాజు తమ రాజ్యం మీదికి దండెత్తుకు వచ్చినప్పుడు కూడా ఈ రేంజ్లో వణక లేదు.‘‘ఏం బాసూ.... ఎండకు ఎందుకు ఎండలేదో చెప్పమంటావా?’’ కవ్వింపు చర్యలకు దిగింది చేప.‘‘అక్కర్లేదమ్మా... నువ్వు ఎండితే ఏమిటి? ఎండక పోతే ఏమిటి? బుద్ధి తక్కువై ఏదో వాగాను. నన్ను క్షమించమ్మా’’ అంటూ చేపకు సారీ చెప్పాడు రాజు.ఆ తరువాత...‘‘ఎవరక్కడా’’ అని కేకేశాడు.‘‘చెప్పండయ్యా’’ అంటూ పరుగెత్తుకు వచ్చారు భటులు.‘‘ ఈ చేపమ్మను పల్లకీలో ఎక్కించుకొని, మేళతాళాలతో వాగులనాగారం చెరువులో వదిలి రండి’’ అని ఆదేశించాడు రాజు. ‘‘అలాగేనయ్యా’’ అంటూ భటులు పరుగులు తీశారు. – యాకుబ్ పాషా -
రైళ్లలోనూ లగేజి చార్జీలు!
న్యూఢిల్లీ: విమానాల్లోలాగే రైళ్లలోనూ అదనపు లగేజీకి అదనంగా చార్జ్ చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. అడ్డూఅదుపు లేకుండా కంపార్ట్ మెంట్లను సామానుతో నింపేస్తుండడంతో, ప్రయాణి కుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా ఉన్న నిబంధనలను ఇకపై కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనిప్రకారం పరిమితికి మించి లగేజీ కలిగిఉన్న ప్రయాణికులు ఆరు రెట్లు ఎక్కువగా జరిమానా చెల్లించాల్సి రావచ్చని ఓ రైల్వే అధికారి తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్, లేదా రెండవ తరగతి ప్రయాణికుడు 40 కేజీల వరకు రుసుము చెల్లించకుండా తమతోపాటే లగేజీ తీసుకెళ్లవచ్చు. అంతకుమించితే 80 కిలోల వరకు తగిన రుసుము చెల్లించాలి. అయితే అదనపు లగేజీని సంబంధిత లగేజీ వ్యాగన్లోనే పెట్టాల్సి ఉంటుంది. ‘ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నవే... పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం. లగేజీకి సరిపడ రుసుము చెల్లించకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంది’ అని రైల్వే శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ వేదప్రకాశ్ చెప్పారు. ‘ఉదాహరణకు ఒక ప్రయాణికుడు 80 కిలోల లగేజీతో 500 కి.మీ. ప్రయాణిస్తే.. 40 కిలోల వరకు చార్జీ ఉండదు. అదనపు 40 కిలోల లగేజీకోసం రూ.109 చెల్లిస్తే సరిపోతుంది. తనిఖీలలో అదనపు లగేజీతో పట్టుబడితే రూ.654 జరిమానా చెల్లించాలి. ఏసీ ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు 70 కిలోల వరకు ఉచితంగా లగేజీ తీసుకెళ్లొచ్చు. 150 కిలోల లగేజీ ఉంటే మిగిలిన 80 కిలోలకు చెల్లించాలి. ఏసీ టూ టైర్ ప్రయాణీకులకు 50 కిలోల వరకు చార్జీ ఉండదు. ప్రయాణీకుల సూట్‌కేసులు, ట్రంకు పెట్టెలకు నిర్ణీత పరిమాణాన్ని సూచిస్తున్నాం’ అని వేదప్రకాశ్ చెప్పారు. -
మ్యూచువల్ ఫండ్స్ చార్జీలను తగ్గించిన సెబీ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ వసూలు చేసే అదనపు ఎక్స్పెన్స్ చార్జీలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ బాగా తగ్గించింది. గతంలో 20 బేసిస్ పాయింట్లుగా ఉన్న ఈ అడిషనల్ ఎక్స్పెన్స్ చార్జీని సెబీ 5 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లకు ఇది వర్తిస్తుందని సెబీ పేర్కొంది. సెబీ ఈ నిర్ణయం కారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ వ్యయాలు మరింతగా తగ్గుతాయని, ఫలితంగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ మరింతగా పెరుగుతాయని నిపుణులంటున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం కమీషన్లు తగ్గవచ్చని వారు చెప్పారు. వంద బేసిస్ పాయింట్లు 1 శాతానికి సమానం. నిబంధనల్లో మార్పులు... ఇన్వెస్టర్ ఒక ఫండ్ నుంచి వైదొలిగేటప్పుడు (ఫండ్ యూనిట్లను విక్రయం) ఆ ఫండ్ నిర్వహణ ఆస్తుల మొత్తంలో 20 బేసిస్ పాయింట్లను ఎగ్జిట్ లోడ్‌గా చెల్లించాలని సెబీ 2012లో నిబంధన విధించింది. తాజాగా ఈ ఎగ్జిట్ లోడ్‌ను 5 బేసిస్ పాయింట్లకు పరిమితం చేసింది. అంతేకాక మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన వివరాల వెల్లడి నిబంధనలను కూడా సరళీకరించింది. -
విమాన చార్జీలకు రెక్కలు..
సాక్షి, ముంబయి : ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు గత ఏడాదిలో 30 శాతం పెరగడంతో విమానయాన సంస్థలు నిర్వహణ ఖర్చులను అధిగమించేందుకు విమాన చార్జీలను పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 45 శాతం జెట్ ఇంధనం ఖర్చులే కావడంతో విమాన చార్జీలను 15 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే పలు ప్రైవేట్ విమానయాన సంస్థలు సంకేతాలు పంపినా అధికారికంగా చార్జీల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాదిగా జెట్ ఇంధన ధరలు 30 శాతం మేర పెరిగాయని, గత ఆరునెలల్లోనే 25 శాతం భారమయ్యాయని, ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలను పెంచకతప్పదని ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే ముందుగా ఏ సంస్థ చార్జీల పెంపును ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పోటీ పెరిగిన క్రమంలో చార్జీల పెంపుకు ముందు సీట్ల ఆక్యుపెన్సీని కూడా చూసుకోవాలని మరో ఎయిర్‌లైన్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. జెట్ ఇంధన ధరల పెంపుతో విమాన చార్జీలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని తాము అంచనా వేస్తున్నామని కేపీఎంజీ ఏరోస్సేస్, డిఫెన్స్ ఇండియా హెడ్ అంబర్ దూబే పేర్కొన్నారు. జెట్ ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని అన్నారు. -
క్యా'బ్' పరేషాన్
దేశీయ రవాణా రంగంలోకి ప్రవేశించిన క్యాబ్ సంస్థలు ప్రయాణికులపై దండయాత్ర చేస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆటోరిక్షాలు, మెట్రో రైలు వంటి అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల చార్జీలను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కానీ సిటీలో క్యాబ్ సంస్థలపై మాత్రం నియంత్రణ అనేదే లేదు. వీటి చార్జీలపైనా ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకుండా పోయింది. మోటారు వాహన నిబంధనల మేరకు 2006లో ‘సిటీ క్యాబ్యాక్ట్’నుఅమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం కిలోమీటర్‌కు రూ.10 చొప్పున, రాత్రి వేళల్లో రూ.15 చొప్పున చార్జీలు ఉండేవి. బడా క్యాబ్ సంస్థల ప్రవేశంతో చార్జీల నియంత్రణ అంశం ఎవరి పరిధిలో లేకుండా పోయింది. దీంతో ‘పీక్ అవర్స్’ పేరుతో సగటు ప్రయాణికుడి నడ్డి విరుస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో:రవాణా రంగంలోకి దూసుకొచ్చిన అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు విధించే చార్జీలు మొదట్లో ఆటోరిక్షా కంటే తక్కువగా ఉండేవి. ఈ చార్జీలతో ఆకట్టుకున్న ఊబెర్, ఓలా వంటి క్యాబ్ సంస్థలు ఇప్పుడు ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ఆటోరిక్షాలు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో రాత్రి 10 గంటలు దాటాక మాత్రమే సాధారణ చార్జీలపైన 50 శాతం అదనపు చార్జీలు విధించే వెసులుబాటు ఉంది. కానీ క్యాబ్ సంస్థలు ప్రత్యేకంగా ‘పీక్ అవర్స్’ లేదా ‘స్లాక్ అవర్స్’కు వేర్వేరుగా చార్జీలు చార్జీలను పెంచేస్తున్నాయి. ఇలాంటి పెంపు నిబంధన నిర్దిష్టంగా లేకున్నా, నియంత్రించేవారు గాని.. కనీసం దీనిపై ఫిర్యాదు చేసేందుకు గాని అవకాశం లేకపోతోంది. వేసవిలో పెరిగిన క్యాబ్ డిమాండ్ కొద్ది రోజులుగా పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో పాటే క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. సాధారణ రోజుల్లో 1.2 లక్షల క్యాబ్‌లు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తుండగా.. ప్రస్తుతం వేసవి రద్దీకి అనుగుణంగా సుమారు 1.6 లక్షల క్యాబ్‌లు తిరుగుతున్నాయి. 8 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలను పెంచేస్తున్నారు. ఒకవేళ పీక్ అవర్స్‌లో క్యాబ్‌ల కొరత కారణంగా చార్జీలు పెరుగుతున్నట్లు భావించినా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే పీక్ అవర్స్‌గా భావించాలి. కానీ క్యాబ్ చార్జీలు ప్రతి గంటకు మారిపోవడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లోనూ పీక్ అవర్ చార్జీలు విధిస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీకి సాక్ష్యాలివిగో.. ♦ దిల్సుఖ్నగర్ నుంచి బోడుప్పల్ వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. సాధారణంగా ఈ దూరానికి క్యాబ్ చార్జీ రూ.250 అవుతుంది. కానీ ఇటీవల ఓ ప్రయాణికుడు ఏకంగా రూ.798 చెల్లించాల్సి వచ్చింది. ♦ హైటెక్‌సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు సాధారణంగా రూ.300 నుంచి రూ.350 వరకు ఉంటుంది. కానీ రెండు రోజుల క్రితం ఈ చార్జీ రూ.650కి పెరగడంతో సదరు ప్రయాణికుడు బెంబేలెత్తాడు. ♦ గంట గంటకూ చార్జీలు జంప్ అవుతున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ♦ పీక్ అవర్స్ నెపంతో 1:2, 1:3, 1:4 చొప్పున చార్జీలను ఆయా క్యాబ్ సంస్థలు పెంచేస్తున్నాయి. ♦ మీటర్ ఆధారంగా నడిచే ఆటో రిక్షాలు, ట్యాక్సీలు తదితర వాహనాల చార్జీలపై ఆర్టీఏ, తూనికలు–కొలతలు శాఖల నియంత్రణ ఉంటుంది. కానీ మొబైల్ యాప్‌తో సేవలందజేస్తున్న క్యాబ్‌లను నియంత్రించే అధికారం ఏ ప్రభుత్వ విభాగానికీ లేకుండా పోయింది. ప్రభుత్వమే చార్జీలునిర్ణయించాలి బడా క్యాబ్ సంస్థలను ప్రభుత్వం నియంత్రించకపోవడమే ఇందుకు కారణం. ఆటోలు, ట్యాక్సీలకు ఉన్నట్లుగానే క్యాబ్‌లకు కూడా ఫిక్స్డ్ చార్జీలు ఉండాలి. ప్రభుత్వమే ఈ చార్జీలను నిర్ణయించి పారదర్శకంగా అమలు చేయాలి. – అనిల్ కొఠారి, గ్రీన్‌క్యాబ్స్ ఓనర్ మాకూ అన్యాయమే.. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల్లో సగానికి పైగా ఆవే తీసుకుంటాయి. జీఎస్టీతో సహా భారమంతా మా డ్రైవర్లపైనే వేస్తున్నారు. డీజిల్ ఖర్చులు, మెయింటనెన్స్ ఖర్చులన్నీ మినహాయిస్తే రోజుకు రూ.500 కూడా రావడం లేదు. – సిద్ధార్థ్గౌడ్, జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు -
విమానాల్లో ఛార్జీల బాదుడు
న్యూఢిల్లీ : ఇక మీదట విమానంలోనూ ఫోన్ మాట్లాడుకునేందుకు, ఇంటర్నెట్ను వాడుకునేందుకు టెలికం కమిషన్ అనుమతించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన నిబంధన పట్ల ప్రయాణికులు ఓ వైపు సంతోషిస్తున్నప్పటికీ, మరోవైపు వారికి రుచించని మాట ఒకటి తెలియజేసింది. అదేంటంటే ఇక మీదట విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా మొబైల్ ఫోన్లను వాడవచ్చు, కానీ అందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని సంకేతాలిచ్చింది. అయితే ఈ ఛార్జీలు ఎంతమేర ఉంటాయని స్పష్టంగా తెలియజేయనప్పటికీ, అంతర్జాతీయ నిబంధనలనుసరించి నిర్ణయిస్తామని మాత్రం తెలిపింది. కాగా, అంతర్జాతీయంగా కొన్ని దేశాలు 10ఎంబీ డేటా వాడుకుంటున్నందుకు 4.5 డాలర్లు(రూ. 350) వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకైతే అంతర్జాతీయ రూట్లలో దేశీయ విమానయాన సంస్థలు ఇంటర్నెట్ సేవలకు 30నిమిషాలకు రూ.500, గంటకు రూ.1000 ఛార్జ్ చేస్తున్నాయి.అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఇక మీదట ఇన్ ఫ్లయిట్ ఇంటర్నెట్, మొబైల్ కాల్స్ మాట్లాడాలంటే అర గంట నుంచి గంటకు రూ.500 - 2000 చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇన్ ఫ్లైయిట్ ఇంటర్నెట్ చార్జీల నిర్ణయం విషయంలో ట్రాయ్ జోక్యం ఉండదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. సర్వీసు ప్రొవైడర్లే ఆ చార్జీలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. -
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
-
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే కస్టమర్లను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న బ్యాంకులు ఇపుడు వారినెత్తిన మరో బాంబు వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల జారీ, డెబిట్ కార్డుల లావాదేవీలు తదితర లావాదేవీల పై సర్వీస్ ఛార్జి విధించాలనే సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. ప్రధానంగా ఇకపై ఉచిత సేవలపైన కూడా పన్నులు కట్టాలన్న జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో ఇకపై ఉచిత సేవలకు శుభం కార్డు వేయనున్నాయని తెలుస్తోంది. మే నెలలో దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా.. సర్వీస్ ఛార్జీ వసూలు చేసినట్లు పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఎస్టీ) ఈ నోటీసులు అందించటం విశేషం. బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపై.. సర్వీస్ ఛార్జీ విధిస్తున్నట్లుగా భావించి ఈ పన్నులు చెల్లించాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ కోరింది. ఈ మేరకు ప్రధాన బ్యాంకులకు నోటీసులు అందాయి. అంతేకాదు ఈ సంవత్సరానికే కాకుండా.. గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని ఈ నోటీసుల్లో తెలిపింది. ఈ పన్నుల భారం మొత్తం విలువ సుమారు రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే ఉచిత సేవలకు బదులు బ్యాంకులు ఇక సర్వీస్ చార్జీ బాదుడుకు తెర తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, లావాదేవీలు, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ భారం తప్పదంటున్నారు. ఇప్పటివరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకులకు నోటీసులు అందాయి. త్వరలోనే ఇతర బ్యాంకులకు నోటీసులు అందే అవకాశం ఉంది. -
సిద్దవ్వ
‘‘అమ్మా! ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనియ్యరట్నే?’’ తల్లి జడ అల్లి, రిబ్బన్ ఇస్తే దాంతో ఆ జడను జతచేసుకుంటూ చెప్పింది ఎనిమిదో తరగతి చదువుతున్న రేణుక. ‘‘బాపమ్మకు పింఛన్ రానీ... కడ్దాం’’ అంటూ విసురుగా బిడ్డను కుడికి తిప్పి అటు వైపు తల దువ్వి ఇంకో జడకోసం పాయలు తీయసాగింది భూలక్ష్మి. పక్కింట్లోంచీ మాటలు వినపడుతున్నాయి. ‘‘అమ్మా.. ఎన్ని రోజుల్సంది అడుగుతున్నా.. బూట్లుగావల్నని? షెర్కు పనికివోతే ఇస్తా.. మిరపకాయలు తెంపవోతే ఇస్తా.. బెండకాయ ఇర్వవోతే ఇస్తా అని నాల్గు నెల్ల నుంచి అంటున్నవ్. యే కాలంకి ఆ కాలం బోతనే ఉంది పైసల్లెవ్.. బూట్లు లెవ్. రాజుగాడు గొన్నడు.. మహేందర్గాడు తెచ్చుకున్నడు.. నన్ను ఎక్రిస్తున్రే....’’మారాం చేస్తున్నాడు ఇంటర్ ఫస్టియర్లోఉన్న కొడుకు. ‘‘చింతపండు వొల్వవోతా కదా.. ఆ పైసల్ రాంగనే ఇస్తా...’’ బోర్లించిన సత్తు పళ్లెం మీద జొన్నరొట్టెను ఒత్తుతూ అంది సరోజ.‘‘నాకిప్పడే గావాలేపో. బాపమ్మను అడిగియ్యి!’’ జిద్దుతో కాళ్లను నేలకేసి తంతూ అన్నాడు. రొట్టెను పెనం మీద వేస్తూ ‘‘బాపమ్మ తాన ఏడుంటయ్? అక్క ఫోన్ జేసింది. చిన్ను గాడి పుట్టెంట్రుకలు వెట్టుకుంటున్రట. బట్టలు.. మాసం బంగారం కట్నంబెట్టాలే. యేడ్నుంచయితయ్ అన్ని? గా పైసల కోసమే ఎవరి కాళ్లువట్టుకొవాల్నో తెల్వక సస్తున్నా’’ తనలో తను అనుకుంటూ కొడుక్కీ చెప్పింది సరోజ. ‘‘నాకు దెల్వదు.. నీ యవ్వ.. ఈ నెలగన్క పైసలియ్యకపోతే సూడు.. ఇంట్లకెంచి ఎల్లిపోతా’’ అదే జిద్దు, అదే మొండితనంతో కొడుకు. పైన రేకుల వేడి.. పొయ్యి వేడి.. తన నిస్సహాయత మీద కోపం..అన్నీ నెత్తికెక్కి పిండిచేతిని దులుపుకొని, నుదుటి మీద పడ్డ జుట్టును మణికట్టుతో వెనక్కి తోసుకుంటూ లేచింది ‘‘ఏందిరా బాడ్కో.. లెస్స మాట్లాడుతున్నవ్? ఇంట్లకెంచి వోతవా?’’ అంటూ గది మూలకు చూడసాగింది చీపురు కోసం. తల్లి ఆవేశం తెలిసిన కొడుకు నిమిషంలో బయటపడ్డాడు. అయినా తగ్గని అమ్మ.. చీపురు తీసుకొని వాకిట్లోకి పరిగెత్తింది కొడుకు వెనకాలే.. ‘‘నీయయ్య ఏమన్న ఈడ గడ్డ దాషివెట్టి పోయిండనుకుంటున్నావ్రా? బూట్లులెవ్.. గీట్లు లెవ్.. మల్లగనక ఆ పేరెత్తినవో పాత బూటుతో కొడ్తా ఏందనుకుంటున్నవో బిడ్డా’’ తప్పించుకుని పోతున్న కొడుకు వేగాన్ని అందుకోలేక స్వరాన్నిపెంచింది సరోజ. ఆ రెండిళ్లకు కలిపి ఒక్కటిగా ఉన్న వాకిట్లో కూర్చునుంది సిద్దవ్వ. రెండిళ్ల మాటలూ ఆమె చెవినపడ్డాయి. చాచుకుని ఉన్న కుడికాలును చూసుకుంది. మోకాలి కింద పాత గుడ్డతో గట్టిగా కట్టుకట్టి ఉంది. ఆ దెబ్బ తగిలి దాదాపు మూడు నెల్లవుతోంది. కాస్త వంగింది కుడిచేత్తో కట్టు ఉన్న చోటును రుద్దుకుందామని. నొప్పి ప్రాణం తీసింది. ‘‘అవ్వా....’’ అని మూలుగుతూ మళ్లీ అరుగుకు వెన్నును వాల్చింది. ‘ఈ నెలన్నా దవ్ఖాన్ల సూపించుకోవాలే అనుకున్న..’ మనసులో సణుక్కుంటూ నిస్సహాయంగా అరుగు అంచుకు తల ఆనించింది. అనుభవించిన జీవితం మెదిలింది. ఈ ఇంటికొచ్చినప్పుడు తొమ్మిదేండ్ల పిల్ల. పెండ్లంటే ఆటలెక్కనే అన్కుంది. అటెన్క నాలుగేండ్లకు పెద్దమనిషి అయింది. పద్నాలుగేండ్లకు మల్లేష్, పదహారేండ్లకు బాల్‌రాజు, ఆ యేడాదికే పద్మ... పదిహేడేండ్లకే ముగ్గురు పిల్లలు. మధ్యల ఇంక రెండు కడుపులు వొయినయ్. ‘‘ఛల్.. గీ ఊళ్లె పనిజేస్తనా’’ అని పెనిమిటి.. కొన్నొద్దులు బొంబైల, ఇంకొన్నొద్దులు మస్కట్ల ఉండి పైసల్ దేలేగాని అప్పులైతే జేసిండు మస్తుగా. అన్నోంకల అప్పు వుట్టుడు బంద్ అయినంక ఊర్లేనే ఉండుడు సురు వెట్టుండు. అప్పు ముట్టజేషె తందుకు ఉన్న రెండెక్రాలు అమ్ము కుంటిమి. పద్మ పెండ్లికి మల్లా అప్పే. సోల్ది వెట్టంగా వెట్టంగా కూలికి వోవుడు మొదలువెట్టిండు మొగడు. కొడుకులు చేతికొచ్చినంకైతే పురాగా పని బందేవెట్టిండు. పరాకత్ తాగుడే. తాగతందుకు పైసల్ లేకపోతేనే పని. కొడుకులతో సరిసమానంగా మొగోడిలెక్క ఎంత కష్టవడ్డది? పెండ్లిలు, నీల్లాటలు.. ఎన్ని జేసింది? భూపాల్‌రెడ్డి దొర పొలంల పెనిమిటి, ఇద్దరు పిల్లలు గల్సి బాయి దవ్వుతుంటే మట్టిపెళ్లలు ఇరిగి మీదవడ్డయ్. మొగడైతే ఆడిదాడ్నే పానం ఇడ్శే. పీన్గును దీస్కొని అందరం గల్సి భూపాల్‌రెడ్డి దొర ఇంటికాడికి వోతిమి. పైసల కోసం. ‘‘ఆడు తాగి సచ్చిపోయిండు. నేనెందుకు దండుగ్గడ్తా? ఉల్టా నా పేరే బద్నాం.. ఫలానా దొరకోసం బాయి దవ్వుతుంటే సచ్చిపోయిండని. మల్లా నా పొలంల పనికెవరొస్తరే?’’ అని గాయ్జేసి.. లొల్లివెట్టి రూపాయి ఇయ్యలే. పోస్ట్‌మార్టమ్‌ల తాగి సచ్చిపోయిండనే అచ్చిందట. ‘‘అవ్మల్లా.. కాయకష్టంజేషెటోళ్లు తాగకుండా ఎట్ల పనిజేస్తరు?’’అని పీన్గును బొందవెట్టినంక కల్లు గుడ్షె కాడ గూసోని భూపాల్‌రెడ్డి దొరను తిట్టిండ్రు తనోల్లంతా. ‘‘వారీ.. గా దొర ముంగట నోరువెగ్లకుండా.. కల్లు ముంతను జూస్కోని ఎంత ఎగిర్తే ఏమొస్తదిరా?’’ అన్నది. ‘‘యే.. లంగగాడ్దికొడుకే అడు! మనమేం జెప్పినా ఇనడే..!’’ అనుకుంట తన నోరే మూపిచ్చిరి. గదే బాయిల చిన్నోడి నెత్తికి దెబ్బతగిలి.. మెంటల్ అయిండు. మీది మీది దెబ్బలతో పెద్దోడు బయటవడ్డడు. గా పొద్దు ఇంకా యాదికున్నది. షిన్నోడు పనికివోనన్నా.. గుంజుకపోయిండు పెద్దోడు. ‘‘పానం బాగలేదు రానే..’’ అన్నా ఇన్లే. మక్కగట్క తిని గట్ల మంచమ్మీద ఒరిగిండో లేదో.. గుంజ్కపొయిరి అయ్యా, కొడుకు గల్సి. పండి.. పండి షిన్నోడు సూత పాయే. గిన్నేండ్లలో.. అంటే ఎన్నేండ్లుంటయ్? గానాడు దేనికోసమో సర్కారోళ్లు అడిగితే డెబ్భై మీదనే ఉంటయ్ అని జెప్పింది. ఆడ్నే ఉన్న కోమటోళ్ల సావిత్రమ్మ.. ‘‘ఊకో సిద్దవ్వ.. పెండ్లిజేసుకొని నేను ఈ ఊరికొచ్చినప్పడు షిన్నపిల్లవు. మీ అత్తతో బాసండ్లు తోమతందుకు రాకపోతుంటివా మా ఇంటికి? అరవై ఉంటయేమో గంతే’’ అన్నది. గంతేనా? ఏమో తియ్. అరవై ఏండ్లకు నెత్తి నెరుస్తదా? దవడలు కూడా ఊషిపోయే. కింది పండ్లూ వదులైనయ్. నడుమైతే భూమేవట్టే. పెయ్యంతా ముడుతలే. షేతులైతే ఇకారం గొడ్తున్నయ్. ముందుగల్లనే నల్లటి మనిషి... ఇంకా నల్లగా! పాపం.. బాపనోల్ల ఆయి ఊకే అంటుండే.. ‘‘సిద్దీ.. నల్లగుంటవ్ కాని.. మస్తు కళ ఉంటదే నీ మొఖంల’’ అని. ఆల్లింట్లున్న సిమెంట్ కుండీలల్ల నీళ్లు నింపతందుకు గట్లంటుందేమో అనుకునేది. ఆ లోతు నుయ్యిల కెంచి బొక్కెనేసి నీళ్లు షేదుతుంటే దమ్ము ఎగవోతుండే. మా ఆడివిల్ల అననే అనే.. ‘‘బాపనోల్లింట్ల నీళ్లు షేది షేది అంగిపోయినవ్ అదినా.. అని. అయినా తాను జేషిన కష్టం ముందు పాపం.. గా ఆయికి షేదిచ్చిన నీళ్లెన్ని? గివన్నీగాదు గని.. మొగడు, కొడుకులు సచ్చిపోయినప్పుడు రెక్కలు ఇర్గిపోయి.. యెన్ను çవడిపోయినట్టయింది. ఇగ మల్లా లెవ్వలే. కాలం లేదు. ఉన్నోళ్లు సుత పొలాలను పిలాట్లు జేసుకున్నరు. పనులు బంద్ అయ్నయ్. కరువు పని ముసలోల్లకు ఇడ్శిపెట్టి.. బలమున్నోల్లంతా పట్నం దారివట్టిండ్రు. పెద్దోడు గూడా గా దారిపొంటనేవాయే. ఏ పనిదొరికితే గా పని జేసుడు వెట్టిండు. గొన్నొద్దులు చౌకీదార్ లెక్కగూడా ఉన్నడు. దొంగతనం మోపి ఎల్లగొట్టిండ్రు. మస్తు బాధవడ్డడు. ‘‘అమ్మా.. నేను దొంగతనం జెయ్యలేదే’’ అని ఏడ్శిండు కొడుకు. ఆఖిరికొస్తే డ్రైనేజీలు దీసే పనిదొరికిచ్చుకున్నడు. ఎనిమిదినెల్లు జేసిండేమో.. మోర్లదంతా నోట్లకు, ముక్కులకు వొయ్యి ఏదో ఇన్సిపెక్షనటా.. అదొచ్చి సచ్చిపోయిండు పట్నంల. అందరం రోడ్డు మీదవడ్డం. పెద్దోడికి ఒక బిడ్డ, కొడుకు. చిన్నోడికి ఇద్దరు బిడ్డలే. ఇందిరమ్మ పథకంలొచ్చిన ఇల్లమ్మితే పెద్దోడి బిడ్డ పెండ్లాయే. దానికి పదిహేను నిండంగనే పెండ్లి జేస్తిమి. మిగిలినోల్లు సదూతుండ్రు. పద్మకు పెండ్లి జేసి తోలిచ్చినమంటే ఇగామెను అర్సుకున్నదే లేదు. అడగకడగక అడ్గింది బిడ్డ.. ‘‘అమ్మా... నా బిడ్డకు కమ్మల్గున్నాలు జేపిస్తవానే’’ అని. గదిగూడ అడగకపోవునేమో.. సముర్థాడింది. ఆల్ల యారాండ్ల పిల్లలకు అమ్మమ్మలు మస్తు బంగారం వెట్టిండ్రట. నలుగుట్ల దీసేసినట్టు ఉండద్దని అడిగినట్టుంది. అదీ బీడీలు జేస్తది. అన్ని పైసలు ఇంట్లియ్యకుండ... ఇన్ని దాషిపెట్టుకుంటది. గట్ల దాసుకున్న దాంట్లెకు కొన్ని గలుపుమన్నది గంతే. గవ్విటితో బిడ్డకు కమ్మల్గున్నాలు కొనిచ్చి అమ్మమ్మ వెట్టిందని జెప్తా అన్నది బిడ్డ. తానిచ్చుడేమోగానీ.. కాపోల్ల గంగారం పొలంల పనికివొయ్యి కాలుజారివడితే సూడొచ్చింది. దాసుకున్న పైసలల్ల నుంచి తనకే గొన్నిచ్చిపాయే... దవ్ఖాన్ల సూపిచ్చుకో అని. దవ్ఖాన్లకు ఏడవాయే? ‘‘నిన్ను సూడతందకొచ్చెటోల్లకు షికెన్లు వెట్టి, కల్లు తాపిచ్చుడికే ఉన్న పైలు వొడుస్తున్నయ్’’ అని పద్మిచ్చిన పైసల్ దీస్కుంది పెద్ద కోడలు. గా నెలల పెద్ద కోడలి దగ్గరుండె. షెరొక్క నెల వంచుకుంటుడ్రు గదా! ‘‘ఏందే సిద్ది పంచుకునుడు? నువ్వేమన్నా కాయకష్టం జేస్తలేవా? సక్కగ నీది నువ్వు ఉండక?’’ అన్నది మల్లవ్వ. మొగదిక్కులేని ఆడోళ్లం. ముగ్గురం మూడు సోట్ల ఎందుకని.. ఆల్లిద్దరి దగ్గర్నే కాలం ఎల్లదీస్తుంది. ఓల్లదగ్గరుంటే ఆల్లకు గా నెల ఫించన్ ఇయ్యాలే. కూలీ చేసిన పైసలెమన్నుంటే బిడ్డ కోసమని వెడ్తుండే. కాలు కదలకుండయినప్పటి కెంచి కూలీగూడా లేదు. సిద్దవ్వకు తెలియకుండానే కన్నీళ్లొస్తున్నాయి. థూ.. ఏం బతుకు పాడైంది? సోయి దెల్షినప్పటినుంచీ కష్టాలే. ఎన్నడన్న సుఖవడ్డదా? కడుపు నిండ తిండి దిన్నదా? బిడ్డ నోరు ఇడ్శి అడిగింది.. ఉల్టా దాన్ దగ్గరున్నయే ఇచ్చే. ఎంత సిగ్గుషరం లేని జన్మిది? ఒక్కసారిగా కాలు సులుక్కుమని పొడిచినట్టవడంతో ఆ కాలును కొంచెం వెనక్కి మడవడానికి ప్రయత్నించి నొప్పి పెరగడంతో వెంటనే మళ్లీ చాపింది. ‘‘ఈ కాలొకటి.. సావనియ్యది.. బత్కనియ్యది’’ అనుకుంది వేదనగా. ‘‘ఏమత్తా.. పుర్సత్గా గూకున్నవ్? కచ్చీరుకాడికి వోవా?’’ జొన్నెరొట్టె, ఉల్లిగడ్డ కారం ఉన్న పళ్లేన్ని తెచ్చి సిద్దవ్వ ముందు పెడ్తూ అంది పెద్ద కోడలు. మొహం మీద తిరుగుతున్న ఈగను తోలడానికి కుడిచేతిని అటూఇటూ ఆడిస్తూ పళ్లెం వంక చూసింది సిద్దవ్వ. ఫించనొచ్చే దినం వంతు మార్తది. ఏం మర్శినా గిది మాత్రం మర్వరు కోడండ్లు. చిన్న కోడలు అన్న మాట గుర్తొచ్చింది. ‘‘అత్తా.. అచ్చే నెల సుత నాతాన్నే ఉండు. ఊకే వాకిట్ల దేక్కుంట ఆ ఇంటికి ఈ ఇంటికేం తిర్గుతవ్ గని’’ అని. తన మీద పావురంతో గాదు. ఆ నెలల బిడ్డ ఫీజు గట్టాలే.. పిల్లగాండ్లు పెద్దోలయిండ్రు. బాత్రూమ్కు ఉట్టి తడ్కనే ఉన్నది. తల్పువెట్టియ్యాలనే ఆలోశ్న జేస్తుంది. ఎక్వతక్వలకు ఫించన్ పైసలు సగవెడ్తది. అయినా ఈ నెల సూత తనను షిన్నదే ఉంచుకుంటే పెద్దది ఊకుంటదా? గుంజి గూట్లెవెట్టది? అనుకుంటూ జొన్నరొట్టె తినసాగింది. ‘‘ఏమయ్యా... లిస్ట్ తయారైందా?’’ అడిగాడు సెక్షన్ హెడ్ యూడీసీని. ‘‘సర్.. రామ్మోహన్ దగ్గరుంది’’ అని చెప్పి రామ్మోహన్ దగ్గరకు వచ్చాడు యూడీసీ. ‘‘రామ్మోహన్.. లిస్ట్ తయారైందా?’’ అడిగాడు యూడీసీ. ‘‘ఫోర్‌డేస్ అవుతుంది సర్..రెడీ అయ్యి’’ చెప్పాడు ఎల్డీసీ రామ్మోహన్. ‘‘ఎంత మంది ఉండొచ్చు...’’ మళ్లీ యూడీసీ. ‘‘అయిదూర్లలో పన్నెండు మంది ఉన్నారు సర్. అంతా డెబ్భై ఏళ్ల పైబడ్డ వాళ్లే’’ చెప్పాడు సిన్సియర్‌గా రామ్మోహన్. యూడీసీ మొహంలో చిరునవ్వు. ‘‘గుడ్! సర్ సంతోష పడ్తాడు. వచ్చే నెలలో కూడా చూడూ..’’ అంటూ వెళ్లిపోయాడు యూడీసీ. రామ్మోహన్ మెదడులో ఇద్దరున్నారు. ఆ ఇద్దరి పేర్లను వయా యూడీసీ సెక్షన్హెడ్కు చేరకుండా జాగ్రత్తపడ్తున్నాడు. స్వామి ఒక కార్యం అప్పజెప్పినప్పుడు స్వకార్యమూ చూసుకోవాలని గవర్నమెంట్జాబ్లో చేరిన కొత్తలోనే నేర్చుకున్నాడు. అదీగాక వాటా తనకు ఉంటదో ఉండదో? ఉన్నా.. ఎంతుంటుందో? అందుకే జాగ్రత్తపడ్డాడు. యూడీసీ కూడా ఆ జాగ్రత్తలోనే ఉన్నట్టున్నాడు. అంతగా పట్టుపడితే ఒక్కరి పేరు చెప్తాడు. ఆ నెలవి నిన్ననే వీఆర్ఓలకు అప్పగించేశాడు కూడా! నిశ్చింతగా ఇంకో ఫైల్ ఓపెన్ చేశాడు రామ్మోహన్. మధ్యాహ్నం పన్నెండు దాటింది. మార్చి ఎండ చుర్రుమంటోంది. ‘గింత తిని ఎల్లేసరికి గీయాల్లాయే..’ రెండు అరచేతులను నేల మీద పెట్టి బలాన్ని కూడదీసుకుని డేక్కుంటు వెళ్తూ అనుకుంది సిద్దవ్వ. మధ్యలో ఆగి తల నిటారుగా పెట్టి ఎండ తగలకుండా కుడి చేతిని నుదురుకు అడ్డం పెట్టుకుని దారి చూసుకుంది. ‘ఇంకా మాలెస్స దూరమే ఉన్నదుల్లా...’ అనుకుంటూ మళ్లీ డేకడం మొదలుపెట్టింది. ‘‘గింత ఎండపూట ఎల్లినవేందే?’’ ఏదో పనిమీద నుంచి ఇంటికెళ్తూ అడిగాడు గూండ్ల భూమేశ్.. ఎదురుపడ్డ సిద్దవ్వను.‘‘గ్యారకొట్టిందాంక పంచాయతీ అపీస్లకు పెంట మీది గిర్దావర్ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) రాడు! ఇంత కడుపు సల్లవడగొట్కొని ఎల్లేసరికి గీయాల్ల ఆయే.. ఏంజేతు’’ మూలుగుతూ బదులిచ్చింది.‘‘పంచాయతీ ఆఫీస్‌ల ఏం పనే నీకు?’’ అని అంతలోకే గుర్తొచ్చిన వాడల్లే ‘‘అగో.. ఇయ్యాల ఫించనా.. ఏందీ?’’ అడిగాడు. ‘‘అవ్!’’ నిలబడి ఉన్న భూమేష్ వైపు ఇందాకటిలాగే తల పైకెత్తి నుదురుకి చెయ్యి అడ్డంపెట్టుకొని మాట్లాడసాగింది. ‘‘రా మల్ల.. నేను కొండవోవాల్నా..?’’ భూమేశ్. ‘‘ఎట్ల దొల్కపోతావ్.. సైకిల్ సూత లేనట్టుందిగద కొడ్కా..?’’ వెళ్లడానికి సిద్ధమవుతూ అడిగింది.‘‘ఎత్కపోతా రాయే అవ్వా..’’ అని నవ్వుతూ సిద్దవ్వను అమాంతం రెండు చేతులతో పైకి లేపి పరుగుపెట్టాడు భూమేశ్. పదిహేను నిమిషాల్లో ఆమెను పంచాయితీ ఆఫీస్‌లో దింపి నీళ్లతో ఆయసాన్ని తీర్చుకున్నాడు. డేక్కుంటూ వెళ్లి వరుసలో కూర్చుంది సిద్దవ్వ. దెబ్బ తగిలిన కాలు తన ఉనికిని మర్చిపోనివ్వట్లేదు. కాలు కాదు మిన్ను విరిగినా బాధ్యత తప్పదు. క్యూలో పెన్షన్ తీసుకునేవాళ్లు కదులుతున్నకొద్దీ సిద్దవ్వ ముందుకు డేకుతోంది. కాలు నొప్పి విపరీతంగా ఉంది. తట్టుకోలేకపోతోంది. కళ్లను గట్టిగా మూసుకుంది బాధను భరిస్తున్నట్టు. పెన్షన్ పంచుతున్న వ్యక్తి గొంతు గట్టిగా వినపడేసరికి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది సిద్దవ్వ. ‘‘యాదమ్మా.. నీ వేలిముద్ర మ్యాచ్ అయితలే.. రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు పో!’’ అన్నాడు అసిస్టెంట్. ‘‘ఏందీ.. అయితే పైసలియ్యవా?’’ అన్నది యాదమ్మ.‘‘వేలిముద్ర కరెక్ట్‌గా లేకపోతే పైసలెట్లిస్తరు? వీయ్యార్వో సారు కొలువూడ్తది’’ అని జాబితాలో తర్వాత ఉన్న పేరు పిలవసాగాడు. ‘‘ఓ సారూ.. ముందుగల్ల నా లెక్క జెప్పి తర్వాత ఇంకొకొల్లన్ బిలువ్’’ అన్నది బెదురు లేకుండా.‘‘ఏం దబాయిస్తున్నవా? వీయ్యార్వో సారు తానకు పో.. చెప్తడు’’ బెదిరిస్తున్నట్టుగా అసిస్టెంట్.‘‘పోకడ మస్తే ఉందిరో’’ అంటూ కాస్త ముందుకు జరిగింది.‘‘ఏమన్నవే ముసల్దానా? నాకు పోకడ్నా?’’ అంటూ కూర్చున్నవాడు ఒక్కసారిగా లేచాడు ఆవేశంతో. ‘‘ఏ సారూ.. మాటలు మంచిగరానియ్. నా అసుంటి తల్లి లేదా?’’ అంది యాదమ్మ గాయపడ్డదానిలా. ‘‘ఛీ.. నీ అసుంటి తల్లా? నా తల్లి నీ లెక్కెందుకుంటది?’’ అంటూ ఆమెతో పోట్లాటకు దిగాడు. అక్కడున్న వాళ్లంతా బెదిరిపోయారు. ఆ గొడవ.. కొంచెం దూరంలో సర్పంచ్‌తో రాజకీయాలు మాట్లాడుతున్న వీఆర్వో చెవిన పడటంతో గబగబా అక్కడికి వచ్చాడు అతను. ‘‘ఏయ్.. సునీల్.. ఏందయ్యా లొల్లి? ఏమైంది?’’ గద్దించాడు అసిస్టెంట్‌ను. ‘‘సూడుండ్రి సర్.. వేలిముద్ర సరిగ వడ్తలేదు.. రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు పో అని మర్యాదగా జెప్తుంటే ఇనకుండా పోకడగాడు.. గీకడగాడు అంటుంది’’ ఫిర్యాదు చేశాడు అసిస్టెంట్.‘‘ఏందమ్మా?’’ అన్నాడు యాదమ్మ వైపు తిరుగుతూ వీఆర్వో. ‘‘అవ్ సారూ.. నెల కిందట.. అంతకు మునుపూ గిదే యేలు.. గిదే ముద్ర గదా.. గప్పుడు కరెక్ట్గవడ్డది.. గిప్పడు పడకుండవోతదా? లేక నేనేమన్నా కొత్తేలుతో అచ్చిన్నా?’’ యాదమ్మ బాధలో వెటకారం ధ్వనించింది. ‘‘అదే వేలు యాదమ్మా.. రోజురోజుకి ముసలైతున్నవ్గదా.. గీతలర్గి పోయినయేమో..’’ అన్నాడు వీఆర్వో నింపాదిగా, పళ్లమధ్యలో ఇరుక్కున్న వక్కపొడిని టూత్‌పిక్‌తో తీసుకుంటూ. ‘‘గట్లెట్లా? గట్ల అర్గుతయ్ అని నేను యేడ ఇన్లే. సాచ్ఛం ఉంటే సూపియ్ సారూ..’’ అదే కడుపుమంట యాదమ్మ గొంతులో.‘‘గవన్నీ రేపు ఎమ్మార్వో ఆఫీస్‌ల అడుగు పో..’’ నిర్లక్ష్యంగా చెప్పి ‘‘ఏయ్.. సునీల్! నువ్వు కానియ్! మూడూర్ల పంచాయతీ ఇది. లైను కూడా బాగానే ఉన్నట్టుంది. తొందర్గ కానియ్’’ అంటూ వరాండాలోంచి పంచాయతీ ఆఫీస్ గదిలోకి వెళ్లాడు వీఆర్వో. ఆ అవమానానికి యాదమ్మ మనసు చివుక్కుమన్నది. ‘‘మీ మొదలారా.. మీకు గత్తర్లులెవ్వ.. నాయంగా మాకొచ్చే పైసల్ని మింగుతుండ్రు గదా! మీ ఇండ్లండ్లకెంచి వెడ్తున్నట్టే జేస్తుండ్రు.. మీ పోకట్లకగ్గివెట్టా! పోతా.. ఎమ్మార్వో తాన్కే గాదు..ఆల్ల తాత కాడిగ్గూడా వోతా! మీ పనిజెప్తా!’’ కోపం, బాధ, ఉక్రోషం, ఏడుపు అన్నీ ఉన్నాయి ఆ అరుపులో. ‘‘ఏయ్ సునీల్! గా ఒర్రుడేంది? ఈడికెంచి ముందామెను పంపియ్!’’ యాదమ్మ మాటలకు చిరాకుపడుతూ వీఆర్వో. ‘‘సార్’’ అని జవాబిచ్చి.. ‘‘ఏ యాదమ్మ..గీడ లొల్లివెట్టక్.. రేపు ఎమ్మార్వో తాన వెట్కపో.. నడువ్’’తరిమాడు అసిస్టెంట్.‘‘పెడ్త పెడ్తా.. మీ సంగతి జూస్తా’’ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ ‘‘ఓ ఎల్లక్కా.. సిద్దవ్వా.. మీక్కూడా గీ గతేవట్టిస్తరు సూడుండ్రి... రేపు నాతో ఎమ్మార్వో ఆఫీస్‌కి రాండ్రే. గీల్లంతా లంగల్.. దొంగలు.. మన ఎయ్యి రూపాయలగ్గూడా ఆశవడే కుక్కలు.. గీ కొడుకులు. సూడుండ్రే మీగ్గూడా మొండి షెయ్యే జూపిస్తరు’’ అని లైన్లో ఉన్న వాళ్లను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పంచాయతీ కాంపౌండ్ దాటింది యాదమ్మ. అక్కడున్న అందరి మనసూ బరువెక్కింది. సిద్దవ్వకైతే చేతులు రావట్లేదు ముందుకు జరగడానికి. భయం జొచ్చింది. యాదమ్మ ఇంటి సంగతి తనకెర్కే. వయసుమీదున్నప్పుడే మొగుడు వొయిండు. పిలగాండ్లిద్దరు ఎడ్డోల్లే. మగబాయి లెక్క అన్నిటికీ తానే. ఫించన్ దప్ప ఏం లేదు. పొద్దుగూకేటాల్ల కాపోల్లిండ్లల్ల అన్నం అడుక్కచ్చుకుంటది. ఎప్పుడెప్పుడన్నా సాకిలిండ్లల్ల పనుంటే విలుస్తరు. పోతది. గంతే.ఇప్పుడెట్లుల్లా.. ‘‘సూడుండ్రే.. మీగ్గూడా మొండి షెయ్యే...’’ యాదమ్మ మాటలు చెవుల్లో తిరుగుతున్నయ్. ‘‘సిద్దవ్వా... ఓ సిద్దవ్వా..’’ ఆ పిలుపుతో వర్తమానంలోకి వచ్చి.. అసిస్టెంట్ వైపు చూసిందిసిద్దవ్వ. ‘‘ఏం జూస్తవ్... ముందుకు రా’’ ఈసడింపు అసిస్టెంట్ గొంతులో. చేతుల ఆసరాతో ముందుకు జరిగింది. ‘‘హూ...’’ చిరాగ్గా నిట్టూరుస్తూ.. ‘‘పెంటయ్యా... గీమెను జెర కుర్చీల కూసోవెట్టు’’ అక్కడే ఉన్న పంచాయతీ ప్యూన్‌కు చెప్పాడు అసిస్టెంట్. ‘‘సారూ..’’ అంటూ వచ్చి సిద్దవ్వ రెండు చంకల కింద చేతులతో ఆమెను లేపి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు పెంటయ్య. ఒక్కసారిగా కాళ్లు కిందకి వేళ్లాడటంతో దెబ్బతిన్న కాలు జువ్వుమని లాగి కంపించసాగింది. ఆ నొప్పికి విలవిల్లాడింది ఆమె. పంటికింద బాధను నొక్కేసి బయోమెట్రిక్ మెషీన్ మీద వేలు పెట్టింది ముద్ర కోసం. ‘ఫెయిల్’ అంటూ మొరాయించింది మెషీన్. ‘‘ఉహ్హూ.. మల్లా వెట్టు’’ తిరస్కారం అసిస్టెంట్ గొంతులో.కంపిస్తున్న కాలు మోకాలిని ఎడమచేత్తో అదిమిపట్టుకుంటూ కుడిచేయి బొటనవేలును మళ్లీ మెషీన్ మీద పెట్టింది. అదే శబ్దం ఫెయిల్ అంటూ. ‘‘సిద్దవ్వ గిదే లాస్ట్ చాన్స్. సరిగ్గా పెట్టు’’ హెచ్చరిక. ‘‘అట్లనే సారూ..’’ కంపిస్తున్న స్వరం, చేయితో బొటన వేలిని ఉంచింది. ఫె.. యి.. ల్.‘‘సిద్దవ్వా.. నీ వేలిముద్రను గూడా రిసీవ్ చేస్కుంట లేదు. ఎమ్మార్వో ఆఫీస్‌కు పో రేపు’’ అంటూ తర్వాత పేరు పిలిచాడు అసిస్టెంట్ సునీల్. వెన్నులో వణుకు సిద్దవ్వకు. అంటే.. ఎయ్యి రూపాయలు రావిప్పుడు. ఫించన్ లేకుండా ఇంటికివోతే..? దిగులు.. గుబులు ముసురుకున్నాయ్. పొద్దున రొట్టె తినంగా.. దబ్బదబ్బ చిన్నకోడలు బయటకచ్చి.. ‘‘ఈ నెల సుత అత్తమ్మ నాదగ్గర్నే ఉంటది’’ అన్నది పెద్దకోడలికి ఇనవడేటట్టు. గంతే.. ఉరుక్కుంట బయటకచ్చింది పెద్దకోడలు ‘‘ఏందే ఉండేది’’ అనుకుంట. ‘‘ నెల నీ తాన.. నెల నా తాన అన్నప్పుడు లెక్క గట్లనే ఉండనియ్’’’ బెదిరిచ్చింది.‘‘ఏంది లెక్కపత్రం? మస్తు మాట్లాడుతున్నవ్. ఉంటది. నా తాన్నే ఉంటది. నీకేమైతుంది?’’ ‘‘నాకేమైతుందా?’’ ‘‘అవ్..’’ ‘‘ఏందే అవ్...’’ మాటామాటా వెంచుకుని సిగెంట్రుకలు వట్టుకుండ్రు. ఫించన్ కోసం తనను పంచుకున్నోళ్లు... ఇయ్యాల అది లేకుంట వోతే ఇంట్లెకి రానిస్తరా?రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు తనను ఓల్లు గొండవోవాలే? పైసల్ దప్ప గివన్ని ఆల్లకు పడ్తయా? ఏం అవుసరం ఆల్లకు? ఎట్లనన్న జేసి పైసలు దేవాలే.. ఆల్ల షేతులల్ల వొయ్యాలే! ఆల్లు మాత్రం ఏం జేస్తరు? బతుకులిట్ల గాలిపాయే.. అనుకుంటూ పెంటయ్య వైపు చూసింది.అర్థమైన పెంటయ్య ఆమెను కిందికి దించాడు. చేతులు నేల మీద పెడితే బలం రావట్లేదు. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగట్లేదు. మెదడులో యాదమ్మ మాటలే.. సూడుండ్రే మీగ్గూడా మొండి షెయ్యే... సూడుండ్రే మీగ్గూడా మొండి...సూడుండ్రే మీగ్గూడా.. సూడుండ్రే... సూడుం... -
మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై ఎస్బీఐ గుడ్‌న్యూస్
ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. సగటు నెలవారీ మొత్తాలను నిర్వహించని సేవింగ్స్ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలకు ఎస్బీఐ భారీగా కోత పెట్టింది. ఈ ఛార్జీల కోత 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందనున్నట్టు తెలిపింది. అంతకముందు మెట్రో, అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ 3వేల రూపాయలు. అదేవిధంగా సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 10 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. దీంతో కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు ఈ మినిమమ్ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదు. తగ్గించిన ఎస్బీఐ ఛార్జీల వివరాలు: తమ కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్బ్యాక్ల అనంతరం ఛార్జీలకు కోత పెట్టినట్టు ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలకే బ్యాంకు తొలుత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎస్బీఐ వద్ద 41 కోట్ల సేవింగ్స్ అకౌంట్లు ఉండగా.. పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్ల పీఎంజేడీవై, బీఎస్‌బీడీ అకౌంట్లు 16 కోట్లు ఉన్నాయి. 21 కంటే తక్కువ వయసున్న అకౌంట్స్ హోల్డర్స్‌కు కూడా మినిమమ్ ఛార్జీల నిబంధనలను బ్యాంకు వర్తింపచేయడం లేదు. -
హాల్ టికెట్లు ఆపొద్దు: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: వివిధ కారణాలు చూపుతూ విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరిస్తుండటంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్పందించింది. ఇటువంటి ఘటనలు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతర్గత పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదనే కారణంగా హాల్ టికెట్లు ఇవ్వటం లేదనీ, ఫీజులు వసూలు చేస్తున్నారనీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యాదులు రావటంతో సీబీఎస్ఈ ఈ మేరకు పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 5వ తేదీ నుంచి పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. -
బస్సుల్లోనూ పెట్స్‌కు అనుమతి
దొడ్డబళ్లాపురం: ఇళ్లల్లో పక్షులను, ప్రాణులను పెంచుకునే వారు పనిమీద వేరే ఊరికి వెళ్లాలంటే పెద్ద చిక్కే. పెట్స్‌ను బస్సుల్లో వదలరమ్మా, రెండురోజులు చూసుకోండి అని ఇరుగుపొరుగుకు బతిమాలుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే కుక్కలు, పిల్లులు, పక్షులు తదితరాలను ఆర్టీసీ బస్సులు, రైళ్లలో అనుమతించరు కాబట్టి వాటిని వెంట తీసుకుపోవడం కుదరదు. ఇకపై కేఎస్ఆర్టీసీ బస్సుల్లో పెంపుడు జంతువులు, పక్షులను తీసుకుని ప్రయాణించడానికి అనుమతి ఇస్తారట. ఒక పెట్‌కి ఒక టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇకపై ఇష్టానుసారంగా లగేజీలు తీసుకువెళ్లడం కూడా కుదరదు. కేఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. పక్షులు, ప్రాణులు బస్సుల్లో వస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉండడంతో పాటు శుభ్రత లోపిస్తుందని వాపోతున్నారు. లగేజీ చార్జీలు పెంపు ఒక వ్యక్తి 30 కేజీలు, పిల్లలయితే 15 కేజీలు లగేజీ మాత్రమే తీసికెళ్లే అవకాశం ఉందట. అంతకుమించి లగేజీ తప్పనిసరయితే కేజీకి రూ.1 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుండి ఈ కొత్త నిబంధనలు, ధరలు వర్తిస్తాయి. -
రైల్వే క్లాక్‌రూమ్, లాకర్ల ఫీజు పెంపు!
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు లగేజీని భద్రపరచుకునే క్లాక్రూములు, లాకర్ల ఫీజులను పెంచేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. ఫీజుల్ని పెంచే అధికారాన్ని డివిజినల్ రైల్వే మేనేజర్ల(డీఆర్ఎం)కు కట్టబెట్టింది. ఈ సేవల ఆధునీకరణకు త్వరలో బిడ్లు ఆహ్వానించనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త విధానంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఫీజుల్ని పెంచే అధికారం డీఆర్ఎంలకు ఉంటుంది. లగేజీని గరిష్టంగా నెలరోజుల పాటు భద్రపరుస్తామని, కొత్త విధానాన్ని తొలుత ‘ఏ’ క్లాస్ రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 24 గంటల పాటు వస్తువుల్ని భద్రపరిచేందుకు క్లాక్ రూమ్‌కు రూ.15, లాకర్‌కు రూ.20 వసూలు చేస్తున్నారు. -
తెర వెనుక హైడ్రామా
సాక్షి, చెన్నై: సినీ నటుడు విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీచేయకుండా అడ్డుకునేందుకు సినిమా స్టైల్లోనే కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు ప్రజల ఓటు చీలడం ఖాయమన్న సంకేతాలతో అధికార పక్ష అన్నాడీఎంకే వర్గం తెర వెనక రాజకీయం సాగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విశాల్ పేరును ప్రతిపాదిస్తూ ఆర్కే నగర్‌కు చెందిన పదిమంది సంతకాలు చేశారు. పరిశీలన సమయంలో వారిలో సుమతి, దీపన్‌ల సంతకాలపై అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తొలుత విశాల్ నామినేషన్ పత్రాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఈలోగా సుమతి, దీపన్లకు వచ్చిన బెదిరింపుల ఆడియో టేపుల్ని విశాల్.. రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో) దృష్టికి తీసుకెళ్లారు. విచారణ ముగియడంతో నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. చివరకు 11 గంటల సమయంలో సుమతి, దీపన్‌ల సంతకాలు బోగస్ అని తేల్చి విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆర్వో వేలుస్వామి అధికారికంగా ప్రకటించారు. ఇతర స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పెద్దగా పట్టించుకోని ఆర్వో ఒక్క విశాల్ నామినేషన్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని చూస్తే, తెర వెనుక ఏమేరకు రాజకీయం సాగిందో స్పష్టమవుతోంది. అడ్డుకోవడం అక్రమం: విశాల్ తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో విశాల్ ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీల దృష్టికి తీసుకెళ్లారు. సినీ వర్గాలు విశాల్‌కు బాసటగా నిలిచాయి. -
సింగిల్ ఛార్జ్.. 1000 కిలోమీటర్లు
ఎటువంటి ఇంధన వనరులతో ప్రమేయం లేకుండా కేవలం విద్యుత్ ఛార్జింగ్‌తో అత్యంత వేగంగా నడిచే కారును టెస్లా సంస్థ రూపొందించింది. ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్ చేస్తే ఆగకుండా 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతమని టెస్లా సంస్థ సీఈఓ ఆలాన్ ముస్క్ తెలిపారు. 1.9 సెకండ్లలో ఈ కార్ 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ కారు అందుకుంటుందని ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇదొక సంచలనాత్మక ఆవిష్కరణ అని టెస్లా సంస్థ పేర్కొంది. సౌతాఫ్రికాకు చెందిన యువ సైంటిస్ట్ దీనిని రూపొందించినట్లు టెస్లా పేర్కొంది. ఈ కారును శుక్రవారం కాలిఫోర్నియాలో ఆటో ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఎలక్ట్రిక్ కార్ ప్రత్యేకతలు ఈ కారుకు నాలుగు ఇండిపెండెంట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ మోటార్లు.. నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తాయి. ఈ కారులో గంటకు 60 మైళ్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఈ కారులో నలుగురు కూర్చుని సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుంది. వెయ్యి కిలోమీటర్ల దూరం వరకూ చార్జింగ్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు. కేవలం రెండు సెకెండ్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని ఈ కార్ అందుకోగలదు. -
జడ్జీల పేరుతో లంచాలు!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల పేరుతో కొందరు లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. నవంబర్ 13న ఇది విచారణకు వస్తుందని పేర్కొంది. కొత్త ప్రవేశాలు చేపట్టకుండా నిషేధం ఎదుర్కొంటున్న ఓ మెడికల్ కాలేజీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా ముడుపులుచేతులు మారుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐర్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఆ కాలేజీ వైద్య ప్రవేశాల కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోందని, కాబట్టి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయనకు స్థానం కల్పించొద్దని న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. ‘ఈ ఆరోపణలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. తాజా పరిస్థితులన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే ఈ విషయంపై విచారణ జరపడానికి సీనియారిటీ ప్రాతిపాదికన తొలి ఐదు స్థానాల్లో ఉన్న జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం’ అని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఉన్నత న్యాయ వ్యవస్థ గౌరవానికి సంబంధించిన ఈ వ్యవహారం విచారణలో భాగంగా సీబీఐ సేకరించిన కీలక పత్రాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని దవే ఆందోళన వ్యక్తం చేశారు. -
తిరుమలలో రూ.లక్షల్లో హోటళ్ల అద్దెలు
సాక్షి, తిరుమల: ఆదాయం పెంచుకునేందుకు తిరుమలలో ఇబ్బడిముబ్బడిగా ఇచ్చిన పెద్ద హోటళ్ల అనుమతులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(టీటీడీ) ఇరుకున పెట్టాయి. ప్రస్తుతం కొండపై 11 పెద్ద హోటళ్లు, 6 జనతా హోటళ్లు ఉన్నాయి. వీటికి ప్రతి మూడేళ్లకోసారి టీటీడీ టెండర్లు నిర్వహిస్తోంది. టెండర్ దక్కించుకున్నవారు ఎర్నింగ్ మనీ డిపాజిట్ రూ.10 లక్షలు, నెలసరి అద్దె మొత్తాన్ని ఆరు నెలలకు కలిపి టీటీడీకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కొన్ని హోటళ్ల నెలసరి అద్దె రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెరిగింది. నెలకు రూ.20 లక్షల అద్దెతో హోటల్ ప్రారంభించిన తర్వాత ఆహార పదార్థాల ముడిసరుకు కొనుగోళ్లు, సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు ఇలా నెలకు రూ.కోటి వరకు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు భక్తులపై భారం వేస్తున్నారు. పెద్ద హోటళ్లలో భోజనానికి రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో పెద్ద హోటళ్ల ధరలు అధికంగా ఉన్నాయని, వాటిని సమీక్షించాలని ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలైంది. కేసు విచారణ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం హైకోర్టుకు హాజరై సమాధానమిచ్చారు. అధిక ధరలకు విక్రయించే హోటళ్లపై ఇప్పటికే రూ.లక్షల్లో జరిమానా వేశామని వివరించారు. -
బ్యాంకింగ్... ' పైసా వసూల్'
సుధాకర్ కాస్త సంప్రదాయ వాది. బ్యాంకింగ్‌లో కావచ్చు... బీమా రంగంలో కావచ్చు... ఆఖరికి టెలిఫోన్ కనెక్షన్ విషయంలో కావచ్చు!! ఎక్కడైనా ప్రభుత్వ రంగాన్నే నమ్ముతాడు. ప్రయివేటు రంగంలో చక్కని ఆఫర్లున్నా సరే... అదంతా మోసమని కస్టమర్లను ఉచ్చులోకి లాగటానికి ఆ వల విసురుతుంటారని అందరితో చెబుతుంటాడు. ఎవరు విన్నా... వినకపోయినా తను మాత్రం ఎక్కువగా ప్రభుత్వ రంగంపైనే ఆధారపడ్డాడు. కాకపోతే ఈ మధ్య బ్యాంకింగ్‌కు సంబంధించి తను పునరాలోచనలో పడ్డాడు. తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలేమో అనుకుంటున్నాడు కూడా!! ఎందుకంటే ఒకటి రెండు విషయాల్లో ప్రయివేటు బ్యాంకులే బెటరనుకునే అనుభవాలు ఎదురయ్యాయి మరి!! సుధాకర్‌కి ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వాడుతున్నాడు. తన మిత్రుడు శ్రీకర్‌కు మాత్రం ఓ అగ్రశ్రేణి ప్రయివేటు బ్యాంకులో ఖాతా ఉంది. కాకపోతే ఇద్దరూ ఈ మధ్య విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. మరి వీసా కోసం దరఖాస్తు చేయాలి కదా? వీసా దరఖాస్తు కోసం 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే నేరుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న స్టేట్మెంట్ కుదరదు. బ్యాంకు సిబ్బంది ప్రింట్ తీసి, దానిపై స్టాంపు వేసి ఇస్తేనే చెల్లుతుంది. దీంతో సుధాకర్, శ్రీకర్ ఇద్దరూ వాళ్ల వాళ్ల బ్యాంకులకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే...! సుధాకర్ తన బ్యాంకు స్టేట్మెంట్ కోసం వెళ్లి అక్కడో ఫారం నింపి ఇచ్చాడు. స్టేట్మెంట్ వచ్చింది. 5 పేజీల స్టేట్మెంట్ను బ్యాంకు సిబ్బంది అప్పటికప్పుడే ఇచ్చేశారు. హమ్మయ్య! అనుకుంటూ బయటికొచ్చాడు సుధాకర్. ఇంతలో తన మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. స్టేట్మెంట్ తీసుకున్నందుకు రూ.600 మినహాయించుకున్నట్లు బ్యాంకు పంపిన మెసేజ్ అది!!. నిజానికి సుధాకర్ ఎప్పుడూ బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోలేదు. అవసరమైనపుడు తన ఇంటర్నెట్ ఖాతా ద్వారా తనే ప్రింట్ తీసుకునేవాడు. అలాంటిది ఒకసారి బ్యాంకుకెళ్లి 5 పేజీల స్టేట్మెంట్ తీసుకున్నందుకు రూ.600 కోతపడేసరికి దిమ్మదిరిగిపోయింది. బ్యాంకుకెళ్లి అడిగితే... అవి రూల్స్ అని, రూల్స్ ప్రకారమే కోత పడిందని చెప్పారు. అంతే!!. మరి శ్రీకర్ పరిస్థితేంటి? శ్రీకర్ తన బ్యాంకుకెళ్లాడు. స్టేట్మెంట్ అడిగాడు. దాదాపు 6 పేజీల స్టేట్మెంట్ను వాళ్లు కూడా ఇచ్చారు. కాకపోతే శ్రీకర్ ఖాతాలోంచి రూపాయి కూడా కట్ కాలేదు. ఎందుకంటే ప్రతి 6 నెలల్లో ఒకసారి ఉచితంగా స్టేట్మెంట్ తీసుకోవచ్చన్నది ఆ బ్యాంకు నిబంధన. అప్పటిదాకా శ్రీకర్ కూడా బ్యాంకు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు కాబట్టి... శ్రీకర్‌కు దాన్ని ఉచితంగా ఇచ్చారు. ఎలాంటి చార్జీలు ఖాతా నుంచి మినహాయించుకోలేదు. మరో సంఘటన చూద్దాం!!. ఓ అప్లికేషన్‌పై ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు అటెస్టేషన్ అవసరమైంది. ఈ విషయంలో కూడా సుధాకర్, శ్రీకర్ ఇద్దరూ వాళ్ల బ్యాంకులకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఆ అప్లికేషన్ తీసుకుని, దానిపై సంతకం చేసి, స్టాంపు వేసి ఇచ్చారు. కాకపోతే దీనికి సుధాకర్ ఖాతా నుంచి రూ.175 కోత పడింది. శ్రీకర్ ఖాతాలో మాత్రం రూ.100 మాత్రమే కోత పడింది. అయినా ఇదేకాదు!! శ్రీకర్ ఈ మెయిల్‌కు తన బ్యాంకు నుంచి ప్రతి మూడు నెలలకోసారి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ వస్తుంటుంది. దానికి శ్రీకర్ నుంచి ఎలాంటి చార్జీలూ వసూలు చేయరు. అంటే ఒకవేళ ఏదైనా దరఖాస్తుకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తే దీన్ని కూడా ఇవ్వవచ్చన్న మాట. కాకపోతే సుధాకర్‌కు మాత్రం ఎలాంటి స్టేట్మెంట్లూ రావు. బ్యాంకుకెళితే చార్జీల బాదుడు తప్పదు. అదీ సంగతి!!. మరిప్పుడు సుధాకర్ ఏం చేయాలి? ప్రభుత్వ రంగంలోని తన బ్యాంకే బెటరనుకోవాలా? లేక ప్రయివేటు బ్యాంకులే బెటరనుకోవాలా? నిజానికిప్పుడు చార్జీల విషయంలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు రెండూ దొందుకు దొందేనని చెప్పాలి. కాకపోతే అటు సేవల విషయంలోను, కొన్ని చార్జీల విషయంలోను మాత్రం ప్రయివేటు బ్యాంకులే మెరుగ్గా ఉన్నాయి. మరి చిన్న చిన్న జీతగాళ్లతో పాటు కోట్ల మంది నమ్ముకున్న ప్రభుత్వ బ్యాంకులు ఇలా ఎడాపెడా చార్జీలు బాదేస్తూ ప్రయివేటు బ్యాంకులతో పోటీ పడుతుంటే ఏం చేయాలి? ప్రయివేటు బ్యాంకులకన్నా తాము రెండాకులు ఎక్కువే చదివామన్నట్లుగా వ్యవహరిస్తుంటే కర్తవ్యమేంటి? బ్యాంక్ మేనేజర్ సంతకానికి రూ.175.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా ఈఎస్ఐ, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లుల క్లయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆయా అధికారులు దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతున్నారు. ఇందుకోసం సంబంధిత బ్రాంచి మేనేజర్ సంతకం, స్టాంప్ ఉండాల్సిందేనంటున్నారు. గత్యంతరం లేక బ్యాంకును సంప్రదిస్తే–ఎస్బీఐలో అటెస్టేషన్ చార్జీలు రూ.175, మిగతా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. హెచ్డీఎఫ్సీ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో దీనికి రూ.100 వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో బదిలీ చేసినా చార్జీలే! కేంద్రం డిజిటల్ చెల్లింపులంటూ ఊదరగొడుతున్నా బ్యాంకులు మాత్రం చార్జీల మోత మోగిస్తున్నాయి. ఆన్లైన్లో నగదు బదిలీకి ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, యూపీఐ తదితర ఆప్షన్లున్నాయి. ఎస్బీఐలో ఎన్ఐఎఫ్టీ చార్జీలు రూ.10 వేల వరకైతే రూ.2.50, లక్షకైతే రూ.5, రూ.2 లక్షల వరకైతే రూ.15, రూ.2 లక్షల పైనైతే రూ.25 కట్టాల్సిందే. ఆర్టీజీఎస్లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకైతే రూ.25, ఆపైన జరిపే ప్రతి లావాదేవీ మీద రూ.50, ఐఎంపీఎస్‌లో అయితే రూ.1,000 వరకు ఉచితం. ఆపైన రూ.10 వేల వరకు ప్రతి లావాదేవీకి రూ.2, రూ.లక్ష వరకైతే రూ.4, రూ.2 లక్షల వరకైతే ప్రతి లావాదేవీ మీద రూ.12 చార్జీలుంటాయి. కనీస నిల్వల్లో ఎవరికి వారే!! కనీస నగదు నిల్వల పరిస్థితైతే దారుణం. కరెంట్ ఖాతాల్లోనే కాదు.. పొదుపు ఖాతాల్లోనూ మినిమం బ్యాలెన్స్ లేకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని బ్యాంకులూ అపరాధ రుసుములు వసూలు చేస్తున్నాయి. మెట్రోల్లో ఎస్బీఐ కనీస నగదు నిల్వ రూ.3 వేలు. లేని పక్షంలో రూ.20–40 వరకు చార్జీలున్నాయి. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో పొదుపు ఖాతాల్లో కనీసం రూ.10 వేలు ఉండాలని, కొన్ని అంతర్జాతీయ బ్యాంకులైతే రూ.లక్ష వరకు ఉండాల్సిందేనని షరతులు విధించాయి. లేకపోతే జీఎస్టీతో కలిపి రూ.500– 700 వరకు చార్జీలున్నాయి. బ్యాంకుకెళ్లి డిపాజిట్ చేసినా మోతే! ఆన్లైన్లోనే కాదండోయ్.. బ్యాంకుకు వెళ్లి నగదును డిపాజిట్ చేసినా చార్జీల మోత తప్పదు. ఎస్బీఐ తొలి 3 డిపాజిట్లు మాత్రమే ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత ప్రతి డిపాజిట్‌కు రూ.50. ప్రైవేట్ బ్యాంకులైతే ఉచిత లావాదేవీలు ముగిశాక ప్రతి లావాదేవీ మీద రూ.150 వసూలు చేస్తున్నాయి. ఏటీఎం నిర్వహణకూ చార్జీలే.. సొంత బ్యాంకు ఏటీఎంలో అయినా ఇతర బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు డ్రా చేస్తే చార్జీలున్నాయి. ఎస్బీఐలో మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంలో అయితే 3 సార్లు, పట్టణాల్లో అయితే 5 సార్లు ఉచితం. ఆ తర్వాత ప్రతి లావాదేవీ మీద సొంత బ్యాంకు ఏటీఎంలో అయితే రూ.10, ఇతర బ్యాంకు ఏటీఎంలో అయితే రూ.20 చార్జీ ఉంటుంది. ఎస్బీఐలో సాధారణ డెబిట్ కార్డు జారీకి ఎలాంటి చార్జీలు లేవు. కానీ, గోల్డ్ డెబిట్ కార్డు జారీకి అయితే రూ.100, ప్లాటినం డెబిట్ కార్డుకైతే రూ.300, చార్జీ విధిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే డెబిట్ కార్డు జారీకి చార్జీ లేదు కానీ, ఏటా కార్డు నిర్వహణకు రూ.120 చార్జీ వసూలు చేస్తుంది. చిరిగిన నోట్లు మారిస్తే.. నోట్లు చిరిగిన లేదా శిథిలావస్థకు చేరిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకూ చార్జీలున్నాయి. ఎస్బీఐలో అయితే నోట్ల విలువ రూ.5 వేలకు మించితే ప్రతి నోటుకు రూ.2 చొప్పున వసూలు చేస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి ఆన్లైన్ ద్వారా బస్సు లేదా రైలు టికెట్లు లేదా కరెంట్ బిల్లు స్థానిక సంస్థల ఫీజులు చెల్లించినా సరే చార్జీలున్నాయి. ఆయా సేవలకు మొత్తం విలువపైన డెబిట్ కార్డుతో అయితే 0.75–1.5 శాతం, క్రెడిట్ కార్డుతో అయితే 1.75–2.5 శాతం వరకు చార్జీలున్నాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించినా సరే రూ. 10తో పాటూ జీఎస్టీ కట్టాల్సిందే. చెక్, డీడీ, స్టేట్‌మెంట్‌కూ మోతే! చెక్ బుక్కు, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), స్టేట్మెంట్ అన్నింటికీ చార్జీలున్నాయి. ఎస్బీఐ ఖాతాదారులు త్రైమాసికంలో లక్ష కంటే తక్కువ బ్యాలెన్స్ నిర్వహణ చేసేవారికి చెక్‌బుక్ తొలి 25 పేజీలు ఉచితం. ఆ తర్వాత 10 చెక్‌లకు రూ.30, 25 చెక్‌లకు రూ.75, 50 చెక్‌లకు రూ.150 చెల్లించాలి. జీఎస్టీ అదనం. ప్రయవేటు బ్యాంకులతో పాటు చాలా ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా కాల పరిమితిని బట్టి ఉచిత స్టేట్మెంట్లు ఇచ్చే సదుపాయం ఉన్నా... స్టేట్ బ్యాంకు మాత్రం దీనికి భారీగానే వసూలు చేస్తోంది. ఎస్బీఐలో రూ.5 వేల డీడీకి రూ.25, రూ.10 వేలకు రూ.50, లక్షకైతే ప్రతి 1,000కి రూ.5 చార్జీ కట్టాల్సిందే. ఎస్ఎంఎస్, మొబైల్ వ్యాలెట్కూ బాదుడే! ఖాతాలో నగదు పడినా, లేదా డ్రా చేసినా వెంటనే మొబైల్‌కు సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) వచ్చేలా పెట్టుకున్నారా! అయితే మీ జేబుకు చిల్లే. ఎస్ఎంఎస్ సేవలకు గాను ప్రతి బ్యాంకు 3 నెలలకొకసారి రూ.15 వసూలు చేస్తున్నాయి. అంతేకాదు నగదు ఒకే సంస్థకు చెందిన ఒక వ్యాలెట్ నుంచి మరొక దానికి బదిలీ చేసినందుకు కొన్ని సంస్థలు ఉచితంగా అందిస్తే, మరికొన్ని రూ.10–20 వరకు చార్జీ చేస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా ఆన్లైన్ బ్యాంకు ద్వారా నగదు రీచార్జి చేసినప్పుడు ఉచితంగా సేవలందిస్తున్నాయి. కానీ, ఆ నగదు అవసరానికి తిరిగి బ్యాంకు ఖాతాలోకి మళ్లించేందుకు నగదు విలువ ప్రకారం రూ.10–100 వసూలు చేస్తున్నాయి. సర్వీసుల్లో పోటీ ఏదీ? చార్జీల విషయంలో ప్రభుత్వ బ్యాంకులు తామేమీ తక్కువ తినలేదన్నట్లు ప్రయివేటు బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. కానీ సేవల్లో మాత్రం... నాసిరకమే!! బ్యాంకుకెళితే సిబ్బంది తీరు ఎలా ఉంటుందన్నది అందరికీ అనుభవమే. ప్రయివేటు బ్యాంకులు ఆటోమేషన్తో సిబ్బందిని నేరుగా కలవాల్సిన అవసరాన్ని తప్పిస్తుండగా... ప్రభుత్వ బ్యాంకులు దీనికింకా ఆమడ దూరంలోనే ఉన్నాయి. పైగా ఎస్బీఐ వంటి అగ్రశ్రేణి బ్యాంకుల్లో చెక్‌బుక్ కోసం రిక్వెస్ట్ పెడితే... 10–12 రోజులు పడుతుందనే సమాచారం రావటంతో పాటు... దాదాపు అంతే సమయం తీసుకుంటున్నారు కూడా!! అదే ప్రయివేటు బ్యాంకులైతే 3–4 రోజుల్లోనే చెక్‌బుక్‌ను పంపిస్తున్నాయి. ఇంటర్నెట్ సేవలు మరీను!! ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దాదాపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలందిస్తున్నా... రెండుమూడు అగ్రశ్రేణి బ్యాంకులు తప్ప మిగతావన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ దిగ్గజ బ్యాంకులు కూడా తరచూ సేవలకు అంతరాయం కలగటం, నెట్‌బ్యాంకింగ్ పనిచేయకపోవటం, ఒకవేళ కస్టమర్ ఎవరైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమస్యల గురించి బ్యాంకు సిబ్బందిని వెళ్లి అడిగితే వారిక్కూడా ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవటం... ఇలాంటి సమస్యలు తక్కువేమీ కాదు. ఉదాహరణకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను యాక్టివేట్ చేసుకున్నవారికి తొలుత చూసే హక్కులు (వ్యూయింగ్ రైట్స్) మాత్రమే వస్తాయి. అంటే వీరు ఖాతాను నెట్లో తెరిచి చూసుకోవటం తప్ప ఎలాంటి లావాదేవీలూ చెయ్యలేరు. ఇంటర్నెట్లోనే యాక్సెస్ స్థాయిని అప్‌గ్రేడ్ చేసుకుంటే... అప్పుడు లావాదేవీలు జరిపే హక్కులొస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రిక్వెస్ట్ పెట్టుకుని నాలుగైదు రోజులైనా అది అప్‌గ్రేడ్ కాదు. బ్యాంకుకెళ్లి అడిగితే వారు నెట్ లాగిన్‌ను చెక్‌చేసి... స్టేటస్ చెప్పటం తప్ప ఏమీ చెయ్యలేరు. కొందరు సిబ్బందికీ దీనిపై అవగాహన తక్కువే. కాకపోతే ఈ విషయంలో ప్రయివేటు బ్యాంకులు ముందంజలోనే ఉన్నాయని చెప్పొచ్చు. వాటి ఇంటర్నెట్ బ్యాంకింగే దాదాపు 90 శాతం అవసరాలను తీర్చేస్తోంది. అదీ కథ. -
ఎస్బీఐ ఖాతా మూసివేత చార్జీల రద్దు
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పొదుపు ఖాతాల మూసివేత చార్జీల విషయంలో నిబంధనలను సడలించింది. దాదాపు ఏడాది పైబడిన పొదుపు ఖాతాలు మూసివేసిన పక్షంలో క్లోజింగ్ చార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జరిమానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కనీస బ్యాలెన్స్ నిబంధనలను సడలించిన ఎస్బీఐ తాజాగా అకౌంటు క్లోజింగ్ చార్జీలూ రద్దు చేయడం గమనార్హం. ఈ నెల నుంచే సడలింపు అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. ఖాతా తెరిచినప్పటికీ కనీస బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయలేక, పెనాల్టీలతో సమస్యలు ఎదుర్కొంటున్న కస్టమర్లకు ఇది వెసులుబాటుగా ఉంటుందని వివరించింది. 14 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్‌లో మూసివేసిన ఖాతాలు మినహాయిస్తే.. ఆ గడువు దాటిన తర్వాత క్లోజ్ చేసే అకౌంట్లపై మాత్రం ఎస్బీఐ రూ. 500 మేర సర్వీస్ ట్యాక్స్ కింద వసూలు చేస్తోంది. కాగా, తాజాగా నిబంధనల సడలింపుతో సదరు ఖాతాదారులు తమ అవసరాలను బట్టి సాధారణ పొదుపు ఖాతాలను బేసిక్ ఖాతాలుగా (బీఎస్బీఏ) మార్చుకోవడానికి వీలవుతుందని ఎస్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. పెనాల్టీలపై విమర్శలు వెల్లువెత్తుటంతో ఎస్బీఐ ఇప్పటికే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనలు సడలించిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ చార్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
సాక్షి, న్యూఢిల్లీ : మినిమం బ్యాలెన్స్‌ను ప్రతి నెలా మెయింటెన్ చేయలేక అవస్థలు పడుతున్న ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, స్మాల్, బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులను మెయింటెన్స్ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో 13 కోట్ల మంది ఖాతాదారులు లాభపడనున్నారు. ఎస్బీఐకు మొత్తం 43 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. నెలవారీ రుసుము బాధ నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి మరో ఆప్షన్ కూడా ఇచ్చింది ఎస్బీఐ. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేని వారు తమ ఖాతాలను బేసిక్స్ సేవింగ్స్ అకౌంట్‌కు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పింది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే.. పేదవారిని ఉద్దేశించి ప్రారంభించనదే ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్. మామూలు సేవింగ్స్ ఖాతాలా బేసిక్ సేవింగ్స్ అకౌంట్ నుంచి నెలకు నాలుగు సార్ల కంటే ఎక్కువగా డబ్బును డ్రా(బ్యాంకులో డ్రా, ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్) చేయకూడదు. ఒక వేళ చేస్తే ఒక్కసారికి రూ.50+ ట్యాక్స్‌లు(ఎస్బీఐలో డ్రా చేస్తే), రూ. 10+ట్యాక్స్(ఎస్బీఐ ఏటీఎంలో డ్రా చేస్తే), రూ.20+ట్యాక్స్(వేరే బ్యాంకుల ఏటీఎంలో డ్రా చేస్తే) రుసుము చెల్లించాల్సివుంటుంది. -
కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంకు
సాక్షి, ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మరో ప్రభుత్వ రంగ బ్యాకు తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా చార్జీల వడ్డన మొదలు పెట్టేసింది. ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఇక మీదట బాదుడు షురూ చేయనుంది. పీఎన్బీ ఏటీఏల విత్‌డ్రాలపై నియంత్రణ విధించింది. ఏటీఎం ద్వారా నెలకు 5 లావాదేవీలు మించితే చార్జీని వసూలు చేయనున్నట్టు ఒక ప్రకటలో తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈసవరించిన నిబంధనలు అమలు కానున్నాయి. సేవింగ్ / కరెంట్/ ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాదారులందరూ నెలకు అయిదు సార్లు పరిమితికి మించితే ఒక్కో లావాదేవీకి రూ.10 వసూలు చేయనున్నట్టు పేర్కొంది. పీఎన్బీ ఏటీఎం లావాదేవీలకుడా ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే, బ్యాలెన్స్ ఎంక్వయిరీ, ఫండ్ బదిలీ లేదా గ్రీన్ పిన్ అభ్యర్థన లాంటి ఇతర నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జ్ ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. తద్వారా ఉచిత లావాదేలకు చరమగీతం పాడి ఖాతాదారులపై భారం పెంచింది. -
ఉప్పుకు కూడా బిల్లు వేస్తున్న రెస్టారెంట్
సాక్షి, హైదరాబాద్: హోటల్లో తినే తిండికి బిల్లు కడతారు, తాగే నీళ్లకు బిల్లు కడతారు, మరి వేసుకొనే ఉప్పుకు బిల్లు ఎప్పుడైనా కట్టారా... ఉప్పుకు బిల్లు ఏంటీ అనుకుంటున్నారా ? అవును భాగ్యనగరంలోని ఓ రెస్టారెంట్లో చిటికెడు ఉప్పుకు బిల్లు వేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఓ సోమాజిగూడలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌కు కుటుంబ సమేతంగా డిన్నర్‌కు వెళ్లాడు. తిన్న తరువాత లైమ్‌సోడా తీసుకున్నాడు. అందులోకి కొంచెం ఉప్పు కావాలని అడిగాడు. వెంటనే ఉప్పు ఇచ్చారు అక్కడి సిబ్బంది. అంతేకాదు చివరగా వచ్చే బిల్లులో ఇచ్చిన చిటికెడు ఉప్పుకు కూడా రూ.1 బిల్లు వేశారు. అయితే రెస్టారెంట్‌పై వచ్చిన ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటన కావలని చేసింది కాదని, సాఫ్ట్‌వేర్‌లో తప్పిదం వల్ల జరిగిందని తెలియచేసింది. తాజాగా బిల్లు ఇచ్చే యంత్రాల్లో కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశామని, దానిని పరిశీలించకుండా క్యాషియర్ బిల్లు జారీ చేశారని వివరణ ఇచ్చారు. ఈ సంఘటన అనంతరం బిల్లుపై వినియోగదారుడుకి లైమ్‌సోడాకు రేటు రూ.150 తగ్గింపు ఇచ్చినా కస్టమర్ దానిని తిరస్కరించాడు. -
రాయలసీమ ఐజీగా షేక్ మహమ్మద్ ఇక్బాల్
– శ్రీధర్‌రావు నుంచి బాధ్యతల స్వీకరణ కర్నూలు : రాయలసీమ ఐజీగా నియమితులైన షేక్ మహమ్మద్ ఇక్బాల్ సోమవారం బి.క్యాంప్‌లోని ఐజీ కార్యాలయంలో ఎన్.శ్రీధర్‌రావు నుంచి బాధ్యతలు చేపట్టారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న ఈయనను సీమ ఐజీగా నియమిస్తూ గత నెల 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈయన స్వగ్రామం జిల్లాలోని కోవెలకుంట్ల. 1987లో పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులు పొందుతూ ఐజీ స్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌లో ఎక్కువ కాలం పనిచేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతో శ్రమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మహమ్మద్ ఇక్బాల్‌ను రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు, స్నేహితులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్‌రావు, కర్నూలు ఎస్పీ గోపీనాథ్‌జట్టి, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు, వైఎస్సార్ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ, ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్ శామ్యూల్ జాన్, కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు, అడిషనల్ ఎస్పీలు షేక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, వెంకటాద్రి, హుసేన్ పీరా, సుప్రజ, ఈశ్వర్‌రెడ్డితో పాటు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల డీఎస్పీలు.. ఐజీకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్‌రావుకు ఘన వీడ్కోలు ఇప్పటివరకు ఐజీగా ఉన్న శ్రీధర్‌రావు విజయవాడలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం పోలీసు అతిథిగృహంలో రాయలసీమ రేంజ్ పోలీసు అధికారులు ఆయనకు పెద్దఎత్తున సన్మానం చేసి.. ఆత్మీయ వీడ్కోలు పలికారు. డీఐజీకి సన్మానం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్‌ను విజయవాడ సంయుక్త కమిషనర్‌గా బదిలీ చేయడంతో ఆదివారం రాత్రి రిలీవ్ అయ్యారు. జిల్లా పోలీసు అధికారులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. రమణకుమార్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా పనిచేసిన గంటా శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పోలీస్‌శాఖలో అవినీతిని సహించను..
