![Police Fined Bjp Mla For Writing Chowkidar On His Car - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/26/chouk.jpg.webp?itok=yH45vJMr)
చౌకీదార్ అని రాసున్న బీజేపీ ఎమ్మెల్యే రాందాంగోర్ వాహనం
సాక్షి, భోపాల్: వాహనం నంబర్ ప్లేట్‌పై చౌకీదార్ అని రాసి ఉన్నందుకు పోలీసులు ఎమ్మెల్యేకు చలాన్ విధించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మై భీ చౌకీదార్’ అనే నినాదాన్ని ఈ మధ్య బాగా పాపులర్ చేసింది. అయితే ఈ నినాదానికి తనపేరును కూడా జోడించి చౌకీదార్ పంధాన అని సొంత కార్ నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందాంగోర్.
బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఖండ్వా ఎమ్మెల్యే నందకుమార్ సింగ్‌ను కలవడంతోపాటు పట్టణంలో రంగులపంచమికి హాజరవడానికి రాందాంగోర్ వచ్చారు. ఉత్సవ సమయం కావడంతో పోలీసులు కొన్నిచోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే రాందాంగోర్ వాహనాన్ని రోడ్డుపై వెళ్తున్నప్పుడు నెంబర్ ప్లేట్‌ను చూసిన పోలీసులు.. వాహనాన్ని ఆపి నెంబర్ ప్లేట్ చట్టం ప్రకారం ఫైన్ విధించారు. చలాన్ వివరాలను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. తాను ఎటువంటి అతిక్రమణలకు పాల్పడలేదని, పోలీసుల ఫైన్ విధింపులో కాంగ్రెస్ కుట్ర దాగుందని ఎమ్మెల్యే రాందాంగోర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment