సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్‌కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్‌తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.
ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్‌ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్.
ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్‌గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్‌ను పోస్ట్ చేశాడు. ఈ రీల్‌లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్‌లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో అవార్డు కూడా పొందాడు.
ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలు
విశేషం ఏమిటంటే
అతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్‌ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
రిజ్వాన్ స్పందన
“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్‌కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు
రిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, మరో చేతిలో ఫుట్‌బాల్‌ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్‌ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్)
కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్‌కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్‌బాల్‌తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment