ఈఆర్‌సీకి ఇంధన శాఖ లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)ని ఇంధన శాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన, రాష్ర్టపతి పాలన నేపథ్యంలో కొత్త విద్యుత్ చార్జీలపై తాము నిర్ణయం ప్రకటించలేమని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. జూన్ 2 తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం.
వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలను మార్చి చివరి వారంలోనే ఈఆర్‌సీ నిర్ణయించాల్సి ఉంది. అయితే, కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత చార్జీలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీంతో తదుపరి నిర్ణయం ప్రకటించే వరకూ ప్రస్తుత చార్జీలే కొనసాగుతాయని ఈఆర్‌సీ ప్రకటించింది.
ప్రస్తుత చార్జీలనే కొనసాగించండి!
Published Wed, May 14 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement