ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' భారతీయ మార్కెట్లో 2023 ఆటో ఎక్స్‌పో వేదికపై తన లేటెస్ట్ 'ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీలను ఎట్టకేలకు ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ ఏడాది ప్రారంభంలో రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదలైన హ్యుందాయ్ ఐయోనిక్ 5 డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి కంపెనీ మొదట బుక్ చేసుకున్న 500 మందికి మాత్రమే ప్రారంభ ధరతో విక్రయిస్తుంది.
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే రూ. 1 లక్షతో బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలెట్టేసింది. కావున ఇప్పుడు మొదటి బ్యాచ్ డెలివరీలను ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ పెర్ల్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన మారుతి ఫ్రాంక్స్ - ధర ఎంతో తెలుసా?)
'హ్యుందాయ్ ఐయోనిక్ 5' గత 2022 లోనే వరల్డ్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ & వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) పై ఆధారపడి ఉంటుంది. కావున అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ లేటెస్ట్ వెహికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్‌లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రేక్డ్ రియర్ విండ్‌షీల్డ్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు.
ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్ థీమ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ గ్లోవ్-బాక్స్, లెవెల్ 2 ADAS వంటి వాటితో పాటు రెండు 12.3 ఇంచెస్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & ఇన్‌స్ట్రుమెంట్) ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
(ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!)
హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించారు. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.
ఆధునిక డైజిన్, ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్‌లు, లేన్ ఫాలో అసిస్ట్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వంటి ADAS ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment