![Hyderabad: ERC Public Inquiry Into Electricity Charges Hike - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/25/ELECTRICITY%5D.jpg.webp?itok=Yjcb1wpk)
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సి) భవనంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ విచారణ నిర్వహించనుంది.
2022–23లో రూ.6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం తెలిసిందే. బహిరంగ విచారణలో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment