28లోపు మెజారిటీ చూపండి! | 28 Within the majority of the Show! | Sakshi
Sakshi News home page

28లోపు మెజారిటీ చూపండి!

Published Sun, Mar 20 2016 3:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

28లోపు మెజారిటీ చూపండి! - Sakshi

28లోపు మెజారిటీ చూపండి!

♦ సీఎం రావత్‌కు గవర్నర్ పాల్ ఆదేశం
♦ బల నిరూపణపై రావత్ ధీమా
 
 డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందన్న బీజేపీ వాదన నేపథ్యంలో.. మార్చి 28 లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం హరీశ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆదేశించారు. బడ్జెట్‌పై ఓటింగ్ సందర్భంగా శుక్రవారం 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి సభలో ధర్నా చేయడం, అనంతరం గవర్నర్‌ను కలసిన బీజేపీ ప్రతినిధి బృందం మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. దాంతో మెజారిటీని నిరూపించుకోవాలని శనివారం గవర్నర్ కేకే పాల్ ..రావత్‌కు లేఖ రాశారు.

గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు సీఎం రాజ్‌భవన్‌కు వచ్చేముందే ఈ లేఖను సీఎం ఆఫీసుకు పంపారు.  ఈ లేఖతో అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించి, తిరిగి వారి మద్దతును కూడగట్టేందుకు రావత్‌కు పది రోజుల సమయం లభించింది. కాగా, రెబల్ ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌ను కానీ, సీఎల్పీని కానీ వీడలేదని, తన ప్రభుత్వం మెజారిటీలోనే ఉందని, అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నానని  రావత్ ధీమా వ్యక్తం చేశారు. రెబల్స్‌లో ఐదుగురు తనవైపే ఉన్నారన్నారు. 35 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ బీజేపీ అబద్ధమాడుతోందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలుంటాయని స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాలా స్పష్టం చేశారు.

మరోవైపు, స్పీకర్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో పాటు, రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రావత్ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నందువల్ల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ శ్యామ్ జాజు డిమాండ్ చేశారు. 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో తమకు అందుబాటులోనే ఉన్నారని, తమకు మద్ధతిస్తున్న ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు హాజరు పర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.శారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్‌కు 36 మంది సభ్యులుండగా, బీజేపీ సభ్యులు 28 మంది ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరత పాల్జే సేందుకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement