Nexon EV Owner to Tata Motors: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ బ్రాండ్లలో 'టాటా మోటార్స్'కి చెందిన 'టాటా నెక్సాన్' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. దాదాపు ప్రతి సారి అమ్మకాల్లో ఈ SUV ముందంజలో ఉంటుంది. అంతగా ఈ కారుని ప్రజలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇటీవల ఒక మహిళ తనకు టాటా నెక్సాన్ కారు వద్దంటూ.. తిరిగి మీరే తీసుకోండి అంటూ ట్విటర్‌లో సంస్థను ఉద్దేశించి పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా నెక్సాన్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఈవీ వంటి మోడల్స్‌లో అందుబాటులో ఉంది. ఇటీవల టాటా నెక్సాన్ ఈవీ ఓనర్ 'కార్మెలిటా ఫెర్నాండెజ్' తన కారుని తిరిగి తీసుకోండంటూ విన్నవించుకుంది. టాటా మోటార్స్ సర్వీస్ అనుభవంతో తాను చాలా విసుగు చెందినట్లు, టాటా టోల్ ఫ్రీ నెంబర్ కూడా సరిగ్గా పనిచేయలేదంటూ చెప్పుకొచ్చింది.
కార్మెలిటా ఫెర్నాండెజ్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో ఎదురైన రెండు సమస్యలను గురించి ప్రస్తావిస్తూ.. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య పూణేకు రెండు ట్రిప్పులు వెళ్లి సుమారు 160 కి.మీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే తాను అంత దూరం ప్రయాణించలేదని వెల్లడిందింది. ఇక రెండవ సారి ఛార్జింగ్ స్టన్స్ పని చేయలేదని పేర్కొంది. ఈమె ఇప్పటికే బ్యాటరీని ఒకసారి వారంటీ కింద భర్తీ చేసినట్లు సమాచారం.
నిజానికి పూణే, ముంబై మధ్య దూరం 160 కిమీ వరకు ఉంటుంది. అయితే ఆ రహదారిలో ఎక్కువ భాగం బ్యాటరీ స్థాయిని గణనీయంగా తగ్గించే ఘాట్ విభాగాలతో నిండి ఉంటుంది. కావున రేంజ్ తప్పకుండా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కావున పూణే & ముంబై మధ్య కారును తప్పకుండా ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు పరిధి 312కిమీ అని గతంలోనే కంపెనీ ప్రకటించింది.
(ఇదీ చదవండి: సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీపై సైబర్ అటాక్ - నిలిచిపోయిన ఉత్పత్తి)
భారతదేశంలో ఎంతో మంది ప్రజలకు నమ్మికైనా టాటా ఉత్పత్తుల మీద కంప్లైంట్స్ రావడం చాలా అరుదు. గతంలో వెలుగులోకి వచ్చిన సమస్యలను కూడా సంస్థ పరిష్కరించింది. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ తరహా సమస్య బహుశా ఇదే మొదటిది కావచ్చు. అయినా కస్టమర్లు ఎటువంటి గందరగోళానికి గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ తప్పకుండా ప్రతి ఉత్పత్తిలో ఏర్పడిన సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తుంది.
Nightmarish experience @TataMotors_Cars on my 2 trips to Pune fm BOM. 1st time battery issue (replaced by @RudraMotors). 2nd time Tata charging stns at Food Mall & Turbhe didnt work! ZConnect Support doesn't support. Tata Toll Free 18008332233 doesn't work. Pls take my car back! pic.twitter.com/i8JaZmtIDO
— Carmelita Fernandes (@SocialCarmelita) May 14, 2023
ఇదిలా ఉండగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి పరుగుతోంది. అయితే ఈ వాహనాలకు కావలసినన్ని ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు. ఈ ఛార్జింగ్ స్టేషన్ నెట్‌వర్క్ పెంచడానికి భారత ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేస్తోంది. కావున రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సదుపాయాలు కావలసినన్ని అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment