Himani Shivpuri
-
బాలీవుడ్ నటి హిమానీ శివపురికి కరోనా..
ముంబై: కరోనా మహమ్మారి సామాన్య జనాల నుంచి సెలబ్రిటీల వరకు అందరిని హడలెత్తిస్తుంది. తాజాగా బాలీవుడ్ పరిశ్రమలో అనేక సినిమాలలో నటించిన హిమానీ శివపురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో తెలిపింది. కాగా ఎవరైనా తనను కలిస్తే వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. హిమానీ 'ఘర్ ఏక్ సప్నా' వంటి ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే 'హమ్ ఆప్కే హై కౌన్', 'దిల్వాలే దుల్హానియా లే జయేంగే', 'పార్డెస్' వంటి అనేక చిత్రాల్లో హిమానీ నటించారు. అయితే కుచ్ కుచ్ హోతా హైలో రిఫాత్ బీ పాత్రకు మంచి పేరు వచ్చింది. కేవలం సినిమాలలోనే కాక టెలివిజన్ రంగంలో కూడా హిమానీ శివపురి మంచి నటనతో పేరు తెచ్చుకున్నారు. -
బీజేపీలో చేరిన ప్రముఖ నటి
డెహ్రడూన్: బాలీవుడ్ సీనియర్ నటి హిమాని శివపురి గురువారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఉత్తరాఖండ్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్యోతి ప్రసాద్ గైరోలా సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా హిమాని శివపురి మాట్లాడుతూ.. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన హిమాని బాలీవుడ్ లో సహాయ నటిగా గుర్తింపు పొందారు. 1984లో వచ్చిన ‘ఆబ్ ఆయేగా మజా’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. రాజా, పరదేశ్, హీరో నంబర్ వన్, కోయలా, బంధన్, దీవానా మస్తానా, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, ఉమ్రావ్ జాన్ తదితర చిత్రాల్లో కనిపించారు. పలు హిందీ సీరియల్స్ లోనూ వివిధ పాత్రలు పోషించారు. ఆమెకు కత్యాయన్ అనే కుమారుడు ఉన్నాడు.