సీఎం కుర్చీలో రావత్.. 11 అత్యవసర నిర్ణయాలు
డెహ్రాడూన్: రాష్ట్రపతి పాలనను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి హరీశ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఆయన ఆఘమేఘాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పన్నెండు నిర్ణయాలు తీసుకొని వాటిని శీఘ్రంగా అమలు చేయాలని ఆదేశించారు.
వీటిలో నీటి సంక్షోభం అనే అంశం ప్రధానంగా ఉంది. రావత్ ఉత్తరాఖండ్ లో మెజారిటీ కోల్పోయారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే, తనకు కనీసం మెజార్టీ నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రపతి పాలన విధించారని హైకోర్టులో పిటిషన్ వేయగా దానిని విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. ఈ నెల 29న బల పరీక్షను ఎదుర్కోనున్నారు.