విత్తన బంతులతో రాసిన అతి పెద్ద వాక్యం
పాలమూరు ఆడబిడ్డలు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. విత్తన బంతుల (సీడ్ బాల్స్)తో ఇంగ్లిష్ అక్షరాలతో అతిపెద్ద వాక్యాన్ని పేర్చినందుకు ఈ ఘనత సాధించారు. అంతేకాదు 2.08 కోట్ల విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేసి వెదజల్లారు. జిల్లాలోని 479 గ్రామైక్య, 11,506 స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ 1,29,506 మంది మహిళలు, మెప్మా ఆధ్వర్యంలోని 27,040 మంది 10 రోజుల పాటు శ్రమించి వీటిని తయారుచేశారు. 81 మంది మహిళలు.. 81 ఇంగ్లిష్ అక్షరాలతో ‘టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ఉమెన్ ట్రాన్స్‌ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్ టు హెటిరో గ్రీన్ బెల్ట్’అని ఇంగ్లిష్‌లో 73,918 సీడ్ బాల్స్‌ను పేర్చారు. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా వీక్షించిన గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ సాయంత్రం రికార్డు సాధించినట్లు ప్రకటించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, కలెక్టర్ వెంకట్రావ్ విత్తన బంతులను వెదజల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment