
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు,ఫాల్గుణ మాసం, తిథి: బ.విదియ ప.2.50 వరకు తదుపరి తదియ, నక్షత్రం: హస్త ఉ.10.06 వరకు, తదుపరి చిత్త,వర్జ్యం: సా.6.56 నుండి 8.42 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు, అమృత ఘడియలు: తె.5.32 నుండి 7.20 వరకు (తెల్లవారితే సోమవారం).
సూర్యోదయం : 6.13
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కార్యజయం. ముఖ్య విషయాలపై చర్చలు. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం.... కొన్ని కఠినపరీక్షలు ఎదుర్కొంటారు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు మందగమనంలో సాగుతాయి.
మిథునం... కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తులు, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
కర్కాటకం.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
సింహం... శ్రమ వృథా కాగలదు. విలువైన పత్రాలు జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి.
కన్య.... పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.
తుల.... రుణబారాలు. బంధువులతో తగాదాలు. ప్రయాణాలు రద్దు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వృత్తులు, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం.. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు.... నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. నూతన విద్యావకాశాలు. కొత్త వ్యక్తుల పరిచయం. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
మకరం.... రుణఒత్తిడులు పెరుగుతాయి. సోదరులతో కలహాలు. బాధ్యతలు కొన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం.... కొన్ని అంచనాలు తప్పుతాయి. నిర్ణయాలలో పునరాలోచన. దూరప్రయాణాలు. బంధువులతో విరోధాలు. దైవదర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు అంతగా కలసిరావు.
మీనం.... కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment