
హైదరాబాద్, సాక్షి: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు. కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే.. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా?.
ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు.. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు?. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’’ అని అన్నారు.
కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది ! విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ !
పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు !
ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే..… pic.twitter.com/hqiKkXIFrn— KTR (@KTRBRS) October 15, 2024