gunnies record
-
కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్‌కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్‌తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్‌ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్‌గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్‌ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్‌లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్‌తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్‌ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్‌కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, మరో చేతిలో ఫుట్‌బాల్‌ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్‌కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్‌బాల్‌తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai).. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఐయోనిక్ 5' (IONIQ 5) ఎలక్ట్రిక్ కారు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కిన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించడంతో.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ కారు లేహ్ లడఖ్‌లోని ఉమ్లింగ్ లా నుంచి సముద్ర మట్టానికి 5799 మీ (19,024 అడుగులు) ఎత్తులో కేరళలోని కుట్టనాడ్ వరకు ప్రయాణించింది.మొత్తం 14 రోజులు 4900 కిమీ కంటే ఎక్కువ దూరం.. విభిన్న రహదారుల్లో, పలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఐయోనిక్ 5 విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈవో ఇండియా టీమ్ ఈ డ్రైవ్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హ్యుందాయ్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' (Unsoo Kim) మాట్లాడుతూ, ఐయోనిక్ 5 పర్ఫామెన్స్.. ఇంజినీరింగ్ నైపుణ్యం వంటివి తిరుగులేనివి. కంపెనీ విజయానికి, కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం అని అన్నారు.Hyundai IONIQ 5 takes part in GUINNESS WORLD RECORDS™ Title for the Greatest Altitude Change by an Electric Car ▶ https://t.co/KeB82JGXOX@GWR #Hyundai #IONIQ5 #EV #GUINNESSWORLDRECORDS pic.twitter.com/G2kzjNjVr2— Hyundai Motor Group (@HMGnewsroom) December 26, 2024హ్యుందాయ్ ఐయోనిక్ 5హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై తయారైంది. స్మార్ట్ మొబిలిటీ అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్దేశించింది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. దీని ధర రూ. 52.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంట.. ఇంట్రెస్టింగ్ ఫోటోలు!
-
మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - ఒక్క రోజులోనే గిన్నిస్ రికార్డ్!
Meta Threads: ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన మెటా థ్రెడ్స్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. విడుదలైన ఒక రోజుకే సంచలనం సృష్టించి ట్విటర్‌కు షాక్ ఇచ్చిన ఈ యాప్ ఏకంగా 1 మిలియన్ మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకున్న ఒక వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలోనే 10 లక్షల ఫాలోవర్స్ సాధించిన సరి కొత్త రికార్డ్ నెలకొల్పాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ 'జిమ్మీ డోనాల్డ్సన్' (Jimmy Donaldson) మెటా థ్రెడ్స్ డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) పాతిక సంవత్సరాల డోనాల్డ్సన్ 'మిస్టర్ బీస్ట్' అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాడు. తాజాగా విడుదలైన థ్రెడ్స్ యాప్‌లో కూడా తన హవా చూపించాడు. ఇతడు మెటా థ్రెడ్స్‌లో కేవలం మూడు పోస్టులు మాత్రమే చేసినట్లు సమాచారం. ఈ మూడు పోస్టులకు 1 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారంటే ఇతడెంత ఫెమస్ అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఫాలోవర్స్ పెరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో తీసి ట్విటర్ ద్వారా పోస్ట్ చేసాడు. The moment @mrbeast reached one million followers on Threads... (yes, this is how we monitored the record) (and yes, it drained the battery from our phone a lot) pic.twitter.com/PwzrUNPa2t — Guinness World Records (@GWR) July 6, 2023 -
Viral Video: తగ్గేదేలే..! స్కిప్పింగ్‌లో కుక్క గిన్నిస్ వరల్డ్ రికార్డు
-
కీహోల్ ద్వారా.. ఆర్చరీలో అరుదైన రికార్డు..
-
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!
ప్రస్తుతం మనుషులు సరైన జీవన సరళిన పాటించకపోవడం దీనికితోడు వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులతో మానవుల ఆయుః ప్రమాణం రోజురోజుకి తగ్గిపోతుంది . పైగా ఒత్తిడి, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడంతో రకరకాల వ్యాధుల భారినపడి అతి తక్కువ వయస్సులోనే మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. అలాంటి పరిస్థితిని సైతం తట్టుకుని సెంచరీ వయసుదాటిన ఇప్పటికి ఆరోగ్యంగానే ఉండటమే కాక 119వ పుట్టినరోజు జరుపుకుంది జపాన్‌కి చెందిన శతాధిక వృద్ధురాలు. (చదవండి: ఇప్పుడు పశ్చాత్తాపం పడిన ప్రయోజనం లేదు!... శిక్షలు అనుభవించాల్సిందే!!) అసలు విషయంలోకెళ్లితే...జపాన్‌కు చెందిన తనకా 1903లో జన్మించింది. అదే ఏడాది రైట్ బ్రదర్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి విమానాన్ని కనుగొన్నారు. అంటే ఆమె మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి 11 సంవత్సారాల ముందు జన్మించింది. అంతేకాదు ప్రపంచంలేనే అత్యంత వృద్ధ మహిళ అయిన కేన తనకా తన 119వ పుట్టినరోజును జనవరి2, 2022న జరుపుకున్నారు. ఆమె ప్రస్తుతం ఫుకుయోకాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో నివసిస్తోంది. అయితే ఆమె మాట్లాడలేదు కానీ తన హావభావాలను ఉపయోగించి సిబ్బందితో కమ్యూనికేట్ చేస్తుంది. అంతేకాదు ఆమె ఎక్కువగా పజిల్స్ పరిష్కరించడంలో గడపడానికి ఇష్టపడుతుంది. పైగా ఆమె 1922లో హిడియో తనకాను వివాహం చేసుకుంది. అయితే ఆమెకు ఐదుగురు పిల్లలు. ఆమె భర్త, పెద్ద కుమారుడు రెండవ చైనా-జపనీస్ యుద్ధంలో పాల్గోన్నారు. అంతేకాదు 2020 నాటికి ఆమెకు ఐదుగురు మనవళ్లు ఎనిమిది మంది మనవరాళ్లు ఉన్నారు. పైగా తనకా ఇప్పటికీ గణితం, నగీషీ వ్రాతలను అధ్యయనం చేయడంలో ఉత్సాహంగా ఉంది. ఆమె తన కుటుంబ సభ్యులు, నర్సింగ్ హోమ్ అటెండెంట్లతో బోర్డ్ గేమ్‌లు ఆడుతుండటం మరొక విశేషం. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2019లో తనకాని ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా జీవించి ఉన్న వ్యక్తిగా గుర్తించింది. అయితే ఆ సమయానికి ఆమె వయసు 116. (చదవండి: భారత సంతతి అమృతపాల్ సింగ్ మాన్కు యూకే గౌరవ జాబితాలో చోటు !) -
గిన్నిస్ రికార్డు కెక్కిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్
Choreographer Radhika Guinness Record: ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు రాధిక గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఏఎంఎస్ ఫైన్ఆర్ట్స్ సంస్థ నిర్వాహకుడు, సమాజ సేవకుడు డాక్టర్ ఆర్.జె.రామనారాయణన్ నాట్యకళలను ప్రోత్సహించే విధంగా వాటిపై అవగాహన కలిగించే విధంగా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా సినీ నృత్య దర్శకురాలు రాధిక బృందం నేతృత్వంలో చెన్నైలోని పలు వేదికలపైనా, అదే విధంగా ఆన్లైన్ ద్వారా రోజూ గంట చొప్పున 365 రోజులు నాట్యకళ వేడుకలను నిర్వహించారు. ఇందులో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు. కాగా చివరిరోజున 600 మంది నాట్య కళాకారులతో నిర్వహించిన నాట్యకళ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదైంది. న్యాయమూర్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డ్ బుక్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా తిలకించారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అతిథిగా పాల్గొని నాట్య కళాకారులను అభినందించడంతో పాటు గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రాన్ని నృత్య దర్శకురాలు రాధికకు ప్రదానం చేశారు. -
సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!
అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు. బియ్యపు గింజపై కళాఖండాలు చెక్కి ఔరా! అనిపిస్తాడు. పెన్సిల్ మొనపై రాటుదేలిన తన పనితనంతో బొమ్మ చెక్కితే భూతద్దం పెట్టి చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటికే తన కళాతృష్ణతో రెండు సార్లు లిమ్కా బుక్ రికార్డులకెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి విజయమోహన్ తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ అబ్బురపరిచాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు చెక్కి గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. సూక్ష్మకళలో కొన్నేళ్ల నుంచి అద్భుతాలు సృష్టిస్తున్న అతను బియ్యపు గింజలపై వివిధ కళాఖండాలు చెక్కడంలో దిట్ట. బియ్యపు గింజ ఎంత చిన్నగా ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి గింజపై వేల కొద్దీ బొమ్మలు చెక్కిన ఘనత ఆయనది. ప్రస్తుతం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయ అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ ఎలాంటి సూక్ష్మదర్శిని వాడకుండా చిన్నపాటి సూదిమొనతో ఈ అద్భుతాలు సృష్టించడం విశేషం. – నరసాపురం బియ్యపు గింజలు, నువ్వుల గింజలు, కొబ్బరి పీచు ఇలా ఈ సూక్ష్మమోహనుడు పనితనానికి కాదేదీ అనర్హం. దేనిపైనైనా అద్భుతంగా బొమ్మలు చెక్కిచూపిస్తాడు. పదేళ్ల వయస్సులో పనికిరాని వస్తువులతో బొమ్మలు చేయడంతో ప్రారంభమైన ఇతని విజయ ప్రస్థానం ఈ రోజు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచం మొత్తంగా సూక్ష్మ కళాకారులు ఎంతో మంది ఉండగా.. బియ్యపు గింజపై బొమ్మలు చెక్కే వారు చాలా అరుదు. బియ్యపు గింజలపై పేర్లు రాయడం వంటివి చాలామంది చేస్తుంటారు. అయితే ఆ దశను మోహన్ దాటి మరింత ముందుకు వెళ్లాడు. ఇంత వరకూ బియ్యపు గింజలపై 3 వేల వరకూ బొమ్మలు చెక్కాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు, ప్రియురాలి హృదయం, దేశ నాయకులు ఇలా.. ఒక్కో బియ్యపుగింజపై ఒక్కో అద్భుత ఆకారాన్ని సృష్టించాడు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా.. ఒకే బియ్యపుగింజపై శ్రీరామ పట్టాభిషేకం దృశ్యం మొత్తం చెక్కడం ఆ యువకుడి ప్రతిభకు మరో తార్కాణం. పెన్సిల్ మొనలు, సుద్దముక్కలపై 5 వేల పైనే బొమ్మలు చెక్కాడు. నువ్వుల గింజ, కొబ్బరిపీచులో ఒక లేయర్‌పై బొమ్మలు వేస్తాడు. భవిష్యత్‌లో కొబ్బరిపీచు లేయర్‌పై కూడా బొమ్మ చెక్కే ప్రయత్నం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన విజయమోహన్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఢిల్లీ పిలిపించుకుని అభినందించారు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) తొలి ప్రయత్నంలోనే గిన్నిస్ రికార్డు బియ్యపు గింజలపై బొమ్మలే కాదు కాకుండా చెట్ల ఆకులపై సూదితో చిల్లులు పెడుతూ ఎవరి ఆకారాన్ని అయినా చెక్కేస్తాడు. అగ్గిపుల్లలు, కోడిగుడ్డు గుల్లలు, ఖాళీ బీరుబాటిళ్లు, పనికిరాని చెక్క ముక్కలు అతని కంటిలో పడితే అందాలు చిందే వస్తువులుగా మారిపోతాయి. ఇంజినీరింగ్ పూర్తిచేసి 2019 అక్టోబర్‌లో గ్రామసచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అయినా తన ప్రవృత్తిని వదిలిపెట్టకుండా బొమ్మలు చెక్కడం కొనసాగిస్తూ గిన్నిస్ రికార్డు సాధించాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు ఎలాంటి అతుకులు లేకుండా చెక్కి గిన్నిస్ సాధించాడు. అదీ తొలిప్రయత్నంలోనే కావడం గమనార్హం. దీనికి కేవలం రెండురోజుల సమయం పట్టింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అతిచిన్న మిక్సీ తయారు చేసినందుకు 2019 మార్చి 16న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతనిపై వ్యాసం వెలువడింది. మళ్లీ అదే ఏడాది అతిచిన్న మజ్జిగ చిలికే యంత్రం తయారుచేసి రెండోసారి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కాడు. నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్ట్స్ విభాగంలో విజయమోహన్‌ను జాతీయ స్థాయిలో రాష్ట్రీయ యువ గౌరవ అవార్డుతో సత్కరించింది. 2018 మార్చి 21న ఢిల్లీలోని ఆంధ్రా భవన్లో జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర మంత్రులు విజయ్‌గోయల్, రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ యువకుడిని తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇన్క్రెడిబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడుకు చెందిన ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ ఎచీవర్ బుక్ అఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు. 2017 ఆగస్ట్‌లో ఒకే ఒక్క బియ్యపుగింజపై శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని సూక్ష్మదర్శిని సాయం లేకుండా 3 గంటల వ్యవధిలో చెక్కినందుకు నేషనల్ రికార్డ్స్ బుక్ పురస్కారం లభించింది. 2017 సెప్టెంబర్‌లో మూడు బియ్యపు గింజలపై మూడు భాషల్లో జాతీయ గీతాన్ని 10 గంటల వ్యవధిలో రాసినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 2015లో 33 రోజుల్లోనే 1,33,333 గింజలపై సాయిరాం నామావళిని రాసి ఔరా అనిపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. గిన్నిస్ సాధించాలన్న నా కల నిజమైంది. ఆనందంగా ఉంది. ఈ కళలో ఇంకా సాధించాలి, మరింత ప్రయోగాత్మకంగా ముందుకెళ్లాలని ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఏ వస్తువు చూసినా దానిని ఏదో చేయాలనే ఆలోచన వచ్చేది. ఇదే ఉత్సాహం నన్ను ఈ కళకు పరిచయం చేసింది. బియ్యపు గింజలపై బొమ్మలు చెక్కేవారు ప్రపంచం మొత్తంగా ఎవరూ లేరు. అదీ సూక్ష్మదర్శిని లేకుండా చిన్న సూది మొనతో చెక్కుతాను. అందువల్లే గిన్నిస్ సాధ్యమైంది. –కొప్పినీడి విజయమోహన్ -
గిన్నిస్ బుక్‌లోకెక్కిన ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి
నరసాపురం: పెన్సిల్ లెడ్‌పై అతుకులు లేకుండా, ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా సూదిమొనతో 246 లింకులు చెక్కినందుకు గాను ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయంలో అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న కొప్పినీడి విజయమోహన్‌కు సూక్ష్మ కళాకారుడిగా పేరు ఉంది. సూదిమొనతో బియ్యపు గింజలపై కళాకృతులు చెక్కి ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. రాష్ట్రీయ యువగౌరవ్ సమ్మాన్ అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. 50 వరకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. విజయమోహన్ తండ్రి వరహాలరావు ఆటో డ్రైవర్. తల్లి నాగ సుశీల గృహిణి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విజయమోహన్ 2019 అక్టోబర్‌లో గ్రామ సచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. -
గిన్నిస్ రికార్డుల్లోకి బుజ్జి ఆవు?
లేగ దూడ ఎంత ముద్దుగా ఉందో కదూ..! ఈ దూడ చూడటానికి చుట్టుపక్కల ఊర్లకు చెందిన వందల మంది వస్తున్నారట. ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంతమంది ఎందుకు వస్తారనే కదా మీ అనుమానం. ఈ లేగ దూడ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉన్న ఆవుగా రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇది ఎంత ఎత్తు ఉందో తెలుసా 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు) మాత్రమే. పైగా 26 కిలోలు మాత్రమే ఉన్నట్లు దీని యజమానులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ వయసు 23 వారాలు. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.అయితే ఇప్పటివరకు అతి చిన్న ఆవుగా భారత్‌కు చెందిన మాణిక్యం (వేచూర్ జాతి) గిన్నిస్ రికార్డుల్లో ఉంది. మాణిక్యం 24 అంగుళాలు (31 సెంటీమీటర్లు) ఎత్తు ఉంటుంది. దీన్ని బట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు కనుక పరిశీలిస్తే కచ్చితంగా మాణిక్యం రికార్డును రాణి ఎత్తుకుపోతుందని దాని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
Green India Challenge: గిన్నీస్ బుక్‌లో పాలమూరు ఆడబిడ్డలు
పాలమూరు ఆడబిడ్డలు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. విత్తన బంతుల (సీడ్ బాల్స్)తో ఇంగ్లిష్ అక్షరాలతో అతిపెద్ద వాక్యాన్ని పేర్చినందుకు ఈ ఘనత సాధించారు. అంతేకాదు 2.08 కోట్ల విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేసి వెదజల్లారు. జిల్లాలోని 479 గ్రామైక్య, 11,506 స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ 1,29,506 మంది మహిళలు, మెప్మా ఆధ్వర్యంలోని 27,040 మంది 10 రోజుల పాటు శ్రమించి వీటిని తయారుచేశారు. 81 మంది మహిళలు.. 81 ఇంగ్లిష్ అక్షరాలతో ‘టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ఉమెన్ ట్రాన్స్ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్ టు హెటిరో గ్రీన్ బెల్ట్’అని ఇంగ్లిష్‌లో 73,918 సీడ్ బాల్స్‌ను పేర్చారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించిన గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ సాయంత్రం రికార్డు సాధించినట్లు ప్రకటించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, కలెక్టర్ వెంకట్రావ్ విత్తన బంతులను వెదజల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
చేతుల్లేకున్నా.. లోకాన్ని అందుకుంది!
ఆమెకు రెండు చేతులు లేవు అయితేనేం ఆత్మవిశ్వాసం మాత్రం నిండుగా ఉంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సాధించలేని ఉన్నత శిఖరాలను ఆత్మస్థైర్యంతో అధిరోహించింది. ప్రపంచంలోనే చేతులు లేకుండా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేకాదు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సాధించడంతోపాటు విమానాన్ని నడిపిన తొలి పైలట్‌గానూ గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది జెస్సికా కాక్స్. ఆ సంగతులేంటో నేటి ‘success story’లో తెలుసుకుందాం...! మనలో చాలామందికి అసలు లక్ష్యాలు ఉండవు. లక్ష్యాలు ఉన్నవారు కూడా తమ కుటుంబ పరిస్థితులు బాగాలేవని, మా తల్లిదండ్రులు చదువుకొని ఉంటే బాగుండని, మేం డబ్బున్నవాళ్లమైతే అనుకున్న లక్ష్యాలను చేరేవారమని ఇలా నిందించుకుంటూ లక్ష్య సాధనలో వెనకపడుతూ ఉంటారు. నిండైన ఆత్మవిశ్వాసం ఉంటే తమ లక్ష్యసాధనకు ఏదీ అడ్డంకి కాదని ఎందరో నిరూపించి మనకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు జెస్సికా కాక్స్. సౌకర్యాలకన్నా నిండైన ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర శ్రమ ద్వారానే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపిస్తోంది జెస్సికా. ఆమె 1983 ఫిబ్రవరి 2న అమెరికాలో జన్మించింది. అయితే జన్యుపరమైన లోపాల కారణంగా ఆమెకు రెండు చేతులు లేవు. కూతురి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. భవిష్యత్తులో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి చిన్నతనంలోనే చంపేయాలని ఇరుగుపొరుగు సూచించినా వారు మాత్రం కన్నపేగును కడుపులో దాచుకొని పెంచారు. కొన్నిరోజుల తర్వాత జెస్సికాను పాఠశాలకు పంపండం ప్రారంభించారు. అయితే పాఠశాలలో తోటి విద్యార్థులు జెస్సికాను తీవ్రంగా అవమానించేవారు. వారి మాటలకు జెస్సికా చాలా బాధపడేది. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్లలేనని చెప్పేది. కానీ, అకస్మాత్తుగా ఒకరోజు జెస్సికా తనకు చేతులు లేకపోయినా కాళ్లు ఉన్నాయి వాటిసాయంతోనే అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని నిశ్చయించుకుంది. పైలెట్‌గా.... చేతులు లేకపోయినా కాళ్లతోనే రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు కాళ్లతోనే టైపింగ్ చేయడం కూడా నేర్చుకుంది. నిమిషంలోనే 25 పదాలు టైప్ చేసే స్థాయికి చేరుకుంది. అందరిలా తాను ఉండాలనుకునే జెస్సికా స్విమ్మింగ్ కూడా నేర్చుకుని బెస్ట్ స్విమ్మర్‌గా మారింది. 14 సంవత్సరాల వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి జెస్సికా. అంతేకాదు గుర్రపుస్వారీలో కూడా ప్రావీణ్యం సాధించింది. 17 సంవత్సరాల వయసులో కారు డ్రైవింగ్ నేర్చుకుని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించింది. చదువులో కూడా జెస్సికా ఎప్పుడు ముందే ఉండేది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించే జెస్సికా పైలెట్‌గా మారాలని నిశ్చయించుకుంది. మూడేళ్ల శిక్షణ అనంతరం 2008లో పైలెట్‌గా సర్టిఫికెట్ అందుకుంది. జెస్సికా వివిధ దేశాలు పర్యటిస్తూ అందరికి ప్రేరణ కలిగిస్తోంది. 2014లో జెస్సికా కరాటేలో అరిజోనా చాంపియన్‌గా నిలిచింది. కసి, పట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసం ఉన్నత శిఖరాలు మన కాళ్ల దగ్గరకొస్తాయని జెస్సికా నిరూపించింది. జెస్సికా నీవు సాధించిన ఘనతలకు నిజంగా నీకు సెల్యూట్....! – సాక్షి స్కూల్ ఎడిషన్ -
ఫేసియల్ యోగా రికార్డు బద్దలైంది
సాక్షి సిటీబ్యూరో: ముఖంలో మెరుపులు పెంచేందుకు ఉపకరించే ఫేసియల్ యోగా... సిటీని మరో అంశంలో గిన్నిస్ రికార్డులకు ఎక్కించింది. గ్లామర్ రంగ ప్రముఖురాలు రుచికాశర్మ... ఆధ్వర్యంలోని బీయింగ్ ఉమెన్ సంస్థ ఆదివారం ఉదయం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వేల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఫేసియల్ యోగా సాధన చేశారు. తద్వారా ఏకకాలంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్న ఫేస్ యోగా ఈవెంట్‌గా గతంలో థాయ్‌ల్యాండ్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టామని రుచికాశర్మ చెప్పారు. కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధిగా ఎలోనారా గ్రీనాక్ రికార్డ్ నమోదు ప్రతిని రుచికాశర్మకు అందజేశారు. వయసుతో పాటు వచ్చే ముఖవర్ఛస్సులో మార్పు చేర్పులను ఫేసియల్ యోగా సమర్ధవంతంగా నియంత్రించగలదని ఈ సందర్భంగా రుచికా శర్మ అన్నారు -
రికార్డు లడ్డూ
తాపేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్‌స్టాల్ గతంలో సాధించిన గిన్నిస్ రికార్డులను తిరగరాస్తూ తయారుచేసిన 8,300 కిలోల భారీ 'నవ్యాంధ్ర' లడ్డూను బుధవారం ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలించారు. 6,300 కిలోల మరో లడ్డూను విజయవాడకు తరలించారు. స్వీట్‌స్టాల్ అధినేత సలాది వెంకటేశ్వరరావు గత నాలుగేళ్లుగా వినాయక చవితికి అతిపెద్ద లడ్డూల తయారీతో వరుస గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. ఉత్సవ కమిటీల నుంచి ఆర్డర్లపై 2011లో 5,570 కేజీలు, 2012లో 6,599 కేజీలు, 2013లో 7,132 కేజీలు, 2014లో 7,858 కేజీల లడ్డూలు తయారుచేసి గిన్నిస్ రికార్డులను సాధించారు. ఈ ఏడాది విశాఖలో నెలకొల్పనున్న 80 అడుగుల భారీ గణనాథుని కోసం 8,300 కిలోల లడ్డూ తయారీ చేసి పాత రికార్డును తిరగరాశారు. వెంకటేశ్వరరావుతో పాటు 14 మంది సిబ్బంది ఆరు గంటల వ్యవధిలో లడ్డూ తయారీని పూర్తిచేశారు. కాగా విజయవాడలో నెలకొల్పనున్న 53 అడుగుల డూండీ గణనాథుని కోసం 6,300 కిలోల లడ్డూను 4.50 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. బుధవారం వెంకటేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజల అనంతరం క్రేన్‌సాయంతో రెండు లడ్డూలను ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. భారీ లడ్డూలను తిలకించేందుకు తాపేశ్వరం, పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. 8,300 కిలోల నవ్యాంధ్ర లడ్డూతో సరికొత్త గిన్నిస్ రికార్డుతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వరల్డ్ అమేజింగ్ రికార్డ్సు, రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్సు తదితర 13 రికార్డులు సాధించినట్టు శ్రీనుబాబు తెలిపారు.