
'సీఎం ఒత్తిడి చేస్తేనే రేప్ ఆరోపణలు చేశా'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. కుట్రలు చేసే వ్యక్తులకు అధికారంలో ఉండే హక్కు లేదని మండిపడింది. తనపై బీజేపీ నేత హరక్ సింగ్ రావత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, అదే మహిళ ప్లేటు ఫిరాయించి తాను ముఖ్యమంత్రి రావత్ ఒత్తిడి చేస్తేనే అలా తప్పుడు కేసు పెట్టానంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. దీంతో బీజేపీ నేతలు రావత్ రాజీనామాకు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 'హరీశ్ రావత్కు అధికారంలో ఉండే నైతిక హక్కును కోల్పోయాడు. ఒక మహిళను బెదిరించి, ఆమెను కష్టాలుపాలు చేస్తామని హెచ్చరించి తప్పుడు కేసు పెట్టించారు. అలాంటి వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే హక్కు ఏమాత్రం లేదు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ అన్నారు.