ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai).. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఐయోనిక్ 5' (IONIQ 5) ఎలక్ట్రిక్ కారు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కిన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించడంతో.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ కారు లేహ్ లడఖ్‌లోని ఉమ్లింగ్ లా నుంచి సముద్ర మట్టానికి 5799 మీ (19,024 అడుగులు) ఎత్తులో కేరళలోని కుట్టనాడ్ వరకు ప్రయాణించింది.
మొత్తం 14 రోజులు 4900 కిమీ కంటే ఎక్కువ దూరం.. విభిన్న రహదారుల్లో, పలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఐయోనిక్ 5 విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈవో ఇండియా టీమ్ ఈ డ్రైవ్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హ్యుందాయ్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' (Unsoo Kim) మాట్లాడుతూ, ఐయోనిక్ 5 పర్ఫామెన్స్.. ఇంజినీరింగ్ నైపుణ్యం వంటివి తిరుగులేనివి. కంపెనీ విజయానికి, కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం అని అన్నారు.
Hyundai IONIQ 5 takes part in GUINNESS WORLD RECORDS™ Title for the Greatest Altitude Change by an Electric Car ▶ https://t.co/KeB82JGXOX@GWR #Hyundai #IONIQ5 #EV #GUINNESSWORLDRECORDS pic.twitter.com/G2kzjNjVr2
— Hyundai Motor Group (@HMGnewsroom) December 26, 2024
హ్యుందాయ్ ఐయోనిక్ 5
హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై తయారైంది. స్మార్ట్ మొబిలిటీ అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్దేశించింది.
ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!
ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. దీని ధర రూ. 52.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).
Comments
Please login to add a commentAdd a comment