Top Stories
ప్రధాన వార్తలు

ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్
అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నాళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బచ్ లు బుధవారం భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది. That’s good to hear! #SunitaWilliams returns to earth 🌎 https://t.co/RGUUmJh6lQ— Samina Shaikh 🇮🇳 (@saminaUFshaikh) March 16, 2025

మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
సాక్షి,విజయవాడ : కూటమి ప్రభుత్వం అమరావతి కోసం రూ.11 వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు మొత్తాన్ని మొత్తం అప్పు అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టనుంది.ఇక,రూ.11 వేల కోట్ల అప్పు కోసం హాడ్కోతో సీఆర్డీఏ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఋణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది. రూ. 11 వేల కోట్లను అమరావతిలో పనులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? పెట్రోల్ బైక్ కొనాలా? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కథనంలో దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ బైక్స్ప్రస్తుతం మార్కెట్లో దాదాపు ప్రతి కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైకులకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అంతే కాకుండా ఇవి పర్యావరణ హితం కూడా. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి విడుదల చేయవు.ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం అయాన్ పాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఎక్కువ మన్నికను ఇస్తాను. సంస్థలు కూడా ఈ బ్యాటరీలపైన మంచి వారంటీ కూడా అందిస్తాయి. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా.. శిలాజ ఇంధన వినియోగం మాత్రమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.ఇదీ చదవండి: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులుపెట్రోల్ బైక్స్చాలా కాలంగా ఎక్కువమంది పెట్రోల్ బైకులనే ఉపయోగిస్తున్నారు. ఇంధనం అయిపోగానే.. వెంటనే ఫిల్ చేసుకోవడానికి లేదా నింపుకోవడానికి పెట్రోల్ బంకులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ పెట్రోల్ బైకులకు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది పెట్రోల్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. పనితీరు పరంగా కూడా పెట్రోల్ బైకులు.. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఉత్తమంగా ఉంటాయి.ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ కొనుగోలు చేయకపోవడానికి కారణంఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది పెట్రోల్ బైక్స్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం అనే తెలుస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఛార్జింగ్ మధ్యలోనే ఖాళీ అవుతుందేమో అనే భయం కూడా ఎక్కువమంది కొనుగోలు చేయకపోవడానికి కారణం అనే చెప్పాలి.

బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్‌ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్‌లోనే సేద తీరిన విరాట్.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్లో విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్

‘సీఎం రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేఎల్పీ కార్యాలయం నుంచి మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం.. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారు.శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటిలకే చట్టబద్ధత లేకుండా పోయింది. సభ ఇంకా కొనసాగుతోంది. 6 గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా?, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలి. రుణమాఫీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. నిర్మల్ లో ఏ గ్రామానికి వెళ్లినా సరే.. రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమే. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్ మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు. లంకె బిందెల కోసమా?, మీ ఆస్థాన గుత్తేదారుల ప్రాజెక్టులకు రీ ఎస్టిమేషన్ వేసి ఇస్తున్న మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా?, వారి జేబులు నింపే శ్రద్ధ పేదలకు మంచి చేసేందుకు పట్టింపు లేదా?, కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి దానిపై చర్చ డైవర్ట్ చేస్తున్నారు. మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదంటే ఎలా?, కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశాడో రికార్డులు ఉన్నాయని రేవంత్ అన్నారు.. వాటిని బయట పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి?’ అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి.

‘అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం’
సాక్షి, వరంగల్ : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంచనాల మేరకు రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించారు. కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. అది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా 15 నెలల్లో రూ. 58 లక్షల జీతం తీసుకున్నారు.ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్,హరీష్ రావు చర్చకు రావాలి. ఎనిటైం. ఏ ప్రాజెక్ట్ దగ్గరైనా చర్చకు రెడీ. రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్.త్యాగాలు చేసిన వారు జాతిపితలు అవుతారు’అని పునరుద్ఘాటించారు. సభలో రేవంత్ అసహనంజనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. నిరుద్యోగులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలను చూసిన రేవంత్.. చూశాను ఇక దించండి అంటూ అసహనానికి లోనయ్యారు. దీంతో నిరుద్యోగులు ఫ్లెక్సీలను దించడంతో రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఆయన త్వరగా కోలుకోవాలి.. దయచేసి నన్ను అలా పిలవొద్దు: సైరా భాను
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. గతేడాది చివర్లో తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. దాదాపు 28 ఏళ్ల తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి పాలయ్యారు. డీ హైడ్రేషన్‌కు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్ఛార్డ్ అయ్యారు.తాజాగా ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఆయన భార్య సైరా భాను ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నానని తెలిపారు. ఆయనకు ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు నాకు తెలిసింది.. ఆ దేవుడి ఆశీర్వాదంతో ప్రస్తుతం బాగానే ఉన్నారని.. ఎవరూ కూడా ఆందోళనకు గురి కావొద్దని అభిమానులను కోరారు. అయితే మేమిద్దరం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని అన్నారు. కేవలం నా ఆరోగ్య సమస్యల కారణంగానే విడిపోయామని.. గత రెండేళ్లుగా నా పరిస్థితి బాగాలేదని పేర్కొన్నారు. నా వల్ల ఆయనకు అదనపు ఒత్తిడిని గురి చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని.. అందువల్ల తనను మాజీ భార్య అని పిలవవద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేసింది.కాగా.. ఏఆర్ రెహమాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. సైరా తరపు లాయర్ వందనా షా ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు.రెహమాన్ సినీ ప్రయాణంఏఆర్ రెహమాన్.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్-బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు.

‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్‌లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్‌కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్‌జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్‌జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్‌జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్ఆర్సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

ఘోర అగ్ని ప్రమదం.. 51 మంది దుర్మరణం!
నార్త్ మెసీడోనియా: యూరప్ లోని నార్త్ మెసీడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు 51 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో గాయాలబారిన పడ్డారు. కోకానిలో ఉన నైట్ క్లబ్ లో ఓ కార్యక్రమం నిమిత్తం భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మెసీడోనియా పాప్ గ్రూప్ డీఎన్ కే ప్రొగ్రామ్ ఉండటంతో అభిమానులు భారీ ఎత్తున నైట్ క్లబ్ కు వచ్చారు. అయితే నైట్ క్లబ్ లో ఉన్న మందుగుండ సామాగ్రి అంటుకుని మంటలు వ్యాపించాయి. అక్కడకు వచ్చిన వారు తేరుకునే లోపు పలువురు మంటలకు ఆహుతయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన డీఎన్ కే పాప్ గ్రూప్ కు అధిక సంఖ్యలో యువత ఫ్యాన్స్ గా ఉన్నారు. డీఎన్ కే ఎక్కడ షో చేసినా యువతే అధికంగా హాజరవుతారు. ఈ క్రమంలోనే తాజా షోకు కూడా యువత ఎక్కువగా హాజరయ్యారని నార్త్ మెసీడోనియా న్యూస్ ఏజెన్నీ ఎమ్ఐఏ స్పష్టం చేసింది.

IPL 2025: విధ్వంసం సృష్టించిన రింకూ సింగ్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఫామ్‌లోకి వచ్చాడు. నిన్న (మార్చి 15) జరిగిన కేకేఆర్ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 33 బంతులు ఎదుర్కొని 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహించిన టీమ్ పర్పుల్ టీమ్ గోల్డ్‌పై విజయం సాధించింది.ఐపీఎల్ ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్కాడ్ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కూడా ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. టీమ్ పర్పుల్‌కు అజింక్య రహానే.. టీమ్ గోల్డ్‌కు వెంకటేశ్ అయ్యర్ సారథ్యం వహించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ గోల్డ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (61) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. లవ్నిత్ సిసోడియా 46 పరుగులతో రాణించాడు.అనంతరం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ పర్పుల్.. రింకూ సింగ్ చెలరేగడంతో 15.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో విజయం సాధించాక కూడా మ్యాచ్‌ను కొనసాగించారు. రెండో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని కూడా టీమ్ పర్పుల్ మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మరో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఈసారి టీమ్ పర్పుల్ 280 పరుగుల లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో టీమ్ పర్పుల్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. టీమ్ పర్పుల్ ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్‌తో పాటు ఆండ్రీ రసెల్ (64 నాటౌట్), క్వింటన్ డికాక్ (52) చెలరేగిపోయారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్-2025 సీజన్లో కేకేఆర్ జర్నీ లీగ్ ఆరంభ రోజున (మార్చి 22) ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హెం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. గత సీజన్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ సన్‌నైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి, తమ మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విడిచిపెట్టాడు. మెగా వేలంలో శ్రేయస్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది. శ్రేయస్‌ను ఆ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. శ్రేయస్ వీడటంతో కేకేఆర్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. మెగా వేలంలో బేస్ ధర రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన అజింక్య రహానేను కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. తొలుత వెంకటేశ్ అయ్యర్‌నే కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో రహానే ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీని ఎగరేసుకుపోయాడు. మెగా వేలంలో రహానేను కేకేఆర్ తొలుత పట్టించుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్ల రౌండ్లో రహానేను కేకేఆర్ దక్కించుకుంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్
IPL 2025: టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
టీనేజీ బ్యూటీలా నమ్రత.. మైమరిపించేస్తున్న సంయుక్త
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
అఫీషియల్: అనుమానాల్లేవ్.. చెప్పిన టైంకే 'వార్ 2'
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్
రూ. 100 కోట్ల భూమికి ఎసరు.. ఎలా కనిపెట్టారంటే..?
పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?
రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?
మూడుసార్లు మిస్క్యారేజ్, కెరీర్‌కు నటి గుడ్‌బై.. ఇన్నాళ్లకు గుడ్‌న్యూస్
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల
వెంకటేష్‌తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.. సంఘంలో ఆదరణ
ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు
ఒక్కసారే రీచార్జ్.. ఏడాదంతా వ్యాలిడిటీ
తీరు మారని పాకిస్తాన్.. 91 పరుగులకే ఆలౌట్
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
మన పార్టీ వాళ్లను ఏ పార్టీ వాళ్లు చేర్చుకోరు... అది మన పార్టీ అదృష్టం!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
IPL 2025: టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
టీనేజీ బ్యూటీలా నమ్రత.. మైమరిపించేస్తున్న సంయుక్త
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
అఫీషియల్: అనుమానాల్లేవ్.. చెప్పిన టైంకే 'వార్ 2'
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్
రూ. 100 కోట్ల భూమికి ఎసరు.. ఎలా కనిపెట్టారంటే..?
పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?
రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?
మూడుసార్లు మిస్క్యారేజ్, కెరీర్‌కు నటి గుడ్‌బై.. ఇన్నాళ్లకు గుడ్‌న్యూస్
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల
వెంకటేష్‌తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.. సంఘంలో ఆదరణ
ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు
ఒక్కసారే రీచార్జ్.. ఏడాదంతా వ్యాలిడిటీ
తీరు మారని పాకిస్తాన్.. 91 పరుగులకే ఆలౌట్
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
మన పార్టీ వాళ్లను ఏ పార్టీ వాళ్లు చేర్చుకోరు... అది మన పార్టీ అదృష్టం!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సినిమా

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'మహాతల్లి'
మహాతల్లి జాహ్నవి దాసెట్టి (Jahnavi Dasetty) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. అది చూసిన స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా అయితే.. ఒక్కసారి మావయ్యా అనమ్మా అంటూ ఎమోషనల్ అయిపోయాడు. జాహ్నవి, సుశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది గర్భం దాల్చినట్లు వెల్లడించింది జాహ్నవి. అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీని వీడియోల రూపంలో షేర్ చేస్తూనే ఉంది. భర్తతో కలిసి ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంది.ఎవరీ జాహ్నవి?జాహ్నవి తెలుగమ్మాయి. నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఆమె మొదట్లో కొన్ని షార్ట్ ఫిలింస్ చేసింది. అలా మహాతల్లి- మహానుభావుడు అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ సిరీస్ ఏ రేంజ్లో క్లిక్ అయిందంటే జాహ్నవిని మహాతల్లిగానే జనాలు గుర్తుపెట్టేసుకున్నారు. ఇప్పటికీ అలాగే పిలుస్తారు. వెబ్ సిరీస్‌లు, సరదా వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో పాపులర్ అయింది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు కూడా చేసేది. లై, మెంటల్ మదిలో చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: ఎవర్నీ మోసం చేయకూడదు.. గుణపాఠం నేర్చుకున్నా..: కావ్యశ్రీ

వెంకటేష్‌తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రం చాలామంది చూసే ఉంటారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే, ఇందులో నేపాలి అమ్మాయిగా నటించిన టాప్ హీరోయిన్ 'వినీత' గుర్తుందా..? కథలో భాగంగా ఒకమారు వెంకటేష్ నేపాల్‌కు వెళ్లినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని ఆ నేపాలి అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆపై కథ అనేక మలుపులు తిరుగుతుంది. వినీత విషయానికి వస్తే.. 2003 వరకు సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఒక్కసారిగా చిత్రపరిశ్రమకు ఎందుకు దూరం అయింది..? మళ్లీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుందా..?ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు 'వినీత' పేరు బాగా పాపులర్. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో అక్కడి స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో మెప్పించింది. ఆపై మలయాళంలో కూడా మోహన్ లాల్ లాంటి హీరోతో నటించింది. ఆపై బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇలా వరుస విజయాలతో వెళ్తున్న వినీతకు 2003లో తగిలిన ఎదురుదెబ్బతో ఆమె ఇప్పటికీ కోలుకోలేదు. ఆ ఏడాదిలో కొందరి ఫిర్యాదుతో వినీతపై వ్యభిచారం కేసును పోలీసులు నమోదుచేశారు. తల్లి, సోదరుడితో కలిసి ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ, 2004లో ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు వెళ్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా కేసు నమోదు చేశారని కోర్టు తప్పుబట్టింది. ఆమెపై ఎటువంటి అభియోగాలు లేకుండా ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. అయతే, ఆమెకు జరగాల్సిన నష్టం అంతా ఇంతలోనే జరిగిపోయింది. విచారణ పేరుతో తనను మానసిక వేదనకు గురిచేశారని ఆ సమయంలో వినీత పేర్కొంది. సమాజంలో తన పేరును నాశనం చేసేలా పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె తెలిపింది. ఈ కేసు తర్వాత వినీతకు సినిమా ఛాన్సులు ఎవరూ ఇవ్వలేదు. తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినీ కెరీర్‌ను కావాలనే కొందరు నాశనం చేశారని ఆమె అభిమానులు పేర్కొన్నారు. సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఆమె చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పలు కథనాలు కూడా వచ్చాయి. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు పరిశ్రమకు దూరంగానే ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన రెండు, మూడు సినిమాల్లో మాత్రమే ఛాన్సులు వచ్చాయి. అవి కూడా సహాయక పాత్రలు మాత్రమే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన వినీత ఇలా చిన్న చిన్న పాత్రలలో ఆమె నటించడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే, వినీత ఇప్పుడు మరోసారి చిత్రపరిశ్రమలో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదురితే తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని ఆమె చూస్తున్నట్లు సమాచారం.

ఆయన త్వరగా కోలుకోవాలి.. దయచేసి నన్ను అలా పిలవొద్దు: సైరా భాను
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. గతేడాది చివర్లో తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. దాదాపు 28 ఏళ్ల తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి పాలయ్యారు. డీ హైడ్రేషన్‌కు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్ఛార్డ్ అయ్యారు.తాజాగా ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఆయన భార్య సైరా భాను ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నానని తెలిపారు. ఆయనకు ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు నాకు తెలిసింది.. ఆ దేవుడి ఆశీర్వాదంతో ప్రస్తుతం బాగానే ఉన్నారని.. ఎవరూ కూడా ఆందోళనకు గురి కావొద్దని అభిమానులను కోరారు. అయితే మేమిద్దరం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని అన్నారు. కేవలం నా ఆరోగ్య సమస్యల కారణంగానే విడిపోయామని.. గత రెండేళ్లుగా నా పరిస్థితి బాగాలేదని పేర్కొన్నారు. నా వల్ల ఆయనకు అదనపు ఒత్తిడిని గురి చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని.. అందువల్ల తనను మాజీ భార్య అని పిలవవద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేసింది.కాగా.. ఏఆర్ రెహమాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. సైరా తరపు లాయర్ వందనా షా ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు.రెహమాన్ సినీ ప్రయాణంఏఆర్ రెహమాన్.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్-బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు.

రష్మికను చూసి ఇబ్బంది పడ్డ శ్రీలీల.. ఎందుకో తెలుసా?
శ్రీలీల(Sreeleela).. గత కొంతకాలంగా టాలీవుడ్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఇది. ఒకవైపు స్టార్ హీరోలతో మరోవైపు యంగ్ స్టార్స్‌లో సినిమాలు చేస్తూ తెలుగు తెరపై దూసుకెళ్తోంది. అయితే ఈ టాలెంటెడ్ బ్యూటీ ఇటీవల తన దూకుడుని తగ్గించింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన చిత్రాలేవి రిలీజ్ కాలేదు. కానీ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూనే.. సడెన్‌గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌కి అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ పాట ఒప్పుకునేందుకు శ్రీలీల కాస్త వెనకడుకు వేసిందట. కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆలోచించిందట. కానీ డైరెక్టర్ సుకుమార్ నచ్చజెప్పి పాటకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పాట శ్రీలీల కెరీర్‌కి ప్లస్సే అయింది. అయితే ఈ పాట షూటింగ్ కోసం వెళ్లినప్పుడు సెట్లో రష్మిక(rashmika mandanna)ను చూసి శ్రీలీల భయపడిందట. ఆమెతో మాట్లాడేందుకు కాస్త సిగ్గు పడిందట. దానికి గల కారణం ఏంటో కూడా శ్రీలీల వివరించింది.శ్రీలీల హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంలో మొదట రష్మికను హీరోయిన్గా తీసుకున్నారు. కొంతవరకు షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆమె ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారు. పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలకు మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే పారితోషికం అందించిందట. ఈ ఒక్క పాటకే దాదాపు రూ. 2 కోట్లు అందించినట్లు సమాచారం.
న్యూస్ పాడ్‌కాస్ట్

బీఆర్ఎస్ నాయకుల స్టేచర్ గుండుసున్నా.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి ..రేవంత్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్... ‘ఈ సభ నీ సొంతం కాదు’ అన్నందుకు బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు

భారతదేశ కుటుంబంలో మారిషస్ ఒక అంతర్భాగం... ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ

కేసీఆర్‌ను గద్దె దింపిందీ నేనే. నాది సీఎం స్థాయి.. ఆయనది మాజీ సీఎం స్థాయి. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్‌కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు

వైఎస్ వివేకా కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూటమి సర్కారు కుతంత్రం. రంగన్న మరణాన్నీ వాడేసుకుంటున్న వైనం

ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ద్రోహం... స్త్రీనిధి సంస్థ నిధులకు ఎసరు

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై రాజీలేని పోరాటం కొనసాగించాలి... రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి... వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
క్రీడలు

శ్రీలంక కెప్టెన్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు! వీడియో వైరల్
ఆసియా లెజెండ్స్ లీగ్ 2025లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు తిసారా పెరీరా సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీలంక లయన్స్‌కు సారథ్యం వహిస్తున్న పెరీరా.. శనివారం ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.ఈ మ్యాచ్‌లో పెరీరా ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్పిన్నర్ అయాన్ ఖాన్ బౌలింగ్‌లో పెరీరా వరుసగా 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అయాన్ ఖాన్ తన ఓవర్‌ను వైడ్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత పెరీరా వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. మళ్లీ నాలుగో బంతిని అయన్ వైడ్‌గా సంధించాడు. మిగిలిన మూడు బంతులను కూడా పెరీరా సిక్సర్లగా మలిచాడు.35 బంతుల్లో సెంచరీ..ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పెరీరా.. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తిసారా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ మెవాన్ ఫెర్నాండోతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో పెరీరా కేవలం కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 36 బంతులు ఎదుర్కొన్న ఈ శ్రీలంక కెప్టెన్.. 2 ఫోర్లు, 13 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మెవాన్ ఫెర్నాండో(81) పరుగులతో రాణించాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగల్గింది. దీంతో అఫ్గాన్‌పై 26 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.కాగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన జాబితాలో తిసారా పెరీరాతో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, రవిశాస్త్రి, హర్షల్ గిబ్స్ ఉన్నారు.చదవండి: టెస్టు క్యాప్ పై '804' నెంబర్.. పాక్ ఆటగాడికి రూ. 4 కోట్లు జరిమానా!? Skipper on duty 🤩Thisara Perera's blistering 108* off 36 balls helped Sri Lankan Lions to put 230 on board 🔥#MPMSCAsianLegendsLeague pic.twitter.com/cE3Zw9rQJq— FanCode (@FanCode) March 15, 2025

టెస్టు క్యాప్ పై '804' నెంబర్.. పాక్ ఆటగాడికి రూ. 4 కోట్లు జరిమానా!?
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. తాము నిర్ధేశించిన నియమాలు, నిబంధనలను ఉల్లఘించినందుకు గాను జమాల్‌కు పీకేఆర్ 1.4 మిలియన్ల (భారత కరెన్సీలో సుమారు. రూ. 4. 35 కోట్లు) భారీ జరిమానా పీసీబీ విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై కూడా పాక్ క్రికెట్ కొరడా ఝులిపించినట్లు సమాచారం.జమాల్ ఏమి తప్పు చేశాడంటే?జమాల్ స్వదేశంలో ఓ టెస్టు మ్యాచ్ సందర్భంగా తన క్యాప్‌పై 804 నంబర్‌ను రాసుకున్నాడు. ఆ నంబర్‌ను తన క్యాప్‌పై రాసుకున్నందుకు అతడిపై పీసీబీ సీరియస్ అయినట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే 804 అనేది జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్యాడ్జ్ నంబర్.ఇమ్రాన్‌కు సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే అతడి బ్యాడ్జ్ నంబర్‌ను జమాల్ తన క్యాప్‌పై రాసుకున్నట్లు పీసీబీ విచారణలో తేలింది. కాగా పాకిస్తాన్ క్రికెట్లో భాగంగా ఉన్న ఆటగాళ్లు గానీ, కోచింగ్ స్టాప్ గానీ రాజకీయాల గురించి మాట్లాడకూడదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అతడికి పీసీబీ ఫైన్ విధించినట్లు సమా టీవీ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఈ కారణంగానే జమాల్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ పీసీబీ సెలక్టర్లు ఎంపిక చేయలేందంట. జరిమానా పడిన ఆటగాళ్లలో అమీర్ జమాల్‌తో పాటు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది.చదవండి: IPl 2025: ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?

ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?
ఐపీఎల్-2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అన్ని విధాల సిద్దమవుతోంది. చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో సీఎస్కే ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత సీజన్లో గ్రూపు స్టేజికే పరిమితమైన సీఎస్కే.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అదరగొట్టాలన్న పట్టుదలతో ఉంది.రికార్డు స్ధాయిలో ఆరో ఐపీఎల్ ట్రోఫీపై మెన్ ఇన్ ఎల్లో కన్నేసింది. అందుకోసం సీఎస్కే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం సామ్ కుర్రాన్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు సీఎస్కే జట్టులోకి వచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివమ్ దూబే, ధోని వంటి ఆటగాళ్లతో సీఎస్కే బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కన్పిస్తోంది. బౌలింగ్‌లోనూ పతిరానా, నాథన్ ఈల్లీస్, నూర్ ఆహ్మద్ వంటి యువ సంచలనాలతో సీఎస్కే బలంగా ఉంది. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు అంచనా వేశాడు.సీఎస్కే ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు డెవాన్ కాన్వే ప్రారంభించాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్లో గైక్వాడ్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా రచిన్ రవీంద్ర వచ్చాడు. కానీ గత సీజన్లో రవీంద్ర తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ క్రమంలోనే రవీంద్రను మూడో స్దానంలో బ్యాటింగ్‌కు పంపించాలని రాయుడు సూచించాడు. అదేవిధంగా నాలుగో స్ధానం కోసం దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంటుందని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్ దూబే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలకు అంబటి చోటు ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా మతీషా పతిరాన, అన్షుల్ కాంబోజ్.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా అశ్విన్‌కు తుది జట్టులో అతడు అవకాశమిచ్చాడు. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.రాయుడు ఎంపిక చేసిన సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా/రాహుల్ త్రిపాఠి/విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రాన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్బెంచ్: ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, జామీ ఓవర్టన్చదవండి: IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే..

IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కనున్నాడు.కేకేఆర్ ఫ్రాంచైజీ ఇటీవలే తమ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేసింది. రహానే కేకేఆర్‌ను గతేడాది ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు. అదేవిదంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.మూడోసారి..రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఓ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ గైర్హజారీలో పూణే జట్టును రహానే నడిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.తర్వాతి ఐపీఎల్-2019లో హాఫ్ సీజన్ వరకు ఆర్ఆర్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే స్మిత్ తిరిగి రావడంతో కెప్టెన్సీ నుంచి రహానే తప్పుకున్నాడు. 2019 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి స్మిత్ తన స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానే మళ్లీ రాజస్తాన్ రాయల్స్ బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాతి సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్,చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానే ఆటగాడిగానే కొనసాగాడు. ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది.చదవండి: PAK vs NZ: మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
బిజినెస్

రోబో క్యూబ్: గెలుస్తుంది.. గెలిపిస్తుంది..
రూబిక్స్ క్యూబ్ పజిల్‌ను పరిష్కరించడానికి చాలా కష్టపడుతుంటారు కొంతమంది. ఇప్పుడు సులువుగా పరిష్కరించే పద్ధతిని నేర్పిస్తుంది ఈ ‘ఎక్స్ మ్యాక్ రోబో క్యూబ్’ చూడటానికి సాధారణ రూబిక్స్ క్యూబ్లాగే ఉంటుంది కాని, ఇందులోని ఆరు మోటార్లు రూబిక్స్ క్యూబ్‌లోని బ్లాక్స్‌ను సులువుగా తిప్పుతూ స్వయంగా పరిష్కరిస్తుంది.ఎవరైనా పజిల్‌ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ రంగుల లైట్లు, సంగీతాలను ప్లే చేస్తూ అర్థమైయ్యేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఇలా దీని సాయంతో చిన్న పిల్లలు కూడా రూబిక్స్ క్యూబ్‌ను సులువుగా పరిష్కరించగలరు. ధర కాస్త ఎక్కువ. ఆన్లైన్లో దొరుకుతుంది.

రియల్ ఎస్టేట్‌ను వదిలేస్తున్న వారెన్ బఫెట్!
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హతావే చైర్మన్ వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థల్లో ఒకటైన హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న తనఖా రేట్లు, క్షీణిస్తున్న అమ్మకాలు, ఆర్థిక అస్థిరతతో ప్రాపర్టీ మార్కెట్ సతమతమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది దేనికి సంకేతం?ఎందుకు వదులుకుంటున్నట్టు?బలమైన కారణం ఉంటే తప్ప బఫెట్ వ్యాపారాలను అమ్మేసుకోడు. మరి ఇప్పుడెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదులుకుంటున్నాడు? మార్కెట్ విస్తరణకు పేరొందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం కంపాస్ కు హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించేందుకు బెర్క్ షైర్ హాత్వే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బెర్క్ షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్, రియల్ లివింగ్ వంటి బ్రాండ్ల ద్వారా పనిచేస్తున్న హోమ్ సర్వీసెస్ కు 5,400 మంది ఉద్యోగులు, 820 బ్రోకరేజీ కార్యాలయాలతో విస్తృతమైన నెట్ వర్క్ ఉంది.వ్యాపారాన్ని విక్రయించాల్సిన అవసరం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఎదురుదెబ్బల నుంచి కూటా ఉద్భవించి ఉండవచ్చు. 2024లో హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా 107 మిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. రియల్ ఎస్టేట్ కమిషన్ దావాకు సంబంధించిన 250 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ దీని వెనుక ముఖ్యమైన కారణం. మార్కెట్ పరిస్థితులు బిగుసుకుపోవడం, లాభదాయకత కుంచించుకుపోవడంతో బఫెట్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గే అవకాశమూ ఉంది.పతనం అంచున అమెరికా హౌసింగ్ మార్కెట్?అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుతో ఆకాశాన్నంటుతున్న తనఖా రేట్లు గృహ అమ్మకాలను గణనీయంగా మందగించేలా చేశాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ప్రకారం, 2023 లో ప్రస్తుత గృహాల అమ్మకాలు దాదాపు 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ నుంచి బఫెట్ వైదొలగడం దీర్ఘకాలిక ప్రతికూలతలను ఆయన అంచనా వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.

చేతిసైగలతో కదిలే డ్రోన్
గాల్లో ఎగిరే వస్తువులను చూసి చాలా ఆనందపడతారు పిల్లలు. ఇక ఆ ఎగిరే వస్తువు వాళ్లు చెప్పినట్లు ఎగిరితే ఇక ఆ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఆ పని చేస్తుంది ఈ ‘స్కూట్ డ్రోన్’. చేతి సైగలతో కోరుకున్న రీతిలో ఈ డ్రోన్‌ను ఎగురవేస్తూ ఆటలాడుకోవచ్చు. ఎగిరేటప్పుడు పల్టీలు కొట్టడం వంటి విన్యాసాలు కూడా చేస్తుంది.ఆరుబయటి మైదానాల్లోనే కాకుండా, జనావాసాల్లో కూడా దీనిని సురక్షితంగా ఎగరేయవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు ఎదురుగా ఉన్న అవరోధాలను గుర్తించగలవు. కాబట్టి, ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఈ డ్రోన్‌ను ఎగరేస్తూ ఆటలాడుకోవచ్చు. ధర రూ. 4,569. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది.

శాలరీ అకౌంట్ ఉంటే ఇవన్నీ ఉన్నట్టే..
వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు.క్లాసిక్ శాలరీ అకౌంట్స్, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.రుణాలపై తక్కువ వడ్డీ రేట్లుశాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీఅత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది.ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలువేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి.ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులుబ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి.ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ షాపింగ్, డైనింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి.ఉచిత డిజిటల్ లావాదేవీలుసాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులుశాలరీ అకౌంట్ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది.ఉచిత ఏటీఎం లావాదేవీలుఅనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు.జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీచాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్‌తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలకు లేని ప్రయోజనం.
ఫ్యామిలీ

ఈ వారం కథ: మసాన్ హోలీ
బ్లూసీ కేఫ్‌లో టీ తాగి బయటకొచ్చి నిలబడి, సిగరెట్ వెలిగించుకొని కాసేపు రోడ్డు అవతల కనిపిస్తోన్న సిటీ బస్టాపు వైపు, దాని పక్కనే ఉన్న మెట్రోస్టేషన్స్ వైపు చూస్తూ సిగరెట్ అంత్యక్రియల్లో చివరిదాకా పాల్గొని..పుట్‌పాత్ సందులోంచి తన యాభైఏళ్ల వయసు దాటుతోన్న పాదాలను ఆడించుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కి చేరుకున్నాడు సత్యానంద్. ప్రయాణికుల్ని ఒరుసుకుంటూ డిసెంబర్ నెల చలికూడా రైల్వేస్టేషన్స్ లోకి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ‘మణుగూరు వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడవనెంబర్ ప్లాట్‌ఫామ్ మీద...’లోయర్‌బెర్త్ మీద కూర్చొని విండోతెరిచి సెల్ఫోన్లో టైం చూశాడు. పదకొండున్నర. మిడిల్‌బెర్త్ ప్రయాణికుడు ఇంకా వచ్చినట్టు లేడు. అప్పర్‌బెర్త్ మీద అప్పటికే దుప్పటి కప్పుకొని పడుకొన్న వ్యక్తి ఒక చెయ్యిని తలకింద పెట్టుకొని, మరోచేత్తో పట్టుకున్న సెల్‌ఫోన్స్ వెలుతురు ముఖం మీద పడుతుంటే రీల్స్ చూస్తూ పడీపడీ నవ్వుతున్నాడు. చెప్పులు విప్పి సీటు కిందకు నెట్టి బాసింపట్టు వేసుకుని కిటికీలోంచి బయటికి చూశాడు.ప్లాట్‌ఫాం మీద మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. మీరందరూ వెళ్లిపోతే నేను కాసేపు కునుకు తీస్తాను అన్నట్లు అలసిన దేహంతో కనిపిస్తోంది రైల్వేస్టేషన్స్ .రైలు కదిలింది. చివరి నిమిషంలో పరుగెత్తుకుంటూ వచ్చి రైలెక్కినట్లున్నాడు ఆయాసపడుతూ మిడిల్‌బెర్త్ యువకుడు. బ్యాక్‌ప్యాక్ సీట్లో పెట్టి, పక్కన కూర్చొని షూస్ విప్పుకుంటూ ‘నాది మిడిల్‌బెర్త్ అంకుల్, మీరెక్కడిదాకా?’ అని అడిగాడు. ‘భద్రాచలం’ చెప్పాడు సత్యానంద్.‘మాది వరంగల్. మీకు నిద్రొచ్చినపుడు చెప్పండి బెర్త్ మీదకు వెళ్తాను’ అన్నాడా యువకుడు.‘థాంక్యూ... ఒక అరగంట’ అని తిరిగి కిటికీలోంచి బయటికి చూశాడు సత్యానంద్, కిటికీ అవతల ఒక్కో దృశ్యం వెనక్కి జారిపోతోంది. సికింద్రాబాద్ స్టేషన్స్ పరిసరాల నుండి అనుబంధం తెంచుకుంటోంది రైలు. రివ్వున కిటికీలోంచి వీచిన చల్లగాలికి అద్దం కిటికీ కిందికి దించబోతుండగా రేపు ఉదయమెప్పుడో సికింద్రాబాద్ నుండి వారణాసి వైపు వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పొగమంచులో తడుస్తూ కనిపించింది మసక మసగ్గా.గోదావరి నదివైపుకీ, గుడికీ వెళ్లాల్సిన ప్రయాణికులు దిగే స్టాప్‌లో బస్సు దిగి, ఆటో ఎక్కి గోదావరి వద్ద దిగి ఇరవైదాకా ఉన్న కరకట్ట మెట్లెక్కి అలసట తీర్చుకోడానికి కాసేపు నిలబడి ఎదురుగా మెట్లకింద కొద్ది దూరంలో లేతసూర్యకాంతిలో ఆవిరవుతున్న పొగమంచులో నింపాదిగా ప్రవహిస్తోన్న నదివైపు చూశాడు సత్యానంద్.పూజాసామాగ్రి అమ్మే షాపులు ఒక్కొక్కటీ తెరుస్తున్నారు, పితరులకు తర్పణం అర్పించడానికి వచ్చిన కొందరు పూజారులతో కలిసి మెట్లు దిగుతున్నారు.వీపుకి తగిలించిన బ్యాక్‌ప్యాక్ సవరించుకుని తను కూడా నదివైపు వెళ్లడానికి మెట్లు దిగసాగాడు సత్యానంద్. వెనక కొంచెం దూరంలోని మైకులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రంలోంచి ‘ఏడనున్నాడో భద్రాద్రి వాసుడు’ కీర్తన వినిపిస్తోంది. ఏడనున్నాడో... అన్న శబ్దం వినగానే సత్యానంద్‌కి నలభై ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు. అతని జ్ఞాపకాల్లో గతం ఇసుకలా రాలడం మొదలుపెట్టింది.నలభై ఏళ్ల క్రితం సంగతి. సత్యానంద్‌కి పన్నెండు ఏళ్లుంటాయి. నమ్మిన స్నేహితుడు మోహన్స్ రావు వ్యాపారంలో సత్యానంద్ తండ్రి శివరాంను మోసం చేస్తే, ఖైరతాబాద్‌లో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి ముప్పాతిక భాగం అప్పులు తీర్చి అద్దె ఇంట్లోకి మారారు. ఇంక ఏ వ్యాపారం జోలికి పోకుండా చిన్న ప్రైవేటు కంపెనీలో జీతానికి కుదిరాడు శివరాం. బొటాబొటి సంపాదన దానికితోడు పావుభాగం అప్పులు శివరాం ఖాళీజేబులకీ, అతని భార్య లక్ష్మీకాంతం చెవులకీ గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంట్లో దంపతులిద్దరి మధ్యా చిన్నగా గొడవలు మొదలయ్యాయి. బంధువుల సూటిపోటి మాటల దగ్గరి నుండి అద్దె ఇంటి ఓనరమ్మ కళ్లల్లో అప్పుడప్పుడూ కనిపించే చిన్నచూపు వరకూ లక్ష్మీ కాంతానికి చిరాకు తెప్పించేవి, తల్లిదండ్రుల మధ్య క్రమంగా పెరుగుతున్న గొడవ చూసి ఒకరోజు రాత్రి, ‘నేను స్కూల్ మానేసి ఏదైనా పనిలో చేరుతాను నాన్నా’ అన్నాడు ఏడవతరగతి చదువుతున్న సత్యానంద్.కళ్లవెనుక తిరిగిన నీళ్లు బయటికి రాకుండా ఆపి ‘ఒద్దు బిడ్డా, నువ్వూ చెల్లాయి బాగా చదువుకొని బంధువుల్లో మన గౌరవం నిలబెట్టాలి’ అన్నాడు శివరాం కొడుకు సన్నని మెడపై ఉన్న తలను తన గుండెవైపుకు అద్దుకుంటూ. ఒకరోజు రాత్రి దంపతులిద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.‘‘దోస్తు దోస్తు అని వాడు చెప్పిన మాటలు విని దొరికిన కాడికి అప్పులు చేసి ఒక్కటి కాకుండా రెండు వ్యాపారాల్లో చేయిపెడితివి. అందులో ఒకటి సారా కాంట్రాక్టు. నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ మోహన్స్ రావుగాడు తెలివిగా డబ్బులన్నీ వాడి ఖాతాలో వేసుకొని నీకు నష్టాలు చూపెట్టాడు. చేతకాని వాడివి చేతకానివాడిలా ఉండాల్సింది. ఇవి నా మాటలు కాదు. మా అన్నదమ్ములు, బంధువులు అంటున్న మాటలు.’’ అన్న భార్య మాటలు గట్టిగా తగిలాయి శివరాం మనసుకి. వేరే ఎవరైనా అంటే ఏమోకానీ తన భార్య తనని ‘చేతకానివాడు’ అన్న మాట అతన్ని తీవ్రంగా వేధించింది. తనూ కుటుంబాన్ని పోషించడానికేగా వ్యాపారంలోకి దిగింది. కాకపోతే మోసపోయాడు.ఏమనుకున్నాడో ఏమో తెల్లవారుఝామున ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పట్నుండీ ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం శివరాం బావమరుదులు ఎన్ని చోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎక్కడోచోట ఏడుస్తూ ఉంటాడులే అక్కా’ అని ఓదార్పు మాటలు, ‘నాకంట పడాలే కానీ’ అనే చిన్నతమ్ముడి ఆవేశపు మాటలు లక్ష్మీ కాంతం చెవుల వద్ద నెమ్మదిగా సెలవు తీసుకున్నాయి. క్రమంగా శివరాం ఆ కుటుంబానికి ఎప్పుడో కాని గుర్తు వచ్చేలా వాళ్ల మనసులో ఒక మూల చీకట్లో ఉండిపోయాడు.సత్యానంద్‌కి మాత్రం తండ్రి అప్పుడప్పుడూ కలలో కనిపించేవాడు. అమ్మానాన్న చెల్లాయిలతో కలిసి భద్రాచలం గోదావరిలో తుళ్లింతలు కొడుతూ బాల్యంలో తను స్నానం చేసిన దృశ్యం కలలో అతనికి ఏడాదికి రెండుసార్లయినా వచ్చేది. ముఖ్యంగా హోళీ పండుగనాడు తన తండ్రి భద్రాచలం తీసుకెళ్లేవాడు. ఏ రంగులూ వాడకుండా పసుపు కుంకుమలు రుద్దుకొని అమ్మనాన్న గోదావరి ఒడ్డున హోళీ ఆడుకునేవారు. శివరాం భార్య లక్ష్మీకాంతం కుటుంబంతో భోజనం చేసే సమయంలో ఎప్పుడో ఒకసారి భర్త గుర్తుకొచ్చి పిల్లల్తో, ‘ఆ రోజు రాత్రి నేను మీ నాన్నని... చేతకాకపోతే అని తిట్టి ఉండాల్సింది కాదు. నిజానికి అది నా మాట కూడా కాదు.బంధువుల నోట్లోంచి వినీ వినీ విసుగొచ్చి తట్టుకోలేక అన్నమాట. అయినా ఆ మాట అనకుండా ఉండాల్సింది’ అని గుడ్లనీరు కక్కుకుంటుంటే ‘ఏదో బాధ తట్టుకోలేక అంటే మాత్రం ఆయన ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోవాలా’ అని ఎదుగుతున్న కూతురు తండ్రిని కోపంగా గుర్తుచేసుకునేది.ఇంటర్ అర్హతతో సత్యానంద్‌కి రైల్వేలో ఉద్యోగం వచ్చాక చర్లపల్లిలో ఒక ప్లాటు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని శివరాంలేని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందా కుటుంబం. మరుసటి ఏడాదే చిన్నతమ్ముడికి తన కూతురినిచ్చి పెళ్లిచేసింది లక్ష్మీ కాంతం.నదుల అద్దాల్లో తమ ముఖాల్ని చూసుకుంటూ ముందుకు కదులుతోన్న మేఘాల్లాగా సాగిపోయింది కాలం.నాలుగురోజుల క్రితం ఆదివారపు న్యూస్పేపర్లో తన తండ్రిని వ్యాపారంలో మోసం చేసిన మోహన్‌రావు దశదిన కర్మ ప్రకటన కనిపించింది సత్యానంద్‌కి. ‘పాపి చిరాయువు అంటారు. నూరేళ్లు నిండకుండానే పోయాడన్న మాట మా కాపురంలో చిచ్చుపెట్టి’ అంది ఆ వార్త విని లక్ష్మీ కాంతం. సత్యానంద్‌కి కళ్లముందు తండ్రి మెదిలాడు. మోహన్స్ రావు చనిపోయిన వార్త తన తండ్రికి తెలుసోలేదో, అసలింతకీ తన తండ్రి బతికే ఉన్నాడో లేదో తెలియదు.జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాడు సత్యానంద్. భద్రాచలం గోదావరి ఒడ్డున చివరిమెట్టు దిగాక కాళ్లకు ఇసుక మెత్తగా తగిలింది. నీళ్లుపాడిన పాటలో కరిగి కన్నీరైపోయిన రాళ్ల సూక్ష్మ అవశేషాల్లాంటి తీపిలేని చక్కెరచుక్కల ఇసుక రేణువులపై నడుచుకుంటూ గోదావరివైపు కదులుతుండగా మళ్లీ తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు.‘భద్రాచలం అంటే చాలా ఇష్టంరా సత్యానంద్. చిన్న ఊరు.. పెద్దగోదావరి.. ఆయనెవరో కంచర్ల గోపన్న కట్టిన గుడి. ప్రశాంతంగా అయిపోయే దర్శనం. చిన్నప్పుడు మా అయ్యశివయ్య ఎందుకోగానీ పండుగ రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లేవాడు. కాబట్టి ఎప్పుడూ మేం ఇబ్బంది పడిందిలేదు. మా అయ్యకు భద్రాచలం అంటే బాగా ఇష్టం, కానీ ఎందుకో కాశీ విశ్వేశ్వరుడి పేరు చెబితే చాలు కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. అందుకేనేమో నాకు శివరాం అని పేరు పెట్టాడు’ అని తన తండ్రి శివరాం వాళ్ల నాన్న శివయ్యను గుర్తుకు చేసుకునే సందర్భం ఎందుకో గుర్తుకొచ్చింది సత్యానంద్‌కి.జనసంచారం లేని చోటికి వెళ్లాడు సత్యానంద్. ఇసుకలో బ్యాగ్పెట్టి, ప్యాంటూ షర్టూ విప్పి గోదావరిలోకి అడుగుపెట్టి నీళ్లల్లో కూర్చున్నాడు.అతని గొంతువరకూ వచ్చాయి నీళ్లు. భద్రాచలం ఊరి మీది నుండి పైకి లేస్తున్నాడు సూర్యుడు. కరకట్ట మీది నుండి గోదావరివైపుకు మెట్లుదిగుతున్న భక్తుల సంఖ్య పెరిగింది. ఒక మెట్టు అంచున అప్పుడే వచ్చినట్లున్న వృద్ధ కాషాయధారి అక్కడ కూర్చోడానికి అప్పుడే మెట్టుమీద గుడ్డ పరుచుకుంటున్నాడు.‘ఒకవేళ నాన్న ఇల్లువదిలిపెట్టి వెళ్లిపోయిన ఆ రాత్రి సరాసరి భద్రాచలం వచ్చి ఉంటాడా? ఆయన ఆచూకీ కోసం ఈ ఊరికి కూడా వెళ్లి వెదకమని అమ్మ మావయ్యలకు చెప్పి ఉంటుందా? తను అప్పుడు చాలా చిన్నవాడు. తనకి గుర్తొస్తే తను చెప్పేవాడేమో! ఒకవేళ ఇక్కడికి వచ్చి తన తండ్రి నలభై సంవత్సరాల నుండీ ఇక్కడే ఉండిపోయి ఉంటాడా?’ హఠాత్తుగా కలిగిన ఈ ఆలోచనకు ఒళ్లు ఝల్లుమంది సత్యానంద్‌కి.‘ఒక్క రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి తన తండ్రి కనిపిస్తాడేమో చూడాలి’ అనుకున్నాడు గోదావరిలో ఒక మునకవేస్తూ.. తర్వాత రెండో మునక.. మూడో మునక వేసి ఎందుకో.. నీళ్లలోనే కొన్నిక్షణాలు అలా ఉండిపోయి.. మనసులో ఇలా అనుకున్నాడు ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’..(2025).(1995) లలితాఘాట్, వారణాసి (కాశీ) (ఫాల్గుణశుక్ల ద్వాదశి) స్నానం చేయడానికి గంగానదిలో దిగి రెండు మునకలు వేసి మూడో మునక వేయగానే నలభైఏళ్ల శివరాంకు భవిష్యత్ కాలంలోంచి వినిపించినట్లు ఏవో మాటలు వినిపించాయి నీళ్లల్లోంచి.‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ దిగ్గున నీళ్లలోంచి తలబయటికి తీశాడతను. ఈ అకస్మాత్ పరిణామానికి కొన్ని క్షణాలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెలియకుండా నోట్లోకి వెళ్ళిన నీళ్లను బయటికి వదిలి నోటితోనే గట్టిగా గాలి పీల్చుకున్నాడు. కాలంలో ముందెక్కడో ఉన్న సుదూరతీరం నుండి పాములా నీళ్లలో పాక్కుంటూ వచ్చి చెవిదగ్గరికి రాగానే నీటిబుడగలా పేలిపోయిన శబ్దంలోంచి వచ్చినట్లుగా వినిపించాయా మాటలు . ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ .యాభైఏళ్లు దాటిన వ్యక్తి గొంతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయా మాటలు. గొంతులో ఇంకా ఎండిపోని లేతదనం, సన్నని జీరను బట్టి ఆ గొంతు తన కొడుకు సత్యానంద్‌ది అని శివరాం పోల్చుకున్నాడు. ‘తను వాడి పన్నెండవ ఏట ఇల్లువిడిచి పెట్టి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇరవై ఏళ్లు దాటుంటాయి. మరి యాభై ఏళ్ల వయసున్న వ్యక్తి గొంతులోంచి వచ్చిన మాటల్లా ఉన్నాయేంటి. అంటే తన కొడుక్కి యాభైఏళ్లు దాటాక మోహన్ రావు చనిపోతాడా?ఈ భవిష్యత్వాణి ఇప్పుడెందుకు వినిపించిందో? ఇల్లు విడిచిపెట్టి వచ్చిన ఈ పదేళ్లలో ఇలాంటి అనుభవం నాకెప్పుడు కలుగలేదు. ఇదంతా తన భ్రమ అయి ఉంటుందా? నీళ్లలో వినిపించిన మాటల్లోని శబ్దతీవ్రత ఇది భ్రమకాదు అన్నట్లుగా ఉంది. కాశీలో ఇలాంటి అనుభవాలు సాధారణమేనా?’ శివరాం ఆలోచనల్ని తెంచివేస్తూ అతడు స్నానంచేస్తున్న లలితాఘాట్ పక్కనున్న విశ్వనాథ మందిరం అవతలనున్న మణికర్ణికా ఘాట్నుండి ఏవో శబ్దాలు వినిపించాయి.అక్కడ ‘మసాన్స్ హోలీ’ వేడుక జరుగుతోంది. దహనక్రియలు జరిగిన వాళ్ళ చితాభస్మాన్ని చల్లుకుంటూ అఘోరాలు, బైరాగులు, సన్యాసులు, భంగు సేవిస్తూ ఢమరుకం వాయిస్తూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నృత్యం చేస్తున్నారు. శవదహనం జరిగే మణికర్ణికా ఘాట్‌వద్ద ప్రతిఏటా ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు జరిగే వేడుక ‘మసాన్స్ హోలీ’. మసాన్స్ అంటే శ్మశానం, శ్మశానంలో జరిగే హోలీ.కాశీలో ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం పార్వతీపరమేశ్వరుల వివాహానంతరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినాడు పార్వతిని పరమేశ్వరుడి చిరునామా అయిన కాశీలోని విశ్వనాథ మందిరానికి తీసుకొచ్చారు. ఆ వేడుకని పురస్కరించుకొని శివుడు దేవతలు, గంధర్వులతో కలసి ఉల్లాసంగా హోలీ ఆడాడు. ఆ హోలీయే రంగోభరీ ఏకాదశి. ఆ వేడుకలో పాల్గొనలేకపోయిన భూత ప్రేత పిశాచాలు శివగణాలు, అఘోరాల కోసం మరుసటి రోజైన ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు శివుడు సతీసమేతంగా మణికర్ణికాఘాట్‌కి వచ్చి వీరితో కలిసి భస్మ హోలీ ఆడాడు.ఆ సంప్రదాయమే కాశీలోని మణికర్ణికాఘాట్ వద్ద ఏటా కొనసాగుతోంది.గంగలో స్నానం పూర్తిచేసుకొని ఒడ్డున ఉన్న మెట్లవైపు కదులుతుండగా శివరాంకు మళ్లీ నీళ్లల్లో వినిపించిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనించాయి. ‘మోహన్స్ రావు చనిపో.......’అప్రయత్నంగా మణికర్ణికాఘాట్వైపు చూశాడు. మసాన్స్ హోలీ దద్దరిల్లుతోంది అక్కడ, చితాభస్మం గాల్లోకి లేస్తోంది. సన్యాసుల, బైరాగుల, అఘోరాల నృత్యకేళి చిందులేస్తోంది.‘మోహన్స్ రావు చనిపోయిన వార్త, చితాభస్మలేపన మసాన్స్ హోలీ హేల ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? రెండు విషయాలు ఒకే రోజున జరగడంలో అంతరార్థం ఏదైనా ఉందా.. ఎవరు చెబుతారు?’ అనుకుంటూ మెట్లమీద అడుగులు వేశాడు శివరాం.‘ఎల్లుండి పౌర్ణమిరోజు రాత్రి గంగఒడ్డున కూర్చొని చంద్రున్ని చూడు’ అని వృద్ధ్ద సన్యాసిని ఒక యువ సన్యాసినితో చెబుతున్న మాటల పక్కనుండి నడిచి మెట్ల పైకి వచ్చి తల తుడుచుకొని బట్టలు మార్చుకుంటుండగా శివరాంకి తన కుటుంబం గుర్తుకొచ్చింది.‘పిల్లలేం చేస్తున్నారో? కొడుకు సత్యానంద్‌కి ఇరవైయేళ్లు దాటి ఉంటాయి. కూతురు ఏం చదువుతోందో? అది వాళ్లమ్మతో కలిసి నన్ను తిట్టుకునే ఉంటుంది. లక్ష్మీకాంతం.. ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనని ఇంకా..భార్య గుర్తుకురాగానే తను కాశీకి వచ్చిన కొత్తలో తనలాగే ఇల్లువిడిచి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి చేరి ఒక సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో తెలుగులో ఏదో గొణుక్కుంటూ తనకి పరిచయమైన సుందర్రావు గుర్తుకొచ్చాడు శివరాంకు. అతనిది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు. గయ్యాళి భార్య నోటికి వేగలేక ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరి ఎందుకో మనసు మార్చుకొని ఎక్కడెక్కడో తిరిగి చివరికి కాశీకి వచ్చిచేరాడు.ఆ పరిచయంతో అప్పుడప్పుడు సాయంత్రాల్లో గంగాఘాట్ల వద్ద కలుస్తూ ఉండేవాడు.‘చచ్చినా తిరిగి ఇంటికి వెళ్లను’ అనేవాడు తరచుగా తన భార్య ప్రస్తావన వచ్చినపుడు. ‘చస్తే ఇంకేం వెళ్తావులే’ అని తనంటే పెదాల్ని చెవులదాకా సాగదీసి శబ్దంలేకుండా నవ్వేవాడు. ఆ నవ్వులో అమాయకత్వానికి పుట్టిన బిడ్డలాంటి ఏదో అందం ఉండేది. ఉన్నట్లుండి ఒకరోజు సాయంత్రం హరిశ్చంద్రఘాట్ దగ్గర కనిపించి ‘రేపుదయం ఇంటికి బయలుదేరుతున్నాను’ అన్నాడు. ‘అదేంటీ చచ్చినా ఇంటికి వెళ్లనని పదేపదే చెప్పేవాడివి కదా.. హఠాత్తుగా ఏంటీ మార్పు. ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?’ అని తను అడిగితే,‘ఈ కాశీలో ఉండడం కష్టమైపోతోంది శివరాం. నా భార్యపేరు అన్నపూర్ణ. ఆ పేరు ఇక్కడ ఎవరో ఒకరి నోటినుండి రోజూ వినబడుతూనే ఉంటుంది. ‘అన్నపూర్ణ మాతాకీ జై’అంటూ. వినపడకపోయినా ఏదో ఒక బోర్డుమీద ఆ పేరు కనబడుతూనే ఉంటుంది.కాశీకి వచ్చినప్పటి నుండీ అన్నం తింటున్నప్పుడల్లా నా భార్య అన్నపూర్ణే గుర్తుకొస్తోంది. ఇక ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనని అర్థమైంది. నా పెళ్లాం గయ్యాళిదే కావొచ్చు. కానీ లౌక్యం తెలియని వెర్రిమాలోకం. అడుక్కునే బిచ్చగాడికి కూడా ఆమె వాలకం చూస్తే మోసం చేయాలనిపిస్తుంది.ఇంటికి వెళ్లి చూస్తాను. రానిచ్చిందా ఉండిపోతాను. మళ్లీ గయ్యాళి గంగమ్మ వేషం వేసిందా..’ అని గంగానది వైపు చూసి, ‘భరిస్తాను.. ఉండిపోతాను.. పాపం దానికి పిల్లలు కూడా పుట్టలేదు’ అని తన దగ్గర సెలవు తీసుకొని మెట్లెక్కి వెళ్లిపోయాడు. అతని వెనుకే మిగిలిన ఆ సాయంత్రపు నిశ్శబ్దంలో తనకి తన భార్య లక్ష్మీకాంతం గుర్తుకొచ్చింది.‘తన భార్య పేరు కూడా అన్నపూర్ణో, విశాలాక్షో అయితే సుందర్రావులా తనూ ఇంటికి బయలుదేరి వెళ్లేవాడా?’ అనుకున్నాడు ఆ నది ముందు నిల్చొని.వెంటనే ఆరోజు రాత్రి తన భార్య అన్నమాటలే మళ్లీ మెదిలాయి మనసులో.ఒకవేళ మనస్సు మార్చుకొని ఇల్లు విడిచిపెట్టివచ్చిన ఈ పదేళ్ల తర్వాత తను కూడా అతడిలా తిరిగి ఇంటికి వెళ్తే తన భార్యపిల్లలు ఇంట్లోకి రానిస్తారా? ‘ఎక్కడ చచ్చావ్ ఇంతకాలం’ అంటారా? ముఖ్యంగా తన చిన్న బావమరిది ముందు మెడపట్టుకొని బయటికి నెట్టేస్తాడు. వాడిదసలే దుడుకు స్వభావం. వాళ్ల చేతుల్లో అలాంటి అవమానం పొందేకంటే ఈ కట్టె కాశీలో కాలిపోవలసిందే’ అనుకున్నాడు ఆ రాత్రి సుందర్రావు వెళ్లిపోయిన వైపు మరోసారి చూసి.గత స్మృతుల్లోంచి బయటికొచ్చాడు శివరాం. అతనికి ఎందుకో టిఫిన్స్ చేయాలనిపించలేదు. మెట్లపైకి వెళ్లి టీ తాగి వచ్చి ఎండ పెరుగుతున్నా పట్టించుకోకుండా ఘాట్వద్దే కూర్చొని మసాన్స్ హోలీ వేడుకనే చూడసాగాడు. మధ్యాహ్నం పన్నెండవుతోంది. మణికర్ణికాఘాట్ వద్ద మసాన్స్ హోలీ ఆడుతున్న వాళ్లంతా నృత్యం చేస్తూనే ఎందుకో గంగానది వైపు చూడసాగారు.(2030)ఊరుచివరి శ్మశానం:చితిమీద ఎనభైఏళ్ల వృద్ధుడి భౌతిక కాయానికి నిప్పంటించి మేఘాలు దట్టంగా కమ్మిన ఆకాశం కింద మిగిలిన కార్యక్రమాలన్నీ చకచకా కానిచ్చేసి మృతుడి తాలూకు వాళ్లంతా ఇళ్లవైపు బయలుదేరాక భోరున వర్షం మొదలైంది.అంచుల్లో పెచ్చులూడిపోయి బాగా మసిపట్టిన సిమెంటురేకుల షెడ్డుకింద కాలుతున్న చితి మంటని కర్రతో సవరించి ఆ షెడ్డుకి కొంత దూరంలో ఉన్న మరొక షెడ్డువైపు వానలో తడుచుకుంటూనే పరుగెత్తాడు కాటికాపరి బహుశా సారాతాగి మళ్లీ వద్దామని.అంత వర్షంలోనూ చితికి కొద్దిదూరంలో ఆకాశం కింద నిలబడి వానను పట్టించుకోకుండా ఆ షెడ్డుకింద శివరాం చితివైపు చూస్తోంది లక్ష్మీకాంతం.భర్తతో గడిపిన మధురక్షణాలన్నీ ఆమె కళ్లముందు మెదిలాయి.వంటగదిలో గచ్చునేలమీద నూనెచుక్కపై తాను చూసుకోకుండా కాలువేసి జారి పడబోతుంటే కూరగాయలు కోస్తున్నవాడల్లా దిగ్గునలేచి కిందపడకుండా నడుంపట్టుకొని ఆపిన శివరాం చేతులు, పదిరోజుల దాకా తనకి జ్వరం తగ్గకపోతే సేవలు చేస్తూనే చిన్నపిల్లాడిలా ఏడ్చిన భర్త కళ్లు, ‘నీచేతుల్లో గోరింటాకు బాగా పండుతుంది లక్ష్మీ’ అని తన చేతుల్ని ముదు ్దపెట్టుకున్న ఆయన పెదాలు, ‘వెళ్లొస్తాను లక్ష్మీ’ అని బతుకుదెరువు కోసం బయలుదేరే ఆయన పాదాలు, రాత్రుల్లో తనని నిశ్చింతగా నిద్రపుచ్చిన ఆయన ఛాతీ..అన్ని దృశ్యాలూ ఆమె కళ్లముందు గిర్రున తిరిగాయి. ఆ చేతులు, కాళ్లు, ఛాతీ, పెదాలు అన్నీ ఎదురుగా చితిలో కాలిపోతున్నాయి అనిపించగానే ఆమె కళ్లలోంచి దుఃఖం కట్టలు తెంచుకుంది.ఆమె నోట్లోంచి మూడు అక్షరాల మాట ఒకటి బయటికి వెలువడబోతుండగానే చప్పున అక్కడి దృశ్యం మారింది.ఈసారి అదే చితిమీద డెబ్భైఅయిదేళ్ల లక్ష్మీకాంతం భౌతికకాయం కాలుతోంది. అదే బోరున వర్షం, అప్పటిదాకా లక్ష్మీకాంతం నిలుచున్న చోట నిల్చొని..ఇల్లు విడిచి వెళ్లిపోయిన నలభైఏళ్ల తర్వాత ఆ రోజే తిరిగివచ్చిన శివరాం.. పావుభాగం వంగిపోయిన దేహంతో భార్య చితివైపు చూస్తున్నాడు. ‘తల్లిలేని పిల్లనయ్యా.. నన్ను బాగా చూసుకుంటావు కదూ’ అని పెళ్లయిన కొత్తలో బేలకళ్లతో నవ్వుతూ తనని అడిగే భార్య శరీరం ఆకాశం కింద నేలకు పైన కాలి బూడిదవుతోంది. అతడి కళ్లలోంచి రెండు జలపాతాలు దుముకుతున్నాయి.ఉన్నచోటే కూలబడి భార్య చితివైపు చూస్తూ అతను కూడా మూడు అక్షరాల పదాన్ని గట్టిగా రోదిస్తూ పలికాడు.ఎక్కడో పిడుగుపడ్డ శబ్దానికి లక్ష్మీకాంతానికి కలచెదిరింది. మెల్లిగా కళ్లుతెరిచింది. చెంపలకు తడిగా దిండుతగిలింది. మూసి ఉన్న గది కిటికీల బయట పెద్ద చప్పుడుతో రాత్రి ఎప్పుడు మొదలైందో..వాన కురుస్తోంది. కరెంట్ పోయినా ఇన్వర్టర్ సాయంతో తక్కువ స్పీడులో ఫ్యాను తిరుగుతోంది. బెడ్‌లైట్ వెలుతురులో గడియారంలో మూడుగంటల ముల్లుని ముట్టుకొని ముందుకి కదిలింది సెకెన్ల ముల్లు. ఢెబ్భై అయిదేళ్ల వయస్సున్న శరీరాన్ని నెమ్మదిగాలేపి మంచం అంచున కూర్చోబెట్టి కొంగుతో కన్నీళ్లు్ల తుడుచుకుంది. వాన మరింత జోరు అందుకున్న శబ్దం వినిపిస్తోంది.ఆమెకెందుకో దగ్గరయిన వాళ్లు కాస్తా ఒకరి నుండి మరొకరు వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ దూరంగా వెళ్లిపోతున్న ప్రపంచంలోని కొందరు స్త్రీ పురుషులు ఒక్క క్షణం కళ్ల ముందు మెదిలారు.గది కిటికీలకు ఇవతల మరో వర్షం మొదలైంది. తెల్లవారు జామున ఎప్పటికో వాన వెలిసింది. లక్ష్మీకాంతానికి ఎందుకో జీవితంలో మొదటిసారి కాశీకి వెళ్ళాలనిపించింది.

యువ కథ: కనురెప్పలే సాక్షిగా
తెల్లవారుజామున సుమారుగా ఐదున్నర గంటలు– ఇండియా పాక్ సరిహద్దు ప్రాంతం. కంచెకు ఇవతల ఇండియా, అవతల పాకిస్తాన్. అక్కడి వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంది. దట్టమైన పొగమంచు– పక్కన ఎవరున్నారో కూడా తెలుసుకోలేని విధంగా కమ్ముకుని ఉంది. సైనికులు చీమ చిటుక్కుమన్నా పసిగట్టేంత అలెర్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.కొంచెం దూరంలో ఏదో అలికిడి. మన సైనికులు ఒక్కసారిగా అప్రమత్తమై, చెవులు రిక్కించారు. రైఫిల్స్‌ను పొజిషన్లోకి తీసుకుని, అడుగులో అడుగు వేస్తూ, అలికిడి వచ్చిన దిశగా ముందుకు కదిలారు. వారికి అక్కడ ఎవరో ఉన్నట్టు అర్థమైంది. వారి దుస్తులు కొంతభాగం మాత్రం కనిపిస్తున్నాయి. వారి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ, సైనికులు ఆ పొగమంచులో కదలకుండా ఉండిపోయారు. ఆ దుస్తులు మరింత ముందుకు వచ్చాయి. సైనికులు ముందుకు కదిలారు. అక్కడ కనిపిస్తున్న దుస్తులను చూస్తూ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. కారణం.. వారు పాక్ నుంచి నియంత్రణరేఖ ద్వారా ఇండియాలోకి చొరబడుతున్న ఉగ్రవాదులు.సైనికుల ధాటికి నిలబడలేక, తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగించే సమయం లేక ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అదే సమయంలో ఇండియా సైనికులను చూసి వెనక్కు పారిపోయిన ఒక ఉగ్రవాది ఒకచోట నక్కి ఉన్నాడు. పడిపోయిన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో వారి కన్నుగప్పి ఆ ఉగ్రవాది నియంత్రణరేఖ దాటి ఇండియాలోకి అడుగుపెట్టి, పొగమంచులో కలిసిపోయాడు.ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ ..నగరంలోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్. విదేశీ అతిథులు.. వివిధ దేశాల అధ్యక్షులు.. ప్రఖ్యాత పరిశ్రమల అధిపతులు.. సినీతారలు.. వ్యాపార ప్రముఖులు.. ఈ హోటల్లోనే బస చేస్తుంటారు. ఆ రోజు హోటల్ చాలా సందడిగా ఉంది. ముగ్గురు విదేశీ రాయబారులు ఇండియాకు వచ్చారు. వారికి అదే హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ అర్జున్ తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. క్షుణ్ణంగా ఆ హోటల్ పరిసర ప్రాంతాలను తన డేగచూపుతో పరిశీలిస్తున్నాడు. హోటల్ వెనుక ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వెనక్కు తిరిగాడు. అతడి మస్తిష్కంలో ఏదో తళుక్కుమని మెరిసింది. హోటల్ వెనుకభాగంలో రెండు మూడు అడుగుల దూరంలో మట్టి తవ్వినట్టుగా ఉంది. అది తెలియకుండా ఉండటానికి మట్టిని జాగ్రత్తగా కప్పేసి ఉంది. వెంటనే దూరంగా ఉన్న తన టీమ్‌కి సైగ చేశాడు అర్జున్. వారు తమతో పాటుగా స్నిఫర్ డాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు. అది ఆ ప్రాంతాన్ని వాసన చూసి, తన అరుపులతో హెచ్చరించింది.తక్షణమే అర్జున్ అతని టీమ్ రంగంలోకి దిగారు. అక్కడ పాతిపెట్టిన ఆర్డీఎక్స్ పేలుడు వస్తువులను కనిపెట్టారు. వాటిని పాతిపెట్టిన వారు హోటల్ లోపలకు చేరి ఉంటారేమో అనే ఆలోచన అర్జున్ను కలవరపరిచింది. వెంటనే హోటల్ లోపలకు పరుగు తీశాడు. అర్జున్ టీమ్ కొద్దిసేపటిలో అక్కడ పాతిపెట్టిన పేలుడు వస్తువులను పేలకుండా నిర్వీర్యం చేసేశారు. ఈలోపు అక్కడికి చేరుకున్న మరో టీమ్ వాళ్లు స్నిఫర్ డాగ్స్‌తో హోటల్ లోపలికి అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో... అక్కడికి చేరుకున్న ఇద్దరు ఉగ్రవాదులు ఏకే–47 తుపాకులతో కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ పడిపోయి ఉన్నారు. వాళ్ళను తొక్కుకుంటూ లోపలికి వెళ్తున్న ఉగ్రవాదులను రిసెప్షన్లో ఉన్నవాళ్లు చూడనే చూశారు. అక్కడున్న డేంజర్ అలారం మోగిస్తూ ముందుకు కదిలారు. హోటల్లో ఉన్నవారితో పాటు ముగ్గురు విదేశీ రాయబారులు కూడా ఆ డేంజర్ అలారం విన్నారు. వెంటనే తమ గది తలుపులు తెరువబోతున్న విదేశీ రాయబారుల ఎదుట ఇన్స్పెక్టర్ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతడిని చూసి వారు భయపడ్డారు. వారిని చూస్తూ అర్జున్ తన చేతి మణికట్టు మీద ఉన్న మువ్వన్నెల జెండాను చూపించాడు. అది చూసి వారు స్థిమితపడగానే, ‘ఎక్కువ సమయం లేదు. నాతో రండి’ అంటూ అక్కడి నుంచి వారిని వేగంగా పై అంతస్తుకు తీసుకెళ్లాడు. అప్పటికే కింద అంతస్తులలో తుపాకీ శబ్దాలు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.అక్కడ ఒక మూలనున్న చీకటిగది తలుపు తెరిచాడు. వారిని అందులోకి పంపించి, ‘మీరు ఇందులోంచి వెళ్తే బయటకు చేరుకుంటారు. అక్కడున్న మా వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా వేరేచోటుకు చేరుస్తారు’ అని చెప్తుంటే వారు ముగ్గురు అర్జున్‌ని కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ లోపలకు నడిచారు. వెంటనే అర్జున్ అక్కడనుండి బయటకు వచ్చి, తన చేతిలోని రైఫిల్‌ను పొజిషన్లోకి తీసుకుని ముందుకు నడిచాడు. అప్పటికే ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులతో ఆ హోటల్ రణరంగంలా ఉంది. తుపాకీతో ముందుకు నడుస్తున్న అర్జున్, అక్కడి గందరగోళం చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ మెట్ల మీదుగా కిందకు పరుగుతీశాడు. చిన్నపిల్లల అరుపులు.. మహిళల ఏడుపులు.. అర్జున్‌కి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకొన్ని మెట్లు దిగితే కింద అంతస్తు వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్తున్న అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం అక్కడ మెట్ల కింద భాగంలో ఒక ఉగ్రవాది ఏకే–47 రైఫిల్ పట్టుకుని తనవైపు గురిపెట్టి ఉన్నాడు. వాడిని చూసిన అర్జున్ తన రెండు చేతులు పైకెత్తి, రెండు మెట్లు దిగాడు. ఇంకో మెట్టు దిగిన అర్జున్, మెరుపువేగంతో కదిలి వాడిని ఒక్క తోపు తోశాడు. వాడు అల్లంత దూరాన ఎగిరి పడ్డాడు. వాడి చేతిలోని ఏకే–47 దూరంగా ఎగిరి పడింది.అర్జున్ గాలిలోకి డైవ్ చేస్తూ ఏకే–47 అందుకున్నాడు. అది చూసిన ఉగ్రవాది అక్కడనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క అర్జున్ రైఫిల్ పట్టుకుని తన చుట్టూ గమనించాడు. అక్కడ అప్పటికే చాలామంది చనిపోయి పడున్నారు. ఇంకొంతమంది రక్తమోడుతూ పడి ఉన్నారు. అర్జున్ తన చేతిలో ఉన్న ఏకే–47ను ఒక్కసారిగా ఆ ఉగ్రవాది వైపు గురిపెట్టాడు. క్షణాల్లో ఆ ఉగ్రవాది శరీరం జల్లెడలా మారి, కింద పడిపోయాడు. ఆ రైఫిల్‌ను అక్కడే పడేసి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించాలని ఆలోచిస్తూ ముందుకు రెండడుగులు వేశాడు అర్జున్. సరిగ్గా అప్పుడే.. బాంబు విస్ఫోటం.. హోటల్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి దూరంగా విసిరేయబడ్డాడు అర్జున్. కొద్దిక్షణాల తరువాత అతడి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. ఎదురుగా దుమ్ము .. ధూళి .. నల్లటి పొగ .. వాటిని చూస్తూ పైకి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కాని, అతడికి కదలడానికి శక్తి చాలడం లేదు. ఇంతలో లీలగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాటిని వినాలని చెవులు రిక్కించాడు.‘సాబ్.. నేను మీ గులాం.. నసీర్ అబ్దుల్లాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టే ఇక్కడ మొత్తం అందరినీ చంపేశాం’ చెప్తూ వికటంగా నవ్వసాగాడు.అటుపక్క నుంచి చెప్తున్నది వింటూ, ‘అలాగే సాబ్.. నేను ఇక్కడనుండి వెంటనే తప్పుకుంటాను. ఈ ఫోన్ కాలుతున్న మంటలలోకి విసిరేస్తున్నాను’ అంటూ ఫోన్ మంటలలోకి విసిరేసి, అక్కడనుండి ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి ఎవరో చూడాలని ప్రయత్నిస్తున్న అర్జున్‌కి కదలడం చేతకాక అలాగే ఉండిపోయాడు. అతడి కళ్ళు మూతలు పడిపోయాయి.రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) ఆఫీస్..మూడంతస్తుల ఆ భవనంలో చివరి అంతస్తు.. హోమ్ మినిస్టర్ ఆ అంతస్తులోకి అడుగుపెట్టాడు. హోమ్ మినిస్టర్ రాక గురించి తెలియగానే ‘రా’ చీఫ్ అగస్త్య అక్కడికి వచ్చాడు.‘అగస్త్యా! ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ మీద దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు దాటింది. అమాయకులైన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఎవరు చేశారో మనకు తొందరగా తెలియాలి’ అన్నాడు.‘సర్ .. నాకు రెండుగంటలు టైం ఇవ్వండి’ అన్నాడు అగస్త్య. ఒకపక్క ఒక విశాలమైన గది. ఆ గది నుంచి బయటకు వచ్చిన ఒక డాక్టర్ అగస్త్యను కలిశాడు.‘సారీ అగస్త్యగారు! అతడికి ఎలాంటి మందులు పని చేయడం లేదు. శరీరం మొత్తం చచ్చుబడిపోయింది’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.అగస్త్య విచారిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అది చిన్న సైజు హాస్పిటల్‌లా ఉంది. అక్కడ ఒక మంచం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఆ గదిలోనే ట్రీట్మెంట్ జరగడానికి వీలుగా అన్ని పరికరాలు అమర్చారు.అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.మంచం మీదున్న ఆ వ్యక్తిని కొద్దిసేపు అలా చూస్తుండిపోయాడు. తరువాత అక్కడున్న సిస్టం ఆన్ చేశాడు. పేపర్ వెయిట్ తిప్పుతూ ఆలోచనలో మునిగిపోయాడు. అతడు పేపర్ వెయిట్ తిప్పుతూ ఉంటే సిస్టంలో స్క్రీన్ సేవర్లు మారిపోతున్నాయి. తిప్పుతున్న పేపర్ వెయిట్ కిందపడిపోతుండగా, దానిని చేతులతో పట్టుకుని పక్కన పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో సిస్టంలో స్క్రీన్ సేవర్ ఆగిపోయింది. అది ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో.కొద్దిసేపు తరువాత అక్కడనుండి వెళదామని అనుకుంటూ అగస్త్య పైకి లేచాడు. అనుకోకుండా అగస్త్య చూపు మంచం మీదున్న వ్యక్తి మీద పడింది. ఒక్కసారిగా అగస్త్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి, అగస్త్యవైపే చూస్తున్నాడు.అగస్త్య అతడిని చూస్తూ, ‘అర్జున్! బాగానే ఉన్నావా?’ అడిగాడు.అర్జున్ మాట్లాడలేకపోతున్నాడు. అతడి కళ్ళు మాత్రమే చూడగలుగుతున్నాయి.ఏదో చెప్పాలని అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి శరీరం ఇసుమంతైనా కదలడం లేదు. ఆ బాధ అతడి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి పరిస్థితిని ఆందోళనగా చూస్తున్నాడు అగస్త్య.‘కమాన్ .. అర్జున్ కమాన్.. నువ్వు మాట్లాడగలవు. నువ్వు తలుచుకుంటే పైకి లేచి నిలబడగలవు’ అని ధైర్యవచనాలు చెప్తూ అర్జున్‌ని ఉత్సాహపరుస్తున్నాడు అగస్త్య.అర్జున్ పైకి లేవడం కాదు కదా, కనీసం మాట్లాడలేడని అతడికి తెలుసు.‘అర్జున్.. నువ్విప్పుడు ఏదైనా చెప్పగలిగితే మనం ఆ ఉగ్రవాదులను పట్టుకోగలం. ఫైవ్ హిల్స్ ప్యాలస్ హోటల్ దాదాపుగా ధ్వంసమైంది. నువ్వు కాపాడిన విదేశీ రాయబారులు క్షేమంగా తిరిగి వెళ్లిపోయారు.అందుకుగాను నీకు రాష్ట్రపతి ప్రశంస లభించింది. ఇప్పుడు ఆ ఉగ్రదాడి గురించి నువ్వు చెప్పే వివరాలు మాత్రమే మన దేశాన్ని కాపాడగలుగుతాయి’ అని చెప్తూ అగస్త్య అర్జున్ వంక చూశాడు. అర్జున్ కనులనుంచి నీటిచుక్కలు రాలిపడ్డాయి. అతని పక్కన కూర్చుని అగస్త్య కన్నీటిని తుడిచాడు. సరిగ్గా అదే సమయంలో.. అర్జున్ కళ్ళు అక్కడ ఆన్ చేసి ఉన్న సిస్టం మీద పడ్డాయి. సిస్టంను చూస్తూ అతడి కళ్ళు పెద్దవయ్యాయి.అర్జున్ కళ్ళలో మార్పులను గమనిస్తున్న అగస్త్య సిస్టంలో ఏముందా అని చూశాడు. అందులో.. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్– నాడీమండలం పని చేయడం ఆగిపోయి అమియోట్రోఫిక్ లాటరల్ స్కె›్లరోసిస్ వ్యాధి వలన స్టీఫెన్ హాకింగ్ కదలలేని, మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడు. అయినా, కేవలం కనురెప్పలు కదిలించడం ద్వారా ఎన్నో పుస్తకాలను రచించాడు.అది చూడగానే అర్జున్ కళ్ళలో ఏదో చెప్పాలన్న ఆరాటం కనిపిస్తోంది. అగస్త్య ఉత్సాహంగా పైకి లేచాడు. ‘అర్జున్! నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. నువ్వు ఆ ఉగ్రవాదుల గురించి ఏదో సమాచారం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కదా’ అన్నాడు అగస్త్య. ‘ఔను’ అన్నట్టుగా కనురెప్పలు ఆడించాడు అర్జున్. ‘అర్జున్ ముందు వాళ్ళ పేర్లు తెలిస్తే చెప్పు. వాళ్ళు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులో నేను కనిపెడతాను’ అన్నాడు అగస్త్య.అందుకు సమాధానంగా కనురెప్పలు కదిలించాడు అర్జున్.‘మొదలుపెడదాం’ అంటూ అగస్త్య, ‘నేను ఏబీసీడీలు చెప్తుంటాను. వాడి పేరులో మొదటి అక్షరం వచ్చినప్పుడు కనురెప్పలు కదిలించు అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్’ అన్నప్పుడు కనురెప్పలు కదిలించాడు అర్జున్. ఎన్ అనే అక్షరం రాసి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు అగస్త్య. అలా ‘నసీర్ అబ్దుల్లా’ పేరు బయటకు వచ్చింది. అర్జున్ను చూసి అగస్త్యకు కళ్ళు తడిబారాయి.పేరు మోసిన ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్ అబ్దుల్లాను, మిగిలినవారిని ‘రా’ అరెస్ట్ చేసింది.కేవలం ‘కనురెప్పలే సాక్షిగా‘ భయంకరమైన ఉగ్రవాదులను కనిపెట్టినందుకు అర్జున్‌కు ప్రత్యేకమైన అవార్డు ప్రకటించారు.

పెద్దలకు ఇద్దాం! ఇమ్యూనిటీకాలు
మామూలుగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకే అని చాలామంది అనుకుంటుంటారు. అవి పెద్దవాళ్లకూ అవసరమవుతాయి. కోవిడ్ టైమ్‌లో వ్యాక్సిన్‌కు విశేషప్రాచుర్యం వచ్చింది. పెద్దవాళ్లకు ఇచ్చే వ్యాక్సిన్ అంటే అది కోవిడ్ కోసమే కాదు... ఇంకా చాలా రకాల వ్యాధులను నివారించగలిగే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన కారణం ఏమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక వ్యవస్థ మునపటి అంత బలంగా ఉండకపోవచ్చు. దాంతో ఇమ్యూనిటీకి బలం పెంచడం కోసం ఇలా తీసుకోవచ్చు. అలాగే చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్లు క్రమంగా ప్రభావం కోల్పోతూ ఉండవచ్చు. అందుకే వాటిని మరింత బలోపేతం చేసేందుకు 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలివి...సాధారణంగా 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, వాళ్లలో వ్యాధి నిరోధక వ్యవస్థ కాస్త బలహీనంగా (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నప్పుడు 65 ఏళ్ల వయసు తర్వాత కొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన టీకాలు ఇవ్వడం ద్వారా ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. అందుకే ఈ వ్యాక్సిన్లు.పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లుడిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ తమ చిన్నతనంలో డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారు. కానీ 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి వాళ్లలో ఆ టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్‌ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. అది బూస్టర్ డోస్‌లా పనిచేసి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది.హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కాలేయాన్ని ప్రభావితం చేసేదే ఈ హెపటైటిస్–ఏ వైరస్. కలుషితాహారం, కలుషితమైన నీటి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. దీని నివారణకు ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, ఆర్నెల్లకు మరో విడత కూడా తీసుకోవాలి.హెర్పిస్ జోస్టర్ వ్యాధిహెర్పిస్ జోస్టర్ అనే వైరస్‌తో మొదట చికెన్‌పాక్స్ వచ్చి, అటు పిమ్మట అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. హెర్పిస్ జోస్టర్ వైరస్ సోకిన వాళ్లలో 60 ఏళ్లు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ. జోస్టర్ వ్యాక్సిన్ అన్నది ఈ హెర్పిస్ జోస్టర్ వ్యాధి నుంచి నివారణ ఇస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల 100 శాతం వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ లేదు గానీ... వ్యాక్సిన్‌తో బాధితుల జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు.వ్యారిసెల్లా వ్యాక్సిన్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ ‘చికెన్‌పాక్స్’ను కలిగిస్తుంది. వ్యారెసెల్లా వ్యాక్సిన్ వృద్ధుల్లో ఈ చికెన్ పాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అప్పటికే ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నవాళ్లకూ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వాళ్లకూ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్‌లో ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి డాక్టర్లు ఈ వ్యాక్సిన్‌ను సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని తీసుకున్నవారు కూడా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు. గర్భవతులకూ దీన్ని ఇవ్వకూడదు.హెపటైటిస్–బి వ్యాక్సిన్హెపటైటిస్–బి వైరస్ కూడా కాలేయాన్నే ప్రభావితం చేసే మరింత ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాల్లోనే దీని వ్యాప్తీ జరుగుతుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసిప్రాణాంతకంగా మార్చే ముప్పు ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన వైరస్‌కు అదృష్టవశాత్తూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీన్ని మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసూ, అలాగే మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులూ దీన్ని తీసుకోవడం మేలు.ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధికి నివారణగా ఇచ్చే వ్యాక్సిన్. జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే రెండో దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి తీవ్రంగా బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటుంది. అందుకే జలుబు వైరస్‌కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవై ఐదేళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టేటస్‌లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది.సూచన : గుడ్డుతో అలర్జీ ఉన్నవారు దీని బదులు రీకాంబినెంట్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి.టైఫాయిడ్ వ్యాక్సిన్ : అందరూ తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యాక్సిన్ ఇది. మరీ ముఖ్యంగా ఆహార పరిశ్రమలో పనిచేసేవారూ, వంటలు చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. ఆహార తయారీ రంగంలో ఉండేవారికి టైఫాయిడ్ ఉంటే... ఓ క్యారియర్‌గా వారు అనేక మందికి ఈ వ్యాధిని సంక్రమింపజేసే అవకాశం ఉన్నందున వాళ్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నది డాక్టర్ల సిఫార్సు.హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్‌పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ అమ్మాయిలు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోసు ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోసు ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది.మరికొన్ని వ్యాక్సిన్లు ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందిగానీ దాన్ని కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఇస్తారు. ఇవేగాక జపనీస్ ఎన్కెఫలైటిస్, రేబీస్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఎల్లో ఫీవర్ వ్యాధి మన దేశంలో లేదు కాబట్టి అది ఉన్నచోటికి వెళ్లే ప్రయాణికులు అక్కడికి వెళ్లే 15 రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే పశ్చిమాసియా దేశాలకు వెళ్లేవాళ్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.నిమోకోకల్ వ్యాక్సిన్: వయసు పైబడిన వారిలో స్ట్రె΄్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియాతో నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23): ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్’ తో ప్రయోజనం చేకూరుతుంది. ఇది కేవలం ఒక్క నిమోనియాకు మాత్రమే కాకుండా మెనింజైటిస్, బ్యాక్టీ రిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్) లకు నివారణ ఔషధంగా కూడా పనిచేస్తుంది.అయితే దీనివల్ల నూరు శాతం నివారణ జరగకపోవచ్చు. కాకపోతే చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గి, కాంప్లికేషన్లు కూడా చాలా వరకు నివారితమవుతాయి. అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి.

ఫ్యూచర్ టెన్స్ విజన్ 2030
పాతిక సంవత్సరాలు బ్యాంకర్‌గా పనిచేసిన ముంబైకి చెందిన మధురా దాస్ గుప్తా సిన్హా ఉద్యోగమే జీవితం అనుకోలేదు. ఇతర మహిళల జీవితాల గురించి ఆలోచించింది. ప్రసవం తరువాత దాస్ గుప్తా స్నేహితురాలు ఉద్యోగ విరామం తీసుకుంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగ విరామం అలాగే ఉండిపోయింది‘పెళ్లయిన తరువాత ఉద్యోగం ఎందుకు?’ అనే భావనతో ఒక యువతి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది... ఇలాంటి సంఘటనలు మధురా దాస్ గుప్తాను లోతుగా ఆలోచించేలా చేశాయి.‘యాస్పైర్ ఫర్ హర్’ అనే సంస్థనుప్రారంభించేలా చేశాయి.భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకొని ‘యాస్పైర్ ఫర్ హర్’కు శ్రీకారం చుట్టింది మధురా దాస్ గుప్తా. మెంటార్షిప్, స్కిలింగ్, రోల్‌మోడల్స్, నెట్వర్కింగ్ ద్వారా మహిళలు శ్రామిక శక్తిలోకి వచ్చేలా ప్రేరేపించడానికి ఉద్దేశించిన కమ్యూనిటీ ఆధారిత వేదిక ఇది. 2030 నాటికి పది మిలియన్ల మంది మహిళలను శ్రామిక శక్తిలో చేర్చే లక్ష్యంతో ‘యాస్పైర్ ఫర్ ఉమెన్’ పనిచేస్తుంది.
ఫొటోలు


రెడ్ శారీలో మెరిసిపోతున్న మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. (ఫోటోలు)


స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ రీతూ వర్మ పోజులు.. ఫోటోలు


మాల్దీవుల్లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ (ఫోటోలు)


రజినీకాంత్ 'కూలీ' మూవీ వర్కింగ్ స్టిల్స్


'మసూద'లో భయపెట్టిన అమ్మాయి ఎంత అందంగా మారిందో చూశారా (ఫొటోలు)


విజయవాడ : సురభి నాటకోత్సవాలు అలరించిన భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన (ఫొటోలు)


వైభవంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)


‘కోర్ట్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)


సప్తగిరి ‘పెళ్ళి కాని ప్రసాద్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)


మహిళల ప్రీమియర్ లీగ్‌లో విజేతగా ముంబై ఇండియన్స్..టైటిల్ సొంతం (ఫొటోలు)
International View all

ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్
అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్..

స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..
ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

సునీత వచ్చేస్తోంది.. ఐఎస్ఎస్తో క్రూ-10 అనుసంధానం సక్సెస్
అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.

‘మీ టైమ్ అయిపోయింది’.. వారికి ట్రంప్ హెచ్చరిక
సానా: యెమెన్‌లో హౌతీలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది.

26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం?
జీలం: పాకిస్తాన్‌లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో..
National View all

పుట్టిన ఏడాదికే తల్లి వెంటే జైలుకు పసిబిడ్డ.. పాపం ఈ చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో
బెంగళూరు : ప్రసవించిన 14రోజులకే అనివార్య కారణాలతో రూ.60వేలకు

మిజోరం వండర్ కిడ్కి అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి

అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు లేఖ
కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) క

స్వర్ణ దేవాలయంలో భక్తులపై దాడి.. ఐదుగురికి గాయాలు
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల స్వర్ణదేవాలయం(

తమిళులపై కామెంట్స్.. పవన్‌కు ప్రకాష్‌రాజ్ కౌంటర్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ
International View all

ఘోర అగ్ని ప్రమదం.. 51 మంది దుర్మరణం!
నార్త్ మెసీడోనియా: యూరప్ లోని నార్త్ మెసీడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 10 మంది సైనికులు మృతి!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది.

అమెరికాలో రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు.. కారణం ఇదే..
వాషింగ్టన్: భారత్‌కు చెందిన రంజనీ శ్రీనివాసన్‌కు వీసా రద్దు

నింగిలోకి ఫాల్కన్.. వెల్కమ్ బ్యాక్ సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్

‘చిప్’ల కోసం ట్రంప్ స్కెచ్
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన త
National View all

దేవుడా..నా కూతుర్ని ఎందుకు చంపేశావ్.!
శివమొగ్గ: ఇంట్లో నీటి ట్యాంక్ నింపాలని మోటార్ స్విచ్ ఆన్

Punjab: హిందూ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి
జలంధర్: పంజాబ్(

ర్యాపిడ్ రైలు కారిడార్‌పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే..
న్యూఢిల్లీ: నమో భారత్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని, సౌకర్యాలను

లీలావతి ఎవరు? ఆమె పేరుతో ఉన్న ఆస్పత్రి ఎందుకు చిక్కుల్లో పడింది?
ముంబై: మహానగరం ముంబైలోని సుప్రసిద్ధ లీలావతి హాస్పిటల్(

హైపర్‌లూప్ ‘పాడ్’.. అరగంటలో 350 కిలోమీటర్ల ప్రయాణం..
చెన్నై: భూమి మీద విమాన వేగంతో ప్రయాణికులను గమ్య స్థానాలకు చే
NRI View all

కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ క

పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస
NRI View all

గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసార

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు వి

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ
క్రైమ్

రన్యారావుతో నాకే సంబంధం లేదు: పిడుగురాళ్ల వ్యాపారి
పల్నాడు, సాక్షి: పిడుగురాళ్లలో తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ ఓ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడన్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కన్నడ నటి, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు(Ranya Rao) పేరు తెర మీదకు రాగా.. పరారీలో ఉన్నాడని చెబుతున్న సదరు వ్యాపారి ఈ అంశంపై స్పందించాడు. ఏం జరిగిందంటే.. స్థానికంగా తాను మిర్చి ఎగుమతి, బంగారు దిగుమతి చేస్తున్నానని.. తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు ఇస్తానంటూ సదరు వ్యాపారి ప్రచారం చేశాడు. అయితే అతని ఆర్భాటాలు, అప్పటికే అతను చేసిన దానధర్మాలు చూసిన కొందరు అది నిజమేనని నమ్మారు. దాచేపల్లి, కారంపూడి, సత్తెనపల్లి, నరసరావుపేటకు చెందిన కొందరు సదరు వ్యాపారికి డబ్బు ముట్టజెప్పారు. మార్చి మొదటి వారం నుంచి ఆ వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో తాము మోసపోయామన్న ఆందోళనతో బాధితులు లబోదిబోమన్నారు. అయితే సదరు వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని భావిస్తుండగా.. అతని పేరిట ఓ వాట్సాప్ సందేశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.తానేం దేశం విడిచి పారిపోలేదని.. ఇండియాలోనే ఉన్నానని.. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, రెండు నెలల టైం ఇస్తే అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఆ ఆడియో మెసేజ్‌లో చెప్పాడు. వందల కోట్లు ఎగ్గొట్టాడని వార్తల్లో వస్తున్న కథనాలను ఆ వ్యాపారి తోసిపుచ్చాడు. అలాగే.. నటి రన్యా రావుతో లింకులు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. ఆమెతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని ఆ ఆడియో మెసేజ్‌తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సారీ నాన్నా.. యూజ్‌లెస్‌గా ఉండలేను!
శ్రీకాకుళం: ‘సారీ నాన్న.. నాకెంతో చేశారు.. నేను కొంచెం కూడా మీకు ఉపయోగపడలేదు. ఇంత వయస్సు వచ్చినా మీకు సహాయం కాకుండా నేను ఉన్నాను. యూజ్‌లెస్‌గా ఉండటం కంటే మీకు దూరంగా ఉంటేనే కరెక్టని నాకు అనిపించింది. మిమ్మల్ని కష్టపెట్టాలనినాకు లేదు..’ అని వాట్సాప్ డీపీలో మెసేజ్ పెట్టి ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నందిగాం మండలం ఆనందపురం ఊర చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన ఇచ్ఛాపురం హరికృష్ణ(24) విజయనగరంలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేవాడు. 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం విజయనగరం వెళ్తాను డబ్బులు ఇవ్వు అని తల్లిని అడిగాడు. కొద్ది రోజుల్లో ఇంటి సంబరం ఉందని, అదయ్యాక వెళ్లు అని చెప్పి రూ.550 ఇచ్చింది. డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన హరికృష్ణ పురుగుల మందు కొని ఆనందపురం చెరువు వద్దకు వెళ్లి తాగాడు. అనంతరం తన గ్రామానికి చెందిన స్నేహితుడు మామిడి విజయ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విజయ్ కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు తెలియజేసి ఆనందపురం వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న హరికృష్ణను పలాసలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం మెడికవర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. మృతుడి తల్లి ఆదిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్‌మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే హరికృష్ణ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యతో గొడవపడి భర్త.. పటాన్చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్‌చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్లో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్‌లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కుల్ఫీ ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీట్లలో గంజాయి
సాక్షి, హైదారాబాద్/అబిడ్స్ : హోలీ సంబరాలను సొమ్ము చేసుకొనేందు కు గంజాయి విక్రేతల ముఠా కొత్త పన్నాగం పన్నింది. హోలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం లోయర్ ధూల్‌పేట్‌లో కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లకు సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి కుల్ఫీ ఐస్‌క్రీమ్‌ల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వా«దీనం చేసుకుని, సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వీడియోలు


రూ.11 వేల కోట్ల అప్పు కోసం హడ్కోతో CRDA ఒప్పందం


నార్త్ మెసీడోనియాలో అగ్ని ప్రమాదం


ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పు లపాలు చేశారు: సీఎం రేవంత్ రెడ్డి


అసలు సమంత జీవితంలో ఏం జరుగుతుంది ?


ఏఆర్ రెహమాన్ హెల్త్ బులెటిన్ విడుదల


అసలు విషయం మర్చిపోయిన వీరమల్లు.. అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి


పాక్ సైన్యం కాన్వాయ్ పై బలూచ్ తిరుగుబాటుదారుల దాడి


భూ లక్ష్మి ఆలయంలో యాసిడ్ దాడి కేసు ఛేదించిన పోలీసులు


అది YS జగన్ చిత్తశుద్ధి.. సభలో సీఎం రేవంత్ పొగడ్తలు


OUలో ఆంక్షలు విధించడంపై కేటీఆర్ మండిపాటు