ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మైనారిటీలో సర్కారు!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడింది. 9 మంది పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ కేకే పాల్‌ను కలిసి.. సీఎం హరీశ్ రావత్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, దాన్ని డిస్మిస్ చేయాలని కోరారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు రాజ్‌భవన్ వర్గాల సమాచారం.
70 మంది సభ్యుల అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌కు 36 మంది సభ్యులున్నారు. ఆరుగురు సభ్యుల డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా రావత్ ప్రభుత్వానికి మద్దస్తోంది. బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌లోని 9 మంది రెబల్స్‌తో సర్కారు మైనారిటీలో పడింది. కాగా, బడ్జెట్‌పై ఓటింగ్‌కు బీజేపీ సభ్యులతో కలిసి కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద ధర్నాకు దిగారు. ఈ గందరగోళం మధ్యనే సభ బడ్జెట్‌ను ఆమోదించింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో సంక్షోభం
Published Sat, Mar 19 2016 1:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement