CM Harish Rawat
-
ఉత్తరాఖండ్‌లో ఆసక్తికర పోరు
-
చిన్న రాష్ట్రంలో చిక్కనైన పోటీ
- రెండు చోట్ల ‘నిలిచిన’ సీఎం రావత్ - ఉత్తరాఖండ్ పోరులో ఉత్కంఠ (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ఉత్తరాఖండ్ నాలుగో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ లేనంత వాడి, వేడి ఈసారి కనిపిస్తున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఎన్నికల్లో పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీ ఉన్న ఈ హిమాలయ రాష్ట్రంలోని 70 సీట్లకు మంగళవారం పోలింగ్ జరుగుతుంది. దాదాపు 76 లక్షల ఓటర్లు ముఖ్యమంత్రి హరీశ్ రావత్(కాంగ్రెస్)మరో అవకాశం ఇవ్వకపోతే ప్రతిపక్షం బీజేపీకి అధికారం దక్కుతుంది. 2014 ఎన్నికల్లో మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ బీజేపీ కైవసం చేసుకోవడంతోపాటు, అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సైన్యంలో, బీఎస్ఎఫ్ వంటి పారా మిలిటరీ దళాల్లో ఉత్తరాఖండీల వాటా వారి జనాభా నిష్పత్తి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రానికి చెందిన జవాన్లు, మాజీ జవాన్లు కలపితే రెండున్నర లక్షల మంది ఉన్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా ఉత్తరాఖండీయే. ఈ వర్గం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలుస్తోంది. బీజేపీ సీఎం పదవికి అభ్యర్థిని ప్రకటించలేదు. రెండు జిల్లాల నుంచి సీఎం పోటీ కాంగ్రెస్ సీఎం రావత్ రెండు స్థానాల నుంచి పోటీచేస్తున్నారు. 16 ఏళ్ల ఉత్తరాఖండ్ చరిత్రలో రెండు అసెంబ్లీ సీట్లకు ఒకరు పోటీచేయడం ఇదే మొదటిసారి. ఆయన పోటీచేస్తున్న కిచ్చా బెంగ్ నియోజకవర్గం పర్వత పాద ప్రాంతమైన ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లాలో ఉంది. మైదాన ప్రాంత జిల్లా హరిద్వార్‌లోని హరిద్వార్ (రూరల్) నుంచి కూడా పోటీచేస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాలతో పోల్చితే బాగా అభివృద్ధి చెందిన ఈ రెండు జిల్లాల్లో 20 స్థానాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ విజయావకాశాలపై ధీమా లేకనే ముఖ్యమంత్రి రెండు చోట్ల నుంచి నిలబడ్డారు. ఈ రెండు జిల్లాల సీట్లు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఈ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరుసాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో బీఎస్పీ చెప్పుకోదగ్గ బలం ఉన్నబీఎస్పీ త్రిముఖ పోటీలకు కారణమైంది . ఫిరాయింపులు బాగా జరగడంతో రెండు కాంగ్రెస్, బీజేపీలు రెండూ బలమైన తిరుగుబాటు అభ్యర్థులను దాదాపు 18 స్థానాల్లో ఎదుర్కొంటున్నాయి. రెండు పక్షాలూ ఎన్నికల సమయంలో తలుపుతట్టిన ఫిరాయింపుదారులకు టికెట్లిచ్చి తిరుగబాట్లకు అవకాశమిచ్చాయి. 11 మంది కాంగ్రెస్ మాజీలకు బీజేపీ టికెట్లు కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికైన మాజీ కాంగ్రెస్ సీఎం విజయ్ బహుగుణ సహా 12 మంది బీజేపీలో చేరడంతో వారిలో బహుగుణ మినహా అందరికీ బీజేపీ టికెట్లిచ్చింది. బహుగుణకు బదులు ఆయన కొడుకు సౌరభ్ తండ్రి సీటు సితార్‌గంజ్ నుంచి కమలం గుర్తుపై పోటీచేస్తున్నారు. ముగ్గురు మాజీ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున పోటీచేస్తుండగా మరో ముగ్గురు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. అన్ని సీట్లకు రెండు పక్షాలు పోటీచేస్తున్నాయి. అయితే, ధనౌల్తీ స్థానంలో హస్తం గుర్తుపై తన అభ్యర్థి మన్మోహన్ మాల్‌ను నిలిపినప్పటకికీ, అక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రీతంసింగ్ పన్వర్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. -
'సీఎం ఒత్తిడి చేస్తేనే రేప్ ఆరోపణలు చేశా'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. కుట్రలు చేసే వ్యక్తులకు అధికారంలో ఉండే హక్కు లేదని మండిపడింది. తనపై బీజేపీ నేత హరక్ సింగ్ రావత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, అదే మహిళ ప్లేటు ఫిరాయించి తాను ముఖ్యమంత్రి రావత్ ఒత్తిడి చేస్తేనే అలా తప్పుడు కేసు పెట్టానంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. దీంతో బీజేపీ నేతలు రావత్ రాజీనామాకు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 'హరీశ్ రావత్‌కు అధికారంలో ఉండే నైతిక హక్కును కోల్పోయాడు. ఒక మహిళను బెదిరించి, ఆమెను కష్టాలుపాలు చేస్తామని హెచ్చరించి తప్పుడు కేసు పెట్టించారు. అలాంటి వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే హక్కు ఏమాత్రం లేదు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ అన్నారు. -
మరో ‘స్టింగ్’ దుమారం
రావత్ డబ్బులు పంచారని వీడియోలో వెల్లడించిన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ♦ విశ్వాస పరీక్షకు ముందు వేడెక్కిన రాజకీయం ♦ మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: హరీశ్ రావత్ డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో విశ్వాస పరీక్షకు ముందు మళ్లీ రాజకీయ దుమారం రేగుతోంది. మంగళవారం(ఈ నెల 10న) విశ్వాస పరీక్ష జరగనుండగా.. ఆదివారం పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ లక్ష్యంగా మరో వీడియో లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్‌సింగ్ బిస్త్, రెబల్ కాంగ్రెస్ ఎమ్మ్యెలే హరక్ సింగ్ రావత్ మధ్య జరిగిన సంభాషణ ఇది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా మైనింగ్ ద్వారా తాను సంపాదించిన దాన్ని ఎమ్మెల్యేలకు చెరో రూ.25 లక్షలు ఇచ్చారని మదన్‌సింగ్ బిస్త్ చెప్పినట్లు ఈ వీడియోలో ఉంది. దీన్ని బీజేపీ నేత భగత్‌సింగ్ కోషారియా ఢిల్లీలో విడుదల చేశారు. హరీశ్ రావత్ అవినీతితో సంపాదించిన డబ్బును ఎమ్మెల్యేలకు పంచారని ఆరోపించారు. అయితే.. విశ్వాస పరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వారిని భయపెడుతోందంటూ కాంగ్రెస్ విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావటం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై బీజేపీ-కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. బ్లాక్మెయిల్ చేస్తున్నారు: రావత్ తనతోపాటు తన కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లనూ కేంద్ర ఏజెన్సీలు ట్యాప్ చేశాయని.. వివిధ మార్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నాయని, వారిని బెదిరిస్తున్నారని రావత్ మండిపడ్డారు. ‘నేనేదో దేశవ్యతిరేక వ్యక్తి అయినట్లు నాపైనా నిఘా పెట్టారు. విశ్వాసపరీక్ష తర్వాత రాష్ట్రంలో బ్లాక్‌మెయిలర్లపై ప్రత్యేకంగా పోరాటం చేస్తా’మని డెహ్రాడూన్‌లో తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వాస పరీక్షలో నెగ్గుతామన్న రావత్.. తాజా వీడియో గురించి తనకేమీ తెలియదన్నారు. కాగా, కావాలనే ఈ పరీక్షపై అనిశ్చితి నెలకొనేలా మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాస్ విజయ్ వర్గీయను రంగంలోకి దించారని, ఆయన ఇలాంటి జిమ్మిక్కులు చేయటంలో నిష్ణాతుడని ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ కిషోర్ ఆరోపించారు. మంగళవారం వరకు ఆయన్ను రాష్ట్రం నుంచి బయటకు పంపాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ రాష్ట్ర గవర్నర్ కేకే పాల్‌కు లేఖ రాశారు. సర్కారు ఏర్పాటుచేస్తాం: బీజేపీ రాష్ట్రంలో మే 10 తర్వాత తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ పేర్కొంది.విశ్వాసపరీక్షలో ఓడిపోతామనే భయంతోనే రావత్ డబ్బులిస్తున్నట్లు వీడియోలో ఈ విషయం బట్టబయలైందని తెలిపింది. ‘మే 10న ఎక్కువమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయనున్నారని మాజీ సీఎఎ కోషారియా తెలిపారు. తన పార్టీ ఎమ్మెల్యేలపైనే రావత్‌కు నమ్మకం లేదని అందుకే.. పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగానే డబ్బులు పంచారు’ అని అన్నారు. -
10న ఉత్తరాఖండ్‌లో బలపరీక్ష
సుప్రీంకోర్టు ఆదేశం ♦ సింగిల్ ఎజెండాతో అసెంబ్లీని సమావేశపరచాలి ♦ ఓటింగ్ సమయంలో రాష్ట్రపతి పాలన రద్దు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈనెల 10న బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ (కాంగ్రెస్)కు విశ్వాస పరీక్ష ఉంటుందని స్పష్టంచేసింది. సస్పెన్షన్ వేటు పడిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత.. సభలో ఓటింగ్ జరిగే వరకు కొనసాగితే వారు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్దేశించింది. మంగళవారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ఈ ఒక్క ఎజెండాతోనే శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఆ రెండున్నర గంటలపాటు రాష్ట్రపతి పాలనను తాత్కాలికంగా నిలిపిఉంచాలని, ఆ సమయంలో రాష్ట్ర ఇన్చార్జిగా గవర్నర్ సాగాలని చెప్పింది. ఈమేరకు జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల కేసు ఉత్తరాఖండ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో సుప్రీంకోర్టు వారిని ఓటింగ్‌కు దూరంగా ఉంచింది. అయితే హైకోర్టులో వారికి సానుకూలంగా వస్తే వారు ఓటింగ్‌కు హాజరవచ్చు. దీనిపై హైకోర్టులో శనివారం వాదనలు జరగనున్నాయి. మార్చి 18న ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం విషయంలో వివాదంతో రాష్ట్రంలో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. బలపరీక్ష నిర్వహణకు కేంద్రానికి అభ్యంతరం లేదంటూ అడ్వొకేట్ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు చెప్పారు. బలపరీక్ష కోసం సుప్రీం మార్గదర్శకాలను నిర్దేశించింది. అసెంబ్లీ ముఖ్యకార్యదర్శి పర్యవేక్షణలో విశ్వాసపరీక్ష నిర్వహించాలని, ఈ తంతు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొంది. ఓటింగ్ ఫలితాన్ని, వీడియో సీడీని ఈనెల 11న 10.30 గంటలకు తమకు సీల్డ్కవర్లో అందజేయాలని శాసనసభ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అర్హులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనేలా, ఈ వ్యవహారం ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నిర్దేశించింది. విశ్వాస పరీక్ష మినహా సభలో ఎలాంటి అంశాన్నీ చర్చించడానికి వీల్లేదంది. సభలో తీర్మానానికి మద్దతిచ్చే వారు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న వారు మరోవైపు కూర్చోవాలని చెప్పింది. మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి పాలనను పునరుద్ధరించాలంటూ ఏప్రిల్ 22న సుప్రీం జారీచేసిన ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ధర్మాసనం స్పష్టంచేసింది. అసెంబ్లీలో బలాబలాలు మొత్తం సభ్యులు: 70 బీజేపీ: 28 కాంగ్రెస్: 27 బీఎస్పీ: 2 స్వతంత్రులు: 3 ఠ యూకేడీపీ: 1 సస్పెన్షన్ వేటుపడినవారు: 9 (కాంగ్రెస్ రెబల్స్) (బీజేపీ ఎమ్మెల్యే బీఎల్ ఆర్య మార్చి 18న ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు) -
ఆ సీడీలో నేనే: రావత్
డెహ్రాడూన్: తనపై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీ నకిలీదన్న ఉత్తరాఖండ్ పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ ఆ వీడియోలో ఉన్నది తనేనని ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలకు డబ్బు లేదా ఇతర సాయంపై సీడీలో ఆధారాలుంటే ప్రజల సమక్షంలో ఉరికి సిద్ధమని ఆవేశంగా మాట్లాడారు. దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాకు సవాల్ విసిరారు. క్లాక్‌టవర్ వద్ద తనను ఉరితీయాలని ఆదివారమిక్కడ అన్నారు. ‘విలేకరితో లేదా ఎమ్మెల్యేతో భేటీ నేరమా? వీడియోలో చూపిన సంభాషణలు అర్థరహితంగా ఉన్నాయి. అప్పటికి అనర్హతకు గురవ్వని ఎమ్మెల్యేతో మాట్లాడటం తప్పెలా అవుతుంది?’ అని అన్నా ఎవరైనా సరే ఎందుకు తన కోసం రూ.15 కోట్లు ఖర్చుపెట్టాలి? విలేకరి తనతో ఏదో మాట్లాడగా.. తాను దానికి సమాధానమిచ్చానని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ సీడీని ఒక ప్రైవేట్ వార్తా చానల్ చీఫ్ ఎడిటర్ తయారుచేయించారని అన్నారు. -
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష రద్దు అయింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం మే 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. కాగా రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు మొత్తం ఏడు రకాల ప్రశ్నలను సంధించింది. సభలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఆర్టికల్ 175 (2) గవర్నర్ చెప్పారా? ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడమే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడానికి కారణమా? అసెంబ్లీలో జరిగిన పరిణామాలే రాష్ట్రపతి పాలనకు దారి తీశాయా? ద్రవ్ వినిమయ బిల్లు సందర్భంగా జరిగిన పరిణామాలు రాష్ట్రపతి పాలనకు కారణాల్లో ఒకటా? విశ్వాస పరీక్ష ఆలస్యం కావడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీసిందా? ఉత్తరాఖండ్ సీఎస్‌కు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. -
‘ఉత్తరాఖండ్’ తీర్పుపై సుప్రీం స్టే
రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత ♦ ఈ నెల 27 వరకూ స్టే విధించిన సుప్రీం కోర్టు ♦ 26 నాటికి హైకోర్టు తీర్పు ప్రతులు ఇరు పక్షాలకూ ఇవ్వాలని ఆదేశం ♦ తదుపరి విచారణ వరకూ రాష్ట్రపతి పాలనను తొలగించబోమంటూ కేంద్రం నుంచి హామీ తీసుకున్న వైనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో మరో నాటకీయ మలుపు! రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం ఇచ్చిన సంచలన తీర్పుపై సుప్రీం కోర్టు ఈ నెల 27 వరకూ స్టే విధించింది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది. స్టే ఉత్తర్వులు జారీ చేసే ముందుగా.. కేసు తదుపరి విచారణ తేదీ వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం తొలగించబోదంటూ అటార్నీ జనరల్ ముకుల్‌రోహత్గీ హామీని ధర్మాసనం నమోదు చేసుకుంది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటుచ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని జస్టిస్ దీపక్‌మిశ్రా, శివకీర్తిసింగ్‌ల బెంచ్ శుక్రవారం మధ్యాహ్నం కిక్కిరిసిన కోర్టులో విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేలు, ఉత్తరాఖండ్‌లో రద్దయిన ప్రభుత్వ సీఎం హరీశ్‌రావత్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, కపిల్ సిబల్‌లు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలపై ఇరు పక్షాల వారూ ఆవేశంగా వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కేంద్రం తరఫు న్యాయవాదులు కోరారు. ‘తీర్పు ఇంకా అందనందున.. ఒక పక్షం సీఎంగా బాధ్యతలు చేపట్టటానికి సానుకూలంగా ఉంటూ.. మరొక పక్షాన్ని ప్రతికూల పరిస్థితిల్లోకి ఎలా నెట్టేస్తారు?’ అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించటమంటే రాష్ట్రపతి పాలన ప్రకటనను అమలు చేయటమే అవుతుందని రావత్, స్పీకర్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరు పక్షాలు తమ తమ వాదనలపై బలంగా పట్టుబట్టటంతో బెంచ్ స్పందిస్తూ.. తమది రాజ్యాంగ కోర్టు అయినందున తాము సమతుల్య దృష్టితో చూడాల్సి ఉంటుందని పేర్కొంది. హైకోర్టు తన తీర్పుపై సంతకాలు చేసి, ప్రతివాదులు అప్పీలు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచి ఉండాల్సింద పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రతులు కేసులో ఇరు పక్షాలకూ వెంటనే అందనందున.. ఈ నెల 27న తదుపరి విచారణ వరకూ ఆ తీర్పును నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 26 కల్లా తీర్పు ప్రతులను ఇరు పక్షాలకు అందించటంతో పాటు సుప్రీంకోర్టుకూ అందుబాటులో ఉంచాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు తీర్పు ప్రతినిఅధికారికంగా అందుకుని పరిశీలిస్తామని.. ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం ఎదుటకు వెళ్లే అవకాశముందని వివరించింది. రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సుప్రీం స్టే విధించటంతోగురువారం హైకోర్టు తీర్పుతో జరిగిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పునరుద్ధరణ రద్దయింది. మళ్లీ రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది. న్యాయవ్యవస్థపై పూర్తివిశ్వాసం: కాంగ్రెస్ న్యాయవ్వస్థపై తమకు పూర్తి విశ్వాసముందని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని మోదీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా, అక్రమంగా, ఏకపక్షంగా రద్దు చేసిందని, కోర్టు ఎదుట వాస్తవాలను ప్రవేశపెడతామని చెప్పింది. సుప్రీం తాజా ఉత్తర్వులు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించి అక్రమ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా అడ్డుకుందని రావత్ అన్నారు. సుప్రీంకోర్టు స్టే విధించకముందు.. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం అనుమతించాలన్నారు. రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య: వెంకయ్య ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య అని.. గవర్నర్ నివేదిక వచ్చిన తర్వాత శాసనసభను పునరుద్ధరించవచ్చునని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులను చేసిన తర్వాత.. ఏప్రిల్ 29న బలపరీక్ష నిర్వహించాలనటం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పు ప్రతులు కేంద్రం, గవర్నర్లకు అందకుముందే.. రావత్ తనకు తానుగా రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం బాధ్యతలు చేపట్టటం అక్రమమని బీజేపీ ఆరోపించింది. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని సుప్రీంకోర్టు స్టే నిలిపివేసిందని పేర్కొంది. -
సీఎం కుర్చీలో రావత్.. 11 అత్యవసర నిర్ణయాలు
డెహ్రాడూన్: రాష్ట్రపతి పాలనను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి హరీశ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఆయన ఆఘమేఘాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పన్నెండు నిర్ణయాలు తీసుకొని వాటిని శీఘ్రంగా అమలు చేయాలని ఆదేశించారు. వీటిలో నీటి సంక్షోభం అనే అంశం ప్రధానంగా ఉంది. రావత్ ఉత్తరాఖండ్ లో మెజారిటీ కోల్పోయారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే, తనకు కనీసం మెజార్టీ నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రపతి పాలన విధించారని హైకోర్టులో పిటిషన్ వేయగా దానిని విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. ఈ నెల 29న బల పరీక్షను ఎదుర్కోనున్నారు. -
కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాష్ట్రపతి పాలన రద్దు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు రద్దు చేసింది. 356 అధికరణంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగి తేలాయి. కేంద్ర ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశాయి. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని ఉద్ఘాటించాయి. కాగా, 29న హరీశ్ రావత్ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే.. 'ఉత్తరాఖండ్ లో తప్పుడు విధంగా రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఈ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి పరిపాలన అనేది అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే విధించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రజాప్రతినిధులను ఇలా అనూహ్యంగా తొలగించడమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బకొట్టడమే. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ఎంతో తొందరపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మెజారిటీ నిరూపించుకునేందుకు మరో రోజు ఉండగానే ఇలా త్వరత్వరగా రాష్ట్రపతి పాలన విధించడం అనేది కేంద్రం చేసిన అనాధికార కార్యక్రమంలాగా కనిపిస్తోంది' అని కోర్టు వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌లో సంబరాల కోలాహలం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీఎం హరీశ్ రావత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకొని టపాకాయలు కాల్చారు. పలువురు పత్రికా ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత హృదయేష్ స్పందిస్తూ మరోసారి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడిన మన న్యాయ వ్యవస్థకు నా సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించారు. 29న బల పరీక్ష హైకోర్టు తీర్పు నేపధ్యంలో హరీశ్ రావత్ కు మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 29న ఆయన బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఇప్పటికే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు బీజేపీతో చేతులు కలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పెద్దలు సమీక్షలు జరిపి బలపరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్రపతి నిర్ణయాన్నీ సమీక్షించొచ్చు
రాష్ట్రపతి పాలనపై ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్య ♦ ఒక్కోసారి రాష్ట్రపతి నిర్ణయం కూడా పొరపాటు కావచ్చు ♦ రాష్ట్రపతి పాలన ఎత్తేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు ♦ తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశం నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేసి తమను రెచ్చగొట్టవద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువరించే వరకూ దానిని ఎత్తివేయొద్దని బుధవారం ఆదేశించింది. కోర్టు తీర్పు ఇవ్వక ముందే లేదా తీర్పును రిజర్వు చేయడానికి ముందే ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం అసెంబ్లీని సస్పెండ్ చేయాలన్న రాష్ట్రపతి నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? లేదా? అనే అంశాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చని స్పష్టం చేసింది. ఒక్కోసారి రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కూడా పొరపాటు కావచ్చని, అందువల్ల దానిపై సమీక్ష జరపవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిస్త్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎన్డీఏ ప్రభుత్వ వాదనలను ప్రస్తావిస్తూ.. తన రాజకీయ విజ్ఞతతో ఆర్టికల్ 356 విధింపుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఎవరైనా తప్పులు చేయొచ్చు.. అది రాష్ట్రపతి అయినా కావచ్చు లేదా జడ్జీలైనా కావచ్చు’ అని అన్నారు. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రావత్ తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తీర్పు వెలువడక ముందే లేదా రిజర్వ్ చేయడానికి ముందే రాష్ట్రపతి పాలన ఎత్తివేయకుండా.. అలాగే ప్రతిపక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా చూడాలని కోర్టును కోరారు. కోర్టు త్వరితగతిన తీర్పు వెలువరించేలా కేంద్రం ఎటువంటి కుట్రలు పన్నకుండా చూడాలని విన్నవించారు. అయితే కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడానికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బీమ్‌లాల్ ఆర్యాపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పక్కన పెట్టారన్న కేంద్ర ఆరోపణలపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏప్రిల్ 5న అనర్హత ఫిర్యాదు ఎందుకు చేశారు? మీరు స్పీకర్‌పై దారుణమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం పనిచేసేది ఇలాగేనా? దీని గురించి కేంద్రం ఏం చెబుతుంది. దీనిని అంత తేలిగ్గా తీసుకోవడం సాధ్యం కాదు. దీనిపై మేము దృష్టి పెట్టాం’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి తాను ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని గురువారం కోర్టుకు వివరిస్తామని ఏఎస్జీ మెహతా చెప్పారు. దీంతో కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా గురువారం కోర్టు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. -
ఉత్తరాఖండ్‌లో 31న బలపరీక్ష
హైకోర్టు తీర్పు ♦ అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలకూ ఓటువేసే అవకాశం ♦ కేంద్రానికి ఎదురుదెబ్బ; తీర్పును సవాల్‌చేసే యోచన నైనిటాల్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కొత్త మలుపు. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేలా హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండు రోజులకే ఉత్తరాఖండ్ హైకోర్టు ఈనెల 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మంగళవారం ఆదేశించింది. అలాగే, అనర్హత వేటుపడ్డ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ ఓటు వేసేందుకు అనుమతించింది. అయితే వారి ఓట్లను విడిగా ఉంచాలని, వీరి అనర్హతను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పును బట్టి వాటిపై నిర్ణయం ఉంటుందని చెప్పింది. రాష్ట్రపతి పాలనను సవాల్‌చేస్తూ పదవీచ్యుత సీఎం హరీశ్‌రావత్ దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్ యూసీ ధ్యాని వరుసగా రెండోరోజూ వాదనలు విన్నారు. బలపరీక్ష సజావుగా జరిగేందుకు ఆ రోజు అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని డీజీపీని ఆదేశించారు. విశ్వాసపరీక్ష నిర్వహించాలని ఆదేశించినప్పటికీ, రాష్ట్రపతి పాలనపై స్టే విధించారా లేదా అన్నదానిపైనా, రద్దయిన రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించారా లేదా అన్న విషయాలపైనా స్పష్టత లేదు. తొలుత గవర్నర్ విశ్వాసపరీక్షకు ఈనెల 28ని ఖరారుచేయగా, దాని కంటే ఒకరోజు ముందు కేంద్రం రాష్ర్టపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై కేంద్రం బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసే అవకాశముంది. అలాగే, అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు అనుమతించడంపై కాంగ్రెస్ కూడా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలనే యోచనలో ఉంది. రావత్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నిర్హేతుకంగా విధించిన రాష్ట్రపతి పాలనను తక్షణమే రద్దు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వాదనలను కోర్టు అంగీకరించిందని, రాష్ట్రపతి పాలన విధించకుండా విశ్వాస పరీక్ష నిర్వహించడానికి అవకాశముందని పేర్కొందని సింఘ్వీ మీడియాకు చెప్పారు. కేవలం బేరసారాల ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి పాలన విధించలేరని, బల పరీక్షనూ ఆపలేరన్నారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను ఓటు వేసేందుకు అనుమతించడంపై సింఘ్వీ మాట్లాడుతూ, వారి అనర్హత రద్దు అయితే తప్ప వారి ఓట్లు చెల్లుబాటు కావని చెప్పారు. వారికి ఎదురుదెబ్బ: రావత్ కోర్టు తీర్పును హరీశ్ రావత్ స్వాగతించారు. నిరంకుశ పాలనను తేవడానికి యత్నిస్తున్న కేంద్రానికి ఇది ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. అలాగే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేయాలన్న వారి యత్నాలను ఈ తీర్పు అడ్డుకుంటుందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిందని, దీన్ని కేంద్రం అడ్డుకుంటే 24 గంటలపాటు నిరశన దీక్ష చేపడతానని చెప్పారు. తమకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ చెబుతోంది. తమ పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలతోపాటు 6 మంది పీడీఎఫ్ మ్మెల్యేలు, ఒక బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పింది. -
కాంగ్రెస్ రెబల్స్‌పై వేటు
♦ ఉత్తరాఖండ్ సీఎం రావత్ శిబిరానికి ఊరట కలిగించిన స్పీకర్ ♦ రాత్రి అత్యవసరంగా సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ♦ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలపై చర్చ ♦ కేంద్రానికి నివేదిక పంపించిన గవర్నర్ ♦ సీఎం హరీశ్‌పై ‘స్టింగ్’ వీడియో విడుదల చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ♦ విశ్వాస పరీక్షకు ముందు మారుతున్న రాజకీయం న్యూఢిల్లీ/ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. శనివారం ఉదయం రెబల్ ఎమ్మెల్యేలు సీఎం హరీశ్ రావత్‌పై ‘స్టింగ్’ ఆపరేషన్ వీడియో విడుదల చేయగా.. రాత్రికల్లా ఆ తొమ్మిది మందిపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసేశారు. అంతకుముందే రాష్ట్ర గవర్నర్ కేకే పాల్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో పరిణామాలపై తన నివేదికను పంపించారు. అస్సాం ప్రచారానికి వెళ్లి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ అత్యవసరంగా తన మంత్రిమండలితో సమావేశమై గవర్నర్ నివేదికపై చర్చించారు. ఓపక్క కేబినెట్ సమావేశం జరుగుతుండగానే.. కాంగ్రెస్ ప్రతినిధి అంబికాసోనీ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మోదీ సర్కారు కూటనీతిని అనుసరిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బట్టబయలయ్యాయని ఆమె విమర్శించారు. రెబల్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నారని.. అయినా ఏదో జరిగినట్లు బీజేపీ రాద్ధాంతం చేస్తోందని ఆమె మండిపడ్డారు. గవర్నర్ నివేదికపై రాత్రి పొద్దుపోయేదాకా చర్చించిన కేంద్ర మంత్రి మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారన్న వార్తలు సశేషంగానే నిలిచిపోయాయి. అయితే దీనిపై ఆదివారం కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, కేంద్ర మంత్రిమండలి సమావేశం కొనసాగుతున్న సమయంలోనే డెహ్రాడూన్‌లో అసెంబ్లీ స్పీకర్ 9మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం నాటి విశ్వాస పరీక్షకు సీఎం రావత్‌కు పెద్ద ఊరట లభించినట్లయిది. వేటు తర్వాత ప్రొగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ సాయంతో కాంగ్రెస్‌కు కావాల్సిన బల నిరూపణ (మ్యాజిక్ ఫిగర్ 32)ను తేలిగ్గా చేరుకోనుంది. అంతకుముందు శనివారం మధ్యాహ్నం తిరుగుబాటు చేసిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సీఎం హరీశ్ రావత్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి అసెంబ్లీలోనే బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని ఆధారాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా నాటకీయ పరిణామాల మధ్యన స్పీకర్ వీరిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. సీఎంపైనే స్టింగ్ ఆపరేషన్..: శనివారం ఉదయం తిరుగుబాటు ఎమ్మెల్యేలు సీఎం హరీశ్ రావత్‌పైనే అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ వీడియో క్లిప్ మీడియాకు విడుదల చేశారు. విశ్వాస పరీక్షకు సహకరించాలంటూ సీఎం రావత్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసినట్లు ఈ వీడియో క్లిప్‌లో ఉండటం సంచలనం సృష్టించింది. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రావత్ పక్షాన నిలిచింది. సదరు వీడియో నకిలీదంటూ రావత్ ఖండించారు. ఉత్తరాఖండ్‌లో బలాబలాలు: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 71 సీట్లున్నాయి. ఇందులో సాధారణ మెజారిటీకి కావాల్సిన 36 సీట్లు సరిగ్గా కాంగ్రెస్‌కున్నాయి. బీజేపీకి 28 స్థానాలు, స్వతంత్రులకు 6 స్థానాలుండగా.. ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటంతో కాంగ్రెస్ బలం 27కు పడిపోయింది. ఈ సమయంలో విశ్వాస పరీక్ష ఎదుర్కుంటే ఓటమి తప్పదు. దీంతో తొమ్మిది మందిపై అనర్హత వేటు వేయటం ద్వారా 61 సీట్లకు గానూ.. బల నిరూపణకు 32 సీట్లు కాంగ్రెస్‌కు అవసరం. అయితే ఆరుగురు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం కలిపితే.. కాంగ్రెస్ ఖాతాలో 33 సీట్లు ఉంటాయి. కాబట్టి మెజారిటీ చేరుకోవచ్చనేది అధికార పార్టీ వ్యూహం. -
రాష్ట్రపతి వద్దకు ఉత్తరాఖండ్ పంచాయితీ
ప్రణబ్‌ను కలసిన బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులు ♦ కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం కుమారుడి బహిష్కరణ డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ పంచాయితీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధుల బృందాలు సోమవారం ప్రణబ్ ముఖర్జీని కలసి తమ వాదన లను వినిపించాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలు కలసి రావత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నాయని ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. గులాం నబీ ఆజాద్, మోతీలాల్ వోరా, అంబికా సోనీ, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్‌లు కూడా రాష్ట్రపతిని కలసిన బృందంలో ఉన్నారు. అంతకుముందు కైలాస్ విజయ్‌వర్గీయ నేతృత్వంలోని బీజేపీ బృందం రావత్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రణబ్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ రద్దుతో పాటు మెజార్టీ నిరూపణకు తమకు సమయమిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలంటూ రాష్ట్రపతిని కోరామని విలేకరులకు కైలాస్ తెలిపారు. అసెంబ్లీలో తమకు 36 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, సీఎంగా కొనసాగేందుకు రావత్‌కు ఎలాంటి నైతిక అర్హత లేదన్నారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తమ బృందంతో కలసి రాష్ట్రపతి వద్దకు వెళ్లలేదని, వారు ఆయనను విడిగా కలుస్తారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. విజయ్ బహుగుణ కుమారుడిపై వేటు మాజీ సీఎం విజయ్ బహుగుణ కుమారుడు సాకేత్‌తోపాటు జాయింట్ సెక్రటరీ అనిల్ గుప్తాలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం వేటు వేసింది. వార్తాపత్రికల్లో వచ్చిన వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని వారిద్దరిని సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ సంఘం పీసీసీకి సిఫార్సు చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ చెప్పారు. సిఫార్సుల్ని పరిగణనలోకి తీసుకుని సాకేత్, అనిల్‌ను ఆరేళ్లు బహిష్కరించామని తెలిపారు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీఎం హరీష్ రావత్ సోమవారం ఆరోపించారు. డబ్బు, అధికార బలంతో చిన్న రాష్ట్రంలో అనిశ్చితికి ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. ప్రతి ఏడాది కొత్త ముఖ్యమంత్రి రావడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదన్నారు. హరీష్ రావత్ సీఎంగా కొనసాగడం ముఖ్యంకాదని, ఉత్తరాఖండ్ అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం అవసరమని చెప్పారు. రాష్ట్రంలోని మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికే మైనింగ్, భూ మాఫియాతో ప్రభుత్వం కుమ్మక్కయ్యిదంటూ బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని రావత్ విమర్శించారు. స్పీకర్ తీరు అభ్యంతరకరం: బీజేపీ ఆర్థిక బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రావత్ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని, తక్షణం కాంగ్రెస్ సర్కారును రద్దుచేయాలని ఉత్తరాఖండ్ బీజేపీ డిమాండ్ చేసింది. బిల్లుపై ఓటింగ్ సమయంలో డివిజన్ కోరినా స్పీకర్ పట్టించుకోలేదని, సీఎంకు ప్రతినిధిలా ఆయన వ్యవహరిస్తున్నారని పార్టీ ప్రతినిధి మున్నాసింగ్ చౌహాన్ సోమవారం ఆరోపించారు. సభను నడిపించే నైతిక అర్హత స్పీకర్‌కు లేదని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ సర్కారును కేంద్ర బీజేపీ నేతలు అస్తిరపరుస్తున్నారన్న ఆరోపణలు సరికాదని, పార్టీలో విభేదాల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిరంకుశ, అహంకార ధోరణివల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీపై విశ్వాసం కోల్పోయారని చెప్పారు. 35 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చాక... విప్ ధిక్కరించారంటూ కాంగ్రెస్ రెబెల్‌కు నోటీసులు జారీచేయడం చట్టవిరుద్ధమన్నారు. -
28లోపు మెజారిటీ చూపండి!
♦ సీఎం రావత్‌కు గవర్నర్ పాల్ ఆదేశం ♦ బల నిరూపణపై రావత్ ధీమా డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందన్న బీజేపీ వాదన నేపథ్యంలో.. మార్చి 28 లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం హరీశ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆదేశించారు. బడ్జెట్‌పై ఓటింగ్ సందర్భంగా శుక్రవారం 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి సభలో ధర్నా చేయడం, అనంతరం గవర్నర్‌ను కలసిన బీజేపీ ప్రతినిధి బృందం మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. దాంతో మెజారిటీని నిరూపించుకోవాలని శనివారం గవర్నర్ కేకే పాల్ ..రావత్‌కు లేఖ రాశారు. గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు సీఎం రాజ్‌భవన్‌కు వచ్చేముందే ఈ లేఖను సీఎం ఆఫీసుకు పంపారు. ఈ లేఖతో అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించి, తిరిగి వారి మద్దతును కూడగట్టేందుకు రావత్‌కు పది రోజుల సమయం లభించింది. కాగా, రెబల్ ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌ను కానీ, సీఎల్పీని కానీ వీడలేదని, తన ప్రభుత్వం మెజారిటీలోనే ఉందని, అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నానని రావత్ ధీమా వ్యక్తం చేశారు. రెబల్స్‌లో ఐదుగురు తనవైపే ఉన్నారన్నారు. 35 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ బీజేపీ అబద్ధమాడుతోందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలుంటాయని స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాలా స్పష్టం చేశారు. మరోవైపు, స్పీకర్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో పాటు, రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రావత్ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నందువల్ల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ శ్యామ్ జాజు డిమాండ్ చేశారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో తమకు అందుబాటులోనే ఉన్నారని, తమకు మద్ధతిస్తున్న ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు హాజరు పర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.శారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్‌కు 36 మంది సభ్యులుండగా, బీజేపీ సభ్యులు 28 మంది ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరత పాల్జే సేందుకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. -
ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో సంక్షోభం
ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మైనారిటీలో సర్కారు! డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడింది. 9 మంది పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ కేకే పాల్‌ను కలిసి.. సీఎం హరీశ్ రావత్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, దాన్ని డిస్మిస్ చేయాలని కోరారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు రాజ్‌భవన్ వర్గాల సమాచారం. 70 మంది సభ్యుల అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌కు 36 మంది సభ్యులున్నారు. ఆరుగురు సభ్యుల డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా రావత్ ప్రభుత్వానికి మద్దస్తోంది. బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌లోని 9 మంది రెబల్స్‌తో సర్కారు మైనారిటీలో పడింది. కాగా, బడ్జెట్‌పై ఓటింగ్‌కు బీజేపీ సభ్యులతో కలిసి కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగారు. ఈ గందరగోళం మధ్యనే సభ బడ్జెట్‌ను ఆమోదించింది. -
హోదాతోనే అభివృద్ధిలో పోటీ
ఏపీకి కూడా సాధించుకోండి మేమూ మద్దతిస్తాం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో ఉత్తరాఖండ్ సీఎం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాతోనే ఉత్తరాఖండ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి స్పష్టం చేశారు. రెవెన్యూ లోటు కారణంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతోనే త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉందని లేకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. హోదా సాధించుకునే విషయంలో తాము కూడా పూర్తి మద్ధతు ఇస్తామని హామీ ఇచ్చారు. హిమాలయాలనుంచి తిరిగి వస్తూ రఘువీరారెడ్డి శుక్రవారం డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ సీఎం తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా అమలుతోనే విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు వచ్చాయన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ అప్పట్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలోనే తీర్మానించామని ఆ విషయంలో ఏపీకి సంపూ ర్ణ మద్దతిస్తామని రఘువీరాకు ముఖ్యమంత్రి రావత్ స్పష్టమైన హామీ ఇచ్చారు.