
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: డీజీపీ
రాష్ట్రపతి పాలన విధించిన దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను దింపుతామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఎన్నికల నేపథ్యంలో నగర పోలీస్ అధికారులతో పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ సమావేశమయ్యారు. నగర పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.