ఆ సీడీలో నేనే: రావత్ | Me itslef in that CD sayes Rawat | Sakshi
Sakshi News home page

ఆ సీడీలో నేనే: రావత్

Published Mon, May 2 2016 1:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆ సీడీలో నేనే: రావత్ - Sakshi

ఆ సీడీలో నేనే: రావత్

డెహ్రాడూన్: తనపై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీ నకిలీదన్న  ఉత్తరాఖండ్ పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ ఆ వీడియోలో ఉన్నది తనేనని ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలకు డబ్బు లేదా ఇతర సాయంపై సీడీలో ఆధారాలుంటే ప్రజల సమక్షంలో ఉరికి సిద్ధమని ఆవేశంగా మాట్లాడారు. దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాకు సవాల్ విసిరారు. క్లాక్‌టవర్ వద్ద తనను ఉరితీయాలని ఆదివారమిక్కడ అన్నారు.

‘విలేకరితో లేదా ఎమ్మెల్యేతో భేటీ నేరమా? వీడియోలో చూపిన సంభాషణలు అర్థరహితంగా ఉన్నాయి. అప్పటికి అనర్హతకు గురవ్వని ఎమ్మెల్యేతో మాట్లాడటం తప్పెలా అవుతుంది?’ అని అన్నా ఎవరైనా సరే ఎందుకు తన కోసం రూ.15 కోట్లు ఖర్చుపెట్టాలి? విలేకరి తనతో ఏదో మాట్లాడగా.. తాను దానికి సమాధానమిచ్చానని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ సీడీని ఒక ప్రైవేట్ వార్తా చానల్ చీఫ్ ఎడిటర్ తయారుచేయించారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement