బీజేపీలో చేరిన ప్రముఖ నటి | Actress Himani Shivpuri joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ప్రముఖ నటి

Published Thu, Dec 1 2016 3:35 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

బీజేపీలో చేరిన ప్రముఖ నటి - Sakshi

బీజేపీలో చేరిన ప్రముఖ నటి

డెహ్రడూన్‌: బాలీవుడ్‌ సీనియర్‌ నటి హిమాని శివపురి గురువారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఉత్తరాఖండ్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్యోతి ప్రసాద్‌ గైరోలా సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా హిమాని శివపురి మాట్లాడుతూ.. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు.

ఉత్తరాఖండ్‌ కు చెందిన హిమాని బాలీవుడ్‌ లో సహాయ నటిగా గుర్తింపు పొందారు. 1984లో వచ్చిన ‘ఆబ్‌ ఆయేగా మజా’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. రాజా, పరదేశ్‌, హీరో నంబర్ వన్‌, కోయలా, బంధన్‌, దీవానా మస్తానా, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, ఉమ్రావ్‌ జాన్‌ తదితర చిత్రాల్లో కనిపించారు. పలు హిందీ సీరియల్స్‌ లోనూ వివిధ పాత్రలు పోషించారు. ఆమెకు కత్యాయన్‌ అనే కుమారుడు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement