భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు దూసుకెళ్తున్న సమయంలో హ్యుందాయ్ కంపెనీ దేశీయ విఫణిలో మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేయనున్న ఈ లేటెస్ట్ మోడల్ టెస్టింగ్ కూడా మొదలైపోయింది. ఇంతకీ హ్యుందాయ్ కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు ఏది? ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు అరంగేట్రం చేయనుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కోనా (Kona) ఎలక్ట్రిక్ కారుతో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ తన క్రెటా SUV ని కూడా ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఎలాంటి క్యామోఫేజ్ లేకుండానే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించింది.
(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!)
దేశీయ విఫణిలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు విడుదలైన తరువాత MG ZS EVకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు చూడటానికి సాధారణ క్రెటా మాదిరిగా కనిపించినప్పటికీ తప్పకుండా కొన్ని మార్పులు పొందనుంది. ఇందులో ఎటువంటి మార్పులు జరిగాయనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కోనా ఎలక్ట్రిక్ ఆధారంగా ఇది తయారయ్యే అవకాశం ఉందని, ఇది 400 కంటే ఎక్కువ కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?)
హ్యుందాయ్ కంపెనీ అమ్మకాల్లో క్రెటా పాత్ర చాలా ప్రధానమైనది, కావున ఇది ఎలక్ట్రిక్ కారు రూపంలో విడుదలైతే మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment