ముసాయిదా నిబంధనలను ప్రకటించిన ఈఆర్సీ
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, అదనపు లోడ్ సామర్థ్యం మంజూరీకి ఇకపై సర్వీసు లైన్ చార్జీల పేరుతో కొత్త చార్జీలను వసూలు చే యనున్నారు. కనెక్షన్ లోడ్ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కి ఈ చార్జీ లను చెల్లించాల్సి ఉంటుంది. కోరిన వారికి కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ విద్యు త్ పంపిణీ సంస్థ (డిస్కం)ల బాధ్యత కాగా, అందుకు అవసరమైన విద్యుత్ లైన్ లేదా ప్లాంట్ ఏర్పాటుకు చేసే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ఈ లైన్ చార్జీలను వసూలు చేయనున్నారు.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ప్రకటించి ఈ నె ల 24లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. లోడ్ సామర్థ్యం, కనెక్ష న్ కేటగిరీ, కనెక్షన్ జారీకి డిస్కంలు చేసే సగటు వ్యయం ఆధారంగా కొత్త కనెక్షన్ల చార్జీలను నిర్ణయించాలని రాష్ట్రాల ఈఆర్సీలకు గతంలో కేంద్రం సూచన చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్) రూల్స్ 2020ను ప్రకటించింది.
ప్రతి కనెక్షన్ కోసం సైట్‌ను సందర్శించి డిమాండ్ చార్జీలను అంచనా వేయడానికి బదులుగా ఈ పద్ధతిని పాటించాలని కోరింది. కేంద్రం సూచనల మేరకు లైన్ చార్జీల వసూళ్లకు అనుమతించాలని డి స్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ఈ మేరకు ముసాయిదాను ప్రకటించింది. కనెక్షన్ లోడ్ సామర్థ్యంలోని ప్రతి కిలోవాట్ లోడ్‌కి కొంత మొత్తం చొప్పున ఈ చార్జీలను విధిస్తారు.
కొత్త కనెక్షన్ జారీకి ప్రత్యేకంగా విద్యుత్ లైన్ వే యాల్సిన అవసరం ఉన్నా, లేకున్నా ఈ కింద పేర్కొన్న మేరకు సర్వీసు లైన్ చార్జీలను వసూలు చేయాలని ఈఆర్సీ ప్రతిపాదించింది. అభ్యంతరాలు, సలహాలు తీసుకున్న తర్వాత ఈఆర్సీ తుది ఆదేశాలు జారీ చేయనుంది.
ప్రస్తుత చార్జీలకు అదనంగా కొత్త చార్జీలు
కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం భూగర్భ కేబుల్ లైన్ వేయాల్సిన అవసరం వస్తే పైన పేర్కొన్న సంబంధిత కేటగిరీ చార్జీలతో పోలిస్తే దరఖాస్తుదారుల నుంచి 2.5 రెట్ల రుసుమును అధికంగా వసూలు చేస్తారు.
కొత్త కనెక్షన్ల జారీకి ఇప్పటికే వసూలు చేస్తున్న దరఖాస్తు ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్‌మెంట్ చార్జీలకు అదనంగా ఈ సర్వీసు లైన్‌చార్జీలను వసూలు చేయనున్నారు. హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ కోసం కొత్త లైన్లను వేయాల్సి వస్తే అందుకు కానున్న వ్యయాన్ని డిస్కంలు అంచనా వేసి దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment