- విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన
- 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు
- 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 65 పైసల నుంచి 72 పైసలు పెంపు
- 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి మంగళవారం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనలో.. 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని తెలుస్తోంది. 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 0.65 పైసల నుంచి 0.72 పైసలు అదనంగా పెరగనుంది. 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపుతో 1958 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకోవాలనే దిశగా డిస్కంలు ప్రతిపాదించినట్టు తెలిసింది. 2016-17 సంవత్సరంలో సగటున యూనిట్‌కు 0.42 పైసలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.
పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
Published Tue, Mar 8 2016 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement