power charges
-
కరెంటు మరింత ఖరీదు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల భారాన్ని మోపింది. ఈ చార్జీలను ప్రతి నెలా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది చాలదన్నట్లు కూటమిలో భాగమైన బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కొత్త దారిలో ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమవుతోంది. దానిని నేరుగా కాకుండా పరోక్షంగా వేస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రజల కరెంటు బిల్లు మరింతగా పెంచేలా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సాయపడుతోంది.కొత్త పేరుతో కొత్త చార్జీవిద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన దానికంటే అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొంటున్నాయి. ఈ విద్యుత్తు కొనుగోలుకయ్యే అదనపు ఖర్చును ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. గతంలో ఈ చార్జీలను ఏడాది చివరిలో మదించి, ఒకే సారి వేసేవి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నిబంధనలు (రెగ్యులేషన్స్) 2005కు సవసరణ చేసి వాటిని ప్రతి నెలా వసూలు చేసుకునే వి«ధానాన్ని తెచ్చింది. ఎప్పుడు చేసిన ఖర్చును అప్పుడే మరుసటి నెల బిల్లులో యూనిట్‌పై గరిష్టంగా రూ.0.50 చొప్పున వసూలు చేసుకొనేలా ఏపీఈఆర్సీ కూడా చట్టంలో మార్పులు చేసింది. ఏడాదికోసారి కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రూ అప్ను లెక్కించేలా సవరణలు చేసింది. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ‘ఇంధన సర్దుబాటు సర్‌చార్జి’ పేరుతో కొత్త వడ్డనకు శ్రీకారం చుట్టింది.రెండు విధాలుగా వడ్డనడిస్కంలు ఆర్ధిక స్థిరత్వం కోసం వినియోగదారుల నుంచి నెలవారీ బిల్లులతో పాటుగా ఇంధన సర్దుబాటు సర్‌చార్జీని కూడా వసూలు చేసుకోవడానికి కేంద్రం విద్యుత్ చట్టంలోని నిబంధనల్లో సవరణలకు ముసాయిదాను రూపొందించింది. గడిచిన మూడేళ్లలో సర్దుబాటు చార్జీల సగటును తీసుకుని ఈ సర్‌చార్జీని ఏపీఈఆర్సీ నిర్ణయించాలని చెప్పింది. దానిని ఏడాదికోసారి నిర్ణయించే టారిఫ్ ఆర్డర్‌తో కలిపి ప్రకటించాలని సూచించింది. తద్వారా సర్దుబాటు చార్జీల లెక్కలతో సంబంధం లేకుండా ప్రజలపై సర్‌చార్జీల రూపంలో వచ్చి పడుతుంది. ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీని కూడా ఎఫ్పీపీఏ సర్దుబాటుకు డిస్కంలు వాడుకోవచ్చని, వినియోగదారుల నుంచి వసూలు చేసేంతవరకూ వేచి చూడాల్సిన అవసరం ఉండదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారటీ (సీఈఏ) వివరించింది. అది కూడా సరిపోకపోతే నిర్దిష్ట శాతంలో కొంత వరకూ చార్జీలను వేసి నెల నెలా కూడా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 15 వరకూ ముసాయిదాపై అన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు, సూచనలను కేంద్రం స్వీకరించింది. వాటిని పరిశీలించి త్వరలోనే ఈ చార్జీల వసూలుపై కొత్త నిబంధనలను ప్రకటించనుంది. -
తెలంగాణ: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించలేదు. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ‘‘అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదు. స్థిర చార్జీలు రూ.10 యధాతధంగా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం.132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి రూపాయిన్నర రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచాం. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచాం.గృహ వినియోగదారులకు మినిమమ్ చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. ఆర్ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయి. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింది’ అని వివరాలు వెల్లడించారు.చదవండి: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు -
ఆ రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయి?: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు. కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే.. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా?. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు.. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు?. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’’ అని అన్నారు.కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది ! విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ !పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు !ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే..… pic.twitter.com/hqiKkXIFrn— KTR (@KTRBRS) October 15, 2024చదవండి: ఓ వైపు మరణ శాసనం..! మరోవైపు సుందరీకరణా? -
Fact Check: బాబుదే ఈ ‘వంచన’
సాక్షి, అమరావతి: అసలు వాస్తవాలను దాచిపెట్టేసి, అవాస్తవాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు నిత్యకృత్యంగా పెట్టుకుంది. ఏదో ఒక కారణంగా విద్యుత్తు బాదుడంటూ తరచూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. విద్యుత్ ట్రూఅప్ చార్జీలపై బుధవారం ఈనాడు ప్రచురించిన కథనమూ ఇటువంటిదే. అసలు వాస్తవమేమిటంటే.. ఈ ట్రూఅప్ చార్జీలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనివే. ఆ విషయం ప్రసావించకుండా కథనం వండి, పాఠకులను వంచించింది. రాష్ట్రంలో ప్రస్తుతం విధిస్తున్న నెట్వర్క్ ట్రూ ఆప్ చార్జీలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనివని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు స్పష్టం చేశారు. 2014–19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ నిమిత్తం జరిగిన వాస్తవ ఖర్చులు నిర్దేశిత వ్యయంకన్నా ఎక్కువ అవడంవల్ల ఈ చార్జీలు వచ్చాయే తప్ప ప్రస్తుత కాలానికి సంబంధించినవి కావని తెలిపారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ‘విద్యుత్ చార్జీలపై జగన్ వంచన’ అంటూ ఈనాడు బుధవారం అచ్చేసిన కథనాన్ని సీఎండీలు ఖండించారు. ఈ మేరకు ‘సాక్షి’ ప్రతినిధికి వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల నిర్ధారణకు 1998 సంవత్సరంలోనే రాష్ట్ర విద్యుత్ సంస్కరణల చట్టం ప్రకారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఏర్పాటైంది. విద్యుత్ నెట్వర్క్, రిటైల్ సరఫరా ధరలను చట్టబద్ధంగా ఏర్పాటైన ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం డిస్కంల ఆర్థిక స్థితిగతులు, సరఫరా, నెట్వర్క్ నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చు, దీర్ఘకాలంలో వివిధ ఖర్చుల వార్షిక పెరుగుదల శాతంలను పరిగణనలోకి తీసుకుంటుంది. రాష్ట్ర విద్యుత్ రంగంలో నెట్వర్క్ నిర్వహణ ధరలు ఐదేళ్లకొకసారి, రిటైల్ సరఫరా ధరలు ఏడాదికోసారి ఆరి్ధక సంవత్సరం మొదలయ్యే ముందుగా ప్రకటిస్తారు. 2000 సంవత్సరం నుంచి రిటైల్ సరఫరా ధరలు, నెట్వర్క్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు వంటివి మండలి ఆదేశాల ప్రకారమే డిస్కంలు వినియోగదారుల నుంచి వారి వినియోగాన్ని బట్టి వసూలు చేస్తున్నాయి. â విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి ఏటా సెపె్టంబరు నెలాఖరుకి తదుపరి ఆర్థిక సంవత్సరం ఆదాయ, అవసరాల నివేదికలను అప్పటికున్న పరిస్థితుల ఆధారంగా తయారు చేస్తాయి. అప్పుడు వంద శాతం ఖచి్చతత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్య పడదు. ఆరి్థక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంధన ఛార్జీలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఉండే హెచ్చుతగ్గులు విద్యుత్ చట్టంలో, నిబంధనల్లో నిర్దేశించిన విధంగా సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. â గడిచిన ఆరి్థక సంవత్సరంలో గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్‌ను హేతుబదీ్ధకరించి ఒక ఉమ్మడి ఏక గ్రూపు టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మొదటి స్లాబ్ రాయితీ ధరల ప్రయోజనం వినియోగదారులందరికీ అందుతుంది. ఇదే కాకుండా ప్రస్తుత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ వాడకపోయినా కట్టవలసివచ్చే నెలవారీ కనీస చార్జీలు రద్దయ్యాయి. దీని ప్రకారం సింగల్ ఫేజ్ వారికి రూ.65, త్రీ ఫేజ్ వినియోగదారులకు రూ.150 చెల్లించాల్సిన అవసరం తప్పింది. â కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే 2021–22 ఆరి్ధక సంవత్సరం నుండి వార్షిక ట్రూ ఆప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారమే డిస్కంలు 2021–22 సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి విద్యుత్ కొనుగోలు వ్యయ హెచ్చు తగ్గులను ఏపీఈఆర్సీకి సమరి్పంచాయి. ప్రస్తుత 2023–24 ఆరి్ధక సంవత్సరం నుంచి త్రైమాసిక సర్దుబాటు చార్జీల స్థానంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా నెలవారీ సర్దుబాటు చార్జీలు అమల్లోకి వచ్చాయి. తదనుగుణంగా డిస్కంలు జూన్ నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ఒక నెలలోని సర్దుబాటును దాని తరువాత రెండో నెలలో వసూలు చేస్తారు. â డిస్కంల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 2019 మే నుండి సెపె్టంబర్ 2023 వరకు సబ్సిడీ రూపంలో దాదాపు రూ.39,900 కోట్లను, వివిధ విభాగాల విద్యుత్ వినియోగ చార్జీల రూపంలో మరో రూ.10,750 కోట్లను, మొత్తంగా నాలుగున్నరేళ్లలో రూ.50,650 కోట్లు డిస్కంలకు ఇచి్చంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి ట్రూ ఆప్ చార్జీలను, ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. అందువల్ల ఇందులో వంచన అన్నదే లేదు. ఈనాడు కథనంలో అర్ధం లేదు. -
ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా?
రాత్రీపగలు తేడా లేదు.. ఎప్పుడైనా ఐదు నిమిషాలు కరెంటు పోయిందంటే ఇబ్బందే. లైట్లు, ఫ్యాన్ల వంటి అత్యవసరాల నుంచి టీవీలు, ఇతర సాంకేతిక ఉత్పత్తుల దాకా ఏది నడ వాలన్నా విద్యుత్ కావాల్సిందే. ఈ కరెంటు చార్జీలు ఒకచోట భగ్గుమంటుంటే.. మరోచోట చాలా తక్కువగా ఉంటుంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో సగటున కరెంటు చార్జీలు ఎంత ఉన్నాయనే దానిపై ‘గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్’ ఓ పరిశోధన చేసి జాబితా లను రూపొందించింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. కొన్ని పేద దేశాల్లో కరెంటు చార్జీ లు అతితక్కువగా ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువున్నట్టు గుర్తించింది. మన రాష్ట్రం లో కరెంటు చార్జీల పెంపుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వివరాలేమిటో చూద్దామా.. నివేదికలో గృహ విద్యుత్ చార్జీల లెక్క ఇదీ.. ►ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో 2021 చివరినాటికి ఉన్న విద్యుత్ చార్జీలను పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు. ►మొత్తం ప్రపంచవ్యాప్తంగా సగటున గృహ విద్యుత్ చార్జీలు రూ.10.22 పైసలుగా.. వాణిజ్య విద్యుత్ చార్జీలు రూ.9.30గా ఉన్నాయి. ►క్కువ గృహ విద్యుత్ చార్జీల్లో భారతదేశం సగటున యూనిట్‌కు రూ.5.73 ధరతో 41వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో విద్యుత్ చార్జీలు మన కంటే తక్కువ. ఇక మనదేశంలో వాణిజ్య విద్యుత్ (దుకాణాలు, పరిశ్రమల వంటి వాటికి ఇచ్చే) ధర సగటున రూ.8.30గా ఉంది. ► అమెరికా రూ.11.39 ధరతో 88వ స్థానంలో నిలిచింది. ►మన దేశంలో సగటున యూనిట్‌కు ధర (రూ.లలో)- 5.73 ► తక్కువ గృహ విద్యుత్ చార్జీలు ఉన్న దేశాల్లో మన స్థానం -41 -
చార్జీలు పెంచిన రోజు నుంచే కేసీఆర్ పతనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంచిన రోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత త్వరలోనే విద్యుత్ చార్జీలను పెంచుతామని చెప్పడం ద్వారా కేసీఆర్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఆరోపించారు. ఓట్లు, ఎన్నికలు తప్పితే కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రజల జీవితమే విద్యుత్‌పై ఆధారపడి ఉందని, విద్యుత్ కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడని చరిత్ర రాష్ట్రానికి ఉందని గుర్తు చేశారు. తన స్వార్థం, వ్యక్తిగత లాభం కోసం ఎక్కువ ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి జెన్కోను నష్టాల పాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు తాను చేసిన తప్పును ప్రజలపై రుద్దాలని చూడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. -
చార్జీల మోత తగ్గిస్తాం
-
మళ్లీ యూటర్న్
తెలుగుదేశం ప్రభుత్వం ఆక్వా రైతులను మళ్లీ మోసం చేసింది. ఆక్వా చెరువులకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో హడావిడిగా తాను కూడా చార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆచరణలో అమలు చేయలేదు. తాజాగా జారీచేసిన జీవో ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా యూనిట్‌కు రూ.3.86 రైతులు చెల్లిస్తే... తర్వాత మత్స్యశాఖ ద్వారా రూ.1.86 వెనక్కి చెల్లిస్తామని పేర్కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆక్వా సాగు 72,945 హెక్టార్లు ఉండగా 29,922 కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద జరిగే సాగులో 40 శాతం వరకూ జిల్లాలోనే జరుగుతోంది. ఒకప్పుడు డాలర్లు కురిపించిన ఆక్వాసాగు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధరలు పడిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో అక్వా రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాలకు ఎగుమతులు తగ్గాయని, కుంటిసాకులు చెబుతూ దళారులు ధరలు తగ్గించి వేయడంతో రైతులు పూర్తిగా నష్టాలలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో మే నెలలో జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాలలో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తమ ఇబ్బందులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆక్వా చెరువులకు ఉపయోగించే విద్యుత్ చార్జీలను యూనిట్ రూ.3.80 నుంచి రూ.1.50కి, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు ఏడు రూపాయల నుంచి రూ.ఐదుకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సముద్ర తీర ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజి, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతానని, నాలుగో ఏడాది నుంచి ఆక్వాకు మద్దతు ధర ప్రకటిస్తానని ఆయన çహామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై జగన్ సీరియస్‌గా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 26న హడావిడిగా సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా వ్యాపారులు, రైతులతో చర్చించారు. విద్యుత్ చార్జీలు ఏడాది పాటు రూ.3.80 నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయినా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కరెంటు బిల్లులు యూనిట్ రూ.3.80 టారిఫ్‌తోనే వచ్చాయి. ప్రస్తుతం జీవో విడుదల చేస్తూ రైతులు ముందు రూ.3.86 చొప్పున బిల్లులు చెల్లిస్తే తర్వాత రూ.1.86 మత్స్యశాఖ నుంచి ఇప్పిస్తామని అందులో పేర్కొన్నారు. మత్స్యశాఖ ద్వారా చెల్లింపులేంటి? వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రకారం 2017–18లో రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులు రూ. 42,110 కోట్లు కాగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగువేల కోట్ల పైగా ఆదాయం వస్తోంది. కానీ 2018–19 బడ్జెట్లో మత్స్యశాఖకు కేటాయింపులు కేవలం రూ. 386 కోట్లు మాత్రమే. ఇవి మత్య్సకారుల సంక్షేమానికి సరిపోవడం లేదు. అటువంటప్పుడు మత్స్యశాఖ ద్వారా చెల్లిస్తాననడం వంచన అని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వాలో విద్యుత్ కనెక్షన్లు భూయజమానుల పేరుతో ఉన్నాయి. బిల్లులు చెల్లించేది కౌలు రైతులైతే, భూ యజమానుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 1980 నుంచి తీసుకున్న విద్యుత్ కనెక్షన్‌దారులు అనేక మంది చనిపోయారు. ప్రస్తుతం భూములు వారి వారసుల పేరుతో ఉన్నాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సమస్యాత్మకంగా మారతాయని ఆక్వారైతులు అంటున్నారు. ఆక్వాపై చంద్రబాబు హైడ్రామా ఆక్వా రైతులపై చంద్రబాబు మళ్లీ డ్రామా ఆడుతున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించామని చెబుతూ రైతుల వద్ద నుంచి పాత బకాయిలు వసూలుకు మార్గం చూసుకున్నారు. ఓవర్‌లోడ్, ఏసీడీల పేరుతో భారీగా బిల్లులు వేసి, వాటిని చెల్లిస్తేనే రాయితీ ఇస్తాననడం సరికాదు. బిల్లు ఏక మొత్తంలో చెల్లించిన తరువాత తగ్గించిన సొమ్ము తిరిగి బ్యాంకు అకౌంట్లో యజమాని పేరున వేస్తాననడం విడ్డూరంగా ఉంది. చెరువులు సాగుచేసే లీజుదారులు లక్షలు వెచ్చించి రొయ్యల సాగు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల రాయితీల పేరుతో బకాయిలు గుంజడానికే చంద్రబాబు ఎత్తుగడ. జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు నష్టాలతో విద్యుత్ బకాయిలు పడ్డారు. తగ్గించిన సొమ్మును మినహాయించుకుని బిల్లు చెల్లించే పద్ధతి తీసుకురావాలి. – వేగేశ్న వెంకట్రాజు (యండగండి శ్రీను), ఆక్వా రైతు, చినకాపవరం రాయితీ పేరుతో భారీ మోసం విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆక్వా రైతుపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రొయ్యల రైతుల విద్యుత్ బకాయిలు ముక్కుపిండి వసూలు చేసేందుకు విద్యుత్ బిల్లుల రాయితీలు ప్రకటించారు. విద్యుత్ బిల్లులో తగ్గించిన యూనిట్ ధరను యథావిధిగా ఎందుకు వసూలు చేయరు. డొంకదారుల్లో రాయితీలు ఇస్తాననడం చంద్రబాబు వంచన యోచనలో భాగం. యూనిట్‌కు రూ.1.86 పైసలు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ సొమ్మును బిల్లులోనే తగ్గించి చెల్లించే విధంగా రైతులకు అవకాశం కల్పించాలి. పాత బకాయిల పేరుతో చార్జీలు తగ్గించకపోవడం దారుణం. – గొట్టుముక్కల సూర్యనారాయణరాజు (సూరిబాబు), ఆక్వా రైతు, ఆకివీడు -
శ్లాబు మారితే జేబుకు చిల్లు!
సాక్షి, హైదరాబాద్: రమేశ్.. సురేశ్.. పక్కపక్కనే ఉంటారు.. జూలై నెలలో ఇద్దరిళ్లలో 95 యూనిట్ల చొప్పున కరెంట్ కాలింది.. అయితే మీటర్ రీడింగ్ తీసే వ్యక్తి రమేశ్ ఇంటికి 28వ రోజు వచ్చాడు.. రమేశ్‌కు రూ.220 బిల్లు వచ్చింది! అదే రీడింగ్ తీసుకునే వ్యక్తి సురేశ్ ఇంటికి 31వ రోజు వచ్చాడు.. అయితే సురేశ్‌కు మాత్రం రూ.365 బిల్లు వచ్చింది!! అదేంటి..? ఇద్దరూ ఒకే మొత్తంలో కరెంట్ వాడినా బిల్లులో ఎందుకింత తేడా? ఇలా సురేశ్ ఒక్కడే కాదు.. బిల్లు ఎందుకు పెరిగిందో తెలియక ఎందరో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. మీటర్ రీడింగ్ తీసుకోవడంలో ఒకరోజు అటూ ఇటూ అయితే బిల్లుల్లో రూ.వందల తేడా వస్తోంది. నడ్డి విరుస్తున్న నాన్ టెలిస్కోపిక్ పద్ధతి విద్యుత్ బిల్లుల జారీలో ప్రవేశపెట్టిన అశాస్త్రీయమైన నాన్ టెలిస్కోపిక్ విధానం పేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తోంది. మరోవైపు సరిగ్గా మీటర్ రీడింగ్ తీయకపోవడం వల్ల కూడా బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగించినా తేడా రూ.వందల్లో ఉంటోంది. వాస్తవంగా విద్యుత్ వినియోగదారులకు శ్లాబుల వారీగా విద్యుత్ బిల్లులను జారీ చేస్తున్నారు. గృహ వినియోగదారులకు 50, 100, 200, 300, 400 యూనిట్ల శ్లాబులున్నాయి. వినియోగం పెరిగిన కొద్దీ శ్లాబు మారి విద్యుత్ ధర పెరుగుతుంది. ఒక్కో శ్లాబుకు ఒక్కో చార్జీ ఉంటుంది. 50 యూనిట్లలోపు వినియోగానికి ధర యూనిట్‌కు రూ.1.45, 50 యూనిట్లు దాటితే యూనిట్ ధర రూ.2.60లకు పెరుగుతుంది. వినియోగం 100 యూనిట్లు దాటితే ధర రూ.3.30లకు చేరుతుంది. వినియోగదారుడు ఒక శ్లాబు దాటితే, అధికంగా వాడిన విద్యుత్‌కు తదుపరి శ్లాబు ప్రకారం ధర విధిస్తారు. ఇలా అధికంగా వాడిన విద్యుత్ మొత్తానికి కొత్త శ్లాబు ప్రకారం చార్జీలు విధించడాన్ని టెలిస్కోపిక్ పద్ధతి అంటారు. అయితే తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాల్లో నాన్–టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నారు. శ్లాబు దాటి ఒక్క యూనిట్ అధికంగా వినియోగించినా మొత్తం వినియోగానికి కొత్త శ్లాబు ధర ప్రకారం బిల్లులు జారీ చేయడాన్ని నాన్ టెలిస్కోపిక్ విధానం అంటారు. 100 యూనిట్ల లోపే ‘టెలిస్కోపిక్’ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 100 యూనిట్లలోపు వినియోగానికి మాత్రమే టెలిస్కోపిక్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతి నెలా సరిగ్గా 30 రోజులకు మీటర్ రీడింగ్ తీయడం సాధ్యం కావడం లేదు. దీంతో మీటర్ రీడింగ్ 30 రోజుల తర్వాత తీస్తే వినియోగదారులు అధిక ధరల శ్లాబుల పరిధిలోకి వెళ్లిపోతారని, బిల్లులు విపరీతంగా పెరిగిపోతాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు రెండేళ్ల కిందటే విద్యుత్ రంగ నిపుణులు వాదించారు. దీంతో 30 రోజుల తర్వాత ఆలస్యంగా రీడింగ్ తీసినా, కేవలం 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేయాలని డిస్కంలకు అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ఆ మేరకు డిస్కంలు కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తెచ్చాయి. దీంతో రీడింగ్ ఆలస్యంగా తీసినా 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేస్తున్నారు. ఉదాహరణకు 35 రోజులకు 110 యూనిట్లు వినియోగం జరిగితే.. కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం 30 రోజులకు 94.2 (30/35 ్ఠ110= 94.2) యూనిట్లు వినియోగించినట్లు అంచనా వేసి 100 యూనిట్ల లోపు శ్లాబు ధరల ప్రకారం చార్జీలు విధిస్తున్నారు. ముందుగానే రీడింగ్ తీసి.. మీటర్ రీడింగ్ ఎన్నడూ సరిగ్గా 30 రోజులకు తీసుకోవడం లేదు. అయితే ఆలస్యంగా.. లేదంటే కొన్ని రోజుల ముందుగా రీడింగ్ తీసుకుంటున్నారు. కొన్నిసార్లు వారం లేదా 10 రోజుల ముందే రీడింగ్ నమోదు చేసుకుంటున్నారు. ఇలా ముందుగా తీసుకున్న రీడింగ్‌కు కూడా పైన పేర్కొన్న విధానాన్నే పాటిస్తున్నా రు. ఉదాహరణకు ఒక మీటర్ రీడింగ్‌ను 28 రోజుల్లో తీసుకుంటే 95 యూనిట్ల వినియోగం నమోదైంది. 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి లెక్కిస్తే 101 యూనిట్లు అవుతుంది. దీంతో తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, ఆపై ఒక యూనిట్‌కు రూ.4.30 చొప్పున చార్జీలు విధిస్తున్నారు. రీడింగ్ నమోదులో జాప్యం జరిగితే శ్లాబులు మారి విద్యుత్ బిల్లులు పెరగకుండా కేవలం 30 రోజుల వినియోగాన్ని మాత్రమే అంచనా వేసి బిల్లులు జారీ చేయాలని ఈఆర్సీ ఆదేశిస్తే, రాష్ట్ర డిస్కంలు మాత్రం ముందస్తుగా తీసుకుంటున్న రీడింగ్‌లకు సైతం ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నా యి. దీంతో వినియోగదారులకు జారీ చేసే విద్యుత్ బిల్లుల డిమాండ్ నోటీసులో వినియోగం తక్కువ ఉన్నా చార్జీలు మాత్రం అనూహ్యంగా పెరిగిపోయి కనిపిస్తున్నాయి. ఒక యూనిట్.. రూ.151.8 ఒక వినియోగదారు 100 యూనిట్లు వాడితే.. తొలి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున (50 ్ఠ1.45), తర్వాతి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.30 చొప్పున (50 ్ఠ2.30) మొత్తం విద్యుత్ చార్జీ రూ.202.5 విధిస్తారు. ఒకవేళ 101 యూనిట్లు వాడితే.. అందులో తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, ఆ తర్వాతి ఒక యూనిట్‌కు రూ.4.30 చొప్పున చార్జీని విధిస్తారు. అప్పుడు 101 యూని ట్లకు బిల్లు రూ.334.3 అవుతుంది. తొలుత 100 యూనిట్లకు రూ.202.5 విధించగా.. 101 యూని ట్లకు మాత్రం బిల్లు రూ.334.3కు చేరుతోంది. అంటే కేవలం ఒక యూనిట్ విద్యుత్ అధికంగా వాడడం వల్ల ఏకంగా రూ.131.8 అధికంగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు వంద యూనిట్ల వరకు వినియో గదారుల చార్జీలు రూ.30, వంద నుంచి 200 యూనిట్ల వినియోగానికి రూ.50 చొప్పున విధిస్తారు. 100 యూనిట్లకు అదనంగా ఒక యూనిట్ వాడినా వినియోగదారుల చార్జీలు రూ.30 నుంచి రూ.50కు పెరిగిపోతాయి. దీంతో మొత్తంగా అదనంగా చెల్లిం చాల్సిన విద్యుత్ చార్జీలు రూ.151.8లకు పెరిగి పోతాయి. అదే 201 యూనిట్లు వాడితే ఒక్కసారిగా రూ. 256.80 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పేద కుటుంబాల మధ్య చిచ్చు విద్యుత్ బిల్లులు పేద, మధ్య తరగతి కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. చాలా చోట్ల రెండు, మూడు పోర్షన్లకు ఒకే మీటర్ సదుపాయం ఉండగా, అందరి వినియోగం కలిపి అధిక ధరల శ్లాబులతో బిల్లులు జారీ అవుతున్నాయి. తక్కువ అద్దెతో ఒకటి రెండు గదుల ఇళ్లలో నివాసముండే వారు మరో రెండు మూడు కుటుంబాలతో కలిసి ఒకే విద్యుత్ మీటర్‌తో సరఫరా పొందుతున్నారు. ఒక్కో కుటుంబం 50 యూనిట్ల చొప్పునే వాడినా నాలుగు కుటుంబాలకు కలిపి మొత్తం 200 యూనిట్లకు గాను రూ.1,000 బిల్లు అవుతోంది. అదే వేర్వేరు మీటర్లు ఉంటే ఒక కుటుంబానికి రూ.72.50 బిల్లు మాత్రమే కానుంది. -
వచ్చే ఏడాది కూడా ఇవే కరెంట్ చార్జీలు
-
వంద కోట్లతో ఎంఎస్ఎంఈ
అమరావతిలో పరిశ్రమల అభివృద్ధి సంస్థ: సీఎం సాక్షి, అమరావతి: వంద కోట్ల రూపాయల నిధితో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అమరావతిలో ఎంఎస్ఎంఈ కార్పొరేట్ భవన నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ చార్జీలు ఇక పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పారు. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ లోగోను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 237 ఎంఎస్ఎంఈ అసోసియేషన్లను అనుసంధానం చేసి, అమరావతి కార్యాలయం నుంచే పురోగతిని పరిశీలించే ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం : సీఎం
అమరావతి: సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుండటంతో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై ఆయన శనివారం సమీక్షించారు. వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ఈ నెలాఖరున ఓర్వకల్లు విమానాశ్రయానికి శంకుస్థాపన జరుగుతుందని, జూలై నెల చివరకు విజయవాడ-ముంబయి, విజయవాడ-తిరుపతి, విజయవాడ-ఇండోర్ విమాన సర్వీసులు నడుస్తాయని వివరించారు. గ్యాస్ పైపు లైన్ల ఏర్పాటులో జాప్యంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. -
అదను చూసి చార్జీలు బాదుతారు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ చార్జీలు పెంచ ట్లేదని గొప్పలకు పోతున్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యానే ఇలా చెబుతున్నారు. ఎన్నికలు ముగి సిన తర్వాత ఆదాయ లోటును పూడ్చుకోడానికి ఒక్కసారిగా విద్యుత్ చార్జీలు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తారు’ అని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లపై విద్యుత్ రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు, వక్తలు మండిపడ్డారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి పైపైన బాగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పెచ్చురిల్లిన అవినీతితో రైతు లు, ప్రజలు తీవ్ర ఇబ్బందు లు గురవుతున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తే ‘మేమేమీ చేయలేం, ఏసీబీకి ఫిర్యాదు చేసుకోండి’ అని డిస్కంల ఉన్నతాధికారులు పేర్కొనడం సరికాదని తప్పుబట్టారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీ డీసీఎల్) 2017–18కి సంబంధించి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), విద్యుత్ టారీఫ్ ప్రతిపాదనలపై మంగళవారం హైదరాబాద్‌లో ని ఫ్యాప్సీ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) నిర్వహించిన బహి రంగ విచారణ వాడివేడీగా జరిగింది. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీని వాస్ల సమక్షంలో కార్యక్రమం జరిగింది. చేతులు తడపనిదే పని జరగదు.. క్షేత్రస్థాయి అధికారుల చేతులు తడిపితేకాని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, కొత్త స్తంభాల ఏర్పాటు, కొత్త వ్యవసాయ కనెక్షన్ల జారీ కావడం లేదని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల అమాయక రైతులు, పౌరులు విద్యుదాఘాతాలు, ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా బహిరంగ విచారణలో ఈ అంశాలపై ఫిర్యాదు చేస్తున్నా డిస్కంల యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఏకంగా 11,303 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండనుందని అంచనాల్లో చూపారని, యూనిట్‌కు రూ.1.97 చొప్పున స్థిర చార్జీలు విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సి వస్తుందని, దీంతో ప్రజలపై రూ.2,226 కోట్ల అనవసర భారం పడనుందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్‌రావుతో పాటు ఎం.తిమ్మారెడ్డి, దొంతి నర్సింహారెడ్డి తప్పు బట్టారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, స్తంభాల ఏర్పాటు కోసం క్షేత్రస్థాయి అధికారులు రైతులను దోచుకుంటున్నారని, ఈ అవినీతికి చెక్‌పెట్టాలని పలువురు కోరారు. ఓపెన్ యాక్సెస్‌కు అనుమతించండి తెలంగాణలో రైల్వే ట్రాక్షన్ కేటగిరీ విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.7.10 ఉండగా, ఏపీలో రూ.4.74 మాత్రమే వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు ఉండటంతో రాష్ట్రంలో కొత్త రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టులను ప్రారంభించలేకపోతున్నాం. ఏపీ తరహాలో రైల్వేకు విద్యుత్ చార్జీలను రూ.4.74కు తగ్గించాలి. లేకుంటే ఓపెన్ యాక్సెస్ విధానంలో బయట నుంచి విద్యుత్ కొనేందుకు అనుమతించాలి. –ఎల్ఎల్ మీనా, చీఫ్ ఇంజనీర్, ద.మ«.రైల్వే ఛత్తీస్‌గఢ్‌కు రూ.50 కోట్ల ట్రేడింగ్ మార్జిన్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ గతేడాది యూనిట్‌కు రూ.5.47 కాగా.. ఈ ఏడాది రూ.6.71కు పెంచుతూ ప్రతిపాదించడం సరికాదు. ఒక్కసారిగా 15 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుంది. ఏపీ, తెలంగాణ జెన్కోల విద్యుత్ ధరలు అసాధారణ రీతిలో పెరిగిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్ డిస్కంలు రూ.50 కోట్ల ట్రేడింగ్ మార్జిన్‌ను తెలంగాణ నుంచి రాబట్టుకుంటామని ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలిపాయి. ఇది కూడా ప్రజలపై భారం కానుంది. –సౌరభ్ కుమార్ శ్రీవాస్తవ, ఫ్యాప్సీ -
ఇది బాబు మార్క్ సర్కార్
► పేదోడిపై విద్యుత్ భారం ► విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల సర్వత్రా విమర్శలు రాజంపేట టౌన్ : సామాన్యుడి సంక్షేమమే ధ్యేయమని పదేపదే చెప్పుకువచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచి పేదోడిపై పెను భారాన్ని మోపారు. గతంలో 9 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు ప్రజలపై అన్ని రకాల భారాలను మోపి, ప్రజలకు పెట్టిన బాధలు అన్నీఇన్నీ కావు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో నేను మారాను, మీకు మంచి చేస్తాననని చెప్పి నోటికి వచ్చిన హామీలన్ని ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన బాబు తన పాత మార్క్ పాలనను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి ఇది బాబు మార్క్ పాలన అని నిరూపించాడు. ధనవంతులపైనే విద్యుత్ భారం పడుతుందని ప్రభుత్వం ప్రజలను నమ్మించే మాటలు చెపుతున్నా ముమ్మాటికి విద్యుత్ ఛార్జీల భారం పేద, మధ్య తరగతి ప్రజల, వ్యాపారులపై ప్రతి నెల ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది. తిని, తినక టీవీ, ఫ్యాన్, మిక్సి వంటి సౌకర్యాలను కల్పించుకున్న పేద, మధ్య తరగతి ప్రజలు విద్యుత్ ఛార్జీల పెంపుతో వాటిని అటకెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక మూడుమార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం పట్ల బాబు పాలన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఉపసంహరించుకోవాలి: పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. నోట్ల రద్దుతో ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా వెనకబడ్డారు. ఈతరుణంలో విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రభావం పేద, మ«ధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలపై పడుతుంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ఆందోళనలు చేపడతాం. ---చిట్వేలి రవికుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పేద, మధ్య తరగతి ప్రజలకే ఇబ్బంది: ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టతరంగా వుంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్య ప్రజలకు శరాఘాతంగా మారుతుంది. ---దండు గోపి, సాతపల్లె, రాజంపేట -
నడ్డివిరిచిన విద్యుత్ ఛార్జీలు
► పెరిగిన ఛార్జీలతో బతికేదేలా? ► పొదుపు పాటించకుటే బిల్లు మోతే ఎల్.ఎన్.పేట: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోవలసిన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునుంచే విద్యుత్ బిల్లులు మోత ప్రజల నెత్తిన పిడుగులా పడింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల వారికి ఇచ్చిన వేసవి కానుక ఇది. చంద్రబాబు మూడేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇది మూడోసారి. ఈనెల ఒకటో తేదీ నుంచి పెంచిన విద్యుత్ బిల్లు అమల్లోకి వచ్చాయి. పేద, బడుగు, బలహీన, మద్యతరగతి, ఉతన్న ఇలా ఏ వర్గాన్ని వదలకుండా అందరి నెత్తిన తలాకాస్త పెంచుకుంటు పోయారు. వినియోగదారుడు వాడుకునే ప్రతీ యూనిట్‌పైన పెంచిన ఛార్జీల భారం పడింది. ఇలా ఎడా పెడా పెంచుకుని పోతున్న విద్యుత్ ఛార్జీలను ఎలా భరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజల రోజు, నెలవారీ ఆదాయం (సంపాదన)లో ఎలాంటి పెరుగుదల లేకుండా పోతుంది. ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని పలు వర్గాలకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. వేసవి కాలం కావడంతో పని చేసుకుని ఇంటికి చేరి విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి పెరిగిన చార్జీలు షాక్కొడుతున్నట్లు ఉంటాయి. పిల్లలు టివీ చూస్తామన్న పెద్దలకు భయం పుట్టుకొస్తోంది. ప్రజలకు మోసం చేస్తున్నారు: చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు మోసం చేసే కార్యక్రమాలే ఎక్కువుగా జరుగుతున్నాయి. బాబు మారిడాని నమ్మిన ప్రజలు గత ఎన్నికల్లో పట్టం గట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత తన పాత విధానాలే అవలంబిస్తోన్నారు. ప్రజలకు మోసం చేయడంలో ఆయన కంటే ఘనాపాటి ఎవరు లేరు. ---కిలారి త్రినాద్, వైఎస్సార్ సీపీ మండల కన్వినర్, యంబరాం, ఎల్.ఎన్.పేట ప్రభుత్వమే భరించాలి: పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. అన్ని వర్గాల వారి కోసం కాకున్న కనీసం నెలకు 200 యూనిట్లు కంటే తక్కువగా విద్యుత్ వినియోగం చేసే లబ్దిదారులకు చెందిన ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. ఎప్పటికప్పుడు ఛార్జీలు పెంచుకుంటు పోవడం వలన కూలి చేసుకునే వారి కుటుంబాలకు అప్పులే మిగులుతాయి. ---బూర్లె లింగన్న, రైతు, మిరియాపల్లి, ఎల్.ఎన్.పేట -
చంద్రబాబూ.. గుణపాఠం నేర్వరా?
విద్యుత్ చార్జీలను పెంచితే మళ్లీ ప్రజా ఉద్యమమే సీపీఎం నేత బాబూరావు హెచ్చరిక బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళులు విజయవాడ : పేదలపై విద్యుత్ భారాలు మోపితే ప్రతిఘటన తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీ.హెచ్.బాబూరావు తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2000 సంత్సరంలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో జరిగిన ప్రజా ఉద్యమంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జరిపించిన పోలీసు కాల్పుల పాశవిక దాడికి 16 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఆదివారం సుందరయ్యభవన్‌లో నగర సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అమర వీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాబూరావు మాట్లాడుతూ 2000వ సంత్సరంలో విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేసి వాటిని తిప్పికొట్టారని గుర్తుచేశారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ విద్యుత్ చార్జీల పెంపునకు పూనుకోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ఆర్.తులసీరావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనా«థ్ తదితరులు పాల్గొన్నారు. -
'అంతా వారికే ఊడిగం చేస్తున్నారు'
హైదరాబాద్: నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్నారని లెఫ్ట్ పార్టీ నేతలు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు విద్యుత్ ధరలను పెంచాడని.. అదే మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు. గత ఉద్యమ స్ఫూర్తిగా ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బస్సుభవన్ ముట్టడికి యత్నం
హైదరాబాద్: పెంచిన విద్యత్, బస్సు చార్జీలకు నిరసనగా నగర బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం బస్సు భవన్ ఎదుట ధర్నా చేశారు. బస్సు భవన్ ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
విద్యుత్ చార్జీల మోతపై వైఎస్సార్సీపీ ధర్నా
కల్యాణదుర్గం : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ బిల్లులు మోతపై వైఎస్సార్సీపీ నాయకులు ధర్నాకు దిగారు. టీడీపీ ప్రభుత్వం వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక్కసారిగా విద్యుత్ చార్జీలను పెంచలేదని, కానీ ఈ ప్రభుత్వం మాటిమాటికీ చార్జీలను పెంచి ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోందని విమర్శించారు. ఈ ధర్నా వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు, రూరల్ కన్వీనర్ తిరుమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది. -
అప్పటివరకు పాత విద్యుత్ చార్జీలే: ఈఆర్సీ
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ టారీఫ్ ఆర్డర్ జారీ చేసే వరకు రాష్ట్రంలో ప్రస్తుత చార్జీలే అమల్లో ఉంటాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016-17కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) ను సమర్పించడంలో విద్యుత్ పంపణీ సంస్థ (డిస్కం) లు తీవ్ర జాప్యం చేయడంతో ఈ నెల 31 తేదీ లోపు కొత్త టారీఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ జారీ చేయలేకపోయింది. డిస్కంలు ప్రతిపాదించిన చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహించి కొత్త టారీఫ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే అమల్లో ఉంటాయని తాజాగా ఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చింది. -
'పుట్టినరోజున కూడా అచ్చెన్నాయుడు అబద్ధాలు'
పుట్టినరోజు నాడైనా నిజాలు చెబుతారని అనుకుంటే.. ఆరోజు కూడా అచ్చెన్నాయుడు అబద్ధాలే చెబుతున్నారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ సంస్కరణల బిల్లు మీద జరిగిన చర్చలో ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచగా, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్కసారి కూడా పెంచని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా విద్యుత్ చార్జీలను దారుణంగా పెంచుతున్నారని, ఏపీ డిస్కంలు ఎక్కువ రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని ఆయన అన్నారు. పవర్ ఎక్స్చేంజిలలో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉన్నా దాన్ని వదిలేసి ఎక్కువ ధరకు సుదీర్ఘ కాలం పాటు కొంటున్నారని ఆడిట్ సంస్థలే తప్పుబట్టాయని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం ఎక్కువ ధర పెడుతున్నాయని ఏపీఈఆర్సీకి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజి లేఖ కూడా రాసిందని అన్నారు. రోజుకు 24 గంటల పాటు యూనిట్‌కు రూ. 2.71 చొప్పున, రాత్రి సమయాల్లో అయితే రూ. 1.90 చొప్పున అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం మాత్రం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. 5.11 చొప్పున యూనిట్ విద్యుత్ కొంటోందని చెప్పారు. బొగ్గు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నా కూడా పాతరేట్లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో బషీర్ బాగ్ లో పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశారని, ఆ విషయం ఇప్పటికీ అందరికీ గుర్తేనని తెలిపారు. వైఎస్ తర్వాత వచ్చిన కిరణ్ సర్కారు కూడా విద్యుత్ చార్జీలు పెంచిందని.. అది కూడా తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తాము అవిశ్వాసం పెడితే చంద్రబాబు నాయుడు విప్ తమ సభ్యులకు జారీచేసి మరీ ఆ ప్రభుత్వాన్ని కాపాడారని ఆయన అన్నారు. -
పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
- విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన - 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు - 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 65 పైసల నుంచి 72 పైసలు పెంపు - 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి మంగళవారం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనలో.. 100 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని తెలుస్తోంది. 101 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు 0.65 పైసల నుంచి 0.72 పైసలు అదనంగా పెరగనుంది. 400 యూనిట్లు, ఆపై వాడే వినియోగదారులపై అదనంగా యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో 1958 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకోవాలనే దిశగా డిస్కంలు ప్రతిపాదించినట్టు తెలిసింది. 2016-17 సంవత్సరంలో సగటున యూనిట్‌కు 0.42 పైసలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. -
ఏపీ ప్రజలకు భారీగా విద్యుత్ షాక్!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో విద్యుత్ చార్జీలు మరోసారి ప్రజలకు భారీగా షాక్ ఇవ్వబోతున్నాయి. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. రూ.7200 కోట్ల మేర ఛార్జీల పెంపుకు ప్రతిపాదనలను డిస్కంలు అందచేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేయడంతో ఛార్జీల పెంపు అనివార్యం కానుంది. -
పల్లె ప్రజలపై ‘వీధి’ పోటు
* పంచాయతీల్లో ప్రజల నుంచి వసూలుకు ప్రభుత్వ నిర్ణయం * ఇంటి పన్నుతో కలిపి రాబట్టాలని ప్రతిపాదనలు * పంచాయతీరాజ్ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం * ఈ ఏడాది వసూలు లక్ష్యం... 78కోట్లు * బిల్లు నిర్ణయం ఇలా... ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి * ఇప్పటివరకు బకాయిలు 800 కోట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని ప్రజలపై మరో విద్యుత్ భారం పడనుంది. గ్రామ పంచాయతీల్లోని వీధి దీపాల విద్యుత్ చార్జీలను ప్రజల నుంచే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి పన్నుతో కలిపి వీధి దీపాల విద్యుత్ పన్నును కూడా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచన మేరకు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీల్లో ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన సమీక్షలో వీధి విద్యుత్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి గ్రామ పంచాయతీలు వీధి దీపాల కరెంట్ బిల్లును గ్రామస్తుల నుంచి వసూలు చేయనున్నారు. ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి ఒక్కో ఇంటికి ఎంత బిల్లు చెల్లించాలనేది నిర్ణయిస్తారు. దీనిని ఇంటి పన్నులోనే కలుపుతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి వీధి దీపాల చార్జీల పన్ను రూపేణా ఈ ఏడాది దాదాపు రూ. 78 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏం జరుగుతోంది.. చిన్న పంచాయతీల్లోని వీధి దీపాలకు, మంచినీటి పథకాల నిర్వహణ కోసం వినియోగించే కరెంట్‌కు ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయిస్తూ 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 44ను జారీ చేసింది. పెద్ద పంచాయతీల్లో వీధి దీపాల కరెంట్ చార్జీలను చాలా ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకు చెల్లిస్తూ పంచాయతీలపై కరెంట్ బిల్లుల భారం లేకుండా చేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరిగి బాధ్యతలు చేపట్టాక.. విద్యుత్ శాఖ 1987 జీవోకు భిన్నంగా మైనర్ పంచాయతీలలో వీధి దీపాల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. దాదాపు రూ. 612 కోట్లు బకాయిగా పేర్కొంది. దీంతోపాటు పెద్ద పంచాయతీల విద్యుత్ బిల్లు బకాయిలను కలిపి దాదాపు రూ. 800 కోట్లు వసూలుకు ఆయా గ్రామ పంచాయతీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాలకు విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేసింది. ఈ వివాదం నేపథ్యంలో పాత బకాయిల వసూలుకు పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల మధ్య చర్చలు నడుస్తుండగానే.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ వీధి దీపాలకు వినియోగించే కరెంట్ బిల్లులను తప్పనిసరిగా చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత నాలుగు నెలలుగా పంచాయతీ సర్పంచ్‌లు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులను మళ్లించి వీధి దీపాల చార్జీల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. -
విద్యుత్ ‘చార్జ్’
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి కరెంట్ చార్జీల పెంపు సగటున 4.4 శాతం మోతకు ఈఆర్సీ ఆమోదం ప్రజలపై రూ. 816 కోట్ల భారం.. పేదలకు ఊరట 200 యూనిట్ల వరకు పాత చార్జీలు.. ఆపై బాదుడే పరిశ్రమలకు 5 శాతం పెంపు వ్యవసాయ వినియోగ లెక్కలకు ఈఆర్సీ కత్తెర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల మోత మోగింది. ప్రస్తుత విద్యుత్ చార్జీల మీద సగటున 4.42 శాతం పెంపునకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రజలపై రూ.816 కోట్ల భారం పడనుంది. ఫిబ్రవరి 7న విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి సమర్పించిన చార్జీల ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను పరిశీలించిన ఈఆర్సీ... ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈ కొత్త చార్జీలను ప్రకటించింది. అయితే డిస్కంలు చేసిన పలు ప్రతిపాదనలను ఈఆర్సీ అంగీకరించలేదు. గృహ వినియోగదారులకు సంబంధించి 100 యూనిట్ల లోపు వరకు చార్జీల పెంపును డిస్కంలే మినహాయించాయి. ఆపైన పెంపును కోరాయి. కానీ ఈఆర్సీ మాత్రం నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి కూడా భారం పడకుండా మినహాయింపునిచ్చింది. దీంతో 200 యూనిట్లకు మించితే చార్జీ మోత మోగడం ఖాయమైంది. ఇక వ్యవసాయ, కుటీర పరిశ్రమలకు చార్జీలు పెంచకుండా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం ఆ వర్గాలకు ఊరటనిచ్చింది. మిగతా వ్యాపార, వాణిజ్య కేటగిరీలన్నింటా చార్జీల పెంపు ఉంది. టెలిస్కోపిక్ విధానం కాబట్టి శ్లాబ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీల లెక్కింపు ఉంటుంది. మొత్తంగా గృహాల కేటగిరీలో సగటున 1.3 శాతం చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 1,088.68 కోట్ల పెంపును ప్రతిపాదిస్తే... ఈఆర్సీ రూ. 272.68 కోట్ల మేరకు తగ్గించి.. రూ. 816 కోట్ల భారానికి పచ్చజెండా ఊపింది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ప్రార్థన మందిరాలన్నింటికీ చార్జీలు పెంచింది. పరిశ్రమల కేటగిరీల్లో సగటున 5 శాతం చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో 200 వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు దాదాపు 80 లక్షలు ఉన్నాయి. వారికి ప్రస్తుత భారం నుంచి ఉపశమనం లభించినట్లే. అంతకు మించి విద్యుత్ వినియోగించే 8 లక్షల కుటుంబాలపై పెంపుతో భారం పడుతుంది. 80 లక్షల ఇళ్లకు ఉపశమనం.. రాష్ట్రంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.20 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయని ఈఆర్సీ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 88 లక్షల కనెక్షన్లు గృహ వినియోగదారులే. అంటే వారందరిపై చార్జీల భారం ఉండదని టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ప్రకటించారు. చైర్మన్‌తో పాటు ఈఆర్సీ సభ్యులు హెచ్.శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి శుక్రవారం కొత్త విద్యుత్ చార్జీలను వెల్లడించారు. వ్యవసాయ, కుటీర పరిశ్రమలను పెంపు నుంచి మినహాయించడంతో 18 లక్షల మందిపై ప్రభావం ఉండదని వారు చెప్పారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహేతర చిరు వ్యాపారులు, దుకాణాలకు సంబంధించి 10.6 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో 6 లక్షల కనెక్షన్లకు చార్జీల పెంపు భారమేమీ ఉండదని తెలిపారు. మొత్తంగా ప్రస్తుతమున్న చార్జీలతో పోలిస్తే 4.4 శాతం చార్జీలు పెరిగాయని.. గృహాల కేటగిరీలో కేవలం 1.3 శాతం పెరిగాయని ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్), దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సమర్పించిన ఆదాయ వ్యయ నివేదికలు, కొత్త చార్జీల ప్రతిపాదనల ప్రకారం.. వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు 4 నుంచి 5.75 శాతం వరకు ఉంది. సర్కారు సబ్సిడీ రూ. 4,227 కోట్లు.. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,473.76 కోట్లు అవసరమని ఏఆర్ఆర్ నివేదికల్లో ప్రతిపాదించాయి. కానీ ఈఆర్సీ రూ. 23,416 కోట్లకు దీనిని కుదించింది. మొత్తం రూ. 6,476.23 కోట్ల లోటు ఉందని డిస్కంలు ఏఆర్ఆర్ నివేదికల్లో పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి రూ. 5,387.55 కోట్ల సబ్సిడీ ఆశిస్తూ... రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. అయితే ప్రభుత్వం రూ. 4,227 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. కోళ్ల పరిశ్రమకు అదనంగా ఇచ్చిన రూ. 30 కోట్ల సబ్సిడీని నేరుగా చార్జీలలోనే సర్దుబాటు చేసింది. వీటికి యూనిట్‌కు రూ. 5.63 చొప్పున ఉన్న చార్జీని ఏకంగా రూ. 2.03కు తగ్గించింది. అయితే కొత్త టారిఫ్‌లో పౌల్ట్రీ ఫారాలకు రూ. 3.60 చొప్పున చార్జీ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్ వినియోగం డిస్కం లు అంచనా వేసినంతగా ఉండదని ఈఆర్సీ అభిప్రాయపడింది. సర్కారు ఇస్తున్న సబ్సిడీ సరిపోతుందని పేర్కొంటూ... కేటగిరీల వారీగా వ్యవసాయ విద్యుత్ వినియోగ లెక్కలను తగ్గించింది. డిస్కంలు 13,431 మిలియన్ యూనిట్లు అవసరమని అంచనా వేసుకోగా.. ఈఆర్సీ భారీగా కత్తెర పెట్టి 10,650 మిలియన్ యూనిట్లు సరిపోతుందని స్పష్టం చేసింది. ఇందులో ఎన్పీడీసీఎల్కు 4,300 మిలియన్ యూనిట్లు, ఎస్పీడీసీఎల్కు 6,350 యూనిట్లు సరిపోతుందని పేర్కొంది. రూ. 3,789 కోట్లలోటు చూపిన ఎన్పీడీసీఎల్కు రూ. 3,529 కోట్లు ప్రభుత్వ సబ్సిడీ అందుతుందని, రూ. 2,687 కోట్లలోటు చూపిన ఎస్పీడీసీఎల్కు రూ. 698 కోట్లు సబ్సిడీ అందుతుందని ఈఆర్సీ వెల్లడించింది. ప్రస్తుత, ప్రతిపాదిత చార్జీలతో భారం (రూ.లలో) యూనిట్లు ప్రస్తుత చార్జీ ప్రతిపాదిత చార్జీ 100 202.50 202.50 200 620 620 201 670.38 826.80 250 983 1,160 300 1,327 1,525 400 2,065 2,305 పెంపుతో ఆదాయ, వ్యయాలు (రూ. కోట్లలో) 2015-16లో రాబడి అంచనా 23,416 ప్రస్తుత చార్జీలతో ఆదాయం 18,373 చార్జీల పెంపుతో వచ్చే రాబడి 1,816 ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 4,227 -
విద్యుత్ చార్జీల పెంపుపై ఆగ్రహం
కుందుర్పి (అనంతపురం) :రాష్ట్రప్రభుత్వం పెంచిన విధ్యుత్తు చార్జీలకు నిరసనగా గురువారం వైఎస్సార్సీపీ నాయకులు కుందుర్పిలో ర్యాలీ మరియు రెవిన్యూకార్యాలయం ముందు ధర్నా చేపట్టి ఆంధోళన చేపట్టారు.స్థానిక రామస్వామి ఆలయం నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక రెవిన్యూకార్యాలయం ముందు రెండుగంటలపాటు ధర్నా నిర్వహించారు.కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపి ప్రదాన కార్యాలయానికి తాళాలు వేసి బైటాయించి నిరసన తెలిపారు.అనంతరం మండల కన్వినర్ ఎస్‌కేఆంజినేయులు మరియు నాయకులు నరేష్,రామూర్తి,ఎన్‌బాబు,ఈరాము తదితరులు మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన 9నెలలు కాలంలోనే ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని రుణమాఫీ,పండ్లతోటల బిల్లులు,ఫించన్లు,తదితర పథకాలను అమలుచేయకపోగా రోజూ ప్రజలకు అపద్దప్రకటనలతో సీఎం చంద్రబాబు ముందుకుసాగుతున్నారని తెలిపారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాలనలో రూపాయి విధ్యుత్తు చార్జీలు పెంచకుండా రైతులకు మరియు సామాన్యప్రజల అభివృధ్దికి బాటలు వేశారని సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది గడువక ముందే విధ్యుత్తు చార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపారన్నారు.అనంతరం ఏపీఓ నీరజను అక్కడకు చేరుకున్న నాయకులు పలువురు ఉపాదికూలీలు బిల్లులు చెల్లించాలని నిలదీశారు.ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పెద్దప్పయ్య, అతావుల్లా, పాలాక్షి, బండారప్ప, స్టుడియో కిష్ట, తిమ్మ రాజు, ఎనుముల దొడ్డిరాముడు, పూలరామాంజి, మల్లి, శివలింగమూర్తి, శ్రీనివాసులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబుది దగాకోరు ప్రభుత్వం'
అనంతపురం : పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం సీపీఐ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మని దహనం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వమంటూ ధ్వజమెత్తారు. సీపీఐ నగర కమిటీ మంగళవారం అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని దుమ్మెత్తి పోశారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్‌చార్జీలు పెంచబోమని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు చార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధపడడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు మోసపోయామని ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారన్నారని, ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారని సీపీఐ పేర్కొంది. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బాలపెద్దన్న, అల్లీపీరా, కార్పొరేటర్ పద్మావతి, బాషా, ఎల్లుట్ల నారాయణస్వామి, పెనకచర్ల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఛార్జీలపెంపు: వైఎస్సాఆర్ సీపీ వాకౌట్!
-
ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 50 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎన్నికల హామీ మేరకు ఢిల్లీలో విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. నెలకు 400 యూనిట్ల వరకు వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది. దీంతో 90 శాతం ఢిల్లీ వాసులకు ప్రయోజనం చేకూరనుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని కేబినెట్ బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయించింది. మార్చి 1 నుంచి ఇది అమలుకానుంది. అలాగే ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతకన్నా ఎక్కువ వాడితే మాత్రం బిల్లు కట్టాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు నిర్ణయాల వల్ల రాష్ర్ట ప్రభుత్వంపై ఏటా రూ.1, 670 కోట్ల భారం పడనుంది. ఉచిత నీటి సరఫరా వల్ల 18 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇక విద్యుత్ డిస్కంల ఖాతాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)తో ఆడిట్ చేయించిన తర్వాత విద్యుత్ రేట్లను సమీక్షిస్తామని సిసోడియా చెప్పారు. మరోవైపు ఇదే అంశంపై సీఎం కేజ్రీవాల్ బుధవారమే కాగ్ శశికాంత్ శర్మను కలిశారు. -
రొయ్యయ్యో..
వ్యాపారుల మాయాజాలంతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. నాణ్యతలేని సీడ్‌తో దిగుబడులు సగానికి పడిపోయి..సాగు ఖర్చులు రెట్టింపై ఒకవైపు తల్లడిల్లుతుంటే ధరలు పతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోజూ కేజీకి రూ.10 నుంచి రూ.20 ధర తగ్గిస్తూనే ఉన్నారు. టంగుటూరు: రొయ్యల వ్యాపారులు కూడబలుక్కొని ధరలను అమాంతం తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యతలేని సీడ్ కారణంగా దిగుబడులు సగానికి పడిపోయాయి. సీడ్, ఫీడ్, కెమికల్స్ ధరలు, విద్యుత్ చార్జీలు పెరగడంతో సాగు వ్యయం పెరిగిపోయింది. దీనికితోడు ధరల తగ్గుదల రైతులకు ఆశనిపాతంలా మారింది. యాంటీబయోటిక్స్ సాకుతో ధరల తగ్గుదల: యాంటీబయోటిక్స్ అధిక మోతాదులో వాడారన్న కారణంగా మూడు నెలల క్రితం అమెరికాకు ఎగుమతైన రొయ్యల కంటైనర్లు కొన్ని తిరస్కరణకు గురై వెనక్కు వచ్చాయి. ఇదే సాకుగా చెప్పి వ్యాపారులు ధరలు తగ్గించడం ప్రారంభించారు. మూడు నెలల క్రితం వరకు రైతులకు గిట్టుబాటుగా ఉన్న ధరలపై వ్యాపారులు సిండికేటై కొర్రీలేశారు. అప్పటి వరకు కేజీ 30 కౌంట్ రూ.500 వరకూ ఉన్న ధరను క్రమంగా తగ్గించుకుంటూ మంగళవారానికి రూ.430కు చేర్చారు.ఇటీవలి కాలంలో రోజుకి రూ.10 నుంచి రూ.20 తగ్గిస్తూనే ఉన్నారు. మంగళవారం నాటి రొయ్యల ధరలు: 30 కౌంట్ రూ.430, అలాగే 40 కౌంట్ రూ.360, 50 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ.300, 70 కౌంట్ రూ.280, 80 కౌంట్ రూ.260, 90 కౌంట్ రూ.230, 100 కౌంట్ రూ.210 ధరలు ఉన్నాయి. 30, 40 కౌంట్లకు లేని గిరాకీ: సాధారణంగా రొయ్యలనగానే 30 కౌంట్‌కు ఇచ్చే ధరనే ప్రామాణికంగా భావిస్తారు. 30 కౌంట్‌కే అధిక ధర చెల్లిస్తారు. అయితే ప్రస్తుతం 30, 40 కౌంట్లకు గిరాకీ లేదు. ఈ రెండు కౌంట్లకు రోజుకు రూ.10 నుంచి రూ.20 ధర తగ్గించేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ రెండు రకాల కౌంట్ల రొయ్యలను అడిగే వ్యాపారులే కరువయ్యారు. 30 కౌంట్ వరకూ రొయ్యలు పెంచితే అధిక ధరలతో పాటు దిగుబడయ్యే సరుకూ పెరుగుతుందని రైతులు ఆశిస్తారు. అందుకే కష్టమైనా..నష్టమైనా మధ్యలో రొయ్యలు దెబ్బతింటే తప్ప రైతులంతా 30 కౌంట్ వరకూ రొయ్యలు పెంచేందుకే ప్రయత్నిస్తారు. ప్రస్తుతం 30 కౌంట్ వరకూ రొయ్యలు పెంచిన రైతులు సరుకు అడిగే వారు లేక కొనుగోలుకు ముందుకొచ్చినా ధరలు దారుణంగా తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. ధరలు ఇవ్వరు..పొరుగు రాష్ట్రాల వ్యాపారులను దరిచేరనివ్వరు: రాష్ట్రంలోని తీర ప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తున్నారు. మండలంలోని తీర ప్రాంతంలోనే సుమారు 5 వేల హెక్టార్లలో రొయ్యల సాగు ఉంది. ఇక్కడి దిగుబడులను విశాఖపట్నం కేంద్రంగా కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తూ ధరలను వారి ఇష్టానుసారం కొనుగోలు చేస్తున్నారు. వీరిచ్చే ధరల కన్నా కేజీ రూ.20 పైగా అధికంగా ఇచ్చి కొనుగోలు చేసేందుకు మహారాష్ట్ర, కేరళ, ఒడిసా వ్యాపారులు ముందుకొస్తున్నా వారిని ఇక్కడి వ్యాపారులు రానివ్వరు. ధరలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా ఉంది. రొయ్యల ఎగుమతులపై సుంకం రూపేణా ఏడాదికి కోట్లాది రూపాయలు గడిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను వ్యాపారులకు వదిలి..రైతులను గాలికొదిలేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హేచరీల దోపిడీ.. హేచరీల్లో ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని సీడ్ ను అధిక ధరలకు రైతులకు అంటగడుతూ కోట్లు గడిస్తున్నాయి. మత్స్యశాఖాధికారులు వాటిపై కన్నెత్తి చూడటం లేదు. చెరువులో వేసిన సీడ్ సగానికిపైగా ప్రాథమిక దశలోనే చనిపోతూ సర్వేవల్ 60 శాతానికి పడిపోతోంది. నాణ్యతలేని సీడ్ రైతులకు సరఫరా చేస్తున్న హేచరీలు తమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నాయి. వ్యాపారులు, అధికారులు, హేచరీల యాజమాన్యాలు రైతులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. -
విద్యుత్ చార్జీలపై యుద్ధం
విజయవాడ : విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పది వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. మంగళవారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయా పార్టీల సమావేశం జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకుడు పి.సుందరరామరాజు అధ్యక్షత వహించారు. విద్యుత్ పంపిణీలో నష్టాలను అరికట్టడం, ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడం, ప్రభుత్వ సబ్సిడీ పెంచడం తదితర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపైనే భారం వేసేందుకు సిద్ధమవడాన్ని వామపక్షాలు ఖండించాయి. చార్జీల పెంపును అడ్డుకునేందుకు కార్యాచరణను ప్రకటించాయి. వివిధ ప్రాంతాల్లో ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణల్లో పాల్గొని చార్జీలు పెంచడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయాలని, ధర్నాలు నిర్వహించాలని సమావేశం కార్యకర్తలకు పిలుపునిచ్చింది. చార్జీలు పెంచితే ప్రజలపై రూ.1,261 కోట్ల మేరకు భారం పడుతుందని నేతలు పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఇలావుండగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు తదితర ప్రాంతాల్లో, ప్రభుత్వ పోరంబోకు ప్రదేశాల్లో నివాసం ఉంటున్న పేదల ఇళ్లస్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలుచేయాలని కేంద్రాన్ని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకులు ఆర్.రమ, పోలారి, సీపీఐ ఎంఎల్ నాయకులు కోటయ్య, సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శిశు సంక్షేమ శాఖకు రూ.1100 కోట్లివ్వండి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ శిశు సంక్షేమశాఖకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మేనకాగాంధీని రాష్ట్ర మంత్రి పీతల సుజాత కోరారు. ఢిల్లీ శాస్త్రి భవన్లో మంగళవారం మధ్యాహ్నం కేంద్రమంత్రితో పీతల భేటీ అయ్యారు. అనంతరం ఏపీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి నీలం సహానీతో కలసి ఆమె మాట్లాడారు. ‘మహిళా, శిశు సంక్షే మ శాఖ నుంచి ఈ బడ్జెట్లో రూ. 1,100 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చాం. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని చెప్పారు. -
ఫోర్త్ ఏస్టేట్: ఎడా పెడా బాదుడే!
-
'విద్యుత్‌చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి'
హైదరాబాద్: బీజేపీని ఓడించడానికి ఆప్‌తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓట్లను ఆప్‌కు బదలాయించడం వల్లే ఒకశాతం ఓట్లు తగ్గి, బీజేపీ ఓడిపోయిందన్నారు. బీజేపీ ఏవైనా తప్పులు చేస్తే తప్పకుండా ఆత్మ పరిశీలన ఉంటుందన్నారు. ముస్లింల విశ్వాసం పొందేలా పార్టీని నడిపిస్తామని వెల్లడించారు. అలాగే, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఛాతీ ఆసుపత్రిని హైదరాబాద్ నుంచి తరలించాలనే నిర్ణయంపై బీజేపీ న్యాయపోరాటానికి దిగుతుందన్నారు. -
మళ్లీ విద్యుత్ చార్జీల మోత!
మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలకు వచ్చే నెలలో కరెంటు చార్జీల షాక్ రాసిపెట్టి ఉందని నిర్ధారణ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,261 కోట్ల భారం వేయడానికి రంగం సిద్ధమవుతుండగా... తెలంగాణలో ఇది రూ. 1,089 కోట్ల వరకూ ఉండొచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి. దేశం ఆర్థిక సంస్కరణల మార్గం పట్టాక విద్యుత్ చార్జీల పెంపులో ఓ కొత్త పద్ధతి అమలు కావడం మొదలైంది. రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డులు రద్దయి...రంగంలోకి విద్యుత్ నియంత్రణ కమిషన్(ఈఆర్సీ)లు, డిస్కంలు, ట్రాన్స్‌కోలు వచ్చిపడ్డాక విద్యుత్ వినియో గదారులకు హఠాత్తుగా షాకిచ్చే విధానం మాయమైంది. పెంచబోయే విద్యుత్ చార్జీలపై వినియోగదారులను దశలవారీగా మానసికంగా సిద్ధం చేసే సృజనాత్మక విధానం ఒకటి ప్రారంభమైంది. ముందు డిస్కంలు విద్యుత్ సరఫరాలో తమకు వస్తున్న నష్టాలను ఏకరువు పెడుతూ ఈఆర్సీకి నివేదికలందజేస్తాయి. ఏమేరకు చార్జీలు పెంచవలసివస్తుందో ప్రతిపాదనలు సమర్పిస్తాయి. అలా సమర్పించే ముందు ప్రభుత్వంతో చర్చించి అనుమతి తీసుకోవడం రివాజు. డిస్కంలు చేసిన ప్రతిపాదనలపై ఈఆర్సీ సమీక్షించి, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. చివరకు చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి చార్జీలను ‘బాగా ఎక్కువ’గా పెంచాలని ఆంధ్రప్రదేశ్‌లో డిస్కంలు సూచించినా చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకించిందని కథనాలు వెలువడ్డాయి. 15 శాతం పెంచాలన్న డిస్కంల సూచనను ప్రభుత్వం తిరస్కరిస్తే కనీసం 10 శాతం పెంపుకైనా అనుమతించాలని అవి విన్నవించుకున్నాయట. కానీ, దీన్ని కూడా తిరస్కరించి ముందుగా ప్రత్యామ్నాయాలను పరిశీలించి రమ్మని వెనక్కి పంపారట. ఈ కర్మకాండ అంతా పూర్తయ్యాక 6 శాతం మేరకు చార్జీలు పెంపును ప్రతిపాదిస్తూ ఏపీ డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. తెలంగాణలోనూ కొంచెం తేడాతో ఇదే నడిచింది. కాకపోతే డిస్కంల చార్జీల ప్రతిపాదనలు అత్యంత గోప్యంగా ఉండిపోయాయి. ఈఆర్సీకి ఇచ్చాకగానీ ఆ ప్రతిపాదనల వివరాలు బయటకు పొక్కలేదు. మొత్తానికి 5.75 శాతం మేర పెంచడానికి డిస్కంలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రెండు రాష్ట్రాలూ ఎవరికి వారు అవతలివారు ఏమేరకు పెంచుతారో చూసి దాన్నిబట్టి తాము నిర్ణయించుకోవాలనుకున్నందున ప్రతిపాదనల సమర్పణలో కాస్తంత జాప్యం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఎంత పెంచదల్చుకున్నదో తెలిశాకే తెలంగాణ డిస్కంల ప్రతిపాదనలు ఆఖరి నిమిషంలో ఈఆర్సీకి వెళ్లాయి. ఏపీతో పోలిస్తే ‘తక్కువ’ పెంచిన కీర్తి కూడా దక్కింది. రెండుచోట్లా చార్జీలు పెరిగినా బోలెడు లోటు ఉంటుందని వార్షిక రాబడి, అవసరాల నివేదికలు(ఏఆర్‌ఆర్‌లు) చెబుతున్నాయి. మొత్తంగా తమకు రూ. 6,721 కోట్లు నష్టం వస్తున్నదని తెలంగాణ డిస్కంలు తేల్చితే...తమ నష్టం 7,716 కోట్లని ఏపీ డిస్కంలు వెల్లడించాయి. చార్జీలు పెంచదల్చుకున్నప్పుడల్లా నష్టాల వాదనలే తెరపైకి వస్తాయి. డిస్కంలిచ్చే ప్రతిపాదనలను మరో మాట లేకుండా ప్రభుత్వాలు ఆమోదిస్తాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దీనికి మినహాయింపు. విద్యుత్ చార్జీలను పెంచబోమని 2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆయన ప్రభుత్వం తు చ తప్పకుండా అమలు చేసింది. మరో అయిదేళ్లపాటు కూడా పెంచేది లేదని ఆయన 2009 ఎన్నికల్లో చెప్పారు. అయితే, ఆయన కనుమరుగైన అనంతరం వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు రకరకాల పేర్లతో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని మోపాయి. ఇదంతా దాదాపు రూ. 33,000 కోట్లు! తమకు అధికారం అప్పగిస్తే విద్యుత్ చార్జీలు పెంచ బోమని మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు కూడా ప్రకటించారు. కానీ, ఇతర వాగ్దానాల్లాగే దాన్ని కూడా మూలనపడేశారు. నిజానికి విపక్షంలో ఉన్నప్పు డు చార్జీల పెంపును ఆయన గట్టిగా వ్యతిరేకించారు గనుక అధికారంలోకి రాగానే వాటిని వెనక్కు తీసుకోవాలి. కనీసం హామీ ఇచ్చిన ప్రకారం కొత్తగా చార్జీలైనా పెం చకుండా ఉండాలి. కానీ ఆయన చార్జీల పెంపు దోవనే ఎంచుకు న్నారు. నిరుపేద వినియోగదారులను ఇబ్బంది పెట్టడంలేదని చెప్పడంవ ంటివన్నీ కంటి తుడుపు కబుర్లు. వాటికంత విలువ లేదు. పరిశ్రమలపైనా, వాణిజ్య వినియో గదారులపైనా మోపే భారం అంతిమంగా సాధారణ ప్రజానీకానికే వివిధ రూపాల్లో బదిలీ అవుతుంది. డిస్కంలకు నష్టాలు వస్తున్న మాట నిజమే అయినా వాటిని పూడ్చు కోవడం కేవలం చార్జీల పెంపుద్వారా మాత్రమే సాధ్యమని వాదించడం ప్రజలను పక్కదోవ పట్టించడమే. అంతర్జాతీయంగా పెట్రో ధరలు... మరీ ముఖ్యంగా బొగ్గు, గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఇదిగాక కాలంచెల్లిన ట్రాన్స్ఫార్మర్ల నూ, ఇతర పరికరాలనూ మార్చడం...పటిష్టమైన నిఘాతో వాణిజ్య చౌర్యానికి అడ్డుకట్టవేయడం వంటి చర్యలవల్ల విద్యుత్ పంపిణీ, సరఫరాల్లో జరిగే నష్టాన్ని అరికట్టడం వీలవుతుంది. ఇలాంటి అంశాలపై దృష్టిపెట్టకుండా సులభంగా అయి పోయే చార్జీల పెంపు మార్గాన్నే ఎంచుకోవడం ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం చేయ డమే అవుతుంది. చార్జీల పెంపుపై వచ్చిన ప్రతిపాదనలపై కొంచెం అటూఇటుగా నిర్ణయాలు తీసుకోవడం కాక ఈఆర్సీలు కూడా హేతుబద్ధంగా వ్యవహరించాలి. విద్యుత్ సంస్థల్లో అడుగంటుతున్న క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచడానికి కృషి చేయాలి. డిస్కంలకొచ్చే నష్టాలను ఇతరత్రా పూడ్చుకోవడానికి ఏమేరకు వీలున్న దో సూచనలివ్వాలి. రిటైర్డ్ అధికారులతో నిండివుండే ఈఆర్సీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాయని భావించబట్టే వాటికి హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారి నేతృత్వం ఉండాలని నిరుడు సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే నెలలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణల తర్వాత ఈఆర్సీలు ప్రభుత్వాలకు సరైన మార్గ నిర్దేశనం చేయగలిగితే ప్రజలు సంతోషిస్తారు. -
కరెంటు వాతకు సిద్ధం!
రూ. 1,089 కోట్ల వరకూ విద్యుత్ చార్జీల భారం పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి అందించిన డిస్కంలు సగటున 5.75 శాతం చార్జీల పెంపు ఆంధ్రప్రదేశ్ కంటే స్వల్పంగా తక్కువ డిస్కంల మొత్తం ఖర్చు రూ. 26,700 కోట్లు ప్రస్తుత ఆదాయం రూ. 18,900 కోట్లు 2015-16 లోటు అంచనా రూ. 7,800 కోట్లు చార్జీల పెంపుతో వచ్చే అదనపు రాబడి రూ. 1,089 కోట్లు డిస్కంల నికర లోటు రూ. 6,721 కోట్లు అత్యంత గోప్యంగా ఏఆర్ఆర్ల సమర్పణ వివరాలు వెల్లడించని డిస్కం అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాష్ట్రం కావడంతో కొంత ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే భారాన్ని కొంత మేరకు తగ్గించింది. ఈ మేరకు కొత్త చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు అత్యంత నాటకీయంగా, గోప్యంగా శనివారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. చార్జీల వివరాలతో పాటు 2015-16 ఆర్థిక సంవత్సరపు వార్షిక రాబడి, అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) అందజేశాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఫైనాన్స్ డెరైక్టర్ శ్రీనివాసరావు, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) జనరల్ మేనేజర్ మధుసూదన్ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డికి ఈ నివేదికలు సమర్పించారు. అందులోని వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. కానీ విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఏఆర్‌ఆర్‌లలో రూ. 7,800 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు చూపించాయి. అందులో రూ. 1,089 కోట్లను చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. అంటే సగటున 5.75 శాతం చార్జీల పెంపు ఉండే అవకాశముంది. కేటగిరీల వారీగా చార్జీల్లో కొంత హెచ్చు తగ్గులుండే అవకాశమున్నప్పటికీ... ఏపీతో పోలిస్తే 0.25 శాతం తక్కువగానే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని డిస్కంల అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు తక్కువ విద్యుత్ వినియోగించే అల్పాదాయ వర్గాలపై భారం పడకుండా... సంపన్న వర్గాలు, పరిశ్రమలు, ఎక్కువ విద్యుత్ వాడే కేటగిరీలకు చార్జీలు పెరగనున్నాయి. పెంచినా నికరంగా లోటే... విద్యుత్ చార్జీలను పెంచినప్పటికీ డిస్కంలపై నికరంగా రూ. 6,721 కోట్ల లోటు ఉంటుంది. దానిని పూడ్చుకునేందుకు ప్రభుత్వమిచ్చే సబ్సిడీలపై ఆధారపడాల్సి ఉంటుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో నివేదించాయి. రాష్ట్రంలో సరిపడేంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో పాటు విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడంతో గతంతో పోలిస్తే ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతమున్న చార్జీలు, నాన్ టారిఫ్, ఇతరత్రా ఆదాయాల ద్వారా మొత్తం రూ. 18,900 కోట్ల ఆదాయం వస్తుందని.. విద్యుత్ కొనుగోలు, సరఫరా, సంస్థల నిర్వహణకు అయ్యే ఖర్చు రూ. 26,700 కోట్లు ఉంటుందని డిస్కంలు తమ ఏఆర్‌ఆర్‌లలో పేర్కొన్నాయి. ఈఆర్సీ వద్ద హైడ్రామా.. గతంలోని ఆనవాయితీకి భిన్నంగా తెలంగాణ డిస్కంలు తమ తొలి ఏఆర్ఆర్లను సమర్పించాయి. సాధారణంగా ఏఆర్ఆర్లను సమర్పించిన వెంటనే అందులోని వివరాలను సంక్షిప్తంగా వెల్లడించేవారు. కానీ ఈ సారి డిస్కం అధికారులు ఏఆర్‌ఆర్‌లు సమర్పించే విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈఆర్సీకి ఇచ్చిన తర్వాత కూడా పెదవి విప్పకుండా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ వివరాలను బయటకు రానీయోద్దని తమకు ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయంటూ తప్పుకొన్నారు. మరోవైపు ఏఆర్ఆర్లోని వివరాలను వెల్లడించే బాధ్యత తనది కాదని ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా డిస్కంలు అందించిన ఏఆర్ఆర్లతో పాటు కొత్త రేట్ల టారిఫ్‌ను వెబ్సైట్లో ఈఆర్సీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ డిస్కంలు తమకు సీడీ (సాఫ్ట్ కాపీ) రూపంలో నివేదికలు ఇవ్వలేదని... రాత్రిపూట కావటం, ఆదివారం సెలవుదినం కావడంతో మరో రెండు రోజుల వరకు వెబ్సైట్లో పెట్టడం వీలు కాదని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేవరకు మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన తెలంగాణ సర్కారు... ఎట్టకేలకు కొత్త చార్జీలను ఈఆర్సీకి సమర్పించినప్పటికీ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తెరలేపింది. కానీ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే చార్జీల పెంపు శాతం తక్కువగా ఉంటుందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ధ్రువీకరించారు. ఇప్పటికే మూడు నెలలు వాయిదా పడటం, ఈఆర్సీ ఇచ్చిన గడువు శనివారంతో ముగిసే నేపథ్యంలో డిస్కంలు ఆఖరి నిమిషంలో ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఈ వివరాలను వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. -
పేదలకూ షాకే
- విద్యుత్ చార్జీల పెంపుపై అన్ని వర్గాల్లో ఆగ్రహం - జిల్లావాసులపై నెలకు రూ.15 కోట్ల మేర అదనపు భారం - సర్కారు నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ రాజమండ్రి: విద్యుత్ చార్జీలు పెంచినా పేదోడిపై భారం వేయలేదని, వంద యూనిట్ల లోపు వాడకానికి పెంపు వర్తించదని సర్కారు అంటోంది. అయితే ఎంత మంది వంద లోపు యూనిట్లు వాడతారు అని చూస్తే మాత్రం పెంపు భారం దాదాపు అందరిపై పడుతుందని తేలుతుంది. ప్రజలపై రాష్ట్రం మోపుతున్న వరుస భారాల్లో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి కరెంటు చిర్జీలు పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఆ మేరకు విద్యుత్తు నియంత్రణా మండలి(ఈఆర్సీ) అనుమతి కోసం పంపిణీ సంస్థలు(డిస్కంలు) ప్రతిపాదనలు పంపాయి. వాటిని ఈఆర్సీ ఆమోదించడడం లాంఛనమే. ప్రభుత్వ నిర్ణయంపై జిల్లాలో అన్నివర్గాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం విద్యుత్తు వినియోగ దారుల సంఖ్య 14,39,670. ఇందులో గృహ కనెక్షన్లు 12.44,626, వాణిజ్య కనెక్షన్లు 1,17,194, పరిశ్రమల కనెక్షన్లు 9520, చిన్నతరహా పరిశ్రమల కనెక్షన్లు 864 ఉన్నాయి. మిగిలినవి వ్యవసాయ, ప్రభుత్వం, ప్రజాప్రయోజనాల సర్వీసులు, హెచ్‌టీ సర్వీసులు. వీరిలో చార్జీల పెంపు పేదలకూ భారం కానుంది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 50 యూనిట్ల లోపు వినియోగదారులు 5.76 లక్షల మంది, 51 నుంచి 100 యూనిట్లలోపు వినియోగ దారులు 4.37 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య తాజా నెల బిల్లు ప్రకారం తేలింది. కాగా వీరి సంఖ్య నెల నెలా మారుతుంటుంది. వచ్చేది వేసవి కావడంతో ప్రతి ఇంటా వినియోగం భారీగా ఉంటుంది. ఒక ఫ్యాను వినియోగించే వారికి వంద యూనిట్లకుపైగా వినియోగం ఉంటుంది. అంటే ఏప్రిల్ తర్వాత లెక్కలు పూర్తిగా తారుమారవుతాయి. మార్చి నుంచి 51 నుంచి 100 యూనిట్లలోపు వాడే వారి సంఖ్య రెండు లక్షలకు తగ్గిపోతుంది. భారం ఇలా పడుతుంది.. వందకు పైగా వినియోగించే ఐదు లక్షల మందిలో రెండు లక్షల మంది 101 నుంచి 200 యూనిట్ల లోపు వినియోగిస్తారు. వీరి వినియోగంపై 100 వరకూ ఇప్పుడున్న యూనిట్ ధరకు 0.12 పైసలు పెరుగుతుంది(రూ.2.60 నుంచి రూ.2.76). అంటే బిల్లుపై రూ.12 అదనంగా చెల్లించాలి. 101 నుంచి 200 వాడితే అదనం గా యూనిట్‌కు 0.22 పైసలు వడ్డిస్తారు (రూ.3.60 నుంచి రూ. 3.82) అంటే 200 యూ నిట్లు వాడే బిల్లుకు అదనంగా రూ.22 భారం పెరుగుతుంది. సగటున రెండు లక్షల మంది 150 యూనిట్లు వినియోగిస్తారని అంచనా వేస్తే రెండు లక్షల మందిపై నెలకు రూ.66 లక్షల భారం పడుతుంది. 201కి పైగా వినియోగించే వారి సంఖ్య సుమారు రెండు లక్షలని అంచనా. 300 యూనిట్లు వాడే వారు అదనంగా నెలకు రూ.130, 500 యూనిట్లు వాడే వారు అదనంగా రూ. 235 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 200 యూనిట్లకు మించి వాడే మూడు లక్షల మంది సగటున నెలకు 30 0 యూనిట్లు వినియోగిస్తే నెలకు రూ.మూడు కోట్ల మేర భారం పడనుంది. చిన్న దుకాణాల వారు సగటున 500 యూనిట్లు వినియోగిస్తారనుకుంటే నెలకు రూ.260 అదనపు భారం పడనుంది. జిల్లాలో ఈ తరహా 1,17,194 మంది వినియోగదారులపై అదనపు భారం రూ.మూడు కోట్లకు పైగా ఉంటుంది. పరిశ్రమలపైనా పెనుభారం.. నెలకు 5,000 యూనిట్లు వినియోగించే కుటీర పరిశ్రమలపై నెలకు రూ.1200 అదనపు భారం పడుతుంది. జిల్లాలోని 864 పరిశ్రమలపై సుమారు రూ.10 లక్షలకు పైగా భారం పడుతోంది. కేటగిరీ-3 పరిశ్రమలపై నెలకు రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల భారం పడనుంది. పంచాయతీల వీధిదీపాలపై రూ.4 కోట్ల వరకూ, మంచినీటి పథకాలపై మరో మూడు కోట్ల వరకూ భారం పెరగనుంది. ఇతర వినియోగాలతో కలిపి చూస్తే చార్జీల పెరుగుదల వల్ల జిల్లా వాసులపై నెలకు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. ప్రజలు తట్టుకోలేరు.. టీడీపీ ప్రభుత్వం ఒకపక్క సంక్షేమ పథకాల్లో భారీగా కోత పెడుతూ, మరోపక్క అన్ని రకాల చార్జీలు పెంచుతోంది. ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. ఇప్పటికే పెట్రోలు చార్జీలు పెంచేశారు. కొత్తగా కరెంటు బిల్లులు కూడా భారీగా పెరిగితే ప్రజలు తట్టుకోలేరు. - జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పేదలు ఫ్యాన్ వేసుకోకూడదా! విద్యుత్తు చార్జీలు సామాన్యుడి నడ్డి విరుస్తాయి. వందకు పైగా వినియోగించే వారిలో పేదలు కూడా ఉంటారు. వేసవిలో ఫ్యాను వాడితే చాలు వంద యూనిట్లు దాటిపోతుంది. అంటే పేదవాళ్లు వేసవిలో ఫ్యానులు కూడా వేసుకోకుండా ఉండాలని ప్రభుత్వ ఉద్దేశమా! - పి. సూర్యనారాయణరాజు, రిటైర్డు ఉద్యోగి, రాజమండ్రి -
విద్యుత్ ఛార్జీలు 6 శాతం పెంచే అవకాశం: బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారులపై డిస్కంలు 6 శాతాన్ని భారాన్ని మోపాయని చెప్పారు. దాంతో విద్యుత్ చార్జీలను 6 శాతం పెంచాలని ఏపీ ఈఆర్సీ పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.7,700 కోట్లు నష్టాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, 100 యూనిట్లు లోపు వాడినవారికి అదనపు ఛార్జీలు పెంచే యోచన లేదన్నారు. 100 యూనిట్లు వాడినవారికి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. కోటి 17 లక్షల కుటుంబాలపై విద్యుత్ భారం పడదని చంద్రబాబు చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఆలోచిస్తామన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. -
విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం!
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమయ్యింది. తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేయడంతో ఛార్జీల పెంపు అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్కంలు అందజేసిన ప్రతిపాదనలపై ఈనెల్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రభుత్వానికి ఈఆర్సీ సిఫార్సు చేయనుంది. ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈఆర్సీకి డిస్కం అందజేసిన ప్రతిపాదనలు.. 50 లోపు యూనిట్లకు రూ. 2.75 51 నుంచి 100 లోపు యూనిట్లకు రూ.3.45 101 నుంచి 150 యూనిట్ల వరకూ రూ.5.71 151 నుంచి 200 వరకూ రూ.6.71 201 నుంచి 250 వరకూ రూ. 6.76, 251 నుంచి 300 వరకూ రూ.7.29 301 నుంచి 400 వరకూ రూ. 7.82 , 401 నుంచి 500 వరకూ 8.35 500 పై బడిన యూనిట్లకు రూ.8.88 -
100 యూనిట్లు దాటితే వాతే!
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా అడుగులు ముందుకు వేస్తోంది. దాదాపు అయిదు గంటలపాటు ఏపీ కేబినెట్ సోమవారం సమావేశమైంది. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై - మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. అయితే ఎప్పటి నుంచి పెంపు అమలు చేయాలన్నదానిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కాగా 100 యూనిట్ల పైనే విద్యుత్ ఛార్జీల పెంపుకు ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు ఆదాయ వనరుల సమీకరణపై కూడా కేబినెట్ దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా కేబినెట్ భవనాల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్న రుణ ఉపశమన పథకంపై- ఇకపై జిల్లాల వారీగా సమీక్షలు చేయాలని నిర్ణయించారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఆధ్వర్యంలో ఈ సమీక్షలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సోలార్ విద్యుత్ విధానానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఏపీకి కరెంట్ చార్జీల వాత!
-
కోతలయ్యాయ్.. ఇక వాతలే!
రూ. 4,000 నుంచి 4,500 కోట్ల మేర చార్జీల వడ్డనకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: నిన్న, మొన్నటి వరకూ విద్యుత్ కోతలతో అల్లాడిన ప్రజలకు కరెంట్ చార్జీల షాక్ ఇచ్చేందుకు సర్వం సన్నద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కొనుగోలు భారం అంచనాలను దాటడంతో ప్రజలపై చార్జీల భారం మోప డం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.4,000 నుంచి 4,500 కోట్ల మేర చార్జీల వడ్డన ప్రతిపాదనలకు డిస్కంలు తుది మెరుగులు దిద్దుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గృహ వినియోగదారులకు సంబంధించి 50 యూనిట్లలోపు కేటగిరీని 30 యూనిట్లకు కుదించనున్నారు. ఇంతకంటే ఎక్కువ కరెంటు వాడేవారు తర్వాతి కేటగిరీలోకి(31-100) వస్తారు. తెలంగాణలో మొత్తం 81 లక్షల మంది గృహ వినియోగదారులున్నారు. 0-50 యూని ట్ల కేటగిరిలోని దాదాపు 70 శాతానికి పైగా వినియోగదారులు 30 యూనిట్లకు మించి విద్యుత్తు వాడుతున్న వారే. వీరిని రెండో కేటగిరీకి బదిలీ చేస్తే ఆదాయం పెరగడం, గృహ వినియోగదారుల సబ్సిడీభారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందరిపైనా బాదుడే.. 2014-15 ఆర్థిక సంవత్సరం చార్జీల ప్రతిపాదనల్లో టీఎస్ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్(పాత సీపీడీసీఎల్)లు దాదాపు రూ.5 వేల కోట్ల మేర చార్జీల పెంపును ప్రతిపాదించాయి. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో అవి అమలు కాలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం 50 యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడే గృహాలకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తున్నారు. 2014-15 ప్రతిపాదనల్లోనే ఈ చార్జీని డిస్కంలు రూ.1.95కు పెంచాయి. తాజా ప్రతిపాదనల్లో ఈ కేటగిరీని 1-30 యూనిట్లకు పరిమితం చేసిన డిస్కంలు.. యూనిట్‌కు దాదాపు అదే చార్జీని వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. 31-100 యూనిట్ల కేటగిరీలో రూ.4 లోపు వసూలు చేయాలని యోచిస్తున్నాయి. దీంతోపాటు విద్యుత్తును ఆదా చేసే చర్యల్లో భాగంగా... వినియోగం ఎక్కువగా ఉంటున్న పీక్ అవర్స్‌లో టారిఫ్‌ను పెంచాలని, టైమ్ ఆఫ్ ది డే(టీవోడీ) టారిఫ్‌ను అమలు చేయాలనే విషయాన్నీ పరిశీలిస్తున్నాయి. గతేడాది పరిశ్రమల(హెచ్-3) కేటగిరీలో సాయంత్రం 6 నుంచి రాత్రి పది గంటల వరకు టీవోడీ చార్జీ విధిస్తూ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఈసారి ప్రతిపాదనల్లో టీవోడీ చార్జీలను మరిన్ని కేటగిరీలకు విస్తరించాలని పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే.. సాధారణ సమయంలో ఉన్న యూనిట్ రేటుతో పోలిస్తే.. పీక్ అవర్స్‌లో రూపాయిన్నర చొప్పున అదనంగా వసూలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. గతేడాది వార్షిక నివేదికలో టీఎస్ఎన్పీడీసీఎల్ తమకు రూ.7,046.95 కోట్ల ఆదాయం అవసరమని అంచనా వేసింది. ఇప్పుడున్న విద్యుత్తు చార్జీల ప్రకారం రూ. 3,663 కోట్లు సమకూరుతాయని.. పెంచిన చార్జీలతో రూ.871 కోట్లు అదనంగా రాబట్టుకోవాలని నిర్ణయించింది. సీపీడీసీఎల్ విషయానికొస్తే గతేడాది రూ.22,754 కోట్ల ఆదాయం అవసరం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత చార్జీల ప్రకారం రూ.17,307 కోట్లు వస్తుందని.. రూ.4,296 కోట్ల మేర చార్జీలను పెంచడం ద్వారా లోటును పూరించుకోవాలని ప్రతిపాదనలు చేసింది. గతేడాది దీని పరిధిలో ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలు ఏపీలో చేరటంతో ఈ డిస్కం పరిధి తగ్గింది. టీఎస్ఎస్పీడీసీఎల్గా ఆవిర్భవించింది. తన పరిధిలో లేని రెండు జిల్లాల ఆదాయ వ్యయాలను తాజా వార్షిక రాబడి అంచనా(ఏఆర్ఆర్)లో తొలగించి.. రూ.3 వేల కోట్ల మేర ఆదాయం రాబట్టేలా చార్జీల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ లెక్కన తెలంగాణలో మొత్తం రూ.4,000 నుంచి రూ.4,500 కోట్ల మేరకు చార్జీలను వడ్డించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్లను నవంబరు నెలాఖరున తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి డిస్కంలు సమర్పించాలి. ఈనెల 12లోగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఆలోపే ఏఆర్‌ఆర్‌లు సమర్పిస్తామని డిస్కం వర్గాలు తెలిపాయి. -
రైతులను పిట్టల్లా కాల్చిన ఘనత చంద్రబాబుదే
బషీర్‌బాగ్ మృతులకు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నివాళి సాక్షి, హైదరాబాద్: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని పద్నాలుగేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్టు 28న) ఆందోళన చేసిన రైతులను పిట్టల్లా కాల్చిన ఘనత నాటి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదేనని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆనాడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ముందుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలందరితో కలిసి జగన్ హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్ వద్ద గల అమరవీరుల స్తూపం సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు, ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడుతూ ఉంటే పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపారని గుర్తుచేశారు. ఆ ఉద్యమంలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించడం తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని జగన్ అన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన వారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఆర్.కె.రోజా, తిరువీధి జయరాములు, పాలపర్తి డేవిడ్‌రాజు, షేక్ బేపారి అంజాద్బాష, ముస్తఫా, సుజయ్‌కృష్ణ రంగారావు, ఆదిమూలం సురేష్, బూడి ముత్యాలనాయుడు, ఎస్.వి.మోహన్‌రెడ్డి, కలమట వెంకటరమణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, కిడారు సర్వేశ్వరరావు, ఐజయ్య తదితరులు ఉన్నారు. -
బయట పడిన బాబు నిజస్వరూపం
కోవూరు : ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజస్వరూపం అధికారం చేపట్టిన నెలతిరగక ముందే బట్టబయలు అవుతోంది. ఎన్నికల ముందు రైతులకు, సామాన్య ప్రజలకు విద్యుత్ చార్జీల భారం ఏ మాత్రం ఉండదని ప్రచారం చేసిన చంద్రబాబు.. విద్యుత్ చార్జీల పెంపు తప్పదని పరోక్షంగా ప్రకటించి తన అసలు వైఖరి చాటుకున్నారు’ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడులో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్ దేవుడెరుగు విద్యుత్ చార్జీలు, గిట్టుబాటు ధరలేక ప్రజలు, రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే త్వరలో విద్యుత్ చార్జీలు పెంపు అనివార్యమని ప్రకటించడం ఆయన దగాకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు.తాను ఇక ప్రజలు, రైతు సంక్షేమానికి పాటుపడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నెల వ్యవధిలోనే ఇలా మాట మార్చడం దారుణమన్నారు. సెంటు భూమికి కూడా నీరు అందక రైతులు సతమతమవుతున్నారన్నారు. రైతుకు 9 గంటలు విద్యుత్ ఇస్తామన్న ప్పటికీ కనీసం 3 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోవడంతో రైతు లు లబోదిబోమంటున్నారన్నారు. గతంలో ఆయన పాలనలో విద్యుత్ చార్జీలు తగ్గించమని ఆందోళనకు దిగిన సీపీఎం కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా ప్రజలు చంద్రబాబు అసలు స్వరూపాన్ని గుర్తించాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ములుమూడి వినోద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మోహిద్దీనా సర్పంచ్ గడ్డం రమణమ్మ, నాయకులు మల్లికార్జునరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, నరసింహులురెడ్డి, జనార్దన్‌రెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, భాస్కర్‌రెడ్డి, రాధయ్య, అహమ్మద్ ఉన్నారు. -
ప్రస్తుత చార్జీలనే కొనసాగించండి!
ఈఆర్సీకి ఇంధన శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని ఇంధన శాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన, రాష్ర్టపతి పాలన నేపథ్యంలో కొత్త విద్యుత్ చార్జీలపై తాము నిర్ణయం ప్రకటించలేమని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. జూన్ 2 తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలను మార్చి చివరి వారంలోనే ఈఆర్సీ నిర్ణయించాల్సి ఉంది. అయితే, కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత చార్జీలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీంతో తదుపరి నిర్ణయం ప్రకటించే వరకూ ప్రస్తుత చార్జీలే కొనసాగుతాయని ఈఆర్సీ ప్రకటించింది. -
బాబు కాలం
నరకయాతన అనుభవించాం చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో నరకయాతన అనుభవించాం.. వర్షాలు రాక .. కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం.. ప్రతి సంవత్సరం విద్యుత్ చార్జీలు పెంచి మా నడ్డివిరిచేవారు.. బిల్లులు చెల్లించకుంటే కనికరం లేకుండా మోటార్లు, స్టార్టర్లు తీసుకెళ్లేవారు..నా స్టార్టర్‌ను కూడా అలాగే తీసుకెళ్లారు. -మల్లారెడ్డి, రైతు, కొండాయపల్లె, కమలాపురం మండలం బాబు పాలనలో వర్షాలు పడేవికావు బాబు హయాంలో వర్షాలు పడేవి కావు. బోరు బావుల్లో నీరు తోడుకునేందుకు క ష్టంగా ఉండేది.. బిల్లులు కట్టలేదని ఎక్కడ స్టార్టర్లు తీసుకెళుతారోనని పొలాల వద్దకు రాత్రనక, పగలనక పరుగులు తీసేవాళ్లం.. వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమని నమ్ముతున్నాం. -రామసుబ్బారెడ్డి,రైతు,పెండ్లిమర్రి గ్రామం,కలసపాడు ప్రభుత్వ బోరు అన్నా వినలేదు వైఎస్ దయతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోరు వేశారు.. పత్తిపంట చేతికొచ్చే సమయంలో బిల్లు కట్టలేదని స్టార్టర్ తీసుకెళ్లారు.. గవర్నమెంట్ వేసిన బోరు అని చెప్పినా వినలేదు.. దీంతో రూ. 30 వేలు నష్టపోయాను.. -ఓబుళాపురం మాతయ్య, రైతు, ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం తర్వాత కడతానన్నా వినలేదు డబ్బులు వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లు కడతానని చెప్పినా వినలేదు. చంద్రబాబు పాలనలో బలవంతంగా స్టార్టర్ తీసుకెళ్లారు.. దీంతో పంట పూర్తిగా నష్టపోయి అప్పుల పాలయ్యాను.. వైఎస్ మరణంతో మా బతుకులు చిందరవందర అయ్యాయి. - మాచవరంవెంకటరామిరెడ్డి, రైతు, ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం ఆయన కాలంలో అప్పులే మిగిలాయి చంద్రబాబు హయాంలో అప్పులే మిగిలాయి.. అప్పట్లో నాకున్న మూడెకరాల్లో పొద్దుతిరుగుడు సాగుచేశా.. పంటలు సరిగా పండకపోయినా బిల్లు కట్టాల్సిందేనని స్టార్టర్లు తీసుకెళ్లారు.. వైఎస్ పుణ్యాన అప్పులు తీర్చుకున్నాను. - కర్రాపోలిరెడ్డి, రైతు, ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం వందేళ్లయినా మరచిపోం చంద్రబాబు పరిపాలనను వందేళ్లయినా మరచిపోలేం.. కరెంట్ బిల్లులు కట్టలేదని స్టార్టర్లు, మోటార్లు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారు. బిల్లులు కట్టలేక మోటార్లను వదులుకోవాల్సిన పరిస్థితి.. మా గ్రామంలో నాతో సహా 30 మంది రైతుల స్టార్టర్లు తీసుకెళ్లారు.. ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రస్తుతం కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో లేం. -ఈశ్వరరెడ్డి, రైతు,సర్పంచ్, తెల్లపాడు,కలసపాడు,మండలం -
పంచ్: ఆయన ఉన్నప్పుడే బావుండేది..
ఆయన మళ్లీ వస్తే బాగుంటుంది.. అవును ఆయనే రావాలి ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరించాలన్నా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు మళ్లీ రావాలన్నా కరెంటు బిల్లు కట్టలేని రైతులపై కేసులు పెట్టాలన్నా కరెంటు చార్జీలు తగ్గించమని అడిగిన ప్రజలను కాల్చి చంపాలన్నా అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించాలన్నా హైటెక్ పేరిట సొంత స్థలాల ధరలు పెంచుకోవాలన్నా ఆయన మళ్లీ వస్తే బావుంటుంది... ఆయన వస్తేనే ఇవన్నీ సాధ్యం. కానీ.. ఆయన రాడు. ఒక అభిప్రాయం పవనిజం కన్నా సంపూర్ణిజమే బెటరేమో! టీడీపీ బీజేపీ పొత్తు - ఎల్లయ్యకు ఎద్దులు లేవు, మల్లయ్యకు బండి లేదు ఇద్దరూ కలిసి సవారి కట్టినట్టు ఉంది. జనసేన - చేలో పడ్డ గుడ్దెద్దు - సేకరణ: జీవన్ ఎందుకు వచ్చినట్టో... కర్ణాటకలోని శివమొగ్గ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి జేడీయూ అభ్యర్థి బి.ధర్మప్ప సకల సన్నాహాలు చేసుకున్నారు. నామినేషన్ వేయడానికి మందీ మార్బలంతో కలెక్టర్ కార్యాలయం దాకా వెళ్లారు. మరో ఇద్దరితో కలసి లోనికి వెళ్లి ఎన్నికల అధికారి బన్సల్ ఎదుట ఠీవీగా కూర్చున్నారు. నామినేషన్ పత్రాలు అడిగినప్పుడు మాత్రం చుట్టూ చూసి తెల్ల మొహం వేశారు. ఇంట్లోనే నామినేషన్ పత్రాలను మరిచిపోయి వచ్చానని, వెంటనే తెప్పిస్తానని ఎన్నికల అధికారికి విన్నవించారు. దీంతో ‘అవి వచ్చేంత వరకు వేచి ఉండండి. వేరే వారు నామినేషన్లను దాఖలు చేయడానికి అవకాశం కల్పించండి’ అంటూ అధికారి ఆయనను బయటకు సాగనంపారు. ‘ఏనుగు’ అభ్యర్థికి నోటీసు కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గంలో ఏపీ అహ్మద్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి పార్టీ చిహ్నమైన ఏనుగుపై వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. వెరీ గుడ్ ఐడియా అని స్నేహితులు సలహా ఇచ్చారు. వెంటనే కేరళ నుంచి ఓ పెంపుడు ఏనుగును రూ.28 వేలకు బాడుగకు తెచ్చుకున్నారు. ఆ ఏనుగుపైనే ఊరేగింపుగా వెళ్లి నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే ఇందుకు ఎన్నికల అధికారుల ముందస్తు అనుమతి లేదు. అహ్మద్ ఏనుగుపై వచ్చాడని తెలుసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, అటవీ శాఖాధికారులను పిలిపించుకుని సమాచారాన్ని రాబట్టారు. అనంతరం ఆయనకు నోటీసు జారీ చేశారు. - వి.సురేంద్రన్, బెంగళూరు -
ప్రస్తుతానికి పాత విద్యుత్ చార్జీలే: ఈఆర్సీ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల మోత తాత్కాలికంగా వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఆర్సీ కార్యదర్శి మనోహర్‌రాజు శనివారం ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ టారిఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించి ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ చార్జీల మోతను ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం కూడా కోడ్ ఉన్నందున ఏ కేటగిరీ వినియోగదారులకు (రైతులు, గృహ తదితర) ఎంతమేరకు సబ్సిడీ ఇస్తామనే విషయాన్ని పేర్కొనలేమని ఈఆర్సీకి తెలిపింది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే అమలవుతాయని ఈఆర్సీ స్పష్టం చేసింది. అదేవిధంగా ట్రాన్స్‌కోకు చెందిన విద్యుత్ సరఫరా చార్జీలు, సాంప్రదాయక ఇంధన వనరుల అస్థిర చార్జీల(వేరియబుల్ కాస్ట్)తోపాటు క్రాస్‌సబ్సిడీ సర్చార్జీలకు సంబంధించి కూడా తదుపరి ఆదేశాలు వెలువడేవరకూ ప్రస్తుత చార్జీలే అమలవుతాయని ఈఆర్సీ తెలిపింది. కాగా ఎన్నికల కోడ్ ముగిశాక.. అంటే మే 20 తర్వాత ఏ క్షణంలోనైనా విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశముంది. -
జేబుకు చిల్లు 5,600 కోట్లు
-
జేబుకు చిల్లు 5,600 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1 నుంచి కొత్త కరెంటు చార్జీల మోత మోగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం నాలుగేళ్లుగా ఏటా విద్యుత్ చార్జీలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగించనుంది. స్లాబుల మాయూజాలంతో వినియోగదారుల జేబుకు భారీయెత్తున చిల్లు పెట్టనుంది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ఏకంగా సుమారు రూ.5,600 కోట్ల కరెంటు చార్జీల భారం పడనుంది. కేవలం గృహ వినియోగదారులపైనే ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా భారం పడనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ప్రధానంగా గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చార్జీలు పెంచనుంది. నెలకు 150 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు భారీ బిల్లు షాక్ ఇవ్వనుంది. వీరికి ఆయూ స్లాబుల మేరకు యూనిట్‌కు 50 పైసల నుంచి రూ.1.78 వరకూ చార్జీ పెరగనుంది. నెలకు 150 యూనిట్లకుపైబడి వినియోగించే కేటగిరీ వారికి ఇప్పటికే అధిక చార్జీలు ఉండటం వల్ల ఈసారి వారిపై కాస్త కరుణ చూపినట్లు సమాచారం. ఇక చిన్నతరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలు, ఫెర్రో అల్లాయ్స్ యూనిట్లకు సగటున 50 పైసల నుంచి 75 పైసల మేరకు చార్జీలు పెరగనున్నట్టు తెలిసింది. అదేవిధంగా వాణిజ్య సంస్థలు, మల్టీప్లెక్స్‌లు, హోర్డింగ్‌లకు కూడా ప్రస్తుత చార్జీల కంటే సగటున 50 పైసల మేరకు చార్జీలు పెరగనున్నారుు. 24న కొత్త టారిఫ్ ఆదేశాలు! వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5,600 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను పెంచడంతో పాటు సుమారు రూ.6,500 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించే విషయమై అభిప్రాయాన్ని తెలియజేయూలంటూ ఈఆర్సీ గురువారం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనశాఖకు చేరిన ఈ లేఖపై గవర్నర్ సమీక్ష అనంతరం ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ నెల 24న ఈఆర్సీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తారుు. అయితే విద్యుత్ చార్జీల పెంపునకు కోడ్ కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందా? లేదా? అనే విషయమై స్పష్టత లేదు. ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతివ్వకుంటే కోడ్ ముగిసేవరకు అంటే మే నెలాఖరు వరకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే అమలయ్యేలా ఈఆర్సీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్‌రంగ నిపుణులు మాత్రం ఎన్నికల సంఘం వ్యతిరేకించే అవకాశం లేదనే అంటున్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలోనూ విద్యుత్ చార్జీలను ఈఆర్సీ నిర్ణయించిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. పేదలు, మధ్యతరగతే సమిధలు! గృహ వినియోగదారులకు గతంలో 100 యూనిట్లుగా ఉన్న స్లాబును కాస్తా 50 యూనిట్లుగా విభజించి చార్జీలను పెంచిన ప్రభుత్వం.. ఈసారి దాన్నీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఎల్టీ-1 కిందకు వచ్చే గృహ వినియోగదారులను ఎల్టీ 1(ఏ) నుంచి 1(డీ) వరకూ విభజించింది. ప్రతి కేటగిరీలో చార్జీలను వేర్వేరుగా నిర్ణయించింది. దీనితో ఒక స్లాబు దాటి మరో స్లాబులోకి వెళితే చాలు చార్జీల మోత మోగిపోనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించినట్టైతే దాన్ని ఎల్టీ-1(ఏ) కేటగిరీగా నిర్ణయించింది. వీరికి ప్రస్తుతమున్న యూనిట్ చార్జీని రూ.1.45 నుంచి రూ.1.95కు పెంచింది. అంటే 50 పైసలు పెంచిందన్నమాట. ఇక 100 యూనిట్ల వరకు వినియోగిస్తే ఎల్టీ1(బీ)గా నిర్ణయించి మొదటి 50 యూనిట్లకు రూ.3.10 చొప్పున 51-100 యూనిట్లకు రూ.3.75 చొప్పున వసూలు చేయనుంది. 150 యూనిట్ల వరకు వాడితే ఎల్టీ1(సీ) తొలి 50 యూనిట్లకు రూ.3.10, 51-100 యూనిట్లకు రూ.3.75, 101-150 యూనిట్లకు రూ.5.38 చొప్పున వసూలు చేయనున్నారు. అయితే 150 యూనిట్లకు పైగా వినియోగించే వారిపై (ఎల్టీ1(డీ) కేటగిరీ మాత్రం కాస్త కరుణ చూపారు. వీరికి యూనిట్‌కు సగటున 25 నుంచి 35 పైసల మేరకు పెరిగినట్టు సమాచారం. ఎందుకంటే.. ఒక యూనిట్‌ను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సరఫరా చేసేందుకు అయ్యే సగటు వ్యయం కంటే 20 శాతానికి మించి టారిఫ్ ఉండకూడదని జాతీయ టారిఫ్ విధానం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ కేటగిరీ వారికి పెద్దగా విద్యుత్ చార్జీలను పెంచకూడదని ఈఆర్సీ భావించినట్టు తెలిసింది. మరోవైపు చిన్న, భారీ, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు కూడా కొత్త చార్జీల షాక్ తగలనుంది. స్థానిక సంస్థలకు మరిన్ని ఇక్కట్లు ఇప్పటికే అనేక పంచాయతీలు, మునిసిపాలిటీలు విద్యుత్ చార్జీలు బకాయిపడి ఉన్నాయి. ఫలితంగా విద్యుత్ సంస్థలు వాటికి కనెక్షన్ కట్ చేస్తున్నాయి. తాజాగా పెరగనున్న చార్జీలు స్థానిక సంస్థలపై మోయలేని భారంగా పరిణమించనున్నారుు. దీంతో వీధుల్లో చీకట్లు అలుముకోవడంతో పాటు, తాగునీటి సరఫరాకూ ఇబ్బందులు ఏర్పడనున్నారుు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని వినియోగదారులపైనే నెట్టే అవకాశం ఉంది. దీంతో తాగునీటి చార్జీలూ పెరిగే ప్రమాదం పొంచి ఉంది. వీధి దీపాలకు యూనిట్ విద్యుత్ చార్జీ సగటున 40 పైసల మేర కు, తాగునీటి సరఫరాకు 50 పైసల నుంచి రూపాయి వరకూ పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వివరించాయి. -
విభజన వేళ చార్జీల బాదుడా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ట్ర విభజన అంశం పార్లమెంటు ముందుకు వెళ్తున్న సమయంలో విద్యుత్‌చార్జీల పెంపుపై విచారణ ఏమిటని పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలను వెంటనే తిరస్కరించాలని, విచారణ వారుుదా వేయూలని మంగళవారం డిమాండ్ చేశారుు. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ సీపీడీసీఎల్ సమర్పించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ హాలులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసాగా మారింది. తొలుత బహిరంగ విచారణలో మాట్లాడేందుకు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇందుకు నిరసనగా వామపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. ఇలావుండగా హాల్లో ఆందోళనకు దిగిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్, న్యూడెమోక్రసీ నేత గాదె దివాకర్‌లు విచారణను అడ్డుకున్నారు. దీంతో ఈఆర్సీ చైర్మన్ భాస్కర్ విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. పోలీసులు ఆందోళనకు దిగిన నేతలను అరెస్టు చేశారు. తర్వాత విచారణ ప్రారంభం కాగా విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి, రఘుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు మాట్లాడారు. మరికొన్ని ముఖ్యాంశాలు... ల్యాంకో సంస్థకు అధిక చార్జీలు చెల్లించడం ద్వారా అధికారులు అదనంగా రూ.150 కోట్లను ముట్టచెప్పారు. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. దీనిపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. విదేశీ బొగ్గు కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయి. దీనిపై ఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయమని కూడా డిస్కంలు కోరకపోవడంలో మతలబు ఏమిటి? జీవీకే, ల్యాంకో, స్పెక్ట్రమ్‌లపై వైఎస్ హయూంలో విచారణ జరిపిన సీబీసీఐడీ నివేదిక సమర్పించినా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించే పేద, మధ్యతరగతికి విద్యుత్ చార్జీలను భారీగా పెంచడం సమంజసం కాదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ముగిసిన స్పెక్ట్రమ్, జీవీకే, ల్యాంకోలను స్వాధీనం చేసుకోకుండా ఆధునీకరణ పేరుతో వారికే అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ఉసురు తగులుతుంది! ఈఆర్సీ విచారణ సందర్భంగా రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉంటున్న వారిని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు శ్రీధర్‌రెడ్డి, అంజిరెడ్డి, రాములు విమర్శించారు. లక్షల బిల్లులు చెల్లించాల్సిన వారిని ఏమనకుండా ఒక నెల బిల్లు చెల్లించకుంటే గ్రామాల్లో కరెంటు కట్ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి కోతలు ఉండవని... గ్రామాలకు మాత్రం కనీసం రాత్రి పూట కూడా కరెంటు ఇవ్వడం లేదని తెలిపారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని తమ ఉసురు తప్పకుండా తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. వ్యవసాయానికి రాత్రి పూట కరెంటు ఇస్తుండటం వల్ల రైతులు విద్యుత్ షాకులకు గురై చనిపోతున్నారన్నారు. -
ముంబైలో విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే ఆత్మాహుతి
కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ హెచ్చరిక సాక్షి, ముంబై: ముంబైలో విద్యుత్ చార్జీలు తగ్గించనట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా అధినేత అనిల్ అంబానీ ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటానని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సర్కారును హెచ్చరించారు. ముంబైలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాందివలిలోని రిలయన్స్ ఇన్ఫ్రా కార్యాలయం ఎదుట ఆయన మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆయన ఆత్మాహుతికి పాల్పడతానంటూ శనివారం హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న కంపెనీలు ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫ్రా అధినేత అనిల్ అంబానీపై నిరుపమ్ నిరసన వ్యక్తం చేశారు. -
చార్జీల పెంపు తప్పదు: ట్రాన్స్‌కో
సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని మించి వ్యయమవుతోందని, విద్యుత్ చార్జీలను పెంచక తప్పదని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన వ్యయంలో పెరుగుదల, 2014 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేపట్టాల్సి ఉండటం, పెరిగిన నిర్వహణ ఖర్చులను కారణంగా చూపుతూ.. చార్జీల పెంపు ప్రతిపాదనలను ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందుంచారు. 2014-19 వరకు బహుళ సంవత్సర టారిఫ్‌లో భాగంగా విద్యుత్‌సరఫరా, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నిర్వహణపై ట్రాన్స్‌కో సమర్పించిన ప్రతిపాదనలపై ఈఆర్సీ మంగళవారం బహిరంగ విచారణను చేపట్టింది. ట్రాన్స్‌కో వాదనను విచారణలో పాల్గొన్న విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ నేతలు, పరిశ్రమల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి వాదనలు.. - ‘రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రం కలిసి ఉంటుందా? విడిపోతుందా? తెలియని పరిస్థితి. రాష్ట్రం కలిసి ఉంటుందనే ఆలోచనతో విచారణ జరుపుతున్నారు. విభజన జరిగితే ఎలా అనేది కూడా ఆలోచించాలి. ఇవి 5 సంవత్సరాల చార్జీల ప్రతిపాదనలు కాబట్టి వీటిపై విచారణ ఇప్పుడు వద్దు. ప్రతీ ఏటా డిస్కంలలాగా ట్రాన్స్‌కో కూడా ప్రతిపాదనలు ఇవ్వాలి. విద్యుత్ సరఫరా నష్టాలు 2009-10లో 4.2 శాతమని పేర్కొన్న ట్రాన్స్‌కో 2013-14 నాటికి 3.89 తగ్గిస్తామంది. అయితే, 2014-15లో సరఫరా నష్టాలు 4.15 శాతం ఉంటాయని ఇప్పుడంటోంది. సరఫరా నష్టాలను తగ్గించడంలో ట్రాన్స్‌కో విఫలమైనట్టు దీంతో స్పష్టమౌతోంది’ - విద్యుత్‌రంగ నిపుణుడు వేణుగోపాల్‌రావు - ‘ఈ ప్రతిపాదనలపై ఐదేళ్ల వరకు కాకుండా... విభజన జరిగే వరకూ అనే షరతుతో విచారణ జరపాలి’ - న్యూ డెమోక్రసీ నేత గాదె దివాకర్ - ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనల్లో అవకతవకలు కనిపిస్తున్నాయి. ఆడిట్ అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’ - ఫ్యాప్సీ ప్రతినిధి అనిల్ రెడ్డి - ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనలపై డిస్కంలు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు. ట్రాన్స్‌కో, డిస్కంలు కుమ్మక్కయ్యాయా? సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంలో పారదర్శకత పాటించడం లేదు’ - విద్యుత్ రంగ నిపుణుడు తిమ్మారెడ్డి -
ఆమ్ ఆద్మీ ‘పవర్’
విద్యుత్ చార్జీలపై 50 శాతం సబ్సిడీ ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ సర్కార్ కానుక సాక్షి, న్యూఢిల్లీ: అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విధుల్లో నిమగ్నమయ్యారు. ఉచిత మంచినీటి సరఫరా విషయంలో ఎన్నికల హామీని నెరవేర్చుకున్న ఆప్ సర్కారు.. తమ మరో ప్రధాన హామీ అయిన విద్యుత్ చార్జీల తగ్గింపుపై మంగళవారం నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి సమావేశం అనంతరం 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై విద్యుత్ చార్జీల్లో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. 28 లక్షల వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయం వల్ల వచ్చే 3 నెలల్లో దాదాపు రూ. 61 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. అలాగే, ఢిల్లీలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు.. బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, ఎన్డీపీఎల్ కంపెనీల ఖాతాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ)తో తనిఖీ చేయించాలని నిర్ణయించారు. ఆడిట్ ఎందుకు చేయించకూడదనే విషయాన్ని బుధవారం ఉదయంలోగా తెలియజేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం ఆ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. ఆడిట్ పూర్తయిన తరువాత భవిష్యత్తులో మరోమారు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. విద్యుత్ చార్జీల తగ్గింపు నిర్ణయం నేటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. 0-200 యూనిట్ల వరకు డీఈఆర్సీ యూనిట్ టారిఫ్ రూ.3.90 ఉండగా తాజాగా యూనిట్‌కి రూ.1.95గా, 201-400 యూనిట్ల వరకు డీఈఆర్సీ యూనిట్ టారిఫ్ రూ.5.80 ఉండగా ఢిల్లీ ప్రభుత్వం రూ.2.90గా ప్రకటించింది. విద్యుత్ వినియోగం 400 యూనిట్లు దాటితే ఎలాంటి సబ్సిడీ వర్తించదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. మరో 48 గంటల సమయం మాత్రమే ఉందనుకుని పనిచేస్తున్నానని ఈ సందర్భంగా కేజ్రీవాల్ విలేకరులతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కొనసాగుతుందా? లేదా? అనే దానితో సంబంధంలేకుండా ఆ కొద్ది సమయంలోనే ప్రజలకు సాధ్యమైనంత మంచి చేయాలనుకుంటున్నానన్నారు. జనవరి 2న ఆయన ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని కూల్చివే యాలనే యోచనలో ఉన్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్, బీజేపీలను నమ్మలేం. ప్రభుత్వం నిలబడుతుందా, లేదా అన్నదాన్ని కూడా పట్టించుకోం. ఇంకో 48 గంటల సమయం మాత్రమే ఉందనుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం’ అన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా తమ పార్టీ నుంచి ఎమ్ఎస్ ధిర్‌ను ప్రతిపాదిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. బుధవారం నుంచి జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో తాత్కాలిక స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు బీజేపీ సీనియర్ నేత జగ్దీశ్ ముఖి తిరస్కరించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మతీన్ అహ్మద్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. జ్వరం, విరోచనాలతో కేజ్రీవాల్ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి మంగళవారం కొంతమేర మెరుగుపడింది. మద్దతుపై మరోమాట లేదు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆ రెండు పార్టీలు తోసిపుచ్చాయి. ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామనే మాటకు కట్టుబడి ఉన్నామని, తమ ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్ష సమయంలో ఆప్‌కు ఓటు వేస్తారని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి షకీల్ అహ్మద్ చెప్పారు. అసలు ఆప్‌కు ప్రభుత్వం నడపాలనే ఉద్దేశమే లేదని బీజేపీ ఆరోపించింది. -
మళ్లీ మోతపడుద్ది!
ప్రజలకు భారం మోయడం అలవాటైపోయింది. అందుకే ఎడాపెడా అన్నీ పెంచేసి చోద్యం చూస్తోంది ప్రభుత్వం.ఏదో నాలుగురోజులు సమ్మెలు, ధర్నాలు, విపక్షాల అరుపులు, ప్రజా సంఘాల గగ్గోలు. అన్నీ బేకాతర్ అనుకుంటే అవే సర్దుకు పోతాయి. ఇదీ పాలకల ఎత్తుగడ. జనాన్ని పిండే పథకం. ఇప్పుడు మళ్లీ విద్యుత్తు చార్జీల రూపంలో షాక్ ఇవ్వనుంది. సామాన్యుడ్ని హడలెత్తించనుంది. పాలమూరు, న్యూస్‌లైన్ : ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలు.. సర్ చార్జీల తో అవస్థ పడుతున్న సామాన్య జనానికి చార్జీల పెం పుతో మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఒక పక్క చార్జీలు పెరుగుతూ పోతుంటే సామాన్యుడి ఇం ట్లో ఎలక్ట్రానిక్ గృ హోపకరణాలు ఒక్కొక్కటిగా మూ లకు చేరుతున్నాయి. నెలవారీ బిల్లు తగ్గింకునేందుకు వారు ఇప్పటికే ముప్పుతిప్పలు పడుతున్నారు.. కాం గ్రెస్ ప్రభుత్వం 2011, 2013 సంవత్సరాల్లో విద్యుత్ చార్జీలను పెంచింది. దీంతోపాటు సర్దుబాటు పేరిట అ దనంగా వసూలు చేస్తూ విద్యుత్ వినియోగదారులకు ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది. ఇవి చాలవన్నట్లు తా జాగా మరోసారి చార్జీలను పెంచేందుకు సమాయత్తం అవుతోంది. ఈ మేరకు యూనిట్ల వారీగా పెంచే చార్జీల తో ఈఆర్సీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిం చింది. వాటినే యథావిధిగా ప్రభుత్వం ఆమోదం తెలి పితే వచ్చే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరుగుతా యి. ఈ భారం జిల్లాపై నెలకు రూ.14 కోట్లు ఉంటుందని అంచనా.. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేవలం 300 యూనిట్లు దాటి విద్యుత్తును వినియోగించుకునే వారిపై భారం మోపింది. తరువాత స్లాబ్‌లను మార్చి సామాన్య, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ చార్జీలను రుద్దింది. తాజాగా అన్ని వర్గాలపై భారం వేయనున్నారు. 150 యూనిట్లు వాడుకునే వినియోగదారులకు 50 పైసలు ఇంతకంటే ఎక్కువగా వినియోగించుకునే వారు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికి అదనంగా రూపాయి భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన సగటున రూ.1.07 భారం పడుతోంది. దీంతోపాటు పరిశ్రమలు, పంచాయతీలకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు ప్ర తిపాదనల్లో పేర్కొంది. జిల్లాలో గృ హావసరాలు, ఇతర కనెక్షన్లు దాదాపు 5,58,990 ఉంటాయి. వీటి వల్ల నెలకు రూ.16.25 కోట్ల ఆదాయం వస్తుండగా భారీ పరిశ్రమలు తదితర వాటితో రూ.18కోట్లు ఆదాయం వస్తోంది. ప్రతిపాదిత చార్జీల ప్రకారం విద్యుత్ శాఖకు అదనంగా రూ.14 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అధికారుల అంచనా ప్రకారం 51-100 యూనిట్ల విద్యుత్తును వినియోగమయ్యే కనెక్షన్లు 2.20 లక్షలు ఉంటాయి. 101-200 యూనిట్ల విద్యుత్తును వినియోగించే కనెక్షన్లు 1.50 లక్షలు ఉంటాయి. 201-300 యూనిట్లు వినియోగించుకునే వినియోగదారులు 1.30 లక్షలు ఉంటారు. జిల్లా మొత్తం నెలకు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడకం ఉంటుంది. అయితే పెంపు భారం ఎక్కువగా 200 యూనిట్లు వినియోగించే మధ్యతరగతి ప్రజలపై పడనుంది. ఈ దఫా ఎల్టీ కనెక్షన్లను వర్గీకరించి యూనిట్ల వ్యయంలో మార్పులు చేశారు. చార్జీల పెంపు వల్ల వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు పంచాయతీలు, విద్యుత్తు దీపాలు, ఎత్తిపోతల పథకాలు, మంచినీటి పథకాలు తదితర వాటిపై విద్యుత్తు చార్జీల భారం పడనుంది. ఎత్తిపోతల పథ కాల నిర్వహణ ఇక భారం ఎత్తిపోతల పథకాలపై కూడా ప్రభుత్వం చార్జీల భారం మోపింది. 33 శాతం అదనంగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల వీటి నిర్వహణ ఇక నుంచి రైతులకు భారం కానుంది. యూనిట్‌కు సగటున రూ.5.35 నుంచి రూ.7.10కి పెంచుతూ ప్రతిపాదించారు. జిల్లాలో ఏపీఎస్ఐడీసీ, ఐటీడీఏ, ఎస్సీ కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్, ఎన్ఎస్పీ పరిధిలో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుదలతో వీటి నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది. -
దొడ్డిదారిన బాదేయండి!
2013-14 సర్దుబాటు చార్జీలు కొత్త చార్జీల్లో కలిపేయండి తన ప్రకటనకు, ఈఆర్సీ ఆదేశాలకు భిన్నంగా సీఎం సూచన! రూ. 1,250 కోట్ల వసూలుకు డిస్కంలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీలను వసూలు చేయం. - విద్యుత్ చార్జీల పెంపు సందర్భంగా గత ఏడాది ఏప్రిల్‌లో సీఎం కిరణ్ 2013-14 సర్దుబాటు చార్జీల వసూలు రద్దు. - ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కానీ ముఖ్యమంత్రి తన ప్రకటనకే విరుద్ధంగా సూచనలిచ్చారు. ఈఆర్సీ ఆదేశాలను ధిక్కరించి దొడ్డిదారిన 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా పెంచనున్న రెగ్యులర్ చార్జీల్లోనే 2013-14 సర్దుబాటు చార్జీలను కూడా కలిపేయూలని సీఎం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 2014-15కు ఏకంగా రూ. 5 వేల మేరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. ముఖ్యమంత్రి తన ప్రకటనకు, ఈఆర్సీ ఆదేశాలకు కట్టుబడితే ప్రజలకు వచ్చే ఏప్రిల్ నుంచి పొంచి ఉన్న భారం రూ. 1,250 కోట్ల మేరకు తగ్గేది. ఇంధన సరఫరాలో వ్యత్యాసాల వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు మారుతూ ఉంటాయి. తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ తగ్గి.. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరిగితే విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఆ మేరకు పెరుగుతుంది. దేశీయ బొగ్గు అందుబాటులో లేని కారణంగా అధిక ధరకు విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నందువల్ల కూడా విద్యుత్ ఉత్పత్తికి అదనపు వ్యయం అవుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి అదనంగా వెచ్చించిన మొత్తాన్ని ప్రజల నుంచే ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ) పేరిట వసూలు చేస్తారు. 2013-14లో ప్రభుత్వం రూ. 5,500 కోట్ల మేరకు రెగ్యులర్ చార్జీలను పెంచింది. ఆ సమయంలో ఈ సంవత్సరానికి సర్దుబాటు చార్జీలను వసూలు చేయబోమని సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈఆర్సీ కూడా సర్దుబాటు చార్జీలను రద్దు చేసింది. కాగా రెండురోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో 2013-14 నాటి సర్దుబాటు చార్జీల గురించి డిస్కంలు ప్రస్తావించారుు. సుమారు రూ. 1,250 కోట్ల మేరకు వసూలు చేయాల్సి ఉందని, అరుుతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించినందున సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించాలని కోరాయి. ఇందుకు సీఎం ససేమిరా అన్నారు. అంతేకాదు రెగ్యులర్ చార్జీలతో వీటిని కలిపేసి ఆ రకంగా వసూలు చేసుకోవాల్సిందిగా సూచించినట్టు ఇంధనశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలనే డిస్కంలు బుధవారం ఈఆర్సీకి సమర్పించనున్నాయి. 2013-14 సర్దుబాటు చార్జీల రద్దుకు ఆదేశించిన ఈఆర్సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది. నేడు పెంపు ప్రతిపాదనలు! విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వారుుదా పడింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం ఏపీఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలు తొలుత భావించాయి. అయితే ఇదేరోజు రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ కావడం ఇందుకు అడ్డంకిగా మారింది. 2013-14కు చార్జీల పెంపు సమయంలో మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. కేబినెట్‌కు సమాచారం లేకుండా చార్జీలను ఎలా పెంచుతారని గత ఏడాది వారు సీఎంను నిలదీశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తాజాగా సుమారు రూ.5 వేల కోట్ల మేరకు ప్రజలపై భారం వేసే విధంగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం సమర్పించేందుకు ప్రభుత్వం జంకినట్టు సమాచారం. కేబినెట్ సమావేశం రోజే భారీయెత్తున చార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పిస్తే, టీవీల ద్వారా విషయం బయటకు వెల్లడై కేబినెట్లో తీవ్ర నిరసన ఎదుర్కొనక తప్పదని ముఖ్యమంత్రి భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వాయిదా పడినట్టు సమాచారం. -
పౌల్ట్రీకి సగం ధరకే విద్యుత్
‘పౌల్ట్రీ ఎక్స్పో 2013’ ప్రారంభ సభలో సీఎం ప్రకటన సాక్షి,హైదరాబాద్: విద్యుత్ చార్జీలు తగ్గించాలనే పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల చిరకాల డిమాండ్‌కు అనుగుణంగా ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇక్కడి హైటెక్స్‌లో మూడురోజుల పాటు జరగనున్న ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2013’ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ.5.60తో విద్యుత్ సరఫరా అవుతోందని ఈ ధరను సగానికి తగ్గించి రూ.2.80 కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. ఒక్క వ్యవసాయంపైనే రైతు ఆధారపడే పరిస్థితులు ప్రస్తుతం లేవని, అనుబంధ రంగాలైన పాడి, చేపలు, కోళ్ల పెంపకం లాంటివి చేపట్టినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కాసు వెంకట కృష్ణారెడ్డి, కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనుప్ కుమార్ ఠాకూర్, సహ కార్యదర్శి సంజయ్ బోస్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. -
విద్యుత్ చార్జీల వాతలకు మరో నెల గడువు
ఈఆర్సీని కోరిన డిస్కంలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీ ఈఆర్సీ)ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కోరాయి. ఈ మేరకు ఈఆర్సీ కార్యదర్శికి తాజాగా లేఖ రాశాయి. 2014-15లో ఎంత మేర లోటు ఏర్పడుతుందనే అంశంపై డిస్కంలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. దీని ప్రకారం ఏకంగా రూ.12 వేల కోట్ల మేరకు లోటు ఉంది. ఈ మొత్తాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే వరుసగా నాలుగేళ్ల నుంచి విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు సర్దుబాటు చార్జీలు వడ్డించటంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఎన్నికల సమయంలో చార్జీలు పెంచితే ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేమనే ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలో లోటు తగ్గించే అవకాశాలను పరిశీలించడంతోపాటు భారాన్ని తగ్గించేందుకు వీలుగా మరో నెల సమయాన్ని కోరినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31 నాటికి విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కంలు కోరాయి. ఒకవేళ ఆ గడువు నాటికి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ సుమోటోగా చార్జీలను నిర్ణయించనుంది. -
విద్యుత్ చార్జీల పెంపునకు సర్కారు సన్నద్ధం
ప్రజల నెత్తిన 12,000 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను విద్యుత్ చార్జీలతో చావబాదేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏకంగా రూ.12 వేల కోట్ల మేర భారాన్ని జనం నెత్తిన మోపేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన లెక్కలను తేల్చడంలో ప్రస్తుతం ఇంధన శాఖ వర్గాలు బిజీగా ఉన్నాయి. ప్రాథమికంగా లెక్కించిన దాని ప్రకారం సుమారు 12 వేల కోట్ల మేరకు చార్జీల భారాన్ని ప్రజలపై మోపాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చినట్టు ఇంధనశాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్ర విభజన గొడవలో ఆర్టీసీ చార్జీల పెంపుపై పెద్దగా నిరసన వ్యక్తం కాలేదని గ్రహించిన ప్రభుత్వం.. రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపునకు సిద్ధపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంధనశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ సుమారు రూ.47 వేల కోట్ల మేరకు ఆదాయం అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ చార్జీల ద్వారా రూ.35 వేల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరనుంది. దీంతో రూ.12 వేల కోట్ల మేరకు ఏర్పడే లోటును కరెంట్ చార్జీల పెంపు ద్వారానే భర్తీ చేసుకోవాల్సి ఉందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇంత భారీ చార్జీల భారానికి కారణం.. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ డిమాండ్‌ను చూపడం ద్వారా తక్కువ సబ్సిడీని ఇవ్వడం.. విద్యుత్ సరఫరా, పంపిణీ(టీ అండ్ డీ) నష్టాలను తక్కువగా చూపడం, 2013-14లో సర్దుబాటు చార్జీలు లేవంటూ నాటకమాడి.. ఇప్పుడు ఆ భారాన్నీ ప్రజలపై మోపనుండటమేనని విద్యుత్‌రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. పైగా.. 2014-19 ఆర్థిక సంవత్సరాలకుగానూ(వచ్చే ఐదేళ్లకు) మల్టీ ఇయర్ టారిఫ్(ఎంవైటీ)ను ప్రకటించాల్సి రానుండటంతో గత నాలుగే ళ్లుగా భరించకుండా తప్పించుకున్న ఉచిత విద్యుత్ సబ్సిడీ భారంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాలు, సర్దుబాటు చార్జీలనూ ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 12 వేల కోట్ల చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించనున్నట్టు సమాచారం. ‘ఉచిత’ భారాన్ని తగ్గించుకుంటోందిలా..: వ్యవసాయ విద్యుత్ సరఫరా అంచనాలను తక్కువగా లెక్కించడం ద్వారా ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచిత కరెంట్కయ్యే వాస్తవిక భారాన్ని ప్రభుత్వం అదనంగా చెల్లించేది. ఈ విధంగా 2007-08 ఆర్థిక సంవత్సరంలో 1,200 కోట్లను డిస్కంలకు అదనంగా చెల్లించింది. అదేవిధంగా 2008-09 ఆర్థిక సంవత్సరంలో అదనపు విద్యుత్ కొనుగోలుకు అయిన రూ.6 వేల కోట్లనూ చెల్లిస్తామని హామీనిచ్చారు. అయితే, ఆయన మరణానంతరం ఉచిత విద్యుత్కయ్యే అదనపు వ్యయాన్ని ప్రభుత్వం భరించడం లేదు. గత రెండేళ్ల లెక్కలనే పరిశీలిస్తే.. 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకుగానూ వ్యవసాయానికి రాష్ర్టంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో 6143.15 మిలియన్ యూనిట్ల(ఎంయూ) క రెంట్ అదనంగా సరఫరా అయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీ అనుమతి మేరకు వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన విద్యుత్ 16569.22 ఎంయూలు కాగా, సరఫరా అయినది 19924.4 ఎంయూలు. అదనంగా 3355.18 ఎంయూల విద్యుత్ ఇచ్చారు. అదేవిధంగా 2012-13లో సరఫరా చేయాల్సిన విద్యుత్ 18225.9 ఎంయూలు కాగా, సరఫరా అయింది 21013.87 ఎంయూలు. అంటే 2787.97 ఎంయూల విద్యుత్‌ను అదనంగా సరఫరా చేశారన్నమాట. ఈ లెక్కన గత రెండేళ్లలోనే ఏకంగా 6143.15 ఎంయూలు అదనంగా ఇచ్చారు. మొత్తమ్మీద 2010-11 నుంచి 2013- 14 వరకూ ఈ విధంగా ఏటా సగటున 2,500 ఎంయూల మేరకు ఉచిత విద్యుత్‌ను అదనంగా సరఫరా చేయాల్సి వచ్చింది. అయితే, ఈ 10 వేల మిలియన్ యూనిట్ల మొత్తానికి సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో డిస్కంలు వాణిజ్య సంస్థల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకుని అదనపు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయానికి అదనపు కరెంట్‌ను సరఫరా చేశాయి. యూనిట్‌కు సగటున రూ.5.50 చొప్పున లెక్కిస్తే.. 10 వేల ఎంయూలకు రూ.5వేల కోట్ల మేరకు అదనంగా వెచ్చించాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాల్సి ఉన్నా.. చెల్లించేందుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఈ భారం మొత్తాన్ని ఇప్పుడు ట్రూ-అప్ పద్ధతిలో(వాస్తవిక వ్యయాన్ని రాబట్టుకోవడం) రాబట్టుకునేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. నష్టాలు, సర్దుబాటు అన్నీ జనంపైనే.. ఉచిత విద్యుత్ భారంతో పాటు డిస్కంల నష్టాల భారాన్నీ ప్రజలపైనే మోపనున్నారు. ఈఆర్సీ నిర్ణయించిన విద్యుత్ సరఫరా, పంపిణీ(టీఅండ్‌డీ) నష్టాలతో పోలిస్తే.. వాస్తవ నష్టం ఎక్కువగా ఉంది. అయితే, గత నాలుగేళ్లుగా వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఒకేసారి ఆ లోటును భర్తీ చేసుకోవాల్సి వస్తోంది. ఈ తేడా విలువ సుమారు రూ.3 వేల కోట్ల మేరకు ఉంటుందని డిస్కంలు ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీల వసూలు లేదని ప్రభుత్వం దర్జాగా ప్రకటించింది. అయితే, ఇప్పుడు దాన్నీ వసూలు చేయనున్నారు. 2013-14లో వసూలు చేయాల్సిన సర్దుబాటు చార్జీల భారాన్ని.. తాజా రెగ్యులర్ చార్జీలతో కలిపి సుమారు 2 వేల కోట్ల మేరకు వసూలు చేయనున్నట్టు తెలిసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సిన అదనపు విద్యుత్ కోసం మరో 2 వేల కోట్ల మేరకు వెచ్చించాల్సి వస్తుందని అంచనా. తాజా చార్జీల్లో దాన్ని కలిపి వడ్డించనున్నారు. మొత్తంగా అన్నింటినీ కలుపుకుని రూ.12 వేల కోట్ల మేర చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. అయితే, ఏయే కేటగిరీ(గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వగైరా)కి ఎంత మేరకు చార్జీలను పెంచాలనే విషయంపై కసరత్తు పూర్తికాలేదని ఇంధనశాఖ వర్గాలు చెప్పాయి. ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి వద్ద జరిగే కీలక సమావేశంలో ఏయే కేటగిరీకి ఎంత మేరకు చార్జీలను పెంచాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే ఎందుకు? డిస్కంలు ప్రతీ ఐదేళ్లకు ఓసారి మల్టీ ఇయర్ టారిఫ్(ఎంవైటీ)ను ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఎంవైటీలో టారిఫ్ ప్రతిపాదనలను స్థూలంగా పేర్కొంటారు. తద్వారా రానున్న ఐదేళ్లపాటు టారిఫ్ విధానం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. ప్రధానంగా పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉంటుందనేది ఈ ఎంవైటీ లక్ష్యం. 2009-14 సంవత్సర కాలానికి సమర్పించిన ఎంవైటీ కాలపరిమితి 2013-14 ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోయింది. దీంతో 2014-19 వరకు.. అంటే రానున్న ఐదేళ్ల వరకు ఎంవైటీను డిస్కంలు సమర్పించాల్సి ఉంది. కాగా, ఏటా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టారిఫ్‌ను సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఏ ఆర్థిక సంవత్సరానికి ఆ ఆర్థిక సంవత్సరంలో చార్జీల పెంపు వివరాలతో టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పిస్తున్నాయి. ఇప్పుడు ఎంవైటీని సమర్పించాల్సి ఉండటంతో 2009-14 ఎంవైటీ లెక్కలను సరిచూసుకుని.... గత నాలుగేళ్లుగా పేరుకుపోయిన మొత్తాలన్నింటినీ వసూలు చేయాల్సి ఉందని ఇంధనశాఖ వర్గాలు చెబుతున్నాయి. బాబు బాటలోనే.. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చంద్రబాబు హయాంనాటి రోజులు మళ్లీ వచ్చాయి. విద్యుత్ చార్జీల పెంపులో బాబును ప్రస్తుత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటోంది. గత ఐదేళ్లు చార్జీలు పెంచలేదని... మరో ఐదేళ్లూ పెంచేది లేదని 2009లో వైఎస్ ప్రకటించారు. ఈ హామీని ప్రభుత్వం పట్టించుకోలేదు. నాడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచగా... వైఎస్ మరణానంతరం గత నాలుగేళ్లలో నాలుగుసార్లు చార్జీలు పెరిగాయి. ఇప్పుడు ఐదోసారి పెంచేందుకూ ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత నాలుగేళ్లలోనే రెగ్యులర్ చార్జీల రూపంలో సర్కారు రూ.12,500 కోట్ల భారాన్ని మోపింది. సర్దుబాటు చార్జీల రూపంలో మరో రూ.11 వేల కోట్లకుపైగా మొత్తాన్ని జనం నెత్తిన రుద్దింది. అయితే, విద్యుత్ సరఫరా మాత్రం రోజురోజుకీ అంతంతమాత్రంగా మారిపోతోంది. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ హామీనిచ్చారు. ఈ హామీని మేనిఫెస్టోలో కూడా చేర్చారు. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట కూడా ఇచ్చారు. అయితే, ఈ హామీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇచ్చేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో రెగ్యులర్ చార్జీల భారమిలా.. ఆర్థిక సంవత్సరం భారం(రూ. కోట్లలో) 2010-11 1,000 2011-12 1,000 2012-13 5,000 2013-14 5,500 మొత్తం 12,500 సర్దుబాటు చార్జీల వడ్డన ఇలా... ఆర్థిక సంవత్సరం భారం(రూ.కోట్లలో) 2009-10 1,442 2010-11, 11-12 6,022 2012-13 4240 మొత్తం 11,704 -
మరోసారి ‘షాక్’
సాక్షి, ముంబై: మరోసారి విద్యుత్ చార్జీలతో ముంబైకర్ల నడ్డివిరించేందుకు బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇదివరకే పెంచిన విద్యుత్ చార్జీలతో వినియోగదారులు బెంబేలెత్తుతుండగా, మరోసారి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమయింది. కొత్త చార్జీలు సోమవారం (సెప్టెంబర్ ఒకటి) నుంచి వర్తిస్తాయి. అంటే అక్టోబరు బిల్లు కొత్త చార్జీలతో వస్తుందని బెస్ట్ విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. చార్జీలు పెంచేందుకు మహారాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఎంవీఆర్సీ) ఇటీవలే అనుమతి ఇవ్వడం తెలిసిందే. దీంతో ముంబైకర్లపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు బెస్ట్‌కు మార్గం సుగమమయింది. కొలాబా నుంచి బాంద్రా, సైన్ వరకు ఉన్న బెస్ట్ విద్యుత్ వినియోగదారులపై బిల్లుల భారం పడనుంది. ప్రతీనెల 100 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వినియోగదారులకు రూ.39, అలాగే నెలకు 300 యూనిట్లు వాడే సామాన్య వినియోగదారులకు రూ.207 చొప్పున అదనంగా వడ్డించనున్నారు. కొలాబా మొదలుకుని పశ్చిమ శివారులోని మాహిం వరకు, తూర్పు శివారు ప్రాంతంలో సైన్ వరకు బెస్ట్ కరెంటు సరఫరా చేస్తోంది. మిగతా శివారు ప్రాంతాల్లో రిలయన్స్, బీఎస్ఈఎస్ తదితర డిస్కమ్‌లు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. బెస్ట్ విద్యుత్ వినియోగదారుల్లో నివాసాలు, దుకాణాలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన 10 లక్షల మంది ఉన్నారు. వీరందరి నెలవారీ కరెంటు బిల్లులు కనీసం 8.9 శాతం పెరగనున్నాయి. కొత్త ధరలు అమల్లోకి రావడంతో ఇళ్లలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించే వాళ్లు కూడా ఆందోళనకు గురవుతున్నారు. నివాస వినియోగదారులకు వర్తించే కొత్త చార్జీల వివరాలివి యూనిట్లు పాత ధర (యూనిట్‌కు) కొత్త ధర తేడా (పైసల్లో) అదనపు భారం 0-100 2.06 2.45 39 రూ.39 101-300 3.81 4.50 69 రూ.207 301-500 5.36 6.35 99 రూ.495 501- ఆపైన 6.86 8.00 1.14 రూ.571 -
దేశానికి పట్టిన శని కాంగ్రెస్: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: దేశానికి పట్టిన పెద్ద శని కాంగ్రెస్ పార్టీ అని, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, ఇతర కేంద్రమంత్రులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం రెండు విడతలుగా అధికారంలో కొనసాగుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల కలిగిన లబ్ధిని ఈ ప్రభుత్వం ఉపయోగించుకుందని వ్యాఖ్యానించారు. టీడీపీపై కక్షతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. చంద్రబాబు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎప్పటిలాగానే ‘సాక్షి’ ప్రతినిధులకు ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోవటంతో.. ఆయన ఏం చెప్పారనే సమాచారాన్ని వివిధ మార్గాల నుంచి సేకరించి వార్తగా ఇవ్వటం జరిగింది. చిల్లర వ ర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రపంచంలో ఎవరికీ నమ్మకం లేకుండా పోయిందని విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో పాత్రధారులు తాము ఎక్కడ శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భ యంతోనే ఫైళ్లన్నింటినీ తగలబెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహారభద్రత బిల్లు వల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఎన్నికలకు ముందు ఇటువంటి పథకాలను కేవలం ఓట్ల కోసమే ప్రారంభిస్తారని బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి దిగజారిపోయిందని.. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో అందోళనలు జరుగుతున్నాయని.. తాను అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చిన సందర్భాలు లేవని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చిందని.. కాంగ్రెస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. విభజనకు టీడీపీయే కారణమని వైఎస్సార్ సీపీ నేతలు చెప్పటాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు గుంటూరు జిల్లా నుంచి తెలుగు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బాబూ... ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా? ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. ఒకవేళ అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది. చిల్లర వర్తక రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని చెప్తున్న మీరు.. ఈ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా మీ పార్టీ ఎంపీలు గైర్హాజరు అయ్యేలా చేసి బిల్లు ఆమోదానికి ఎందుకు సహకరించారు? మీరు సీఎంగా ఉన్న సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని చెప్పటం పచ్చి అవాస్తవం కాదా? విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం జరిగింది మీ హయాంలోనే కదా? ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్, వామపక్షాలు ఉమ్మడిగా నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై కాల్పులు జరిపి ముగ్గురిని బలిగొన్నది మీ ప్రభుత్వం కాదా? గిట్టుబాటు ధర కోసం ఆందోళనకు దిగిన రైతులపై పశ్చిమగోదావరి జిల్లా కాల్దరిలో కాల్పులు జరిపింది మీ ప్రభుత్వం అవునా, కాదా? తమ సమస్యలను పరిష్కరించాలని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్లను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో గొడ్లను బాదినట్లు చితక బాదింది ఎవరి హయాంలో? ఉప్పు పండించే రైతులపై ప్రకాశం జిల్లా చినగంజాంలో కాల్పులు జరిపినపుడు అధికారంలో ఉంది ఎవరు? కరెంటు బిల్లులు చెల్లించలేదని రైతాంగాన్ని అరెస్టు చేయటంతో పాటు కాళ్లకు బేడీలు వేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించింది మీ హయాంలో కాదా? 2001లో ఆర్టీసీ కార్మికులు 24 రోజుల పాటు సమ్మెచేసి రవాణా స్తంభించిపోయినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ)ని సంస్కరణల పేరుతో ట్రాన్స్‌కో, జెన్‌కోలుగా విభజించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా 1997 ఆగస్టు నుంచి 1998 వరకు ఏడాది కాలం పాటు విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినపుడు అధికారంలో ఉన్నది ఎవరు? అప్పుడు 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎన్నడూ లేని విధంగా ఐదు రోజుల పాటు సమ్మెకు కూడా వెళ్లారు కదా. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? -
బషీర్‌బాగ్ అమరులకు లెఫ్ట్ నివాళి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల వ్యతిరేక పోరులో అమరులైనవారి 13వ వర్ధంతి సందర్భంగా వామపక్షాల నేతలు బుధవారం బషీర్‌బాగ్‌లోని షహీద్‌చౌక్ వద్ద నివాళులు అర్పించారు. విద్యుత్ ఉద్యమ అమరులు.. బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలను స్మరించుకున్నారు. నివాళులర్పించిన వారిలో బీవీ రాఘవులు, వైవీ రావు, తమ్మినేని వీరభద్రం(సీపీఎం), కె.రామకృష్ణ, చాడా వెంకటరెడ్డి, గుండామల్లేష్, అజీజ్ పాషా(సీపీఐ), డీవీ కృష్ణ, గాదె దివాకర్(న్యూడెమోక్రసీ), ఎండీ గౌస్, తాండ్రకుమార్, వర్ల వెంకటరెడ్డి(ఎంసీపీఐ), గుర్రం విజయ్‌కుమార్(సీపీఐఎంఎల్), మురహరి(ఎస్‌యూసీఐ), జానకీరాం(ఆర్ఎస్సీ), దయానంద్(ఫార్వర్డ్‌బ్లాక్), ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ తదితరులున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ గైర్హాజరయ్యారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నుంచి చీలిన చంద్రన్నవర్గం నేతలు గోవర్దన్, ఎస్.వెంకటేశ్వరరావు, సంధ్య తదితరులు విడిగా వచ్చి నివాళులర్పించా రు. కాగా.. తెలంగాణ, సమైక్యాంధ్ర విభేదాలు కమ్యూనిస్టుల ఐక్య పోరాటాలకు ఆటంకం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు స్పష్టంచేశారు. తమ మధ్య విభేదాలు ఈనాటివి కాదని, అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలున్నా కలిసే పనిచేస్తున్నామన్నారు. విభజనపై పాలకవర్గాలు నాటకమాడుతున్నాయని విమర్శించారు. వారి వారి వాటాలు ఖరారయ్యే వరకు ఈ పోరు ఇలా నడుస్తూనే ఉంటుందన్నారు. ఓ పక్క సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూనే జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని ట్రావెల్స్ వంటి సంస్థలు బస్సుల్ని తిప్పుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. -
మళ్లీ సర్దుబాటు వడ్డన : యూనిట్‌కు 49 పైసలు