ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ హై వోల్టేజీ షాక్ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. 2016-17 సంవత్సరానికి కొత్త టారీఫ్ను గురువారం విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్సీ) ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. తాజాగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలతో వినియోగదారులపై రూ.216 కోట్ల అదనపు భారం పడనుంది.
ఈ పెంపులో గృహ వినియోగదారులకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా కరెంట్ ఛార్జీల పెంపుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.