President Rule
-
రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు?
ఇంఫాల్: మణిపూర్‌లో గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. దీనికిముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మణిపూర్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త నేత విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారనే విషయానికొస్తే..రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం విఫలమైనప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన(President's rule) విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతోంది. అలాగే ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నయినా తొలగించి, ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనప్పుడు కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356(Article 356)ను ఉపయోగిస్తూ వస్తోంది.దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1951 జూన్ 20న పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా ఆర్టికల్ 356ను ఉపయోగించారు. ఆయన పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు. నాడు పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం(Communist government)లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడానికే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిని విధించారని కొందరు రాజకీయ నిపుణులు చెబుతుంటారు. కాగా అధికారిక రికార్డుల ప్రకారం 1959లో మొదటిసారిగా కేరళలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. జవహర్లాల్ నెహ్రూకు కేరళ వామపక్ష ప్రభుత్వం నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
ఢిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించింది మణిపూర్‌లో గిరిజన జాతుల మధ్య హింస నేపథ్యంలో శాంతిభద్రతలు దిగజారాయి. దీంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. రెండు జాతుల మధ్య రేగిన వైరం.. ఎంతటి హింసకు దారి తీసిందో తెలిసిందే.. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు.60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఇదీ చదవండి: మణిపూర్ శాంతిస్తుందా? -
గూండాల చేతిలో పశ్చిమ బెంగాల్: సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలోని మమత ప్రభుత్వంపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ గూండాలు, రేపిస్టుల చేతుల్లో ఉందని సువేందు ఆరోపించారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఏడు లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయని అన్నారు. నిందితులు టీఎంసీతోప్రత్యక్ష సంబంధం కలిగినవారేనని, వీరని మమతా బెనర్జీ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. మమతా సాగిస్తున్న అవినీతిని బీజేపీ బయటపెడుతుందని అన్నారు. అంతకుముందు బీర్భూమ్లో నర్సుపై వేధింపుల ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ సీఎం మమతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిపాలనతో పాటు పోలీసింగ్ వైఫల్యమే ఇటువంటి ఘటనలకు కారణమన్నారు. మమతకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఆమె తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రపతి పాలనే శరణ్యం!
‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్’ సెటిల్ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్ బుక్’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్ బుక్’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతటా యువనేత, ‘రెడ్ బుక్’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్ కౌన్సిలర్‌నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్‌ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్‌బుక్ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్‌రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్‌ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్లో తమ ’సూపర్ సిక్స్’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్‌ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్ ఆన్ అకౌంట్’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
పల్నాడు, సాక్షి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు. కానీ, కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడని రషీద్‌ను హత్య చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు చేస్తున్నారు. మా ఎంపీ, ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. మిథున్‌రెడ్డి, రెడ్డప్పపై దాడి చేశారు. దాడి చేసింది కాకుండా.. వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారు. గత ఐదేళ్లలో ఎన్నాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం... ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన. ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!.. మంత్రి సంచలన కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ నేతలు ప్రతీరోజు కేంద్రంలోని బీజేపీ, దర్యాప్తు సంస్థలతో తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆప్ మంత్రి అతిశి సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి అతిశి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం కుట్రలు జరుగుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. గతంలోని అనుభవాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించడం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావడం మానేశారు. ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్)ని పదవి నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Let me warn the BJP that imposing President's rule in Delhi will be illegal, unconstitutional and against the mandate of the people of Delhi. The people of Delhi have given a clear mandate to Arvind Kejriwal and Aam Aadmi Party." pic.twitter.com/IbcVTnpkNK — ANI (@ANI) April 12, 2024 దీంతో, మంత్రి అతిశి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రతిరోజు కొన్ని అందమైన కథల్ని వండి వార్చుతున్నారని కాషాయ పార్టీ నేతలు ఎద్దేవా చేసింది. ఇక, ఆప్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా.. సీఎం పీఎస్ వైభవ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం ప్రకటించింది. కాగా, ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Arvind Kejriwal has been arrested in a fake case and that too without any proof because there is a conspiracy to topple the elected govt of Delhi. when we see a few things from the past, it shows that there has been a… pic.twitter.com/kcGcqRIpde — ANI (@ANI) April 12, 2024 -
రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్యాపేట: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో జరపాలని పార్లమెంటులో చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు. కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50వేల మెజార్టీతో కాంగ్రెస్ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ మెజారిటీ తగ్గితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. దేశాన్ని బీజేపీ ఛిన్నాభిన్నం చేయబోతుందని ఉత్తమ్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ మోసాలు ఎండగట్టేందుకే హాత్ సే హాత్ జోడో యత్ర చేపడుతున్నట్లు చెప్పారు. చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే.. -
ఫెడరల్ వ్యవస్థకు రోజులు మూడాయా?
కేంద్ర ప్రభుత్వం కత్తినీ, కలాన్నీ సమంగా శత్రువుగా భావిస్తోందా? ఉగ్రవాదులనూ, సమాజాన్ని చైతన్యపరిచే రచయితలనూ ఒకటిగానే చూస్తోందా? అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నవారిని నిర్బంధించడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో అధికారం మొత్తాన్నీ తన చేతుల్లోకి తీసుకోవడానికీ వెరవడం లేదు. దీంతో దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు రోజులు మూడాయన్న భావన దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. దీనికితోడుగా రాజ్యాంగ పరిధుల్ని కాలదన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, 2024 సంవత్సరానికి ముందే దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. ‘‘దేశంలో శాంతి భద్రతలకు ఏర్పడుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, భద్రతా సంస్థలు సిద్ధంగా ఉండాలి. శాంతి, భద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్రాలకు ఉన్నదని రాజ్యాంగం నిర్దేశించినా... దేశ సమైక్యతతో ఈ సమస్య ముడిపడి ఉంది కాబట్టే మా ఆవేదనంతా. మనది ఒకే దేశం కాబట్టి దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకే రకం యూని ఫామ్ ఉండాలి. దేశ యువకుల ఉద్రేక స్వభావాల్ని ఆసరా చేసుకొని కొందరు తమ కలాల ద్వారా ఉగ్రవాద ప్రచారానికి తోడ్పడుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి రూపొందిన ‘ఉపా’ చట్టం ప్రభుత్వానికి ఎంతో వెన్నుదన్నుగా ఉపయోగపడుతోంది. అయినా ‘ఉపా’ చట్టాన్ని, దాని సామంజస్యాన్ని ప్రశ్నించే కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చాయి.’’ – అక్టోబర్ 28–29 తేదీల్లో ప్రధాని మోదీ ప్రసంగాల సారాంశం. ‘‘ప్రతీ రాష్ట్రమూ శాంతి భద్రతల రక్షణకు దేశవ్యాప్తంగా ఒకే ఒక విధానం రూపొందించి తీరాలి. ఇది 2024 లోగానే రూపొంది తీరాలి.’’ – హోంమంత్రి అమిత్ షా (27 అక్టోబర్ 2022) దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు ‘రోజులు మూడాయన్న’ భావన క్రమంగా దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. ఇటీవలనే పదవీ కాలం ముగిసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణతో ప్రారంభమైన కొన్ని అభ్యుదయకర తీర్పుల ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానం మీద కొంత విశ్వాసం బలపడింది. అయితే భారతదేశ చైతన్యవంతులైన, పాలక శక్తుల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ యువతరంపై దారుణమైన నిర్బంధ విధానానికి బీజేపీ ప్రభుత్వం పాల్పడింది. చివరికి నిలువెల్లా వికలాంగుడైన అభ్యుదయవాది, భావ విప్లవ స్ఫూర్తికి దోహదం చేస్తూ అనేక సంవత్సరాలుగా దేశ పాలక వర్గాల అధికార దుర్వినియోగాన్ని సహిస్తూ వచ్చిన సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఒక రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దాన్ని రద్దు చేయించడానికి పాలకవర్గం సాహసించి, తిరిగి జైలుకు పంపించింది. అంత బలహీన స్థితికి దేశ బీజేపీ నాయకత్వ పాలనా పద్ధతులు దిగజారిపోయాయని ప్రజలు నిర్ణయానికి వచ్చే అవకాశాన్ని పాలకులు కల్పించకూడదు. సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ స్వయంగా తన తండ్రి జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పును కూడా తిరగదోడారు. ఆయన బిడ్డగా ఎదిగివచ్చినా తన తనాన్ని, తన స్వతంత్ర ప్రతిపత్తిని సదా ఈ క్షణం దాకా కాపాడుకుంటూ వచ్చిన ఉద్దండుడు నేటి సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి. తన సొంత తండ్రిగారిచ్చిన తీర్పునే కొట్టి పారేయడానికి రక్త సంబంధం ఏమాత్రం ఆయనకు అడ్డు నిలువక పోవడం అత్యంత ప్రశంసనీయం. ఈ పరిణామం గమనించి ఉన్న బీజేపీ పాలకులు నవంబర్ 9న నూతన ప్రధాన న్యాయమూర్తిగా డి.వై.చంద్రచూడ్ పదవీ స్వీకారం చేయకుండా నిరోధించేందుకు ఎవరి చేతనో ఒక అడ్డుపుల్ల పిటిషన్ వేయించారు. కానీ తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఆ ‘కొంటి’ పిటిషన్‌ను ‘సరుకులేని కాగితం’గా కొట్టి పారవేశారు. ఇలా బీజేపీ హయాంలో ఒకటిగాదు, ఎన్నో పిటిషన్లు! ‘ది వైర్’ లాంటి ప్రముఖ దేశీయ వార్తా సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై నిష్పాక్షిక విచారణ జరిపి తీరాలని ఢిల్లీ పోలీసుల్ని దేశ ప్రఖ్యాత ‘ఎడిటర్స్ గిల్డ్’ పోలీసులను కోరింది. ఇంత కన్నా బీజేపీ పాలకుల అసమర్థ దుర్జనత్వానికి నిదర్శనం మరొక టుంది. ‘జాతీయ భద్రతా ప్రయోజనాల’ పేరిట ఇతరులు తెరచి చూడటానికి వీలు లేదన్న మిషపైన పాలకులు కొత్తగా ‘సీల్డ్ కవర్’ ఎత్తుగడలు పాటిస్తూ వచ్చారు. కానీ, ఆ ఎత్తుగడలను బహిర్గతం చేస్తూ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల సుప్రీం బెంచ్ ‘మీడియా వన్ ఛానల్’ టెలికాస్ట్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్‌ను పక్కకి తోసేసింది. ఎందుకంటే, ఆ ఛానల్‌కు ఎప్పటి నుంచో ఉన్న సెక్యూరిటీ అనుమతిని కూడా అకస్మాత్తుగా పాలకులు రద్దు చేశారు. ఎవరు ఫిర్యాదు చేసినా, అసలు ఫైల్లో ఉన్నదేమిటో, బయటికి పొక్కకుండా రహస్యంగా దాచిన విషయం జాతీయ భద్రతకు ఏ విధంగా విఘాతం కల్గిస్తుందో కోర్టు వారికి విధిగా బహిరంగపరచాల్సిందేననీ, ‘సీల్డ్ కవర్’ల తతంగం ఇక మీదట కొనసాగరాదనీ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. ఈ భాగోతం ఇలా ఉండగానే, రాజ్యాంగ పరిధుల్ని కాల దన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీం గమనిస్తూనే ఉంది. గతంలో బొమ్మై (కర్ణాటక) ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని దించేయడానికి జరిగిన ప్రయత్నంలో శాసనసభ చర్చకు, దాని అనుమతికి బద్ధమై మాత్రమే నిర్ణయాలు జరగాలన్న జస్టిస్ జయచంద్రారెడ్డి హెచ్చరికను ఆనాటి ప్రతిపక్షం పాటించక తప్పలేదు. అటు కేరళ బీజేపీ గవర్నర్, ఇటు తమిళనాడు గవర్నర్, మరికొన్ని ఇతర రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంపై దేశవ్యాప్తంగా నేడు పెద్ద అలజడి విద్వత్ వర్గాలలో ప్రారంభమైంది. బహుశా 2024వ ఏడాదికి ముందే అర్ధంతరంగా దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు నిజమే అవుతాయేమో అన్నంతగా ప్రజా బాహుళ్యంలో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకంటే – భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ పని, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలకు బద్ధమై ఉండవలసిందేగానీ, వ్యతిరేకించ కూడదు. రాజ్యాంగం తనను అనుమతించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలలో 163(2) అధికరణ గవర్నర్ల జోక్యానికి అనుమతిస్తుంది. అంతేగానీ, ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించి ‘సొంత దుకాణం’ తెరచుకునే అధికారం నామినేటెడ్ గవర్నర్లకు లేదు. సుప్రసిద్ధ సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్... షంషేర్ సింగ్ కేసులో చెప్పిన తీర్పులో ఇలా పేర్కొ న్నారు: ‘‘శాసనసభ (లెజిస్లేచర్)కు ఆయా శాఖల మంత్రులు జరూరుగా సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. వీరు ఆశువుగా చెప్పే పద్ధతికి ప్రజలూ అలవాటు పడ్డారు. ఎవరో ఒకే ఒక నాయకుడి ఆత్మకు దాసోహమని కూర్చోకుండా ప్రజలు ఈ రకపు ప్రజాస్వా మ్యానికి కూడా అలవాటుపడ్డారనుకోవాలి. కాకపోతే, భారతదేశపు సంక్లిష్ట రాజకీయ నిర్మాణ సూత్రాలకు ఒదిగి ఉండక తప్పదేమో’’! కాబట్టి ఈ పరిస్థితుల్లో కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ల అనవసర జోక్యానికి చోటివ్వకుండా చూడాలని ప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది కాళేశ్వరం రాజ్ అభిప్రాయం. చివరికి, త్వరలో దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాల గురించి పలువురి అనుమానాలకు తగి నట్టుగానే గుజరాత్ విద్యాపీఠ్‌కు 12వ అధ్యక్షుడిగా గుజరాత్ గవర్నర్, బీజేపీ అనుయాయి అయిన దేవవ్రత్‌ను నియమించాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విద్యాపీఠ్‌ను స్వతంత్ర సంస్థగా 1920లో గాంధీజీ నెలకొల్పారని మరవరాదు. నిజమైన గాంధేయవాది మాత్రమే ఈ విద్యాపీఠ్‌ను అలంకరించాలని నాడు నిర్ణయమయింది. కానీ, ఆ ఆశయానికి విరుద్ధంగా దేవవ్రత్‌ను (రాజ కీయ గవర్నర్) నియమించినందుకు నిరసనగా విద్యాపీఠ్ ట్రస్టీల బోర్డునుంచి గత నెల 18న తొమ్మిదిమంది సభ్యులు రాజీనామాలు చేశారు. ఏతావాత మన పాలకులు కూడా కలాన్నీ, కత్తినీ సమ పాళ్లలోనే ఒకే బాటలో నిలబెట్టడానికి అంగీకరిస్తున్నందువల్ల గాంధీ విద్యాపీఠ్ నెత్తిపైన కూడా ఈ రెండు రకాల ఆయుధాలను – సమంగా మోపడానికి వెనుదీయలేదన్నమాట! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాష్ట్రపతి పాలనలోనూ యూపీదే రికార్డు
సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైనపుడు, శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధిస్తూ ఉంటుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటిదాకా అధికసార్లు రాష్ట్రపత్రి పాలన విధించారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి సీఎం సీఠును అధిరోహింకలేకపోయారు. రాష్ట్రం రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లంటే మొత్తం రోజులు ఉత్తరప్రదేశ్ 10 1,689 మణిపూర్ 10 2,337 జమ్మూ కశ్మీర్ 9 3,892 బిహార్ 8 1,001 పంజాబ్ 8 3,477 -
‘ఏం చేయలేకపోతున్నా.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 24,235 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 395 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఢిల్లీలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఇక్భాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయిందని, ప్రజలకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ‘ఢిల్లీలో కోనా పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. ప్రజలకు ఆక్సిజన్, ముందులు ఆందడం లేదు. నా స్నేహితుడే కరోనాతో పోరాడుతున్నాడు. అతనికి ఆసుపత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్ దొరకడం లేదు. తనకు కావాల్సిన రెమెడిసివిర్ ప్రిస్కిప్షన్ నా దగ్గర ఉంది. కానీ నేను అది ఎక్కడి నుంచి తీసుకు రావాలి?. సాయం చేయలేక ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ప్రభుత్వం కూడా సహాయం చేయలేకపోతుంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. సీనియర్ వ్యక్తిని. అయినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ఏ అధికారిని సంప్రదించలేకపోతున్నాను. ఆ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలని అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరుతున్నారు. ఇదే గనుక జరగకపోతే రోడ్లపై శవాలు పడి ఉంటాయి’ అని విజ్ఙప్తి చేశారు. కాగా ఇక్బాల్ 1993 నుంచి ఢిల్లీలోని మాటియా మహల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్బాల్ కామెంట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు. చదవండి: ‘కరోనా కేసులు పెరగడానికి మేం కారణం కాదు’ -
రాష్ట్రపతి పాలన?!: బీజేపీ నేత వ్యాఖ్యల కలకలం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన అధికారం చేపట్టింది మొదలు బీజేపీ, శివసేన మధ్య ఏదో ఒక రూపంలో విభేదాల సెగలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా స్థానిక బీజేపీ నేత శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి(ఎంవీఏ) సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న పదిహేనురోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం ఖాయమని, దాంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం రానుందంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. కొంతమంది ఈ మంత్రులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతారు, ఇక ఆ తరువాత సదరు మంత్రులు వైదొలగవలసి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ మంత్రులు ఎవరనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో వాజ్‌ను సర్కార్ భారీగా వెనకేసుకొచ్చిందని ఆరోపించారు. దీంతో అసెంబ్లీని తొమ్మిది సార్లు వాయిదా వేయాల్సి ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో వ్యవస్ధీకృత నేరాలకు పాల్పడుతోందంటూ పాటిల్ ధ్వజమెత్తారు. (అనిల్ దేశ్‌ముఖ్ 2 కోట్లు అడిగారు) అవినీతి ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా నేపథ్యంలో , మరిన్ని అవినీతా ఆరోపణలతో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుందని బీజేపీ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రంలో పరిణామాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. తాను సర్వీసులో కొన సాగాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మాజీ రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీకి చెందిన అనిల్ దేశముఖ్ డిమాండ్ చేశారని సస్పెన్షన్‌కు గురైన ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ఆరోపించిన క్రమంలో చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలుచేయాలని మరో మంత్రి అనిల్ పరాబ్ కోరారంటూ వాజే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు) కాగా ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించడంతో సోమవారం రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్‌దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. -
మాట వినకపోతే.. సుప్రీం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ వాదనలు కొనసాగిస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు లోపించాయని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న , వి.రామస్రుబమణియన్‌లతో కూడినధర్మాసనం విచారించింది. యూపీలో అనేక హత్యలు జరుగుతున్నాయని, కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సూచనలు చేయలేదని న్యాయవాది సుకిన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల క్రిమినల్ రికార్డులు కూడా పరిశీలించారా అని జస్టిస్ బోబ్డే ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 30 శాతం నేరాలు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయని సుకిన్ తెలిపారు. ‘ఇంతకు మించి ఎక్కువ వాదనలు కొనసాగిస్తే భారీ జరిమానా విధిస్తాం’అంటూ జస్టిస్ బోబ్డే పిటిషన్‌ను కొట్టివేశారు. చదవండి: ఉత్తరాఖండ్ : 12 మందిని కాపాడిన ఫోన్ కాల్ -
యోగీ రాజీనామా చెయ్యి.. రాష్ట్రపతి పాలన పెట్టండి!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రగిలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో నేరస్థులు, మాఫియా, రేపిస్టులకు అడ్డూ అదుపూలేకుండా పోతోందన్నారు. 'జంగిల్‌రాజ్' యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నేరాలు, ముఖ్యంగా దళిత బాలికలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ యోగిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు) రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాస్ బల్రాంపూర్ ఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని, నిర్భయ కేసును గుర్తుకు తెచ్చాయని మాయావతి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగని రోజు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తనకూ ఒక ఆడకూతురు ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని, ఆడబిడ్డలను రక్షించ లేని యోగి వెంటనే రాజీనామా చేయాలని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వస్థలమైన గోరఖ్‌పూర్ మఠానికి యోగిని పంపించాలని మాయావతి వ్యాఖ్యానించారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) అలాగే హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించకుండా, అర్ధరాత్రి దహనం చేసిన యూపీ పోలీసులపై మాయావతి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని బీఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు. ఇది జంగిల్‌రాజ్యం కాకపోతే, మరేంటి? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబానికి అండగా నిలిచిన ప్రతిపక్షాలను ప్రశంసించిన మాయవతి తమ పార్టీ కూడా బాధిత కుటుంబం తరపున పోరాడు తుందన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ బలరాంపూర్, ఆజంగర్ వరుస దారుణాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా హత్రాస్ సంఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి బుధవారం తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందంలో మహిళా సభ్యులతో పాటు దళిత వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారు ఈ బృందం ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనుందని, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ .25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇల్లు ఇస్తామని రాష్ట్రం ప్రకటించింది. వీడియోలింక్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
‘రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి’
న్యూఢిల్లీ: ఆడియో టేపుల వ్యవహారం రాజస్తాన్ రాజకియాల్లో మరింత దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేశారు. (రాజస్తాన్ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు) ఇక దీనిపై మాయావతి స్పందిస్తూ.. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మొదట ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఆడియో టేపుల విషయంలో మరో చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజస్తాన్‌లో రాష్ట్రపతి పాలనను గవర్నర్ సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరతను గవర్నర్ పూర్తిస్థాయిలో తెలుసుకొని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. (‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్‌లో ఉన్నారు’) -
ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారు?
జైపూర్: మహారాష్ట్ర రాజకీయంలో రాత్రికి రాత్రికే చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మహా సీఎం పీఠం బీజేపీకి చేజారిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో శనివారం తెల్లవారేసరికి పరిస్థితి మొత్తం బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఈ మహా ట్విస్ట్ షాక్ నుంచే తేరుకునేలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేశారు. అటు ఎన్సీపీ కీలక నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ హఠాత్పరిణామాలపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ-ఎన్సీపీ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వైనాన్ని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఏ దిశకు తీసుకువెళుతున్నారంటూ ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. సరియైన సమయంలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెపుతారని ట్వీట్ చేశారు. సీఎం ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ అపరాధ భావనతో ఉన్నారని, తాము మంచి పాలనను అందించగలమనే విశ్వాసమే వారికి లేదని ఆరోపించారు. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా విజయవంతమై సుపరిపాలన ఇస్తారా అనే సందేహం తనకు ఉందని, అంతిమంగా మహారాష్ట్ర ప్రజలు నష్టపోనున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో ఈ నెల 12న అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ శనివారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫడ్నవిస్ ప్రభుత్వ బల నిరూపణకు నవంబర్ 30వ తేదీ గడువు విధించారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం महाराष्ट्र में जो हुआ वह छिपकर करने की क्या आवश्यकता थी, इस प्रकार अचानक राष्ट्रपति शासन का हटना और इस प्रकार शपथ दिलाना कौनसी नैतिकता है? ये लोग देश में लोकतंत्र को किस दिशा में ले जा रहे हैं? समय आने पर देशवासी इसका जवाब देंगे और बीजेपी को सबक सिखाएंगे। — Ashok Gehlot (@ashokgehlot51) November 23, 2019 -
రాష్ట్రపతి పాలన మాటున బేరసారాలు
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తున్న శివసేన చిరకాల మిత్రుడైన కమలదళంపై కస్సుమంటోంది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తోందని శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లు తమ పార్టీకి 119 (స్వతంత్ర అభ్యర్థులు 14 మందితో కలిపి) ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ పార్టీ సహకారం లేకుండా మరెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టింది. మేజిక్ ఫిగర్ అయిన 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించిందని గుర్తు చేసింది. క్రికెట్లోనూ, రాజకీయాల్లోనూ ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చునన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపైనా సామ్నా ఎడిటోరియల్ విరుచుకుపడింది. ఇవాళ, రేపు క్రికెట్ అంటే ఆట తక్కువ, వ్యాపారం ఎక్కువ అన్నట్టుగా తయారయ్యాయని వ్యాఖ్యానించింది. అంతేకాదు క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణమైపోయిందని, అప్పుడే విజయం వరిస్తోందని పేర్కొంది. బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వలవేసి రాజకీయ క్రీడలో గెలవాలని చూస్తోందని సామ్నా తన సంపాదకీయంలో ఆరోపించింది. మరోవైపు ఎన్సీపీ కూడా బీజేపీపై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. తమ పార్టీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఇతర పార్టీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఎమ్మెల్యేలను తమ గూటికి లాగాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌తో భేటీ వాయిదా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఇంకా ముందుకు కదలలేదు. వాస్తవానికి శనివారమే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి చర్చించి, ఆ తర్వాత గవర్నర్‌తో భేటీ కావాలని భావించారు. కానీ ఈ సమావేశాలన్నీ వాయిదా పడ్డాయి. ఆదివారం శరద్ పవార్, సోనియాతో కలిసే అవకాశాలున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై పవార్ సోనియాతో చర్చించాక మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఒక స్పష్టత రానుంది. ఎన్డీయే భేటీకి సేన దూరం ఈ నెల 18న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎన్డీయే సమావేశం కానుంది. ఈ సమావేశానికి తాము హాజరు కాబోమని శివసేన స్పష్టం చేసింది. ఎన్డీయేకి రాం రాం చెప్పడం ఇక లాంఛనప్రాయమేనని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విలేకరులకు చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న శివసేనకు చెందిన ఒకే ఒక మంత్రి అరవింద్ సావంత్ ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎప్పుడైతే 50:50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదో అప్పట్నుంచే తాము ఎన్డీయేకి దూరమయ్యామని రౌత్ స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్ష స్థానాల్లో సేన ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో శివసేన పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు ఇకపై మారిపోనున్నాయి. శివసేన ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షం వైపు అయిదో వరసలో ఇక కూర్చోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఎక్కడ తగ్గాలో తెలుసు..!
-
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
-
రంగంలోకి రాష్ట్రపతి ఎప్పుడొస్తారంటే...
న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రంలో పరిపాలన సాగనప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి, నేరుగా ఆ రాష్ట్రాన్ని కేంద్రమే పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలనా యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. కేంద్రం నియమించిన గవర్నర్ నేతృత్వంలో పాలన సాగుతుంది. పాలనా విషయాల్లో తనకు సాయపడేందుకు అధికారులను సైతం నియమించుకునే హక్కు గవర్నర్‌కి ఉంటుంది. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారి ఆర్టికల్ 356ని ప్రయోగించారు. రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మాత్రమే. ఏఏ సందర్భాల్లో అవకాశముందంటే... - ఒక రాష్ట్ర శాసన సభ ఆ రాష్ట్ర గవర్నర్ నిర్దేశించిన సమయంలో సీఎంను ఎన్నుకోలేనప్పుడు. - సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి ముఖ్యమంత్రికి మైనారిటీ సభ్యుల మద్దతు మాత్రమే మిగిలినప్పుడు, గవర్నర్ ఇచ్చిన. సమయంలో తిరిగి ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం చెందినప్పుడు. - సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినా రాష్ట్రపతి పాలనకు అవకాశం. - రాష్ట్రంలో యుద్ధపరిస్థితులు తలెత్తినప్పుడు, లేదా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నికలు వాయిదా వేయాల్సిన సందర్భాల్లో కూడా అవకాశం ఉంది. - రాజ్యాంగ బద్దంగా రాష్ట్రంలో పాలన సాగడం లేదని గవర్నర్ రిపోర్టు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. - 1994లో ఎస్ఆర్.»ొమ్మై వర్సెస్, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో... రాష్ట్రపతి పాలన విధించే విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. అప్పటిదాకా దేశంలో చాలా సార్లు రాష్ట్రపతిపాలన విధించారు. ఆర్టికల్ 356 దురి్వనియోగానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుకట్ట వేయగలిగాయి. 2000వ సంవత్సరం తరువాత దేశంలో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు బాగా తగ్గాయి. ఎంతకాలం ఉండొచ్చు పార్లమెంటులోని రెండు సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన ఆరునెలల పాటు కొనసాగించవచ్చు. ఆ తరువాత ఎన్నికల కమిషన్ తదుపరి ఎన్నికలను ఖరారు చేయొచ్చు. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా మూడళ్ల వరకు కొనసాగించవచ్చు. అయితే ఈ కాలంలో ఆరు నెలలకోసారి పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎత్తివేయొచ్చు పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించడంలో అన్ని అవకాశాలూ మూసుకుపోయినప్పుడు, రాష్ట్రప్రభుత్వ పాలన కొనసాగింపునకు అన్ని ప్రత్యామ్నాయాలూ అంతరించి పోయినప్పుడు, తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే చిట్టచివరి ప్రయత్నంగా రాష్ట్రపతి పాలన విధించాలని 1983లో సర్కారియా కమిషన్ స్పష్టం చేసింది. డాక్టర్ అంబేద్కర్ సైతం రాష్ట్రపతి పాలనను ‘‘డెడ్ లెటర్’’అని (అతి తక్కువగా ఉపయోగించాలని) అభివర్ణించారు. -
గవర్నర్ సిఫారసుపై భిన్నస్వరాలు
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ బీకే కోష్యారీ చేసిన సిఫారసుకు గల రాజ్యాంగ బద్ధతపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ సిఫారసు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయమని రాజ్యాంగ నిపుణుడు ఉల్లాస్ బాపట్ అన్నారు. ‘ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలంటూ బీజేపీకి రెండు రోజులు గడువిచి్చన గవర్నర్.. ఇతర పార్టీలకు 24 గంటలు మాత్రమే సమయమివ్వడం, కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడం పక్షపాత ధోరణిగా కనిపిస్తోంది’అని అన్నారు. అత్యవసరం అయినప్పుడు ఒక ఔషధంగా మాత్రమే రాష్ట్రపతి పాలన అ్రస్తాన్ని వాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ లాయర్ శ్రీహరి ఆనె∙మాట్లాడుతూ.. ఏ పార్టీ కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని గవర్నర్ సకారణంగా భావించినప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24 నాటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు అన్ని పక్షాలకు తగిన సమయం ఉంది. గవర్నర్ పిలిచే దాకా వారు ఆ ప్రయత్నాలు చేయలేదనడం అర్థరహితం. ప్రభుత్వం ఏర్పాటుపై సంసిద్ధత తెలిపేందుకు ప్రతి పార్టీకి ఇచ్చే గడువు పై నిర్దిష్టత అంటూ ఏమీ లేదు’ అని తెలిపారు. ముచ్చటగా మూడోసారి... మహారాష్ట్రలో ఇప్పటిదాకా రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1980, ఫిబ్రవరి 17న మొదటిసారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 1980లో శరద్‌పవార్‌కి మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 17, 1980 నుంచి, 1980 జూన్ 8 వరకు అంటే 112 రోజుల పాటు అది కొనసాగింది. 2014లో సైతం మరోమారు మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనను చవిచూడాల్సి వచ్చింది. సెపె్టంబర్ 28, 2014 నుంచి అక్టోబర్ 31, 2014 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు మొత్తం 33 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. -
'మహా'రాష్ట్రపతి పాలన
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం మరిన్ని కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కేంద్రం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. మరోవైపు, శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, ఎన్సీపీల చర్చలు మంగళవారం కూడా కొనసాగాయి. కాంగ్రెస్ తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులతో ముంబైలో చర్చలు జరిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందుగా.. మూడు పార్టీల మధ్య కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్–సీఎంపీ)పై అవగాహన కుదరాలని, పొత్తుపై విధివిధానాలను నిర్ణయించుకోవాలని, అందుకు మరింత సమయం అవసరమని ఎన్సీపీ– కాంగ్రెస్ నిర్ణయించాయి. ముఖ్యంగా సైద్ధాంతిక విబేధాలున్న శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్పష్టమైన ప్రణాళిక అవసరమని ఆ రెండు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాగా, సాయంత్రం సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు సాధించేందుకు గవర్నర్ తమకు 24 గంటల సమయం మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రపతి పాలన విధించడంపై స్పందిస్తూ.. మేం మూడురోజుల సమయం అడిగితే, ఆరునెలల సమయమిచ్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యేందుకు తమకు గడువును పొడిగించకుండా రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేయడాన్ని సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆ పార్టీ నేత నారాయణ రాణె వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఆర్టికల్ 356 ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచిపోయినా, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు నెలకొనలేదని, ప్రభుత్వ ఏర్పాటుకు తాను చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ మంగళవారం కేంద్రానికి నివేదిక అందించారు. బీజేపీ, శివసేనలు ప్రభుత్వ ఏర్పాటులో విఫలమవడంతో మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ఆహా్వనించామని, అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యేందుకు ఎన్సీపీ 3 రోజుల గడువు కోరిందని కేంద్రానికిచ్చిన నివేదికలో గవర్నర్ వివరించారు. ‘రాష్ట్రపతి పాలన సాధారణంగా ఆరునెలల పాటు ఉంటుంది, కానీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటే.. ఆరు నెలల ముందే రాష్ట్రపతి పాలనను ఎత్తేసేందుకు అవకాశముంది’ అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ నిర్ణయాన్ని విపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చర్చలు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో మంగళవారం ఉదయం కూడా ముఖ్య నేతల చర్చలు కొనసాగాయి. ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో సోనియా మరోసారి ఫోన్లో సంభాశించారు. అనంతరం, ముంబై వెళ్లి పవార్‌తో చర్చలు జరపాల్సిందిగా సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్లను ఆదేశించారు. చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శివసేనకు మద్దతునిచ్చే విషయంలో మరింత స్పష్టత అవసరమని, చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు అహ్మద్‌పటేల్ తదితర నేతలు తెలిపారు. మాకూ స్పష్టత కావాలి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీలతో ఒక ప్రణాళిక రూపొందిస్తామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్, ఎన్సీపీల మాదిరిగానే శివసేనకు కూడా ప్రభుత్వ ప్రాథమ్యాలకు సంబంధించిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై స్పష్టత అవసరమన్నారు. సోమవారమే మద్దతు కోరుతూ ఎన్సీపీ, కాంగ్రెస్‌లను తొలిసారి సంప్రదించామని, బీజేపీ పాటించే హిందూత్వ.. నకిలీ హిందూత్వ అని ఉద్ధవ్ విమర్శించారు. హిందూత్వ అంటే కేవలం రామ మందిర నిర్మాణం కాదని, హిందూత్వ అంటే రాముని మార్గంలో సత్యసంధతతో వ్యవహరించడమని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు రోజుల గడువు కావాలని కోరినా గవర్నర్ ఇవ్వలేదని పేర్కొంటూ, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా మంగళవారమే విచారించాలని కోరినా.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అంగీకరించలేదు. ఇప్పటికిప్పుడు బెంచ్‌ను ఏర్పాటుచేయలేమని రిజిస్ట్రీ స్పష్టం చేసింది. దాంతో ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలు చేస్తూ కూడా ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నామని, అయితే దానిపై తుది నిర్ణయం బుధవారం తీసుకుంటామని సేన తరఫు న్యాయవాది ఫెర్నాండెజ్ తెలిపారు. -
‘మహా’ సంక్షోభం
ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయానికి రాష్ట్రపతి పాలన విధింపుతో తాత్కాలికంగా బ్రేకు పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికివ్వాల్సిన వ్యవధి విష యంలో రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ తమపట్ల వివక్ష ప్రదర్శించారని శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక వివిధ చానెళ్లు ఎగ్జిట్ పోల్స్ పేరిట ప్రసారం చేసిన అతిశయోక్తుల మాటెలా ఉన్నా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మెజారిటీనైతే ఎన్డీఏ సొంతం చేసుకుంది. 288మంది సభ్యులుండే అసెంబ్లీలో ఎన్డీఏ ప్రధాన పక్షమైన బీజేపీ 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించగా, భాగస్వామ్య పక్షమైన శివసేనకు 56 స్థానాలు దక్కాయి. అంటే...ఇంతక్రితంలాగే ఈ రెండు పార్టీలూ కలిసి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమే. కానీ ఫలితాలు వెలువడి పక్షం రోజులు దాటుతున్నా ఆ రెండు పార్టీలూ తమ విభేదాలను పరిష్కరించుకోలేక పోయాయి. పర్యవసానంగా ప్రభుత్వం ఏర్పాటు తమ వల్ల కాదని ఆదివారం బీజేపీ చేతులెత్తేసింది. నిజానికి మహారాష్ట్రతోపాటే ఎన్నికలు జరిగిన హరియాణాలో బీజేపీకి అవసరమైన మెజారిటీ రాకపోయినా విపక్షమైన జననాయక్ జనతాపార్టీ(జేజేపీ), మరికొందరు స్వతంత్రుల అండతో అక్కడ సునాయాసంగా బీజేపీ సర్కారు ఏర్పాటు చేయగలి గింది. కానీ అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగి,పెద్దగా అవినీతి ఆరోపణలు రాని మహారాష్ట్రలో మాత్రం అడుగు ముందుకేయలేక ఆపసోపాలు పడింది. పైగా శివసేనతో బీజేపీకి ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆ రెండు పార్టీలూ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కలిసి నడుస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై విభేదాలొచ్చి రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేసినా, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇద్దరూ రాజీకొచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని అందించారు. ఈసారి కలిసి పోటీ చేసి నెగ్గినా, ఫలితాలు వెలువడ్డాక ఇద్దరూ విడిపోయారు! ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని సీట్ల పంపకం సమయంలో తమకు బీజేపీ హామీ ఇచ్చిందని శివసేన చెబుతుండగా...అదంతా నిజం కాదని బీజేపీ కొట్టిపారేస్తోంది. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ అంశం ఎన్నికల ప్రచార పర్వంలో ఏనాడూ చర్చనీయాంశం కాలేదు. ఫలితాలు వెలువడ్డాకే శివసేన ఈ హామీ సంగతిని బయటి ప్రపంచానికి వెల్లడించింది. దేశంలో సంపన్నవంతమైన రాష్ట్రంగా పేరుబడిన మహారాష్ట్రలో తమ కూటమికి మెజారిటీ దక్కినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోవడం బీజేపీకి అప్రతిష్టే. అందుకే ఆ పార్టీ అధిష్టానం చివరి వరకూ శివసేనను బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. మంత్రివర్గంలో సగం స్థానాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయినా శివసేన ఎక్కడా తగ్గలేదు. బీజేపీతో పోలిస్తే దాదాపు సగం స్థానాలే వచ్చినా అది రాజీకి ససేమిరా అంది. పొత్తు పేరుతో తమను క్రమేపీ బీజేపీ తుడిచి పెట్టేస్తున్నదన్న శంక ఆ పార్టీలో బయల్దేరబట్టే ఈసారి పాలన పగ్గాలు తీసుకోవాలన్న పట్టుదలతో శివసేన ఉన్నదంటున్నారు. సిద్ధాంత సారూప్యం ఉన్న ఈ రెండు పార్టీలే కలిసి మనుగడ సాగించలేనప్పుడు...ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన చెలిమి ఎన్నాళ్లుంటుందన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇటీవలికాలంలో సిద్ధాంతాలకు కాంగ్రెస్ పెద్దగా విలువిస్తున్న దాఖలాలు లేవు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం వేసిన ఎత్తుగడల పర్యవసానంగా పార్టీకి జరిగిన నష్టమేమిటో ఆ పార్టీకి గుర్తుంది. అందుకే శివసేనకు మద్దతివ్వాలా వద్దా, ఏ ప్రాతిపదికన దానికి మద్దతివ్వాలి, ఎలాంటి షరతులు విధించాలి, ప్రభుత్వంలో చేరాలా వద్దా అనే అంశాల్లో అది ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడింది. పార్టీలో మెజారిటీ ఎమ్మె ల్యేలు కోరుకుంటున్నట్టు శివసేనకు మద్దతిస్తే మహారాష్ట్రలో ముస్లిం ఓటర్లను శాశ్వతంగా దూరం చేసుకోకతప్పదన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. అలాగే కేరళలో సైతం దాని ప్రభావం బలంగా పడుతుందన్న భయం ఉంది. త్వరలో రాబోయే జార్ఖండ్ ఎన్నికల్లో కూడా ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. కనుకనే గవర్నర్ శివసేనకిచ్చిన గడువు ముగుస్తున్నా నిర్ణయం తీసుకోలేక కాంగ్రెస్ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. కాంగ్రెస్ మద్దతు కూడగట్టడం విషయంలో శివసేనకు ఎన్సీపీ ఏం హామీ ఇచ్చిందోగానీ ఆ పార్టీ కూడా ఇరకాటంలో పడింది. ఇంతకూ శివసేన–ఎన్సీపీల మధ్య కుదిరిన అవగాహనేమిటో తెలియదు. ఈ పరిణామాలన్నీ సహజంగానే బీజేపీకి లాభిస్తాయి. సిద్ధాంత సారూప్యం ఉన్న తమను కాదని శివసేన అవకాశవా దాన్ని ఆశ్రయించిందని చెప్పడానికి దానికి అవకాశం ఏర్పడింది. గవర్నర్ కోష్యారీ ప్రభుత్వం ఏర్పాటు కోసం వివిధ పార్టీలకిచ్చిన గడువు గురించి విమర్శలొ స్తున్నాయి. బీజేపీకి 48 గంటల గడువిచ్చి, తమకు మాత్రం అందులో సగం వ్యవధే ఇచ్చారని శివసేన గుర్రుగా ఉంది. ఎన్సీపీకి ఇచ్చిన వ్యవధి ఇంకా తక్కువ. ఆ పార్టీని 17 గంటల్లో నిర్ణయం చెప్పాలని గవర్నర్ కోరారు. సంక్షోభాలొచ్చినప్పుడు కేంద్రంలోని పాలకపక్షం అభీష్టానికి అనుగు ణంగానే గవర్నర్లు వ్యవహరిస్తారన్నది కొత్తేమీ కాదు. కానీ రాజకీయంగా ఆరితేరిన ఎన్సీపీ, కాం గ్రెస్‌లు బీజేపీ–శివసేనల మధ్య విభేదాలొచ్చే అవకాశం ఉన్నదని, అదే జరిగితే శివసేన తమను ఆశ్రయించక తప్పదని అంచనా వేయలేకపోవడం, తమ వ్యూహానికి పదును పెట్టుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫలితాలొచ్చి పక్షం రోజులు దాటినా ఆ రెండు పార్టీలూ వివిధ సంభావ్యతల గురించి చర్చించుకోలేకపోవడం వాటి వైఫల్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించినంత మాత్రాన దారులన్నీ మూసుకుపోయినట్టు కాదు. కొత్త ఎత్తులకూ, వ్యూహాలకూ కావలసినంత సమయం ఉంటుంది. కనీసం ఇప్పుడైనా పార్టీలన్నీ మిత్రుల్ని ఖరారు చేసుకుని సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించాలి. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
-
మహా ఉత్కంఠకు తెర : రాష్ట్రపతి పాలనకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర మంత్రిమండలి చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. మంత్రిమండలి తీర్మానాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. నవంబర్ 8న అసెంబ్లీ పదవీకాలం ముగిసినా తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొనడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. గవర్నర్ సిఫార్సును కేంద్ర మంత్రిమండలి ఆమోదించి రాష్ట్రపతికి నివేదించింది. మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ సమ్మతించలేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేసిన ప్రయత్నాలకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు గవర్నర్ విధించిన డెడ్‌లైన్‌లోగా సహకరించలేదు. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కోరారు. అయితే తమకు మరో 48 గంటల గడువు కావాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కోరడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాజ్యంగ బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటయ్యే పరిస్థితి లేదని గవర్నర్ స్పష్టం చేశారు. మొత్తంమీద రాష్ట్రపతి పాలనతో రెండు వారాలు పైగా సాగిన మహా డ్రామాకు తెరపడింది. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు మంత్రిమండలి ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సిఫార్సుకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు మంగళవారం మధ్యాహ్నం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్యా బలం లేనందున గవర్నర్ సిఫార్సును పరిగణనలోకి తీసుకుని మంత్రిమండలి రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను గవర్నర్ ఆహ్వానించినా బలనిరూపణకు డెడ్‌లైన్ పొడిగించాలన్న వినతిని గవర్నర్ తోసిపుచ్చారు. ఇక మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. ఈ దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి. -
శివసేనకు షాకిచ్చిన గవర్నర్..!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ అనూహ్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపినట్టు ప్రచారం జరగడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం నిన్న (సోమవారం) శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్.. నేడు (మంగళవారం) ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి రాత్రి 8.30 గంటలవరకు గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు ముగియకముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపారని ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు తాము అడిగిన గడువు ఇవ్వకపోగా.. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు వీలులేకుండా రాష్ట్రపతి పాలన దిశగా గవర్నర్ సాగుతున్నట్టు వస్తున్న వార్తలతో శివసేన, ఎన్సీపీ కంగుతిన్నాయి. ఒకవేళ గవర్నర్ రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆయన నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అహ్మద్ పటేల్‌తో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మూడు రోజుల గడువు ఇచ్చిన గవర్నర్.. తమకు అంత గడువు ఇవ్వడానికి నిరాకరించడంపైనా శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు గవర్నర్ తీరుపై ఎన్సీపీ కూడా గుర్రుగా ఉంది. తమకు ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలన అంటూ లీకులు ఇస్తున్నారని మండిపడింది. ఇక, శివసేనకు మద్దతిచ్చే విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్ ముంబై చేరుకున్నారు. సేనకు మద్దతుపై కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయని ఖర్గే తెలిపారు. -
మహా మలుపు : రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది.గవర్నర్ నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు మంగళవారం రాత్రి 8.30 గంటలతో ముగియనుండగా ఈలోగానే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం పట్ల విపక్షాలు భగ్గుమన్నాయి. కాగా, బలనిరూపణ గడువును మరో 48 గంటలు పొడిగించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గవర్నర్ కోరిన అనంతరం రాజ్‌భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేశారు. ఇక కేంద్ర హోంశాఖకు గవర్నర్ లేఖ చేరడంతో కేంద్ర క్యాబినెట్ గవర్నర్ సిఫార్సును ఆమోదించింది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఇచ్చిన గడువు పొడిగించేందుకు నిరాకరించిన గవర్నర్ ఎన్సీపీని మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు సంప్రదింపులు జరుపుతుండగానే గవర్నర్ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
‘శివ’సైనికుడే సీఎం
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా.. మెజారిటీ సాధించిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య అధికారం పంపిణీపై అవగాహన కుదరకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడనట్టయితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత, ఆర్థికమంత్రి ముంగంతివార్ పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని ముంగంటివార్ తెలిపారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వలేదని, బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా కూటమి ఫెవికాల్ కన్నా, అంబుజా సిమెంట్ కన్నా దృఢమైనది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టుకోగలదు’అన్నారు. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతివృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాముప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అదే పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం.. ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని వక్కాణించారు. గురువారం రాత్రి శరద్‌పవార్ నివాసంలో ఎన్సీపీ నేతల భేటీ అనంతరం అజిత్ పవార్ పై వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ, శివసేన డ్రామా బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను ‘అధికారంలో ఎక్కువ వాటా కోసం ఆడుతున్న తాత్కాలిక డ్రామా’అని ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ నీడ నుంచి శివసేన ఎన్నటికీ బయటకు రాదు’అని కాంగ్రెస్‌లో చేరకముందు శివసేనలో కీలక నేతగా వ్యవహరించిన సంజయ్ వ్యాఖ్యానించారు. పొత్తు తేలే దాకా నేనే సీఎం! ఔరంగాబాద్: రాజకీయ అనిశ్చితి కొనసా గుతున్న మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరేవరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణూ గడాలే గురువారం కలెక్టర్‌ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం అందించారు. లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనకు దిగుతా నంటూ ఆ రైతు హెచ్చరించడం కొసమెరుపు! -
వీడని ఉత్కంఠ.. ఇక రాష్ట్రపతి పాలనే!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం కోసం ఏర్పడిన ప్రతిష్టంభనకు అసలైన పరిష్కారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ మృదుగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 7లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలూ ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుందని, ఆ లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. బీజేపీ -శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రజలు ఏ పార్టీకీ తగిన మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే శివసేన-బీజేపీ కలిసి పనిచేయడమే మేలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటులో శివసేన నేతలు కఠినంగా వ్యవహరిస్తున్నారని, మరో రెండు రోజుల్లో సేన నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సుధీర్ వెల్లడించారు. కాగా ఐదేళ్లపాటు తానే మహారాష్ట్ర సీఎంగా ఉంటానని బీజేపీ శాసనసభా పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేయగా.. బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా తమకు ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బదులిచ్చారు. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం అక్కడి పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. దీంతోపాటు అవసరమైతే శ్రీనగర్‌కు వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. కశ్మీర్ హైకోర్టును ఆశ్రయించడంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు స్పందించారు. కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్, రవాణా సేవలను నిలిపివేయడంతో జర్నలిస్టులకు విధి నిర్వహణతోపాటు హైకోర్టును ఆశ్రయించడం ప్రజలకు కష్టంగా మారిందంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈరోజే మాట్లాడతా. అవసరమైతే శ్రీనగర్ వెళ్లి, పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తా’ అని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. ఆరోపణలు తప్పని తేలితే తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పిటిషనర్లను హెచ్చరించారు. ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, జమ్మూకశ్మీర్ పరిపాలన యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఈ ప్రక్రియ ప్రాధాన్యతా క్రమంలో, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ఆదేశించింది. వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకే అవగాహన ఉంటుంది కాబట్టి..మోబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. హైకోర్టుతోపాటు అన్ని కోర్టులు, లోక్ అదాలత్‌లు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని కశ్మీర్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తెలిపారు. 370 రద్దుపై విచారణకు ఓకే ఆర్టికల్–370 రద్దు, కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాల్ చేస్తూ పీపుల్స్ కాన్ఫరెన్స్ పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పార్లమెంట్ నిర్ణయం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్‌ను పంపింది. ఆర్టికల్–370 రద్దుకు వ్యతిరేకంగా ఇంకా పిటిషన్లను స్వీకరించబోమని, ఈ విషయంలో ఇంప్లీడ్మెంట్ అప్లికేషన్ మాత్రం వేసుకోవచ్చని బెంచ్ తెలిపింది. ‘పార్లమెంట్ నిర్ణయంలో చట్టబద్ధతపై అక్టోబర్‌లో విచారిస్తాం’ అని కోర్టు తెలిపింది. ఆజాద్‌కు అనుమతి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కశ్మీర్ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఆయన అక్కడ రాజకీయ సమావేశాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా, అనంత్‌నాగ్ జిల్లాలకు వెళ్లి ప్రజలను కలసుకోవచ్చని పేర్కొంది. తన కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆజాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే, అస్వస్థతకు గురై ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కశ్మీర్ సీపీఎం నేత యూసఫ్ తారిగమి సొంత రాష్ట్రం వెళ్లేందుకు కోర్టు ఓకే చెప్పింది. ఫరూక్ అబ్దుల్లాకు సొంతిల్లే జైలు కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా(81) సోమవారం ప్రజాభద్రత చట్టం(పీఎస్ఏ)లోని ‘పబ్లిక్ ఆర్డర్’ నిబంధన కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి విచారణ లేకుండా ఆరు నెలలపాటు జైల్లో ఉంచేందుకు అవకాశం కల్పించే, కశ్మీర్‌కు మాత్రమే వర్తించే చట్టం ఇది. శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులోని ఫరూక్ నివాసాన్నే తాత్కాలిక జైలుగా అధికారులు ప్రకటించారు. ఆర్టికల్ 370ను కేంద్రప్రభుత్వం రద్దుచేసిన నాటి నుంచీ అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్‌వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్‌తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్‌లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
కశ్మీర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పాడిగించేం దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పొడిగింపు ప్రతిపాదనకు ఇటీవలే లోక్‌సభ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది చివర్లో కశ్మీర్లో ఎన్నికలు జరపాలని భావిస్తున్నందున రాష్ట్రపతి పాలనను పొడిగించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఆయన బదులిస్తూ.. గతంలో ఎన్నడూ రంజాన్ మాసం (మే 7–జూన్4)లో రాష్ట్రంలో ఎన్నికలు జరపలేదన్నారు. అదేవిధంగా, జూన్ 30 నుంచి ఆగస్టు 15 వరకు అమర్నాథ్ యాత్ర సాగుతోం దని తెలిపారు. రాష్ట్రంలో 2018 డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా.. కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2030 కల్లా దేశంలోని ప్రజలందరికీ సురక్షిత నీటిని అందించాలన్న లక్ష్యాన్ని 2024 సంవత్సరానికి కుదించినట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి లోబడే ఈ చర్య తీసుకున్నామ న్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాల్లో వృథా జలాన్ని శుద్ధిచేసి వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నీటి కొరతను నివారించే విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. -
కశ్మీర్‌లోని పరిస్థితిని అర్థం చేసుకోండి
-
కశ్మీర్‌లోని పరిస్థితిని అర్థం చేసుకోండి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2019ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుతోపాటు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగించే తీర్మానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకొని బిల్లుకు, తీర్మానానికి రాజ్యసభ మద్దతు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడగింపునకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలుపగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. రంజాన్ పండుగ, అమర్నాథ్ యాత్ర వంటి సాకులతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ విప్లవ్ ఠాకూర్ కేంద్రం తీరును తప్పుబట్టారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన జూలై 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పొడగించే తీర్మానాన్ని ఇప్పటికే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. త్వరలో అమర్నాథ్ యాత్ర ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే తెలిపారు. -
జమ్మూకశ్మీర్‌లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన
-
ఏడాది చివర్లో జమ్ము కశ్మీర్ ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది చివర్లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని అన్నారు. జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్ షా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుస్తుందని చెప్పారు. కాగా జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ అంతకుముందు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. -
ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. రాష్ట్రంలో 2018 జూన్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్‌సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్ఈజెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
బెంగాల్లో రాష్ట్రపతి పాలన తప్పదా!
సాక్షి, న్యూఢిల్లీ : చినికి చినికి గాలి వానలా మారినట్లు పశ్చిమ బెంగాల్లో పార్టీ జెండాలు, బ్యానర్ల విషయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ప్రారంభమైన తగువు తుపాకులు పట్టుకొని పరస్పరం కాల్చుకునే పరిస్థితికి దారితీసింది. ఇరువర్గాల మధ్య గత పక్షం రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 13 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలుకాగా, ఐదుగురు తణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి 24 పరగణాల జిల్లా ఉత్తరాదిలోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి ఇంతటితో తెరదించకపోతే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జాతి విద్వేషాలు రగులుకునే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలో 2017, 2010లో హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చిన వలసదారులు స్థానిక బెంగాలీలను స్థానభ్రంశం చేశారని తణమూల్ మంత్రి ఒకరు ఆరోపించడం అంటే జాతి విద్వేషాలకు అవకాశం ఇవ్వడమే. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని కమ్యూనిష్టులు సవాల్ చేసినప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో, 2000 సంవత్సరంలో కమ్యూనిస్టులను, మమతా బెనర్జీ సవాల్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు మమతా పార్టీని బీజేపీ సవాల్ చేస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఏర్పడిందని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా అల్లర్లను అరికట్టాల్సిన బాధ్యత తణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. మమత అధికార యంత్రాంగం కూడా పార్టీ లాగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి తీవ్రమైంది. ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను అరికట్టడం చేతకాక బెంగాల్ పోలీసులు చేతులు కట్టుకు కూర్చున్నారని అనడంకన్నా వాటిని ఆపడం ఇష్టంలేక మిన్నకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లను గెలుచుకున్న ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కూడా అల్లర్లను అరికట్టేందుకు బాధ్యత తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి తీవ్రమవడం, కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించడం తప్పదు. -
బెంగాల్లో రాష్ట్రపతి పాలన??
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి.. హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలకు మీరే కారణమంటూ టీఎంసీ, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ రాష్ట్ర గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి తెలియజేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కేంద్రానికి నివేదిక అందజేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడిన త్రిపాఠి.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం రావొచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో డజను మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఈ క్రమంలో బెంగాల్లో పరిస్థితులు ఇంకా దిగజారితే.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముంటుందని ఆయన అన్నారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముందన్న బీజేపీ నేత కైలాశ్ విజయ్వార్గియా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఆ అవసరం రావొచ్చు. అలాంటి డిమాండ్ వస్తే కేంద్రం దానిని పరిశీలిస్తుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి ప్రధానితోగానీ, హోంమంత్రితోగానీ నేను చర్చించలేదు’ అని పేర్కొన్నారు. బెంగాల్లో హింసకు మీరే కారణమంటూ బీజేపీ, టీఎంసీ పరస్పరం వేలెత్తి చూపించుకోవడంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పాటుపడాలని సూచించారు. -
రాష్ట్రపతి పాలనలోకి జమ్మూకశ్మీర్
న్యూఢిల్లీ: రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి నుంచి కశ్మీర్‌ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్ అధికార ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివేదించిన నేపథ్యంలో సోమవారం మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతిపాలనకు పచ్చజెండా ఊపింది. జూన్‌లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని అధికార పీడీపీ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాజకీయసంక్షోభం మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతు తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని ఆ తర్వాత గవర్నర్‌ను పీడీపీ కోరింది. అదే సమయంలో బీజేపీ, మరికొందరు ఇతర సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ సైతం గవర్నర్‌ను కలిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం రెండు కూటములకు లేవని భావిస్తూ గవర్నర్ అసెంబ్లీని రద్దుచేశారు. -
జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది. ఆరు నెలల గవర్నర్ పాలన ముగియడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇప్పటికే ఒక నివేదికను కేంద్రానికి పంపడం, కేంద్ర కేబినెట్తోపాటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది. ఈ ఏడాది జూన్ నెలలో సంకీర్ణ కూటమి నుంచి బీజేపీ వైదొలుగడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వం పడిపోతే ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధిస్తారు. గవర్నర్ ఈ ఆరు నెలల్లో వీలైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేదా అసెంబ్లీ రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆరు నెలలపాటు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఈ కాలంలోనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు జరుగకపోతే మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. -
రాష్ట్రపతి పాలనకు ఆదేశించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో శాసనసభ ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. తాము 18 ఏళ్లు నిండినప్పటికీ 2018 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకోవడం వల్ల ఓటు హక్కు కోల్పోతున్నామని పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్.అభిలాష్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణం ఉండాలంటే రాష్ట్రపతి పాలనే శరణ్యమని పిటిషన్లో తెలిపారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ను చేర్చారు. న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీకి అనుకూలమని.. తెలంగాణ శాసనసభ ఎన్నికలు సాధారణ షెడ్యూలు ప్రకారం జరిగితే 20 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు పొంది వినియోగించుకునేవారని, కానీ కేంద్ర ఎన్నికల సంఘం అర్ధంతరంగా ఓటర్ల నమోదు షెడ్యూలును కుదించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ‘శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా ముందస్తుగా సభ రద్దు చేస్తూ మంత్రిమండలి సిఫారసు చేయగలదా? ఏ అత్యవసర పరిస్థితి లేకున్నా సభ అభిప్రాయాన్ని తెలుసుకోకుం డానే ఇలా రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అధికార పార్టీకి సానుకూల సమయమని చెప్పి ఓటర్ల నమోదుకు 2018 జనవరి 1ని అర్హత తేదీగా ప్రకటించడం స్వేచ్ఛ గా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమవుతుం దా?ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి పాలనకు ఎందుకు సిఫారసు చేయదు?’ వంటి ప్రశ్నలను పిటిషన్లో లేవనెత్తారు. ‘రద్దు’పై న్యాయ సమీక్ష జరపాలి తెలంగాణ ఎన్నికలు 4 రాష్ట్రాలతో పాటే వస్తాయని, తాను ఎన్నికల సంఘంతో మాట్లాడానని సీఎం ప్రకటన చేశారని పిటిషనర్లు ఆక్షేపించారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను ఏపీలో విలీనం చేయగా సం బంధిత ఓటరు జాబితాను ఇప్పటికీ సవరించలేదని వివరించారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబి తాలో చేర్చేలా ఆదేశాలివ్వాలని, కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేని రీతిలో అసాధారణంగా అసెంబ్లీని రద్దు చేయడంపై న్యాయ సమీక్ష జరపాలని.. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిం చేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి’
-
‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యయాని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. పౌరుల హక్కులు, ప్రతిపక్ష పార్టీల హక్కులు కాలరాయబడుతున్నాయి. బీజేపీ నేతలు అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఏలూరులో సీఎం పర్యటన పేరిట బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేయడం దారుణం. ఏపీలో ఇంత దుర్మార్గంగా దాడులు జరగడం ఇదే తొలిసారి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేదు కాబట్టే గవర్నర్‌ను జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదు. టీడీపీ అధికారం ఇంకో ఆరు నెలలు మాత్రమేన’ని తెలిపారు. బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ.. టీడీపీ నిరాశ నిస్పృహలతోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుందన్నారు. సీఎం దివాళా కోరు తనం వదిలి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి, నటి కవిత, అడ్వకేట్ హంస, త్రిపురనేని చిట్టిబాబు గవర్నర్‌ను కలసినవారిలో ఉన్నారు. -
సిగ్గులేని ప్రభుత్వం.. రాష్ట్రపతి పాలన పెట్టండి
కోల్‌కతా: పంచాయితీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక ఘటనలపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్రమంత్రి, అస్నాసోల్ ఎంపీ బాబుల్ సుప్రియో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అధికార తృణమూల్ రాజ్యాంగ సూత్రాలను పాటించట్లేదు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది’ అని టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘ఉదయం నుంచి జరిగిన పరిణామాలు నాకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే టీఎంసీ ఓ రౌడీల పార్టీ. మమతా బెనర్జీ ప్రభుత్వం సుపారీలు ఇచ్చి ఎన్నికల్లో హింసను ప్రేరేపించింది. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. నైతికత అంతకన్నా లేదు. తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. అప్పుడే బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారు’ అని బాబుల్ ఓ మీడియా ఛానెల్‌తో పేర్కొన్నారు. కాగా, తృణమూల్ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి రవీంద్రనాద్ ఘోష్, పోలింగ్ బూత్ వద్దనున్న బీజేపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా బాబుల్ ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ అధికార బలంతో ఓటర్లను మభ్యపెడుతోందని, తృణమూల్ కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడ్లతో బీజేపీ కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.మరోవైపు ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఆయన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన చెలరేగిన ఘర్షణలో ఐదుగురు ఓటర్లు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి
ఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. మహబూబా ముఫ్తీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. సర్కార్ వైఫల్యం వల్లే అనంత్‌నాగ్ లో యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందన్నారు. జమ్మూ ప్రజలకు భద్రత కరువైందని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. మరోవైపు ముఖ్యమంత్రి ముఫ్తీ తాజా పరిణామాలతో పాటు, శాంతి భద్రతలపై మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ఆమె ఉగ్రవాదిలో గాయపడ్డవారిని పరామర్శించారు. ఉగ్రదాడితో కాశ్మీరీలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అని ఆమె అన్నారు. -
‘ఢిల్లీలో రాష్ట్రపతిపాలన’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే తనకు లోక్‌సభ టికెట్ ఇస్తానని బీజేపీ బేరం పెట్టిందని ఆమె వెల్లడించారు. బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మితో సమానంగా పార్టీలో హోదా కల్పిస్తామని ఆశ పెట్టినట్టు తెలిపారు. ‘ఆప్ పనైపోయిందని మా పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఎంపీ టికెట్ లేదా ప్రభుత్వంలో కీలకమైన పదవి ఇస్తామని నాకు ఆశచూపారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నాయకులు నాతో చెప్పార’ని అల్కా లంబా తెలిపారు. బీజేపీ నాయకులు తనతో మాట్లాడిన వివరాలను ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు తెలిపినట్టు చెప్పారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. ఎంసీడీ ఎన్నికల్లో కమలం వికసించింది. ఈవీఎంల మోసం వల్లే బీజేపీ గెలిచిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
'తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి'
-
'తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి'
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌కు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజనాథ్కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో విధులు నిర్వహించలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని... అవి ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైన సీఎం జయలలిత గత 15 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత అనారోగ్యంపై అపోలో ఆసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం విదితమే. మరికొంత కాలం పాటు జయ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజనాథ్కు రాసిన లేఖలో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. సీఎం జయ అనారోగ్యంపై పుకార్లు షికార్లు చేశాయి. దాంతో జయ ఆరోగ్యంపై వెంటనే ప్రకటన చేయాలని గవర్నర్‌ను ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేసింది. దాంతో జయను రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పరామర్శించారు. అనంతరం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తమిళనాడు రాజ్‌భవన్ లేఖను విడుదల చేసింది. ఆ తర్వాత జయ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వెంటనే ప్రకటన చేయాలని పలువురు మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో గురువారం అపోలో ఆసుపత్రి ఆమె హెల్ బులెటిన్ విడుదల చేసింది. -
ఈ దేశాన్ని సుప్రీంకోర్టు రక్షించింది
-
అరుణాచల్ సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు
-
ఈ దేశాన్ని సుప్రీంకోర్టు రక్షించింది: నబం తుకీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని సర్వోన్నత న్యాయస్థానం రక్షించిందని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తుకీ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. నబం తుకీ బుధవారమిక్కడ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తమకు న్యాయం చేసిందని, ఈ దేశాన్ని ఉన్నత న్యాయస్థానం రక్షించిందని అన్నారు. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వాల తొలగింపు విషయంలో బీజేపీకి ఇది రెండో ఎదురుదెబ్బ. ఇంతకుముందు ఉత్తరాఖండ్ వ్యవహారంలోనూ కమలదళం ఇలాగే దెబ్బతింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, వారి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. అయితే సుప్రీం కోర్టు దగ్గర కేంద్రం పప్పులుడకలేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలోనే బీజేపీకి చుక్కెదురు అయింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌ను రీకాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
అరుణాచల్ సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలన్నింటినీ న్యాయస్థానం రద్దు చేసింది. అసెంబ్లీ సమావేశాల తేదీని ముందుకు జరుపుతూ.... గవర్నర్ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. డిసెంబర్ 15, 2015 నాటి యథాతథ పరిస్థితి ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో నబమ్ టుకీ మళ్లీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు మార్గం సుగమమైంది. కాగా 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు. నాటకీయ పరిణామాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ‘సుప్రీం’ను ఆశ్రయించగా.. గవర్నర్ విచక్షణాధికారాల పరిధిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించారు. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఇది ప్రజాస్వామ విజయమని ఆ పార్టీ అభివర్ణించింది. -
విశ్వాస పరీక్షకు కేంద్రం సిద్ధం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో బలనిరూపణ పరీక్షను పర్యవేక్షించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిటైర్డ్ సీఈసీని పరిశీలకుడిగా నియమించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ నిర్ణయం జరిగింది. -
‘సుప్రీం సూచన’ను పరిశీలిస్తున్నాం
ఉత్తరాఖండ్ బలపరీక్షపై 6న చెబుతాం: కేంద్రం న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీం చేసిన ఈ సూచనపై తుది నిర్ణయాన్ని శుక్రవారం నాటికి చెబుతామని తెలిపింది. దీనికి న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆమోదం తెలుపుతూ కేంద్రానికి రెండు రోజులు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదావేసింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. సుప్రీం పర్యవేక్షణలో విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని పదవీచ్యుత సీఎం రావత్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తమ సూచనపై తదుపరి విచారణ నాటికి నివేదించకపోతే, ఈ అంశపైనా విచారణ చేపడతామన్నారు. బలపరీక్ష రావత్‌కు విశ్వాస పరీక్ష లాంటిది అని అది అవిశ్వాస పరీక్ష కాదని సిబల్, సింఘ్వీ వాదించారు. దీన్ని ఏజీ రోహత్గీ ఆక్షేపిస్తూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో రావత్ సీఎంగావిశ్వాస పరీక్షను ఎదుర్కొనలేరని చెప్పారు. ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకొని 2005, మార్చి 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ దాని ప్రకారం జార్ఖండ్ నమూనాలో సంయుక్త బలపరీక్ష ఉండొచ్చని చెప్పింది. అప్పుడు జార్ఖండ్‌లో శిబూ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్‌చేస్తూ బీజేపీ నేత అర్జున్ ముండా కోర్టును ఆశ్రయించగా కోర్టు సంయుక్త బలపరీక్షకు ఆదేశించింది. -
పార్లమెంట్ సమావేశాల కుదింపు?
సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూలు ప్రకారం మే 13 వరకు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలు 6నే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వల్ల డీఎంకే, ఏఐడీఎంకే, సీపీఎంలు సమావేశాలను కుదించాలని కేంద్రాన్ని కోరాయి. సమావేశాలు ముగిస్తే ఎంపీలు నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన సమావేశాల్లో రాజ్యసభలో ప్రధానమైన సభావ్యవహారా లేవీ సాగలేదు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ ఉంది. ఒకవేళ ఈ విచారణలో ఏమీ తేలకుండా వాయిదాపడితే పార్లమెంటు సమావేశాలు ముందస్తుగా ముగిసే వీలుంది. లోక్‌సభలో ఆర్థిక బిల్లు మంగళవారం ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇది సాధ్యం కానిపక్షంలో ఐదున ఆమోదం పొందనుంది. అదే రోజు గానీ, 6న గానీ రాజ్యసభ ఆమోదం పొందొచ్చు. దీంతో సమావేశాలు 6నే ముగుస్తాయని అధికార పార్టీ భావిస్తోంది. -
ఆ సీడీలో ఉన్నా.. మాజీ సీఎం అంగీకారం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఆదివారం ఓ స్టింగ్ ఆపరేషన్ విషయమై సంచలన అంగీకారం చేశారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్ సీడీలో తాను ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇప్పటివరకు ఈ స్టింగ్ ఆపరేషన్ ఓ బూటకమని కొట్టిపారేస్తూ వచ్చిన రావత్ తొలిసారి ఈ సీడీలో తాను ఉన్నానని అంగీకరించారు. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ జర్నలిస్టుతో అప్పటి సీఎం రావత్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఓ ప్రైవేటు న్యూస్ చానెల్ ఎడిటర్ ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ సీడీ కాపీలను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు మీడియాకు పంపారు. స్టింగ్ ఆపరేషన్‌కు పాల్పడిన జర్నలిస్టుతో తాను సమావేశమైన విషయం వాస్తవమేనని రావత్ తాజాగా స్పష్టం చేశారు. 'ఓ జర్నలిస్టుతో సమావేశం కావడం నేరమా? అప్పటికీ సాంకేతికంగా అనర్హత పడిన ఓ ఎమ్మెల్యేతో నేను మాట్లాడటం తప్పా? రాజకీయాల్లో మేం ఏదైనా చానెల్‌ను నిషేధించామా' అని రావత్ ఆదివారం డెహ్రాడూన్‌లో విలేకరులతో అన్నారు. రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం, అసెంబ్లీలో బలపరీక్షకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించడం, అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మూడు కాళ్ల కుందేళ్లు
జీవన కాలమ్ ఈ మధ్య పేపర్లో చదివాను. ఒకానొక గ్రామంలో ప్రజలెవరూ ఇంతవరకూ న్యాయస్థానం ఎలా ఉంటుందో ఎరగరట. ఈ దేశంలో కోట్ల వ్యాజ్యాలు కోర్టుల్లో మురుగుతున్న నేపథ్యంలో ఇది పెద్ద విడ్డూరం. ఇదేమిటి? వీళ్లకి సమస్యలు రావా? తగాదాలు ఉండవా? తేల్చుకోవలసిన అంశాలు ఉండవా? ఉంటాయి. కానీ ఉండవలసిన గొప్ప సంప్రదాయం వారి దగ్గర ఉంది. తమ పెద్దల మాటనీ, తీర్పునీ గౌరవించే సంస్కారం. ఇది చాలా గొప్ప పరిణతి. మనదేశంలో రాజకీయ నాయకులు, మంత్రులు పాలన జరపడం మానేసి చాలా కాలమయింది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే పాలన ఎలా జరగాలో ప్రతీ చిన్న విషయాన్నీ నిర్దేశిస్తోంది. కేంద్రం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనని విధించింది. న్యాయస్థానం అది సబబుకాదంది. ప్రభుత్వం ఫలానా పార్టీ సొంత కంపెనీ కాదంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రజల మనసుల్లో అలాంటి చర్య ఒక ‘నిస్పృహ’ని కలిగిస్తుందంది. 10 రాష్ట్రాలలో 33 కోట్ల మంది ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక అలమటిస్తూంటే లక్షల లీటర్ల నీటిని క్రికెట్ మైదానాల్ని తడపడానికి ఖర్చు చేసి కోట్ల ఆదాయాన్ని సంపాదించే క్రికెట్ ఆటకి పూనుకున్నారు. రెండు రోజులకొకసారి లభించే గుక్కెడు నీళ్లు 41 అడుగుల లోతు నూతిలోంచి తోడు కోడానికి వెళ్లిన 11 ఏళ్ల పిల్ల చచ్చిపోయింది. ‘‘నీళ్లు వృథా చెయ్యకండి బాబూ! మనుషులు చచ్చి పోతున్నారు’’ అని న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. ఆ మాత్రం కనీస బాధ్యతని ఈ దేశపు పెద్దలకి కోర్టులు తమ అధికారంతో నేర్పాలా? 9000 కోట్లు ఎగవేసి పరాయి దేశంలో సేద తీర్చుకుంటున్న ఓ పెద్ద మనిషిని ఈ దేశపు న్యాయస్థానం అరెస్టు చేసి తీసుకురావలసిన చర్యకు పూనుకోవ లసి వచ్చింది. ‘‘మీ గుడిలో దేవుడికి మొక్కు కోవడానికి మీ అమ్మకీ, మీ బిడ్డకీ, మీ భార్యకీ అవకాశం ఇవ్వండి బాబూ! ’’ అని సుప్రీంకోర్టు మగభక్తులకి చెప్పాల్సి వచ్చింది. మా ఇంట్లో తెలంగాణ పనిమనిషి పనిచేస్తోంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది కనుక- మా రాష్ట్రంలో తెలంగాణ పని మనిషి- పనిచేస్తున్నా జీతం ఇవ్వను అన్నాను. ‘‘కాదు బాబూ! ఆమె మీ పనిచేస్తోంది. మీ ఇంట్లో పని చేస్తోంది. మీరు ఇవ్వాల్సిందే’’ అని 1250 మంది ఆంధ్రా విద్యుచ్ఛక్తి సిబ్బందికి జీతాలివ్వమని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. నూడుల్స్ అమ్మకాన్ని, ఇసుక పంపకాన్ని, నీటి వనరుల కేటాయింపుల్ని, ఆస్తుల పంపకాల్ని - అన్నిటిని ఎల్లవేళలా సుప్రీంకోర్టే నిర్ణయిస్తోంది. ఒక నాయకుడు మూతి బిగించి - ‘‘నా మెడ మీద కత్తి పెట్టినా నేను ‘భారత్ మాతాకీ జై’ అనను’’ అన్నారు. సభలో ఆ వర్గం వారు చప్పట్లు కొట్టారు. ఈ దేశంలో ఎవరూ ఈయన్ని అనమనలేదు. కానీ ఆయనే అన్నారు. ఎందుకట? రాజ్యాంగం ఆ పని చెయ్యమని చెప్పలేదు కనుక. ‘‘మనం ఏం ఒప్పుకోవాలో వీళ్లు చెప్పనక్కరలేదు’’ అనే అరాచకం నేలబారు ప్రజలకి నచ్చుతుంది కనుక. ప్రజల్ని మెప్పించే ఇచ్చకం నేటి రాజకీయం. ఇలాంటి మెచ్చుకోలు కబుర్లకి ‘చట్టపరమైన’ ఔచిత్యం ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు కోర్టులు చెప్పాలి. తాము చేసే పనులు సబబు కాదని తెలిసినా-పైన చెప్పినవేవీ చట్టానికి నిలవవని వారికి తెలుస్తున్నా - సుప్రీంకోర్టు దాకా లాగి- న్యాయస్థానం తీర్పు వింటే కానీ అంగీకరించని స్థితికి నేటి నాయకత్వం వచ్చింది. ఇది ఎంత అనవసరమో, హాస్యాస్పదమో, అనర్ధమో- విచక్షణనీ, పెద్దరికాన్నీ తమ గ్రామ పెద్దల్లోనే నిలుపుకున్న ఓ చిన్నగ్రామం నిరూపించడం విశేషం. మన అదృష్టం బాగుండి ఈ దేశంలో న్యాయస్థానాలున్నాయి కనుక బతికిపోయాం గానీ లేకపోతే ఈ దేశంలో అన్ని కుందేళ్లకూ మూడే కాళ్లుండేవి. గొల్లపూడి మారుతీరావు -
రాష్ట్రపతి పాలన కొనసాగింపు
ఉత్తరాఖండ్‌లో రేపు బలపరీక్ష ఉండదన్న సుప్రీంకోర్టు ♦ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ♦ కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈనెల 29న అసెంబ్లీలో బలపరీక్ష లేదని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వుల వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా న్యాయయూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఏడు క్లిష్టమైన ప్రశ్నలు సంధించింది. వీటితోపాటు అవసరమనుకుంటే మరికొన్ని ప్రశ్నలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని అటార్నీ జనరల్ (ఏజీ)కు సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదావేసింది. వచ్చే నెల మధ్య నుంచి కోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున ఆలోపే తీర్పు రావచ్చు. విచారణలో తనను అనుమతించాలన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినతిపై బెంచ్ మండిపడింది. ఆయన చేసేదేం లేదంది. కేసు పరిష్కారానికి బలపరీక్ష నిర్వహించడమొక్కటే మార్గంగా కనిపిస్తోందని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందని రాష్ట్రపతి పాలన నిర్ణయంలో సహేతుకత లేకపోతే బలపరీక్ష జరపాల్సి వుంటుందని పేర్కొంది. దీనిపై సూచనలు ఇవ్వాలని అటార్నీ జనరల్ రోహత్గీని కోరింది. రాష్ట్రపతి పాలనను కోర్టు ఎత్తివేయకపోతే మే 27 వరకు అది అమల్లో ఉంటుందని, తర్వాత బలపరీక్ష నిర్వహణ ప్రభుత్వ విచక్షణపైన ఆధారపడి ఉంటుందని రోహత్గీ చెప్పారు. కేంద్రానికి ఏడు ప్రశ్నాస్త్రాలు సబలపరీక్ష ఆలస్యమైతే రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందా? సఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటుకు ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతిపాలనకూ సంబంధముందా? సకేంద్ర పాలననిర్ణయం కోసం అసెంబ్లీ వ్యవహారాలను రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారా?సఆర్టికల్ 175(2) ప్రకారం బలపరీక్ష నిర్వహిస్తున్నట్లు గవర్నర్ చెప్పారా?సగవర్నర్, స్పీకర్ ఇద్దరూ రాజ్యాంగ అధికారాలున్న వారైనందున డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ సూచించవచ్చా?సనిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందనప్పుడు ఆ విషయాన్ని స్పీకర్ చెప్పకపోతే ఎవరు చెప్తారు?రాష్ట్రపతి పాలన విధిస్తే ద్రవ్యవినిమయ బిల్లు పరిస్థితి ఏంటి? -
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష రద్దు అయింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం మే 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. కాగా రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు మొత్తం ఏడు రకాల ప్రశ్నలను సంధించింది. సభలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఆర్టికల్ 175 (2) గవర్నర్ చెప్పారా? ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడమే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడానికి కారణమా? అసెంబ్లీలో జరిగిన పరిణామాలే రాష్ట్రపతి పాలనకు దారి తీశాయా? ద్రవ్ వినిమయ బిల్లు సందర్భంగా జరిగిన పరిణామాలు రాష్ట్రపతి పాలనకు కారణాల్లో ఒకటా? విశ్వాస పరీక్ష ఆలస్యం కావడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీసిందా? ఉత్తరాఖండ్ సీఎస్‌కు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. -
రెండో రోజూ రభస
రాజ్యసభను కుదిపేసిన ‘ఉత్తరాఖండ్’ కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షాలు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలన్నీ రాజ్యసభలో మంగళవారం రెండో రోజూ నిరసన తెలియజేశాయి. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తూ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. సభ ప్రారంభం కాగానే ఐదుగురు కొత్త సభ్యులు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా, స్వపన్ దాస్‌గుప్తా, సుబ్రమణ్యస్వామి, మేరీకోమ్, నరేంద్ర జాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన మంత్రి మోదీతోపాటు పలువురు కొత్త సభ్యులను అభినందించారు. అనంతరం సభాకార్యక్రమాలు మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లో రావత్ ప్రభుత్వ బర్తరఫ్‌పై చర్చకు పట్టుబట్టారు. దీనికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైనా చర్చకు సర్కారు నిరాకరించటంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. చర్చే లేదు: విపక్షాల ఆందోళనపై జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ ఈ అంశంపై చర్చకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన ప్రకటనను సభ ముందు ప్రవేశపెట్టాకే చర్చ జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్‌లో ద్రవ్యవినిమయ బిల్లును 35 మంది వ్యతిరేకించినా స్పీకర్ బిల్లు నెగ్గిందని చెప్పినపుడే రాజ్యాంగం అపహాస్యం పాలైందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే స్పీకర్ ఇలా వ్యవహరించటం జరగలేదన్నారు. దీంతో విపక్ష సభ్యులు ‘మోదీ మీ నియంతృత్వాన్ని సహించం’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి పాలనను సమర్థిస్తూ.. స్పీకర్ వ్యవస్థపై జైట్లీ చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సభ చర్చకు అనుకూలంగానే ఉందని, విపక్షాలు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పలుమార్లు అభ్యర్థన చేశారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు చర్చకు నోటీసులివ్వగా.. బీఎస్పీ దీన్ని బలపరిచింది. ఆందోళన మధ్యే రెండు బిల్లులు సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రభుత్వం రెండు బిల్లులు(ద్రవ్య వినిమయ చట్టం-2015 సవరణ, రద్దు బిల్లు-2015) ప్రవేశపెట్టింది. దీంతో పాటు రాజ్యాంగ(ఎస్సీ) సవరణ బిల్లు-2016ను డిప్యూటీ చైర్మన్ చర్చకు అనుమతించాలని నక్వీ కోరారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విద్యార్థులపై జరిమానా క్రూరం జేఎన్‌యూ విద్యార్థిసంఘం నేత కన్హయ్యతోపాటు పలువురు విద్యార్థులపై జరిమానా విధించటం, కాలేజీనుంచి వెళ్లగొట్టడాన్ని రాజ్యసభలో విపక్షాలు లేవనెత్తాయి. ఇది క్రూరమైన చర్య అని వామపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. చర్చ జరపాలంటూ సీపీఎం నేత తపన్ సేన్ డిమాండ్ చేశారు. విపక్ష నేతలతో మోదీ కరచాలనం సభ ప్రారంభానికంటే ముందుగానే సభకు వచ్చిన ప్రధాని మోదీ విపక్ష నేతలతో కరచాలనం చేశారు. ఆంటోనీ, ఆనంద్ శర్మ(కాంగ్రెస్)లతోపాటు బీఎస్పీ చీఫ్ మాయావతినీ పలకరించారు. సీతారాం ఏచూరి(సీపీఎం) భుజంపై చేయివేసి కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. -
ఉత్తరాఖండ్ మలుపులు
రోజుకో మలుపు తీసుకుంటున్న ఉత్తరాఖండ్ పరిణామాలు ఇంకా పరిణతి చెందని మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులను పట్టిచూపుతున్నాయి. తన ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ రాష్ట్ర హైకోర్టులో గురువారం తీర్పు వెలువడటంతో శుక్రవారం ఉదయం మాజీ సీఎం హరీశ్ రావత్ సీఎంగా కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రానికల్లా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో ఆయన ‘మాజీ’గా మారిపోయారు! మొత్తానికి 18 గంటలపాటు ఆయన ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారనుకోవాలి. స్టే వచ్చాక బీజేపీ నేతలు ఏమైనా చెప్పుకోవచ్చుగానీ...జరిగిన పరిణా మాలు ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టనుగానీ, దేశ గౌరవాన్నిగానీ పెంచేవి కాదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి ఉంటే హరీశ్ రావత్ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ గురువారం హైకోర్టులో తీర్పు వెలువడేది కాదు. దానిపై సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని తమకనుకూలమైన పరిణామంగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఆ సందర్భంగా విధించిన షరతును మరిచిపోతున్నారు. తుది తీర్పు వెలువడే వరకూ ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పునరుద్ధరణకు ప్రయత్నించబోమన్న హామీని తీసుకున్నాకే సుప్రీంకోర్టు ఈ స్టే ఉత్తర్వులిచ్చింది. గురువారం హైకోర్టు కోరిన హామీ ఇదేనని వారు గుర్తుంచు కోవడం మంచిది. ఉత్తరాఖండ్ హైకోర్టులో గత నెల 18న మొదలైన వివాదం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో గమనిస్తే మనది మేడిపండు ప్రజాస్వామ్యమేమోనన్న అనుమానాలు తలెత్తుతాయి. అసెంబ్లీలో ద్రవ్య వినియోగ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ కుంజ్వాల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ అసమ్మతి వర్గం, బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం న్యాయస్థానాని కెక్కింది. 28లోగా బల నిరూపణ చేసుకోవాలని రావత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినా...అంతవరకూ ఓపిక పట్టలేని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఒకరోజు ముందు రావత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సీఎం ప్రయత్నిస్తున్నట్టు చూపే ‘స్టింగ్’ వీడియోను అందుకు కారణంగా చూపింది. ద్రవ్య వినియోగ బిల్లు విషయంలో స్పీకర్ వైఖరిని, 9మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎత్తిచూపింది. ఈ కారణాలు హేతుబద్ధమైనవే అనుకున్నా...ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అవసరమైన ప్రాతిపదికను అవి ఎలా ఏర్పరచగలవో అనూహ్యం. వీడియోలోని సంభాషణలు వాస్తవమైనవో, కాదో ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాలి. బలపరీక్ష సమ యంలో స్పీకర్ తీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఆయన సక్రమంగా వ్యవ హరించలేదనుకుంటే కోర్టులో సవాల్ చేయడానికి ఎటూ అవకాశం ఉండేది. ఈలోగానే 356వ అధికరణను ఉపయోగించడం తొందరపాటు చర్య అని, సర్వో న్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని కేంద్రంలోని పెద్దలకు అనిపించకపోవడం ఆశ్చర్యకరం. సభాపతులుగా ఎన్నికయ్యాక తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండవలసిన స్పీకర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో అవాస్తవేమీ లేదు. అది అన్నిచోట్లా బాహాటంగానే కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ, ద్రవ్య వినియోగ బిల్లు విషయంలోనూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఓటింగ్‌కు పట్టుబట్టినా మూజువాణి ఓటుతో కానిచ్చేసిన తీరు అందరికీ తెలుసు. చట్టాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్య తీసుకోవడానికి న్యాయస్థానాలున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఏడాది వ్యవధిలో ఎటూ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షను జరగనిచ్చి అక్కడ అన్యాయం జరిగిందనుకున్న పక్షంలో న్యాయస్థానం గడప తొక్కి ఉంటే పద్ధతిగా ఉండేది. విపక్షంలో ఉండి తామే అనేకసార్లు తీవ్రంగా వ్యతిరేకించిన, తప్పుబట్టిన 356 అధికరణాస్త్రాన్ని ఇలాంటి సమయంలో ప్రయోగించడం నైతి కంగా సరికాదని ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దలు భావించకపోవడం వింత. ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత రాష్ట్రపతి తీసు కున్న నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని స్పష్టమైంది. ఆ సంగతి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదనుకోవడానికి లేదు. ఉత్తరాఖండ్ హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా తుది తీర్పు వెలువడేలోగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి వేరేవారికి అవకాశం ఇవ్వబోమన్న హామీని ఇవ్వాలని కోరడాన్ని ప్రత్యేకించి ప్రస్తా వించుకోవాలి. న్యాయస్థానాలు ఏం చెప్పినా తమ రాజకీయపుటెత్తులకు అనుగు ణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఉత్తరాఖండ్‌లో పావులు కదిపి, అక్కడ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పర్చబోరన్న గ్యారెంటీ ఏమీ లేకపోబట్టే న్యాయస్థానాలు ఈ విషయంలో పట్టుబట్టాయి. హైకోర్టులోనే ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన హామీని ఇవ్వగలిగి ఉంటే రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చేది కాదు. ప్రజలిచ్చే తీర్పు ఎంత పవి త్రమైనదో, దాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ విషయంలో సుప్రీంకోర్టుది సైతం అదే అభిప్రాయం. జనం ఎన్ను కున్న ప్రభుత్వాలను ఏకపక్షంగా రద్దు చేయడం లేదా అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం సరికాదని న్యాయస్థానాలు మొదటినుంచీ చెబుతున్నాయి. అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఆ మాటను బేఖాతరు చేసింది. ఇప్పుడు అదే పని బీజేపీ చేస్తోంది. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తాయని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని, వ్యవస్థపట్ల ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచు తాయని అందరూ గుర్తించాలి. -
‘ఉత్తరాఖండ్’ తీర్పుపై సుప్రీం స్టే
రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత ♦ ఈ నెల 27 వరకూ స్టే విధించిన సుప్రీం కోర్టు ♦ 26 నాటికి హైకోర్టు తీర్పు ప్రతులు ఇరు పక్షాలకూ ఇవ్వాలని ఆదేశం ♦ తదుపరి విచారణ వరకూ రాష్ట్రపతి పాలనను తొలగించబోమంటూ కేంద్రం నుంచి హామీ తీసుకున్న వైనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో మరో నాటకీయ మలుపు! రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం ఇచ్చిన సంచలన తీర్పుపై సుప్రీం కోర్టు ఈ నెల 27 వరకూ స్టే విధించింది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది. స్టే ఉత్తర్వులు జారీ చేసే ముందుగా.. కేసు తదుపరి విచారణ తేదీ వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం తొలగించబోదంటూ అటార్నీ జనరల్ ముకుల్‌రోహత్గీ హామీని ధర్మాసనం నమోదు చేసుకుంది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటుచ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని జస్టిస్ దీపక్‌మిశ్రా, శివకీర్తిసింగ్‌ల బెంచ్ శుక్రవారం మధ్యాహ్నం కిక్కిరిసిన కోర్టులో విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేలు, ఉత్తరాఖండ్‌లో రద్దయిన ప్రభుత్వ సీఎం హరీశ్‌రావత్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, కపిల్ సిబల్‌లు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలపై ఇరు పక్షాల వారూ ఆవేశంగా వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కేంద్రం తరఫు న్యాయవాదులు కోరారు. ‘తీర్పు ఇంకా అందనందున.. ఒక పక్షం సీఎంగా బాధ్యతలు చేపట్టటానికి సానుకూలంగా ఉంటూ.. మరొక పక్షాన్ని ప్రతికూల పరిస్థితిల్లోకి ఎలా నెట్టేస్తారు?’ అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించటమంటే రాష్ట్రపతి పాలన ప్రకటనను అమలు చేయటమే అవుతుందని రావత్, స్పీకర్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరు పక్షాలు తమ తమ వాదనలపై బలంగా పట్టుబట్టటంతో బెంచ్ స్పందిస్తూ.. తమది రాజ్యాంగ కోర్టు అయినందున తాము సమతుల్య దృష్టితో చూడాల్సి ఉంటుందని పేర్కొంది. హైకోర్టు తన తీర్పుపై సంతకాలు చేసి, ప్రతివాదులు అప్పీలు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచి ఉండాల్సింద పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రతులు కేసులో ఇరు పక్షాలకూ వెంటనే అందనందున.. ఈ నెల 27న తదుపరి విచారణ వరకూ ఆ తీర్పును నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 26 కల్లా తీర్పు ప్రతులను ఇరు పక్షాలకు అందించటంతో పాటు సుప్రీంకోర్టుకూ అందుబాటులో ఉంచాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు తీర్పు ప్రతినిఅధికారికంగా అందుకుని పరిశీలిస్తామని.. ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం ఎదుటకు వెళ్లే అవకాశముందని వివరించింది. రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సుప్రీం స్టే విధించటంతోగురువారం హైకోర్టు తీర్పుతో జరిగిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పునరుద్ధరణ రద్దయింది. మళ్లీ రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది. న్యాయవ్యవస్థపై పూర్తివిశ్వాసం: కాంగ్రెస్ న్యాయవ్వస్థపై తమకు పూర్తి విశ్వాసముందని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని మోదీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా, అక్రమంగా, ఏకపక్షంగా రద్దు చేసిందని, కోర్టు ఎదుట వాస్తవాలను ప్రవేశపెడతామని చెప్పింది. సుప్రీం తాజా ఉత్తర్వులు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించి అక్రమ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా అడ్డుకుందని రావత్ అన్నారు. సుప్రీంకోర్టు స్టే విధించకముందు.. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం అనుమతించాలన్నారు. రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య: వెంకయ్య ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య అని.. గవర్నర్ నివేదిక వచ్చిన తర్వాత శాసనసభను పునరుద్ధరించవచ్చునని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులను చేసిన తర్వాత.. ఏప్రిల్ 29న బలపరీక్ష నిర్వహించాలనటం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పు ప్రతులు కేంద్రం, గవర్నర్లకు అందకుముందే.. రావత్ తనకు తానుగా రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం బాధ్యతలు చేపట్టటం అక్రమమని బీజేపీ ఆరోపించింది. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని సుప్రీంకోర్టు స్టే నిలిపివేసిందని పేర్కొంది. -
సీఎం కుర్చీలో రావత్.. 11 అత్యవసర నిర్ణయాలు
డెహ్రాడూన్: రాష్ట్రపతి పాలనను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి హరీశ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఆయన ఆఘమేఘాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పన్నెండు నిర్ణయాలు తీసుకొని వాటిని శీఘ్రంగా అమలు చేయాలని ఆదేశించారు. వీటిలో నీటి సంక్షోభం అనే అంశం ప్రధానంగా ఉంది. రావత్ ఉత్తరాఖండ్ లో మెజారిటీ కోల్పోయారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే, తనకు కనీసం మెజార్టీ నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రపతి పాలన విధించారని హైకోర్టులో పిటిషన్ వేయగా దానిని విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. ఈ నెల 29న బల పరీక్షను ఎదుర్కోనున్నారు. -
మోదీ సర్కారుకు హైకోర్టు శరాఘాతం
► ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దు ► రావత్ సర్కారును పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు ► 29న మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశం ► కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ధర్మాసనం ► ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం ప్రమాదంలో ఉంది ► ‘356’ విధింపు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం ► ‘రాష్ట్రపతి పాలన’కు చూపిన ప్రాతిపదిక బలంగా లేదు ► తీర్పు వెలువరించే వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించబోమని కేంద్రం హామీ ఇవ్వాలన్న ధర్మాసనం ► ఇవ్వలేమన్న కేంద్ర న్యాయవాది.. మండిపడ్డ హైకోర్టు ► తీర్పుపై స్టేకూ నిరాకరణ.. నేడు సుప్రీంలో కేంద్రం సవాల్ నైనిటాల్ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ఈ నెల 29వ తేదీన శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలని ఆ సర్కారును ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామంతో.. సోమవారం నుంచి మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడతలో గందరగోళం చెలరేగే సూచనలు ప్రస్ఫుటమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించటంపై మోదీ సర్కారు తీరును ఖండించాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి నోటీసు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్రం గత నెల (మార్చి) 27వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది సుప్రీంకోర్టు ఆదేశించిన చట్టానికి విరుద్ధమంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ వి.కె.బిస్త్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నాడు కొట్టివేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయటంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. అదేసమయంలో.. తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మందిపై అనర్హత వేటును కూడా హైకోర్టు ధర్మాసనం సమర్థించటం విశేషం. పార్టీ ఫిరాయింపు అనే రాజ్యాంగ పాపానికి ఒడిగట్టినందుకు.. స్పీకర్ అనర్హత వేటు ద్వారా వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. వారం పాటు తొలగించబోమని హామీ ఇస్తారా? ధర్మాసనం గురువారం బహిరంగ కోర్టులో దాదాపు రెండున్నర గంటల పాటు తీర్పును మౌఖికంగా ప్రకటించింది. ఈ తీర్పు ప్రకటన వరకూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను వారం రోజుల పాటు తొలగించబోమని, వేరొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించబోమని హామీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం కోరింది. అటువంటి హామీ ఇచ్చే అవకాశం తనకు లేదని న్యాయవాది పేర్కొనగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘తీర్పు ఇవ్వకముందే రాష్ట్రపతి పాలన తొలగించి, మరొకరికి ప్రమాణం చేసే అవకాశం ఇస్తే.. న్యాయాన్ని వక్రీకరించటం కాదా? మీరు ప్రతి రాష్ట్రంలోనూ ఇలా చేయగలరు. పది, పదిహేను రోజులు రాష్ట్రపతి పాలన విధించి.. మరొకరిని ప్రమాణ స్వీకారం చేయమనటం’’ అని విమర్శించింది. ‘‘మీరు ఇలా ప్రవర్తించటం పట్ల మాకు కోపం కన్నా ఎక్కువగా బాధ కలుగుతోంది. అత్యున్నత అధికారం - భారత ప్రభుత్వం - ఇలా ప్రవర్తిస్తోంది. కోర్టుతో ఆటలాడవచ్చని మీరు ఎలా భావిస్తారు?’’ అని మండిపడింది. అనంతరం మౌఖికంగా తీర్పును ప్రకటిస్తూ.. ప్రస్తుత కేసు మార్చి 18వ తేదీ నుంచి మొదలైందని.. ఆ రోజును తొలి రోజుగా లెక్కిస్తే 356వ అధికరణ ప్రకటనను పది రోజుల లోగానే చేశారని.. ఇది సుప్రీంకోర్టు విధించిన చట్టానికి విరుద్ధమని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలన విధించటానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు బలంగా లేవని.. కాబట్టి రాష్ట్రపతి పాలన ప్రకటనను న్యాయసమీక్ష చేయటం సరైనదేనని పేర్కొంది. రాష్ట్రపతి పాలన ప్రకటించిన రోజు నాటి పరిస్థితి యథాతథంగా కొనసాగుతుందని.. అంటే పిటిషనర్ (హరీశ్‌రావత్) సారథ్యంలోని ప్రభుత్వం పునరుద్ధరణ అవుతుందని తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారమా..? ‘‘రాష్ట్ర ప్రభుత్వాలను వదిలించుకోవటం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దుచేయటం లేదా తొలగించటం, గందరగోళం ప్రవేశపెట్టం, తద్వారా.. ఎండ, వాన, మంచులను తట్టుకుంటూ ఓటు వేయటానికి తెల్ల కాగితంతో నిలుచునే సామాన్యుడి విశ్వాసాన్ని దెబ్బతీయటం.. కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారమా అన్నది ఈ అంశంలో అతి కీలకం. సస్పెన్షన్ అయినా, రద్దు చేయటమైనా.. దాని ప్రభావం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయటమేనన్నది మా అభిప్రాయం. అది ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకునే పౌరుల మనసుల్లో నిస్పృహకు అంకురార్పణ చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య పునాదిని బలహీనపరుస్తుంది. ఇక్కడ మొత్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం, రాష్ట్రాలు తమ తమ పరిధుల్లో సార్వభభౌమత్వం కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని విస్తృత పరిధిలో చూడాలి. 356 అధికరణను చివరి అవకాశంగా, అత్యంత జాగరూకతతో ఉపయోగించాలన్నది స్పష్టం’’ అని తన సుదీర్ఘ తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి... ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు వీలుగా.. తీర్పును నిలుపదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ‘‘ఇప్పుడు రాష్ట్రపతి పాలన లేదు. ప్రభుత్వ పునరుద్ధరణ జరిగింది. (తీర్పు రాసేందుకు) మాకు సమయం ఇవ్వాలని మేం మీకు చెప్పాం. కానీ.. ఇప్పుడే ప్రకటించేలా మీరు మమ్మల్ని బలవంతం చేశారు. మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి (ఈ తీర్పును) నిలుపదల చేయించుకోండి’’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో రాష్ట్రపతి నిర్ణయంపై న్యాయ సమీక్షకు గల అవకాశంపై కేంద్రం వాదనలను తోసిపుచ్చుతూ.. ‘‘న్యాయబద్ధమైన ప్రయోజనం కోసం అన్నట్లుగా కనిపించినప్పటికీ.. అనుషంగిక ప్రయోజనం పొందటం అంగీకారయోగ్యం కాదు’’ అని పేర్కొంది. వినియోగ బిల్లు వివాదంతో మొదలై... ఉత్తరాఖండ్ శాసనసభలో మార్చి 18వ తేదీన వినియోగ బిల్లు ఆమోదంపై వివాదం చెలరేగటం.. ఆ ద్రవ్య బిల్లు ఓడిపోయిందని, ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని బీజేపీ, కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు వాదించటంతో.. అదే నెల 28వ తేదీన ప్రభుత్వం శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. విశ్వాసపరీక్ష జరగాల్సిన ఒక రోజు ముందు మార్చి 27వ తేదీన.. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందన్న ప్రాతిపదికగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది. రాష్ట్రపతి పాలన విధింపును సవాల్ చేస్తూ హరీశ్‌రావత్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై గత మూడు రోజుల విచారణలో హైకోర్టు.. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించటానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విశ్వాస పరీక్షకు కేవలం ఒక్క రోజు ముందు 356 అధికరణ కింద రాష్ట్రపతి పాలనను ప్రకటించటం.. ప్రజాస్వామ్య మూలాలను నరికివేయటమేనని సోమవారం నాడు అభివర్ణించింది. ఆ తర్వాతి రోజు.. ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి కేంద్రం గందరోళాన్ని ప్రవేశపెడుతోందని విమర్శించింది. బుధవారం నాడు.. రాష్ట్రపతి కూడా తీవ్ర పొరపాటు చేయవచ్చునంటూ.. రాష్ట్రపతి పాలనపై న్యాయసమీక్ష చేయవచ్చునని పేర్కొంది. నేడు ‘సుప్రీం’లో సవాల్ చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. మార్చి 18వ తేదీన వినియోగ బిల్లు శాసనసభలో వాస్తవానికి ఆమోదం పొందలేదని.. స్పీకర్ స్వయంగా దీనిని నిర్ధారించారని, అంటే ప్రభుత్వం పడిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. మోదీజీ కలిసి పనిచేద్దాం ‘మాకన్నా బలమైన కేంద్రంతో విరోధం పెట్టుకోవాలని మేం అనుకోవటం లేదు. పరస్పర సహకారంతో సమాఖ్య పద్థతిలో కలిసి పనిచేసుకుందాం. ఇటీవల జరిగిన పరిణామాలను ప్రధాని మరిచిపోయి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి’ - హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మోదీ, షా క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ ‘రాజ్యాంగాన్ని హత్యచేసి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నించిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలి. హైకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు వంటిది. ఇది కాంగ్రెస్ విజయం మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విజయం. విశ్వాస పరీక్షలోనూ మాదే విజయం’ ఈ తీర్పు ఊహించిందే: బీజేపీ ‘ఈ నిర్ణయంపై మాకేం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలతో దీన్ని ముందుగానే ఊహించాం. కాంగ్రెస్ ప్రతిదానికీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం దురదృష్టకరం. ఇప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మైనారిటీలోనే ఉంది. ఏప్రిల్ 29నే వారి భవితవ్యం తేలుతుంది’ బీజేపీకి చెంపదెబ్బ ‘ఉత్తరాఖండ్ పరిణామాలు బీజేపీ ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటివి. రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవనేదానికి ఇదో మంచి ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగం బట్టబయలైంది’ - సీతారాం ఏచూరీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి ‘మోదీ ప్రభుత్వానికి ఇదో ఎదురుదెబ్బ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల విషయంలో మోదీ జోక్యం తగ్గించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి’ - అరవింద్ కేజ్రీవాల్, ట్విట్టర్లో ప్రజాస్వామ్య విజయమిది ‘బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకుందామనుకున్న బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. ఇది ప్రజాస్వామ్య విజయం. మోదీజీ రాజ్యాంగం దాడి చేద్దామని మీరు చేస్తున్న ప్రయత్నానని ఉత్తరాఖండ్ ప్రజలు, యావద్భారతం గమనిస్తోంది’ - రాహుల్ గాంధీ, ట్వీట్టర్లో -
కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాష్ట్రపతి పాలన రద్దు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు రద్దు చేసింది. 356 అధికరణంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగి తేలాయి. కేంద్ర ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశాయి. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని ఉద్ఘాటించాయి. కాగా, 29న హరీశ్ రావత్ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే.. 'ఉత్తరాఖండ్ లో తప్పుడు విధంగా రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఈ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి పరిపాలన అనేది అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే విధించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రజాప్రతినిధులను ఇలా అనూహ్యంగా తొలగించడమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బకొట్టడమే. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ఎంతో తొందరపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మెజారిటీ నిరూపించుకునేందుకు మరో రోజు ఉండగానే ఇలా త్వరత్వరగా రాష్ట్రపతి పాలన విధించడం అనేది కేంద్రం చేసిన అనాధికార కార్యక్రమంలాగా కనిపిస్తోంది' అని కోర్టు వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌లో సంబరాల కోలాహలం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీఎం హరీశ్ రావత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకొని టపాకాయలు కాల్చారు. పలువురు పత్రికా ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత హృదయేష్ స్పందిస్తూ మరోసారి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడిన మన న్యాయ వ్యవస్థకు నా సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించారు. 29న బల పరీక్ష హైకోర్టు తీర్పు నేపధ్యంలో హరీశ్ రావత్ కు మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 29న ఆయన బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఇప్పటికే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు బీజేపీతో చేతులు కలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పెద్దలు సమీక్షలు జరిపి బలపరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేంద్రంపై హైకోర్టు సీరియస్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రపతి పాలనను వెంటనే ఎందుకు ఎత్తేయలేదని ప్రశ్నించింది. స్పష్టమైన ఆదేశాలిచ్చి వారం రోజుల్లోనే రాష్ట్రపతి పాలనను ఎందుకు ఉపసంహరించలేదని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం చర్యలతో తమకు కోపం కంటే బాధ కలుగుతోందని ఉన్నత న్యాయస్థానం గురువారం వ్యాఖ్యానించింది. కోర్టులతో ఎందుకు ఆడుకుంటున్నారని సూటిగా అడిగింది. 'రేపు రాష్ట్రపతి పాలన ఎత్తేసి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరొకరిని ఆహ్వానిస్తారు. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడం కాదా. ప్రభుత్వం ఏమైనా ప్రైవేటు పార్టీయా' అని ఘాటుగా ప్రశ్నించింది. తాము తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్రం తమ ఆదేశాలను శిరసావహిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేయదని, తమను రెచ్చగొట్టదన్న నమ్మకాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యక్తం చేసింది. -
రాష్ట్రపతి నిర్ణయాన్నీ సమీక్షించొచ్చు
రాష్ట్రపతి పాలనపై ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్య ♦ ఒక్కోసారి రాష్ట్రపతి నిర్ణయం కూడా పొరపాటు కావచ్చు ♦ రాష్ట్రపతి పాలన ఎత్తేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు ♦ తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశం నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేసి తమను రెచ్చగొట్టవద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువరించే వరకూ దానిని ఎత్తివేయొద్దని బుధవారం ఆదేశించింది. కోర్టు తీర్పు ఇవ్వక ముందే లేదా తీర్పును రిజర్వు చేయడానికి ముందే ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం అసెంబ్లీని సస్పెండ్ చేయాలన్న రాష్ట్రపతి నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? లేదా? అనే అంశాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చని స్పష్టం చేసింది. ఒక్కోసారి రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కూడా పొరపాటు కావచ్చని, అందువల్ల దానిపై సమీక్ష జరపవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిస్త్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎన్డీఏ ప్రభుత్వ వాదనలను ప్రస్తావిస్తూ.. తన రాజకీయ విజ్ఞతతో ఆర్టికల్ 356 విధింపుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఎవరైనా తప్పులు చేయొచ్చు.. అది రాష్ట్రపతి అయినా కావచ్చు లేదా జడ్జీలైనా కావచ్చు’ అని అన్నారు. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రావత్ తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తీర్పు వెలువడక ముందే లేదా రిజర్వ్ చేయడానికి ముందే రాష్ట్రపతి పాలన ఎత్తివేయకుండా.. అలాగే ప్రతిపక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా చూడాలని కోర్టును కోరారు. కోర్టు త్వరితగతిన తీర్పు వెలువరించేలా కేంద్రం ఎటువంటి కుట్రలు పన్నకుండా చూడాలని విన్నవించారు. అయితే కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడానికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బీమ్‌లాల్ ఆర్యాపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పక్కన పెట్టారన్న కేంద్ర ఆరోపణలపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏప్రిల్ 5న అనర్హత ఫిర్యాదు ఎందుకు చేశారు? మీరు స్పీకర్‌పై దారుణమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం పనిచేసేది ఇలాగేనా? దీని గురించి కేంద్రం ఏం చెబుతుంది. దీనిని అంత తేలిగ్గా తీసుకోవడం సాధ్యం కాదు. దీనిపై మేము దృష్టి పెట్టాం’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి తాను ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని గురువారం కోర్టుకు వివరిస్తామని ఏఎస్జీ మెహతా చెప్పారు. దీంతో కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా గురువారం కోర్టు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. -
రాష్ట్రపతి పొరపాటు చేసుండొచ్చు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయసమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షించజాలవని కేంద్రం వాదించింది. రాచరికపాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రపతి విజ్ఞతపై తమకు ఎటువంటి అనుమానం లేదని, ఏది చేసినా న్యాయసమీక్షకు అనుగుణంగా చేయాలని తెలిపింది. హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతనెలలో కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను రాష్ట్రపతి సుప్తచేతనావస్థలో ఉంచారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఉన్నత న్యాయస్థానాల్లో వాదోపవాదనలు జరుగుతున్నాయి. -
గందరగోళం సృష్టించారు
♦ కేంద్రానికి ఉత్తరాఖండ్ హైకోర్టు అక్షింతలు ♦ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కును లాగేసుకున్నారు నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం హడావిడిగా తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రంపై అక్షింతలు వేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను లాగేసుకున్నారని, అలాగే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని సృష్టించారని ఆక్షేపించింది. అవినీతి, ఎమ్మెల్యేల బేరసారాల్లాంటి ఆరోపణలు కాకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడమొక్కటే రాజ్యాంగబద్ధ పరిష్కారమంది. రాష్ర్టపతి పాలనను సవాల్‌చేస్తూ పదవీచ్యుత సీఎం రావత్, ఇతర పిటిషన్లపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్రపతిపాలనపై హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై ప్రశ్నలు సంధించింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీలు వేరైనప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని కేంద్ర ప్రభుత్వం భూతద్దం పెట్టుకొని వెతుకుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని రద్దుచేసేందుకు అవినీతి ఆరోపణలే సరిపోతే దేశంలో ఏ ప్రభుత్వమైనా కనీసం ఐదు నిమిషాలైనా మనుగడ సాగిస్తుందా అని ప్రశ్నించింది. -
'ఆ సీన్ రిపీటవనివ్వను'
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇవ్వబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అరుణా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం ఈ పరిస్ధితి తలెత్తిన నేపథ్యంలో అలాంటిది ఢిల్లీలో పునావృతం కానివ్వబోనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న చట్టప్రతినిధులు ఏం చెప్తున్నారో అనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పనిసరిగా వినాలని, ప్రజల అవసరాల మేరకే ప్రతిపక్షాల డిమాండ్లు ఉండాలని హితవు పలికారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్పందన కోరగా 'ఢిల్లీలో మేం ఎప్పటికీ అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వబోం. వచ్చే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలుచుకోలేదని బీజేపీకి తెలుసు. అందుకే గుంఢాగిరి మార్గాన్ని ఎంచుకుంది. దానిని హిమాచల్ ప్రదేశ్‌లో తర్వాత ఢిల్లీలో ప్రయోగించాలనుకుంటున్నారు. ఢిల్లీలో తొలుత 21మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి.. మరో 23మంది ఎమ్మెల్యేలను కొనేయాలని అనుకుంటున్నారు' అని కేజ్రీవాల్ ఆరోపించారు. -
ఉత్తరాఖండ్ డ్రామా!
అవసరార్ధం అభిప్రాయాలు ప్రకటించడం తప్ప దేనిపైనా నికరమైన, సూత్రబద్ధమైన వైఖరిని ప్రదర్శించలేని రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకు ఉత్తరాఖండ్ తాజా ఉదాహరణ. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చిన్నగా మొదలైన ఎమ్మెల్యేల తిరుగుబాటు చివరకు ఆ ప్రభుత్వ మనుగడకే ముప్పు కలిగించే స్థాయికి చేరుకోవడం... కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం లాంటి పరిణామాలు అందరినీ విస్మయపరిచాయి. రాష్ట్ర ప్రభు త్వానికి బలం ఉన్నదో లేదో నిర్ణయించడానికి ఈ నెల 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. ఏ ప్రభుత్వానికైనా అసెంబ్లీలో జరిగే బలపరీక్షే కీలకం. ఆ బలపరీక్షలో నెగ్గితేనే, అత్యధిక సభ్యుల విశ్వాసం చూరగొంటేనే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించాలి. ఈ సంగతిని ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పి 22 ఏళ్లు దాటుతోంది. అంతకు ముందుతో పోలిస్తే ఆ తీర్పు వెలువడ్డాక కేంద్రంలో అధికారం చలాయించే పాలకులు కాస్త తగ్గిన మాట వాస్తవమే అయినా అలాంటి చర్యలకు పూర్తిగా స్వస్తి పలకలేదు. బొమ్మైకేసుకు ముందు 15 సంవత్సరాలు...ఆ తర్వాత 15 సంవత్స రాలు కొలమానంగా తీసుకుని రాష్ట్రపతి పాలనకు వీలుకల్పించే 356వ అధికరణను కేంద్రంలో అధికారంలో ఉండే పాలకులు ఎన్నిసార్లు ప్రయోగించారని ఒక సామాజిక శాస్త్రవేత్త లెక్కలుగట్టినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. బొమ్మైకేసుకు ముందు ఈ అధికరణను 40 సార్లు...ఆ తర్వాత 11 సార్లు అమలు చేశారని ఆయన 2012లో తేల్చిచెప్పారు. న్యాయస్థానాల భయంతో పాలకులు కాస్త తగ్గారని ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్రపతి భావించినపక్షంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చునని 356 అధికరణ చెబుతోంది. కానీ తమకు నచ్చని ప్రభుత్వాన్ని సాగనంపడానికే ఈ అధికరణ కేంద్రంలోని పాలకులకు అక్కరకొస్తున్నది. రాష్ట్రపతి పదవిలో ఉండేవారు ఇలాంటి చర్యల విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరిస్తే ఈ రకమైన పోకడలకు ఆస్కారం ఉండేది కాదు. కానీ కె.ఆర్. నారాయణన్ ఒక్కరే రాష్ట్రపతిగా ఈ విషయంలో దృఢంగా వ్యవహరించారు. యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన సిఫార్సును ఒకసారి, బిహార్ సర్కార్‌ను బర్తరఫ్ చేసే సిఫార్సును మరొ కసారి 1997లో ఆయన తోసిపుచ్చారు. అంతకుముందూ, ఆ తర్వాతా ఎవరూ ఇంత స్వతంత్రంగా వ్యవహరించిన సందర్భాలు కనబడవు. కేంద్ర-రాష్ట్ర సంబం ధాలపై నియమించిన సర్కారియా కమిషన్ సైతం 356వ అధికరణ దుర్విని యోగాన్ని తప్పుబట్టింది. అప్పటివరకూ మొత్తంగా 75 సందర్భాల్లో ఈ అధికర ణాన్ని ఉపయోగిస్తే అందులో కేవలం 26 సార్లు మాత్రమే ‘సరైన కారణాలు’ ఉన్నాయని 1988లో సమర్పించిన నివేదికలో తేల్చిచెప్పింది. ఈనెల 31న బలనిరూపణ చేసుకోవాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఆదేశాల ద్వారా రాష్ట్రపతి పాలన విధింపుపై స్టే విధించి హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించినట్టు భావించ వచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వానికి నైతికంగానూ, చట్టపరంగానూ ఎదురుదెబ్బ తగిలినట్టే. వాస్తవానికి ఈ నెల 28న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధపడాలని రావత్ సర్కారుకు ఆ రాష్ట్ర గవర్నర్ కెకె పాల్ చేసిన సూచనను సజావుగా అమలు జరగనిచ్చి ఉంటే ఆ ప్రభుత్వం ఉండటమో, ఊడటమో తేలిపోయేది. కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా హఠాత్తుగా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించింది. ఇది తొందర పాటు చర్యేనని హైకోర్టు ఆదేశాలు తెలియజెబుతున్నాయి. రావత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడాన్ని కూడా హైకోర్టు ఒకరకంగా నిలిపివేసినట్టే లెక్క. 31న జరిగే బలపరీక్షలో వారు కూడా ఓటేసే అవకాశాన్ని కల్పించడం ఇందువల్లే కావొచ్చు. అయితే, ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై ఉన్న వివాదాన్ని తేల్చేవరకూ వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. మొత్తంమీద హైకోర్టు ఉత్తర్వులు అధికారాన్ని కోల్పోయిన రావత్‌కూ, సభ్యత్వం రద్దయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. లోగడ అరుణాచల్ ప్రదేశ్‌లోనూ, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా తనదీ కాంగ్రెస్ చూపిన బాటేనని ఎన్డీఏ సర్కారు చెప్పినట్టయింది. ఉత్తరాఖండ్‌లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం విషయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరినట్టు ఓటింగ్‌కు స్పీకర్ అనుమ తించకపోయి ఉండొచ్చు. రాజ్యాంగపరంగా, నైతికంగా అది దోషమే కావొచ్చు. ఆ విషయంలో న్యాయస్థానాలు రాజ్యాంగం అనుమతించిన మేరకు జోక్యం చేసు కుంటాయి. జనం అంతిమంగా తీర్పునిస్తారు. అంతేతప్ప దాన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకోవడం మంచిది కాదు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయకుండా ఉంటే మంచిదని కేంద్రం గుర్తించాలి. తాము విపక్షంలో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయడాన్నీ, అప్పుడు తాము తీసుకున్న వైఖరినీ బీజేపీ నేతలు మర్చిపోకూడదు. ఉత్తరాఖండ్ అనుభవంతో కాంగ్రెస్‌కు తత్వం బోధపడినట్టుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేయడం అప్రజాస్వామికమని వాదిస్తోంది. అంతకన్నా ముందు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తే ఇలాంటి తిప్పలు రావని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. ఆ పని చేస్తే కనీసం మణిపూర్‌లోనైనా ప్రభుత్వాన్ని రక్షించు కోగలుగుతామని గ్రహించాలి. -
విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు
ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకోడానికి గురువారం.. అంటే ఈనెల 31వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. గత కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకమైన ఆర్థికబిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న విషయం రుజువైందని కేంద్రం చెప్పింది. అయితే.. మార్చి 28న తాను విశ్వాసపరీక్ష ఎదుర్కొంటానని గవర్నర్ కేకే పాల్‌ను కోరినా, ఈలోపే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయంతో సభలో మొత్తం సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు స్వతంత్ర సభ్యులు కూడా సర్కారుకు మద్దతిస్తారని అంటున్నారు. అదే నిజమైతే 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ స్వతంత్ర సభ్యులు సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం హరీష్ రావత్ ఇంటిదారి చూసుకోక తప్పదు. -
సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ
అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరు సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సీఎంలను ఎన్నుకునే విధానాన్నితీసుకురావాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీలు మారడం నుంచి రాష్ట్రపతి పాలన వరకు జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకపాత్ర వహించాల్సినవి కాదన్నారు. విలువలకు, ప్రజా ప్రయోజనాలకు అధికారం ఎంతో దూరమైందనడానికి పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలే తాజా రుజువని పేర్కొన్నారు. -
'9 మంది ఎమ్మెల్యేలకు వెయ్యి కోట్లు ఇచ్చారు'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర గవర్నర్ పై కేంద్రంలోని నరేంద్ మోదీ సర్కారు బెదిరింపులకు పాల్పడిందని ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ముట్టాయని, రూ.1000 కోట్లకు పైగా చేతులు మారాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానకి విశ్వప్రయత్నాలు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇక భవిష్యత్తు ఉండదని వారి రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం, అందుకు దారితీసిన పరిస్థితులపై ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేయగా, ఈ విషయాన్ని గవర్నర్, రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించారు. గత రెండు రోజులుగా బీజేపీ కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఇలా జరిగిందని రావత్ ఆరోపించారు. 2014 ఫిబ్రవరిలో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్రలు పన్నిందని, మెజారిటీ సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఈ విధంగా జరగడంపై సీఎం హరీష్ రావత్ విచారం వ్యక్తంచేశారు. -
పంతం నెగ్గించుకున్న మోదీ సర్కారు!
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నెలకొన్న రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తీసుకుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేశారు. గవర్నర్ తన నివేదిక, సిఫార్సును ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ, గవర్సర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన అమలుచేశారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం హరీశ్ రావత్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనుండగా.. అంతకుముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా పావులు కదిపిన విషయం తెలిసిందే. బలం ఉన్నా... హైడ్రామా జరిగింది! కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడం.. ఈ సస్పెన్షన్ కనుక నిజమైతే, అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ప్రస్తుతం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్ సస్పెన్సన్ నిర్ణయంతో ఆ సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు సభ్యుల అండ కూడా రావత్ ప్రభుత్వానికి ఉంది. దీంతో 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో బలనిరూపణ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన కోసం శతవిధాలా ప్రయత్నించి తమ పంతం నెగ్గించుకుంది. -
కాంగ్రెస్‌ను కాపీ కొడుతున్న బీజేపీ
డెహ్రాడూన్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్ట ప్రభుత్వాలను తమ తైనాతీలైన గవర్నర్లను ఉపయోగించి పడగొట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఇప్పుడు అదే అలవాటును కేంద్రంలో అధికారంలోవున్న భారతీయ జనతా పార్టీ పుణికి పుచ్చుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విజయం సాధించిన బీజేపీ మణిపూర్‌లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉత్తరఖండ్పై దృష్టిని సారించింది. కాంగ్రెస్‌కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల సహకారంతో రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసుకున్నారు. హరీష్ రావత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ఫిర్యాదు చేశారు. మార్చి 28వ తేదీన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా రావత్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో రావత్ తిరుగుబాటు రాజకీయాలను నెరపుతున్న నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కూడా సభాపతిని కోరారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, సీనియర్ నాయకుడు హరక్ సింగ్ రావత్, బహుగుణ కుమారుడు సాకేత్, కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి అనిల్ గుప్తా సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలందరికి అనర్హత నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రావత్ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోతుందా? ఓడిపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా? వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న అంశాలపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. రావత్ బల పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను దువ్వుతున్నారు. వారి మద్దతుతో రావత్ బల పరీక్ష నెగ్గినట్లయితే వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తారు. ఆ వెంటనే ఎన్నికలను కోరుకుంటారు. ఎలాగు ఎన్నికలు మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. అలా కాకుండా బల పరీక్షలో రావత్ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు సభ్యుల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మరీ అప్పుడు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులకు కట్టబెడతారా, లేక పార్టీకి చెందిన నాయకులకు అప్పగిస్తారా? అన్న అంశం తెర ముందుకు వస్తుంది. కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుల్లో విజయ్ బహుగుణ, హరక్ సింగ్ రావత్‌లు ఉన్నారు. కానీ వారికి మంచి ఇమేజ్ లేదు. 2013లో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యారన్న కారణంగా బహుగుణ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలోనే రావత్ ముఖ్యమంత్రిగా వచ్చారు.హరక్ సింగ్ రావత్ అంత పాపులర్ లీడర్ కాకపోవడమే కాకుండా సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని అభాసుపాలయ్యారు. బీజేపీకి సొంత పార్టీలోనూ చరిస్మాటిక్ నాయకుడు లేరు. ఉన్న హైప్రోఫైల్ లీడర్ బీసీ ఖండూరికి 85 ఏళ్లు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వయోభారం కారణంగా ఆయన సీఎం బాధ్యతలను నిర్వహించలేరు. ఏదేమైనా ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అరుణాచల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రాజకీయ సంక్షోభం బారిన అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోయాయి. అరుణాచల్ లో రాష్ట్రపతి పాలనపై విధించిన స్టేటస్ కోను సుప్రీంకోర్టు గురువారం ఎత్తివేసింది. కొత్త ప్రభుత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌ను నియంత్రించటంతో పాటు యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం నిన్న తిరస్కరించింది. రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాలని రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ బుధవారం సిఫారసు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమకు మెజారిటీ ఉందని కాంగ్రెస్ అసమ్మతి నేత పుల్ సారథ్యంలోని 31 మంది ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్‌ను కలిశారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు. -
అరుణాచల్ లో తొలగనున్న రాజకీయ సంక్షోభం
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో గతనెల రాష్ట్రపతి పాలన విధించారు. కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే రాష్ట్రపతి పాలన ముగుస్తుంది. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించకుండా గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాకు మధ్యంతర ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు తోసిపుచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కాంగ్రెస్ అసమ్మతి నేత కాలిఖొ పాల్ ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న అరుణాచల్‌లో సీఎం నబమ్ టుకీపై అసంతృప్తితో 21మంది ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న తిరుగుబాటు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ టుకీకి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. -
'రాష్ట్రపతి పాలన పెట్టాలనుకుంటున్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అలా విధించేందుకు ఢిల్లీలో మున్సిపల్ కార్మికుల సమ్మెను సాకుగా ఉపయోగించుకోవాలనుకుంటుందని చెప్పారు. చాలా రోజులుగా వేతనాల చెల్లింపుల కోసం బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరు తమ విధులను పక్కకు పెట్టడంతో ఢిల్లీలో చెత్త పేరుకుపోయింది. ఫలితంగా ఆప్ మంత్రులే ఈ మధ్య మున్సిపల్ కార్మికుల అవతారం ఎత్తి వీధులు శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ 'మోదీ ప్రభుత్వం ఢిల్లీలో కూడా అరుణాచల్ ప్రదేశ్‌లో మాదిరిగా రాష్ట్రపతి పాలన విధించాలని అనుకుంటుంది' అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న పలు శాఖల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, తమ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఎలాంటి బాకీ లేదని, వారి జీతభత్యాలు తాము చెల్లిస్తునే ఉన్నామని అన్నారు.