
ప్రధానితో భేటీ కానున్న గవర్నర్
రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన గవర్నర్ నరసింహన్ నేడు కూడా అధిష్టానం పెద్దలను కలవనున్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన గవర్నర్ నరసింహన్ నేడు కూడా అధిష్టానం పెద్దలను కలవనున్నారు. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయిన ఆయన నేడు ప్రధానమంత్రి, సోనియాగాంధీని కలవనున్నారు. ఈ రోజు ఉదయం 11.30గంటలకు మన్మోహన్ సింగ్తో గవర్నర్ సమావేశం అవుతారు.
ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై నివేదికను సమర్పించనున్నారు. అలాగే సలహాదారుల నియామకంపైనా చర్చించే అవకాశం ఉంది. పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. సాయంత్రం నరసింహన్ ....హైదరాబాద్ తిరిగి రానున్నారు.