
ఇండోర్ : బాలీవుడ్ చిత్రం పద్మావతి విడుదలకు ముందే వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా ఈ చిత్రంపై ఉజ్జయిని బీజేపీ ఎంపీ చింతమని మణివీయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కథాంశాలన్ని ఇష్టారీతిగా మారుస్తున్న బాలీవుడ్ దర్శకులు.. తమ భార్యలను కూడా ఇలాగే మార్చుకుంటారా? అంటూ అత్యంత తీవ్ర పదజాలంతో ఆయన విమర్శలకు దిగారు. నాకు ఇప్పటికీ ‘జుహార్’ అంటే అర్థం తెలియడం లేదని ఆయన చెప్పారు.
పద్మావతి చిత్రాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సినిమా పరిభాషలోనే మాట్లాడాలంటే.. ఒకరి భార్య.. మరొకరితో సినిమాకు వెళితో ఎంత దారుణంగా ఉంటుందో.. జుహార్‌కు అర్థం వెతకడం అంతే దారుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. మా చరిత్రను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే.. వారికి చేతులతోనే సమాధానం చెబుతామని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment