
ఈ-కప్పు చాలా స్మార్ట్
ఉదయాన్నే అలవాటు ప్రకారం కప్పులో కాఫీ పోసుకుని హాయిగా పేపర్ ముందేసుకుని కూర్చుంటారు. పేపర్ చదువుతుండగా...
ఉదయాన్నే అలవాటు ప్రకారం కప్పులో కాఫీ పోసుకుని హాయిగా పేపర్ ముందేసుకుని కూర్చుంటారు. పేపర్ చదువుతుండగా, ఎవరో ఫోన్ చేస్తారు. మాట్లాడడం పూర్తయిన తరువాత కాఫీ సంగతి గుర్తొస్తుంది. అప్పటికే కాఫీ చప్పగా చల్లారిపోయి ఉంటుంది. ఉసూరుమంటూ మళ్లీ వేడి చేసుకుంటారు. అలా మళ్లీ వేడి చేసుకుని ఏదో తాగామనిపించినా, అప్పటికే కాఫీపై ఉత్సాహం చచ్చి ఉంటుంది. ఇలాంటి కష్టాలకు పరిష్కారమే ఈ-కప్పు. ఇందులో పోసిన కాఫీ గాని, టీ గాని అరగంట వరకు ఏమాత్రం చల్లారిపోకుండా ఉంటాయి. సెల్‌ఫోన్ మాదిరిగానే దీనిని ఎప్పటికప్పుడు చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని వైర్‌లెస్ పద్ధతిలో చార్జింగ్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. బ్రిటన్‌కు చెందిన థామస్ గోస్టెలో అనే పరిశోధకుడు పద్దెనిమిది నెలలు శ్రమించి ఈ-కప్పును తయారు చేశాడు.