పెద్ద జిల్లాకు ఎస్పీగా రావడం ఆనందంగా ఉంది పరిస్థితులను అవగాహన చేసుకుంటూ చర్యలు చేపడతా రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై దృష్టిసారిస్తా జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కాకినాడ క్రైం : పోలీస్‌శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ అవినీతిని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో 79వ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, ఆశ్వీరచనాల నడుమ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే పెద్ద జిల్లాకు ఎస్పీగా రావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నక్సల్స్, అసాంఘిక, నేర కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటానన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పోలీసులతో ప్రజా సంబంధాల మెరుగుకు కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళిక.. నర్సీపట్నంలో ఓఎస్డీగా పనిచేసిన అనుభవంతో జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను జిల్లా పోలీస్ కార్యాలయంలో కలుసుకోవచ్చన్నారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కలెక్టర్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను, అనంతరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తిమ్మాపురంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడులను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఎస్పీ నేపథ్యమిది.. విశాల్ గున్ని సొంత రాష్ట్రం కర్నాటక 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయనను 2013లో ప్రభుత్వం నర్సీపట్నం ఓఎస్డీగా నియమించింది. అనంతరం 2014 ఆగస్టులో విశాఖ రూరల్ ఏఎస్పీగా వెళ్లారు. అక్కడ దాదాపు రెండేళ్లపాటు పనిచేశాక మార్చి 2016 సంవత్సరంలో పదోన్నతిపై నెల్లూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. అక్కడ ఏడాదిన్నర పాటు పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో డయల్ యువర్ ఎస్పీ, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి మన్ననలు పొందారు. మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ని నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ గ్రౌండ్ ఆధునికీకరణకు అధిక నిధులు మంజూరు చేయించారు. యువతను ఆకర్షించేందుకు పలు క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. -
ఇదేమి బాదుడు
– నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు – 0.75 నుంచి 2 శాతం వరకూ వసూళ్లు – ఆర్టీసీ టిక్కెట్లు బుక్ చేసినా బాదుడే – నగదు రహిత లావాదేవీలపై ప్రజల విముఖత – ఏటీఎంలలో నగదు నిల్వలు నిల్ సాక్షి, రాజమహేంద్రవరం: రూ. వెయ్యి, రూ. 500 నోట్ల చెలామణి రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన నగదు రహిత లావాదేవీలపై ప్రస్తుతం విముఖత వ్యక్తమవుతోంది. నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయడమే ఇందుకు కారణం. పెట్రోలు కొనుగోలు మినహా ఇతర అన్ని సేవలు, వస్తు కొనుగోళ్లపై ఆయా డెబిట్, క్రెడిట్ కార్డుల బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. డిసెంబర్లో పెద్ద నోట్లు రద్దు తర్వాత రెండు నెలలపాటు ఏటీఎం విత్‌డ్రాలు, నగదు రహిత సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలు రద్దు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ బ్యాంకులు తరువాత అంతకుముందులాగే సర్వీస్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. లావాదేవీల మొత్తం ఆధారంగా 0.75 శాతం నుంచి 2 శాతం వరకూ సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. ఫలితంగా వినియోగదారులు నగదు రహిత సేవలపై విముఖంగా ఉన్నారు. ఆర్టీసీ టిక్కెట్లు కొన్నా బాదుడే... పెట్రోలు మినహా ఇక ఏ సర్వీస్ పొందినా, ఏ వస్తువు కొనుగోలు చేసి కార్డు ద్వారా నగుదు చెల్లిస్తే మాత్రం సర్వీస్ చార్జీ చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీ రూపంలో కొనుగోలు చేసినా సర్వీస్ చార్జీ బాదుడు సరేసరి. రూ.2000 లోపు నగదు రహిత లావాదేవీలపై 0.75 శాతం ఆపై గరీష్టంగా 2 శాతం సర్వీస్ చార్జీ రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఉదహరణకు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ టిక్కెట్లు రూ.600 అనుకుంటే దానిపై రూ.5 (0.75శాతం) సర్వీస్ చార్జీ అదనంగా తీసుకుంటున్నారు. ఏదైనా రూ.30,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసి నగదు కార్డుల ద్వారా చెల్లించాలంటే రూ. 600 (2 శాతం) సర్వీస్ చార్జీ అవుతుందని ఆయా దుకాణాల క్యాష్ కౌంటర్లో ముందుగానే చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారులు కార్డుల ద్వారా చెల్లించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఏటీఎంల వద్దకు పరిగెడుతున్నారు. ఏటీఎంలలో కనిష్టంగా రూ. 20,00, గరిష్టంగా రూ.40,000 వస్తున్నాయి. ఒకసారి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీ రూ.30లోపు ఉంటోంది. అన్ని బ్యాంకులు తమ కార్డుదారులకు నెలకు ఐదుసార్లు లావాదేవీల వరకు ఎలాంటి సర్వీస్ చార్జీలు వేయడంలేదు. రూ.30,000 మొత్తం నగదు రహితంగా చెల్లిస్తే రూ.600 సర్వీస్ చార్జీ అవుతుంది. అదే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.30 లేదా అసలే చార్జీ ఉండదు. దీంతో ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువుల చెల్లింపులను నగదు రూపంలో ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. ఏటీఎం.. ఎనీ టైం నో మనీ... వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత నగదు కోసం ఏటీఎంల వద్దకు పరిగెడుతున్న ప్రజలకు ఏటీఎంల వద్ద నో క్యాష్, ఆవుట్ ఆఫ్ ఆర్డర్ వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలో ఆయా బ్యాంకులు పెడుతున్న నగదు కొద్ది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో 811 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికారిక లెక్కల ప్రాకారం దాదాపు 60 శాతం ఏటీ ఎంలలో మాత్రమే నగదు నిల్వలు ఉంటున్నాయి. వీటిలో కూడా 24 గంటలూ నగదు ఉండే ఏటీఎంలు 10 శాతం కూడా లేవు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే 24 గంటలు నగదు ఉంటోంది. జిల్లాలో ప్రతి రోజు అన్ని బ్యాంకులు దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరుపుతున్నాయి. ఇందులో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలు దాదాపు 70 శాతంగా ఉన్నాయి. వస్తు,సేవలకు ప్రజలు నగదు రహిత లావాదేవీలు దాదాపు 10 శాతం జరుగుతున్నాయి. సర్వీస్ చార్జీలు లేనప్పుడు 75 శాతం నగదు రహితమే.. పెద్దనోట్ల రద్దు సమయంలో సర్వీస్ చార్జీలు ఎత్తివేసినప్పుడు ప్రతి రోజు మేము చేసే వ్యాపారంలో 75 శాతం కార్డుల ద్వారానే నగదు తీసుకున్నాం. ప్రస్తుతం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తుండడతో వ్యాపారంలో కనీసం 10 శాతం కూడా కార్డుల ద్వారా లావాదేవీలు జరగడం లేదు. రెండు శాతం సర్వీస్ చార్జీలు అని కస్టమర్లకు చెప్పడంతోనే నగదు తెస్తామంటూ ఏటీఎంల వద్దకు వెళుతున్నారు. – రత్నాకర్, శ్రీ కంప్యూటర్ వరల్డ్, రాజమహేంద్రవరం. సేవలకు సర్వీస్ చార్జీలు తప్పనిసరి పెద్దనోట్ల రద్దుకు ముందు నుంచే నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జీలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం రెండు నెలలపాటు కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం యథాతథంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టిక్కెట్లు నగదు రహిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే నామమాత్రపు సర్వీస్ చార్జీలు వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 60 శాతం ఏటీఎంలు పని చేస్తున్నాయి. కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోతున్నాయి. – సుబ్రమణ్యం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, కాకినాడ. -
ఇన్చార్జి ఈఓ గా జగన్నాథరావు నేడు బాధ్యతల స్వీకరణ
అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమితులైన ఈరంకి వేంకట జగన్నాథరావు బాధ్యతల స్వీకరణ ఆదివారానికి వాయిదా పడింది. శనివారమే బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా అష్టమి తిథి మంచిది కాకపోవడంతో ఆయనకు ఈఓ నాగేశ్వరరావు బాధ్యతలు అప్పగించలేదు. కాగా బదిలీ అయిన దేవస్థానం ఈఓలను రెండు మూడు రోజుల వ్యవధిలో రిలీవ్ చేయడం ఇప్పటివరకూ జరిగింది. ఈసారి ఏకంగా ఈ ప్రక్రియకు పది రోజులు సమయం పట్టింది. ఈ నెల ఎనిమిదో తేదీన ఈఓ నాగేశ్వరరావును విజయనగరం జేసీ–2గా బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇక్కడ రిలీవ్ అయి అక్కడ జాయిన్ కావడానికి ఆయన మూడు ముహూర్తాలు పెట్టుకున్నారు. అయినా ఈఓ గా ఎవరినీ నియమించకపోవడంతో ఆ ముహూర్తాలు దాటిపోయాయి. తాజాగా ఇన్చార్జి ఈఓ ను నియమించినా అష్టమి, నవమి కారణంగా బాధ్యతలు అప్పగించడం కుదరలేదు. ఇదంతా దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. -
ఎస్బీఐ బాదుడు షురూ..
♦ ఖాతాల్లో ఎక్కువ డబ్బులుండేవారికి మినహాయింపు ♦ కనీస బ్యాలెన్స్ రూ. 25వేలు దాటితే ఎన్ని లావాదేవీలైనా ఫ్రీ ♦ అంతకన్నా తక్కువుంటే మాత్రం పరిమితులు.. భారీగా చార్జీల వడ్డన ♦ ఆన్లైన్ లావాదేవీలు కూడా నెలకు 40 మాత్రమే ఉచితం ♦ చిరిగిన నోట్లు మార్చాలన్నా డబ్బు కట్టాల్సిందే ♦ పొదుపును ప్రోత్సహించటానికేనంటూ అధికారుల విచిత్ర భాష్యం అమరావతి, సాక్షి బిజినెస్ ప్రతినిధి ఒక వంకేమో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి... వాటి బదులుగా తక్కువ స్థాయిలో నగదు అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఇంతకు ముందు మాదిరిగా ప్రతి లావాదేవీనీ క్యాష్తో చేస్తామంటే కుదరదు. క్యాష్ తక్కువ ఉంటుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. వీలైనంత వరకూ డిజిటల్ లావాదేవీలే జరపండి’’ అనేది ప్రధానితో సహా దాదాపు ప్రతి మంత్రీ, అధికారీ చెప్పిన మాట. జనం కూడా విధిలేక డిజిటల్ బాట పట్టారు. ఇదే అదనుగా పుంఖాను పుంఖాలుగా డిజిటల్ వాలెట్లు పుట్టుకొచ్చాయి. మన డబ్బుకు సరైన భద్రత ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయా వాలెట్ల ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇంతలో మరో పిడుగు పడింది. దేశంలో అత్యధికులు వినియోగించే ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ప్రతి లావాదేవీకీ పరిమితిని విధిస్తూ... డిజిటల్ లావాదేవీలు జరిపేవారిని కూడా నడ్డి విరిచే కార్యక్రమానికి తెరతీసింది. ముఖ్యంగా ఆరు రకాల లావాదేవీలపై ఎస్బీఐ విధించిన పరిమితులు, చార్జీలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పరిమితులను దాటి వినియోగిస్తే లావాదేవీలపై చార్జీలు, సేవా పన్ను రూపంలో ఖాతాదారుడి జేబు గుల్లవటం ఖాయం. దేశీయ అతిపెద్ద బ్యాంకే ఈ విధంగా చార్జీలను అమలు చేస్తుండటంతో ఇదే బాటను అనుసరించడానికి ఇతర బ్యాంకులు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎస్బీఐ చార్జీలపై వచ్చిన స్పందన చూశాక అమలు చేయాలన్నది వీటి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బడాబాబులకు రుణాలిచ్చి వాటిని వసూలు చేసుకోలేక ఎన్పీఏలుగా ప్రకటిస్తున్న బ్యాంకులు... ఆదాయం పెంచుకోవటానికి ఇలాంటి కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నట్లున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఎస్బీఐ చార్జీల వివరాలివీ... ఏటీఎం లావాదేవీలపై.. ఉచిత ఏటీఎం లావాదేవీలను ఇప్పుడు కనీస నిల్వలతో అనుసంధానం చేశారు. ఖాతాలో ప్రతి నెలా నిల్వ ఉన్న సగటు ఆధారంగా ఈ చార్జీలను విధిస్తారు. కనీస నిల్వ రూ.25,000 దాటి ఉంటే లావాదేవీలపై ఎటువంటి పరిమితులూ ఉండవు. సాధారణ సేవింగ్ అకౌంట్స్‌పై మెట్రో నగరాల్లో అయితే ప్రతి నెలా 8 లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5 + ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3) ఉచితం. అదే నాన్ మెట్రో పట్టణాలు అయితే 10 లావాదేవీల (5 ఎస్బీఐ ఏటీఎం, 5 ఇతర బ్యాంకుల ఏటీఎంలు) వరకు ఉచితం. ఈ ఏటీఎం లావాదేవీలు కాకుండా ప్రతి నెలా బ్యాంకు శాఖ నుంచి రెండుసార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో అయితే నెలకు 40 లావాదేవీలు మాత్రమే ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఇవి దాటితే మాత్రం... చార్జీల వడ్డన తప్పదు. సాధారణ బ్యాంకు ఖాతాదారులు ఈ పరిమితులకు లోబడే లావాదేవీలు చేస్తుంటారని, అందుకని తాజా నిబంధనలతో వారికెలాంటి ఇబ్బందీ ఉండదనేది బ్యాంకు అధికారుల మాట. బేసిక్ సేవింగ్ ఖాతాలైతే... గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లావాదేవీలు పెంచడానికి ప్రారంభించిన బేసిక్ సేవింగ్స్ ఖాతాలైతే చార్జీల ప్రభావం కాస్త ఎక్కువే పడుతుంది. బేసిక్ ఖాతా ఉన్న వారు నెలలో నాలుగు సార్లు (ఏటీఎంతో కలిపి) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే నేరుగా బ్యాంకు శాఖ నుంచి తీసుకుంటే రూ. 50 చార్జీ వేస్తారు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి అయితే రూ. 20, ఎస్బీఐ ఏటీఎం నుంచి అయితే రూ. 10 చెల్లించాలి. ఈ రుసుములకు సేవా పన్ను అదనం. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపును ప్రోత్సహించడానికే విత్డ్రాయల్స్పై పరిమితులు విధించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు!!. బడ్డీ వాలెట్ మరింత భారం ఎస్బీఐ ప్రవేశపెట్టిన బడ్డీ వాలెట్‌ను ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకుంటే రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) ద్వారా వాలెట్లో నగదు జమ చేస్తే.. ఆ విలువపై 0.25 శాతం చార్జీ చెల్లించాలి. ఈ చార్జీని కనిష్టంగా రూ.2, గరిష్టంగా రూ.8గా నిర్ణయించారు. అదే విధంగా బీసీల ద్వారా వాలెట్లోని నగదును తీసుకోవాలంటే రూ. 2,000లోపు నగదుకు కనీస చార్జీ 6గా విధించారు. ఆపై మొత్తానికి విలువలో 2.5 శాతం చార్జీ చెల్లించాల్సి వుంటుంది. అంటే రూ.10వేలు తీసుకుంటే రూ.250 చెల్లించాలన్న మాట. ఆన్లైన్ నగదు బదిలీపై... తక్షణం నగదు బదిలీకై వినియోగించే ఐఎంపీఎస్ సేవలపై కూడా ఎస్బీఐ పరిమితులను విధించింది. ఐఎంపీఎస్ విధానంలో పంపించే లక్ష రూపాయల లోపు మొత్తంపై రూ.5 చార్జీ, సేవా పన్ను చెల్లించాల్సి వస్తుంది. రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్ష లోపు లావాదేవీలపై రూ.15, ఆపైన రూ.5 లక్షలలోపు రూ.25 చార్జీ చెల్లించాలి. ఏటీఎం కార్డుల జారీ కొత్తగా జారీ చేసే ఏటీఎం కార్డులపై కూడా చార్జీలను వసూలు చేస్తోంది. కానీ ఖాతాదారులు రూపే క్లాసిక్ కార్డు తీసుకుంటే ఎటువంటి చార్జీలు ఉండవు. అలా..కాకుండా వీసా, మాస్టర్ వంటి ఇతర కార్డులు తీసుకుంటే మాత్రం అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చెక్‌బుక్కుల జారీ.. ఇక నుంచి కొత్త చెక్‌బుక్ తీసుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిందే. 10 కాగితాలు ఉండే చెక్‌బుక్ అయితే రూ.30, అదే 25 కాగితాలుంటే రూ.75, ఇంకా పెద్దది 50 చెక్కులు ఉండే పుస్తకమయితే రూ.150 చెల్లించాలి. ఈ రుసుములకు సేవాపన్ను అదనం. చిరిగిన నోట్లు మారిస్తే... చిరిగిన, చెల్లని పాతనోట్లను మార్చుకోవాలన్నా చార్జీలు కట్టాల్సిందే. కానీ ఇక్కడ ఎస్బీఐ కొన్ని మినహాయింపులను ఇచ్చింది. 20 నోట్లు లేదా విలువ రూ. 5,000 దాటకుండా ఉంటే ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే 20 నోట్లు దాటితే ప్రతీ నోటుపై రూ.2 చార్జీ చెల్లించాలి. అలా కాకుండా విలువ రూ.5,000 దాటితే నోటుకు రూ.2 లేదా ప్రతీ రూ.1,000లకు రూ.5 ఈ రెండింటిలో ఈ మొత్తం అధికమైతే ఆ మొత్తాన్ని చార్జీగా వసూలు చేస్తారు. -
లోయర్ బెర్త్ కావాలంటే... బాదుడే!
న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో సినియర్ సిటిజన్లు, అనారోగ్యంతో ఉన్నవారు, మహిళలు సాధారణంగా కింది బెర్త్ ఎంపికకు ఇష్టపడతారు. ఇలా సౌకర్యవంతంగా ప్రయాణించలనుకున్న రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ గట్టి షాకే ఇవ్వనుంది. లోయర్‌బెర్త్ బుకింగ్‌లపై అదనపు చార్జీల వసూలుకు యోచిస్తోంది. విమానాల్లో విండో సీట్ల కేటాయింపునకు అధిక చార్జీ వసూలు చేసినట్టుగానే రైళ్లలో కూడా లోయర్‌బెర్త్ బుకింగ్‌లపై చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటి బుకింగ్స్‌లో భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో రైల్వే శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రైల్వే రిజర్వేషన్ సందర్భంగా లోయర్ బెర్త్‌లకు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ బాటలోనే పయనిస్తూ ఈ నిర్ణయం తీసుకోనుంది. కింది బెర్త్ బుకింగ్‌లపై రూ .50 పెంచాలని భారత రైల్వే శాఖ సిఫారసు చేసినట్టు సమాచారం. కాగా ప్రస్తుతం భారతీయ రైల్వేస్ వెబ్సైట్ లో టిక్కెట్లను బుకింగ్ సందర్భంగా బెర్త్‌లను ఎంపిక చేసుకునే ఒక ఆప్షన్‌ను ప్రయాణికులకు అందింస్తున్న సంగతి తెలిసిందే. -
భూసేకరణకు మొదటి ప్రాధాన్యం
- ప్రజాపంపిణీని గాడిలో పెడతాం - ఈ ఆఫీసులపై ప్రత్యేక దృష్టి - బాధ్యతలు స్వీకరించిన నూతన జేసీ - మొదటి రోజు అధికారులను పరుగు పెట్టించిన ప్రసన్న వెంకటేష్ - బి.తాండ్రపాడులో చౌకదుకాణం తనిఖీ - ఓర్వకల్లులో విమానాశ్రయం భూముల పరిశీలన - కలెక్టరేట్లో కలియ తిరిగి వివరాల సేకరణ కర్నూలు(అగ్రికల్చర్): భూసేకరణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నూతన జేసీ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ప్రజాపంపిణీని గాడిలో పెడతానని, ఈ– ఆఫీసులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వివరించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పాలనపై దృష్టి పెట్టారు. తనకు ఏఏ వివరాలు కావాలనే దానిపై ఆదేశాలు జారీ చేస్తూనే.. క్షేత్ర స్థాయి తనిఖీలతో అధికారులను పరుగు పెట్టించారు. బాధ్యతల స్వీకరణ.. కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసన్న వెంకటేష్‌ను ఇటీవల ప్రభుత్వం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు బుధవారం ఉదయం 10.20 గంటలకు జేసీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సప్తగిరి నగర్లో మణికంఠ అయ్యాప్ప స్వామి ఆలయానికి వెళ్లి ఆయన పూజలు జరిపారు. బాధ్యతలు స్వీకరించిన జేసీకి డీఆర్ఓ గంగాధర్‌గౌడు, డీఎస్ఓ సుబ్రమణ్యం, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, ఏఎస్ఓ రాజారఘువీర్, కలెక్టర్ కార్యాలయ సూపరిటెండెంట్లు బోకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పిన్న వయస్కుడు.. తమిళనాడులోని కడళూరు జిల్లా తిరుచ్చి గ్రామానికి చెందిన ప్రసన్న వెంకటేష్.. 2012 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు ఎంబీఏలో బ్యాంకింగ్ పైనాన్స్ కోర్సును పూర్తి చేశారు. ఐఏఎస్ పూర్తి అయిన తర్వాత ఏడాది పాటు అసిస్టెంట్ కలెక్టర్‌గా వైఎస్ఆర్ జిల్లాలో శిక్షణ పొందారు. మొదట పాడేరు సబ్ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ లభించింది. తర్వాత సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పనిచేశారు. అక్కడి నుంచి కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా వెళ్లారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జేసీగా వచ్చారు. ఇంతవరకు జేసీలుగా పనిచేసిన వారిలో ఈయన పిన్న వయస్కుడు కావడం విశేషం. ఆదేశాల మీద ఆదేశాలు.. బాధ్యతలు తీసుకున్న తరువాత జేసీ.. పట్టుమని 10 నిముషాలు కూడ ఉండలేదు. ఆ లోపే రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని మీసేవ కేంద్రాలు, సినిమా థియేటర్ల వివరాలు, అన్ని మండలాల తహసీల్దార్ల వివరాలు తక్షణం ఇవ్వాలని ఆదేశించారు. పౌరసరఫరాలకు సంబంధించి ఈ పాస్ మిషన్లతో నడుస్తున్నవి, ఆఫ్‌లైన్‌తో నడుస్తున్నవి, ప్రజా పంపిణీలోని ఇబ్బందుల వివరాలు తక్షణం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్లి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణలకు బొకేలు సమర్పించి మర్యాద పూర్వకంగా కలిశారు. చౌకదుకాణం తనిఖీ బాధ్యతలు తీసుకున్న వెంటనే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని షాపు నెంబరు–2 ను తనిఖీ చేశారు. ఈ–పాస్ మిషన్ ద్వారా రేషన్ పంపిణీలోని ఇబ్బందులు, ఇప్పటివరకు ఎన్ని కార్డులకు సరుకులు పంపిణీ చేశారనే దానిని తెలుసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడారు. సరుకులు సక్రమంగా అందుతున్నాయా.. ప్రజా పంపిణీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరుకులు సక్రమంగా పంపిణీ అవుతున్నాయని గ్రామస్తులు జేసీకి వివరించారు. ఓర్వకల్ విమానాశ్రయం, సోలార్ పార్క్ భూముల పరిశీలన... తాండ్రపాడు నుంచి ఓర్వకల్లు మండలానికి వెళ్లారు. విమానాశ్రయం, సోలార్ పార్క్‌కు కేటాయించిన భూములను పరిశీలించారు. ఓర్వకల్లు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి విమానాశ్రయం, సోలార్ పార్క్‌లకు భూముల సమీకరణను అడిగి తెలుసుకున్నారు. భూముల సమీకరణలో ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మ్యాప్‌లను పరిశీలించారు. ఎంత మంది రైతులకు పరిహారం ఇచ్చారు... ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉందనే వివరాలు ఆరా తీశారు. కలెక్టరేట్ మొత్తం కలియ తిరిగి.. సాయంత్రం కలెక్టరేట్ మొత్తాన్ని కలియ తిరిగారు. ట్రెజరీ, భూమి రికార్డులు, సర్వే కార్యాలయం, పశుసంవర్ధకశాఖ, వ్యవసాయశాఖ, డీఆర్డీఏ, డ్వామా కార్యాలయాలను జేసీ పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలోని సెక్షన్లను పరిశీలించారు. ఆయా శాఖల వివరాలు తెలుసుకున్నారు. అరగంటకు పైగా కలెక్టరేట్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రజా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. -
జిల్లాను ప్రగతి పథంలో నడిపిద్దాం
బాధ్యతలు చేపట్టిన కొత్త కలెక్టర్ - కుటుంబ పెద్దగా వ్యవహరిస్తానని స్పష్టం - సూచనలు, సలహాలు అందజేయాలని పిలుపు - అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉపాధి హామీ పథకం - శాఖల వారీగా అధికారులతో సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నూతన కలెక్టర్‌గా ఎస్.సత్యనారాయణ శనివారం సాయంత్రం 4.41 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. పట్టు వస్త్రం, పూలమాల, పండ్లు సమర్పించారు. బదిలీ అయిన కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ 1997లో పెద్దాపురం ఆర్డీఓగా పనిచేసి జూన్ 22న బదిలీపై వెళ్తూ ప్రస్తుత కలెక్టర్ అయిన ఎస్.సత్యనారాయణకు ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. యాదృశ్చికంగా ఇప్పుడు కూడా సీహెచ్ విజయమోహన్ నుంచే కలెక్టర్‌గా సత్యనారాయణ చార్జి తీసుకోవడం విశేషం. కొత్త కలెక్టర్‌ను బదిలీ అయిన కలెక్టర్ విజయమోహన్ అభినందించారు. బాధ్యతలు తీసుకున్న కలెక్టర్‌ను దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్లు బొకేలు సమర్పించి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ.. చారిత్రక గుర్తింపు పొందిన జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో చేపట్టిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ జిల్లాను మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకొని ప్రాధాన్యత అంశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన ఫాంపాండ్స్ తవ్వకాలతో పాటు సాగునీరు, విద్య, వైద్యం తదితరాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. జిల్లా అభివృద్ధిలో మీడియా కూడా సహకరించాలని కోరారు. తిట్టడం నా స్వభావం కాదు.. కటుంబ పెద్దగా వ్యవహరిస్తా: కలెక్టర్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘‘తిట్టడం నా స్వభావం కాదు.. నేను సుపీరియర్, మీరు సబార్డినేట్స్ అనే భావన ఉండదు. అభివృద్ధి ఒక్కరితో సాద్యం కాదు. అందరం టీమ్‌గా పనిచేసి జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకెళ్దాం.’’ అని కలెక్టర్ పిలుపు నిచ్చారు. నేను కుటుంబ పెద్దగా వ్యవహరిస్తా.. జిల్లా అభివృద్ధిలో ఏవైనా ఐడియాలు, సూచనలు ఉంటే నా దృష్టికి తీసురండి.. వాటిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామని కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉఫాధి హామీ పథకాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా అమలు చేద్దామని, తర్వాత నీటిపారుదల, ఫాంపాండ్స్, రెవెన్యూ, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, విద్య, వైద్యం తదితరాలకు ప్రాధాన్యతనిద్దామని అన్నారు. శాఖల వారీగా గ్యాప్‌లను గుర్తించిన కలెక్టర్ అన్ని శాఖల అధికారులు పరిచయం చేసుకుంటూ తామ శాఖల్లోని ప్రాధాన్యత అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లోని గ్యాప్‌లను గుర్తించారు. గ్యాప్‌లు లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్లో గ్యాప్‌లు ఉన్నాయని వీటిని సరిచేసుకోవాలని వివరించారు. ఎన్ఆర్ఇజీఎస్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఎన్నో స్థానంలో ఉందని పీడీని ప్రశ్నించారు. ప్రస్తుతం 6వ స్థానంలో ఉందని పీడీ తెలుపగా మొదటి స్థానానికి తీసుకరావడానికి కృషి చేయాలని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, అంగన్వాడీ కేంద్రాలు తదితరాలకు ఉన్న భూసేకరణ సమస్యలను సత్వరం పరిష్కరిస్తామన్నారు. రూ.500, 1000 నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాలో ఉన్న నగదు కొరత, పింఛన్ల పంపిణీ తదితరాలను సమీక్షించారు. ఉద్యాన ప్రగతిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, ఓబులేసు, రాంసుందర్‌రెడ్డి, డిప్యూటి కల్టెకర్లు తిప్పేనాయక్, మల్లికార్జున ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేడు కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎస్.సత్యనారాయణ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఈయనను ప్రభుత్వం జిల్లాకు కలెక్టర్‌గా నియమించింది. 1985లో కర్నూలు సిల్వర్‌జుబ్లీ కళాశాలలో డిగ్రీ చదివిన ఆయన ఇదే జిల్లాకు కలెక్టర్‌గా రావడం విశేషం. జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త కలెక్టర్‌కు స్వాగతం, బదిలీ అయిన కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వీడ్కోలు కార్యక్రమాన్ని సాయంత్రం 5గంటలకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. -
ప్రగతికి పాటుపడతా
కొత్త కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు శ్రమిస్తానని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా 145వ కలెక్టర్‌గా గురువారం ఉదయం 11.45 గంటలకు తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా జిల్లాలోని పరిస్థితులను అవగాహన చేసుకుంటానన్నారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతానన్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు సత్వర ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడతానన్నారు. ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. శాఖల మధ్య సమన్వయం, అధికారుల జవాబుదారీతనంతో సమర్థవంతమైన పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న సహజ వనరులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తోడ్పాటునందిస్తానన్నారు. భౌగోళికంగా రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరికి కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాసేవకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, సమాచారశాఖ డీడీ ఫ్రాన్సిస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇరిగేష¯ŒS ఎస్ఈ రాంబాబు, ఎక్సైజ్ శాఖ డీసీ అరుణారావు, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, జెడ్పీ సీఈవో కె.పద్మ, వైద్య ఆరోగ్యశాఖ డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిశోర్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, డీసీవో ప్రవీణ, సీపీవో మోహ¯ŒSరావు, విద్య, రెవెన్యూ అసోసియేష¯ŒS సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఇదీ కలెక్టర్ కార్తికేయ మిశ్రా నేపథ్యం... జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బిట్స్ పిలానీలో కంప్యూటర్ సై¯Œ్సలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. 2009 సంవత్సరంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్, విశాఖ సబ్ కలెక్టర్‌గా పని చేశారు. రాష్ట్ర విభజనలో తొలుత తెలంగాణాకు కేటాయించగా ఈయన కోరికపై ఏపీకి వచ్చారు. మిశ్రా ఎ¯ŒSపీడీసీఎల్‌కు సీఎండీగా, ట్రా¯Œ్సకో జీఎండీగా పని చేశారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై తూర్పు గోదావరి జిల్లాకు 145 వ కలెక్టర్‌గా వచ్చారు. -
22న బాధ్యతలు స్వీకరించనున్న కొత్త కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నూతన కలెక్టర్‌గా సత్యనారాయణ ఈ నెల 22న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను కర్నూలు కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
యాంగర్‌కి చెక్
మహాభాగ్యం క్షణం తీరికలేని షెడ్యూల్, మల్టీటాస్కింగ్ తెచ్చే ఒత్తిడి సహజంగానే కోపాన్ని తెప్పిస్తుంటుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కెరీర్లో, ఆత్మీయులతో అపార్థాలు వస్తుంటాయి. అనర్థాలు జరుగుతుంటాయి. మరి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? మాట్లాడే ముందు ఆలోచించండి: కోపానికి ట్విన్ సిస్టిర్ ఆవేశం. కోపం రాగానే ఆవేశమూ యాక్ట్ చేస్తుంది. అందుకే కోపం ఉన్నప్పుడు ఆవేశంగా స్పందించకుండా ఆలోచనకు పనిచెప్పండి. నెమ్మదించాకే మాట్లాండి: ఆలోచన విచక్షణనిస్తుంది. దాంతో ఆవేశం పక్కకు తప్పుకుంటుంది. అప్పుడు చెప్పదల్చుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పండి. కోపానికి కారణాన్నీ తెలపండి. వ్యాయామం: ఒత్తిడిని తగ్గించే చక్కని ఆయుధం వ్యాయామం. ఒత్తిడి తగ్గితే కోపమూ కంట్రోల్ అవుతుంది. టైమ్ అవుట్: చేస్తున్న పనిలోంచి బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం. ఈ బ్రేక్ మీలో ఒత్తిడిని దూరం చేసి కోపానికి గురికాకుండా చూస్తుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పరిష్కారం చూడండి: కోపానికి దారితీసిన విషయం మీద దృష్టిపెట్టండి. అప్పుడు కోపం తగ్గి పరిష్కారం పట్టుపడుతుంది. క్షమించడమే.. కోపం తెప్పించిన మనుషులను క్షమించేస్తే ఆ అగ్నిలో దహించిపోయే దుస్థితి ఉండదు. హాస్యాన్ని ఆస్వాదించండి: కోపం వచ్చినప్పుడు హాస్యాన్ని ఆశ్రయించండి. బోలెండత సాంత్వననిస్తుంది. రిలాక్సేషన్ స్కిల్స్: దీర్ఘశ్వాసను తీసుకోండి. శ్రావ్యమైన సంగీతం వినండి. పజిల్స్ నింపండి. కోపానికి కారణాలను కాగితం మీద రాసుకోండి. టేకిట్ ఈజీని మంత్రాన్ని జపించండి. -
‘పుష్కర’ కేసులో ఛార్జిషీట్ వేసేదెన్నడు?
తొక్కిసలాటపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తికాని విచారణ కొనసాగుతోందంటూ కమిషన్‌కు వివరణ ఛార్జిషీట్ వేస్తే కారణాలు, బాధ్యులు ఎవరో తెలిసే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోంది. 2015 జూన్ 14న పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అదే రోజు ఉదయం సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరఘాట్‌లో పూజలు, పుణ్యస్నానాలు ఆచరించారు. అ సమయంలో గంటన్నరపాటు లోపలికి వచ్చే భక్తులు బయటకు వెళ్లకుండా ఉన్న ఒక్కగేటు మూసివేశారు. గేటు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసటాల చోటుచేసుకుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 28 మంది మరణించగా 51 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో స్థానిక పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 ప్రకారం 2015లో కేసు నంబర్ 268/2015 నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా విచారణ ఓ కొలిక్కి రాలేదు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు ఏక సభ్యకమిషన్ కు చెబుతున్నారు. మొదట దర్యాప్తునకు ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్‌ను నియమించారు. కొన్ని రోజులు తర్వాత బదిలీపై అబింకా ప్రసాద్ వెళ్లిపోయారు. ఆయన తర్వాత కేసును ప్రస్తుతం అమలాపురం డీఎస్పీగా పనిచేస్తున్న అంకయ్యకు అప్పగించారు. అయితే నేటికీ కేసు విచారణ దశలోనే ఉండడం గమనార్హం. పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ పూర్తి చేసి చార్జిషీటు వేస్తే కమిషన్ విచారణకు ఉపయోగకరంగా ఉండేది. అయితే ముందు నుంచి కమిషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్న అన్ని ప్రభుత్వ విభాగాలులాగే పోలీసు శాఖ కూడా ఈ కేసుపై నాన్చివేత ధోరణి అవలబింస్తోంది. సీసీటీవీల ఫుటేజీలు లేవని చెప్పడం, రికార్డు కాలేదని, లైవ్ కోసమే వాటిని ఏర్పాటు చేశామని చెప్పడంతో యంత్రాంగం నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించిందో స్పష్టమవుతోంది. చనిపోయిన 28 మందికి పంచనామాలు, పోస్టుమార్టం నివేదికలు కమిషన్‌కు ఇస్తే కమిషన్ విచారణకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా చనిపోయిన, గాయపడ్డవారిని అక్కడ నుంచి ఎంత సమయానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు? ఆలస్యమైతే దానికి బాధ్యులు ఎవరు? అన్న విషయాలు దర్యాప్తులో తేలే అవకాశం ఉండేది. కానీ విచారణ పూర్తి చేయడానికి పోలీసుశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విషయం మంగళవారం జరిగిన కమిషన్ విచారణలో తేటత్లెమవుతోంది. కనీసం ఫలానా సమయానికి విచారణ పూర్తవుతుందని కూడా పోలీసు అధికారులు చెప్పకపోవడం గమనార్హం. కేసుపై పోలీసుల నిర్లక్ష్యం.. తొక్కిసలాటపై పోలీసులు పెట్టిన కేసు ఇప్పటికీ పూర్తికాకపోవడం విడ్డూరం. గాయపడిన వారి ధ్రువపత్రాలు వచ్చిన తర్వాత చార్జిషీటు వేస్తామని గత విచారణ సందర్భంగా పోలీసులు చెప్పారు. ఆ పత్రాలను కమిషన్‌కు కూడా సమర్పించారు. కానీ వారి విచారణ పూర్తి చేసి చార్జిషీటు మాత్రం వేయకపోవడం కేసుపై వారి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. – ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది, బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుడు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు -
బాదుడు షురూ..
• కొత్త చార్జీలను అమల్లోకి తెచ్చిన బ్యాంకులు • కనీస నగదు నిల్వ లేకపోయినా, పరిధి దాటిన నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలపై జరిమానాలు • జనరల్ ఖాతాదారులపై తీవ్ర భారం • బ్యాంకుల తీరుపై మండిపడుతున్న ఖాతాదారులు • చార్జీలను ఎత్తివేయాలని డిమాండ్ ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఖాతాదారులపై చార్జీల బాదుడు ప్రారంభమైంది. ఇదివరకే ఎస్బీఐ ప్రతి సేవకు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి అమలు కూడా చేసింది. మిగతా బ్యాంకులు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే చార్జీలను అమలు చేస్తున్నాయి. దీంతో విషయం తెలియని ఖాతాదారులు అకౌంట్లలో కనీస నిల్వలు ఉంచక, అలాగే నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలు పరిమితికి మించి చేస్తూ చాలామంది చార్జీల బాదుడికి గురవుతున్నారు. చెక్‌బుక్ కావాలన్నా, నెలలోమూడుసార్లకు మించి నగదు జమచేసినా, సొంత ఏటీఎంలో ఐదుసార్లకు మించి డబ్బులు విత్‌డ్రా చేసినా, అకౌంట్ మూసివేయాలనుకున్నా, పరిమితికి మించి లాకర్లను తెరిచినా.. ఇలా ప్రతి సేవలపై ఖాతాదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల చార్జీల అమలు తీరుపై జిల్లాలో ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్జీలను ఎత్తివేసి, పరిమితులను తొలగించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు 252 బ్రాంచ్‌లున్నాయి. ఆయా బ్రాంచిల్లో సురభి, బేసిక్ సేవింగ్స్, జన్‌ధన్ యోజన ఖాతాలు కాకుండా జనరల్ (వ్యక్తిగతం, సాలరీ, వ్యాపారం, తదితర) ఖాతాలు 20లక్షల వరకు ఉన్నాయి. చార్జీలు జనరల్ ఖాతాలకు మాత్రమే అమలు చేస్తున్నాయి. అయితే ఈ చార్జీల అమలు గతంలో కూడా ఉండేవని, దీనిని మళ్లీ అమలు చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. చార్జీలు ఒకే విధంగా కాకుండా వివిధ బ్యాంకులు స్వల్ప తేడాతో అమలు చేస్తున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా చార్జీల అమలుతో బ్యాంకుల్లో ఖాతాదారులు నగదు జమలు చాలావరకు తగ్గించారు. చార్జీల బాదుడు ఇలా.. • సేవింగ్స్ ఖాతాదారులు నెలలో మూడుసార్లు మాత్రమే సొంత బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతి డిపాజిట్‌కు రూ.50 చార్జీ చెల్లించాలి. • రూ.10,000 నెలవారీ సగటు నిల్వ ఉండే సాధారణ కరెంట్ ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతి రూ.1000పై 75 పైసల చార్జీ ఉంటుంది. ఈ చార్జీ కూడా కనీసం రూ.50 తక్కువ కాకుండా వసూలు చేస్తారు. • నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆపై ప్రతి లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. • లాకర్లను సంవత్సరంలో 12 సార్లు మాత్రమే ఉచితంగా తెరవవచ్చు. ఆపై ప్రతిసారి రూ.100 చెల్లించాలి. • కరెంటు ఖాతాదారులకు ఏడాదిలో 50 చెక్కులే ఉచితం. ఆపై ప్రతి చెక్‌లీఫ్‌పై రూ.3 చార్జీ ఉంటుంది. • ఖాతా ప్రారంభం ఉచితంగా కాదు. రూ.20 చెల్లించాలి. • అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఖాతాదారులు తమ ఖాతాల్లో రూ.3000 కనీస నగదు నిల్వ ఉంచాలి, లేదంటే రూ.50పైగా జరిమానా పడుతుంది. • సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.40 వరకు జరిమానా ఉంటుంది. • గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో రూ.1000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.30 వరకు జరిమానా తప్పదు. -
ఎస్బీఐ బాదుడు షురూ
⇒ అమల్లోకి వచ్చిన కొత్త చార్జీలు ⇒ కనీస నగదు నిల్వల్లేకపోతే జరిమానా ⇒ నగదు జమలు, ఏటీఎం, లాకర్ల సేవలన్నింటిపై చార్జీలే న్యూఢిల్లీ: మీరు ఎస్బీఐ ఖాతాదారులా...? అయితే, మీరు కొత్త శకంలోకి అడుగుపెట్టారు. ఖాతాలో ఉంచాల్సిన కనీస నగదు నిల్వ మొత్తం పెంచేశారు. ఇది తెలుసుకోకపోతే జరిమానాల బాదుడుకు గురి కావాల్సి ఉంటుంది. చెక్ బుక్కులు కావాలంటే చార్జీలు... నెలలో మూడు సార్లకు మించి బ్యాంకు శాఖకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తే చార్జీలు... ఏటీఎంలో ఐదు లావాదేవీలు దాటితే చార్జీలు... వార్షికంగా లాకర్ల చార్జీలు పెంపు ఇలా వరుసబెట్టి అవకాశం ఉన్న చోటల్లా ఖాతాదారుల ముక్కుపిండి చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సిద్ధమైపోయింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన చార్జీలు, మార్చిన నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ఎస్బీఐలో కొత్తగా విలీనమైపోయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, భారతీయ మహిళా బ్యాంకు కస్టమర్లు సైతం ఈ చార్జీల భారాన్ని ఎత్తుకోక తప్పదు. ఈ విలీçన బ్యాంకుల ఖాతాదారులకు మాత్రం ఈ ఛార్జీలు ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. ఎస్బీఐ బాటలోనే మిగిలిన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా నడిచే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే ఖాతాదారులు లబోదిబోమనాల్సిందే. ఇతర చార్జీల మోత ఇలా... ⇔ సేవింగ్స్ ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించుకోవాలి. ⇔ రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతీ రూ.1,000పై 75 పైసల చార్జీ ఉంటుంది. ఈ చార్జీ కూడా కనీసం రూ.50 తక్కువ కాకుండా వసూలు చేస్తారు. ⇔ నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. ఇతర బ్యాంకు ఏటీఎంల్లో మూడుకు మించితే ప్రతీ లావాదేవీపై రూ.20 చొప్పున వడ్డన ఉంటుంది. ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.25 వేలు ఉంచితే సొంత బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలపై చార్జీలు పడవు. అదేవిధంగా రూ.లక్ష బ్యాలన్స్ నిర్వహిస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంల్లోనూ లావాదేవీలు ఉచితం. ⇔ లాకర్ అద్దె కూడా పెరిగిపోయింది. అలాగే, ఏడాదిలో 12 సార్లు మాత్రమే ఉచితంగా లాకర్లను తెరిచేందుకు అనుమతి. ఆపై ప్రతిసారీ రూ.100 చెల్లించుకోవాల్సిందే. ⇔ కరెంటు ఖాతాదారులకు ఏడాదిలో 50 చెక్కులే ఉచితం, ఆపై ప్రతీ చెక్‌లీఫ్‌పై రూ.3 చార్జీ ఉంటుంది. ⇔ ఖాతా ప్రారంభం ఉచితం కాదు. రూ.20 చెల్లించుకోవాలి. ఇక మహా బ్యాంకుగా ప్రస్థానం: అరుంధతి వచ్చే నెల ఆఖరు నాటికి అనుబంధ బ్యాంకుల డేటా అనుసంధానం పూర్తి కాగలదని ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఎస్‌బీహెచ్‌తో పాటు అనుబంధ బ్యాంకుల విలీనంతో మెగా బ్యాంకుగా అవతరించిన ఎస్బీఐ భారీ బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయం వివరించారు. ‘మిగతా అనుబంధ బ్యాంకులన్నింటి విలీనం తర్వాత ఒకే పెద్ద బ్యాంకు’గా ఎస్బీఐ కార్యకలాపాలు ప్రారంభించింది. మరిన్ని కొత్త ఉత్పత్తులు, సర్వీసులు ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆడిట్ పూర్తయ్యాక.. ఏప్రిల్ 24 తర్వాత నుంచి ప్రతీ వారాంతం ఒక్కో బ్యాంక్ డేటాను ఎస్బీఐతో అనుసంధానించడం జరుగుతుంది. మే 27 నాటికి డేటా అనుసంధానం పూర్తి కావొచ్చు‘ అని అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఉత్పాదకత, నిర్వహణ సామర్ధ్యం మెరుగుపర్చుకోవడానికి, భౌగోళికమైన రిస్కులను సమర్ధంగా అధిగమించడానికి, కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడానికి విలీనం తోడ్పడగలదని ఆమె వివరించారు. అనుబంధ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ)కు సంబంధించి అదనంగా రూ. 8,600 కోట్ల కేటాయింపులు జరిపినట్లు ఆమె చెప్పారు. ఎన్పీఏలు ప్రతికూల స్థాయిలో భారీగా పెరగకపోవచ్చని తెలిపారు. షేర్ల మార్పిడి ప్రక్రియ కూడా పూర్తయినట్లు వివరించారు. ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, భారతీయ మహిళా బ్యాంక్ ఎస్బీఐలో విలీనం అయిన సంగతి తెలిసిందే. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల్లో చోటు దక్కించుకుంది. బ్యాంక్ అసెట్స్ విలువ ప్రస్తుతం రూ. 37,00,000 కోట్లుగా ఉంటుంది. సుమారు రూ. 26 లక్షల కోట్ల పైగా డిపాజిట్లు, రూ. 18.5 లక్షల కోట్ల మేర అడ్వాన్స్‌లు (ఇచ్చిన రుణాలు) ఉంటాయి. విలీన బ్యాంకుకు మొత్తం 24,013 శాఖలు.. 58,000 పైచిలుకు ఏటీఎంలు, 36 దేశాల్లో 191 శాఖలు ఉంటాయి. 2,800 మందికి వీఆర్ఎస్.. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకానికి అర్హులైన ఉద్యోగులు 12,000 మంది పైగా ఉన్నప్పటికీ.. 2,800 మంది మాత్రమే ఇందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అరుంధతి భట్టాచార్య తెలిపారు. ఏప్రిల్ 5 దాకా ఈ స్కీము అమల్లో ఉంటుందని ఆమె వివరించారు. నిబంధనల ప్రకారం.. 20 ఏళ్ల సర్వీసు ఉండి, 55 ఏళ్ల వయస్సు గల వారు వీఆర్ఎస్ తీసుకునేందుకు అర్హులు. విలీనంతో ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్య 2,70,011కి పెరిగింది. ఇందులో 69,191 మంది ఉద్యోగులు అనుబంధ బ్యాంకులకు చెందినవారు. తగ్గిన ఎస్బీఐ బేస్ రేటు 0.15 శాతం కట్.. ఇకపై 9.10 శాతం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేటుకు సంబంధించి బేస్ రేటును 0.15 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 9.25 శాతం నుంచి 9.10 శాతానికి దిగి వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని వర్తింపచేస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మరోవైపు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) కూడా 15 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇది 14 శాతం నుంచి 13.85 శాతానికి చేరింది. ఎంసీఎల్ఆర్ మాత్రం యథాతథంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఈ వారంలో పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. బేస్ రేటు ప్రాతిపదికన గృహ, వాహన రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు నెలవారీ కట్టే ఈఎంఐల భారం కనీసం 0.15% మేర తగ్గనుంది. 2016 ఏప్రిల్ 1కి ముందు రుణాలు తీసుకున్న వారికి బేస్ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత రుణాలు తీసుకున్న వారికి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)వర్తిస్తుంది. ప్రస్తుతం ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ రేటు 8%గా, మూడేళ్ల వ్యవధికి 8.15%గానూ ఉంది. వీటిలో ఎలాంటి మార్పులు లేవు. -
పెట్రో మంటకు ప్రత్యామ్నాయం
ఎకో టిప్స్ పెట్రోల్, డీజిల్ ఛార్జీలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో కార్లు, స్కూటర్లు ఉన్న వారు పెరిగిన భారాన్ని తగ్గించుకోవాలంటే మీ వాహనాల మైలేజీని పెంచుకోవలసిందే. అందుకు ఈ సూత్రాలను కచ్చితంగా పాటించవలసిందే. ► టైర్లలో గాలి సరిగా ఉండేలా సరిచూసుకోండి. ఎయిర్ ప్రెషర్ ఎక్కువైనా, తక్కువైనా మైలేజీలో తేడా వస్తుంది. ►దుమ్ముపట్టేసిన ఎయిర్ ఫిల్టర్స్ మార్చండి. లేకపోతే కనీసం 10 శాతం మైలేజీ తగ్గిపోవచ్చు. ►స్పీడ్ లిమిట్ పాటించాలి. గంటకు 60 కిలోమీటర్లు మించి స్పీడ్ వెళితే ఫ్యూయల్ సామర్థ్యం తగ్గుతుంది. ►సడన్ బ్రేక్స్, యాక్సిలరేటర్ హఠాత్తుగా పెంచడం వల్ల ఇంధనసామర్థ్యం 33 శాతం తగ్గుతుంది. ►రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించడం వల్ల వాహనం మైలేజ్ 4 శాతం పెరుగుతుంది. ఇంధనం వాడకాన్ని తగ్గించడానికి ఇంకా మార్గాలున్నాయి. కాని అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం వాహనాలను సాధ్యమైనంత తక్కువ వాడటమే. -
10 సెకన్లకు రూ.6 లక్షలు!
⇒ ఐపీఎల్లో సోనీ ప్రకటనల చార్జ్ ఇది ⇒ 14 కంపెనీలతో స్పాన్సర్షిప్ ఒప్పందం ⇒ తెలుగు, బెంగాళీ, తమిళంలో కామెంటరీ ⇒ సోనీ స్పోర్ట్స్ హెడ్ ప్రసన్న కృష్ణన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐపీఎల్ ప్రసార సమయంలో ప్రదర్శించే ప్రకటనలకు 10 సెకన్లకు గాను రూ.6 లక్షలు చార్జీ నిర్ణయించినట్లు సోనీ పిక్చర్స్ నెట్వరŠక్స్ ఇండియా (ఎస్పీఎన్) తెలియజేసింది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న వివో ఐపీఎల్–10 సీజన్ ప్రసార హక్కులను ఎస్పీఎన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గురువారమిక్కడ 10 సాల్ ఆప్ కే నామ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ స్పోర్ట్స్ ఈవీపీ, బిజినెస్ హెడ్ ప్రసన్న కృష్ణన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. స్థానికంగా క్రికెట్ ప్రియులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో తెలుగు, తమిళం, బెంగాళీ భాషల్లో కామెంటరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. వేణుగోపాలరావు, వెంకటపతి రాజు, చంద్రశేఖర్ పీ, సుధీర్ మహావాడీ, కల్యాణ్ కృష్ణ, సీ వెంకటేష్‌లు తెలుగు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారని తెలియజేశారు. గతేడాది 9వ సీజన్లో 36.1 కోట్ల మంది వీక్షకులను సంపాదించుకున్నామని... ఈ ఏడాది 40 కోట్లకు చేరుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘గతేడాదితో పోలిస్తే ప్రకటనల చార్జీలను 10 శాతం పెంచాం. ఐపీఎల్ 9లో 11 మంది స్పాన్సర్స్ రాగా.. ఇప్పుడా సంఖ్య 14కు చేరింది. మరో ఒకటో రెండో సంస్థలు స్పాన్సరర్లుగా చేరే అవకాశముంది. ప్రస్తుతానికైతే అమెజాన్, వివో, వొడాఫోన్, పాలీ క్యాబ్, యమహా, విమల్ పాన్ మసాలా, మేక్‌మై ట్రిప్, పార్లే, వోల్టాస్, ఎస్ బ్యాంక్ వంటివి స్పాన్సర్ ఒప్పందం చేసుకున్నాం’’ అని వివరించారు. -
ఏసీ బస్సు.. గిరాకీ తుస్సు!
►ఏసీ బస్సులకు ఆదరణ అంతంతే.. ►సగటు ఆక్యూపెన్సీ 38–40 మాత్రమే ►నష్టాల్లో నడుస్తున్న పుష్పక్ ►మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులదీ అదే పరిస్థితి సిటీబ్యూరో: ఎండలు మండుతున్నా ఏసీ బస్సులు మాత్రం ప్రయాణికుల ఆదరణకు నోచుకోవడం లేదు. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ఏసీ బస్సులు, ఎయిర్‌పోర్టుకు తిరిగే పుష్పక్ బస్సుల్లో సైతం ఆక్యూపెన్సీ అంతంత మాత్రంగానే ఉంది. సాధారణంగా వేసవిలో ప్రయాణికులు మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల నుంచి ఏసీ బస్సుల వైపు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆదరణ కనిపించడం లేదు. అన్ని బస్సుల్లోనూ సగటు ఆక్యూపెన్సీ శాతం 38–40 వరకే నమోదవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సులు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు సైతం అదే బాటలో నడుస్తున్నాయి. ఈ బస్సులను ప్రవేశపెట్టినప్పటి నుంచీ వరుస నష్టాలే చవిచూస్తున్నాయి. మరోవైపు వేసవి అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల రద్దీ, అభిరుచి మేరకు బస్సుల నిర్వహణలో తగిన మార్పులు చేర్పులు చేయకపోవడం లాంటి అంశాలు నిరాదరణకు కారణమవుతున్నాయి. ప్రారంభం నుంచీ నష్టాలే.. అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సులపై మొదటి నుంచి నష్టాలే వస్తున్నాయి. వీటి నిర్వహణకు కిలోమీటర్‌కు రూ.68 చొప్పున ఖర్చు చేస్తున్నారు. కానీ ఆదాయం మాత్రం రూ.44.62 – రూ. రూ.52 మధ్య మాత్రమే ఉంది. గతంలో దారుణమైన నష్టాలను చవిచూసిన ఎయిరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి ఎలాంటి పాఠాలు నేర్వకుండానే ప్రవేశపెట్టిన 36 పుష్పక్ బస్సులు ఆర్టీసీ పాలిట గుదిబండగా మారాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ బస్సులు కూడా పెద్దగా ఆదరణ పొందడం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని సదుపాయాలతో రూపొందించిన ఈ బస్సులు సాఫ్ట్వేర్ వర్గాలను సైతం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎలాంటి లాభనష్టాలు లేకుండా ఈ బస్సులను నడపాలంటే కిలోమీటర్‌కు కనీసం రూ.64 లభించాలి. కానీ ప్రస్తుతం వీటిపైనా రూ.43 కంటే ఎక్కువ రావడం లేదు. నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే దిల్సుఖ్నగర్ – పటాన్చెరు, ఈసీఐఎల్ – వేవ్‌రాక్, ఉప్పల్ – వేవ్‌రాక్, కోఠి – పటాన్చెరు తదితర మార్గాల్లో ఈ బస్సులు నడుస్తున్నాయి. ప్రణాళిక లోపం... నగరంలో ఏసీ బస్సులకు ఆదరణ లభించకపోవడంతో కొన్నింటిని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి యాదాద్రి వరకు నడుపుతున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో ఈ బస్సులు తిరుగుతున్నాయి. కానీ ఈ మార్గంలోనూ ప్రయాణికులు ఎక్కువగా జిల్లా బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఏసీ బస్సుల్లో చార్జీలు చాలా ఎక్కువగా ఉండడం వల్లే ప్రయాణికులు వాటిలో ప్రయాణించేందుకు వెనకడుగు వేస్తున్నారు. కనిష్టంగా రూ.15 నుంచి గరిష్టంగా రూ.120 వరకు చార్జీలున్నాయి. ఇవి ఆర్డినరీ, మెట్రో బస్సుల చార్జీలతో పోల్చుకుంటే రెట్టింపు కన్నా ఎక్కువ. కొన్ని సాఫ్ట్వేర్ జోన్లలో తప్ప సాధారణ ప్రయాణికులు మాత్రం పెద్దగా వీటి జోలికి వెళ్లడం లేదు. మరోవైపు వేసవి రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందించుకొని బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ప్రణాళిక లోపంతోనే ఏళ్లు గడిచినా ఈ బస్సులు నష్టాల్లో నడుస్తున్నాయి. -
చార్జీలపై వెనక్కి తగ్గిన పేటీఎం
-
చార్జీలపై వెనక్కి తగ్గిన పేటీఎం
క్రెడిట్ కార్డులతో టాప్ అప్‌లపై 2% చార్జీల ఉపసంహరణ న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల ద్వారా మొబైల్ వాలెట్ టాప్ అప్‌లపై 2 శాతం చార్జీల విధింపుపై పేటీఎం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో చార్జీలు ఉపసంహరిస్తున్నట్లు వెల్లడిం చింది. తాము ఇలాంటి విషయాల్లో అత్యంత వేగంగా స్పందిస్తామని, కేవలం ఇరవై నాలుగ్గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని సవరించుకున్నామని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2016లో మ్యాగీ నూడుల్స్ విషయంలో నెస్లే ఇండియా సోషల్ మీడియాలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తలెత్తితే ఏ విధంగా బైటపడతారన్న ప్రశ్నపై స్పందిస్తూ ఆయన ఈ విషయాలు వివరించారు. భారతీయులు చెప్పుడు మాటలకు ఇట్టే పడిపోతారని, దీంతో ఇక్కడ ఏ వ్యాపారాన్నైనా నిర్మించడం కంపెనీలకు చాలా కష్టమైన వ్యవహారమని శర్మ చెప్పారు. టెక్నాలజీపై పట్టుగల కొందరు.. చాలా తెలివిగా క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘కేవలం తెలివైన వారే క్రెడిట్ కార్డు నుంచి డబ్బును బ్యాంకులో వేసుకుని అత్యంత తక్కువగా 0.1% వడ్డీ మీద తిప్పగలరు. ఇక ట్వీటర్ అనేది చాలా అద్భుతమైన మాధ్యమం. మన అభిప్రాయమే జనాల అందరి అభిప్రాయం అన్న భావన కలిగింపజేస్తుంది‘ అంటూ వ్యాఖ్యానించారు. క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన టాప్ అప్ మొత్తాలను తమ నెట్‌వర్క్‌లో కొనుగోళ్లకు ఉపయోగించకుండా.. కొందరు యూజర్లు తమ బ్యాంకు ఖాతాలకు మళ్లించుకుంటుండటాన్ని గమనించిన పేటీఎం.. ఈ తరహా టాప్ అప్‌లపై చార్జీలు విధించిన సంగతి తెలిసిందే. -
క్రెడిట్ కార్డ్ రీచార్జ్‌లపై పేటీఎం వాత
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం చార్జీల బాదుడుకు తెరతీసింది. క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్ రీఛార్జింగ్ కోసం చేసే లావాదేవీలపై వాత పెట్టేందుకు నిర్ణయంచింది. వీటిపై 2శాతం ఫీజును వసూలు చేస్తోంది. దీనిపై పేటీఎం తన అధికారిక బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. వాలెట్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. క్రెడిట్ కార్డులు ఉపయోగించి వాలెట్ రీఛార్జ్ , బ్యాంకులకు డబ్బు తిరిగి బదిలీలలో చోటు చేసుకుంటున్న అక్రమాలని ఆపడానికి ఈ చార్జీలను విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం మార్చి 8 నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే షాపింగ్, బిల్లుల చెల్లింపులకు ఈ ఫీజు పెంపు వర్తించదని స్పష్టం చేసింది. కేవలం రీచార్జ్‌లపై మాత్రమే 2 శాతం చార్జీ వసూలు చేయనున్నట్టు తెలిపింది. అయితే డెబిట్ కార్డు చెల్లింపులు, నెట్‌బ్యాంకింగ్‌పై ఎలాంటి రుసుముం ఉండదని బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్ టాప్ ఆప్ లపై అదే మొత్తంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తునట్టు పేర్కొంది. ఇ-కామర్స్, ఇతర ఆన్లైన్ వాణిజ్య సంస్థలకు యూజర్ల డిజిటల్ చెల్లింపుల కోసం కార్డ్ నెట్ వర్క్ సంస్థలకు లేదా బ్యాంకులకు తము అధిక ఫీజులు చెల్లిస్తున్నామని కంపెనీ సీఈవో విజయ్‌శేఖర్ శర్మ తెలిపారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ద్వారా యూజర్లు కేవలం వాలెట్ లో మనీ యాడింగ్ చేసుకుంటూ పోతే తమకు వచ్చే లాభమేమీ ఉండదనీ, ఇలాంటి సేవల వల్ల తాము నష్టపోతున్నామన్నారు. కాగా గతంలో మొబైల్ రీచార్జ్‌లు, కరెంట్ బిల్లు చెల్లింపులు, బస్ టికెట్లు వంటి వాటికే పరిమితమైన డీమానిటైజేషన్ నేపథ్యంలో మొబైల్ వాలెట్ చెల్లింపులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. -
2వ పటాలం కమాండెంట్‌గా శామ్యూల్ జాన్
- విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి కర్నూలు : ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం కమాండెంట్ విజయ్‌కుమార్ స్థానంలో సీహెచ్ శామ్యూల్‌జాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గుంటూరుకు చెందిన ఈయన 1982లో ఆర్ఎస్ఐ హోదాలో ఏపీఎస్పీ విభాగంలో చేరారు. వరంగల్, కాకినాడ, మంగళగిరి బెటాలియన్లలో పని చేశారు. 1988లో ఆర్ఐగా, 2004లో అసిస్టెంట్ కమాండెంట్‌గా, 2011లో అడిషనల్ కమాండెంట్‌గా పదోన్నతి పొందారు. కర్నూలు రెండవ పటాలంలో విధులు నిర్వహిస్తూ 2013లో పదోన్నతిపై 11వ బెటాలియన్ కడప జిల్లాకు కమాండెంట్‌గా బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లపాటు విధులు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీన కర్నూలు రెండవ పటాలం కమాండెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఐజీగా విజయ్‌కుమార్ : ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్‌గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్స్ మూడవ రేంజ్ (కర్నూలు, కడప, అనంతపురం) డీఐజీగా ఉన్న ప్రసాద్‌బాబు డిసెంబర్లో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో విజయ్‌కుమార్ నియమితులయ్యారు. 2013 నుంచి ఈయన కర్నూలు ఏపీఎస్పీ రెండవ కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విజయ్‌కుమార్ ఈ నెల 18వ తేదీన మూడవ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేయండి
- ప్రజాభిప్రాయ సేకరణలో నేతలు, ప్రజా సంఘాలు, వినియోగదారులు – ఆమోదయోగ్యకరమైన నిర్ణయం ఉంటుంది - ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ జి.భవానీ ప్రసాద్ కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ చార్జీలు పెంచితే అన్ని వర్గాల ప్రజలపై దాని ప్రభావం ఉంటుందని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు, వినియోగదారులు స్పష్టం చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచేందుకు దక్షిణ మధ్య విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర నివేదికలపై గురువారం స్థానిక విద్యుత్ భవన్లో ఏపీ ఈఆర్సీ బృందం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడేళ్లగా జిల్లాలో కరువు తాండవం చేస్తోందని, అలాంటప్పుడు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయడం అన్యాయమన్నారు. కరువు జిల్లా కావడంతో విద్యుత్‌ను ప్రత్యేక రాయితీతో సరఫరా చేయాలని కోరారు. వినియోగదారుల అభ్యంతరాలు విన్న డిస్కం సీఎండీ హెచ్‌వై దొర చార్జీల పెంచేందుకు గల కారణాలను వివరించారు. సమస్యలను పరిష్కరిస్తామని, సేవలను మెరుగుపరుస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఈఆర్సీ సభ్యులు పి.రామమోహన్, డాక్టర్ పి. రఘు, కమిషన్ సెక్రటరీ ఎ. శ్రీనివాస్, డిస్కం డైరెక్టర్లు సయ్యద్ బిలాల్ బాషా, పి.పుల్లారెడ్డి, కర్నూలు జోన్ సీఈ పీరయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల ఎస్ఈలు పాల్గొన్నారు. బాబుకు విదేశీ కంపెనీలే అక్కర: సత్యం గౌడు, ఏపీ గ్రానైట్స్, చిన్న తరహా పరిశ్రమల అసోసియేషన్ చైర్మన్ రాజధానిలో ఏ పని చేపట్టాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విదేశీ కంపెనీలే గుర్తుకొస్తున్నాయి. మన పరిశ్రమల బాగోలు పట్టడం లేదు. నష్టాల కారణంగా సగానికి పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ పరిస్థితుల్లో చార్జీలు పెంచితే ఉన్నవి కూడా మూసేసుకోవాల్సి వస్తుంది. రాయితీపై విద్యుత్ ఇవ్వాలి: ఇ.పుల్లారెడ్డి, సీసీఎం మాజీ కార్పొరేటర్ వెనకబడిన సీమలోని జిల్లా అయిన కర్నూలుకు రాయితీతో విద్యుత్‌ను సరఫరా చేయాలి. ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.2వేల కోట్లు, బడాబాబుల బకాయిలు రూ.వెయ్యి కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని వసూలు చేస్తే సంస్థ నష్టాలు తగ్గుతాయి. కనెక్షన్ కోసం నాలుగేళ్లు నిరీక్షించిన రైతులు చివరకు మరణించినా కనెక్షన్ ఇవ్వలేదు. మామూళ్లతో వేధిస్తున్నారు: వి.భరత్ కుమార్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు విద్యుత్ కనెక్షన్లతోపాటు వివిధ రకాల పనుల కోసం వచ్చే రైతులను అధికారులు, సిబ్బంది మామూళ్ల కోసం వేధిస్తున్నారు. నెలల పాటు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కరెంటు సౌకర్యం అందక రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారు. ఇక ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనెక్షన్లు తొలగిస్తున్నారు. అందరిపై భారం పడుతుంది: ఎంఏ హఫీజ్ ఖాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త విద్యుత్ చార్జీల ప్రభావం అందరిపై పడుతుంది. వర్షాలు లేక రైతులకు పంట చేతికి రావడం లేదు. అలాంటప్పుడు చార్జీలు పెంచితే బిల్లులు ఎలా చెల్లిస్తారు. వీరి చేతిలో డబ్బులేని పక్షంలో పట్టణాలకు వచ్చి లావాదేవీలు కొనసాగించలేదు. వ్యాపారాలు లేక వ్యాపారులు బిల్లులు చెల్లించలేరు. ఒక వేళ చెల్లించాల్సి వస్తే రైతులకు అమ్మే వస్తువుల ధర పెంచాల్సి వస్తుంది. చిన్న పరిశ్రమలు మూత పడతాయి: ఆర్.రఘురామన్, బలహార్ కెమికల్స్ చైర్మన్ చిన్న పరిశ్రమలు అసలే నష్టాల్లో నడుస్తున్నాయి. ఇప్పటికే అనేక పరిశ్రలు వ్యాపారాలు లేక, వివిధ నష్టాల కారణంగా మూత పడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ యూనిట్ ధర రూ.8వరకు పడుతోంది. మరింత చార్జీలు పెంచితే ఎలా. ప్రస్తుతం పరిశ్రమలు నడుపుకోకపోయినా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. -
జియో తాజా ప్రకటన వారికి ఉపశమనం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తాజా ప్రకటనపై సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) హర్షం వ్యక్తం చేసింది. రిలయన్స్ జియో ఉచిత సేవలకు గుడ్ బై చెప్పి టారిఫ్ వార్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై సంస్థ పాజిటివ్‌గా స్పందించింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 , 2017 నుంచి అమలు కానున్న టారిఫ్‌లను ప్రకటించడంతో టెలికాం ఇండస్ట్రీకి ఊరట లభించినట్టు పేర్కొంది. ఉచిత సేవలస్థానంలో సేవలకు ధరలను ప్రతిపాదించడం పరిశ్రమకు గుడ్ న్యూస్ అని వ్యాఖ్యానించింది ఉచిత సేవలకు టాటా చెపుతూ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించడంపై టెలికాం సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉన్నప్పటికీ , పరిశ్రమ పరిశీలకుడిగా, జియో ప్రకటనతో పరిశ్రమ ఉపశమనంగా ఉంటుందని చెప్పగలననికాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పీటీఐకి తెలిపారు. ఇప్పటికైనా చార్జీల వసూళ్లను ప్రారంభించడం తనకు సంతోషం కలిగించిందన్నారు. జియో మంగళవారం ప్రకటించిన రూ.99, రూ.303 ప్లాన్స్ మంచివే అన్నారు. యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ రూ.180 నుంచి రూ.300గా నిలవనుందని తెలిపారు. కాగా ముంబైలో నేడు ప్రెస్ మీట్ నిర్వహించిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తన టెలికాం వెంచర్ జియో కేవలం 170 రోజుల్లో 100 మిలియన్ చందాదారులు మైలురాయిని ప్రకటించారు. జియో ఎంట్రీతో యూజర్లను డిజిటల్‌గా, బ్యూటిఫుల్ మార్చేసామన్నారు. దీంతోపాటు ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రాంను మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 1, 2017 నుంచి అమలయ్యే కొత్త టారిఫ్‌లను వెల్లడించారు. రూ 99 , రూ 303 నెలకు రుసుముగా వన్ టైం పేమెంట్ ద్వారా జియో మార్చి 31, 2017 తరువాత కూడా తన ప్రస్తుత చందాదారులు మరియు కొత్త వినియోగదారులు, మరో సంవత్సరం దాని 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' అపరిమిత ప్రయోజనాలు కొనసాగుతాయని ప్రకటించారు. మార్చి 31, 2018 వరకు ఉచిత కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాలాపై స్పష్టత ఏదీ?
• నాలా చార్జీలను ఎత్తేస్తున్నాం: 2014లో సీఎం వెల్లడి • కానీ, వాస్తవ రూపం దాల్చని హామీ; చార్జీ తగ్గింపు తోనే సరి • 2006 కంటే ముందున్న వాటికి నో నాలా: హై కోర్టు తీర్పు • భేఖాతరంటోన్న హెచ్ఎండీఏ; పన్ను కడితేనే ప్లాన్ అంటూ ఒత్తిడి ఎవరి వాదన వారిదే.. బోడుప్పల్లో ఓ ఇంటి యజమాని తన 200 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరణ కోసం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది 20 ఏళ్ల క్రితమే నివాస లే–అవుట్‌గా రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఇప్పుడు హెచ్ఎండీఏ ఏమంటోందంటే.. ఈ లే–అవుట్ హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి.. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం 3 శాతం నాలా పన్ను కట్టాల్సిందేనని మరి, యజమాని ఏమంటున్నారంటే.. 2006లో నాలా చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే అంతకుముందున్న లే–అవుట్లకు ఈ చట్టం వర్తించదు. ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే అప్పటి మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రస్తుతమున్న ధర ప్రకారం నాలా పన్నును చెల్లించమనడం సరైంది కాదు. గతంలో కె. సత్యానంద పట్నాయక్ పిటిషన్లోనూ హెకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని సాక్షి, హైదరాబాద్: ఈ వాదన అతనొక్కడిదే కాదు.. 2006 కంటే ముందున్న లే–అవుట్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరిదీనూ! వాస్తవానికి 2014లో జరిగిన ఓ ప్రాపర్టీ షోలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ‘నాలా పన్నును ఎత్తేస్తున్నామని’ ప్రకటించారు. కానీ, అది నేటికీ వాస్తవరూపం దాల్చలేదు. 9 శాతంగా ఉన్న నాలా పన్నును కాస్త 3 శాతానికి తగ్గిస్తూ జీవో విడుదల చేశారు. దక్కిందే పుణ్యమని ఇక్కడికే సరిపెట్టుకున్నారు భాగ్యనగర డెవలపర్లు. అయితే ఇప్పుడొచ్చిన చిక్కేంటంటే.. 2006 కంటే ముందున్న లే–అవుట్లను క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే నాలా పన్నును చెల్లించాల్సిందేనని హెచ్ఎండీఏ వాదిస్తోందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అంటోంది. పైగా వాయిదాల రూపంలో కాకుండా ఒకేసారి చెల్లించాలని అప్పుడే ప్లాన్ విడుదల చేస్తామంటూ డెవలపర్లను వేధిస్తున్నారని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక నిర్మాణ సంస్థలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. గతంలోనూ నిర్మాణ సంస్థల వాదనలు విన్న న్యాయస్థానం నిరభ్యంతర ధృవీకరణ పత్రం విషయంలో నాలా చార్జీలను చెల్లింపుల గురించి ఒత్తిడి తేకూడదని వెల్లడించింది. అయినప్పటికీ హెచ్ఎండీఏ మొండి వైఖరి అవలంబిస్తోందంటూ నిర్మాణ రంగం వాపోతోంది. 2006 కంటే ముందుంటే.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ (నాలా)ను తీసుకొచ్చింది. మార్కెట్ విలువలో 10 శాతం పన్నును చెల్లించాలని నిర్ణయించింది. అయితే నిర్మాణ సంస్థల కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ పన్నును హెచ్ఎండీఏ పరిధిలో 9 శాతానికి, జీహెచ్ఎంసీ పరిధిలో 5 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఆ పన్నును కాస్త హెచ్ఎండీఏ పరిధిలో 3 శాతానికి, జీహెచ్ఎంసీ పరిధిలో 2 శాతానికి తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే 2006 కంటే ముందున్న లే–అవుట్లకు మాత్రం ఈ చట్టం వర్తించదు. ⇔ 8330/పీ8/పాలసీ/హెచ్/2009 ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో డెవలప్మెంట్ చార్జీలను వాయిదా పద్ధతుల్లో చెల్లించే వీలుంది కూడా. హెచ్ఎండీఏ చట్టం 2008లోని 46(5) ప్రకారం డెవలప్మెంట్, క్యాపిటలైజేషన్ చార్జీలను 10 శాతం వడ్డీతో వాయిదా పద్ధతిలో చెల్లించే వీలు కల్పించారు అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ ప్రదీప్ చంద్ర. అంటే రూ.15– 75 లక్షల వరకు 4 సమాన వాయిదాల్లో, రూ.75 లక్షల కంటే అధిక మొత్తమైతే 8 వాయిదాల్లో 24 నెలల్లో చెల్లించవచ్చన్నమాట. డెవలపర్లను ప్రోత్సహించడం మానేసి.. నాలా పన్నును సాకుగా చూపుతూ ప్రాజెక్ట్‌ల అనుమతుల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని, అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు నగరం, పట్టణాల్లోని వ్యవసాయ భూమిని నాన్–అగ్రికల్చరల్ ల్యాండ్‌కు మార్పు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో పంచాయతీ పరిధిలోనూ దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు బడా ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. ఫీజుల రూపంలో ప్రభుత్వానికీ ఆదాయం దండిగా వస్తోంది. కానీ, మన రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్లో ఉన్న భూమికి సైతం నాలా పన్నును కట్టాల్సిందేనని ఒత్తిడి తీసుకురావటం అనైతికం. అది కూడా ప్రస్తుతమున్న మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సిందేనంటూ బలవంతం చేస్తున్నారని డెవలపర్లు వాపోతున్నారు. రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే సామర్థ్యమున్న నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం మానేసి.. నీరుగార్చేలా చేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ పనితీరుపై సీఎంకు వినతిప్రతం ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు. – జే వెంకట్ రెడ్డి టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ -
ఎన్నికల దూషణలు
వానాకాలం వస్తే కప్పల బెకబెకలు వినిపించినట్టు ఎన్నికలొచ్చాయంటే చాలు నేతల దుర్భాషలు, ఆరోపణలు హోరెత్తుతాయి. రాయడానికి, తిరిగి చెప్పడానికి వీల్లేని స్థాయిలో ప్రత్యర్ధి పక్షాలపై నోరు పారేసుకుంటారు. ఈ క్రమంలో అణగారిన కులాలనూ, మైనారిటీలనూ, మహిళలనూ కించపరిచేలా మాట్లాడతారు. ఇది కేవలం పురుష నేతల్లో ఉన్న పైత్యం మాత్రమే అనుకుంటే పొరపాటు. కొందరు మహిళా నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈసారి బీజేపీ నేత వినయ్ కతియార్ కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఎన్నికల జాతర మొదలైందని అందరికీ గుర్తుచేశారు. యూపీలో ప్రియాంక కాంగ్రెస్‌కు ఓట్లు రాబట్టగలరనుకుంటున్నారా అని అడిగితే...ఆమెను మించిన అందగత్తెలు తమ పార్టీలో ఉన్నారని జవాబిచ్చారు. అలా అనడం ద్వారా తమ పార్టీ మహిళా నేతలను కూడా కించపరుస్తున్నానని ఆయన మరిచారు. అంతేకాదు, ఆమె అందగత్తె... కాబట్టే ప్రజల్ని ఆకర్షించడానికి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కన్న కూతురి గౌరవం కంటే ఓటు గౌరవమే ఎక్కువని జనతాదళ్ (యు) నాయకుడు శరద్ యాదవ్ లెక్కలేసి అందరినీ నివ్వెరపరిచారు. ఆడపిల్లల విషయంలో ఆయనకు ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నదో ఆ వ్యాఖ్య తేటతెల్లం చేసింది. వీటిపై మహిళా సంఘాల నుంచి, ఇతర పార్టీలనుంచి ఎన్ని విమర్శలొచ్చినా కతియార్, శరద్‌యాదవ్‌లకు తమ తప్పేమిటో తెలియలేదు. ఈసారి నేతల ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని కూడా తాకాయి. పంజాబ్‌లో చాలాచోట్ల ఓటింగ్ యంత్రాలు సరిగా పనిచేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అంతేకాదు...ఎన్నికల సంఘం కుమ్మక్కవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. అది నిస్సిగ్గుగా, వెన్నెముక లేకుండా తయారైందన్నారు. సీబీఐ, ఆర్బీఐ తరహాలో ఎన్నికల సంఘం కూడా ప్రధాని మోదీ ముందు మోకరిల్లిందని ఆరోపించారు. అందుకు సంబంధించి నిర్దిష్టమైన సాక్ష్యాలను వెల్లడించి ఉంటే వేరుగా ఉండేది. కానీ ఆయన ఆ పని చేయలేదు. అంతక్రితం మాటేమోగానీ టీఎన్ శేషన్ 1990లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వచ్చాక ఆ సంస్థ పనితీరు గణనీయంగా మారింది. అది నిర్భీతితో వ్యవహరించడం మొదలుపెట్టింది. తటస్థమైన సంస్థగా చెప్పుకోదగ్గ గుర్తింపు పొందింది. పెత్తందారీ నేతలు గూండాల సాయంతో పోలింగ్ కేంద్రాలు ఆక్రమించుకోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం, దళితులను, ఇతర బలహీన వర్గాల పౌరులను ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించడం వంటి ఉదంతాలు చాలా వరకూ తగ్గాయి. ఎన్నికల హింస కూడా అదుపులోకి వచ్చింది. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలొచ్చిన ఉన్నతాధికారులను విధులనుంచి తప్పించడంతోసహా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు నిజమని తేలితే రీపోలింగ్ నిర్వహించడం, బాధ్యులపై చర్యకు సిఫార్సు చేయడం కనబడుతుంది. నేతలు ఎంతటివారైనా హెచ్చరించడం, అదుపు చేయడానికి ప్రయత్నించడం కూడా చూస్తుంటాం. అయితే ఈ చర్యలు ఏమూలకూ సరిపోవడం లేదన్నది వాస్తవం. బాహాటంగా బయటపడినవాటిపై ఏదో మేరకు చర్యలుంటున్నా లోపాయికారీగా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోట్లాది రూపాయలు వెదజల్లడమన్నది ఆగలేదు. భారీ ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడం, మీడియాలో వాణిజ్య ప్రకటనలు తగ్గలేదు. అయినా ఎన్నికల వ్యయం చెప్పాల్సివచ్చేసరికి ప్రతి పార్టీ పరిమితులకు లోబడే ఖర్చు చేశామని చెబుతుంది. అభ్యర్థులు సైతం దొంగ లెక్కలు అందజేస్తారు. ఒకరిద్దరు నాయకులు నోరు జారిన సందర్భాలున్నా వారిపై ఎన్నికల సంఘం ఏ చర్యా తీసుకోదు. డబ్బు ప్రభావాన్ని తగ్గించడం కోసం సంఘం చర్యలు తీసుకుంటున్నకొద్దీ అవినీతి నాయకులు, గూండాయిజానికి పాల్పడేవారు కొత్త కొత్త మార్గాలు వెదుకుతున్నారు. నిరుడు తమిళనాట ఎన్నికల సమయంలో కోయంబత్తూరులో మూడు ట్రక్కులతో రూ. 570 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు పట్టుబడిన సంగతి అందరికీ తెలుసు. ఆ డబ్బు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు వెళ్తున్నదని తొలుత వెల్లడైనా అది మాదేనని రిజర్వ్‌బ్యాంక్ అంగీకరించడం మినహా అందుకు సంబంధించి ఇతర వివరాలేవీ వెల్లడికాలేదు. అధికారులు చెప్పిన సంజాయిషీలపై మరిన్ని అనుమానాలు తలెత్తాయి. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి, అవి మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తరచు సూచనలు చేస్తుంటుంది. వాటిపై కేంద్ర ప్రభుత్వంగానీ, వివిధ పార్టీలుగానీ తగినంతగా దృష్టి పెడుతున్నట్టు కనబడదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది మొదలుకొని ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ మాత్రమే ఆ సంఘం ఒకటున్నదన్న సంగతి అందరికీ తెలుస్తుంది. ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేవరకూ మళ్లీ దాని జాడ కనబడదు. ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు, దొంగ హామీలు ఇచ్చే పార్టీలపై చర్య తీసుకునే అధికారం దానికి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. నేతల నోటి దురద, విచ్చలవిడి ధన ప్రవాహం, నేరగాళ్ల ఆగడాలు నియంత్రించనప్పుడు ఎన్నికల వ్యవస్థపైనా, దాని పవిత్రతపైనా పౌరుల్లో గురి కుదురుతుందా? ఈమధ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా... ఓటేయనివారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా తప్పుబట్టే హక్కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తర్కంలోని ఉచితానుచితాల సంగతలా ఉంచి పరిస్థితులిలా ఉంటే ఎవరికైనా ఎన్నికల వ్యవస్థలో నమ్మకం కలుగుతుందా? ఓటేయడం తమ హక్కే కాక, బాధ్యత కూడానని...తమ ఓటు వల్ల మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయని పౌరులకు అనిపించేలా పరిస్థితులున్నప్పుడే అందరూ ఆ యజ్ఞంలో పాలుపంచుకుంటారు. తమ మాటల ద్వారా, చేతల ద్వారా ఎన్నికలను ప్రహసనప్రాయం చేస్తున్న నాయకులపై చర్యలు తీసుకున్నప్పుడే... ఆ ధోరణులను సంపూర్ణంగా నియంత్రించినప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడు ఎవరూ ఎన్నికలకు దూరంగా ఉండరు. -
స్వైపింగ్ బాదుడు.. చార్జీల కుమ్ముడు
ఏలూరు (మెట్రో)/తణుకు : నగదు రహిత లావాదేవీలు జరపాలని ప్రభుత్వం, అధికారులు ఊదరగొడుతుండటంతో తాడేపల్లిగూడెంకు చెందిన యోహాన్ అనే యువకుడు కరెంటు బిల్లు చెల్లించేందుకు డెబిట్ కార్డు తీసుకెళ్లాడు. ఆ కార్డు సాయంతో మీ సేవ కేంద్రంలో కరెంటు బిల్లు నిమిత్తం రూ.460 చెల్లించాడు. సర్వీస్ చార్జీల రూపంలో రూ.5, డెబిట్ కార్డు వినియోగించినందుకు ట్యాక్స్ రూపంలో రూ.5 అతడి ఖాతా నుంచి ఎగిరిపోయాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన అరవింద్‌కుమార్ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఏడుసార్లు ఏటీఎం కార్డును ఉపయోగించి నగదు డ్రా చేశాడు. తీసుకున్న సొమ్ము పోగా తన పొదుపు ఖాతాలో ఉండాల్సిన నిల్వ మొత్తంలో రూ.200 తగ్గాయి. బ్యాంక్‌కు వెళ్లి ఇదేమిటని అడిగితే.. ఏటీఎం కార్డును ఐదు పర్యాయలకంటే ఎక్కువసార్లు వినియోగిస్తే చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. తణుకు పట్టణానికి చెందిన పి.పోసిబాబు మోటార్ సైకిల్ కొనుక్కుందామని షోరూమ్‌కు వెళ్లా డు. అతనికి చెక్కు బుక్ లేకపోవడంతో డెబిట్ కార్డు ద్వారా స్వైపింగ్ విధానంలో సొమ్ము చెల్లిస్తానన్నాడు. అలాగైతే 2 శాతం పన్ను కింద రూ.1,300 అదనంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పడంతో వెనుదిరిగి వచ్చేశాడు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమçలు ఇవి. పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్ర ఇబ్బందులు పడిన జనం ప్రభుత్వ సూచనల మేరకు నగదు రహిత లావాదేవీల వైపు క్రమంగా మళ్లుతున్నారు. అయితే, సేవా రుసుములు, పన్నుల పేరిట భారీ దోపిడీకి గురవుతున్నారు. మీ డబ్బు మీరు తీసుకున్నా.. జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో రూ.2 వేలు, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. చిల్లర సమ స్య నేపథ్యంలో ప్రజలు రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఏటీఎం నుంచి ఒకసారి రూ.1,500 తీసుకుంటే మాత్రమే రూ.500 నోట్లు వస్తున్నాయి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే రూ.2 వేల నోట్లు వస్తున్నాయి. ఉదాహరణకు రూ.10 వేలు కావాలంటే రూ.2 వేల నోట్లు 5 వస్తున్నాయి. దీంతో.. ఏటీఎంల నుంచి రూ.1,500 చొప్పున 7 పర్యాయాలు సొమ్ము తీసుకోవాల్సి వస్తోంది. ఐతే, నెలలో 5పర్యాయాలకు మించి ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ప్రతి లావాదేవీపై రూ.20 రుసుం, ఆపై 15 శాతం పన్నును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. దీంతో, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగదు రహిత లావాదేవీలపైనా బాదుడే వివిధ వస్తువుల కొనుగోళ్లు కోసం వినియోగించే డెబిట్, క్రిడెట్ కార్డు లావాదేవీలకు సేవా రుసుం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. ఇలాంటి లావాదేవీలపై సంబంధిత వ్యాపార సంస్థలు 2శాతం చొప్పున సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు స్వైపింగ్ యం త్రాలు ఇచ్చినందుకు ప్రతి లావాదేవీపైనా ఇలా వసూలు చేస్తున్నాయని, ఈ విషయంలో తామేమీ చేయ లేమని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. పన్ను ఎందుకు కట్టాలి పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు అదనంగా పన్ను వసూలు చేస్తున్నారు. స్వైపింగ్ విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అమలు సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదనపు పన్నులు మేమెందుకు చెల్లించాలి. – ఇ.రాజేష్, వినియోగదారుడు, తణుకు 7సార్లు ఏటీఎం వాడితే రూ.200 పోయింది జీతాన్ని డ్రా చేసుకునేందుకు ఈనెలలో 7సార్లు ఏటీఎం కార్డు ఉపయోగించాను. నేను డ్రా చేసిన దానికంటే అదనంగా రూ.200 పోయాయి. బ్యాంక్ అధికారులను అడిగితే సేవా రుసుంగా వసూలు చేశామని చెప్పారు. – బట్టు అరవింద్‌కుమార్, జంగారెడ్డిగూడెం నగదు రహిత లావాదేవీలపైనా మినహాయింపు లేదు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ఎటువంటి చార్జీలు ఉండవని చెప్పిన బ్యాంకులు ప్రస్తుతం సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. నేను చేపల వ్యాపారం చేస్తుంటాను. స్వైపింగ్ మెషిన్ ద్వారా చేసే ప్రతి లావాదేవీపైనా బ్యాంకులు భారీగా పన్ను వసూలు చేస్తున్నాయి. – చింతపూడి పెద్దిరాజు, ఏలూరు -
బహిరంగ చర్చకు సిద్ధం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
నందిపేట(ఆర్మూర్) : తలారి సత్యం మృతికి తాను కారణమని ఆరోపణ లు చేయడం తగదని, అంబేద్కర్ సాక్షిగా ప్రజాకోర్టులో బహిరంగ చర్చ కు తాను సిద్ధమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మం డలంలోని అయిలాపూర్ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. యువకుల మృతిపై ప్రతిపక్షా లు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్మూర్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీసీఎంలతో పాటు ఇతర పార్టీలు అఖిల పక్షం పేరుతో విచిత్రంగా ఒకటయ్యాయన్నా రు. అఖిల పక్షంలోని పార్టీలకు కార్యకర్తలు కరువయ్యారని, ఒకరిద్దరు నాయకులు పోగై శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీకి పండుగ, ప్రయాణికులకు మోత
అమరావతి : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పట్నం బస్సులన్నీ పల్లెకు పరుగుతీస్తాయి. డిమాండ్‌ని బట్టే ధర అన్నట్లు... బస్సు ఛార్జీలకు ఉన్నట్టుండి రెక్కలొచ్చేశాయి. ప్రజా శ్రేయస్సు అని చెప్పుకునే ఆర్టీసీ కూడా... ట్రావెల్స్‌కు ఏమాత్రం తగ్గకుండా టిక్కెట్ చార్జీలను వసూలు చేస్తోంది. సంక్రాంతి పండగకు రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 2,500 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటించిన ఆర్టీసీ... 50 శాతం అదనపు ఛార్జీలతో పాటు రిజర్వేషన్ చార్జీలు తదితరాలన్నీ కలిపి 75 శాతం వరకు అదనంగా టిక్కెట్ ధరపై వసూలు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 17 వరకు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం ద్వారా రిజర్వేషన్లు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ఫ్లెక్సీ ఫేర్ విధానంలో ప్రయాణికుల నుంచి దోచుకున్న ఆర్టీసీ సంక్రాంతి పండక్కి ప్రత్యేక బాదుడుకు తెగబడింది. అదనంగా చార్జీలు వసూలు చేయబోమని రవాణ శాఖ మంత్రి ప్రకటించినా దాంతో తమకు సంబంధం లేదని, బాదుడు బాదుడేనని ఆర్టీసీ స్పష్టం చేస్తోంది. దీంతో ఆర్టీసీ బాదుడు చూసి ప్రైవేట్ ఆపరేటర్లు మరింత రెచ్చిపోతున్నారు. టిక్కెట్ ధరపై 200 నుంచి 300 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టిక్కెట్ల ధరలు పెంచకుండా నియంత్రిస్తామని, టిక్కెట్ల ధరలు పెంచితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇటీవలే మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తనిఖీల పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ జోలికెళ్లొద్దని రవాణా శాఖ అధికారులకు సర్కారు నుంచి మౌఖిక ఆదేశాలందినట్లు సమాచారం. పండగ సీజన్లో ప్రైవేట్ ట్రావెల్స్‌పై తనిఖీలు చేస్తే... అంతిమంగా ప్రయాణికులే ఇబ్బందులకు గురవుతారని, ప్రయాణానికి ఆటంకాల్లేకుండా చూడాలని సర్కారు పెద్దల ఆదేశాలు ఉన్నాయట. దీంతో సాధారణ ధరలు కూడా రెట్టింపైపోయి ప్రయాణికులను వణికిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ టిక్కెట్ ధర సాధారణంగా రూ.300 వరకు ఉంటే, ప్రస్త్తుతం ప్రైవేటు ట్రావెల్స్ రూ.700 నుంచి రూ.900 వరకు వసూలు చేస్తున్నాయి. తిరుపతికి రూ.1,700 వరకు దోచేస్తున్నాయి. ఇదిలాఉండగా తాజాగా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు కొత్త ఎత్తుగడ వేశారు. ఆయా జిల్లాల్లో రవాణా శాఖకు టూరిస్ట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. బస్సులో 42 సీట్లుంటే టికెట్ల ధరలను ఆన్లైన్లో ఉంచి ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నారు. సర్కారే వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుంటే... ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల నుంచి అదనంగా రూ.20 కోట్ల మేర వసూలు చేసేందుకు ఆర్టీసీ టార్గెట్ పెట్టుకోవడం గమనార్హం. -
’రవాణా’ బాదుడు
10 శాతం చార్జీలు పెంచిన రవాణా శాఖ ఎల్ఎల్ఆర్ నుంచి వాహన రిజిస్ట్రేషన్ వరకూ అన్నీ ప్రియమే జిల్లాలో రోజుకు రూ.9 లక్షల అదనపు భారం ఏలూరు (మెట్రో) : వాహన రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రవాణా శాఖ ద్వారా సేవలు పొందే జిల్లా ప్రజలపై రోజుకు సుమారు రూ.9 లక్షల మేర అదనపు భారం పడింది. పెంపుదల ఇలా.. ఇప్పటివరకూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన వారినుంచి ఎల్ఎల్ఆర్ నిమిత్తం ప్రస్తుతం రూ.30 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.150కి పెంచారు. దీనిపై వసూలు చేసే సర్వీస్ చార్జి రూ.60ని యథాతథంగా వసూలు చేస్తారు. రూ.550 ఉండే డ్రైవింగ్ లైసెన్స్ ఫీజును రూ.960కి పెంచారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ.500 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.1,000కి పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు రూ.50 వసూలు చేసేవారు. ఇదికాస్తా రూ.200కు పెరిగింది. గడువు తీరిపోయిన లైసెన్స్ రెన్యువల్‌కు అపరాధ రుసుంతో రూ.100 వసూలు చేసేవారు. ఆ మొత్తాన్ని రూ.300కు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో మార్పులు చేయాల్సి వస్తే రూ.50 వసూలు చేసేవారు. ప్రస్తుతం అది రూ.200కు పెరిగింది. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెరిగాయి. ఏ మేరకు పెంచారనే విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు అందలేదు. కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. మా శాఖ ద్వారా 83 రకాల సేవలు అందిస్తున్నాం. ప్రతి సేవలోనూ పెరిగిన చార్జీలను అమలు చేస్తున్నాం. ఎస్ఎస్ మూర్తి, డెప్యూటీ కమిషనర్, రవాణా శాఖ -
వాట్స్‌యాప్‌లో హిందీ ప్రశ్నపత్రం
కడప ఎడ్యుకేషన్: విద్యాశాఖ ఆ«ధ్వర్యంలో 6 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న(ఆరు నెలల పరీక్షలు) సమ్మెటివ్ అసెస్మెంట్–2కు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు తెలిసింది. ఇందుకు సంబం«ధించిన ప్రశ్నపత్రాలు పలువురి మొబైల్ ఫోన్లలోని వాట్స్యాప్లలో హల్చల్ చేస్తున్నాయి. çసమ్మెటివ్ çపరీక్షలకు సంబంధించి సబ్జెక్టు పశ్నపత్రాలు పరీక్ష జరిగే ఒక రోజు ముందు వాట్స్‌యాప్‌లో హల్చల్ చేస్తున్నాయి. అలా వచ్చిన ప్రశ్నపత్రాల గురించి తెలుసుకున్న విద్యార్థులు తమ స్నేహితులకు సమాచారాన్ని చేరవేసి వాటినే ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమాన్యం కూడా ఆ పేపర్‌నే ప్రిపేర్ కావాలని సూచిస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా అప్పట్లో లీక్ అయినట్లు తెలుస్తోంది. 9వ తేదీ సోమవారం జరగనున్న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రంతోపాటు బిట్‌పేపర్ కూడా ఆదివారం వాట్స్‌యాప్‌లో ప్రత్యక్షమైంది. ఈ ప్రశ్నపత్రాలు కడప నగరం నకాష్ ప్రాంతంలోని ఒక ఇంటర్నెట్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెట్ సెంటర్ యజమాని ఒక సెట్‌కు రూ.3500 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డిని వివరణ కోరగా వాట్స్‌యాప్‌లో ప్రశ్నపత్రం వచ్చినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. ప్రశ్నపత్రాల ప్రిటింగ్ అంతా విజయవాడలో జరుగుతుందని అక్కడి నుంచి వచ్చిన ప్రశ్నపత్రాలను తాము చాలా భద్రంగా పాఠశాలలకు పంపుతామన్నారు. కానీ నిజానిజాలు పరిశీలించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాధ్యత స్వీకరణ
కర్నూలు (టౌన్): స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీగా శ్రీనివాసరావు శనివారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించి డీఐజీగా ఇక్కడ నియమించింది. ఇక్కడ డీఐజీగా పనిచేస్తున్న సాయిప్రసాద్ పదవీ విరమణ పొందారు. -
ఇక సెల్ఫోన్లను ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు
-
ఇక సెల్ఫోన్లను ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు
న్యూఢిల్లీ: సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అత్యవసరంగా ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం వస్తే.. సమయానికి స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్ అయిపోతే... పవర్ బ్యాంక్‌లో కూడా పవర్ అయిపోతే... చార్జింగ్కు ఎలాంటి అవకాశం లేకపోతే...ఎలాంటి కమ్యూనికేషన్‌కు ఆస్కారం లేని ఎడారి లాంటి ప్రాంతంలో చిక్కుకుపోతే!. ఇక నుంచి అలాంటి తిప్పలను తప్పించేందుకు బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచంలోని పలు సంస్థలు ఇప్పటికీ తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి పరిశోధనలు ఇంకేమాత్రం అవసరం లేదని, తాము శాశ్వత పరిష్కారం కనుగొన్నామని బ్రిస్టల్ యూనివర్శిటీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఇక జీవితాంతం చార్జింగ్ చేయాల్సిన అవసరంలేని డైమండ్ బ్యాటరీని కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. ఇక్కడ జీవితాంతం అంటే మన జీవితాంతమని కాదు. ఆ డైమండ్ బ్యాటరీ కాలం అని. ఇంతకు దాని జీవితం ఎంతంటే 11,460 సంవత్సరాలట. అందులో సగం చార్జింగ్ అయిపోవడానికి 5,730 సంవత్సరాలు పడుతుందట. ఈ బ్యాటరీని సెల్ఫోన్ల్తోపాటు ట్యాబ్, ల్యాప్‌ట్యాప్ లాంటి అన్ని చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థ అణుథార్మికతలో కార్బన్ 14 ఉంటుందని, దాని నుంచి కృత్రిమ వజ్రాలను తయారు చేయవచ్చని, అణు థార్మిక శక్తిగల ఆ వజ్రం నుంచి నిరంతం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని బ్రిస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆ కృత్రిమ డైమండ్ బ్యాటరీ నుంచి అణుధార్మికత నేరుగా మనపై ప్రభావం చూపించకుండా ఆ డైమండ్‌పై మరో పొరను కవచంలా ఏర్పాటు చేయవచ్చని వారు చెప్పారు. ఈ కవచం వల్ల అణు డైమండ్ బ్యాటరీ నుంచి వెలువడే అణు ధార్మికత శక్తి ఓ అరటి పండు నుంచి వెలువడేదానికి సమానంగా ఉంటుందని, కనుక మానవుల ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని వారు తెలిపారు. అయితే ఎంతకాలంలో అవి మనకు అందుబాటులోకి వస్తాయో మాత్రం వారు తెలపలేదు. -
ఆరోపణలు అవాస్తవం
ఆత్మకూరు: తనపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ అన్నారు. శనివారం ‘కాసులు వద్దు..కానుక ముద్దు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. కథనంలో ఎక్కడా ఆత్మకూరు డీఎస్పీ అని లేకపోయినప్పటికీ ఆమె స్పందించడం గమనార్హం. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ దాదాపు రెండేళ్లుగా తాను ఇక్కడ పని చేస్తున్నానని, ఎప్పుడూ ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నారు. స్టార్ గోదాం విషయంలో సీఐ ద్వారా డబ్బు తీసుకోలేదని.. అతను తప్పు చేసినందున తాను రిపోర్టు ఇవ్వడం వల్లే సస్పెండ్ అయ్యాడన్నారు. ఆత్మకూరులో తాను ఏనాడు షాపింగ్ చేయలేదని.. తన వద్ద ఉన్నదీ ఒక్క సెల్‌ఫోన్ మాత్రమేనన్నారు. పుట్టిన రోజున కానుక రూపంలో ఓ ఎస్ఐ రింగ్ ఇస్తే.. గొలుసు తీసుకురమ్మని చెప్పాననడంలోనే నిజం లేదన్నారు. అసలు ఎవరికీ తన పుట్టిన తేదీ కూడా తెలియదన్నారు. అనంతరం ఆమె తన పరిధిలోని ఎస్ఐలతో మాట్లాడించారు. విలేకరుల సమావేశంలో మిడుతూరు, ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి, నందికొట్కూరు, పగిడ్యాల ఎస్ఐలు పాల్గొన్నారు. -
నడిగర్ సంఘం సమావేశం తథ్యం
మారిన వేదిక తమిళసినిమా: వ్యతిరేకవర్గం ఆరోపణ లు, కేసులు, కోర్టులు లాంటి పలు వివాదాల మధ్య ఎట్టకేలకు దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) సర్వసభ్య సమావేశం ముందుగా నిర్ణరుుంచిన ప్రకారమే ఆదివారం జరగనుంది. అరుుతే వేదికే మారింది. ముం దుగా ఈ సర్వసభ్య సమావేశం స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాల లో జరపనున్నట్లు కార్యవర్గం వెల్లడిం చింది. అరుుతే అక్కడ నిర్వహించడానికి పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. భ ద్రతా దష్ట్యా పోలీసులు కూడా లయో లా కళాశాలలో సమావేశానికి అనుమతించకపోవడంతో స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి విశాల్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎంజీఆర్ శతజయంతి వేడుక: ఈ సర్వసభ్య ఈ సర్వసభ్య సమావేశంలో తమిళసినిమా నూరేళ్ల వేడుక, ఎంజీఆర్ శత జయంతి వేడుకలతో పాటు వందేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ కళాకారుల పేర్లతో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగుతుందని సంఘ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా సంఘ కార్యక్రమాల తీర్మానాలు, ఆదాయ, వ్యయాల సభ్యుల ఆమోదం వంటి కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. పోస్టర్లు వద్దు ఇకపోతే పోలీసు శాఖ అనుమతి లేనందువల్ల సంఘ సర్వసభ్యసమావేశానికి సంబంధంచిన ఎలాంటి పోస్టర్లను గోడలపై అంటించడం లాంటి ప్రచారాలు చేయరాదని సభ్యలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గుర్తింపు కార్డులున్న సభ్యులకే సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఉంటుందని తెలియజేశారు.ఆదివారం జరగనున్న ఈ సమావేశానికి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. -
ఆర్టీసీ ప్రయాణికులపై తొలగని ‘టోల్’ భారం
అమరావతి: కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా టోల్ పన్ను రద్దైనా ఆర్టీసీ మాత్రం ప్రయాణీకుల జేబుకు చిల్లులు పెడుతోంది. గత పది రోజులుగా టోల్ రుసుంను ఆర్టీసీ టిక్కెట్లతో కలిపి వసూలు చేస్తోంది. రోజుకు ప్రయాణీకుల నుంచి రూ.2 కోట్ల మేర ఒక్క టోల్ గేట్ రుసుం పేరిట ఆర్టీసీ గుంజుతోంది. నెలకు సరిపడా టోకెన్లను ముందుగానే టోల్గేట్లకు చెల్లించామని, ప్రయాణీకులకు ఎలా తగ్గిస్తామని ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 టోల్‌ప్లాజాల్లో నిత్యం 13 వేల ఆర్టీసీ బస్సులు దాటుతున్నాయి. వేలాది ట్రిప్పులు నడుస్తున్నాయి. 65 లక్షల మందిని ఆర్టీసీ నిత్యం వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది. రూ.12 నుంచి రూ.13 కోట్ల వరకు టిక్కెట్ల రూపంలో ఆదాయం ఆర్టీసీకి సమకూరుతుంది. ఇందులో ఒక్క టోల్ ఫీజు రూపేణా రోజుకు రూ.40-50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గత తొమ్మిది రోజుల నుంచి టోల్ ఫీజు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్టీసీ మాత్రం ప్రయాణీకుల నుంచి రూ.3.50 కోట్ల వరకు రాబట్టినట్లు చెబుతున్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపైనా పడింది. చిల్లర లేక చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీంతో రూ.8 కోట్ల వరకు ఆర్టీసీకి నష్టం ఏర్పడింది. ఇందులో టోల్‌గేటు రుసుం తొలగించి టిక్కెట్ల ధరలను ఆ మేరకు తగ్గిస్తే ఈ నష్టం రూ.12 కోట్ల వరకు ఉండేదని యాజమాన్యం ఊరట చెందుతుండటం గమనార్హం. -
శవాలకూ బిల్లేస్తున్నారు
సర్కారీ ఆస్పత్రుల్లో దుస్థితి తణుకు అర్బన్ : ఔను.. ఇది నిజం. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లోనూ శవాలకు బిల్లు వేస్తున్నారు. ఠాగూర్ సినిమాలో చూపించినట్టు వైద్యం పేరిట కాదుగానీ.. పోస్టుమార్టం ఖర్చులంటూ సొమ్ములు వసూలు చేస్తున్నారు. అడిగినంత డబ్బు ముట్టజెప్పకపోతే మృతదేహాలు శ్మశాన వాటికకు కదిలే పరిస్థితి లేదు. అనుమానాస్పద మరణాలు, విషం మింగిన కేసులు, హత్యలు, ఆత్మహత్య కేసులకు సంబంధించి మార్చురీల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తోంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రులు, భీమవరం తదితర కేంద్రాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సామగ్రి.. రసాయనాల పేరుతో.. మెడికో లీగల్ కేసులు (ఎంఎల్సీ)లుగా వ్యవహరించే అనుమానాస్పద మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి కేసులకు సంబంధించి సదరు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. మృతదేహాల నుంచి గుండె, ఊపిరితిత్తులు, చిన్నపేగు, బోన్ వంటి అవయవాలను సేకరించి వాటిని రసాయనాలతో నింపిన పెట్టెల్లో భద్రపర్చి.. వాటిని కాకినాడ లేదా విజయవాడలేని ప్రాంతీయ ఫార్మాసిక్ ల్యాబొరేటరీలకు పంపించాల్సి ఉంటుంది. అవయవాలను భద్రపరిచేందుకు ప్రధానంగా ఫార్మాలిన్‌తోపాటు ఇతర రసాయనాలు, ప్లాస్టిక్ బాటిల్స్ అవసరమవుతాయి. వీటిని ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇలాంటి సామగ్రి, రసాయనాలు అందటం లేదు. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు మార్చురీ సిబ్బంది మృతుల సంబంధీకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా కాలువలో లభ్యమయ్యే మృతదేహాల పోస్టుమార్టం విషయంలో ఈ ఖర్చు మరింత ఎక్కువ అవుతోంది. కుటుంబానికి ఆధారమైన పెద్దదిక్కు పోయి బాధతో ఉన్న వారినుంచి ఇలా సొమ్ములు గుంజటం విమర్శల పాలవుతోంది. అడిగినంత సొమ్ము ఇస్తేనే.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ణి శుభ్రంగా ఇస్తారని.. లేదంటే దానిని నిలువునా చీరేసి.. అవయవాలు బయటకు కనిపించేలా ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సొమ్ములు చెల్లించలేని పేద వర్గాలకు చెందిన కొన్ని మృతదేహాలకు స్థానికంగా చందాలు వసూలు చేసి తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు సుమారు 300కు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుంటారు. ఈ తరహా వసూళ్లతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.1,500 ఇచ్చాను మా మావయ్య ఓ ప్రమాదంలో చనిపోతే శవాన్ని తణుకు ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చురీలో పోస్టుమార్టం చేసే సమయంలో సిబ్బందికి రూ.1,500 ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని అడిగితే.. రసాయనాలు, సామగ్రి కొనాలని తెగేసి చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆ సొమ్ము ఇచ్చాం. ఎ.రామారావు, తణుకు సరఫరా లేదు మృతదేహాల అవయవాలను భద్రపరిచి ల్యాబ్‌లకు పంపే క్రమంలో ఉపయోగించే కెమికల్స్, సామగ్రి ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంది. వాటి సరఫరా లేకపోవడంతో బాధితుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఆస్పత్రి నిధుల నుంచి వెచ్చిస్తున్నా సరిపోవడం లేదు. డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు -
అరకొర వడ్డింపు
మధ్యాహ్న భోజన కుకింగ్ చార్జీలు స్వల్పంగా పెంపు పెరిగిన ధరలు రూపాయల్లో.. పెంపు పైసల్లో ప్రాథమిక స్థాయిలో 27 పైసలు.. ఆపై తరగతులకు 40 పైసలు పెంపు రాయవరం: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నంబరు 260 ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన చెల్లింపులు ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోనికి రానున్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడం, వారానికి మూడు గుడ్లు వేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏజెన్సీలకు ఈ పెంపు ఏపాటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు పౌష్టికాహారం సమగ్రంగా, సమర్ధవంతంగా అందించాలంటే ఈ పెంపు చాలదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు రూపాయల్లో.. ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ కాయగూర కొందామన్నా కేజీ రూ.20ల పైబడి ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో గత నెల వరకు వారానికి రెండు కోడి గుడ్లను విద్యార్థులకు అందించాల్సి ఉం ది. ఈ నెల నుంచి వా రానికి మూడు గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.4.50 నుంచి రూ.5గా ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రూపాయల్లో పెరుగుతుంటే పెంపు పైసల్లో చేయడంపై మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇదీ... జిల్లాలో 4,309 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. ఈ పాఠశాలల్లో 4,064 ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు జిల్లాలో పని చేస్తున్నాయి. కుక్ కమ్ హెల్పర్స్ 8,717 మంది ఉన్నారు. 3,316 ప్రాథమిక, 404 ప్రాథమికోన్నత, 589 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక లక్ష 89 వేల 463 మంది విద్యార్థులుండగా, ఒక లక్ష 50 వేల 849 మంది విద్యార్థులు గత నెల మధ్యాహ్న భోజనం తీసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,34,174 మంది విద్యార్థులుండగా గత నెల 88,746 మంది (66 శాతం) మధ్యాహ్న భోజనం చేశారు. ఉన్నత పాఠశాలల్లో 87,177 మంది ఉండగా గత నెలలో 52,487(60శాతం) మంది మధ్యాహ్న భోజనం గత నెలలో తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 100గ్రాములు, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియాన్ని అందజేస్తారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఇప్పటి వరకు రూ.4.86లు చెల్లిస్తుండగా కేవలం 27 పైసలు పెంచారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిలో ఇప్పటి వరకు రూ. 6.78 చెల్లిస్తుండగా తాజాగా కేవలం 40 పైసలు మాత్రమే పెంచారు. జిల్లాలో అత్యధిక పాఠశాలల్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డిస్తుండగా, కొన్ని మండలాల్లో ట్రస్ట్‌లు తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. అనపర్తి మండలం పొలమూరులో బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్, రాజమండ్రిలో ఇస్కాన్, పెద్దాపురంలో గ్రాస్ సంస్థ, తునిలో అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషనల్ సొసైటీలు విద్యార్థులకు ఆహారాన్ని అందజేస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ వివరాలు.. సోమవారం – సాంబారు మంగళవారం – కూర, రసం బుధవారం – పప్పు, ఆకుకూర, గుడ్డు గురువారం – సాంబారు శుక్రవారం – కూర, రసం శనివారం – పప్పు, కాయగూర, స్వీటు నాలుగేళ్లుగా చెల్లింపుల వివరాలు.. విద్యా సంవత్సరం ప్రాథమిక ప్రాథమికోన్నత/స్థాయి ఉన్నత స్థాయి 2011–12లో రూ.3–84 రూ.4–40 2012–13లో రూ.4–00 రూ.4–65 2013–14లో రూ.4–35 రూ.6.00 2014–15లో రూ.4–60 రూ.6.38 2015–16లో రూ.4–86 రూ.6.78 2016–17లో రూ.5.13 రూ.7.18 -
వోడాఫోన్ దివాలీ ఆఫర్
ముంబై: ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఈ దీపావళినుంచి నేషనల్ రోమింగ్ చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. తమ యూజర్లకు దేశవ్యాప్తంగా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ అందించే ప్లాన్ ను ప్రకటించింది. రిలయన్స్ జియో ఎంట్రీ వార్‌లో భాగంగా వోడాఫోన్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ దీపావళినుంచి వోడాఫోన్ వినియోగదారులు, దేశంలో ఎక్కడైనా రోమింగ్ చింతలేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని వోడాఫోన్ కమర్షియల్ డైరెక్టర్ సందీప్ కటారియా తెలిపారు. నేషనల్ అవుట్ గోయింగ్ చార్జీలు హోం చార్జీలతో సమానం ఉన్నప్పటికీ ఇన్ కమింగ్ చార్జీల భయం వినియోగదారులను పీడిస్తున్నట్టు తమ కన్జ్యూమర్ రీసెర్చ్ లో తేలిందన్నారు. అందుకే తమ యూజర్ల సౌలభ్యంకోసం ఈ నిరణయం తీసుకున్నామన్నారు. రెండు కోట్ల మందికి పైగా ఉన్న తమ వినియోగ దారులకు దీని వల్ల లబ్ది చేకూరనుందని కటారియా పేర్కొన్నారు. -
చార్జీల దడ
మోత మోగుతున్న బస్సు టిక్కెట్టు రేట్లు తిరుగు ప్రయాణానికి ‘ప్రైవేటు’ బాదుడు హైదరాబాద్‌కు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ వసూలు ఆర్టీసీదీ అదే రూటు అమలాపురం టౌన్ : దసరా సెలవులకు సొంతూరు వచ్చి తిరుగు ప్రయాణమవుతున్నవారికి బస్సు చార్జీలు దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రయాణానికి చార్జీలు మోత మోగుతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా జిల్లాకు చెందిన 10 వేలు పైగా కుటుంబాలు తాత్కాలికంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. వీరిలో దాదాపు 75 శాతం మంది దసరా సెలవులకు స్వగ్రామాలకు వచ్చారు. అక్కడి నుంచి బస్సులో వచ్చేటప్పుడు ఒక్కో టిక్కెట్టుకు రూ.1,200 నుంచి రూ.1,800 వరకూ చార్జీ చెల్లించారు. దసరా సెలవులు ముగుస్తూండటంలో మంగళ లేదా బుధవారాల్లో హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల యజమానులు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. సాధారణ సమయంలో జిల్లా నుంచి రోజూ హైదరాబాద్‌కు దాదాపు 100 ప్రైవేటు లగ్జరీ బస్సుల్లో సుమారు 5 వేల మంది ప్రయాణిస్తున్నారు. అన్ సీజన్లో ఒక్కో టికెట్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకూ చార్జి చెల్లిస్తున్నారు. అటువంటిది దసరా పేరుతో ఇప్పుడు వంద శాతం ధరలు పెంచేసి ప్రయాణికులను బాదేస్తున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ హైటెక్ బస్సుల సంఖ్యను 150కి పైగా పెంచారు. టిక్కెట్ల రేట్లను కూడా అమాంతం పెంచేశారు. పెరిగిన చార్జీలతో ఒక్కో కుటుంబం హైదరాబాద్ నుంచి సొంతూరు వచ్చి తిరిగి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు రూ.10 వేల వరకూ అవుతోంది. కానరాని నియంత్రణ వాస్తవానికి ప్రైవేటు బస్సుల చార్జీలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. దీంతో ట్రావెల్స్ నిర్వాహకులు ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సుకు రూ.1000 నుంచి రూ.1,200, ఏసీ బస్సయితే రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ టికెట్ ధర వసూలు చేస్తున్నారు. ఇక వోల్వో, స్లీపర్ చార్జీలు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ నిర్ణయించారు. ఆర్టీసీ ‘ప్రత్యేక’ వడ్డన ఆర్టీసీ కూడా చార్జీల వడ్డనలో ఏమీ తీసిపోలేదు. దసరా పేరుతో ప్రత్యేక (స్పెషల్) బస్సులు వేసి చార్జీల బాదుడుకు దిగింది. జిల్లాలోని తొమ్మిది ఆర్టీసీ డిపోల నుంచి దసరా తిరుగు ప్రయాణాల కోసం హైదరాబాద్‌కు దాదాపు 200కు పైగా స్పెషల్ బస్సులను అదనంగా నడుపుతోంది. రెగ్యులర్ బస్సులకు తోడు ప్రత్యేక బస్సులు నడుపుతూ టిక్కెట్ చార్జీని రూ.640 నుంచి రూ.900 వరకూ పెంచింది. రెగ్యులర్ బస్సులకు మాత్రమే పాత చార్జీలను ఉంచి ప్రత్యేక బస్సులకు మాత్రం రూ.250 నుంచి రూ.300 వరకూ అదనంగా వడ్డిస్తోంది. -
ముగ్గురు ఆపరేటర్లకు అనుకూలంగా ‘సీఓఏఐ’
సంఘాన్ని సంస్కరించాల్సిందే: రిలయన్స్ జియో న్యూఢిల్లీ: ప్రత్యర్థులపై రిలయన్స్ జియో మరోమారు సంచలన ఆరోపణలతో విరుచుకుపడింది. రిలయన్స్ జియో సహా ప్రధాన టెలికం అపరేటర్లతో కూడిన ‘సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ)’పై ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. సీఓఏఐ నిబంధనలు, ఓటింగ్ హక్కులు పూర్తిగా ఏకపక్షం, లోపభూయిష్టమని, ముగ్గురు ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా స్వార్థ ప్రయోజనాల కోసం రూపొందించినవని జియో వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఓటింగ్ విధానంతో సహేతుకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం, పారదర్శకతకు చోటు లేదని, ఈ నిబంధనల్ని సమూలంగా సంస్కరించాలని జియో డిమాండ్ చేసింది. ఓటింగ్ హక్కులు ప్రధాన ఆపరేటర్లకు అనుకూలంగా ఉండడంతో వారు ఎలాంటి నిర్ణయాలనైనా నిర్దేశించగలుగుతున్నారని, ప్రభావితం చేయగలుగుతున్నారని పేర్కొంది. ముగ్గురు ఆపరేటర్లు ఆదాయాల పరంగా 60.84 మార్కెట్ వాటాతో 7 ఓట్ల చొప్పున 21 ఓట్లు కలిగి ఉన్నారని... ఇదే సంఘంలో ఉన్న మరో నలుగురు ఆపరేటర్లకు (జియో సహా) 10 ఓట్లు మాత్రమే సర్దుబాటు చేశారని జియో పేర్కొంది. సత్వరమే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసి సీఓఏఐ నిబంధనల సవరణ, దిద్దుబాటును చేపట్టాలని, భవిష్యత్తులో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని డిమాండ్ చేసింది. -
పెరిగిన మధ్యాహ్న భోజన పథకం ధరలు
ఈనెల నుంచే అమలు సుల్తానాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పెరిగిన నిత్యావసరాల ధరలకనుగుణంగా ధరలు పెంచినట్లు డీఈవో శ్రీనివాసాచారి ఎంఈవోలకు ప్రొసీడింగ్‌లు పంపించారు. జిల్లా వ్యాప్తంగా పీఎస్‌లు 1973, యూపీఎస్‌లు 339, హైస్కూల్లు 704 ఉన్నాయి. ఇందులో 2లక్షల52వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి రోజువారిగా మధ్యాహ్నాభోజన పథకం వండి పెట్టే నిర్వాహకులకు కోడిగుడ్డు అందించేందుకు 01.09.2016 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలకు ఎప్పటికప్పుడు అందించాలని పేర్కొన్నారు. 30.06.2015 31.08.2016 01.09.2016 (ధర రూ.లలో) ప్రైమరీ స్కూల్ 3.86 4.86 5.86 యూపీఎస్ 5.78 6.78 7.78 హైస్కూల్ 5.78 6.78 7.78 -
ఈ-కప్పు చాలా స్మార్ట్
ఉదయాన్నే అలవాటు ప్రకారం కప్పులో కాఫీ పోసుకుని హాయిగా పేపర్ ముందేసుకుని కూర్చుంటారు. పేపర్ చదువుతుండగా, ఎవరో ఫోన్ చేస్తారు. మాట్లాడడం పూర్తయిన తరువాత కాఫీ సంగతి గుర్తొస్తుంది. అప్పటికే కాఫీ చప్పగా చల్లారిపోయి ఉంటుంది. ఉసూరుమంటూ మళ్లీ వేడి చేసుకుంటారు. అలా మళ్లీ వేడి చేసుకుని ఏదో తాగామనిపించినా, అప్పటికే కాఫీపై ఉత్సాహం చచ్చి ఉంటుంది. ఇలాంటి కష్టాలకు పరిష్కారమే ఈ-కప్పు. ఇందులో పోసిన కాఫీ గాని, టీ గాని అరగంట వరకు ఏమాత్రం చల్లారిపోకుండా ఉంటాయి. సెల్‌ఫోన్ మాదిరిగానే దీనిని ఎప్పటికప్పుడు చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని వైర్లెస్ పద్ధతిలో చార్జింగ్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. బ్రిటన్‌కు చెందిన థామస్ గోస్టెలో అనే పరిశోధకుడు పద్దెనిమిది నెలలు శ్రమించి ఈ-కప్పును తయారు చేశాడు. -
‘విద్యుత్’ పోరాట అమరులకు నివాళులు
కాకినాడ సిటీ : విద్యుత్ చార్జీలు తగ్గించాలని, ప్రపంచ బ్యాంకు షరుతులు తగవని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో 2000 ఆగస్టు 28న జరిగిన వామపక్షాల పోరాటంలో అమరులకు ఆదివారం సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు అధ్యక్షత వహించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు జె.వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సీహెచ్ అజయ్‌కుమార్.. అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి జోహార్లర్పించారు. 16 ఏళ్ల క్రితం టీడీపీ అధికారంలో ఉండగా, ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుంటే వామపక్షాలు ఎదురుతిరిగాయని నేతలు గుర్తుచేశారు. నిరంకుశంగా ఉద్యమాలను అణచాలని అంగన్వాడీలపై, ఆర్టీసీ ఉద్యమంపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారని దుయ్యబట్టారు. మరలా అధికారంలోకి వచ్చి ప్రజలపై భారాలు వేస్తున్నారని, ప్రజల ప్రయోజనాలకన్నా.. కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై పోరాడతామని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.వీరబాబు, ఎంవీ రమణ, ఎం.రాజ్‌గోపాల్, సూర్యనారాయణ, మహిళా నాయకులు రమాదేవి, సుభాషిణి, విద్యార్థి నాయకులు రాజ్, దుర్గాప్రసాద్, స్పందన, సూర్య, శివ పాల్గొన్నారు. -
ఆశ్రమపాఠశాల విద్యార్థి ఆత్మహత్య
సెల్‌చార్జర్ చోరీ చేశాడని మందలించిన వార్డెన్ మనస్తాపంతో బాలుడి అఘాయిత్యం సిబ్బందిపై బంధువుల దాడి కోనరావుపేట: మెుబైల్ చార్జర్ చోరీ చేశాడనే కారణంపై వార్డెన్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోనరావుపేట గిరిజన ఆశ్రమపాఠశాలలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వన్‌పల్లి బండమీది తండాకు చెందిన భుక్యా స్వామి (11) తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు. దీంతో ఆయనను మేనత్త హంసి–రాములు చేరదీశారు. కోనరావుపేట గిరిజన ఆశ్రమపాఠశాలలో చేర్పించారు. స్వామి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం మెుబైల్‌ఫోన్ చార్జర్ చోరీ చేశాడనే కారణంతో వార్డెన్ ఆంజనేయులు స్వామికి బుద్ధిచెప్పారు. తోటి విద్యార్థుల ఎదుట ఇలా చేయడంతో అవమానంగా భావించిన స్వామి కృష్ణాష్టమి కోసం తనకు మూడురోజుల సెలవు కావాలని ఈనెల 24న సెలవు పెట్టాడు. శనివారం పాఠశాల భవనం మూడో అంతస్తులోని గదిలోంచి దుర్వాసన వచ్చింది. విద్యార్థులు వెళ్లి చూడగా స్వామి కిటికీకి ఉరివేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని సిబ్బంది, గ్రామస్తులకు అందించారు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థి మృతి కారణమంటూ వార్డెన్ ఆంజనేయులు, సిబ్బందిపై దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని పాఠశాల ఎదుట ధర్నా చేశారు. సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, తహసీల్దార్ గంగయ్య, డీటీడబ్ల్యూవో ఎర్రయ్య, ఎంపీపీ సంకినేని లక్ష్మి, సర్పంచ్ సుమలత, వేములవాడ రూరల్ సీఐ మాధవి పాఠశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు. వార్డెన్‌తోపాటు ఉపాధ్యాయులు, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. విద్యార్థి మృతిపై పూర్తిస్థాయివో విచారణ చేపడతామని చెప్పారు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ , డబుల్ బెడ్రూం పథకాలు అందేలా చూస్తామన్నారు. వారి జీవనోపాధి కోసం భూమిని కూడా కేటాయిస్తామని ఆర్డీవో పేర్కొన్నారు. -
'మా కుమార్తెలను సన్యాసినులుగా మార్చారు'
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రం వివాదాల్లో చిక్కుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను బలవంతంగా సన్యాసినులుగా మార్చేసి కేంద్రంలోనే ఉంచుకున్నారని కోయంబత్తూరుకు చెందిన సత్యజ్యోతి మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. యోగా కేంద్రంలోని సోదరీమణులను విచారించి 11వ తేదీన నివేదిక దాఖలు చేయాలని కోవై ప్రధాన న్యాయమూర్తిని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌లోని వివరాలు.. కోవైకి చెందిన కామరాజ్, సత్యజ్యోతిలకు లత,గీత ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అవివాహితులు. ప్రముఖ యోగా గురువు జగ్గివాసుదేవ్ నేతృత్వంలో కోవై వెల్లియంగిరి కొండ ప్రాంతంలో నెలకొల్పిన ఈషా యోగా కేంద్రానికి ఏడాది క్రితం వెళ్లిన కుమార్తెలు ఇంటికి రాలేదు. వారిని కలుసుకునే అవకాశమూ కల్పించలేదు. తమ కుమార్తెలకు గుండు కొట్టించి సన్యాసినులుగా మార్చిసినట్లు తెలుసుకుని కృంగిపోయాం. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వారిద్దరినీ సన్యాసులుగా మార్చడం చట్టవిరుద్దం. తమ కుమార్తెను విడిపించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. వెంటనే తమ ఇద్దరు కుమార్తెలను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని సత్యజ్యోతి పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎస్ నాగముత్తు, వి.భారతీదాసన్ ఈ పిటిషన్‌ను బుధవారం విచారించారు. పిటిషన్ దారు కోరినట్లు ఇద్దరు యువతులను హాజరుపర్చాలని ఆదేశించడం లేదు. అయితే కోవై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీని వెంటపెట్టుకుని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈషా యోగా కేంద్రానికి వెళ్లాలి. పిటిషన్‌దారుని ఇద్దరు కుమార్తెలను కలుసుకోవాలి. ఇష్టపూర్వకంగా సన్యాసినులుగా మారారా లేదా బలవంతంగా చేర్చుకున్నారా అనే అంశంపై వారిద్దరి నుంచి పూర్తి వివరాలను సేకరించి గురువారం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అక్కాచెల్లెళ్లు ఇష్టపూర్వకంగానే ఈషాలో చేరినట్లు రుజువైతే హైకోర్టు జోక్యం చేసుకోదని వారు స్పష్టం చేశారు. కేసును గురువారానికి (11వ తేదీ) వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
పుష్కర పనులు ఎక్కడివక్కడే
విజయవాడ సెంట్రల్ : టీడీపీ పాలకులు నగరంలో అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల విమర్శించారు. శనివారం పార్టీ కార్పొరేటర్లతో కల్సి చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఆలయాల కూల్చివేత, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు చివరకు మహాత్మాగాంధీ విగ్రహాన్ని బుడమేరులో పడేయడం శోచనీయమన్నారు. మంచిపనులు చేసేవాళ్ళు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోతారన్న ఎంపీ కేశినేని వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంచిపనులు చేశారు కాబట్టే ఆయనకు పేదలు గుండెల్లో గుడి కట్టారన్నారు. పుష్కర పనుల్ని పూర్తి చేయడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఐదు నెలల క్రితం పుష్కర పనులు ప్రారంభమైతే ఎంపీకి కార్పొరేటర్లు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. 30 శాతం పనులు అలాగే మిగిలిపోయాయని నాలుగు రోజుల్లో వీటిని ఎలా పూర్తి చేస్తారని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్యంపై ఇప్పుడు అసహనమా? శానిటేషన్ కాంట్రాక్టులు అడ్డదారిలో పచ్చదండుకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు పారిశుధ్యం బాగోలేదని సీఎం అసహనం వ్యక్తం చేయడం ఓ డ్రామాగా పేర్కొన్నారు. గోడలపై బొమ్మలు వేస్తే విజయవాడ మారిపోదని, పేద,మధ్య తరగతి వర్గాలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు బీజాన్బీ, అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ హడావుడి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. దాసరి మల్లీశ్వరీ మాట్లాడుతూ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించిన ఎంపీ కార్పొరేటర్లను అవమానపర్చారన్నారు. 4వ డివిజన్లో పదిరోజులుగా మురుగునీరు వస్తోందని ఆ విషయాన్ని చెబుదామంటే కనీసం తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. పార్టీ కార్పొరేటర్లు బి.సంధ్యారాణి, ఉమ్మడిశెట్టి బహుదూర్, కె.దామోదర్, ఎం.శివశంకర్ పాల్గొన్నారు. -
నేరస్తుల ‘టోలు’ తీస్తారు!
►రాష్ట్రంలోని టోల్గేట్లన్న ►ఆన్లైన్లో అనుసంధానం ►‘టోల్ ఐ’ పేరుతో అప్లికేషన్ రూపొందిస్తున్న నగర పోలీసులు ►నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి ఉపయుక్తం మహానగరంలో అంతర్రాష్ట్ర, ఇతర జిల్లాల ముఠాలు చేసే నేరాలకు సంబంధించిన కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, ‘పొరుగు’ ప్రాంతాల నుంచి వచ్చే నేరస్తులను కట్టడి చేయడం.. చోరీకి గురైన వాహనాల ఆచూకీ త్వరగా కనుక్కోవడం.. ఈ లక్ష్యాలతో నగర పోలీసు విభాగం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ‘టోల్ ఐ’. రాష్ట్రంలోని అన్ని టోల్గేట్లను ఆన్లైన్లో అనుసంధానిస్తూ.. ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ఈ యాప్ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. - సాక్షి, హైదరాబాద్ కేసు నగరంలో దోపిడీకి పాల్పడిన ఓ ముఠా వాహనంలో పారిపోతోంది. నగరమంతా జల్లెడపట్టినా ఆచూకీ చిక్కలేదు. అంతర్రాష్ట్ర ముఠాగా భావించిన పోలీసులు సిటీ సరిహద్దులు దాటిందని అనుమానించారు. వారు ఏవైపు వెళ్లారో తెలుసుకోవడానికి టోల్గేట్లే ఆధారం. ప్రస్తుతం నేరం జరిగిన పరిధిలోని ఠాణా పోలీసులు వ్యక్తిగతంగా ఆ టోల్‌గేట్స్‌కు వెళ్లి వివరాలు పరిశీలించాల్సిందే. దీనివల్ల కాలయాపన జరగడంతో నేరగాళ్లు సేఫ్డెన్కు చేరుకోవడంతో పాటు చోరీ సొత్తును మాయం చేస్తుండటంతో కేసులు కొలిక్కి రావడంలేదు. పరిష్కారం ‘టోల్ ఐ’ అమలులోకి రావడంతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నేరం జరిగిన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షుల ద్వారా లేదా ఆయా చోట్ల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నేరగాళ్ల వాహనం నంబర్ గుర్తించే వీలుంది. కేసు దర్యాప్తు అధికారులో, కంట్రోల్ రూమ్ సిబ్బందో ‘టోల్ ఐ’లో వాహనం నంబర్ ఎంటర్ చేస్తే చాలు. నేరగాళ్ల వాహనం రాష్ట్రంలోని ఏ టోల్గేట్ నుంచైనా ప్రయాణిస్తే వెంటనే గుర్తిస్తుంది. ఆ విషయాన్ని అలెర్ట్ రూపంలో పోలీసులతో పాటు కం ట్రోల్ రూమ్ సిబ్బందికీ సమాచారం ఇస్తుంది. దీంతో వాహనం ప్రయాణిస్తున్న మార్గంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారమివ్వడం ద్వారా నేరగాళ్లను పట్టుకోవచ్చు. కేసు పాతబస్తీలో భారీ చోరీకి పథకం వేసిన ఓ అంతర్రాష్ట్ర/జిల్లా ముఠా అక్కడ నుంచి బయలుదేరింది. ద్విచక్ర వాహనం లేదా తేలికపాటి వాహనంలో వస్తున్న గ్యాంగ్ మెంబర్లు.. తాము వినియోగిస్తున్న వాహనానికి ఇతర వాహనానిదో, బోగస్ నంబరో వేసి ప్రయాణించారు. నేరం చేసిన తర్వాత చేపట్టే దర్యాప్తులోనే తప్పుడు నంబర్ ప్లేట్‌తో వచ్చారని తేలుతోంది. ఫలితంగా నేర నిరోధం సాధ్యం కాకపోగా.. కేసు దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది. పరిష్కారం ఇలాంటి సవాళ్లకూ ‘టోల్ ఐ’నే సమాధానం. నగర పోలీసులు ఈ సర్వర్‌కు ఆర్టీఏ డేటాబేస్‌ను సైతం అనుసంధానిస్తున్నారు. ఫలితంగా ఓ రకం వాహనానికి(టూ వీటర్) మరో రకం వాహనానికి(లారీ) చెందిన నంబర్ ఉంటే సర్వర్ గుర్తిస్తుంది. ఫలానా వాహనం, దొంగ నంబర్‌తో ఫలానా టోల్గేట్ దాటి వస్తోందని హెచ్చరిస్తుంది. వాళ్లు వస్తున్న మార్గంపై దృష్టిసారించి పట్టుకోవడం ద్వారా నేరాలు నిరోధించవచ్చు. మరిన్ని హంగులతో.. →పస్తుతం టోల్గేట్లను మాత్రమే అనుసంధానించారు. ఇంటర్నెట్ సమస్య కారణంగా ఔటర్ రింగ్ రోడ్‌పై ఉన్న టోల్‌ప్లాజాల అనుసంధానంసాధ్యం కావట్లేదు. దీంతో ప్రతి రెండు గంటలకు ఓసారి వారి డేటా అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. →నగరంలో చోరీకి గురైన వాహనాలకు సంబంధించిన స్టోలెన్ వెహికిల్ డేటాబేస్‌ను సైతం ‘టోల్ ఐ’ సర్వర్‌తో అనుసంధానించనున్నారు. ఫలితంగా ఆ వాహనం రాష్ట్రంలోని ఏ టోల్‌గేట్‌ను దాటినా వెంటనే అప్రమత్తం చేస్తుంది. →అప్లికేషన్ రూపంలో ఉన్న ‘టోల్ ఐ’ని యాప్ రూపంలోకి మార్చనున్నారు. ప్రస్తుతం దర్యాప్తు తదితరాల కోసం నగర పోలీసులు వినియోగిస్తున్న ‘హైదరాబాద్ కాప్’తో దీన్ని లింక్ చేస్తారు. →టోల్గేట్ల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టంతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు. ఫలితంగా టోల్గేట్ నిర్వాహకులతో సంబంధం లేకుండానే ‘ఆపరేషన్’ నడుస్తుంది. -
మొక్కల సంరక్షణ బాధ్యతగా స్వీకరించాలి
ఖమ్మం లీగల్ : మొక్కలు నాటి పట్టించుకోకుండా ఉండొద్దని, నాటిన మొక్కల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలని హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవాసదన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం ఆయన ఖమ్మం చేరుకున్నారు. మొదట గాంధర్వ మొక్క నాటిన న్యాయమూర్తి.. ఆ మొక్కను ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు. అనంతరం జిల్లా ప్రధాన జడ్జి సీహెచ్.విజయ్‌మోహన్, హైకోర్టు విశ్రాంత జడ్జి సీతాపతి తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో న్యాయసేవా సదన్ కార్యదర్శి వి.ఎ.ఎల్.సత్యవతి సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తికి ఘనస్వాగతం.. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన హైకోర్టు జడ్జి యు.దుర్గాప్రసాదరావుకు జిల్లా ప్రధాన జడ్జి సిహెచ్.విజయమోహన్ ఆధ్వర్యంలో శనివారం ఘనస్వాగతం పలికారు. తొలుత ఖమ్మం ఆర్అండ్బీ అతిథిగృహం చేరుకున్న ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిల్లా కోర్టుకు చేరుకుని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత జిల్లాకోర్టులో నిర్వహించిన వర్క్‌షాపులో పాల్గొన్నారు. -
రేపటి నుంచి రిజిస్ట్రేషన్ బాదుడే
భూముల విలువలు 10 నుంచి 20 శాతం పెంపు కాకినాడ లీగల్ : ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమివిలువ పెంచుతూ శనివారం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. బాబు దొంగ దెబ్బతో కొనుగోలుదారులు గొల్లుమంటున్నారు. ప్రతీ ఏడాది భూమి రేట్లు పెంచే అంశాన్ని వారం రోజులు ముందుగా ప్రభుత్వం ప్రకటించేది. దాంతో క్రయవిక్రయదారులు ముందుగా రిజిస్ట్రేషన్లు చేయిచుకునేందుకు వెసులుబాటు ఉండేది. అయితే ఈ సారి ‘బాబు’ శనివారం రాత్రి రిజిస్ట్రేషన్ భూమివిలువలు పెరుగుతున్నట్టు ప్రకటించడంతో ఆగస్టు ఒకటి నుంచి వీటిని రిజిస్ట్రేషన్ శాఖ అమలులోకి తీసుకోనుంది. చాలామంది కొనుగోలు దారులు తమ భూములను ఆగస్టు నెలలో వచ్చే శ్రావణమాసంలో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు నిర్ణయించుకున్నారు. వారికిది షాకే. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగరపంచాయతీలలో భూమివిలువ పెరగనుంది. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న గ్రామాలకు భూమి విలువ 10 నుంచి 20శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచలేదు. ఇప్పటి వరకు రూ. 10లక్షలSవిలువైన భూమికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 75 వేలు అయ్యేది. ఇప్పుడు భూమి విలువ 20శాతం పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు∙రూ.90వేలు అవుతుంది. కాకినాడ కార్పొరేషన్లో.. కాకినాడ కార్పొరేషన్ మాస్టర్ పరిధిలోని చీడిగ, గంగనాపల్లి, కాకినాడమేడలైన్, కొవ్వూరు, నడకుదురు, సూర్యారావుపేట, తూరంగి గ్రామాల్లో భూమి విలువ పెరగనుంది. కట్టడ నిర్మాణాలపైనా... భూముల విలువ పెంచడంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న భవనం నిర్మాణాన్ని బట్టి ఇప్పటివరకు చదరపు అడుగుకు (ఆర్‌సీసీరూఫ్)కు రూ.870 ఉంది. ఆగస్టు 1 నుంచి రూ. 100 నుంచి రూ. 150 వరకూ ఇది పెరగనుంది. అలాగే సిమెంట్ రేకుతో ఉన్న ఇల్లు, మద్రాస్‌టెర్రస్‌తో ఉన్న ఇంటికి కూడా చదరపు అడుగుకు «గతం కంటే ధర పెరిగింది. -
బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
-
‘ఆహా’ అనిపించే ప్రయాణం!
ఒకవైపు ప్రయాణానికే చార్జీ ♦ 5 మెట్రోలు, 360 రూట్లలో సేవలందిస్తున్న ఆహా ట్యాక్సీ ♦ రెండు నెలల్లో కేరళ, కోల్‌కతాలకు విస్తరణ ♦ ఈ నెలాఖరు కల్లా రూ.50 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘స్టార్టప్ డైరీ’తో ఆహా ట్యాక్సీస్ ఫౌండర్ అమిత్ గ్రోవర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సాధారణంగా ఏ ట్యాక్సీ బుక్ చేసినా... తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుందనే కారణంతో రెండు వైపులా చార్జీ చేస్తారు. దీంతో మనకు అవసరం లేకపోయినా, మనం ప్రయాణించకపోయినా రిటర్న్ చార్జీలు భరించాలి. మరి ఒకవైపు ప్రయాణానికే చార్జీ ఉంటే? కారును బట్టి చార్జీ ఉంటే?.. ఆ ప్రయాణం ఆహా కదూ! ఇదిగో ఇలాంటి సేవలతోనే ముందుకొచ్చింది ‘ఆహా’ ట్యాక్సీ.!! సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి ఆహా ట్యాక్సీస్ వ్యవస్థాపక సీఈఓ అమిత్ గ్రోవర్ ఏం చెప్పారంటే... ఓ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. రైలు, బస్సుల్లో వెళదామంటే కిక్కిరిసే జనం. సీటు దొరుకుతుందనే గ్యారంటీ లేదు. పోనీ ట్యాక్సీ బుక్ చేద్దామంటే రిటర్న్ చార్జీ కూడా వేశాడు. ఇది సరికాదని ఎంత వారించినా ఒప్పుకోలేదు. పెపైచ్చు దేశంలో ఎక్కడైనా ట్యాక్సీ చార్జీలిలానే ఉంటాయని ఉచిత సలహా పడేశాడు. చూస్తూ చూస్తూ జేబు గుల్ల చేసుకోవటమెందుకు అనిపించింది. దీనికి పరిష్కారంగా రిటర్న్‌లో ప్రయాణికులను కనెక్ట్ చేస్తే సరిపోతుందనిపించింది. ఇదే వ్యాపార సూత్రంగా గతేడాది జనవరిలో ఆహా ట్యాక్సీస్.కామ్‌ను ప్రారంభించాం. ఐటీ మిత్రులు ప్రవీణ్ సమారియా, కునాల్ కృష్ణ, కుమార్ ఆర్యన్, శివం మిశ్రా, మీరా గిరిధర్‌తో కలసి రూ.15 లక్షల పెట్టుబడితో నోయిడా ప్రధాన కేంద్రంగా దీన్ని ప్రారంభించాం. వాహ్ ట్యాక్సీ ప్రై.లి.లోని ఒక విభాగమే ఆహా ట్యాక్సీస్. సిటీల్లో కాకుండా ఔట్ స్టేషన్ ప్రయాణం కోసం ట్యాక్సీ అగ్రిగేటర్‌గా పనిచేయటమే మా ప్రత్యేకత. అది కూడా ఒకవైపు చార్జీ మాత్రమే విధిస్తూ!!. వెయ్యి మంది డ్రైవర్లతో ఒప్పందం: ప్రస్తుతానికి ఆహా ట్యాక్సీస్తో వెయ్యి మంది డ్రైవర్లు, వెండర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి 50 మంది వెండర్స్ ఉన్నారు. మా సేవలను వినియోగించుకోవటం చాలా ఈజీ. ఆహా ట్యాక్సీ సైట్లోకి వెళ్లగానే వన్‌వే ట్రిప్ లేదా రౌండ్ ట్రిప్ అనే అప్షన్ వస్తుంది. రౌండ్ ట్రిప్ ఎంచుకుంటే పర్వాలేదు. ఒకవేళ వన్‌వే ఎంచుకుంటే.. మిమ్మల్ని ఒక పాయింట్ నుంచి మరో పాయింట్‌ను చేరవేస్తాం. అక్కడి నుంచి తిరిగొచ్చేటప్పుడు ఆ ప్రాంతాల్లోని కస్టమర్లను రిటర్న్‌లో కనెక్ట్ చేయడమే ఆహా ట్యాక్సీ పని. ఎకానమీ, కంఫర్ట్, ప్రీమియం మూడు విభాగాలుగా సేవలందిస్తున్నాం. చార్జీలు ప్రారంభ ధర రూ.999. రాత్రిళ్లలో ప్రయాణానికైతే ఒక రాత్రికి రూ.250 అదనపు చార్జీ ఉంటుంది. కేరళ, కోల్‌కతాలకు విస్తరణ: ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటూ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 360 రూట్లలో సేవలందిస్తున్నాం. నెలకు 1,000 మంది మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం, హైదరాబాద్-విజయవాడ, ఢిల్లీ-హరిద్వార్, ఢిల్లీ-ఊటీ రూట్లు ఉంటున్నాయి. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా విస్తరించాలనేది లక్ష్యం. రెండు నెలల్లో కేరళ, కోల్‌కతాల్లో సేవలు మొదలుపెడతాం. గతేడాది ముంబైకి చెందిన ఆహా వెంచర్స్ ఏంజిల్స్ గ్రూప్ 20-30 కోట్ల మధ్య పెట్టుబడులు పెట్టింది. ఈ నెలాఖరుకల్లా మరో రూ.50 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
కోడల్ని కాల్చి చంపేసింది!
జార్జియాః అమెరికా జార్జియాలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకును విడాకులు కోరినందుకు ఏకంగా ఓ అత్తగారు కోడల్ని కాల్చి చంపేసింది. కొద్దిరోజులుగా ఇంటి గొడవలు కారణంగా కోడలు.. తన ఇద్దరు పిల్లలతోపాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లితండ్రులతో కలసిఉంటున్న ఆమెను కాపురానికి తీసుకొచ్చే వంకతో వెళ్ళిన అత్త.. మనవలు చూస్తుండగానే కోడల్ని కాల్చి చంపేసింది. సౌత్ జార్జియా మెక్ రియోకు చెందిన 68 ఏళ్ళ ఎలిజబెత్ వాల్.. వాయువ్య అట్లాంటా పౌడర్ స్ప్రింగ్స్ లో నివసిస్తున్నతన 35 ఏళ్ళ కోడలు.. జెన్నావాల్ ను తుపాకీతో కాల్చి చంపింది. కొడుకుతో గొడవలు పడి కొద్దిరోజులుగా పుట్టింట్లోనే ఉంటున్నజెన్నాను కాపురానికి తెచ్చేందుకు వెళ్ళిన ఎలిజబెత్.. అక్కడే ఉన్న మనవళ్ళను ముందుగా బయటకు పంపించి, ఇంట్లోనే ఉన్న కోడల్ని మాత్రం షూట్ చేసి, హత్య చేసినట్లు జైల్ రికార్డులు చెప్తున్నాయి. కోడల్ని చంపడంతోపాటు, పిల్లల ఎదుటే హింసకు పాల్పడినందుకు గాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎలిజబెత్ వాల్ పై పలు కేసులు నమోదు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. బాధితురాలు కాబ్ కౌంటీ కెంప్ ఎలిమెంటరీ స్కూల్లో కిండర్‌గార్టెన్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ వెబ్ సైట్ లోని వివరాలను బట్టి ఆమె.. జార్జియా కెన్నెసా హారిసన్ హై లోను, జార్జియా యూనివర్శిటీలోను చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె...కాబ్ కౌంటీలోని మరో రెండు స్కూళ్ళలో కూడ చదివినట్లు వెబ్ సైట్ లోని వివరాలు చెప్తున్నాయి. -
చార్జీలు తగ్గించాల్సిందే
సామాన్యుడి ఆవేదన జనగామ : ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు ఎడాపెడా చార్జీలు పెంచే స్తూ పెను భారం మోపుతున్నారని సామాన్యు డు ఆవేదన చెందుతున్నాడు. స్వరాష్ట్రం సాధిం చుకుంటే కష్టాలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశనే ఎదురవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంపై ప్రజలు ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. చార్జీల పెంపుపై వారి మాటల్లోనే.. బస్సు చార్జీలు తగ్గించాలి ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి. తెలంగాణ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే ఈ వడ్డింపులు ఏంటి. పల్లెవెలుగు బస్సుల చార్జీలు కూడా పెంచడం దారుణం. - ఒరుగంటి తిరుపతి, చీటకోడూరు ధనిక రాష్ట్రం అంటిరికదా తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ధరలు పెంచుడు బాగోలేదు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో మధ్యతరగతి ప్రజలు అవస్థ పడుతున్నారు. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీల పెంపు పెనుభారం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజలను బాదుడు బాగోలేదు. - లగిశెట్టి వెంకటేశ్వర్లు, రైల్వేస్టేషన్‌రోడ్డు, జనగామ కరెంటు చార్జీలతో నష్టమే కరెంటు చార్జీల పెంచుతో జిరాక్స్ దుకాణంపై భారం పడనుంది. వంద యూనిట్లు దాటితే రూపాయి వరకు వడ్డిస్తుండడంతో తాము కూడా ధరలు పెంచాల్సి వస్తోంది. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలి. - వేమెళ్ల సురేష్‌రెడ్డి, జిరాక్స్ దుకాణం, జనగామ హోటళ్లపై మోయలేని భారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హోటళ్లపై ఆధారపడి జీవిస్తున్న వారికి మోయలేని భారం పడనుంది. టిఫిన్స్‌కు అవసరమయ్యే ప్రతి వస్తువును గ్రైండర్‌లోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు పెరిగి నష్టపోతాం. - బాషెట్టి రాజశేఖర్, హోటల్ యజమాని, జనగామ రూపారుు పెంచితే ఎలా? విద్యుత్తు చార్జీల పెంపు నుంచి వాణిజ్య వినియోగదారులను సడలించాలి. సామాన్యుడి నుంచి ధనికుడి వరకు 100 యూనిట్లు వాడని వారు ఉండరు. ఒక్కసారిగా రూపాయి పెంచితే ఎలా. - ఎండి.సమీర్, వ్యాపారి, జనగామ చార్జీలను వెంటనే తగ్గించాలి ప్రభుత్వం విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి ఒక్కటి పెరగడమే తప్ప, ధరలకనుగుణంగా సామాన్యునికి ఒరిగింది ఏమీలేదు. ఏ చార్జీలు పెంచినా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. - రాపోలు ఉపేందర్, టైలర్, జనగామ -
చార్జీలపెంపుపై సీపీఐ ఆందోళన
యాదిగిరిగుట్ట(నల్లగొండ): తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్‌చార్జీలపై సీపీఐ నిరసన తెలిపింది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట బస్టాండ్ వద్ద సీపీఐ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అసలే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై చార్జీల పెంపు మరింత భారంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు. -
దిమ్మదిరిగేలా షాక్
సంగారెడ్డి/మెదక్: విద్యుత్ వినియోగదారుల దిమ్మదిరిగేలా సర్కార్ షాకిచ్చింది. వంద యూనిట్ల లోపు వారి జోలికి వెళ్లకపోయినా ఆపై యూనిట్లు వినియోగించే వారికి చార్జీల మోత మోగించింది. పెరిగిన చార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి 5.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో వందలోపు యూనిట్లు కాల్చే కనెక్షన్లు లక్ష వరకు మాత్రమే ఉన్నాయి. మిగతా 4.50 లక్షల కనెక్షన్ల వారిపై కోట్లాది రూపాయల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఒకటినుంచి 100 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.2.60 ఉంది. 101 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.3.60లు, 201 నుంచి 500 వరకు యూనిట్‌కు రూ.5.60 చొప్పున వసూలుచేస్తున్నారు. ఇందులో 50యూనిట్లు కాల్చిన ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పూర్తి సబ్సిడీ ఇస్తున్నారు. కానీ ఒక బల్బు లేదా ఫ్యాన్ వేసినా నెలకు 100 యూనిట్లు దాటడం ఖాయమని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదంటున్నారు. ప్రతి ఇంట్లో 2నుంచి 3 బల్బులు, టీవీ, రెండు ఫ్యాన్లు నడిపించినా నెలకు 150 నుంచి 200యూనిట్ల వరకు కాలుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో నెలకు రూ.300 నుంచి రూ. 500 వరకు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. పెరిగిన చార్జీలు చెల్లించలేక చీకట్లోనే ఉండే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. గృహావసరాల విద్యుత్‌ను వందకు పైగా యూనిట్లు వాడే కుటుంబాలు దాదాపు 4.50 లక్షలున్నాయి. వీరంతా తాజా పెంపు భారాన్ని మోయాల్సిందే. జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకుపైగా అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి. జిల్లాలో 8,450 పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి యూనిట్ విద్యుత్ ధరను రూ.6.40 నుంచి రూ.6.70కి పెంచటం జరిగింది. ప్రతినెలా పరిశ్రమల నుంచి రూ.5 కోట్ల వరకు బిల్లులు వసూలవుతాయి. కాగా పెంచిన చార్జీల కారణంగా అదనంగా సుమారు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్థిక భారం పడనుంది. కోళ్ల పరిశ్రమకు యూనిట్ ధరను రూ.3.60 నుంచి రూ.4కు పెంచారు. చక్కెర పరిశ్రమలకు యూనిట్ ధర రూ.4.90 నుంచి రూ.5.20కు పెరిగింది. దీంతో కోళ్ల, చక్కెర పరిశ్రమలపై అదనపు భారం పడనుంది. బాదుడు తగదు ప్రభుత్వం నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడం సంతోషకరమే. అయితే వంద యూనిట్లు పైబడిన వారికి చార్జీలు వడ్డించడం సరికాదు. ప్రతి కుటుంబానికి వంద యూనిట్లు దాటుతుంది. ఈ దశలో భారం అందరిపైనా పడుతుంది. - డి.మోహనాచారి, ఖాజిపల్లి కరెంట్ చార్జీల పెంపు సరికాదు.. ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామంటూనే ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపడం సరికాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచి షాక్ ఇవ్వడం బాధాకరం. - రాములు, బ్రాహ్మణ వీధి, మెదక్ 100 యూనిట్లు దాటితే పెంపు భారం... జిల్లాలో 5.50 లక్షల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. 100 యూనిట్ల లోపు కాల్చే కనెక్షన్లు లక్ష వరకు ఉంటాయి. వంద యూనిట్లు దాటిన వారిపై పెంపు భారం పడనుంది. పరిశ్రమలకు 7 శాతం చార్జీలు పెరగనున్నాయి. - సదాశివరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