ERC
-
విద్యుత్ బకాయిలు రూ. 30,777 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లకు విద్యుత్ వినియోగదారుల నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు గతేడాది సెప్టెంబర్ 30 నాటికి ఏకంగా రూ. 30,777 కోట్లకు ఎగబాకాయి. రూ. 50 వేలు, ఆపై కరెంట్ బిల్లులు బకాయిపడిన వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిలివి. అందులో టీజీఎస్పీడీసీఎల్కు రావాల్సిన బకాయిలు రూ. 17,405.04 కోట్లకాగా టీజీఎన్పిడీసీఎల్కు రావాల్సిన బకాయిలు రూ. 13,372.61 కోట్లుగా ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) 2025–26లో ఈ విషయాన్ని డిస్కంలు వెల్లడించాయి. ఎల్టీ కేటగిరీ వినియోగదారుల నుంచి టీజీఎస్పీడీసీఎల్కు రూ. 630.05 కోట్లు, టీజీఎన్పిడీసీఎల్కు రూ.320.66 కోట్లు కలిపి మొత్తం రూ.950.71 కోట్ల బాకాయిలు రావాల్సి ఉంది. ఇక హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్కు రూ.16,774.98 కోట్లు, టీజీఎన్పిడీసీఎల్ రూ.13,051.95 కోట్లు కలిపి మొత్తం రూ.29,826.93 కోట్లు బకాయిపడ్డారు. సర్కారు వారి బకాయిలే అత్యధికం.. మొత్తం బకాయిల్లో రూ. 29,826.93 కోట్లు హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులవే. వాటిలో అత్యధిక బకాయిలు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్ర విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే డిస్కంలకు వివిధ ప్రభుత్వ శాఖలు రూ. 28 వేల కోట్లపైనే బకాయిపడ్డాయి. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో ఏటేటా బకాయిలు పెరిగిపోయాయి. టపటపా పేలిన ట్రాన్స్ఫార్మర్లు గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 52,202 డిస్త్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. కేవలం 6 నెలల్లోనే 50 వేలకుపైగా ట్రాన్స్ఫార్మర్లు దగ్ధం కావడం ఓవర్‌లోడ్ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 28,996 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా.. టీజీఎన్పిడీసీఎల్ పరిధిలో మొత్తం 24,132 ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. మరోవైపు అదే కాలానికి విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన మొత్తం 2,79,939 విద్యుత్ మీటర్లు దగ్ధం కావడం లేదా పాడయ్యాయి. 6 నెలల్లో 316 మంది బలి గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రాష్ట్రంలో విద్యుదాఘాతంతో 316 మంది మృతిచెందగా 105 మంది గాయపడ్డారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 99 మంది, టీజీఎన్పిడీసీఎల్ పరిధిలో 217 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 34, కామరెడ్డిలో 20, మహబూబాబాద్, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చెరో 19 మంది మరణించారు. పాత కేసులు కలుపుకుని ఈ కాలంలో టీజీఎస్పీడీసీఎల్ 138 మంది, టీజీఎన్పిడీసీఎల్ 165 మంది మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాయి. ఇక విద్యుత్ సరఫరా అంతరాయాలకు సంబంధించి మొత్తం 5,23,762 ఫిర్యాదులను రెండు డిస్కంలు అందుకున్నాయి. మరోవైపు 53,633 విద్యుత్ చౌర్యం కేసులు నమోదవగా అందుకు సంబంధించి రూ. 65.04 కోట్ల జరిమానాలను డిస్కంలు విధించాయి. 28లోగా అభ్యంతరాలు తెలపండి: టీజీఈఆర్సీ డిస్కంల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలపై ఈ నెల 28లోగా అభ్యంతరాలు, సలహాలను పంపించాలని టీజీఈఆర్సీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. మార్చి 19న హన్మకొండలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందీరంలో, 21న హైదరాబాద్‌లోని టీజీఈఆర్సీ కార్యాలయం(విద్యుత్ నిలయం)లో బహిరంగ విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది. -
మిగులు విద్యుత్ మోపెడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో ఏకంగా 25,312 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ మిగిలిపోనుంది. వచ్చే ఏడాది రాష్ట్ర విద్యుత్ అవసరాలు 98,319 ఎంయూగా అంచనా వేయగా.. 1,23,631 ఎంయూ విద్యుత్ లభ్యత ఉండనుంది. ఇప్పటికే కుదుర్చుకున్న/భవిష్యత్తులో చేసుకోనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మేరకు ఇంత భారీగా విద్యుత్ సమకూరనుంది. కొనుగోలు చేసే విద్యుత్‌లో రాష్ట్ర అవసరాలు పోగా 25,312 ఎంయూ మిగిలిపోనుంది. సగటున యూనిట్‌కు రూ.5.54 ధర లెక్కన మిగులు విద్యుత్ విలువ రూ.14,022.84 కోట్లు అవుతోంది. అదనంగా ఉందనే ఉద్దేశంతో మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయకపోయినా... ఒప్పందాల మేరకు విద్యుదుత్పత్తి సంస్థలకు ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సిందే.అంటే డిస్కంలపై, పరోక్షంగా రాష్ట్ర ప్రజలపై భారం పడినట్టే అవుతుందని విద్యుత్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విద్యుత్ అవసరాలు 98,318 ఎంయూ కాగా.. డిస్కంలు రాష్ట్రంలోని వినియోగదారులకు విక్రయించనున్న మొత్తం విద్యుత్ 87,384 ఎంయూ మాత్రమే. మిగతా 10,934 ఎంయూ విద్యుత్‌ను డిస్కంలు ‘సాంకేతిక, వాణిజ్య నష్టాల (ఏటీ అండ్ సీ లాసెస్)’రూపంలో నష్టపోనున్నాయి. ఈ నష్టాల విలువ సుమారు రూ.6,057.43 కోట్లు కావడం గమనార్హం. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన ‘వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) 2025–26’లో వెల్లడించిన వివరాలు ఈ వాస్తవాలను స్పష్టం చేస్తున్నాయి. రూ.20,151 కోట్ల విద్యుత్ సబ్సిడీ అవసరం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం 2025–26లో రూ.65,849 కోట్లు వ్యయం కానుండగా.. ప్రస్తుత విద్యుత్ చార్జీలతో డిస్కంలకు రూ.45,698 కోట్లే ఆదాయం అందుతుంది. అయినా విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. దీనితో మిగిలిన రూ.20,151 కోట్ల ఆదాయ లోటును భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచక తప్పదని.. లేకుంటే డిస్కంలు గట్టెక్కే అవకాశాలు ఉండవని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ.64,227 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న డిస్కంలు ఆర్థికంగా మరింత కుంగిపోతాయని పేర్కొంటున్నాయి.భారీగా పెరిగిన కాస్ట్ ఆఫ్ సర్విస్! విద్యుత్ కొనుగోలు చేసేందుకు డిస్కంలు మొత్తంగా రూ. 50,572 కోట్లను ఖర్చు చేయనున్నాయి. అంటే విద్యు దుత్పత్తి కంపెనీలకు ఒక్కో యూనిట్‌కు సగటున రూ.5.54 చెల్లించనున్నాయి. అయితే వినియోగదారులకు సరఫరా చేసేసరికి వ్యయం యూనిట్‌కు రూ.7.54కు చేరుతోంది. ఇలా విద్యుత్‌ను వినియోగదారులకు చేర్చే సరికి అయ్యే వ్యయాన్ని విద్యుత్ రంగ పరిభాషలో ‘కాస్ట్ ఆఫ్ సర్విస్’అంటారు. విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, పర్యవేక్షణ వ్యయాలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, ఇతర వ్యయాలన్నీ ఇందులో కలసి ఉంటాయి. అంటే సగటున ఒక్కో యూనిట్‌కు రూ.2 చొప్పున పెరిగిపోయినట్టు కాస్ట్ ఆఫ్ సర్విస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎనీ్పడీసీఎల్) కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఏకంగా యూనిట్‌కు రూ.8.28గా ఉండటం ఆందోళనకరమని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కాస్ట్ ఆఫ్ సర్విస్ యూనిట్‌కు రూ.7.26గా ఉండటం గమనార్హం. -
కరెంటు చార్జీలు పెరగవు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో సైతం విద్యుత్ చార్జీలు పెరగవు. ప్రస్తుత చార్జీలనే యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ మేరకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలు 2025–26ను మంగళవారం ఈఆర్సీకి సమర్పించాయి. డిస్కంల అంచనాల ప్రకారం 2025–26లో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల ఖర్చులు కలిపి మొత్తం రూ.65,849 కోట్ల వ్యయం కానుంది. అందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.50,572 కోట్ల వ్యయం కానుండగా, నిర్వహణ, పర్యవేక్షణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు కలిపి మిగిలిన వ్యయం కానుంది. అయితే, ప్రస్తుత చార్జీలతో రూ.45,698 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. దీంతో విద్యుత్ చార్జీలు పెంచకపోతే రూ.20,151 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. అయితే, డిస్కంలు సమర్పించిన అంచనా ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన తర్వాత హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ సైతం జరపనుంది. అనంతరం వాస్తవికతకు దగ్గరగా ఉండేలా డిస్కంల అంచనాలను సవరిస్తూ ఆమోదించనుంది. ఒకవేళడిస్కంల ఆదాయ లోటు రూ.20,151 కోట్లు వాస్తవమేనని ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వంపై సబ్సిడీల భారం పడకుండా గతంలో ఈఆర్సీ.. డిస్కంల ఆదాయ లోటును తగ్గించి చూపించినట్టు విమర్శలున్నాయి. ఏటేటా నష్టాలు ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరిస్తే ఆ మేరకు మాత్రమే ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ నిర్ధారించడంతో డిస్కంల నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. 2023–24లో రూ.6,299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్ రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డిస్కంలకు రూ.11,499 కోట్ల సబ్సిడీలను చెల్లించేందుకు అంగీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి సబ్సిడీలను మరింతగా పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, విద్యుత్ టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించినా, హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులకు గ్రిడ్ సపోర్ట్ చార్జీలతోపాటు స్టాండ్ బై చార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలను మాత్రం సవరించాలని డిస్కంలు ఈఆర్సీని కోరినట్టు తెలిసింది. -
తెలంగాణ: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించలేదు. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ‘‘అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదు. స్థిర చార్జీలు రూ.10 యధాతధంగా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం.132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి రూపాయిన్నర రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచాం. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచాం.గృహ వినియోగదారులకు మినిమమ్ చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. ఆర్ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయి. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింది’ అని వివరాలు వెల్లడించారు.చదవండి: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు -
20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ డిమాండ్‌పై అశాస్త్రీయ, అవాస్తవిక అంచనాల ఆధారంగా గతంలో అడ్డగోలుగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లను విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. ఈ పీపీఏల ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ ఉండబోతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లలో కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాద విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. 2024–25లో 24వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండనున్న మిగులు విద్యుత్.. 2028–29 నాటికి 43 వేల ఎంయూలకు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నివేదించాయని గుర్తు చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పూర్తయితే మిగులు విద్యుత్ ఇంకా పెరిగిపోతుందన్నారు. కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే మిగులు విద్యుత్ మరింతగా పెరిగి రాష్ట్ర ప్రజలపై అనవసర భారం పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పీపీఏలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) అనుమతిచ్చిందని, ఇకపై కొత్త పీపీఏలకు అనుమతి విషయంలో పునరాలోచించాలని సూచించారు. 2024–25లో రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదిస్తూ ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పీడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పై బుధవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో పెద్ద సంఖ్యలో వక్తలు పాల్గొని మాట్లాడారు. పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలతో ప్రయోజనాలతోపాటే దుష్పరిణామాలూ ఉంటాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఓ నివేదిక ఇచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు తెలిపారు. అవసరానికి మించి ఈ ఒప్పందాలు చేసుకుంటే జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించడం/పూర్తిగా నిలుపుదల చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఒప్పందాలతో ఇప్పటికే రాష్ట్రానికి ఏటా రూ.500 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 2022–23లో ఏకంగా రూ.5596 కోట్ల చార్జీలను పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించిందన్నారు. వాస్తవానికి ఏటా రూ.3వేల కోట్లకు పైనే చార్జీలు పెరుగుతాయన్నారు. జెన్కో థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలకు మరమ్మతు లేక ఉత్పత్తి తగ్గిందన్నారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్య ముందు తొలుత టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తమ ప్రతిపాదనలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 28న ఈఆర్సీ కొత్త టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించనుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇలా అయితే పరిశ్రమలు తరలిపోతాయి హెచ్‌టీ కేటగిరీలోని 33 కేవీ, 133 కేవీ వినియోగదారుల విద్యుత్ చార్జీలను 11 కేవీ వినియోగదారులతో సమానంగా పెంపుతోపాటు కొత్తగా స్టాండ్‌బై చార్జీలు, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు, అన్‌బ్లాకింగ్ చార్జీల ప్రతిపాదనలను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ), తెలంగాణ ఐరన్, స్టీల్ మ్యానుఫాక్టర్స్ అసోసియేషన్, ఏపీ, టీజీ ప్లాస్టింగ్ మాన్యుఫాక్టరింగ్ అసోసియేషన్లు వ్యతిరేకించాయి. ఇలా అయితే రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్‌కు సమానంగా తమ విద్యుత్ చార్జీలను తగ్గించాలని దక్షిణమధ్య రైల్వే సీఈ కె.థౌర్య విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులపై వక్తల ఆగ్రహంవ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతుల కోసం రవాణా చేసేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై భారతీయ కిసాన్ సంఘ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది రాకపోవడంతో రైతులే మరమ్మ తులకు ప్రయత్నించి విద్యుదాఘాతంతో మరణిస్తున్నా రన్నారు. విద్యుత్ సిబ్బంది అవినీతి, అక్రమాలు, వేధింపులపై ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. పాడి పరిశ్రమను వ్యవసాయ కేటగిరీ కింద చేర్చి ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తాం: మధుసూదనాచారితెలంగాణలో 2015–23 మధ్య కాలం కరెంట్ విషయంలో స్వర్ణ యుగమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గత ప్రభుత్వం చార్జీలు పెంచలేదన్నారు. చార్జీల పెంపుతో పరిశ్రమలు తరలిపోతాయని, మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1220 కోట్ల చార్జీలను పెంచకుండా ప్రభుత్వమే అదనపు సబ్సిడీ ఇవ్వాలన్నారు.అక్కడికక్కడే ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జైన్ తిరుమలాపూర్లో పొలం వద్ద విద్యుదాఘాతంతో 2022 మార్చి 28న పరగోల యాదయ్య చనిపోయాడు. బహిరంగ విచారణలో ఫిర్యాదు రాగా, అక్కడిక్కడే సీఎండీ రూ.5 లక్షల చెక్‌ను యాదయ్య భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు, సభ్యులు మనోహర్, కృష్ణయ్య, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా ‘లైన్’ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, అదనపు లోడ్ సామర్థ్యం మంజూరీకి ఇకపై సర్వీసు లైన్ చార్జీల పేరుతో కొత్త చార్జీలను వసూలు చే యనున్నారు. కనెక్షన్ లోడ్ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కి ఈ చార్జీ లను చెల్లించాల్సి ఉంటుంది. కోరిన వారికి కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ విద్యు త్ పంపిణీ సంస్థ (డిస్కం)ల బాధ్యత కాగా, అందుకు అవసరమైన విద్యుత్ లైన్ లేదా ప్లాంట్ ఏర్పాటుకు చేసే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ఈ లైన్ చార్జీలను వసూలు చేయనున్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ప్రకటించి ఈ నె ల 24లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. లోడ్ సామర్థ్యం, కనెక్ష న్ కేటగిరీ, కనెక్షన్ జారీకి డిస్కంలు చేసే సగటు వ్యయం ఆధారంగా కొత్త కనెక్షన్ల చార్జీలను నిర్ణయించాలని రాష్ట్రాల ఈఆర్సీలకు గతంలో కేంద్రం సూచన చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్) రూల్స్ 2020ను ప్రకటించింది. ప్రతి కనెక్షన్ కోసం సైట్‌ను సందర్శించి డిమాండ్ చార్జీలను అంచనా వేయడానికి బదులుగా ఈ పద్ధతిని పాటించాలని కోరింది. కేంద్రం సూచనల మేరకు లైన్ చార్జీల వసూళ్లకు అనుమతించాలని డి స్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ఈ మేరకు ముసాయిదాను ప్రకటించింది. కనెక్షన్ లోడ్ సామర్థ్యంలోని ప్రతి కిలోవాట్ లోడ్‌కి కొంత మొత్తం చొప్పున ఈ చార్జీలను విధిస్తారు. కొత్త కనెక్షన్ జారీకి ప్రత్యేకంగా విద్యుత్ లైన్ వే యాల్సిన అవసరం ఉన్నా, లేకున్నా ఈ కింద పేర్కొన్న మేరకు సర్వీసు లైన్ చార్జీలను వసూలు చేయాలని ఈఆర్సీ ప్రతిపాదించింది. అభ్యంతరాలు, సలహాలు తీసుకున్న తర్వాత ఈఆర్సీ తుది ఆదేశాలు జారీ చేయనుంది. ప్రస్తుత చార్జీలకు అదనంగా కొత్త చార్జీలుకొత్త విద్యుత్ కనెక్షన్ కోసం భూగర్భ కేబుల్ లైన్ వేయాల్సిన అవసరం వస్తే పైన పేర్కొన్న సంబంధిత కేటగిరీ చార్జీలతో పోలిస్తే దరఖాస్తుదారుల నుంచి 2.5 రెట్ల రుసుమును అధికంగా వసూలు చేస్తారు. కొత్త కనెక్షన్ల జారీకి ఇప్పటికే వసూలు చేస్తున్న దరఖాస్తు ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీలకు అదనంగా ఈ సర్వీసు లైన్చార్జీలను వసూలు చేయనున్నారు. హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ కోసం కొత్త లైన్లను వేయాల్సి వస్తే అందుకు కానున్న వ్యయాన్ని డిస్కంలు అంచనా వేసి దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీ సూచించింది. -
కర్నూలు నుంచి ‘ఏపీఈఆర్సీ’ కార్యకలాపాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు శనివారం నుంచి కర్నూలులో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉంటుందనే గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో ఒకరోజు ముందుగానే ఏపీఈ ఆర్సీ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించింది. ఈఆర్సీ భవనంతోపాటు ఓ అతిథి గృహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.23 కోట్ల నిధులు అందించింది. ఈ నిధులతో 15 వేల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. మరో 5 వేల చదరపు అడుగుల్లో గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని ఈనెల 23న ప్రారంభించారు. శనివారం నుంచి అందులో అధికారికంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. పాతికేళ్ల క్రితం పుట్టిన ‘మండలి’1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, మండలి మాత్రం ఇన్నాళ్లూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం.. అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఏపీఈఆర్సీకి ఒక చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు.వీరి తరువాత ఒక డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, ఆ తరువాత జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా తమ ఆ«దీనంలోని ఫైళ్లను తరలించేందుకు సిద్ధంచేసి భద్రపరచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ ఆదేశించింది. అలాగే, ఉద్యోగులు తమ నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లుచేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా సూచించింది. అన్ని పనులు పూర్తవడంతో సిబ్బందితో పాటు ఫైళ్లు, సామగ్రి కర్నూలుకు తరలివెళ్లాయి.ఏపీఈఆర్సీ ఏం చేస్తుందంటే..విద్యుత్ చట్టంలోని సెక్షన్–86 ద్వారా కమిషన్‌కు పలు విధులను నిర్దేశించారు. అవి ఏమిటంటే.. ⇒ విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం మండలి లక్ష్యం. ⇒ ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లో ఓపెన్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, ఇంట్రా–స్టేట్ ట్రేడింగ్, పవర్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యుత్ అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తీసుకురావడం వంటివి చేయాలి. ⇒ రాష్ట్రంలో పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. ⇒ రాష్ట్రంలో కార్యకలాపాలకు సంబంధించి ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డి్రస్టిబ్యూషన్ లైసెన్సులు, విద్యుత్ వ్యాపారులుగా వ్యవహరించాలనుకునే వారికి లైసెన్స్‌లను జారీచేస్తుంది. ⇒ పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో దాని శాతాన్ని నిర్ణయిస్తుంది. ⇒ డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్యనున్న వివాదాలపై విచారణ జరిపి తీర్పుల ద్వారా పరిష్కరిస్తుంది. ⇒ వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించడంపై ప్రభుత్వానికి సలహాలివ్వడం వంటివి కమిషన్ చేస్తుంది. ⇒ అలాగే, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైంది. -
సబ్సిడీ ఇచ్చాకే ‘జీరో బిల్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సబ్సిడీ నిధులను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విడుదల చేయాలని.. అలా చేస్తేనే వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం–2003లోని నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ‘గృహజ్యోతి’ పథకానికి షరతులతో ఆమోదం తెలిపింది. ముందుగా ఇవ్వాలి.. లేదా రిఫండ్ చేయాలి.. అర్హులైన పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు జీరో బిల్లుల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం ప్రకారం.. ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది. ఫ్రంట్ లోడెడ్ విధానంలో.. డిస్కంలు బిల్లింగ్ చేపట్టడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని వివరించింది. సకాలంలో రాబట్టుకోవాలి.. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈఆర్సీ ఆమోదించింది. ఒక నెలకు సంబంధించి అందాల్సిన సబ్సిడీ వివరాలను తదుపరి నెల 20వ తేదీలోగా డిస్కంలు అందజేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మార్గదర్శకాల్లో ఇంధన శాఖ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదనలను కూడా సత్వరమే సమర్పించాలని కోరింది. -
గడువు పొడిగించేది లేదు
సాక్షి, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించేది లేదంటూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఝలక్ ఇచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి డిస్కంల వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతి పాదన లు సమర్పించేందుకు జనవరి 31తో గడువు ముగిసింది. మరో మూడు నెలలు పొడిగించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తోసిపుచ్చింది. మల్టీ ఈయర్ టారిఫ్(ఎంవైటీ) రెగ్యులేషన్స్ ప్రకారం సత్వరమే ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కంలకు ఆదేశించింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే డిస్కంలపై రోజుకు రూ.5000 చొప్పున జరిమానా విధించాలని ఎంవైటీ రెగ్యులేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు ప్రతి ఏటా నవంబర్ 31లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. దాని ఆధారంగా వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలి? దానికి ఎంత అవుతుంది ? ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌తోనే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తే వచ్చే ఆదాయం ఎంత? అవసరమైన ఆదాయం, వచ్చే ఆదాయం మధ్య ఉండే వ్యత్యాసం(ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా, మిగిలే ఆదాయలోటు భర్తీ చేసేందుకు ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి ? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ సంవత్సరంలో వసూలు చేయాల్సిన విద్యుత్ టారి ఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల పట్టిక ఇందులో ఉంటుంది. గతేడాది నవంబర్ 31లోగా ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల పేరుతో అప్పట్లో డిస్కంలు డిసెంబర్ 2 వరకు గడువు పొడిగింపు పొందాయి. విద్యుత్ టారీఫ్ ఖరారుకు సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలతో మల్టీ ఈయర్ టారిఫ్ రెగ్యులేషన్స్‌ను ఆ తర్వాత కాలంలో ఈఆర్సీ ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శ కాలపై అధ్యయనం జరిపి ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 31వరకు రెండోసారి గడువు పొడిగించింది. డిస్కంల యాజమాన్యాలు తర్జనభర్జన రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులను సీఎండీలుగా నియమించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతించినట్టు తప్పుడు సంకేతాలు పోతాయని ప్రభుత్వవర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగినట్టు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రతిపాదనలు సమర్పించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
‘కరెంట్’ వడ్డన ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇచ్చిన గడువు జనవరి 2తో ముగియనుంది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) అంచనాలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని డిస్కంలు విజ్ఞప్తి చేయగా.. ఈఆర్సీ జనవరి 2 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కంలు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో జనవరి 30వరకు మరోసారి గడువు పొడిగించాలని ఈఆర్సీని కోరేందుకు డిస్కంల యాజమాన్యాలు సిద్ధమైనట్టు తెలిసింది. టారిఫ్ ప్రతిపాదనల్లో ఏం ఉంటాయంటే..? 2024–25లో రాష్ట్రంలో మొత్తం ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది? అందుకు ఎన్ని రూ.వేల కోట్ల ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2024–25లో కొనసాగిస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ నిధులు ఎంత, ఇంకా ఎంత లోటు ఉంటుంది? ఆ లోటును పూడ్చుకోవడానికి 2024–25లో ఏయే కేటగిరీల వినియోగదారుల చార్జీలను ఎంతమేర పెంచాలన్న అంశాలు డిస్కంల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా అభ్యంతరాలను సేకరించి, బహిరంగ విచారణ నిర్వహించి.. కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. రూ.30వేల కోట్లకు చేరిన ఆర్థిక లోటు 2022–23 నాటికి రాష్ట్రంలో డిస్కంల నష్టాలు రూ.62,461 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సగటున ప్రతి నెలా రూ. 1,386 కోట్లు లెక్కన మరో రూ.11,088 కోట్ల నష్టాలు వచ్చినట్టు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డిస్కంల నష్టాలు రూ. 73,549 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సిడీనే కొనసాగిస్తే.. 2024–25లో డిస్కంలకు కొత్తగా మరో రూ.16,632 కోట్ల నష్టాలు వస్తాయని అంచనా. నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.31,632 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉండనుంది. లేకుంటే లోటును భర్తీ చేసుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుంది. కొత్త సర్కారు ముందు సవాళ్లు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల నిర్వహణ సవాలుగా మారింది. విద్యుత్ సబ్సిడీలను ఏటా రూ.30వేల కోట్లకు పెంచడం లేదా ఏ ఏడాదికా ఏడాది లోటు భర్తీ చేసుకోవడానికి చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదే విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిస్తే విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ఉంది. దీంతో టారిఫ్ ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉచితంగా 200 యూనిట్లపైప్రతిపాదనలు సిద్ధం కాంగ్రెస్ సర్కారు హామీ మేరకు ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసే అంశాన్ని 2024–25 టారిఫ్ ప్రతిపాదనల్లో చేర్చడంపై డిస్కంలు కసరత్తు పూర్తిచేశాయి. 200యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు ఎందరు? వారికి ఉచిత విద్యుత్ కో సం అయ్యే వ్యయం ఎంత? అన్న గణాంకాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిని కోరనున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే.. ప్రభుత్వం అదనంగా రూ.3,500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
విశాఖలోనూ విద్యుత్ నియంత్రణ మండలి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడుతోంది. అక్కడి ప్రజలకు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) త్వరలో అందుబాటులోకి వస్తోంది. కొన్ని విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, కేసులను విశాఖ నుంచే ఏపీ ఈఆర్సీ పరిష్కరించనుంది. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న వినియోగదారులకు హైదరాబాద్‌కు, భవిష్యత్‌లో కర్నూలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖలోనూ కార్యకలాపాలు మొదలుపెడుతోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీ ఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. విద్యుత్ నియంత్రణ మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వస్తోంది. ప్రస్తుతం అనేక కేసుల్లో వాయిదాలకు హాజరయ్యేందుకు విద్యుత్ సంస్థల అధికారులు, ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు తరచూ హైదరాబాద్‌లోని ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కనీసం రెండు, మూడు రోజులు ఏపీ ఈఆర్సీ అధికారులు రాష్ట్రంలో అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలూ పనిచేయాల్సిన అత్యవసర విభాగాల్లో విద్యుత్ శాఖ ప్రధానమైనది కావడంతో ప్రజలకు కూడా దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై ఈ పరిస్థితిలో చాలా వరకూ మార్పు రానుంది. కర్నూలులో ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ఈ ఏడాది ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు అక్కడ భవన నిర్మాణం జరుగుతోంది. షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల వంటి కార్యకలాపాలను మాత్రమే విశాఖపట్నం నుంచి నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 18న ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో ఏపీ ఈఆర్సీ క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర విద్యుత్ సంస్థలు తయారు చేసిన ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్‌పై ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ విచారణ విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరిగింది. అయితే.. ఇది ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చిన నివేదికలపై జరిగిన విచారణ. ఇదే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వేసిన పిటిషన్లపై కూడా కమిషన్ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. నవంబర్ 4న క్యాంపు కార్యాలయంలో ఒకేరోజు 9 పిటిషన్లపై బహిరంగ విచారణ చేపట్టనుంది. షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఏపీఈఆర్సీ తాజాగా విడుదల చేసింది. -
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
ఈఆర్సీ నిర్ణయంపై జగదీష్ రెడ్డి ఫైర్.. అదానీకే లాభం అంటూ..
సాక్షి, సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈఆర్సీ(Electricity Regulatory Commission) నిర్ణయంపై జగదీష్ రెడ్డి ఫైరయ్యారు. ప్రజలకు విద్యుత్ దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మంత్రి జగదీష్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఈఆర్ఎసీ అదానీకే లాభం. కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కావు. ప్రజలను పీల్చి పిప్పి చేసే నల్ల చట్టాలు. సంస్కరణల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ప్రజల డబ్బు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గం చేస్తోంది. దేశ సంపదను ఒక్కరిద్దరికే కట్టబెట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి అదానీకి మేలు చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తుంది. దేశంలో సొంత బొగ్గువనరులు ఉండగా కేంద్రం విదేశీ బొగ్గు ఎందుకు తెస్తుంది. అదానీ విదేశీ బొగ్గుని బలవంతంగా రాష్ట్రాలకు కేంద్రం అమ్మిస్తున్నది. విదేశీ బొగ్గుతోనే విద్యుత్ సమస్య ఏర్పడనుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న ఉచిత ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. రైతులకు సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ అందిస్తుంటే అది కేంద్రానికి కడుపు మంటగా ఉందని ఆరోపణలు చేశారు. -
లోన్ వస్తే ట్రాన్స్‘ఫార్మర్ల’కు మీటర్లు! వివరణ ఇచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈ ఆర్సీ)కి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వివరణ ఇచ్చింది. మీటర్ల ఏర్పాటు కోసం రూ.93 కోట్ల రుణమివ్వాలని గతేడాది జూలై 22న గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ)కు ప్రతిపాదనలు పంపామ ని.. ఆ రుణం మంజూరయ్యాక మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే దీనిపై ఆర్ఈసీ నుంచి ఇంకా స్పందన రాలేదని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు నిర్దేశిత గడువులోగా మీటర్లు బిగించి, వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించాలని గతంలో రాష్ట్ర ఈఆర్సీ ఆదేశించింది. ఈ అంశంలో పురోగతిని తెలియజేయాలని ఇటీవల ఈఆర్సీ కోరగా.. తాజాగా టీఎస్ఎస్పీడీసీఎల్ బదులిచ్చింది. తగ్గిన వ్యవసాయ విద్యుత్ వినియోగం రాష్ట్రంలో భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన నేపథ్యంలో కాల్వల కింద సాగు పెరిగి బోరుబావుల కింద వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర డిస్కంలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని వివరించాయి. ►దక్షిణ తెలంగాణలోని 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధవార్షికంలో 5,410 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగ గా.. 2022–23తొలి అర్ధవార్షికంలో 5,105 ఎంయూల వినియోగం జరిగిందని టీఎస్ఎస్పీడీసీఎల్ తెలిపింది. తమ సంస్థ పరిధిలో దాదాపు 6% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని తెలిపింది. 2023– 24లో ఎత్తిపోతల పథకాల వినియోగం 105% పెరగనుందని అంచనా వేసింది. ►ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధ వార్షికంలో 2,938 ఎంయూల వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగగా.. 2022–23 తొలి అర్ధ వార్షికంలో 2,809 ఎంయూల వినియోగం మాత్రమే జరిగిందని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) తెలిపింది. తమ సంస్థ పరి ధిలో దాదాపు 4% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని ఈఆర్సీకి నివేదించింది. ఉత్తర తెలంగాణలో 2023–24లో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 287% పెరగనుందని అంచనా వేసింది. ►2023–24కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో వ్యవసాయ విద్యుత్ అవసరాల అంచనాలను తగ్గించడంపై ఈఆర్సీ వివరణ కోరగా.. డిస్కంలు ఈ వివరాలు ఇచ్చాయి. -
Telangana Electricity Bill: ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్ కట్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లు చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఎడాపెడా విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఎడాపెడా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారు. వ్యక్తిగత, వృత్తిపర జీవితాల్లో బిజీగా ఉండడం, ఇంకా సమయముంది కదా.. తర్వాత చెల్లిద్దామనుకుని మరిచిపోవడం వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోతున్నారు. ఇంతకుముందు నెల, రెండు నెలలు ఆలస్యమైతే క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఇతర సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి బిల్లు కట్టమని గుర్తు చేసేవారు. గత రెండు మూడు నెలలుగా ఒక్కరోజు ఆలస్యమైనా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బిల్లు చెల్లిస్తాం.. గంటసేపు ఆగమని కోరినా ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఆర్సీ మార్గదర్శకాల వక్రీకరణ గడువులోగా బిల్లు చెల్లింపులో విఫలమైతే ఏడు రోజుల గడువుతో నోటీసు జారీ చేసి, ఆ తర్వాత కూడా చెల్లించకపోతేనే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఈఆర్సీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘విద్యుత్ బిల్లుల చెల్లింపు, గడువులోగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపునకు మార్గదర్శకాలు’ పేరుతో ఈఆర్సీ 2002 అక్టోబర్ 16న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కనెక్షన్ తొలగింపునకు ముందు వినియోగదారులకు ఏడు రోజుల సమయం ఇవ్వడమే నోటీసు ఉద్దేశం. ఒకవేళ బిల్లు చెల్లించినా సాంకేతిక/సిబ్బంది తప్పిదాలతో చెల్లించలేదని రికార్డుల్లో నమోదైతే సంజాయిషీ ఇచ్చుకోవడానికి వినియోగదారులకు తగిన సమయం లభిస్తుంది. అత్యవసర సేవల కింద వచ్చే విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి నోటీసు ఇవ్వకుండా కనెక్షన్ తొలగించడం సరైంది కాదని ఈ నిబంధనలను ఈఆర్సీ పెట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మాత్రం ఈ మార్గదర్శకాలను వక్రీకరించి వినియోగదారులకు ‘బిల్ కమ్ నోటీసు’పేరుతో ప్రతి నెలా జారీ చేసే బిల్లులోనే ముందస్తుగా నోటీసును సైతం పొందుపరుస్తున్నాయి. బిల్లులోనే నోటీసు ఉందన్న విషయం సాధారణ వినియోగదారులకు అర్థం కాదు. కేవలం ఈఆర్సీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్టు చూపడానికే డిస్కంలు ‘బిల్ కమ్ నోటీసు’పద్ధతిని అవలంబిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లు బకాయిలు, డిస్కనెక్షన్, రీకనెక్షన్ చార్జీలను చెల్లించిన తర్వాత పట్టణాల్లో 4 గంటల్లోగా, గ్రామాల్లో 12 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే, బిల్లు కట్టిన తర్వాత సకాలంలో సరఫరాను పునరుద్ధరించడం లేదని అంటున్నారు. అయితే, కనెక్షన్ తొలగించడంపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఓ అధికారి తెలిపారు. స్థానికంగా కొందరు సిబ్బందికి, వినియోగదారులతో ఏదైనా ఘర్షణ వాతావరణం ఎదురైతే తొందరపాటుతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిల్లుల వసూళ్ల కోసం తీవ్ర ఒత్తిడి భారీగా విద్యుత్ చార్జీలను పెంచినా డిస్కంలు నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగు నెలలుగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారు. 100శాతం కనెక్షన్లకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలని, 100శాతం బిల్లులు వసూలు చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో డీఈలకు లక్ష్యాలను నిర్దేశించాయి. ప్రతి నెలా 100శాతం బిల్లులు జారీచేసినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే జీతాలు చెల్లిస్తామని లింకు పెట్టాయి. దీంతో ఒత్తిడి పెరగడంతో వసూళ్లను పెంచేందుకు ఎడాపెడా కనెక్షన్లను తొలగిస్తున్నారని విమర్శలున్నాయి. బిల్లు వసూళ్ల కోసం ఇళ్లకు వస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహార తీరు అవమానకరంగా ఉంటోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మీటర్లు పెట్టాలని ఆదేశించలేదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ఈఆర్సీ ఆదేశించిందని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను కచ్చితంగా తెలుసుకోవడానికి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశించామన్నారు. ఈఆర్సీ సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యతో కలసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి రఘునందన్‌రావు ఆరోపణలను ఖండించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించాలని జారీ చేసిన ఆదేశాలను రఘునందన్‌రావుకు పంపానని, అయినా మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థ ఈఆర్సీకి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. మహారాష్ట్రలోని ఒక విద్యుత్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి కచ్చితమైన వినియోగంపై అధ్యయనం చేశారని, రూ.36 కోట్ల విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు అదనంగా పొందాయని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. తెలంగాణ సైతం ఇలాంటి ప్రయోగం చేయాలన్న ఆలోచన ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. త్వరలో జిల్లాలకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ వినియోగదారులకు హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకోవడానికి విద్యుత్ రెగ్యులేటరీ కమి షన్ అన్ని జిల్లాల్లో పర్యటించనుందని శ్రీరంగారావు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం కామారెడ్డి జిల్లాలో, మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనుందన్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా కన్జ్యూమర్ గ్రివెన్స్ రిడ్రస్సల్ ఫోరంకు పంపవచ్చని, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ఈఆర్సీని ఆశ్రయించవచ్చని సూచించారు. -
విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సి) భవనంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ విచారణ నిర్వహించనుంది. 2022–23లో రూ.6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం తెలిసిందే. బహిరంగ విచారణలో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుంది. -
పీపీఏ ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి లేదు
సాక్షి, అమరావతి: అత్యంత పారదర్శకంగా, చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) సమీక్షించి, వాటి ధరలను సవరించే అధికారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లేదని సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పీపీఏలను సమీక్షిస్తూ పోతుంటే పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లుతుందని, దీని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన సౌరవిద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సౌరవిద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. పీపీఏల కింద ధరలను ఖరారు చేసేది ఈఆర్‌సీయేనని, ఆ సంస్థ ఖరారు చేసిన ధరలను తిరిగి ఆ సంస్థే సవరించడానికి అవకాశంలేదని చెప్పారు. పీపీఏ నిబంధనల ప్రకారం ధరలను సవరించే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కం) లేదని, దీంతో అవి ఈఆర్సీ ముందు పిటిషన్ వేసి దాని ద్వారా ధరలను సవరించాలని చూస్తున్నాయని తెలిపారు. ఈ వాదనలను డిస్కంల తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తోసిపుచ్చారు. ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు. అందుకే పీపీఏ ధరలను ఈఆర్సీ వద్దే తేల్చుకోవాలని సింగిల్ జడ్జి స్పష్టం చేశారని చెప్పారు. కోర్టు సమయం ముగియడంతో పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. -
ఈఆర్సీ కార్యాలయంలోకి ప్రవేశంపై నిషేధాజ్ఞలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కార్యాలయంలోకి సందర్శకుల ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించారు. ఆఫీసులోకి ప్రవేశించాలనుకునేవారు తమ వివరాలను సెక్యూరిటీ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఈఆర్సీ కార్యదర్శి అనుమతి ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు చెప్పారు. పని వేళల్లో సందర్శకులు అధికారులను కలవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ, అవసరాల అంచనాల(ఏఆర్ఆర్ల)ను ఈఆర్సీకి గురువారం రహస్యంగా సమర్పించాయి. 2018–19లో అమలుచేయనున్న విద్యుత్ చార్జీల వివరాలనూ వీటితోపాటు పొందుపరిచాయి. ఏఆర్ఆర్ నివేదికలు, విద్యుత్ చార్జీల వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ కరెంటొచ్చేసింది
⇒ ప్రయోగాత్మకంగా సరఫరా ప్రారంభం ⇒ రెండు మూడు రోజుల్లో అధికారికంగా సరఫరా ⇒ పీపీఏపై ఇంకా నిర్ణయం వెలువరించని తెలంగాణ ఈఆర్సీ ⇒ యూనిట్‌కు రూ.3.90గా ఖరారు చేసిన ఛత్తీస్ ఈఆర్సీ ⇒ తుది ధర రూ.4.50 వరకు ఉంటుందంటున్న నిపుణులు ⇒ అప్పటి వరకు లాభనష్టాలపై కొనసాగనున్న సస్పెన్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ కరెంటొచ్చేసింది! పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఎల్) నిర్మించిన వార్ధా(మహారాష్ట్ర)–డిచ్పల్లి(నిజామాబాద్) 765 డీసీ విద్యుత్ కారిడార్ ద్వారా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాష్ట్రానికి ఈ విద్యుత్ సరఫరా అవుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను బట్టి వార్ధా–డిచ్పల్లి గ్రిడ్ నుంచి 650 మెగావాట్ల నుంచి 700 మెగావాట్లను తెలంగాణ ట్రాన్స్‌కో డ్రా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు కరెంట్ సరఫరా ఉండడంతో ఎన్టీపీసీ కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ తీసుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన వార్ధా–డిచ్పల్లి లైన్ల చార్జింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతమరో రెండు మూడ్రోజుల్లో అధికారిక సరఫరా ప్రారంభమవుతుందని తెలంగాణ ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ) నుంచి ఇందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. వాదోపవాదాలే.. ఇంకా తేలని ధర.. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు–విపక్షాలు, విద్యుత్ రంగ నిపుణుల నడుమ గత రెండున్నరేళ్లుగా ఎన్నో వాదోపవాదాలు, ఆరోపణలు, విమర్శలకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కేరాఫ్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యుత్ సరఫరా ప్రారంభమైనా ధరపై ఇంత వరకు కచ్చితత్వం లేదు. తుది ధరను ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ప్రకటించిన తర్వాతే విద్యుత్ కొనుగోళ్ల ద్వారా తెలంగాణకి లాభమో నష్టమో అన్న అంశాలపై స్పష్టత రానుంది. ఛత్తీస్‌గఢ్‌లో 2017–18లో అమలు చేయాల్సిన విద్యుత్ టారీఫ్ ఉత్తర్వులను తాజాగా ఆ రాష్ట్ర ఈఆర్సీ జారీ చేసింది. మార్వా థర్మల్ ప్లాంట్ విద్యుత్‌కు సంబంధించి తాత్కాలిక ధరను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. వార్షిక స్థిర చార్జీలు రూ.1871.72 కోట్లు, పీ అండ్ జీ కాంట్రిబ్యూషన్ రూ.19.13 కోట్లు, చర వ్యయం యూనిట్‌కు రూ.1.20గా అమలు చేయాలని సూచించింది. ఈ గణాంకాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ తాత్కాలిక ధర యూనిట్‌కు రూ.3.90 కానుంది. ఛత్తీస్ విద్యుత్ తుది ధర కూడా యూనిట్‌కు రూ.3.90కు మించదని, పీజీసీఎల్ ట్రాన్స్మిషన్ చార్జీలు కలుపుకుంటే రూ.4.30 నుంచి రూ.4.40 లోపు ఉంటుందని ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన ‘సీటీయూ’ట్రాన్స్మిషన్ చార్జీలు, ట్రేడింగ్ మార్జిన్‌ను మినహాయించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించడంతో రాష్ట్రంపై పడే భారం కొంతవరకు తగ్గిందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మార్వా విద్యుత్ కేంద్రం 2008లో రూ.4,735 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభం కాగా.. నిర్మాణం పూర్తయ్యేసరికి వాస్తవ వ్యయం రూ.8214.45 కోట్లకు ఎగబాకింది. పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లు కలుపుకుంటే నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.9 కోట్ల వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేసే తుది ధర యూనిట్‌కి రూ.4.50 నుంచి రూ.5.00 వరకు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పీజీసీఎల్, ఇతర ట్రాన్స్మిషన్ చార్జీలు కలుపుకుంటే విద్యుత్ రాష్ట్రానికి చేరే సరికి యూనిట్‌కు రూ.5.50 వరకు ఖర్చు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే విద్యుత్ ధర యూనిట్‌కి రూ.3.90 కంటే మించొద్దని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించామని ట్రాన్స్‌కో పేర్కొంటోంది. త్వరలో తేల్చండి.. ఈఆర్సీకి ట్రాన్స్‌కో లేఖ ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ(సీఎస్‌పీజీసీఎల్) నిర్మించిన 1000 మెగావాట్ల మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకుంది. టెండర్లకు బదులు పరస్పర అంగీకార ఒప్పందం(ఎంఓయూ) ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్రం ఏటా రూ.1000 కోట్ల భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అభ్యంతరాలపై ఏడాది కింద బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ... ఈ పీపీఏపై ఇంత వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా ప్రారంభమైన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ పీపీఏపై సత్వర నిర్ణయం తీసుకోవాలంటూ ట్రాన్స్‌కో శనివారం టీఎస్ఈఆర్సీకి లేఖ రాసింది. -
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు!
నేడు ఈఆర్సీకి సమర్పించనున్న డిస్కంలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు గురువారం సమర్పించే అవకాశముంది. మూడుసార్లు గడువు పొడిగించినా డిస్కంలు టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించకపో వడంపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఈ నెల 17న అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23లోగా 2017–18 ఆర్థిక ఏడాదికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాద నలు సమర్పించకపోతే సుమోటోగా నిర్ణయం తీసుకుంటామని డిస్కంలకు ఈఆర్సీ లేఖ రాసింది. దీంతో గడువు ముగిసేలోపే విద్యు త్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేం దుకు డిస్కంలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఆదాయ లోటు రూ.9,824 కోట్లు ఉండనుందని, అందులో రూ.2 వేల కోట్లను చార్జీల పెంపు ద్వారా ప్రజల నుంచి రాబట్టుకోవాలని, మిగిలిన రూ.7,800 కోట్లను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాలని నెల రోజుల కిందే డిస్కంలు సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదిం చాయి. అయితే, ఇంతవరకు సీఎం ఆమోదం లభించ లేదు. గత వారం రోజులుగా చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఆయన ఆధ్వర్యంలో సీఎంను కలసి చార్జీల పెంపు నకు అనుమతి కోరాలని డిస్కంల యాజ మాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. సీఎంతో చర్చించిన తర్వాత ఆయన సలహాలు, సూచ నలు మేరకు మార్పు చేర్పులతో ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పి స్తామని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్ చట్టం నిబంధనల ప్రకారం గత నవంబర్‌లోగా సమర్పించాలని విద్యుత్ టారిఫ్ ప్రతిపాద నలను వివిధ కారణాలతో డిస్కంలు వాయిదా వేస్తూ వచ్చాయి. గడువు ముగిసిన తర్వాత కూడా ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో ఈఆర్సీ సుమోటోగా టారీఫ్ ప్రతిపాద నలను ఖరారు చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించే అవకాశ ముంది. -
విద్యుత్ చార్జీలను మేమే నిర్ణయిస్తాం
డిస్కంలకు ఈఆర్సీ హెచ్చరిక - టారిఫ్ ప్రతిపాదనలివ్వకపోవడంపై అసంతృప్తి - 23లోగా సమర్పించాలంటూ డెడ్‌లైన్ - వచ్చేయేడు డిస్కంల ఆదాయ లోటు రూ. 9,824 కోట్లు - రూ. 2 వేల కోట్ల చార్జీల పెంపునకు డిస్కంల విజ్ఞప్తి - సబ్సిడీని రూ. 8 వేల కోట్లకు పెంచాలని వినతి - ఎటూ తేల్చని రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పించకుండా పంపిణీ సంస్థ (డిస్కం)లు మూడు నెలలుగా తాత్సారం చేస్తున్నాయంటూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) సీరియస్ అయింది. మూడుసార్లు గడువు పొడిగించినా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 23లోగా ప్రతిపాదనలు సమర్పించకుంటే తమంత తాముగా (సుమోటో) నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు డిస్కంలకు లేఖ రాసింది. ‘‘2003 విద్యుత్ చట్టం ప్రకారం 2017–18 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలను 2016 నవంబర్ 30లోగా సమర్పించాల్సి ఉండగా ఏఆర్ఆర్ మాత్రమే సమర్పించాయి. పలు కారణాలు చూపుతూ పదేపదే టారిఫ్ ప్రతిపాదనల సమర్పణకు గడువు పొడిగింపు కోరాయి. మూడుసార్లు పొడిగించాం. చివరి పొడిగింపు గడువూ గత జనవరి 23తో ముగిసింది. అయినా ప్రతిపాదనల సమర్పణలో డిస్కంలు విఫలమయ్యాయి. మళ్లీ ఈ నెల 28 వరకు పొడిగింపు కోరాయి. దీనిపై మేం అసంతృప్తిగా ఉన్నాం. 23లోగా టారీఫ్ ప్రతిపాదించకపోతే నేషనల్ టారిఫ్ పాలసీలోని 8.1 (7) నిబంధన ప్రయోగించి సుమోటోగా నిర్ణయం తీసుకుంటాం. డిస్కంలు సమర్పించిన 2015–16, 2016–17, 2017–18 ఏఆర్ఆర్ నివేదికల్లోని సమాచారం ఆధారంగా 2017–18 రిటైల్ సప్లై టారిఫ్‌ను నిర్ణయిస్తాం’’ అని లేఖలో స్పష్టం చేసింది. ఫుల్ కాస్ట్ టారిఫ్ 2017–18లో రూ.9,824 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని డిస్కంలు ఇప్పటికే అంచనా వేశాయి. ఇందులో రూ.2 వేల కోట్లను చార్జీల పెంపు ద్వారా రాబట్టాలని, మిగతా రూ.7,800 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదించాయి. ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,500 కోట్ల విద్యుత్ సబ్సిడీలు కేటాయించారు. దీన్ని వచ్చే బడ్జెట్లో ఏకంగా రూ.8 వేల కోట్లకు పెంచాలని కోరడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. ప్రభుత్వ సబ్సిడీ ఎంతో తెలియక డిస్కంలు పదేపదే టారిఫ్ ప్రతిపాదనలను వాయిదా వేసుకుంటున్నాయి. గడువులోగా టారిఫ్ ప్రతిపాదించకపోతే ఈఆర్సీ సుమోటోగా మొత్తం రూ.9824 కోట్ల మేరకు (ఫుల్ కాస్ట్) చార్జీల పెంపు కోసం టారిఫ్ ప్రతిపాదించవచ్చు. అదే జరిగితే ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారనుంది. ఆదాయ లోటుపై అడ్డగోలు లెక్కలు ఏపీ డిస్కంలు సగటున యూనిట్‌కు రూ.5.95 విద్యుత్ సరఫరా వ్యయం ప్రతిపాదించగా రాష్ట్ర డిస్కంలు ఏకంగా రూ.6.84కు పెంచి ప్రతిపాదించాయి. 54,756 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముంటే, ఏకంగా 66,076 మిలియన్ యూనిట్ల లభ్యత ఉందని చూపాయి. సాగుకు ఉచిత సరఫరాను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచడం, ఇందుకోసం అవసరానికి మించిన విద్యుత్ సమీకరించి పెట్టుకోవడం, విద్యుత్ సరఫరా వ్యయాన్ని భారీగా పెంచి చూపడంతో డిస్కంల ఆదాయ లోటు పెరిగిందని నిపుణులంటున్నారు. -
ప్రజలపై ‘సౌర’ ధరాభారమా?
అధిక ధర పీపీఏల గడువు పెంచడంపై ఈఆర్సీ ధ్వజం సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుదుత్పత్తి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) పై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) తాజాగా కీలక ఆదేశాలిచ్చిం ది. 2012లో 1,000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం ప్రైవేటు సంస్థలతో కుదిరిన పీపీఏలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో నిర్మాణం పూర్తికానివి ఉంటే వాటి గడువును 2016 మార్చి 31 తర్వాత నుంచి పెంచడానికి వీల్లేదని ఆదేశించింది. సౌర విద్యుత్ ధరలు రోజురోజుకూ తగ్గుతున్నా గతంలో అధిక ధరకు కుదిరిన పీపీఏలకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణ గడువును టీఎస్ఎస్పీడీసీఎల్ పెంచడాన్ని ఈఆర్సీ తప్పుబట్టింది. ఇది రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపడమేనని మండిపడింది. 2014లో 500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి తెలంగాణ రాష్ట్రంలో కుదిరిన పీపీఏలకూ ఈ ఆదేశాలను వర్తింపజేసింది. 2012లో యూనిట్‌కు రూ.6.49 పలికిన సౌర విద్యుత్ ధరలు 2015 నాటికి రూ.5.17కు తగ్గడం, యూనిట్‌కు రూ. 4-4.50 ధరకే సౌర విద్యుత్‌ను విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈఆర్సీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 మార్చి 31 తర్వాత పూర్తై ప్రాజెక్టుల విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.17 నుంచి రూ.5.59 మధ్య ఉండాలని తేల్చి చెప్పింది.ఆలస్యమైన ప్రాజెక్టుల గడువు పెంచడమే కాకుండా త్వరగా నిర్మా ణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను ప్రకటించడాన్నీ ఈఆర్సీ తప్పుపట్టింది. త్వరగా పూర్తై ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు చెల్లించొద్దని ఆదేశించింది. -
కరెంటు బాదుడుకు బ్రేక్
చార్జీల పెంపునకు సీఎం ససేమిరా చివరి క్షణంలో వాయిదా పడిన పెంపు రూ.1,736 కోట్లకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చివరి క్షణంలో సీఎం కేసీఆర్ వ్యతిరేకించడంతో విద్యుత్ చార్జీల పెంపుపై పీటముడి పడింది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కొత్త టారీఫ్‌ను ప్రకటిస్తే వచ్చేనెల 1 నుంచి చార్జీల పెంపును అమలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సిద్ధమయ్యాయి. చార్జీల పెంపునకు సీఎం ఒప్పుకోకపోవడంతో మరోనెల పాటు వాయిదా పడే పరిస్థితి నెలకొంది. నష్టాలు తగ్గించుకోండి.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,958 కోట్ల చార్జీల పెంపు కోసం డిస్కంలు కొత్త టారీఫ్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన ఈఆర్సీ.. డిస్కంలు ప్రతిపాదించిన కొత్త టారీఫ్ పట్టికను యథాతథంగా అనుమతించింది. అయితే డిస్కంలు ప్రతిపాదించిన వార్షిక విద్యుత్ డిమాండ్‌లో 500 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను తగ్గించడంతో చార్జీల పెంపుతో ప్రజలపై పడే భారం రూ.1,736 కోట్లకు పరిమితమైంది. సీఎం ఆమోదముద్ర వేస్తే తక్షణమే కొత్త టారీఫ్ ప్రకటించేందుకు ఈఆర్సీ ఎదురుచూస్తోంది. అయితే సీఎం అనుమతించలేదు. డిస్కంలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నందున చార్జీల పెంపు తప్పదని, సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ 1999లో కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసేందుకు ఎట్టి పరిస్థితిలో అనుమతించేది లేదని ఆయన అధికార వర్గాలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం డిస్కంలు 14 శాతం నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవడం ద్వారా గట్టెక్కాలని సీఎం సూచించినట్లు సమాచారం. గృహాలకు మినహాయింపు ? మొత్తంగా విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ గృహ వినియోగదారులపై భారం మోపడానికి మరింత విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చార్జీల పెంపు నుంచి గృహ వినియోగదారులకు పూర్తిగా మినహాయించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, వ్యాపార రంగాలపై కొంత మేర చార్జీలను పెంచినా గృహ వినియోగదారులపై భారం వేయొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. గృహ కేటగిరీలో 0-100 యూనిట్ల మధ్య విద్యుత్ వాడకంపై గత పదేళ్లుగా యూనిట్‌కు రూ.1.45 మాత్రమే వసూలు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో బొగ్గు, ఇంధనం, రైల్వే రవాణా చార్జీలు భారీగా పెరగడంతో గృహ వినియోగదారులపై సైతం చార్జీలు పెంచక తప్పదని అధికారులకు సీఎంకు నివేదించారు. సీఎంను ఒప్పించి గృహ వినియోగంపై సైతం చార్జీలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘‘విద్యుత్ చార్జీల పెంపును సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపరుచుకొని నష్టాలను అధిగమించాలని ఆదేశించారు. డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉండడంతో చార్జీలు పెంచకతప్పదని సీఎంకు వివరించాం. సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. చార్జీలు పెంచకపోతే డిస్కంలు ఆర్థికంగా కుప్పకూలుతాయి’’ అని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు. -
విద్యుత్ బాదుడుకు ఈఆర్సీ ఒకే
► రూ.1400 కోట్ల చార్జీల పెంపునకు సమ్మతి ► సర్కారుకు చేరిన కొత్త టారిఫ్ ► పాలేరు ఉప ఎన్నిక తర్వాత పెంపు? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్త టారిఫ్ ఉత్తర్వులను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సిద్ధం చేసి ప్రభుత్వ అభిప్రాయం కోసం ఇంధన శాఖకు పంపింది. రూ.1,958 కోట్ల చార్జీల పెంపు కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈఆర్సీకి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లను సమర్పించడం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ అనంతరం స్వల్ప మార్పులతో కొత్త టారిఫ్‌ను ఈఆర్సీ ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చార్జీల పెంపు భారాన్ని దాదాపు రూ.1,400 కోట్లకు తగ్గించినట్టు సమాచారం. ఈ కొత్త టారిఫ్ ప్రతిపాదనలపై ప్రభుత్వం తీవ్రంగా తర్జనభర్జన పడుతోంది. ట్రాన్స్‌కో, డిస్కంల సీఎండీలు డి.ప్రభాకర్‌రావు, జి.రఘుమారెడ్డిలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించి టారిఫ్‌పై చర్చించినట్టు తెలిసింది. టారిఫ్‌లో కొన్ని మార్పుచేర్పులు సూచించాలని ప్రభుత్వం భావిస్తోంది. మే 16న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నందున కరెంటు చార్జీల పెంపును అప్పటిదాకా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. డిస్కంలు నిబంధనల మేరకు గత నవంబర్‌లోపే చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తే ఈ నెల 1 నుంచే పెంపు అమల్లోకి వచ్చేది. కానీ వరుసగా వరంగల్ లోక్‌సభ, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పురపాలికల ఎన్నికలు రావడంతో డిస్కంలు తమ ప్రతిపాదనలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. ఎన్నికల ఫలితాలపై చార్జీల పెంపు ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వరుసగా వాయిదాలను కోరగా ఈఆర్సీ కూడా అంగీకరించింది. పై ఎన్నికలు ముగిశాక మార్చిలో డిస్కంలు రూ.1,958 కోట్ల మేరకు చార్జీల పెంపును ప్రతిపాదించాయి. ఈ నెల 23న కొత్త టారీఫ్‌ను ఈఆర్సీ ప్రకటిస్తుందని, మే 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని భావించాయి. కానీ పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో చార్జీల పెంపుపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఆ ఎన్నిక ముగిశాక మే మూడో వారంలో ఈఆర్సీ నుంచి కొత్త టారిఫ్ ఉత్తర్వులు వస్తాయని, జూన్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
సజావుగా సాగేనా?
నేడు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ కరీంనగర్ : విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. విద్యు త్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. రిటైల్ సప్లయ్ టారిఫ్, క్రాస్ రాయితీ, అదనపు చార్జీల ప్రతిపాదనపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అసలే కరువు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతుండగా, చార్జీల పెంపు ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ సజావుగా సాగేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ అభిప్రాయ సేకరణలో విపక్షాలు, ఉద్యమ సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ మండలి తీరుపై ధ్వజమెత్తాలని నిర్ణయించినట్లు సమాచారం. ఓ వైపు కరువు తాండవం, అప్పులబాధతో రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాట ధర లేక, ఆరుతడి పంటలు సైతం చేతికందని స్థితిలో రైతులు నిరాశ నిస్పృహలతో ఉంటే విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి. నీళ్లు లేక విద్యుత్ మోటార్లను ఉపయోగించుకునే స్థితిలోనే రైతులు లేరని, ఇక చార్జీల పెంపు ఎందుకని ప్రశ్నించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం దినసరి విద్యుత్ కోటా 10.553 మిలియన్ యూనిట్లు ఉంటే 9.9952 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగమవుతోందని, డిమాండ్ తగ్గిందని పేర్కొంటున్నారు. -
ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ హై వోల్టేజీ షాక్ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. 2016-17 సంవత్సరానికి కొత్త టారీఫ్‌ను గురువారం విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్సీ) ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. తాజాగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలతో వినియోగదారులపై రూ.216 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ పెంపులో గృహ వినియోగదారులకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా కరెంట్ ఛార్జీల పెంపుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అప్పటివరకు పాత విద్యుత్ చార్జీలే: ఈఆర్సీ
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ టారీఫ్ ఆర్డర్ జారీ చేసే వరకు రాష్ట్రంలో ప్రస్తుత చార్జీలే అమల్లో ఉంటాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016-17కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) ను సమర్పించడంలో విద్యుత్ పంపణీ సంస్థ (డిస్కం) లు తీవ్ర జాప్యం చేయడంతో ఈ నెల 31 తేదీ లోపు కొత్త టారీఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ జారీ చేయలేకపోయింది. డిస్కంలు ప్రతిపాదించిన చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహించి కొత్త టారీఫ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే అమల్లో ఉంటాయని తాజాగా ఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
- విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన - 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు - 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 65 పైసల నుంచి 72 పైసలు పెంపు - 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి మంగళవారం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనలో.. 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని తెలుస్తోంది. 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 0.65 పైసల నుంచి 0.72 పైసలు అదనంగా పెరగనుంది. 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో 1958 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకోవాలనే దిశగా డిస్కంలు ప్రతిపాదించినట్టు తెలిసింది. 2016-17 సంవత్సరంలో సగటున యూనిట్‌కు 0.42 పైసలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. -
విద్యుత్ ఉద్యోగులపై ‘ఈఆర్సీ’ నియంత్రణ!
ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లవద్దని ఆదేశాలిచ్చిన ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలను ప్రశ్నిస్తూ విద్యుత్ ఉద్యోగులెవరూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని ఆశ్రయించవద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా ఈఆర్సీకి వెళితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. యాజమాన్యం నుంచి అనుమతి లేకుండా విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలపై ఈఆర్సీను సంప్రదించకుండా, ఈఆర్సీ ముందు హాజరుకాకుండా, ఈఆర్సీని ఆశ్రయించకుండా ఉండేలా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు తమ ఉద్యోగులను ఆదేశించాలని కోరుతూ ఈ నెల 9న ఈఆర్సీ కార్యదర్శి లేఖ రాశారు. విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీని ఆశ్రయిస్తే ‘ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్-1964’ను ఉల్లంఘించినట్లేనని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రామాణికంగా చూపుతూ ట్రాన్స్‌కో ఉద్యోగులెవరూ ఈఆర్సీతో సంప్రదింపులు జరపరాదని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా తమ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లకుండా సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వు ప్రతులను శుక్రవారం విద్యుత్ సౌధలో ఇంజనీర్లందరికీ అందజేశారు. -
మళ్లీ ఏఆర్‌ఆర్‌లు వాయిదా!
♦ ఐదోసారి గడువు పెంపు కోరిన డిస్కంలు ♦ ఈ నెల 20 వరకు పొడిగించాలని ఈఆర్సీకి లేఖ ♦ నేడు నిర్ణయించనున్న విద్యుత్ నియంత్రణ మండలి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనల సమర్పణకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి గడువు పెంపు కోరాయి. 2016-17కు సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను సమర్పించేందుకు సోమవారంతో గడువు ముగిసిపోగా.. ఈ నెల 20 వరకు మళ్లీ పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు తాజాగా విజ్ఞప్తి చేశాయి. దీనిపై మంగళవారం ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత భారం పంచుకోవాలి.. వచ్చే ఏడాది ఎన్ని నిధులు కేటాయించాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని డిస్కంలు భావిస్తున్నాయి. సీఎం ఖమ్మం పర్యటన తర్వాత ఏఆర్ఆర్లకు తుది రూపునిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయ్‌లో చేరితే రాష్ట్ర డిస్కంలపై ఉన్న రూ.12 వేల కోట్లకు పైగా అప్పుల భారంలో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 120 రోజుల నుంచి 40 రోజులకు.. ఏఆర్‌ఆర్‌లపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ, రిటైల్ టారీఫ్ ఆర్డర్ జారీ ప్రక్రియల కోసం కనీసం ఈఆర్సీకి 120 రోజుల సమయం ఉండాలని విద్యుత్ చట్టం పేర్కొం టోంది. ఈ లెక్కన గత నవంబర్‌తోనే ఏఆర్ఆర్ల దాఖలు గడువు ముగిసింది. ఉదయ్ పథకంలో చేరే అంశంపై నిర్ణయం కోసం ప్రభుత్వం వరుసగా నాలుగు సార్లు గడువు పొడిగింపు కోరింది. ఈ నెల 20 లోపు గడువు పొడిగిస్తే మాత్రం 40 రోజుల్లో ఈఆర్సీ ఏఆర్‌ఆర్‌లపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటిపై డిస్కంల వివరణ ఆ తర్వాత రిటైల్ టారీఫ్ ఆర్డర్ జారీ చేయాల్సి ఉంటుంది. -
‘ఛత్తీస్’ గండమే!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారడం ఖాయమని విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ, రాజకీయేతర పక్షాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. కనీస ధర నిర్ధారించకుండా నేరుగా ఒప్పందం ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఛత్తీస్‌గఢ్ డిస్కంలతో రాష్ట్ర డిస్కంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆమోదించవద్దని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మం డలి(ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై గురువారం ఈఆర్సీ ఇక్కడ బహిరంగ విచారణ నిర్వహించింది. అభిప్రాయ సేకరణ సాయంత్రం 4 వరకు సుదీర్ఘంగా సాగింది. వేల కోట్ల భారం.. ఈ విద్యుత్ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె.రఘు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం, ట్రాన్స్మిషన్ ఖర్చులు, పన్నుల ఆధారంగా లెక్కిస్తే... అక్కడి విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.50-రూ.5.75 వరకు ఉంటుందన్నారు. అదే టెండర్ల ద్వారా ఇటీవల యూనిట్‌కు ఏపీ డిస్కంలు రూ.4.23కు, తెలంగాణ డిస్కంలు రూ.4.15కే కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.1.50 వరకు అదనపు భారం పడుతుం దన్నారు. అంటే ఏడాదికి రూ.1,050 కోట్ల చొప్పున 12 ఏళ్లలో రూ.12,600 కోట్ల అదనపు భారం పడుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1000 మెగావాట్ల కంటే తక్కువ కొనుగోలు చేసినా.. అసలే కొనకపోయినా పూర్తిగా వెయ్యి మెగావాట్లకు స్థిరచార్జీల చెల్లింపునకు అంగీకరించడంతో వందల కోట్ల భారం పడుతుందని రఘుతోపాటు ఇతర పిటిషనర్లు తిమ్మారెడ్డి, ఎం.వేణుగోపాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న వార్దా (మహారాష్ట్ర)-మహేశ్వరం (హైదరాబాద్) విద్యుత్ కారిడార్‌లో రాష్ట్రానికి లభించనున్న లైన్ల సామర్థ్యం మేరకే ఛత్తీస్‌గఢ్‌కు స్థిరచార్జీలు చెల్లిస్తామని సీఎండీ రఘుమారెడ్డి వివరించారు. ట్రాన్స్మిషన్ చార్జీలు, పన్నులను సైతం తెలంగాణ డిస్కంలపై వేయడం తగదని తిమ్మారెడ్డి పేర్కొనగా ఈఆర్సీ విభేదించింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వల్ల రాష్ట్రం లో విద్యుత్‌చార్జీలు పెరిగిపోతాయని, బషీర్‌బాగ్ తరహాలో విద్యుత్ ఉద్యమాలు పునరావృతం అవుతాయని సీపీఐ రాష్ట్ర నేత వి.రామనరసింహరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆమోదించాలని విద్యుత్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. చివరగా సీఎండీ రఘుమారెడ్డి కొన్ని అభ్యంతరాలపై వివరణలు ఇచ్చారు. ఈ ఒప్పందం ముసాయిదా మాత్రమేనని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి: సీపీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించనున్న ‘ఛత్తీస్‌గఢ్’ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈఆర్సీ ప్రజాభిప్రాయసేకరణ ప్రహసనంగా మారిందని ఆయన విమర్శించారు. చర్చను అడ్డుకోవడంపై సందేహాలు: కోదండరాం రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందం మంచిదేనని.. అయినా అందులోనూ లోపాలుండే అవకాశా లు ఉన్నాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. అలాంటప్పుడు స్వేచ్ఛాయేతర వాతావరణంలో చర్చలు అవసరమని... ఆ చర్చలతో వచ్చే సమష్టి అభిప్రాయంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు. చర్చలో పాల్గొనకుండా ప్రభుత్వం ఎవరిని అడ్డుకున్నా అనుమానాలు, అపోహలు రేకెత్తుతాయన్నారు. అభ్యం తరాలను పట్టించుకోకుండా ఒప్పందాన్ని ఆమోదిస్తే విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. -
ఏపీ ప్రజలకు భారీగా విద్యుత్ షాక్!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో విద్యుత్ చార్జీలు మరోసారి ప్రజలకు భారీగా షాక్ ఇవ్వబోతున్నాయి. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. రూ.7200 కోట్ల మేర ఛార్జీల పెంపుకు ప్రతిపాదనలను డిస్కంలు అందచేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేయడంతో ఛార్జీల పెంపు అనివార్యం కానుంది. -
నిర్దిష్ట విధానాన్ని అనుసరించడంలో తప్పులేదు..
- విద్యుత్ చార్జీల ఖరారుపై ఈఆర్సీ నిర్ణయానికి హైకోర్టు సమర్థన - సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: టారిఫ్ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఇరు రాష్ట్రాలకూ విద్యుత్ చార్జీలను ఖరారు చేసే విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఓ నిర్దిష్ట విధానాన్ని(మెథడాలజీ) అనుసరించడంలో ఎంతమాత్రం తప్పులేదని హైకోర్టు తేల్చిచెప్పింది. యూనిట్ల లెక్కింపు విధానానికి విరుద్ధంగా ఈఆర్సీ అనుసరించిన మెథడాలజీ ఉందన్న ఏకైక కారణంతో, దానిని తప్పని ప్రకటించలేమని స్పష్టంచేసింది. బిల్లింగ్ లెక్కింపు విధానంలో మార్పు విద్యుత్ చట్టనిబంధనలకుగానీ, రాజ్యాంగ నిబంధనలకుగానీ విరుద్ధం కాదని తెలిపింది. ఈ మెథడాలజీని అమలుచేసే ముందు దాని హేతుబద్ధతను ఈఆర్సీ పూర్తిస్థాయిలో పరిశీలించిందని, అందువల్ల మెథడాలజీ మార్పు నిర్ణయాన్ని అనాలోచిత నిర్ణయంగా పరిగణించలేమంది. ఈ విధానాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, అందులో కొత్తేమీ లేదని తెలిపింది. ఈఆర్సీ అనుసరించిన విధానాన్ని తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. కిలోవాట్ పర్ అవర్(కేడబ్ల్యూహెచ్) స్థానంలో కిలోవోల్ట్ అంపరెస్ పర్ అవర్(కేవీఏహెచ్) పద్ధతిన విద్యుత్ చార్జీల లెక్కింపు విధానానికి ఆమోదముద్ర వేస్తూ ఈఆర్సీ 2011లో ఉత్తర్వులిచ్చింది. వీటిని 2011-12, 2012-13, 2013-14 సంవత్సరాలకు వర్తింపచేసింది. కొత్త విధానం ద్వారా బిల్లింగ్ చేయడాన్ని సవాలుచేస్తూ పెద్దసంఖ్యలో గృహ వినియోగదారులు, వాణిజ్య సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి.. ఈఆర్సీ అనుసరించిన విధానాన్ని తప్పుపడుతూ 2013లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు ఈఆర్సీ, ఇటు ఇరురాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిని విచారించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. -
విద్యుత్ ‘చార్జ్’
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి కరెంట్ చార్జీల పెంపు సగటున 4.4 శాతం మోతకు ఈఆర్సీ ఆమోదం ప్రజలపై రూ. 816 కోట్ల భారం.. పేదలకు ఊరట 200 యూనిట్ల వరకు పాత చార్జీలు.. ఆపై బాదుడే పరిశ్రమలకు 5 శాతం పెంపు వ్యవసాయ వినియోగ లెక్కలకు ఈఆర్సీ కత్తెర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల మోత మోగింది. ప్రస్తుత విద్యుత్ చార్జీల మీద సగటున 4.42 శాతం పెంపునకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రజలపై రూ.816 కోట్ల భారం పడనుంది. ఫిబ్రవరి 7న విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి సమర్పించిన చార్జీల ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను పరిశీలించిన ఈఆర్సీ... ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈ కొత్త చార్జీలను ప్రకటించింది. అయితే డిస్కంలు చేసిన పలు ప్రతిపాదనలను ఈఆర్సీ అంగీకరించలేదు. గృహ వినియోగదారులకు సంబంధించి 100 యూనిట్ల లోపు వరకు చార్జీల పెంపును డిస్కంలే మినహాయించాయి. ఆపైన పెంపును కోరాయి. కానీ ఈఆర్సీ మాత్రం నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి కూడా భారం పడకుండా మినహాయింపునిచ్చింది. దీంతో 200 యూనిట్లకు మించితే చార్జీ మోత మోగడం ఖాయమైంది. ఇక వ్యవసాయ, కుటీర పరిశ్రమలకు చార్జీలు పెంచకుండా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం ఆ వర్గాలకు ఊరటనిచ్చింది. మిగతా వ్యాపార, వాణిజ్య కేటగిరీలన్నింటా చార్జీల పెంపు ఉంది. టెలిస్కోపిక్ విధానం కాబట్టి శ్లాబ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీల లెక్కింపు ఉంటుంది. మొత్తంగా గృహాల కేటగిరీలో సగటున 1.3 శాతం చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 1,088.68 కోట్ల పెంపును ప్రతిపాదిస్తే... ఈఆర్సీ రూ. 272.68 కోట్ల మేరకు తగ్గించి.. రూ. 816 కోట్ల భారానికి పచ్చజెండా ఊపింది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ప్రార్థన మందిరాలన్నింటికీ చార్జీలు పెంచింది. పరిశ్రమల కేటగిరీల్లో సగటున 5 శాతం చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో 200 వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు దాదాపు 80 లక్షలు ఉన్నాయి. వారికి ప్రస్తుత భారం నుంచి ఉపశమనం లభించినట్లే. అంతకు మించి విద్యుత్ వినియోగించే 8 లక్షల కుటుంబాలపై పెంపుతో భారం పడుతుంది. 80 లక్షల ఇళ్లకు ఉపశమనం.. రాష్ట్రంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.20 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయని ఈఆర్సీ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 88 లక్షల కనెక్షన్లు గృహ వినియోగదారులే. అంటే వారందరిపై చార్జీల భారం ఉండదని టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ప్రకటించారు. చైర్మన్‌తో పాటు ఈఆర్సీ సభ్యులు హెచ్.శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి శుక్రవారం కొత్త విద్యుత్ చార్జీలను వెల్లడించారు. వ్యవసాయ, కుటీర పరిశ్రమలను పెంపు నుంచి మినహాయించడంతో 18 లక్షల మందిపై ప్రభావం ఉండదని వారు చెప్పారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహేతర చిరు వ్యాపారులు, దుకాణాలకు సంబంధించి 10.6 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో 6 లక్షల కనెక్షన్లకు చార్జీల పెంపు భారమేమీ ఉండదని తెలిపారు. మొత్తంగా ప్రస్తుతమున్న చార్జీలతో పోలిస్తే 4.4 శాతం చార్జీలు పెరిగాయని.. గృహాల కేటగిరీలో కేవలం 1.3 శాతం పెరిగాయని ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్), దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సమర్పించిన ఆదాయ వ్యయ నివేదికలు, కొత్త చార్జీల ప్రతిపాదనల ప్రకారం.. వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు 4 నుంచి 5.75 శాతం వరకు ఉంది. సర్కారు సబ్సిడీ రూ. 4,227 కోట్లు.. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,473.76 కోట్లు అవసరమని ఏఆర్ఆర్ నివేదికల్లో ప్రతిపాదించాయి. కానీ ఈఆర్సీ రూ. 23,416 కోట్లకు దీనిని కుదించింది. మొత్తం రూ. 6,476.23 కోట్ల లోటు ఉందని డిస్కంలు ఏఆర్ఆర్ నివేదికల్లో పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి రూ. 5,387.55 కోట్ల సబ్సిడీ ఆశిస్తూ... రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. అయితే ప్రభుత్వం రూ. 4,227 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. కోళ్ల పరిశ్రమకు అదనంగా ఇచ్చిన రూ. 30 కోట్ల సబ్సిడీని నేరుగా చార్జీలలోనే సర్దుబాటు చేసింది. వీటికి యూనిట్‌కు రూ. 5.63 చొప్పున ఉన్న చార్జీని ఏకంగా రూ. 2.03కు తగ్గించింది. అయితే కొత్త టారిఫ్‌లో పౌల్ట్రీ ఫారాలకు రూ. 3.60 చొప్పున చార్జీ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్ వినియోగం డిస్కం లు అంచనా వేసినంతగా ఉండదని ఈఆర్సీ అభిప్రాయపడింది. సర్కారు ఇస్తున్న సబ్సిడీ సరిపోతుందని పేర్కొంటూ... కేటగిరీల వారీగా వ్యవసాయ విద్యుత్ వినియోగ లెక్కలను తగ్గించింది. డిస్కంలు 13,431 మిలియన్ యూనిట్లు అవసరమని అంచనా వేసుకోగా.. ఈఆర్సీ భారీగా కత్తెర పెట్టి 10,650 మిలియన్ యూనిట్లు సరిపోతుందని స్పష్టం చేసింది. ఇందులో ఎన్పీడీసీఎల్కు 4,300 మిలియన్ యూనిట్లు, ఎస్పీడీసీఎల్కు 6,350 యూనిట్లు సరిపోతుందని పేర్కొంది. రూ. 3,789 కోట్లలోటు చూపిన ఎన్పీడీసీఎల్కు రూ. 3,529 కోట్లు ప్రభుత్వ సబ్సిడీ అందుతుందని, రూ. 2,687 కోట్లలోటు చూపిన ఎస్పీడీసీఎల్కు రూ. 698 కోట్లు సబ్సిడీ అందుతుందని ఈఆర్సీ వెల్లడించింది. ప్రస్తుత, ప్రతిపాదిత చార్జీలతో భారం (రూ.లలో) యూనిట్లు ప్రస్తుత చార్జీ ప్రతిపాదిత చార్జీ 100 202.50 202.50 200 620 620 201 670.38 826.80 250 983 1,160 300 1,327 1,525 400 2,065 2,305 పెంపుతో ఆదాయ, వ్యయాలు (రూ. కోట్లలో) 2015-16లో రాబడి అంచనా 23,416 ప్రస్తుత చార్జీలతో ఆదాయం 18,373 చార్జీల పెంపుతో వచ్చే రాబడి 1,816 ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 4,227 -
విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం!
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమయ్యింది. తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేయడంతో ఛార్జీల పెంపు అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్కంలు అందజేసిన ప్రతిపాదనలపై ఈనెల్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రభుత్వానికి ఈఆర్సీ సిఫార్సు చేయనుంది. ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈఆర్సీకి డిస్కం అందజేసిన ప్రతిపాదనలు.. 50 లోపు యూనిట్లకు రూ. 2.75 51 నుంచి 100 లోపు యూనిట్లకు రూ.3.45 101 నుంచి 150 యూనిట్ల వరకూ రూ.5.71 151 నుంచి 200 వరకూ రూ.6.71 201 నుంచి 250 వరకూ రూ. 6.76, 251 నుంచి 300 వరకూ రూ.7.29 301 నుంచి 400 వరకూ రూ. 7.82 , 401 నుంచి 500 వరకూ 8.35 500 పై బడిన యూనిట్లకు రూ.8.88 -
ఈఆర్సీ అనుమతి ఉన్న ఒప్పందాలనే గౌరవిస్తాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి లేని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని, అవసరమైతే ఆ విషయంలో న్యాయపోరాటం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని అభిప్రాయపడింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం రాత్రి లేక్‌వ్యూ అతిథి గృహంలో జరిగింది. పీపీఏల రద్దుకు దారితీసిన పరిస్థితులను చంద్రబాబు మంత్రివర్గానికి వివరించారు. విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యథావిధిగా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఈఆర్సీ అనుమతి లేని ఒప్పందాలను రద్దుచేయాలని తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధమైనదేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉంటే తెలంగాణకు ఇద్దామన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేయటం సరికాదని విమర్శించారు. సమావేశంలో చర్చించిన అంశాలను సహచర మంత్రి పి. నారాయణతో కలిసి సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దాన్ని ఈ ఏడాది ఆఖరుకు 1100 మెగావాట్లకు పెంచాలని నిర్ణయం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బిల్లును త్వరలోనే సభలో ప్రవేశపెడతాం. వయస్సు పెంపు నిబంధన ఈ నెల నుంచే అమల్లోకి వస్తుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంతోపాటు పలు హామీలిచ్చిన కేంద్రం తక్షణం వాటిని అమలు చేసేలా ఒత్తిడి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్యాకేజీలు వెంటనే విడుదల చేయాలని, పరిశ్రమలకు రాయితీలను అమలు చేయాలని కూడా ఒత్తిడి చేయనున్నారు. పాలనాపరమైన అవాంతరాలు లేకుండా ఉండేందుకు వీలుగా అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు వెంటనే పూర్తి చేయాలి. ఉద్యోగుల కేటాయింపులూ వెంటనే చేపట్టాలి. వీటిలో జాప్యం వల్ల పరిపాలన కుంటుపడుతోంది. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ సక్రమంగానే ఉంది. నిజాం పాలననాటి తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ప్రస్తుతం ముంపు గ్రామాలుగా పేర్కొన్నవి గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వివాదం సృష్టించటం సరికాదు. ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారిని... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. దీనిపై సమన్వయం చేసే బాధ్యత ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి పల్లెకు అప్పగించారు. సామాజిక ిపింఛన్లు అక్టోబర్ రెండు నుంచి అందచేస్తాం. ఆ రోజు నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెంచిన మొత్తాన్ని అమలు చేస్తాం. బెల్టుషాపులను తొలగిం చాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవటంతోపాటు ఉత్తర్వులు జారీ చేశాం. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశాం. ఇంకా బెల్టుషాపులు కొనసాగితే సహించేది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు నామినే టెడ్ పదవులు పొందినవారు వెంటనే వాటికి రాజీనామా చేయాలి. అది వారి నైతిక ధర్మం. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆర్డినెన్స్ జారీ చేయటం ద్వారా తొలగించటం జరుగుతుంది. శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదించటం జరిగింది. ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా రుణ మాఫీ అమలు చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక ఇస్తుంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే తుది నివేదికను అందజేస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఈ విషయంలో వెనక్కువెళ్లే ప్రసక్తి లేదు. -
కరెంట్ షాక్...
- విభజన తర్వాత వడ్డింపు - కొత్త టారిఫ్ సిద్ధం చేస్తున్న విద్యుత్ అధికారులు - వినియోగదారులకు గుండె గు‘భిల్లే’ - దాదాపుగా రెట్టింపు కానున్న చార్జీలు - జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.360 కోట్ల భారం వచ్చే నెల నుంచి కరెంటు చార్జీలు మోతమోగనున్నాయి. నూతనంగా రూపొందించిన టారిఫ్ ప్రకారం ఇకపై మీరు కట్టే బిల్లు దాదాపుగా రెట్టింపు కానుంది. మీ జేబుకు చిల్లుపడనుంది. బిల్లు చూసి మీ గుండె గుభిల్లు మనడం ఖాయం. వినియోగదారుల నడ్డివిరిచేలా ఉన్న ఈ తాజా ప్రతిపాదనలు అమలైతే జిల్లాలో వినియోగదారులపై రూ.360 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. గుంటూరు, సాక్షి: అపాయింటెడ్ డే జూన్ 2 తర్వాత కరెంటు చార్జీలు మోత మోగనున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వినియోగదారుల నడ్డి విరిచే విధంగా జేబుకు చిల్లు పెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచేందుకు డిస్కం ఈఆర్సీకి ప్రతిపాదనలు గతంలోనే సమర్పించింది. సార్వత్రిక ఎన్నికలు, ట్రాన్స్‌కో విభజన తదితర అంశాలతో కరెంటు చార్జీలను పెంచలేదు. రాష్ట్ర విభజన అనంతరం యూనిట్ కరెంటు చార్జీ శ్లాబు దాటితే ముక్కు పిండి రూ.300కు పైగా వసూలు చేయనున్నారు. కొత్త రాష్ట్రంలో కరెంటు వినియోగదారులకు దిమ్మతిరిగేలా డిస్కం షాక్ ఇవ్వనుంది. చార్జీల పెంపు, కొత్త టారిఫ్‌లపై విద్యుత్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే కరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు గాను ఇకపై రూ.611.50 చెల్లించాలి. పొరపాటున ఒక యూనిట్ అదనంగా వాడితే అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్టు పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు రానుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్టు ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున ఉంటాయి. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్టు పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. ఇప్పటికే డిస్కం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించి ఆమోదం కూడా పొందడంతో వినియోగదారులకు ఇక కరెంటు బిల్లు మోత మోగనుంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించనున్నారు. ఈ బాదుడు అమలైతే జిల్లాలో వినియోగదారులపై ఏడాదికి రూ.360 కోట్ల భారం పడనుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్తు బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది. రాష్ట్ర విభజనతో సదరన్ డిస్కంకు సెంట్రల్ డిస్కం నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిశాయి. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న సబ్సిడీ పెరుగుతుందా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. -
జూన్ 2 వరకూ ఆగండి
- విద్యుత్ చార్జీలపై అప్పుడే నిర్ణయం వద్దు - నేడు ఈఆర్సీకి లేఖ రాయనున్న ప్రభుత్వం - రెండు రాష్ట్రాలకు వేర్వేరు చార్జీలు నిర్ణయించాల్సిందేనా? - అదే జరిగితే చార్జీల వ్యవహారం మళ్లీ మొదటికే సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలపై నిర్ణయం వెలువరించేందుకు జూన్ 2 వరకూ ఆగాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కి ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఈ మేరకు సోమవారం ఈఆర్సీకి ఇంధనశాఖ లేఖ రాయనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ చార్జీలపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త ప్రభుత్వాలు వచ్చే వరకూ వేచిచూడాలని ఈఆర్సీని కోరనుంది. ఫలి తంగా విద్యుత్ చార్జీల వ్యవహారం జూన్ 2 వరకూ నిలిచిపోనుంది. అయితే, ఇది కాస్తా కొత్త గందరగోళానికి దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి. దీంతో రెండు వేర్వేరు విద్యుత్ చార్జీలను ప్రకటించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. ఇదే జరి గితే.. మళ్లీ కొత్తగా చార్జీల పెంపునకు విద్యుత్ సంస్థ ల నుంచి ప్రతిపాదనలు తీసుకుని ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించిన అనంతరమే చార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మూడు నెలలు పడుతుంది. దీంతో చార్జీల వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చినట్టు అవుతుంది. వాస్తవానికి 2014 -15 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ టారిఫ్ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇది వాయిదా పడింది. ఎన్నికలు ముగిసిన తర్వాత విద్యుత్ చార్జీలపై ఆదేశాలు జారీచేయవచ్చునని ఈఆర్సీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈఆర్సీ మరోసారి ప్రభుత్వ అనుమతిని కోరింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నందువల్ల జూన్ 2న కొత్త ప్రభుత్వాలు వచ్చాకే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఈఆర్సీకి స్పష్టంచేయాలని సర్కారు నిర్ణయించింది. ఈఆర్‌సీనే వద్దంటే...! ప్రస్తుతం ఉన్న ఈఆర్సీ రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే కొనసాగనుంది. ఆరు నెలల తర్వాత రెండు వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఈఆర్సీలు ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈఆర్సీ తమ రాష్ట్రానికి విద్యుత్ చార్జీలు నిర్ణయించకూడదని... తెలంగాణ ఈఆర్సీ ఏర్పడిన తర్వాత నిర్ణయించుకుంటామని ఎవరైనా అభ్యంతరాలు లెవనెత్తితే ఈ ప్రక్రియ కాస్తా మరో కొత్త సమస్యకు దారితీయనుంది. ఇప్పటికే ఈఆర్సీ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఈఆర్సీ నిర్ణయాన్ని ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే వ్యతిరేకిస్తే.. జూన్ 2 తర్వాత మరో ఆరు నెలల పాటు విద్యుత్ చార్జీల వ్యవహారం అలాగే నిలిచిపోతుంది. అయితే, ప్రభుత్వం వ్యతిరేకించినా.. చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారం ఈఆర్సీ సుమోటాగా చార్జీలను నిర్ణయిస్తే అది కాస్తా మరో కొత్త చర్చకు, గందరగోళానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రస్తుతానికి పాత విద్యుత్ చార్జీలే: ఈఆర్సీ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల మోత తాత్కాలికంగా వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఆర్సీ కార్యదర్శి మనోహర్‌రాజు శనివారం ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ టారిఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించి ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ చార్జీల మోతను ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం కూడా కోడ్ ఉన్నందున ఏ కేటగిరీ వినియోగదారులకు (రైతులు, గృహ తదితర) ఎంతమేరకు సబ్సిడీ ఇస్తామనే విషయాన్ని పేర్కొనలేమని ఈఆర్సీకి తెలిపింది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే అమలవుతాయని ఈఆర్సీ స్పష్టం చేసింది. అదేవిధంగా ట్రాన్స్‌కోకు చెందిన విద్యుత్ సరఫరా చార్జీలు, సాంప్రదాయక ఇంధన వనరుల అస్థిర చార్జీల(వేరియబుల్ కాస్ట్)తోపాటు క్రాస్‌సబ్సిడీ సర్చార్జీలకు సంబంధించి కూడా తదుపరి ఆదేశాలు వెలువడేవరకూ ప్రస్తుత చార్జీలే అమలవుతాయని ఈఆర్సీ తెలిపింది. కాగా ఎన్నికల కోడ్ ముగిశాక.. అంటే మే 20 తర్వాత ఏ క్షణంలోనైనా విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశముంది. -
పవర్ మొత్తం ‘కేంద్రం’ గుప్పెట్లోనే!
-
పవర్ మొత్తం ‘కేంద్రం’ గుప్పెట్లోనే!
సాక్షి, హైదరాబాద్: విభజన అనంతరం రాష్ట్ర విద్యుత్తు రంగంపై రెండు రాష్ట్రాలకూ అధికారాలు లేకుండాపోబోతున్నాయి. విచిత్రంగా అనిపించినా కేంద్ర విద్యుత్తు చట్టం ఇలాగే చెబుతోంది. విభజన తర్వాత అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతంలోని ఏ విద్యుత్ ప్లాంటు ధరను నిర్ణయించాలన్నా... ఏవైనా వివాదాలు తలెత్తినా పరిష్కరించుకునేందుకు ఢిల్లీకి పరుగెత్తాల్సిందే. రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాల్లో ఏర్పడే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఈఆర్సీ), ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లు కేవలం పేరుకే పరిమితం కానున్నాయి. కేవలం ఏడాదికి ఒకసారి విద్యుత్ చార్జీల నిర్ణయానికి మాత్రమే పరిమితం కావాల్సి రానుంది. అదెలాగంటే... రాష్ట్ర విభజన అనంతరం కూడా జెన్కోతో పాటు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కొనసాగుతాయని బిల్లులో కేంద్రం పేర్కొంది. పీపీఏ మేరకే ఇరు ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపింది. దీంతో తెలంగాణలో ఉన్న విద్యుత్ ప్లాంటు నుంచి తెలంగాణతో పాటు సీమాంధ్రకు కూడా యథావిధిగా కేటాయింపుల మేరకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నమాట. అంటే ఒకే విద్యుత్ ప్లాంటు నుంచి విభజన తర్వాత 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ్హ ఒక విద్యుత్ ప్లాంటు నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరిగితే... సదరు ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే యూనిట్ విద్యుత్ ధరతో పాటు అన్ని అంశాలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) పరిశీలిస్తుంది. ్హ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్ల నుంచి అనేక రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అందుకే ఎన్టీపీసీ యూనిట్ల విద్యుత్ ధరను సీఈఆర్సీ నిర్ణయిస్తుంది. ఈ ప్లాంట్లపై ఆయా రాష్ట్రాల్లోని ఈఆర్సీలకు ఎటువంటి అధికారం ఉండదు. తద్వారా ఇటు తెలంగాణ కానీ అటు సీమాంధ్రలోని ఏ విద్యుత్ ప్లాంటు యూనిట్ ధరతో పాటు ఏ ఇతర వివాదం తలెత్తినా పరిష్కరించే అధికారం సీఈఆర్‌సీకే ఉంటుంది. ఫలితంగా టీఈఆర్సీ, ఏపీఈఆర్‌సీలు కేవలం పేరుకే మనుగడలో ఉండనున్నాయి. పీపీఏలు ముగిసేవరకూ పరిస్థితి ఇంతే. అంటే రాబోయే 25-30 ఏళ్ల వరకూ వీటి అధికార పరిధి నామమాత్రమే. ఏడాదికి ఒకసారి విద్యుత్ చార్జీలను మాత్రమే ఇవి నిర్ణయించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లోపు 2రాష్ట్రాలకు వేర్వేరు ఈఆర్సీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు మాత్రమే ప్రస్తుతం ఉన్న ఏపీఈఆర్సీ మనుగడలో ఉండనుంది. అయితే ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లపై ఆ రాష్ట్రంలోని ఈఆర్సీలకే అధికారాలు ఉండాలంటే... కేంద్ర విద్యుత్ చట్టంలో సవరణలు చేయాలి. పార్లమెంటుకు మాత్రమే ఈ అధికారం ఉంది. -
పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులపై మళ్లీ భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించింది. యూనిట్‌కు 50 పైసలు నుంచి రూపాయి వరకు వివిధ కేటగిరీల్లో ఛార్జీలు పెంచనున్నారు. వినియోగదారులపై 9,339 కోట్ల రూపాయలు భారం పడనుంది. 0 - 150 యూనిట్ల వరకు 50 పైసలు పెంచనున్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు, ఎల్టీ, కమర్షియల్ కేటగిరికి యూనిట్‌కు రూపాయి పెంచుతారు. కస్టమర్ ఛార్జీలు 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచుతారు. భారీ పరిశ్రమలకు యూనిట్‌కు 50 పైసలు పెరగనుంది. ఇప్పటికే కిరణ్ ప్రభుత్వంలో ప్రజలపై 24,204 కోట్ల రూపాయల భారం పడింది. ఛార్జీల పెంపు ద్వారా 12,500 కోట్లు రూపాయలు, సబ్ ఛార్జీల ద్వారా 11,704 కోట్ల రూపాయలు భారం పడింది.