ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు | Supreme court extends stay on uttarakhand high court order | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు

Published Wed, Apr 27 2016 4:13 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు - Sakshi

ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష రద్దు అయింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం మే 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. కాగా రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం  సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

కాగా అంతకు ముందు ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు మొత్తం ఏడు రకాల ప్రశ్నలను సంధించింది. సభలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఆర్టికల్ 175 (2) గవర్నర్ చెప్పారా? ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడమే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడానికి కారణమా? అసెంబ్లీలో జరిగిన పరిణామాలే రాష్ట్రపతి పాలనకు దారి తీశాయా? ద్రవ్ వినిమయ బిల్లు సందర్భంగా జరిగిన పరిణామాలు రాష్ట్రపతి పాలనకు కారణాల్లో ఒకటా? విశ్వాస పరీక్ష ఆలస్యం కావడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీసిందా? ఉత్తరాఖండ్ సీఎస్కు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని  న్యాయస్థానం స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement